సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామని.. గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు ఇస్తే.. తమ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎం మాట్లాడుతూ.. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
భూమిలేని వ్యవసాయ కుటుంబాలకూ ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తామని రేవంత్ తెలిపారు. రేషన్‌కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. జనవరి 26 నుంచి ఈ పథకాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఆరోజును మేం ఎంచుకున్నాం. రాళ్లు, రప్పలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబడదు. గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులు సమాచారం సేకరించి ప్రజలకు అన్నివిషయాలు వివరిస్తారు.’’ అని రేవంత్ చెప్పారు.
కేబినెట్ కీలక నిర్ణయాలు
- వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా
- ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
- భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు
- సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ
- రైతు భరోసాకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణం
- జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ
- ములుగు మున్సిపాలిటీకి కేబినెట్ ఆమోదం
- పంచాయతీ రాజ్‌లో 588 కారుణ్య నియామకాలకు ఆమోదం
- 200 కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్ ఆమోదం
- మరో 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదం
ఇదీ చదవండి: ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment