సాక్షి, విజయవాడ: మీడియా ప్రతినిధులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపట్ల సీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇస్తోన్న ఇళ్ల స్థలాలను సద్వినియోగంచేసుకోవాలని ఛైర్మన్ మీడియా ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరబోతోంది
ఆంధ్రప్రదేశ్‌లోని పాత్రికేయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలకు సంబంధించి సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్( ఇండియా ) మాజీ జాతీయ కార్యదర్శి , అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు వర్షం వ్యక్తం చేశారు
పాత్రికేయుల్లో అత్యధికులు నిరుపేదలేనని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతులు తెలియజేస్తున్నామని తెలిపారు. మీడియాలోని ఒక వర్గం నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా మీడియా సంస్థల్లో పని చేసే పాత్రికేయుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చబోతున్నారన్నారు. ఇది సీఎం జగన్ విశాల దృక్పథానికి నిదర్శనమన్నారు.
గతంలో దివంగత నేత వైఎస్సార్ మాత్రమే పాత్రికేయులకు విలువైన ఇళ్ల స్థలాలు ఉచితంగా పంపిణీ చేశారని, ఫలితంగా వారి ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగయ్యాయని వారు గుర్తు చేశారు. సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లోని జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరబోతోందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
మీడియా మంచి కోరే సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు అందరికీ ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్ట్ లు అందరికీ ఈరోజు ఒక చారిత్రిక సందర్భం. ఉమ్మడి రాష్ట్రంలో చివరగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత మళ్ళీ జర్నలిస్టుల గృహ వసతి గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
పాదయాత్ర సందర్భంగా చాలా చోట్ల జర్నలిస్టులు జగన్మోహన్రెడఇని కలిసి తమ సమస్యలను విన్నవించిన నేపథ్యంలో ఆయన తన పార్టీ ఎన్నికల ప్రణాళిక లో పొందుపరిచిన హామీని ఇవాళ నెరవేర్చారు. వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఇవాళ క్యాబినెట్‌లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్‌కు ఆయన క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి తరఫున కృతజ్ఞతలు’అని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment