రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తెలంగాణ ప్రాంత మంత్రులు రాకపోవడాన్ని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. వాళ్లు ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి కూడా నష్టం కలిగిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తెలంగాణ ప్రాంత మంత్రులు రాకపోవడాన్ని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. వాళ్లు ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి కూడా నష్టం కలిగిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయానికి అంచనాల పెంపును కూడా పీసీసీ చీఫ్ బొత్స తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ మేరకు బడ్జెట్ విషయమై సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన తన నిరసన తెలియజేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక లేఖ కూడా ఇచ్చారు. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచడాన్ని గతంలోనే బొత్స సత్యనారాయణ వ్యతిరేకించారు. ఈమేరకు ఇంతకుముందు కూడా ఒకసారి ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు లేఖలు సైతం రాశారు.