ఏపీ కేబినెట్ నిర్ణయాలివి..
విజయవాడ : విజయవాడ క్యాంపు ఆఫీసులో శనివారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 42 అంశాలపై చర్చించామని మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి తెలిపారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, జరిగిన చర్చ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు..
సోంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ కు గతంలో భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో రద్దు
ఈ ప్రాంతంలో మల్టీ ప్రాడక్ట్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేయాలని నిర్ణయం
రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు
ప్రపంచంలోని టాప్ ఇరవై విశ్వవిద్యాలయాలను ఇక్కడికి ఆహ్వానిస్తాం
సుబాబుల్ ను పేపర్ గా మార్చే పరిశ్రమలను వ్యాట్ అయిదు శాతంకు కుదింపు
నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటుకు నిర్ణయం
వ్యర్థాల నుంచి వచ్చే ఇంధనాలకు 14 శాతం వ్యాట్ తొలగింపు
విజయనగరం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాల ఏర్పాటు
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల పెంపుకు నిర్ణయం
పేదలకు అరవై గజాల వరకు ఉచిత క్రమబద్దీకరణ
సింహాచలంలో 12,149 మందికి చెందిన భూముల క్రమబద్దీకరణ
60 నుంచి 300 గజాల వరకు 1998 బేస్ రేట్ల ప్రకారం క్రమబద్దీకరణ
మూడు వందల గజాలకు పైన అయితే ప్రస్తుతం ఉన్న బేస్ రేట్ల ప్రకారం క్రమబద్దీకరణ
దేవాదాయశాఖలో బోర్డుల పరిమితి రెండేళ్లకు పెంచుతూ నిర్ణయం
రాజధాని మాస్టర్ డెవలప్ మెంట్ పై చర్చ, కార్మిక సంస్కరణలపై చర్చ
చిత్తూరులో హెల్త్ సిటీ స్థాపనకు నిర్ణయం, ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తుపై నిర్ణయం
ఆర్థికనేరాలు, చిట్ఫండ్ కంపెనీల మోసాలపై కఠిన చర్యలపై చర్చ
ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్మీడియేట్ స్థాయి వరకు తెలుగును తప్పనిసరి చేయాలని నిర్ణయం