ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం | AP Cabinet Meeting: CM Jagan Approves Key Decissions | Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

Published Fri, Nov 3 2023 7:25 PM | Last Updated on Fri, Nov 3 2023 8:55 PM

AP Cabinet Meeting: CM Jagan Approves Key Decissions  - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రమంత్రిమండలి శుక్రవారం సమావేశమైంది. ఈ భేటీలో ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నసచివాలయం పబ్లిసిటీ సెల్‌లో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు.

సంక్షేమ పథకాల షెడ్యూల్డ్‌...
► నవంబరు 7వ తేదీ..వైఎస్సార్‌ రైతు భరోసా.
►నవంబరు15.. భూపంపిణీ.
►నవంబరు 28.. విద్యాదీవెన. 

►ఖరీప్‌ 2023–24 ధాన్యం సేకరణకు మార్క్‌ఫెడ్‌కు రూ.5వేల కోట్ల రుణ మంజూరుకు ప్రభుత్వం తరపున అవసరమైన గ్యారంటీ అందించేందుకు కేబినెట్‌ ఆమోదం.
►ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్‌ఆధ్వర్యంలో ఖరీప్‌ ధాన్యం సేకరణ. 

►రాష్ట్రంలో వివిధ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తూ..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన గత నెల 30వ తేదీన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్టు సమావేశం  ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి.
►రెండు పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు స్పెషల్‌ ప్యాకేజీ ఇవ్వాలన్న ఎస్‌ఐపీబీ నిర్ణయానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

►రహదారుల,భవనాలశాఖలో 467 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల, భవనాలశాఖ పరిధిలో గెస్ట్‌హోస్‌ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోనున్న ఆర్‌ అండ్‌ బిశాఖ.

►తూర్పుగోదావరి జిల్లా  నల్లజెర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాలతో కలిపి దేవరాపల్లిలో రవాణాశాఖకు చెందిన యూనిట్‌ ఆఫీసు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
►ఈ కార్యాలయంలో అవసరమైన ఒక మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్, ఒక సీనియర్‌ అసిస్టెంట్, ఒక టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజనీర్, ఒక హోంగార్డు నియామకానికి ఆమోదం. 

►శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 6 మండలాలు (ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లె, సీకే పల్లె)తో కలిపి రవాణాశాఖకు చెందిన యూనిట్‌ ఆఫీసు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
►ఒక మోటారు వెహికల్‌ ఇన్స్‌ఫెక్టర్, ఒక సీనియర్‌ అసిస్టెంట్, ఒక జూనియర్‌ అసిస్టెంట్, ఒక టెక్నికల్‌ ఇంజనీరు, ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ముగ్గురు హోంగార్డుల నియామకానికి కేబినెట్‌ ఆమోదం. 

జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్‌కు వివరాలు అందించిన అధికారులు.
►ఇప్పటివరకూ 11710 క్యాంపులు నిర్వహించామని వెల్లడి.
►60 లక్షల మంది శిబిరాల వద్దకు వచ్చారని వెల్లడి
►6.4 కోట్ల మందికి ఇంటివద్దే వైద్య ర్యాపిడ్‌ పరీక్షలు.
►8,72,212 మందికి కంటి పరీక్షలు చేశామన్న అధికారులు.
►5,22,547 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు.
►11327 మందికి కంటి చికిత్సలు చేయిస్తున్నామన్న అధికారులు.
►జగనన్న సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్న మంత్రులు.
►వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి వైద్య సహాయం లభిస్తుందన్న మంత్రులు.
►ఈ కార్యక్రమాన్ని అభినందించిన కేబినెట్‌. 

వైద్య పరీక్షల్లో గుర్తించిన వారికి చికిత్స విషయంలో సమగ్రమైన ఫాలో అప్‌ చేయాలి: సీఎం జగన్‌
►గతంలో ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయించుకున్నవారు, శిబిరాల ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స అవసరమని భావించిన వారు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారు.
►ఈ కేటగిరీలకు చెందినవారిపై ప్రత్యుక శ్రద్ధ వహించాలి.
►తీవ్రమైన రోగాలతో బాధపడుతున్నవారిని గుర్తించిన వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
►వారికి అవసరమైన తుదపరి చికిత్సలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందించాలి.
►ఆస్పత్రులకు వారు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలి.
►మందులు కూడా సకాలంలో వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి.
►చికిత్సలు పూర్తయిన తర్వాతకూడా వారి ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
►జగనన్న సురక్ష శిబిరాలు బాగా జరిగేలా చూడాలని మంత్రులను ఆదేశం.
►శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు మంచి చికిత్స అందేలా చూడాలి.
►వారు ట్రీట్‌మెంట్‌ ముగించుకుని తిరిగి ఇంటి వచ్చాక వారికి మందులు అందేలా, తదుపరి చికిత్స అందించేలా చూడాలి.
►ఎవ్వరికీ మందులు అందలేదన్న మాట వినపడకూడదు. ఈ మందులన్నీ ఉచితంగా అందిస్తున్నాం.
►రిఫరెల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా లేదా ఆస్పత్రికి పంపించాలి
►ప్రయాణ ఖర్చులు కింద రూ.500 అందించాలి.
►దీంతోపాటు గ్రామాల్లో గతంలో తీవ్ర రోగాల బారినపడ్డ పేషెంట్లకు కూడా అండగా నిలవాలి.
►వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందించాలి.

అవసరమైన పక్షంలో డాక్టర్లకు రిఫరెల్‌ కూడా చేసే బాధ్యతలను నిర్వర్తించాలి: సీఎం జగన్‌.
►గతంలో ఆరోగ్య శ్రీకింద చికిత్సలు చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా ఆరాతీయాలి. 
►అవసరమనుకుంటే వారినికూడా రిఫరెల్‌కు పంపించాలి. వీరికీ చేయూత నివ్వాలి.
►ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమం. కచ్చితంగా దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. 
►అత్యంత ఖరీదైన మందులు కూడా ఉచితంగా అందించాలి. 
►మంత్రులు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి.

జనవరి 1 నుంచి ప్రతినెలా నాలుగు క్యాంపులు ప్రతి మండలంలో నిర్వహిస్తారు: సీఎం జగన్‌
►నలుగురు స్పెషలిస్టు డాక్టర్లు కూడా ఇందులో పాల్గొంటారు. 
►ప్రతి వారంలో ఒక మండలంలో ఒక గ్రామ సచివాలయంలో క్యాంపు నిర్వహిస్తారు. 
►అందులోకూడా పైన చెప్పిన విధంగా రోగులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
►ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఉధృతంగా ప్రచారం చేపట్టాలి.
►నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15వరకూ మరోసారి ఈ కార్యక్రమం జరుగుతుంది.
►దిశ యాప్‌ను ఏ రకంగా డౌన్లోడ్‌ చేశామో, ఆరోగ్య శ్రీ యాప్‌నుకూడా డౌన్లోడ్‌ చేస్తాం.
►యాప్‌ ద్వారా ఎంపానెల్‌ ఆస్పత్రులు ఎక్కడున్నాయో సులభంగా తెలుసుకోవచ్చు.
►దీనివల్ల సులభంగా ఆరోగ్య శ్రీ చికిత్సలు అందించవచ్చు.

►గ్రామాల్లో ఎక్కడా కూడా పౌష్టికాహార లోపంతోకాని, రక్తహీనతతో బాధపడేవారు కాని ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.
►వారికి సరైన ఆహారం, మందులు అందిస్తున్నాం.
►ఈ కార్యక్రమంపైనాకూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి.
►కంటి సమస్యలతో బాధపడేవారికి కూడా కంటి అద్దాలు ఇస్తున్నాం. 

మార్కాపురం మెడికల్‌ కాలేజీలో 21 పోస్టులతో నెఫ్రాలజీ డిపార్ట్‌మెంటు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
పలాస తరహాలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీఆసుపత్రి, డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకూ మంత్రిమండలి ఆమోదం.

►పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీలో పురపాలకశాఖ భవన నిర్మాణానికి అవసరమైన స్ధలాన్ని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 

►ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన, మెరుగైన విద్యను అందించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్‌ నియమించాలన్న పాఠశాల విద్యాశాఖ నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
 ►6,790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్‌ స్కిల్స్‌పై బోధనకోసం ఇంజినీరింగ్‌ కాలేజీల మ్యాపింగ్‌ .
►ట్యాబులు డిజిటల్‌ పరికరాలు, యాప్‌లు వినియోగంపై విద్యార్థులకు శిక్షణ దీని ఉద్దేశం.
►అలాగే ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో పెట్టే ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ వినియోగంపైనా వీరు శిక్షణ ఇస్తారు.
►ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే సరిదిద్దుతారు.
►పరికరాల వినియోగంపై టీచర్లనుంచి, విద్యార్థులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తారు.
►వినియోగం తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు
►సాంకేతికను వినియోగించుకుని విద్యార్థుల సమర్థతలో పెంచేలా చూస్తారు
►డేటా ప్రైవసీ, సెక్యూరిటీలపై తగిన చర్యలు తీసుకుంటారు. 

50 ఎకరాల లోపు ఏపీఐఐసీ కేటాయించిన 285 భూకేటాయింపులకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. 
►భారీ ప్రాజెక్టులకు వివిధ రకాల రాయితీలను కల్పిస్తూ.. స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ప్రతిపాదలనకు కేబినెట్‌ ఆమోదం. 
►ఇంటిగ్రేటెడ్‌ ఎలక్ట్రిక్‌ బస్‌ అండ్‌ ట్రక్‌ కాంప్లెక్స్ , డీజిల్‌ బస్‌ రిట్రో ఫిటింగ్, బ్యాటరీ ఫ్యాక్‌ అసెంబుల్డ్  చేసే పెప్పర్‌ మోషన్‌  సంస్ధ.
►ఇది రూ.4,640 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 8080 మందికి ఉపాధి అందించనుంది. 
►దీంతో పాటు ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకూ కేబినెట్‌ ఆమోదం. 

పరిశ్రమలకు భూ కేటాయింపుల విధానంలో మార్పుకు కేబినెట్‌ ఆమోదం.
►పరిశ్రమలకు మరింత అనుకూలత కోసం నిర్ణయం. 
►లీజు విధానం స్థానే సేల్‌ డీడ్‌ విధానంలో కేటాయింపు
►పరిశ్రమలకోసం మాత్రమే ఆభూమిని వినియోగించేలా తగిన షరతులతో ఈ విధానం.
►పరిశ్రమలు పెట్టేవారికి ఆర్థిక సంస్థలనుంచి వెసులు బాటుకోసమే నిర్ణయం
►పరిశ్రమలకు భూ కేటాయింపులపై కొత్త పాలసీ రూపకల్పన. న్యూ ల్యాండ్‌ అలాట్‌మెంట్‌ పాలసీకి ఆమోదముద్ర వేసిన రాష్ట్ర మంత్రిమండలి.

►అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గతంలో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకోసం 1200 ఎకరాలు ఇచ్చిన ఏపీఐఐసీ
►ఇందులో హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
►దీనికోసం సబ్‌ లీజింగ్‌కు అనుమతి ఇచ్చిన కేబినెట్‌.  
►రూ. 95వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎన్‌టీపీసీ. 
►గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటుతో పాటు ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకై ఏపీఐఐసీ ప్రతిపాదనల మేరకు ఎన్‌టీపీసీ లిమిటెడ్‌కు అనుమతులు మంజారు చేస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి.

►తిరుపతి జిల్లా పేరూరులో ఎంఆర్‌కేఆర్‌ గ్రూపు హోటల్‌ నిర్మాణానికి అదనంగా మరో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ.. తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
►వైయస్సార్‌ జిల్లా గండికోటలోనూ, విశాఖపట్నంలో మేపెయిర్‌  గ్రూపులకు గతంలో కేటాయించిన భూములు కాకుండా కొత్త సర్వేనెంబర్లలో భూకేటాయింపులు.

►విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారుడు సాకేత్‌ మైనేనికి గ్రూప్‌– 1 అధికారిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
►రెండు ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన సాకేత్‌ మైనేని.
►డేవిస్‌కప్‌ టీంలో 11 ఏళ్లపాటు కొనసాగిన సాకేత్‌.
►2016 నుంచి 2017 వరకూ ఇండియా నంబర్‌ 1గా ఉన్న సాకేత్‌ మైనేని.


► ఏపీ ఫెర్రోఅల్లాయిస్‌ ప్రోడ్యూసర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి మేరకు వివిధ రకాల విద్యుత్‌ డ్యూటీలలో మినహాయింపులు కల్పిస్తూ కేబినెట్‌ ఆమోదం. 
►ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి కొంత మినహాయింపు.  
►స్టీల్‌ ఇండస్ట్రీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈ పరిశ్రమలకు తోడ్పాటు నిచ్చేందుకు నిర్ణయం.
►రూ.766 కోట్ల మేర భారాన్ని మోయనున్న ప్రభుత్వం
►దాదాపు 50 వేలమంది ఈ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నందున నిర్ణయం తీసుకున్న కేబినెట్‌.


►902 మెగావాట్ల సామర్ధ్యమున్న సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు కోసం  ఎకోరన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్ధకు నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాలలో 5,400 ఎకరాలు ►లీజు ప్రాతిపదికన కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
►ఏడాదికి రూ.31వేలు ఎకరాకు చెల్లించనున్న కంపెనీ.
►రెండేళ్లకు 5శాతం చొప్పున పెంపు. 
►కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్ధకు అనుమతిలిస్తూ కేబినెట్‌ ఆమోదం. 
►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్‌.
►రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వాలన్న  ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్‌.
►రాష్ట్రంలో 100 ఇన్స్‌ఫెక్టర్‌ ఆఫ్‌ పోలీసు పోస్టులను భర్తీ చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
ఇందులో 45 పోస్టులు అప్‌గ్రేడేషన్, 55 సూపర్‌ న్యూమరరీ పోస్టులు.

►ఏపీ స్టేట్‌ పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీలో 22 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో భర్తీ
►సమగ్ర కులగణనకు కేబినెట్‌ ఆమోదం.
►ఆర్ధిక, సామాజిక, విద్యాపరమైన జీవనోపాధి, జనభాసమతుల్యత అన్న అంశాలపై గణన. 
►అణగారిన వర్గాలు మరింత అభ్యున్నతికి ఈ డేటా ఉపయోగపడుతుందన్న సీఎం.
►ఆర్థిక సామాజిక అభివృద్ధి కల్పించేందుకు దోహదపడుతుందన్న సీఎం.
►ప్రభుత్వ పథకాలు అందకుండా ఎవరైనా మిగిలిపోయినా కూడా ఈ గణన ద్వారా తెలుస్తుందని, తద్వారా వారు లబ్ధిపొందుతారన్న కేబినెట్‌.
►మరిన్ని పేదరిక నిర్మూలనా పథకాలకు, మానవవనరుల అభివృద్ధికి, తారతమ్యాలు తగ్గించేందుకు, అసమానతలు రూపుమాపేందుకు ఈ డేటా వినియోగపడుతుందన్న సీఎం. 
►కులగణన చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రివర్గసభ్యులు. 

►ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్న మాటను మరోసారి నిలబెట్టుకుంటూ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లోకల్‌ కేడర్స్‌ అండ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌  డ్రాప్ట్‌ ఆర్డర్‌ 2023కు ఆమోదం.
►జోనల్‌ వ్యవస్థలో మార్పులకు కేబినెట్‌ నిర్ణయం.
►డిస్ట్రిక్‌ కేడర్‌గా టీచర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, సమానస్థాయి, అంతకంటే దిగువ.
►జోనల్‌ కేడర్‌గా జూనియర్‌ అసిస్టెంట్‌ పైన ఉన్నవారు.  
►మల్టీజోన్‌ పరిధిలో సెకండ్‌ లెవల్‌ గెజిటెడ్‌ సమానస్థాయి, డిప్యూటీ కలెక్టర్‌ సమానస్థాయి వారు. 
►స్టేట్‌ లెవల్‌ కేడర్‌ అంతా మల్టీజోనల్‌  కిందకు (ఏపీ సెక్రటేరియట్, హెచ్‌ఓడీలు, స్టేట్‌ లెవల్‌ ఇనిస్టిట్యూషన్స్, కేపిటల్‌ ఏరియాలో పోలిస్‌ కమిషనరేట్‌ మినహాయిస్తే)
►దీనివల్ల 95శాతం పోస్టులు ఆయా స్థానికులకే చెందుతాయి.
►స్థానిక వ్యక్తులకు కనీస విద్యార్హత స్థాయి 10నుంచి 7కు తగ్గింపు.
►ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లను ఆరు జోన్లకు మారుస్తూ నిర్ణయం.
►వీటితోపాటు రెండు మల్టీ జోన్లు.

►ర్నూలులో సెకండ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, స్టేట్‌ క్వాజీ జ్యుడీషియల్‌ అండ్‌ లీగల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఏర్పాటుకు అవసరమైన మరో 100 ఎకరాల భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం. ఇప్పటికే వీటికోసం 50 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం.
►ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కన్జూమర్‌ డిస్‌ప్యూట్‌ రిడ్రెసల్‌ కమిషన్, ఏపీ లీగల్‌ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్‌ కమిషన్, ఏపీ వ్యాట్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్‌బోర్డు, లోకాయుక్త తదితర సంస్థలకు ఉపయోగం. 

►దేవాదాయశాఖలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు దేవాదాయశాఖ కమిషనర్‌ పరిధిలో ఒక డిప్యూటీ కమిషనర్‌ పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. 
►ఆయా దేవాలయాలు ఆర్జించే ఆదాయాలు ఆధారంగా ఏర్పాటు చేసే పోస్టులకు సంబంధించిన ఆదాయపరిమితిని పెంచిన నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
►గతంలో డిప్యూటీ కమిషనర్‌  పరిధిలో రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటే  ఇప్పుడు దానిని రూ.7 నుంచి రూ.12 కోట్లకు పరిమితి పెంపు.
►జాయింట్‌ కమిషనర్‌ పరిధిలో గతంలో రూ.1 కోటి ఉంటే దానిని రూ.12 కోట్లు కంటే ఎక్కువ పరిమితి పెంపు.
►విశాఖపట్నం జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, యూజర్‌ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించిన మంత్రిమండలి.

►పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా.. ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల పరిధిలో 12,984 కుటుంబాలకు, రాజమహేంద్రవరం జిల్లాలో దేవీపట్నం, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో 3,823 కుటుంబాలకు కేటాయించి ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్, భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

►కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధకు 4.12 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
►ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లెలో ఏపీఐఐసీకి 2.92 ఎకరాల భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
►శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అసరమైన భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.

►నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో 39.08 ఎకరాల భూమిని రామాయపట్నం నాన్‌ మేజర్‌ పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్‌ బోర్డుకు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.
► జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి.
►రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాల పంపిణీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.
► విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నరవలో ప్రముఖ జానపదకళాకారుడు దివంగత వంగపండు ప్రసాదరావు సతీమణి శ్రీమతి వంగపండు విజయలక్ష్మికి 1000 గజాల ఇంటిస్ధలం కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement