Cabinet decisions
-
రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామని.. గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు ఇస్తే.. తమ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎం మాట్లాడుతూ.. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.భూమిలేని వ్యవసాయ కుటుంబాలకూ ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తామని రేవంత్ తెలిపారు. రేషన్‌కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. జనవరి 26 నుంచి ఈ పథకాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఆరోజును మేం ఎంచుకున్నాం. రాళ్లు, రప్పలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబడదు. గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులు సమాచారం సేకరించి ప్రజలకు అన్నివిషయాలు వివరిస్తారు.’’ అని రేవంత్ చెప్పారు.కేబినెట్ కీలక నిర్ణయాలువ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసాప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదంభూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలుసంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీరైతు భరోసాకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణంజనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీములుగు మున్సిపాలిటీకి కేబినెట్ ఆమోదంపంచాయతీ రాజ్‌లో 588 కారుణ్య నియామకాలకు ఆమోదం200 కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్ ఆమోదంమరో 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదంఇదీ చదవండి: ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం -
గడపగడపకూ ‘ఏడాది విజయోత్సవాలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో అమలు చేసిన విప్లవాత్మక పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను గడపగడపకూ చేర్చాలని ప్రజాపాలన విజయోత్సవాల మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ విజయోత్సవాల్లో అన్ని శాఖలు భాగస్వాములు కావాలని అధికారులను ఆదేశించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీలో ఉపసంఘం సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం: భట్టి డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ వివిధ శాఖల పరిధిలో అమలైన పథకాలు, కార్యక్రమాల గురించి ఆయా శాఖలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాలను ఉపయోగించుకోవాలని కోరారు. విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవంతోపాటు సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా లేజర్ షో, కార్నివాల్తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. మహిళలను చైతన్యవంతులను చేయాలి: మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళల అభ్యున్నతి కోసం చేపట్టిన 70 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం, బ్యాంకు లింకేజీల కల్పన, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ తదితర పథకాల గురించి మహిళలందరికీ తెలియజేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు సూచించారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అన్ని ఆర్టీసీ బస్సులపై ప్రజా ప్రభుత్వ పాలన విజయాలను తెలియజేసేలా ప్రకటనలు తయారు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల ఏర్పాటుపై పాఠశాల స్థాయి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. సీఎం చేతుల మీదుగా ఆరు పాలసీల విడుదలకు ఏర్పాట్లు: సీఎస్ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు, 200 విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభిస్తున్నామని.. 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆరు ప్రధాన పాలసీలను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. -
70 ఏళ్లుపైబడినవాళ్లకు ఆయుష్మాన్ భారత్ అమలు
న్యూఢిల్లీ, సాక్షి: దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్భారత్ వర్తింపజేస్తూ నిర్ణయం. ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నది: మంత్రి అశ్వినీ వైష్ణవ్తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది కలుగుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్వీరంతా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుంది: మంత్రి అశ్వినీ వైష్ణవ్ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా (AB PMJAY) పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందుతాయి.కేబినెట్ నిర్ణయాలుపీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకానికి ఆమోదం.. రూ.10,900 కోట్ల కేటాయింపు.. ఈవీలపై సబ్సిడీ కొనసాగింపు.. 88,500 ప్రదేశాల్లో ఛార్జింగ్‌ల ఏర్పాట్లు జలవిద్యుత్ ప్రాజెక్టులకు రూ.12,461 కోట్ల కేటాయింపు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన.. రూ. 70,125 కోట్ల రూపాయల కేటాయింపునకు ఆమోదం.. 25,000 గ్రామాలను కలిపేలా రోడ్ల నిర్మాణం పీఎం ఈ -బస్ సేవా పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. రూ. 3,435 కోట్ల రూపాయలతో 38వేల ఈ -బస్ ల ఏర్పాటు వాతావరణ శాఖ టెక్నాలజీ(మిషన్ మౌసమ్) కోసం రూ.2 వేల కోట్ల కేటాయింపు -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు : 12 కొత్త స్మార్ట్ సిటీలు.. 10 లక్షల ఉద్యోగాలు..
ఢిల్లీ : దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.దేశంలో 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.28,602 కోట్ల నిధుల్ని కేటాయించింది.నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏర్పాటు కానున్న 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్‌లో తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్‌కు 2 కేటాయించింది. కడప జిల్లా కొప్పర్తిలో 2596 ఎకరాల్లో, కర్నూలు జిల్లా ఓర్వకల్లో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక తెలంగాణ జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేలా సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. #WATCH | After the cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "...Cabinet today approved 12 Industrial Smart Cities under National Industrial Corridor Development Programme. The government will invest Rs 28,602 crore for this project..." pic.twitter.com/KxNYqNZ5dT— ANI (@ANI) August 28, 2024 -
మహిళా సాధికారతే.. సీఎం జగన్ లక్ష్యం: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, తాడెపల్లి: సీఎం జగన్ పరిపాలన మహిళా సాధికారతే లక్ష్యంగా జరుగుతోందని పౌర సరఫరాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. మహిళా స్వావలంబనతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనేక మంది సంఘ సంస్కర్తల ఆలోచనల సమ్మిళతమే జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా చెప్పింది చేసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన నాల్గవ విడత చేయూత పంపిణీ చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణు వెల్లడించారు. 26,98,931 మందికి 5వేల 60 కోట్ల 4 లక్షలు చేయూత పంపిణీకి ఆమోదం లభించినట్లు చెప్పారు. చేయూత పథకంపై ప్రతిపక్షాలు చేసేవన్నీ అసత్య ప్రచారాలేనని తెలిపారు. రూ.19,188 కోట్లను నాలుగు విడతల్లో చేయూత కింద అందించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. డీఎస్సీ నిర్వహణకు 6,100 పోస్టులతో కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. 2019 నుంచి విద్యారంగంలో 14,219 పోస్టుల భర్తీ చేశామని చెప్పారు. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచినట్లు తెలిపారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. 2019 నుంచి 2 లక్షల 13 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని వెల్లడించారు. ఎస్‌సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యం ఎస్‌సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదివే ఐబీని ఏపీ విద్యావ్యవస్థలోకి తీసుకురానున్నామని చెప్పారు. ఈ ఐబీ విద్యతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటారని తెలిపారు. ఈ విధానంతో విద్యార్థుల కమ్యునికేషన్ స్కిల్స్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతాయని అన్నారు. ఉపాధ్యాయ, విద్యాశాఖ అధికారులకు కూడా ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఐబీ విద్యతో విప్లవాత్మక మార్పులు ఉంటాయని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇదీ చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మెగా డీఎస్సీకి గ్రీన్‌సిగ్నల్ -
ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రమంత్రిమండలి శుక్రవారం సమావేశమైంది. ఈ భేటీలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నసచివాలయం పబ్లిసిటీ సెల్లో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. సంక్షేమ పథకాల షెడ్యూల్డ్... ► నవంబరు 7వ తేదీ..వైఎస్సార్ రైతు భరోసా. ►నవంబరు15.. భూపంపిణీ. ►నవంబరు 28.. విద్యాదీవెన. ►ఖరీప్ 2023–24 ధాన్యం సేకరణకు మార్క్‌ఫెడ్‌కు రూ.5వేల కోట్ల రుణ మంజూరుకు ప్రభుత్వం తరపున అవసరమైన గ్యారంటీ అందించేందుకు కేబినెట్ ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్‌ఆధ్వర్యంలో ఖరీప్ ధాన్యం సేకరణ. ►రాష్ట్రంలో వివిధ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన గత నెల 30వ తేదీన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్టు సమావేశం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి. ►రెండు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలన్న ఎస్ఐపీబీ నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ►రహదారుల,భవనాలశాఖలో 467 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల, భవనాలశాఖ పరిధిలో గెస్ట్హోస్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోనున్న ఆర్ అండ్ బిశాఖ. ►తూర్పుగోదావరి జిల్లా నల్లజెర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాలతో కలిపి దేవరాపల్లిలో రవాణాశాఖకు చెందిన యూనిట్ ఆఫీసు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఈ కార్యాలయంలో అవసరమైన ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, ఒక హోంగార్డు నియామకానికి ఆమోదం. ►శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 6 మండలాలు (ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లె, సీకే పల్లె)తో కలిపి రవాణాశాఖకు చెందిన యూనిట్ ఆఫీసు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. ►ఒక మోటారు వెహికల్ ఇన్స్ఫెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ ఇంజనీరు, ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ముగ్గురు హోంగార్డుల నియామకానికి కేబినెట్ ఆమోదం. జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్‌కు వివరాలు అందించిన అధికారులు. ►ఇప్పటివరకూ 11710 క్యాంపులు నిర్వహించామని వెల్లడి. ►60 లక్షల మంది శిబిరాల వద్దకు వచ్చారని వెల్లడి ►6.4 కోట్ల మందికి ఇంటివద్దే వైద్య ర్యాపిడ్ పరీక్షలు. ►8,72,212 మందికి కంటి పరీక్షలు చేశామన్న అధికారులు. ►5,22,547 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు. ►11327 మందికి కంటి చికిత్సలు చేయిస్తున్నామన్న అధికారులు. ►జగనన్న సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్న మంత్రులు. ►వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి వైద్య సహాయం లభిస్తుందన్న మంత్రులు. ►ఈ కార్యక్రమాన్ని అభినందించిన కేబినెట్. వైద్య పరీక్షల్లో గుర్తించిన వారికి చికిత్స విషయంలో సమగ్రమైన ఫాలో అప్ చేయాలి: సీఎం జగన్ ►గతంలో ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయించుకున్నవారు, శిబిరాల ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స అవసరమని భావించిన వారు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారు. ►ఈ కేటగిరీలకు చెందినవారిపై ప్రత్యుక శ్రద్ధ వహించాలి. ►తీవ్రమైన రోగాలతో బాధపడుతున్నవారిని గుర్తించిన వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►వారికి అవసరమైన తుదపరి చికిత్సలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందించాలి. ►ఆస్పత్రులకు వారు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలి. ►మందులు కూడా సకాలంలో వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి. ►చికిత్సలు పూర్తయిన తర్వాతకూడా వారి ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ►జగనన్న సురక్ష శిబిరాలు బాగా జరిగేలా చూడాలని మంత్రులను ఆదేశం. ►శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు మంచి చికిత్స అందేలా చూడాలి. ►వారు ట్రీట్మెంట్ ముగించుకుని తిరిగి ఇంటి వచ్చాక వారికి మందులు అందేలా, తదుపరి చికిత్స అందించేలా చూడాలి. ►ఎవ్వరికీ మందులు అందలేదన్న మాట వినపడకూడదు. ఈ మందులన్నీ ఉచితంగా అందిస్తున్నాం. ►రిఫరెల్ వీడియో కాన్ఫరెన్స్ద్వారా లేదా ఆస్పత్రికి పంపించాలి ►ప్రయాణ ఖర్చులు కింద రూ.500 అందించాలి. ►దీంతోపాటు గ్రామాల్లో గతంలో తీవ్ర రోగాల బారినపడ్డ పేషెంట్లకు కూడా అండగా నిలవాలి. ►వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందించాలి. అవసరమైన పక్షంలో డాక్టర్లకు రిఫరెల్ కూడా చేసే బాధ్యతలను నిర్వర్తించాలి: సీఎం జగన్. ►గతంలో ఆరోగ్య శ్రీకింద చికిత్సలు చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా ఆరాతీయాలి. ►అవసరమనుకుంటే వారినికూడా రిఫరెల్కు పంపించాలి. వీరికీ చేయూత నివ్వాలి. ►ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమం. కచ్చితంగా దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ►అత్యంత ఖరీదైన మందులు కూడా ఉచితంగా అందించాలి. ►మంత్రులు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. జనవరి 1 నుంచి ప్రతినెలా నాలుగు క్యాంపులు ప్రతి మండలంలో నిర్వహిస్తారు: సీఎం జగన్ ►నలుగురు స్పెషలిస్టు డాక్టర్లు కూడా ఇందులో పాల్గొంటారు. ►ప్రతి వారంలో ఒక మండలంలో ఒక గ్రామ సచివాలయంలో క్యాంపు నిర్వహిస్తారు. ►అందులోకూడా పైన చెప్పిన విధంగా రోగులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ►ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఉధృతంగా ప్రచారం చేపట్టాలి. ►నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15వరకూ మరోసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. ►దిశ యాప్‌ను ఏ రకంగా డౌన్లోడ్ చేశామో, ఆరోగ్య శ్రీ యాప్‌నుకూడా డౌన్లోడ్ చేస్తాం. ►యాప్ ద్వారా ఎంపానెల్ ఆస్పత్రులు ఎక్కడున్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ►దీనివల్ల సులభంగా ఆరోగ్య శ్రీ చికిత్సలు అందించవచ్చు. ►గ్రామాల్లో ఎక్కడా కూడా పౌష్టికాహార లోపంతోకాని, రక్తహీనతతో బాధపడేవారు కాని ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ►వారికి సరైన ఆహారం, మందులు అందిస్తున్నాం. ►ఈ కార్యక్రమంపైనాకూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ►కంటి సమస్యలతో బాధపడేవారికి కూడా కంటి అద్దాలు ఇస్తున్నాం. మార్కాపురం మెడికల్ కాలేజీలో 21 పోస్టులతో నెఫ్రాలజీ డిపార్ట్మెంటు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. పలాస తరహాలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీఆసుపత్రి, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకూ మంత్రిమండలి ఆమోదం. ►పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీలో పురపాలకశాఖ భవన నిర్మాణానికి అవసరమైన స్ధలాన్ని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన, మెరుగైన విద్యను అందించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్ నియమించాలన్న పాఠశాల విద్యాశాఖ నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►6,790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్‌పై బోధనకోసం ఇంజినీరింగ్ కాలేజీల మ్యాపింగ్ . ►ట్యాబులు డిజిటల్ పరికరాలు, యాప్‌లు వినియోగంపై విద్యార్థులకు శిక్షణ దీని ఉద్దేశం. ►అలాగే ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో పెట్టే ఐఎఫ్‌పీ ప్యానెల్స్ వినియోగంపైనా వీరు శిక్షణ ఇస్తారు. ►ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే సరిదిద్దుతారు. ►పరికరాల వినియోగంపై టీచర్లనుంచి, విద్యార్థులనుంచి ఫీడ్ బ్యాక్ ఇస్తారు. ►వినియోగం తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు ►సాంకేతికను వినియోగించుకుని విద్యార్థుల సమర్థతలో పెంచేలా చూస్తారు ►డేటా ప్రైవసీ, సెక్యూరిటీలపై తగిన చర్యలు తీసుకుంటారు. 50 ఎకరాల లోపు ఏపీఐఐసీ కేటాయించిన 285 భూకేటాయింపులకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►భారీ ప్రాజెక్టులకు వివిధ రకాల రాయితీలను కల్పిస్తూ.. స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదలనకు కేబినెట్ ఆమోదం. ►ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ కాంప్లెక్స్ , డీజిల్ బస్ రిట్రో ఫిటింగ్, బ్యాటరీ ఫ్యాక్ అసెంబుల్డ్ చేసే పెప్పర్ మోషన్ సంస్ధ. ►ఇది రూ.4,640 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 8080 మందికి ఉపాధి అందించనుంది. ►దీంతో పాటు ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకూ కేబినెట్ ఆమోదం. పరిశ్రమలకు భూ కేటాయింపుల విధానంలో మార్పుకు కేబినెట్ ఆమోదం. ►పరిశ్రమలకు మరింత అనుకూలత కోసం నిర్ణయం. ►లీజు విధానం స్థానే సేల్ డీడ్ విధానంలో కేటాయింపు ►పరిశ్రమలకోసం మాత్రమే ఆభూమిని వినియోగించేలా తగిన షరతులతో ఈ విధానం. ►పరిశ్రమలు పెట్టేవారికి ఆర్థిక సంస్థలనుంచి వెసులు బాటుకోసమే నిర్ణయం ►పరిశ్రమలకు భూ కేటాయింపులపై కొత్త పాలసీ రూపకల్పన. న్యూ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి ఆమోదముద్ర వేసిన రాష్ట్ర మంత్రిమండలి. ►అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గతంలో థర్మల్ పవర్ ప్రాజెక్టుకోసం 1200 ఎకరాలు ఇచ్చిన ఏపీఐఐసీ ►ఇందులో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►దీనికోసం సబ్ లీజింగ్‌కు అనుమతి ఇచ్చిన కేబినెట్. ►రూ. 95వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎన్టీపీసీ. ►గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుతో పాటు ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకై ఏపీఐఐసీ ప్రతిపాదనల మేరకు ఎన్టీపీసీ లిమిటెడ్‌కు అనుమతులు మంజారు చేస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి. ►తిరుపతి జిల్లా పేరూరులో ఎంఆర్కేఆర్ గ్రూపు హోటల్ నిర్మాణానికి అదనంగా మరో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ.. తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►వైయస్సార్ జిల్లా గండికోటలోనూ, విశాఖపట్నంలో మేపెయిర్ గ్రూపులకు గతంలో కేటాయించిన భూములు కాకుండా కొత్త సర్వేనెంబర్లలో భూకేటాయింపులు. ►విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్– 1 అధికారిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►రెండు ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన సాకేత్ మైనేని. ►డేవిస్‌కప్ టీంలో 11 ఏళ్లపాటు కొనసాగిన సాకేత్. ►2016 నుంచి 2017 వరకూ ఇండియా నంబర్ 1గా ఉన్న సాకేత్ మైనేని. ► ఏపీ ఫెర్రోఅల్లాయిస్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వివిధ రకాల విద్యుత్ డ్యూటీలలో మినహాయింపులు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం. ►ఫెర్రో అల్లాయిస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి కొంత మినహాయింపు. ►స్టీల్ ఇండస్ట్రీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈ పరిశ్రమలకు తోడ్పాటు నిచ్చేందుకు నిర్ణయం. ►రూ.766 కోట్ల మేర భారాన్ని మోయనున్న ప్రభుత్వం ►దాదాపు 50 వేలమంది ఈ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నందున నిర్ణయం తీసుకున్న కేబినెట్. ►902 మెగావాట్ల సామర్ధ్యమున్న సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు నంద్యాల, వైఎస్సార్ జిల్లాలలో 5,400 ఎకరాలు ►లీజు ప్రాతిపదికన కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ఏడాదికి రూ.31వేలు ఎకరాకు చెల్లించనున్న కంపెనీ. ►రెండేళ్లకు 5శాతం చొప్పున పెంపు. ►కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు అనుమతిలిస్తూ కేబినెట్ ఆమోదం. ►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్. ►రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్. ►రాష్ట్రంలో 100 ఇన్స్ఫెక్టర్ ఆఫ్ పోలీసు పోస్టులను భర్తీ చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ఇందులో 45 పోస్టులు అప్‌గ్రేడేషన్, 55 సూపర్ న్యూమరరీ పోస్టులు. ►ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో 22 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో భర్తీ ►సమగ్ర కులగణనకు కేబినెట్ ఆమోదం. ►ఆర్ధిక, సామాజిక, విద్యాపరమైన జీవనోపాధి, జనభాసమతుల్యత అన్న అంశాలపై గణన. ►అణగారిన వర్గాలు మరింత అభ్యున్నతికి ఈ డేటా ఉపయోగపడుతుందన్న సీఎం. ►ఆర్థిక సామాజిక అభివృద్ధి కల్పించేందుకు దోహదపడుతుందన్న సీఎం. ►ప్రభుత్వ పథకాలు అందకుండా ఎవరైనా మిగిలిపోయినా కూడా ఈ గణన ద్వారా తెలుస్తుందని, తద్వారా వారు లబ్ధిపొందుతారన్న కేబినెట్. ►మరిన్ని పేదరిక నిర్మూలనా పథకాలకు, మానవవనరుల అభివృద్ధికి, తారతమ్యాలు తగ్గించేందుకు, అసమానతలు రూపుమాపేందుకు ఈ డేటా వినియోగపడుతుందన్న సీఎం. ►కులగణన చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రివర్గసభ్యులు. ►ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్న మాటను మరోసారి నిలబెట్టుకుంటూ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లోకల్ కేడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రాప్ట్ ఆర్డర్ 2023కు ఆమోదం. ►జోనల్ వ్యవస్థలో మార్పులకు కేబినెట్ నిర్ణయం. ►డిస్ట్రిక్ కేడర్‌గా టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సమానస్థాయి, అంతకంటే దిగువ. ►జోనల్ కేడర్‌గా జూనియర్ అసిస్టెంట్ పైన ఉన్నవారు. ►మల్టీజోన్ పరిధిలో సెకండ్ లెవల్ గెజిటెడ్ సమానస్థాయి, డిప్యూటీ కలెక్టర్ సమానస్థాయి వారు. ►స్టేట్ లెవల్ కేడర్ అంతా మల్టీజోనల్ కిందకు (ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడీలు, స్టేట్ లెవల్ ఇనిస్టిట్యూషన్స్, కేపిటల్ ఏరియాలో పోలిస్ కమిషనరేట్ మినహాయిస్తే) ►దీనివల్ల 95శాతం పోస్టులు ఆయా స్థానికులకే చెందుతాయి. ►స్థానిక వ్యక్తులకు కనీస విద్యార్హత స్థాయి 10నుంచి 7కు తగ్గింపు. ►ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లను ఆరు జోన్లకు మారుస్తూ నిర్ణయం. ►వీటితోపాటు రెండు మల్టీ జోన్లు. ►ర్నూలులో సెకండ్ నేషనల్ లా యూనివర్సిటీ, స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు అవసరమైన మరో 100 ఎకరాల భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఇప్పటికే వీటికోసం 50 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం. ►ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్‌బోర్డు, లోకాయుక్త తదితర సంస్థలకు ఉపయోగం. ►దేవాదాయశాఖలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు దేవాదాయశాఖ కమిషనర్ పరిధిలో ఒక డిప్యూటీ కమిషనర్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఆయా దేవాలయాలు ఆర్జించే ఆదాయాలు ఆధారంగా ఏర్పాటు చేసే పోస్టులకు సంబంధించిన ఆదాయపరిమితిని పెంచిన నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►గతంలో డిప్యూటీ కమిషనర్ పరిధిలో రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటే ఇప్పుడు దానిని రూ.7 నుంచి రూ.12 కోట్లకు పరిమితి పెంపు. ►జాయింట్ కమిషనర్ పరిధిలో గతంలో రూ.1 కోటి ఉంటే దానిని రూ.12 కోట్లు కంటే ఎక్కువ పరిమితి పెంపు. ►విశాఖపట్నం జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, యూజర్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించిన మంత్రిమండలి. ►పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా.. ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల పరిధిలో 12,984 కుటుంబాలకు, రాజమహేంద్రవరం జిల్లాలో దేవీపట్నం, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో 3,823 కుటుంబాలకు కేటాయించి ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్, భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ►కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధకు 4.12 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లెలో ఏపీఐఐసీకి 2.92 ఎకరాల భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అసరమైన భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ►నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో 39.08 ఎకరాల భూమిని రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డుకు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి. ►రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాల పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నరవలో ప్రముఖ జానపదకళాకారుడు దివంగత వంగపండు ప్రసాదరావు సతీమణి శ్రీమతి వంగపండు విజయలక్ష్మికి 1000 గజాల ఇంటిస్ధలం కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. -
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, సచివాలయం: ఏపీలో 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. అలాగే, నర్సాపురం ఫిషరీస్ కాలేజ్ అండ్ యూనివర్సిటీకి 140 పోస్టులకు, 476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇక, సీపీఎస్ విధానం రద్దు చేసి జీపీఎస్‌కు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కాగా, మంత్రి చెల్లుబోయిన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ ఉభయ ప్రయోజనకరం. హెచ్ఆర్ఏను 12 శాతం నుంచి 16శాతానికి పెంచాం. కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో పోస్టులు, సీతానగరం పీహెచ్సీ అప్‌గ్రేడ్‌కు 23 పోస్టులకు కేబినెట్ ఆమోదం. ప్రతీ మండలంలో 2 జూనియర్ కాలేజీలకు ఆమోదం. ► కడప మానసిక వైద్యశాలలో 116 పోస్టులకు కేబినెట్ ఆమోదం. 3వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపునకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కో-ఆపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టుకు ఆమోదం. చిత్తూరు డెయిరీకి 28.35 ఎకరాల భూమికి 99 ఏళ్లకు లీజుకు నిర్ణయం. విశాఖ మానసిక వైద్యశాలలో 11 పోస్టుల మంజూరు. ► ఇక, ఒడిశా మృతులకు కేబినెట్ సంతాపం తెలిపినట్టు వెల్లడించారు. బాధితుల కోసం 50 అంబులెన్స్‌లు పంపించినట్టు తెలిపారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియాకు ఆమోదం తెలిపిందన్నారు. ► అనంతపురం, సత్యసాయి జిల్లాలో విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. ► ఈనెల 12 నుంచి విద్యాకానుక పంపిణీకి నిర్ణయం. ఈనెల 28 నుంచి అమ్మఒడి పథకం అమలుకు నిర్ణయం. నాడు-నేడు కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు ఆమోదం. జగనన్న ఆణిముత్యాలు పథకం అమలుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ► రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను కమిటీలకు అప్పగింత. ఈ ఆలయాల నిర్వహణ బాధ్యత అర్చకులదే. ఐదేళ్ల పాటు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. ► పాడి రైతులకు సరైన ధర కల్పించాం. ఇవాళ పాల సేకరణ పెరిగింది. పాల ధర పెరిగింది. అమూల్ రావడం వల్ల పాడి రైతులకు మేలు జరిగింది. ► ఉద్యోగులందరికీ ఏరియర్స్‌తో 2.73శాతం డీఏకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
జీవో 111ను ఎత్తేస్తున్నాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన జీవో 111ను ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వయంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఆ నిర్ణయాలను పాత్రికేయ సమావేశంలో స్వయంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. గత హామీ మేరకు జీవో 111ని ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. సీఎస్ ఆధ్వర్యంలో త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. ►అలాగే మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతిని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ► రాష్ట్రంలో ఆరు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి. అలాగే త్వరలోనే అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం మూడున్నర వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇబ్బందులు, ఆరోపణల నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల తరహాలో కామన్ బోర్డు ఏర్పాటు చేసి నియామకాల్ని పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ► హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్‌లో రెండు అదనపు టెర్మినల్స్ ఏర్పాటునకు గ్రీన్‌సిగ్నల్. ► ఉమ్మడి రాష్ట్రంలో భూగర్భ జలాలపైనే ఆధారపడ్డారు ►వడ్లు కొనడం చేతకాదు అని కేంద్రం చెప్పొచ్చు కదా ►దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సాగు అయ్యింది ►కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉంది ►దేశ రాజధానిలో 13 నెలలపాటు రైతులు ఉద్యమాలు చేశారు ►వ్యవసాయ చట్టాలు తెచ్చి మళ్లీ తోకముడిచింది ►చివరకు దేశ ప్రధాని రైతులకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ►ఎరువుల దరలను భారీగా పెంచారు ►పనికిమాలిన విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టారు ►రాష్ట్రాలను దివాళా తీయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది ►బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే సిద్ధాంతంతో పనిచేస్తోంది. ►ఆహార భద్రత బాధ్యత నుండి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం ►కేంద్రం బాధ్యతను గుర్తుచేయడం రాష్ట్రంగా మా బాధ్యత ►అందుకే ఢిల్లీ వేదికగా కేంద్రంపై పోరాటం చేశాం ►బ్యాంకులను దివాళా తీయించడమే మోదీ ఘనత ► యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్రమే కొనుగోలు చేస్తుంది ►ధాన్యం కొనుగోలుపై సీఎస్ నేతృత్వంలోని సబ్ కమిటీ ►రైతులు ఎవరూ కూడా ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మకండి ►రూ. 1960 కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం ►మొత్తం 3,4 రోజుల్లోనే ధాన్యం కొంటాం ►6 ప్రైవేట వర్శిటీలకు కేబినెట్ ఆమోదం ►త్వరలోనే అన్ని వర్శిటీల్లో నియామకాలు ►వర్శిటీల్లో 3,500 వరకూ నియామకాలకు నిర్ణయం ►దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది -
Telangana: రూ.786 కోట్లతో కొత్త పథకాలు
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మొత్తం రూ.786 కోట్లతో పలు కొత్త పథకాలు, పనులు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. చనాకా కొరాటా బ్యారేజీతో పాటు నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకాల అంచనా వ్యయం పెంపునకు సైతం అనుమతిచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్ ఈ కింది పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.388.20 కోట్లతో సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుండి తపాస్‌పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి ఓకే. తపాస్‌పల్లిజలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు నికరమైన సాగునీరు అందనుంది. రూ.44.71 కోట్లతో వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామంలోని పెద్దచెరువు పునరుద్ధరణ. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్పూర్ బ్రాంచి కాలువ పనులకు గాను రూ.144.43 కోట్ల మంజూరుకు ఆమోదం. ఈ కాలువ ద్వారా ఘన్పూర్, అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాకా కొరాటా బ్యారేజీ అంచనా వ్యయాన్ని రూ.795.94 కోట్లకు సవరించడానికి ఓకే. బ్యారేజీ నిర్మాణం పూర్తి కాగా, పంప్ హౌస్ నిర్మాణం కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో భీమ్‌పూర్, జైనథ్, భేలా, ఆదిలాబాద్ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మెదక్ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించిన ఘన్పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించారు. మిగిలిపోయిన పనులను రూ.50.32 కోట్లతో చేపట్టడానికి అనుమతి. మెదక్ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. రూ. 27.36 కోట్లతో వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి అనుమతి. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు రూ.10.01 కోట్లు మంజూరు. గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని రూ.669 కోట్లకు సవరించడానికి ఆమోదం. ప్రా జెక్టు పనులకు టెండర్లు పిలవడానికి అనుమతి. మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సమీకరణ కోసం కంపెనీల చట్టం కింద మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర. ఈ కార్పొరేషన్‌కు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ/ప్రిన్సిపల్ సెక్రెటరీ చైర్మన్‌గా, ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ(గజ్వేల్), ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖల జాయింట్ సెక్రటరీలు, సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకంతో పాటు పాల్కేడ్ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్‌పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి మొత్తం రూ.16.23 కోట్లతో ఆమోదం. దేవాదుల పథకంలో భాగంగా ఎత్తైన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌస్, కాలువ పనులకు, గుండ్ల సాగర్ నుంచి లౌక్య తండా వరకు పైప్ లైన్ పనులకు, నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌస్ నిర్మాణానికి మొత్తం రూ.104.92 కోట్లతో ఆమోదం. -
సర్కారు భూములు అమ్మాలని కేబినెట్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం భూముల అమ్మకం ప్రతిపాదనకు ఎట్టకేలకు మోక్షం లభించినట్టు కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు వీలుగా, ప్రభుత్వ భూములను అమ్మి నిధులు సమీకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండేళ్లుగా ఈ మేరకు ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది దాన్ని అమల్లోకి తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చర్చించిన మంత్రివర్గం కరోనా కష్టాల నుంచి బయటపడేందుకు గాను ప్రభుత్వ భూముల అమ్మకం ప్రతిపాదనకు అనుమతి ఇచ్చింది. రూ.50 వేల కోట్లకు అవకాశం ఉన్నా.. రాష్ట్రంలో ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో, ఎంత విలువైన భూములున్నాయన్న వివరాలను రెవెన్యూ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ఇవ్వగా, వాటిలో తక్షణం అమ్మడానికి వీలున్న భూముల వివరాలను క్రోడీ కరించడంపై రెవెన్యూ వర్గాలు దృష్టి్ట పెట్టాయి. రాజధాని హైదరాబాద్ శివార్లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మడం ద్వారా రూ.50 వేల కోట్ల వరకు నిధులు సమీకరించుకునే అవకాశ ముందనే ఓ అంచనా ప్రభుత్వం వద్ద ఉన్నా... ప్రస్తుతానికి 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల వరకు సమీకరించుకోవడానికి ప్రభుత్వం పరిమితం కానుందనే చర్చ జరుగు తోంది. ఈ మేరకు కార్యాచరణ త్వరలోనే ప్రారం భం కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శివార్లపైనే ఆశలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నప్పటికీ హైదరాబాద్ శివార్లలోని భూములపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే భూములకు సంబంధించిన ప్రత్యేక నివేదికను కూడా రెవెన్యూ శాఖ నుంచి తెప్పించుకుంది. ఇటీవల సుప్రీంకోర్టులో కేసు గెలిచిన కోకాపేటలోని దాదాపు 200 ఎకరాలు, మేడ్చల్, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఉన్న ఇవాక్యూ (కాందిశీకులు) భూములు, ఇజ్జత్‌నగర్‌లో 35 ఎకరాలు, హైటెక్స్ సమీపంలో 8 ఎకరాలు, తెల్లాపూర్‌లో 50 ఎకరాలు....ఇలా అమ్మకానికి అనువుగా ఉన్న భూముల వివరాలతో కూడిన నివేదిక ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది. తాజాగా భూముల అమ్మకానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని సీఎస్‌ను ఆదేశించడంతో ఇప్పుడు ఈ భూముల అమ్మకానికి షెడ్యూల్ విడుదల చేయడమే తరువాయి అని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అసైన్డ్ భూములు కూడా... రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను గతంలో భూమి లేని పేదలకు అసైన్‌చేశారు. ఈ భూముల్లో కనీసం 30 శాతం ఇప్పుడు ఆ పేదల చేతుల్లో లేవని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆయా భూములను కూడా ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవాలని, ఇందుకు గాను అసైనీలకు పరిహారం చెల్లించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయా భూముల్లో కబ్జాలో ఉన్న వారి సామాజిక స్థితిగతులతో కూడిన నివేదికను కూడా తెప్పించుకుంది. ఇలా సేకరించిన అసైన్డ్ భూము లను వీలును బట్టి వేలం వేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకు గాను తొలి దశలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూములతో పాటు మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడం లేదంటే బహుళ జాతి సంస్థలకు నిర్దేశిత ధరకు విక్రయించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపి స్తోంది. హైదరాబాద్ శివార్లలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరఖుర్దు, మాదాపూర్, రావి ర్యాల, తుమ్మలూరు, రాయన్నగూడ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయించింది. ఈ గ్రామాల్లో అసైన్‌చేసిన భూములకు గాను 1,636 ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చింది. గత ఏడాది కేవలం సర్వేకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వేలం వేయడం లేదా బహుళ జాతి సంస్థలకు విక్రయించే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలి స్తోందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. గృహ నిర్మాణ సంస్థ భూములు సైతం.. గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.8,504 కోట్ల వ్యయంతో 46,565 యూనిట్లను నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2008 నుంచి 2011 వరకు రూ.6,301 కోట్లను వెచ్చించి పలు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టారు. ఆ తర్వాత ఇందుకోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో ఆర్థిక సంక్షోభం రావడం, ప్రాజెక్టును కొనసాగించడం కష్టసాధ్యమని 2013లోనే మంత్రివర్గ ఉపసంఘం తేల్చడంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయింది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ కార్పొరేషన్‌కు ఉన్న రూ.1,070 కోట్లకు పైగా అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. ఇందుకు గాను బ్యాంకుల్లో తనఖా ఉన్న ప్రాజెక్టులు, భూములను విడిపించింది. ఈ కార్పొరేషన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,337 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ గృహాలు, భూములను అమ్మడం ద్వారా నిధులను సమీకరించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రభుత్వ భూముల అమ్మకంపై రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన సర్కారు ఈ ఏడాది దాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని శివార్లలోని విలువైన భూములతో పాటు అసైన్డ్, గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోని భూములు అమ్మే అవకాశం ఈ ప్రక్రియ మొదలైతే దశల వారీగా రూ.50,000 కోట్ల వరకు సమీకరించుకునే అవకాశం ఉంది. రెండేళ్లుగా పన్నేతర ఆదాయం ప్రతిపాదిస్తున్నా.. భూములు అమ్మడం ద్వారా నిధులు సమీకరించుకోవాలన్న ప్రతిపాదన గత రెండేళ్ల నుంచీ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ మేరకు ఆయా సంవత్సరాలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కూడా పన్నేతర ఆదాయాన్ని ప్రతిపాదించారు. కానీ గత రెండేళ్లలో అనివార్య కారణాల వల్ల ఇది సాధ్యం కాలేదు. అయితే, 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నేతర ఆదాయం పద్దు కింద రూ.30,557 కోట్లను ప్రభుత్వం చూపెట్టింది. కానీ గత మూడేళ్ల లెక్క లను పరిశీలిస్తే పన్నేతర ఆదాయం ఎప్పుడూ రూ.10 వేల కోట్లను దాటలేదు. 2018–19లో రూ. 10,007 కోట్లు, 2019–20లో రూ.7,360 కోట్లు చూపెట్టగా.. 2020–21లో అయితే రూ.5 వేల కోట్లు కూడా దాటలేదు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా పన్నేతర ఆదాయం కింద రూ. 30,600 కోట్ల పద్దు చూపెట్టినా అందులో ఆరో వంతు మాత్రమే వచ్చింది. అప్పుడు కూడా ప్రభుత్వ భూములను అమ్మే ప్రతిపాదనలున్నప్పటికీ అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో 2021–22 సంవత్సరంలో కూడా రూ. 30,557 కోట్లను పన్నేతర పద్దు కింద ప్రభు త్వం చూపెట్టడంతో ఈసారి భూముల అమ్మకాలు తప్పనిసరి అని స్పష్టమవుతోంది. నిరుపయోగంగా ఉన్న గృహ నిర్మాణ సంస్థ భూములతో పాటు డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ద్వారా సేకరించిన భూములు, కోకాపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్న భూములను అమ్మ కానికి పెట్టి రూ.10 వేల కోట్ల వరకు రాబట్టే అవకాశా లున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
కేబినెట్ కీలక నిర్ణయాలు : ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచింది. ఈ మేరకు బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను వెలువరించింది. మందగమనంలో ఆర్థిక వృద్ధిని చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా నాలుగు రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎప్డీఐలు కొద్దిగా మందగించాయి. అందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, పియూష్ గోయల్ వెల్లడించారు. ప్రధానంగా బొగ్గు తవ్వకాలు, సంబంధిత ప్రాసెసింగ్ కార్యకలాపాలు ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం పెట్టుబడులకు అనుమతి వుంటుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. కాంట్రాక్ట్ మాను ఫ్యాక్చరింగ్ రంగంలో 100 శాతం, డిజిటల్ మీడియాలో 26శాతం, బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసుల్లో 49 శాతం పెట్టుబడులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే సింగిల్ బ్రాండ్ రిటైల్ లో ఎఫ్‌డీఐ కోసం స్థానిక సోర్సింగ్ నిబంధనలు (30 శాతం స్థానికంగా కొనుగోళ్లు తప్పనిసరి) సడలించినట్టు గోయల్ చెప్పారు. అలాగే ఆన్లైన్ సేల్స్‌కు అనుమతినిచ్చామన్నారు. అయితే మల్టీ బ్రాండ్ రీటైల్ లో పెట్టుబడుల గురించి కేబినెట్లో చర్చించలేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు జవదేకర్ తెలిపారు. రూ. 24,375 కోట్ల పెట్టుబడితో 2021-22 నాటికి 75 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 529 కాలేజీల్లో 70,978 సీట్లు అందుబాటులో ఉన్నాయని, తాజా నిర్ణయంతో 15,700 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా లభించనున్నాయని కేంద్రమంత్రి జవదేకర్ వెల్లడించారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ఎగుమతులకు ప్రభుత్వం 6,268 కోట్ల సబ్సిడీని ఇవ్వనుంది. ఈ రాయితీ నేరుగా రైతు ఖాతాకు బదిలీ అవుతుందనీ, చక్కెర సీజన్ 2019-20లో మిగులు నిల్వలను ఖాళీ చేయడానికి తమ చక్కెర ఎగుమతి విధానం సహాయపడుతుందని జవదేకర్ చెప్పారు. భారతదేశంలో 162 లక్షల టన్నుల చక్కెర నిల్వ ఉంది, అందులో 40 లక్షల టన్నులు బఫర్ స్టాక్‌గా ఉంటుందన్నారు. దీంతోపాటు విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కోసం అంతర్జాతీయ కూటమి (సిడిఆర్ఐ) ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019 సెప్టెంబర్ 23 న న్యూయార్క్‌లో జరిగే యుఎన్ క్లైమేట్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీడీడిఆర్ఐని ప్రారంభించనున్నట్లు జవదేకర్ ప్రకటించారు. -
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం
-
బాహుబలిని ఆస్కార్‌కు సిఫార్సు చేస్తా
మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి తెలుగువారి చిత్ర నిర్మాణ ప్రతిభా పాటవాన్ని చాటిచెప్పిన బాహుబలి సినిమాను ఆస్కార్‌కు సిఫారసు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సినిమాను ఆద్యంతం హృద్యంగా మలిచిన రాజమౌళికి హ్యాట్సాఫ్ చెబుతూ... చిత్ర నిర్మాణ యూనిట్‌కు అభినందలు తెలుపుతూ మంత్రివర్గం తీర్మానించిందని వివరిం చారు. బాహుబలి యూనిట్‌ను త్వరలో అమరావతికి తీసుకొచ్చి సన్మానిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కన్సార్టియం కంపెనీకి స్విస్ ఛాలెంజ్‌లో అప్పగించేందుకు నిర్ణయించామని తెలిపారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని సీఎం పేషీలో మంగళవారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. మంత్రివర్గ నిర్ణయాలు ► కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావడం పట్ల హర్షం. ► ఒలింపిక్ విజేత పీవీ సింధుకి గ్రూప్–1 సర్వీస్‌లో నియమించేందుకు వీలుగా చర్యలు. ► కొత్తగా 800 కానిస్టేబుల్ పోస్టులకు ఆమోదం. 25 డివిజినల్ అక్కౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్–2 పోస్టులను గ్రేడ్–1 పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఆమోదం. -
ఏపీ కేబినెట్ నిర్ణయాలివి..
విజయవాడ : విజయవాడ క్యాంపు ఆఫీసులో శనివారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 42 అంశాలపై చర్చించామని మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి తెలిపారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, జరిగిన చర్చ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు.. సోంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ కు గతంలో భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో రద్దు ఈ ప్రాంతంలో మల్టీ ప్రాడక్ట్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేయాలని నిర్ణయం రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు ప్రపంచంలోని టాప్ ఇరవై విశ్వవిద్యాలయాలను ఇక్కడికి ఆహ్వానిస్తాం సుబాబుల్ ను పేపర్ గా మార్చే పరిశ్రమలను వ్యాట్ అయిదు శాతంకు కుదింపు నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటుకు నిర్ణయం వ్యర్థాల నుంచి వచ్చే ఇంధనాలకు 14 శాతం వ్యాట్ తొలగింపు విజయనగరం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాల ఏర్పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల పెంపుకు నిర్ణయం పేదలకు అరవై గజాల వరకు ఉచిత క్రమబద్దీకరణ సింహాచలంలో 12,149 మందికి చెందిన భూముల క్రమబద్దీకరణ 60 నుంచి 300 గజాల వరకు 1998 బేస్ రేట్ల ప్రకారం క్రమబద్దీకరణ మూడు వందల గజాలకు పైన అయితే ప్రస్తుతం ఉన్న బేస్ రేట్ల ప్రకారం క్రమబద్దీకరణ దేవాదాయశాఖలో బోర్డుల పరిమితి రెండేళ్లకు పెంచుతూ నిర్ణయం రాజధాని మాస్టర్ డెవలప్ మెంట్ పై చర్చ, కార్మిక సంస్కరణలపై చర్చ చిత్తూరులో హెల్త్ సిటీ స్థాపనకు నిర్ణయం, ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తుపై నిర్ణయం ఆర్థికనేరాలు, చిట్‌ఫండ్ కంపెనీల మోసాలపై కఠిన చర్యలపై చర్చ ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్మీడియేట్ స్థాయి వరకు తెలుగును తప్పనిసరి చేయాలని నిర్ణయం -
జగన్‌తో ప్రయాణం అంటే..జనంతోనే...
=న్యాయం కోసం పోరాటం చేసినా రాజకీయాలేనా? = క్యాబినెట్ నిర్ణయాలను తప్పుపట్టి జైల్లో పెట్టారు =ప్రజలు జగన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నారు = మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడి పామర్రు రూరల్, న్యూస్‌లైన్ : జగన్‌తో ప్రయాణం అంటే జనంతో ఉన్నట్లేనని, అందుకే వైఎస్సార్సీపీలో చేరానని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. న్యాయం కోసం 16 నెలలు పోరాడి బెయిల్ తెచ్చుకుంటే దీన్ని కూడా అధికార, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగి రోడ్డుమార్గంలో తన సొంత నియోజకవర్గమైన రేపల్లెకు పామర్రు మీదుగా వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఆగిన ఆయన పార్టీ కార్యాలయంలో ఉన్న మహానేత ైవె ఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసం మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాలను తప్పుబట్టి తనను జైల్లో పెట్టారని ఆవేదన చెందారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోవాలనే కుట్రతోనే ముందుగా తనను, అనంతరం జగన్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు. 16 నెలల పాటు న్యాయం కోసం పోరాడి కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకుంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆవేదన చెందారు. జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావటానికి కారణం కాంగ్రెస్‌తో కలవడమేనంటూ ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నాయని మోపిదేవి విమర్శించారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్రెడ్డి కోసం ఎదురుచూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాబోయే కాలంలో వచ్చే జగన్మోహన్రెడ్డి ప్రాభవాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాష్ట్ర ప్రజలంతా వైఎస్సార్సీపీ వెనకే ఉన్నారని స్పష్టం చేశారు. అందుకే జగన్‌తో ఉంటే జనంతో ఉన్నట్లేనని పేర్కొన్నారు. చెయ్యని నేరానికి జైలు... మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ బలహీన వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ చెయ్యని నేరానికి జైలు జీవితాన్ని అనుభవించారని చెప్పారు. బలహీన వర్గాల నేతలపై పాలకుల క్రూరత్వం ఎలా ఉంటుందో మోపిదేవి వెంకటరమణ కేసులో స్పష్టమైందన్నారు. వైఎస్ లేని సమయంలో రాష్ట్రాభివృద్ధికి జగన్ మోహన్‌రెడ్డి అవసరం ఎంతైనా ఉన్నదని ప్రజలు గ్ర హించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పామర్రు సర్పంచ్ దేవరకొండ రోహిణి, ఉప సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు ముత్తేవి ప్రసాద్, పార్టీ యూత్ మండల కన్వీనర్ మద్దాలి అరవింద్, ప్రచార కమిటీ మండల కన్వీనర్ కూసం పెద వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.