Cabinet meet
-
పోలవరానికి మళ్లీ ‘చంద్ర’గ్రహణం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును ‘చంద్ర’గ్రహణం వీడటంలేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి దానిని ఛిద్రం చేస్తూనే ఉన్నారు. మధ్యలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టును గాడిలో పెట్టి, పూర్తిస్థాయిలో నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించినప్పటికీ, ఈ ఏడాది ఎన్డీఏలో చేరిన చంద్రబాబు దానికీ మోకాలడ్డారు. పూర్తిస్థాయిలో 45.72 మీటర్ల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే వైఎస్సార్సీపీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందంటూ కేంద్రంతో 41.15 మీటర్లకే ప్రాజెక్తును పరిమితం చేయించి, రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టేశారు. జల శక్తి శాఖ ప్రతిపాదనలను అడ్డుకొని పోలవరం తొలి దశలో 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేలా అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ బోర్డు (పీఐబీ) ఈ ఏడాది ఫిబ్రవరి 27న మెమొరాండంను ఆమోదించింది. దాని ఆధారంగా నిధులు మంజూరు చేసేందుకు 2017 మార్చి 15న ఆమోదించిన తీర్మానాన్ని సవరించాలంటూ కేంద్ర కేబినెట్‌కు మార్చి 6న కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్డీఏలో చేరిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పోలవరానికి నిధులిస్తే ఎన్నికల్లో రాజకీయంగా వైఎస్సార్సీపీకి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దల చెవిలో ఊదారు.దాంతో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. ప్రాజెక్టును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇప్పటిదాకా చేసిన ఖర్చు పోను మిగిలిన రూ.12,157.53 కోట్లు ఇస్తామని చెప్పింది. దీనిని కేంద్ర మంత్రివర్గంలోని టీడీపీ మంత్రి కె.రామ్మోహన్నాయుడు వ్యతిరేకించలేదు. అంటే.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గింపునకు అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 41.15 మీటర్ల ఎత్తుతో నిష్ఫలమే పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు (150 అడుగులు). గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఈ స్థాయిలో కేవలం 115.44 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటాయి. 41.15 మీటర్లకంటే ఎగువన నీటి నిల్వ ఉన్నప్పుడే కుడి, ఎడమ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఇప్పుడు ప్రాజెక్టును 41.15 మీటర్లకే తగ్గించడం వల్ల కాలువలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడం సాధ్యం కాదు.ప్రాజెక్టు ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆయకట్టు 8 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ కూడా అసాధ్యం. 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తీ ప్రశ్నార్థకమవుతుంది. మహానగరంగా మారుతున్న విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడమూ కష్టమే. అంటే.. ప్రాజెక్టు లక్ష్యాలకే గండి కొట్టేశారని నిపుణులు చెబుతున్నారు. జాతీయ ప్రాజెక్టును రాష్ట్ర ప్రాజెక్టుగా మార్చేసిన వైనం 2005లో అన్ని అనుమతులు సాధించి అప్పటి సీఎం వైఎస్సార్ పోలవరం నిర్మాణాన్ని చేపట్టారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తీవ్ర స్థాయిలో పోరాడారు. జాతీయ హోదా ప్రతిపాదన తుది దశలో ఉండగా ఆయన హఠాన్మరణం చెందారు. చివరకు విభజన చట్టం ద్వారా పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. వంద శాతం వ్యయంతో పోలవరాన్ని పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం బాధ్యతలను 2016 సెపె్టంబరు 7న దక్కించుకుంది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంగీకరించారు. కానీ, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33,168.24 కోట్లు అవసరం. అలాంటిది రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేస్తానని అంగీకరించడం ద్వారా ప్రాజెక్టును ఆరి్థక సంక్షోభంలోకి నెట్టేశారు.‘చంద్ర’గ్రహణం నుంచి విముక్తి చేసిన వైఎస్ జగన్ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ మ్యాన్యువల్‌ను తుంగలో తొక్కారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాంలను కట్టకుండానే ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ కట్టేశారు. 2019 ఫిబ్రవరి నాటికి కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీలు వదిలేసి చేతులెత్తేశారు. దీంతో 2018, 2019లో వచి్చన గోదావరి వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు తప్పిదాలను సరిదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని చేపట్టారు.కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్లను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, గ్యాప్–1లో ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్, దిగువ కాఫర్ డ్యాంను పూర్తి చేశారు. విద్యుత్ కేంద్రం పనులను కొలిక్కి తెచ్చారు. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం పనులను దాదాపుగా పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేలి్చతే.. శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమైన ప్రతిసారీ తాజా ధరల మేరకు ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరారు.ఇందుకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తొలి దశలో 41.15 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేసి, ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 45.72 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఇందుకు వైఎస్ జగన్ అంగీకరించారు. దీంతో తొలి దశ పనులు పూర్తి చేసేందుకు రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆరి్థక శాఖ మంత్రి నోట్ జారీ చేశారు. ఇలా పోలవరానికి పట్టిన ‘చంద్ర’గ్రహణాన్ని వైఎస్ జగన్ విడిపించారు. కానీ, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రంగప్రవేశంతో ప్రాజెక్టుకు మరోసారి గ్రహణం పట్టింది. -
మోదీ గుడ్ న్యూస్.. ఇకపై వారందరికి ఫుల్ పెన్షన్!
-
CM Jagan: ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా?. ఇందుకు సంబంధించి ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో వ్యాఖ్యానించారాయన. ‘‘ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పని చేయాలి. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చు’’ అని కేబినెట్ భేటీలో సీఎం జగన్ అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు.. వాటికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈనాడు, యెల్లో మీడియాలో జరిగే ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. -
MP: కౌంటింగ్ వేళ క్యాబినెట్ మీటింగ్.. కాంగ్రెస్ అభ్యంతరం
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ సమావేశానికి మంత్రులందరితో పాటు సీనియర్ అధికారులను కూడా పిలిచారు. ఎటువంటి అజెండా లేకుండా ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందుగా ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపును ప్రభావితం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే ఇది అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీసీ శర్మ ఆరోపించారు. బాలాఘాట్ పోస్టల్ బ్యాలెట్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీకి ఓటు వేయలేదు కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపునకు మూడు రోజుల ముందుగా ఇలా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం గత పదేళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ ఎటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేరు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెయిన్స్ పదవీ విరమణ తర్వాత కొత్త ప్రధాన కార్యదర్శిగా వీర రాణా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే బెయిన్స్ తర్వాత రాష్ట్రంలో ఆమె సీనియర్ మోస్ట్ అధికారి. -
సీఎం జగన్ నిర్ణయంపై హర్షం
సాక్షి, విజయవాడ: మీడియా ప్రతినిధులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపట్ల సీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇస్తోన్న ఇళ్ల స్థలాలను సద్వినియోగంచేసుకోవాలని ఛైర్మన్ మీడియా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరబోతోంది ఆంధ్రప్రదేశ్‌లోని పాత్రికేయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలకు సంబంధించి సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్( ఇండియా ) మాజీ జాతీయ కార్యదర్శి , అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు వర్షం వ్యక్తం చేశారు పాత్రికేయుల్లో అత్యధికులు నిరుపేదలేనని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతులు తెలియజేస్తున్నామని తెలిపారు. మీడియాలోని ఒక వర్గం నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా మీడియా సంస్థల్లో పని చేసే పాత్రికేయుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చబోతున్నారన్నారు. ఇది సీఎం జగన్ విశాల దృక్పథానికి నిదర్శనమన్నారు. గతంలో దివంగత నేత వైఎస్సార్ మాత్రమే పాత్రికేయులకు విలువైన ఇళ్ల స్థలాలు ఉచితంగా పంపిణీ చేశారని, ఫలితంగా వారి ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగయ్యాయని వారు గుర్తు చేశారు. సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లోని జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేరబోతోందని వారు ఆనందం వ్యక్తం చేశారు. మీడియా మంచి కోరే సీఎం జగన్‌కు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు అందరికీ ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్ట్ లు అందరికీ ఈరోజు ఒక చారిత్రిక సందర్భం. ఉమ్మడి రాష్ట్రంలో చివరగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత మళ్ళీ జర్నలిస్టుల గృహ వసతి గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పాదయాత్ర సందర్భంగా చాలా చోట్ల జర్నలిస్టులు జగన్మోహన్రెడఇని కలిసి తమ సమస్యలను విన్నవించిన నేపథ్యంలో ఆయన తన పార్టీ ఎన్నికల ప్రణాళిక లో పొందుపరిచిన హామీని ఇవాళ నెరవేర్చారు. వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఇవాళ క్యాబినెట్లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్‌కు ఆయన క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి తరఫున కృతజ్ఞతలు’అని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. -
ఏపీ కేబినెట్ తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఇవే
-
కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం
-
ప్రజల వద్దకు అభివృద్ధి పనులు
న్యూఢిల్లీ: గత తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. వచ్చే తొమ్మిది నెలల కాలంలో ఈ పనుల గురించి ప్రజలకు వివరించాలని మంత్రివర్గ సహచరులను ఆయన కోరారు. సోమవారం రాత్రి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధానిమాట్లాడారు. 2047లో వందో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే నాటికి మౌలిక వసతులు మొదలుకొని బడ్జెట్ పరిమాణం వరకు ప్రగతి ప్రయాణాన్ని వివరించే పవర్ ప్రజెంటేషన్ కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటి నుంచి 2047వ సంవత్సరం వరకు స్వర్ణయుగం, అమృత్ కాల్‌గా ప్రధాని మోదీ పేర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించిన ప్రధాని, అదే సమయంలో దేశం సాధించిన ప్రగతిని ప్రశంసించారు. విదేశాంగ, రక్షణ సహా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటనల సందర్భంగా సాధించిన విజయాలను వారు వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులను సరిగ్గా వినియోగించుకోవడమెలాగనే అంశంపైనా చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్లో..‘కేబినెట్ సమావేశం ఫలప్రదంగా సాగింది. వివిధ విధివిధానాలపై అభిప్రాయాలను పంచుకున్నాం’ అని పేర్కొన్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనుండటం, ఇటీవల బీజేపీ అగ్ర నాయకత్వం వరుస సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ భేటీ చర్చిస్తుందన్న వార్తలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. -
కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ
-
ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
-
కేసీఆర్ కేబినెట్ నిర్ణయాలు
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది. వైఎస్సార్ కల్యాణమస్తు పథకంలో గతం కంటే ఎక్కువ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. ►కర్నూలు జిల్లా డోన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం ►ఈ నెల రైతులకు ఇన్‌ఫుట్ సబ్సీడీ చెల్లింపునకు కేబినెట్ ఆమోదం ►ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్ ఆమోదం ►1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం ►డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ►విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ►నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్‌గా మారుస్తూ నిర్ణయం ►రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్ బెర్త్‌ల నిర్మాణానికి ఆమోదం ►లీగల సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం ►పంప్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం -
AP: సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
సాక్షి,అమరావతి: ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రి వర్గం పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. అజెండాలోని అన్ని అంశాలకు ఆమోదం తెలిపింది. వై ఎస్సార్ లా నేస్తం, వై ఎస్సార్ ఆసరా, ఈ బీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది. -
నేడు ఏపీ కేబినేట్ భేటీ
-
తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
-
TS: తెలంగాణ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన మరుసటి రోజే.. తెలంగాణ కేబినెట్ భేటీ కావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, దళిత బందు అమలు, సొంత ఇంటి స్థలం కలిగిన వారికి రూ. 3 లక్షల ఆర్ధిక సహాయం, రైతు బంధు నిధుల విడుదల తో పాటు అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. గవర్నర్ వద్ద పెండింగ్ లో బిల్లులపై ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు.. పోడు భూములకు పట్టాలు పంపిణీ తేదీల ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. గిరిజన బంధు లాంటి కీలకాంశంపై నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ నడుస్తోంది. -
ఈనెల 29న ఏపీ కేబినేట్ సమావేశం
విజయవాడ: ఈనెల 29వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. -
కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్
-
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఈ నెల 22న ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ఈ నెల 22న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. -
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్
-
కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
-
సీఎం జగన్ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం
-
TSRTC: కి.మీ.కు 25 పైసలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపు దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి కిలోమీటరుకు 25 పైసల చొప్పున పెంచే దిశగా నివేదికను రూపొందిస్తున్నారు. దీనికితోడు కిలోమీటరుకు 20 పైసలు, కిలోమీటరుకు 28–30 పైసలుతో మరో రెండు ప్రత్యామ్నాయ నివేదికలను కూడా తయారు చేస్తున్నారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు వీలుగా వీటిని సీఎం కార్యాలయానికి సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సూచనతో.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్టీసీని ఇప్పటికిప్పుడు గట్టెక్కించాలంటే టికెట్ చార్జీల పెంపు అనివార్యమంటూ మంగళవారం సీఎం నిర్వహించిన సమీక్షలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపాదనలు సమర్పిస్తే.. మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నట్టు మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కసరత్తు ప్రారంభించి దాదాపు పూర్తి చేసినట్టు తెలిసింది. ప్రస్తుతానికి 25 పైసలైతే ఓకే.. పెరిగిన డీజిల్, టైర్లు, ఇతర పరికరాల ధరల కార ణంగా గత కొన్ని నెలల్లో ఆర్టీసీపై పడిన అదనపు భారం నుంచి గట్టెక్కాలంటే కిలోమీటరుకు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచాలనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. 2019 డిసెంబర్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచారు. ఆ సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.65 ఉంది. ఈ రెండేళ్లలో లీటరుపై గరిష్టంగా రూ.22 మేర పెరిగింది. దీంతో అదనంగా సాలీనా దాదాపు రూ.500 కోట్ల భారం పడిందని లెక్కలు తేల్చారు. ఇక టైర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆ భారం కిలోమీటరుకు రూపాయి చొప్పున పడుతోంది. విడిభాగాల ధరలు భారీగా పెరగడం వల్ల పడిన అదనపు భారం కిలోమీటరుకు మరో రూపాయి చొప్పున పడుతోంది. ఈ లెక్కన నిత్యం సగటున రూ.50 లక్షల అదనపు భారం ఉంటోంది. అంటే సాలీనా సుమారు రూ.180 కోట్ల భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కి.మీ.కు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల వల్ల గతంలో లాగా బస్సులు తిరగటం లేదు. కోవిడ్ సమస్య తగ్గితే ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పుడు కూడా కొంత అనుకూలంగా ఉండేలా కి.మీ.కు 28 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాలనే ప్రత్యామ్నాయ నివేదికను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో మధ్యేమార్గంగా 20 పైసలతో మరో నివేదికను కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు పెంపు చోటు చేసుకునే అవకాశం ఉంది. -
నేడు ఏపీ కేబినెట్ భేటీ