Telangana ministers
-
మేడిగడ్డ చూడ..
-
నేడు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం
-
తెలంగాణలో మాజీ మంత్రుల కార్యాలయాల్లో మిస్సవుతున్న ఫర్నీచర్
-
తెలంగాణ కొత్త మంత్రులు.. వారికి కేటాయించిన శాఖలు ఇవే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నూతన సర్కార్ కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కింది విధంగా శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి- హోం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-మున్సిపల్ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు-ఆర్థికశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి-నీటి పారుదలశాఖ మంత్రి కొండా సురేఖ-మహిళా సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు- పౌరసరఫరాలశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్- బీసీ సంక్షేమశాఖ మంత్రి సీతక్క- గిరిజన సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు, భవనాల శాఖ మంత్రి -
కేటీఆర్‌పై బండి సంజయ్ పోటీ?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఈ వారం రోజుల్లో ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహాగానాలు తగ్గట్లుగానే సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అభ్యర్థలు ఎంపికలో బీజేపీ ఓ స్ట్రాటజీతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం.. బీజేపీ తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ మంత్రులను లక్ష్యంగా చేసుకుని.. బలమైన అభ్యర్థులను దించాలని బీజేపీ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఓడినా.. తిరిగి ఎంపీలుగా వాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో.. గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపైన.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను దింపే యోచనలో ఉంది. కేసీఆర్ పాపులారిటీని, గులాబీ దండు హవాను తట్టుకుని మరి.. హుజురాబాద్‌లో లోకల్ సెంటిమెంట్‌తో ఆయన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక సీఎం కేసీఆర్ పోటీ చేయబోయే కామారెడ్డిలో.. అర్వింద్‌ను పోటీ చేయించాలని భావిస్తోంది. అలాగే.. సిరిసిల్లలో కేటీఆర్‌పై బండి సంజయ్‌ను, సిద్దిపేటలో హరీష్ రావు పై బూర నర్సయ్య గౌడ్‌ను బరిలో దింపాలనుకుంటోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి పై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ లో గంగుల కమలాకర్ పై గుజ్జుల రామకృష్ణా రెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పై డీకే అరుణ, నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి పై మహేశ్వర్ రెడ్డి ఇలా.. కీలక నేతలనే బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ వారంలోనే మంత్రులపై పోటీ చేసే 15 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: సంగారెడ్డిలో వైఎస్సార్ ఫార్ములా -
బీఆర్ఎస్ పార్టీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: బీఆర్ఎస్ పెట్టడం తప్పు కాదని.. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశారు. బీఆర్ఎస్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చన్నారు. ఏపీలో కాంగ్రెస్, సీపీఐతోనే బీఆర్ఎస్ పోటీ పడుతుందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ మంత్రులు ఏపీని ఏం ఉద్దరిస్తారు?. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలే. తెలంగాణ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో దొంగ కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏపీకి రావాల్సిన ఆస్తులు, నిధులు కూడా ఇవ్వడం లేదు’’ అని పేర్ని నాని మండిపడ్డారు. చదవండి: డేంజర్ గేమ్.. చంద్రబాబు ప్లాన్ అదే..? ఇదిగో రుజువులు.. -
ఆర్టీసీ కార్మిక నేతలతో మంత్రుల చర్చలు
సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఆదివారం మంత్రులు చర్చలకు శ్రీకారం చుట్టారు. తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో చర్చించారు. 2019లో ఆర్టీసీ సమ్మె సమయంలో ఆర్టీసీ యూనియన్ల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. అప్పటి నుంచి యూనియన్ల మనుగడను పునరుద్ధరించాలని, గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కార్మిక నేతలు ఎంతగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పరిశీలనకు కూడా సిద్ధం కాలేదు. చివరకు మంత్రులను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దక్కలేదు. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ, డీఏ బకాయిలు, గత వేతన సవరణ బాండ్ల బకాయిలు, సకలజనుల సమ్మె కాలం బకాయిలు, ఇతర దీర్ఘకాలిక డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలన్న విషయంలోనూ నేరుగా మంత్రులు వారితో చర్చించలేదు. ఇంతకాలం తర్వాత ‘మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య’ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తున్న సమయంలో నేతలతో మంత్రుల చర్చించడం విశేషం. ముగ్గురు మంత్రులతో చర్చల్లో భాగంగా, కార్మిక నేతలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను వారికి సమర్పించారు. అధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాక మూడు నాలుగు రోజుల్లో మరోసారి భేటీ అవుతామని కూడా వారు పేర్కొన్నట్టు చెబుతున్నారు. భేటీలో సమాఖ్య నేతలు రాజిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, కత్తులయాదయ్య, మోహన్‌రెడ్డి, కొవ్వూరు యాదయ్య, రామదాసు, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలకైనా పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఉన్నట్టు సమాఖ్య చైర్మన్ రాజిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. మంత్రులతో జరిగిన భేటీల్లో చర్చించిన విషయాలను నేతలు, ఆదివారం సాయంత్రం మునుగోడులో సమాఖ్య సభ్యులకు వివరించారు. డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో, ముందుగా ప్రకటించినట్టు సమాఖ్య పక్షాన ఉప ఎన్నికల బరిలో నిలవాల్సిందేనని సభ్యులు స్పష్టం చేశారు. -
‘భగీరథ’కు అవార్డుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు అంశం రెండు ప్రభుత్వాల మధ్య తాజాగా వివాదం రాజేసింది. ఈ పథకానికి జాతీయ అవార్డు లభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని కేంద్రం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. కేసీఆర్ సర్కార్ పేర్కొన్నట్లుగా జాతీయ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకాన్ని తాము మదింపు చేయలేదని.. తెలంగాణలో 100% నల్లాల ద్వారా క్రమబద్ధమైన తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు తాము నిర్ధారించలేదని స్పష్టం చేసింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే 100% నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొందని వివరించింది. కేవలం ఫంక్షనాలిటీ అసెస్మెంట్–2022 కింద జాతీయ జల్ జీవన్ మిషన్ నిబంధనలను అనుసరించి రోజుకు 55 లీటర్ల తలసరి తాగునీరు అందుతోందో లేదోనని పరిశీలించడంతోపాటు నీటి నాణ్యత బీఎస్ఐ 10,500 ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదోనని మాత్రమే పరిశీలించామని కేంద్ర జలవనరుల శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఆ నివేదికలోని గణాంకాల ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాల నుంచి సేకరించిన నీటి నమూనాలను పరీక్షించగా 8% నివాసాలకు నిత్యం తలసరి 55 లీటర్లకన్నా తక్కువ తాగునీరు అందుతోందని, మొత్తం నమూనాల్లో 5% నివాసాల్లో నీటి నాణ్యత జాతీయ జల్‌జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం లేదని గుర్తించినట్లు వివరించింది. అవార్డు ఆ విభాగంలోనే.. గ్రామీణ గృహసముదాయాలకు క్రమబద్ధమైన నీటి సరఫరా విభాగంలో మాత్రమే తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసిన ఆదివారం బహూకరిస్తున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ వివరణ ఇచ్చింది. నీటి సరఫరాలో క్రమబద్ధత అనేది మొత్తం పనితీరు మదింపు కోసం స్వీకరించే అనేక అంశాల్లో ఒకటి మాత్రమేనని స్పష్టం చేసింది. 100% నల్లా నీటి కనెక్షన్లను ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం అవసరమైన గ్రామ పంచాయతీల ద్వారా ధ్రువీకరణ జరగలేదని తెలిపింది. పదేపదే అబద్ధాలెందుకు?: ఎర్రబెల్లి ‘గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నది మిషన్ భగీరథ ద్వారానే. తెలంగాణలో 100% ఇళ్లకు తాగునీరు అందుతోందని మీ జలజీవన్ మిషన్ వెబ్సైట్లోనూ ఉంది. గ్రామీణ గృహసముదాయాల నీటి సరఫరాకు అవార్డు ఇస్తే అది మిషన్ భగీరథకు కాకుండా మరి దేనికి వచ్చినట్లు అవుతుంది?’అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. కేంద్రం తీరును తప్పుబడుతూ శనివారం రాత్రి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అభ్యంతరాలను లేవనెత్తిన లేఖలోనే మిషన్ భగీరథ పథకాన్ని సమీక్షించామని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. గ్రామ పంచాయతీలన్నీ ధ్రువీకరించాలని తీర్మానాలు చేయలేదని కొత్త మెలిక పెట్టడం ఏమిటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అబద్ధాలు పదేపదే చెప్పడం వల్ల అవి నిజాలు కావనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో షాకింగ్ ఘటన.. -
డీజే టిల్లు సాంగ్ కు డాన్స్ అదరగొట్టిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, తెలంగాణ మంత్రులు
-
కేసీఆర్ గుప్పిట్లో గుట్టు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత నడవడిక, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయం, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు తదితర అంశాలతో కూడిన సమగ్ర సర్వే నివేదికలు పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు అందాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్కు అత్యంత కీలకమని భావిస్తున్న కేసీఆర్ తనకు అందిన నివేదికలను పోస్ట్‌మార్టం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ్యులతో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి ఆర్థిక స్థితిగతులు, వారి రాజకీయ నేపథ్యం తదితర అంశాలను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఐ ప్యాక్’బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదికలను ముఖ్యమంత్రికి సమర్పించింది. ఓ వైపు ఎమ్మెల్యేల పనితీరును సానుకూల కోణంలో విశ్లేషిస్తూనే, మరోవైపు వారిలో ఉన్న లోపాలను ఈ నివేదికలు ఎత్తి చూపినట్లు సమాచారం. వీటితో పాటు వివిధ సర్వే సంస్థల నుంచి అందిన నివేదికల్లోని అంశాలను క్రోడీకరించి తుది నివేదికలు రూపొందించినట్లు తెలిసింది. వెలుగులోకి విస్తుగొలిపే అంశాలు పార్టీ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఈ నివేదికల్లో విస్తు గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల దందాలు, అవినీతి, బంధు ప్రీతి, వారు నెరపుతున్న ఇతర సంబంధాలు తదితరాలను ఈ నివేదికలు కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించాయి. ఎమ్మెల్యేలు పార్టీ కేడర్‌కు అందుబాటులో లేకపోవడం, కొందరినే దగ్గరకు తీయడం, అభివృద్ధి పనుల్లో వాటాల వసూలు, భూ సెటిల్మెంట్లు, ఇసుక దందాలు, కుటుంబసభ్యుల ద్వారా బెదిరింపులు, వసూళ్లు వంటి అనేక అంశాలను ఎత్తి చూపాయి. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేల విజయావకాశాలు ‘ఓ మోస్తరు’గా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేయగా, కొద్ది మందికి మాత్రమే గెలుపు ‘సుస్పష్టం’అని వెల్లడించాయి. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని సిఫారసు చేయకున్నా పార్టీలోనే మరో అభ్యర్థికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నట్లు నివేదికలు సూచించినట్లు సమాచారం. ఇక ఒకరిద్దరు మినహా మిగతా అందరు మంత్రుల పనితీరు మెరుగ్గానే ఉన్నట్లు నివేదికల్లో వెల్లడైనట్లు సమాచారం. తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు పార్టీలో ఉన్న గ్రూపులు, ఆ గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న వారు, అంతర్గత విభేదాలతో జరిగే నష్టం వంటి వివరాలతో పాటు వాటి నివారణకు పార్టీ అధిష్టానం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు కూడా పొందుపరిచినట్లు సమాచారం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తరఫున టికెట్ ఆశిస్తున్న ప్రధాన అభ్యర్థులు, టీఆర్ఎస్ అభ్యర్థి నడవడిక సరిగా లేని పక్షంలో ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది అనే అంశాలతో పాటు వారి బలబలాలను నివేదికలు క్షుణ్ణంగా విశ్లేషించాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఐదుగురు బలమైన నేతలు, వారు ఎన్ని వేల ఓట్లను ప్రభావితం చేయగలరు వంటి అంశాలను కూడా స్థూలంగా నివేదికల్లో ప్రస్తావించినట్లు తెలిసింది. గుర్తింపు దక్కని పక్షంలో పార్టీని వీడే యోచనలో ఉన్న నేతలు, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చే అవకాశమున్న నాయకుల జాబితాలను పొందుపరిచినట్లు సమాచారం. హెచ్చరికలు.. దిద్దుబాట్లు తనకు అందిన నివేదికల ఆధారంగా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు పనితీరును మార్చుకోవాలంటూ ఇప్పటికే అంతర్గతంగా సంకేతాలు ఇవ్వడంతో పాటు దిద్దుబాటు చర్యలకు కూడా పూనుకున్నట్లు తెలిసింది. అంతర్గత విభేదాల పరిష్కారం, కొద్దిగా తీరు మార్చుకుంటే విజయావకాశాలు మెరుగయ్యే పరిస్థితులు ఉన్న చోట దిద్దుబాటు బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతో పాటు కొందరు జిల్లా మంత్రులకు అప్పగించినట్లు తెలిసింది. వ్యక్తిగత, ఆస్తిపాస్తుల వివరాలూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్, బీజేపీ తరఫున టికెట్ ఆశించే నేతల వ్యక్తిగత వివరాలు, వారి కుటుంబసభ్యులు ఎవరైనా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారా అనే కోణంలో కూడా నివేదికలు తయారైనట్లు తెలిసింది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌తో పాటు ఇతర కొన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ ఎంత మేర ప్రభావం చూపుతుందనే కోణంలోనూ అధ్యయన బృందాలు అంచనా వేశాయి. నేతలు ఎంతమేర ఆర్థికస్తోమత కలిగి ఉన్నారు? వారి ఆదాయ మార్గాలేంటి? ఏ తరహా వ్యాపార, వాణిజ్య సంస్థలు నిర్వహిస్తున్నారు? వారికి అనుకూలంగా, ప్రతికూలంగా పనిచేసే అంశాలు, గెలుపు అవకాశాలు తదితరాలపై సర్వే సంస్థలు లోతుగా అధ్యయనం చేశాయి. -
రైతు నిరసనలు దక్షిణాదికి విస్తరిస్తాయనే..
సాక్షి, హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపట్ల టీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయచట్టాలపై ఆందోళనలు దక్షిణాదికి కూడా విస్తరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉనికికి ముప్పు ఏర్పడుతుందనే ప్రధాని నరేంద్రమోదీ వెనక్కి తగ్గారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి శుక్రవారం ఇక్కడి తెలంగాణభవన్‌లో నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు దేశంలోనే అత్యంత ప్రజాదరణ, పాలనాప్రజ్ఞ, దక్షత ఉండటం, వడ్ల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేయడంతో కేంద్రంలో చలనం వచ్చిందన్నారు. అన్నిభాషల మీద పట్టుకలిగిన కేసీఆర్ రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఏం జరుగుతుందో మోదీ ప్రభుత్వానికి తెలుసని, అందుకే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బీజం వేసిందని, రైతుల పోరాటంలో కాంగ్రెస్పాత్ర ఇసుమంత కూడా లేదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పుల ద్వారా యువతను సాగు వైపు మళ్లించాలని సూచించారు. విద్యుత్ చట్టాలను కూడా మోదీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రమే వడ్లు కొనేలా చట్టం తేవాలి: ఎంపీలు కేంద్ర ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేసేలా చట్టం తీసుకురావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు, నూతన వ్యవసాయచట్టాలపై సీఎం కేసీఆర్ ఆందోళనకు పూనుకోవడంతోనే కేంద్రం దిగివచ్చిందన్నారు. లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్‌రెడ్డి పార్టీ ఎంపీలు రం జిత్‌రెడ్డి, పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్ కవిత, వెంకటేశ్ నేతతో కలసి శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ చట్టాలపై కేంద్రం ఇదివరకే నిర్ణయం తీసుకుని ఉంటే రైతులు చనిపోయేవారు కాదని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ రైతు పక్షపాతి అయితే కేంద్రం మెడలు వంచి వడ్లను కొనుగోలు చేసేలా ఉత్తర్వులు తీసుకురావాలన్నారు. -
భూముల మార్కెట్ ధరలు పెంచుదాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని, తొలుత హెచ్ఎండీఏ పరిధిలో పెంపును వర్తింపజేయాలని, ఆర్థిక వన రుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసం ఘం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ప్రస్తు తం అమల్లో ఉన్న మార్కెట్ ధరలను ఉమ్మడి రాష్ట్ర పాలనలో చాలా కాలం కిందట ఖరారు చేశారని, ప్రస్తుత వాస్తవ మార్కెట్ ధరలు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడుతోంది. కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించడం తో రాష్ట్ర ఆదాయానికి భారీ గండి పడిన నేపథ్యంలో.. ఈ ఏడాది భూముల అమ్మకాల ద్వారా అదనంగా రూ.15 వేల కోట్లను సమీకరించాలనే నిర్ణయానికి ఉప సంఘం వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే భూముల ధరలు పెంచాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. గురువారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం అధిక ధరలకే రిజిస్ట్రేషన్లు కరోనా సమయంలో భూముల మార్కెట్ ధరలను పెంచితే.. భూకొనుగోళ్లపై ప్రభావం పడి ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో వచ్చే ఆదాయం తగ్గే అవకాశంపై కూడా ఉపసంఘం చర్చించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి హెచ్ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువ కన్నా అధిక ధరతోనే హెచ్ఎండీఏ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న అంశాన్ని అధికారులు ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు. బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలు అడ్డంకిగా మారినట్టుగా వ్యాపార, వాణిజ్యవర్గాల్లో అభిప్రాయం ఉందని కూడా వివరించారు. హెచ్ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని నివేదించారు. వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ పరిధిలోని భూముల విక్రయాలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. నగరం చుట్టుపక్కల ఉన్న 64 ఎకరాల భూములను విక్రయించేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌కు వచ్చే స్పందన ఆధారంగా తదుపరి భూముల అమ్మకాలకు సంబంధంచిన ధరల పెంపుపై ఒక నిర్ణయానికి రావాలని, ఆ తరువాత ముఖ్యమంత్రికి దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల పెంపుతో ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అవకాశాన్ని కూడా ఉపసంఘం పరిశీలించింది. అయితే ఈ మధ్యకాలంలోనే రెండుసార్లు మద్యం ధరలు పెంచినందున ఇప్పుడే మళ్లీ పెంచడం సరికాదని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థిక, పురపాలక, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ వి.శేషాద్రి కూడా పాల్గొన్నారు. భారం పెరిగింది.. రెవెన్యూ పెరగాలి రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యకమాలు అమలు చేస్తున్నందున వీటి కొనసాగింపు కోసం నిధుల సమీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందని ఉపసంఘం అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలకు నిధులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయని, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపే పరిస్థితి లేనందున ఆర్థిక వనరుల సమీకరణకు కొత్త మార్గాల అన్వేషణ ఒక్కటే మార్గమని భావించింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.11 వేల కోట్ల అదనపు భారం పడటం, కొత్తగా 50 వేల ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ఉపసంఘం చర్చించినట్లు సమాచారం. -
తండ్రి కేసీఆర్‌ను కలిసిన మంత్రి కేటీఆర్?
మర్కూక్ (గజ్వేల్): సీఎం కేసీఆర్‌ను ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ మంగళవారం కలిసినట్లు సమాచారం. కరోనా నిబంధనల మేరకు కేటీఆర్ భౌతికదూరం పాటిస్తూ తండ్రిని పలకరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్లారని సమాచారం. సీఎం కోలుకోవాలని పూజలు యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మంగళవారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ఉదయం ఆలయ మహా మండపంలో కేసీఆర్ గోత్ర, నామాలతో ప్రత్యేకంగా హోమాది పూజలు చేశారు. సమస్త ప్రజానీకం కరోనా నుంచి విముక్తి పొందాలని, వైరస్ నివారణ జరగాలని ధన్వంతరి హోమం జరిపించారు. యాదాద్రీశుడి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో కోలుకోవాలని పూజలు చేసినట్లు ఆచార్యులు తెలిపారు. పూజల్లో ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు, ఆలయ అధికారులు కేసీఆర్‌కు గుత్తా, పోచారం పరామర్శ సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలతో బాధపడుతూ వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఫోన్ ద్వారా వేర్వేరుగా పరామర్శించారు. ‘కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. భయపడాల్సిన అవసరం లేదు’ అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల దీవెన, భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని గుత్తా, పోచారం ఆకాంక్షించారు. సీఎం ఆరోగ్య స్థితిపై మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆరా తీశారు. సీఎం త్వరగా కోలుకుని తిరిగి ప్రజల సేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అర్చకులను కోరారు. నాంపల్లి యూసుఫైన్ దర్గాలో మంత్రి మహబూబ్అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం -
గజ్వేల్..‘పట్టణ ప్రగతి’కి మోడల్
గజ్వేల్ : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మెరుగైన పట్టణ జీవన వ్యవస్థను తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నం ప్రశంసనీయం.. ఇక్కడ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామం, అర్బన్ పార్కులాంటి నిర్మాణాలు తలమాణికంగా నిలుస్తున్నాయి’అని పలువురు మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మ న్లు, కమిషనర్ల బృందం కొనియాడింది. ‘పట్టణ ప్రగతి’పై హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మంగళవారం సీఎం కేసీఆర్‌తో సమీక్షలో పాల్గొన్న వీరంతా అక్కడి నుంచి బస్సుల్లో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సి పాలిటీని సందర్శించారు. హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ తదితరులతో పాటు కలెక్టర్లు, పలువురు ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు ఇక్కడ పర్యటించారు. ముందుగా మున్సిపాలిటీకి సరిహద్దులో ఉన్న వర్గల్ మండలం సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని ఈ బృందం సందర్శించింది. అటవీశాఖ పీసీసీఎఫ్ డోబ్రియాల్ వీరికి అటవీ అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అంశాలవారీగా వివరించారు. ఆ తర్వాత బృందం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం విక్రయాలను, మార్కెట్లోని ఇతర దుకాణ సముదాయాలను పరిశీలించి ముగ్ధులయ్యారు. మంత్రులు సబిత, సత్యవతితో పాటు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, పలువురు మహిళా మున్సిపల్ చైర్మన్లు కూరగాయల వ్యాపారులతో ముచ్చటించారు. ఇది పూర్తయ్యాక వారంతా తిరిగి బస్సుల్లో పట్టణంలోని వైకుంఠధామంను సంద ర్శించి పరిసరాలను ఆసక్తిగా పరిశీలన జరిపారు. తర్వాత అర్బన్ పార్కును సందర్శించారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓపెన్‌జిమ్‌లో కొద్దిసేపు గడిపారు. జిమ్ చేస్తూ తోటి మంత్రులు, ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచారు. అర్బన్ పార్కు నిర్మాణం జరిగిన విధానం తమను ఆకట్టుకుందని.. ఇలాంటి నిర్మాణాలు తమ జిల్లాల్లో కూడా జరిగేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పార్కును ప్రత్యేకంగా కలియతిరిగి తమ జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటివి నిర్మించుకోవాలనే అంశంపై చర్చించుకున్నారు. మంత్రులకు స్వాగతం పలుకుతున్న హరీశ్‌రావు మెరుగైన వసతులే సీఎం లక్ష్యం: హరీశ్‌రావు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మెరుగైన వసతులే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిని మోడల్‌గా చూపుతూ ఇదే తరహాలో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సీఎం సూచించారని తెలిపారు. మెరుగైన నగర, పట్టణ జీవన వ్యవస్థను తీసుకురావడానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణంతో పాటు పట్టణాలకు ఆనుకొని ఉండే విధంగా అర్బన్ పార్కులను నిర్మించి స్వచ్ఛమైన గాలి అందించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన మంత్రులు
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, రవాణాశాఖ మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ డీ–బ్లాక్‌లో తన చాంబర్లో సాయంత్రం 4 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి (టీఎంయూ), హన్మంత్ ముదిరాజ్, గోవర్ధన్ (టీజేఎంయూ), రాజిరెడ్డి, బాబు (ఈయూ) తదితరులు మంత్రిని సన్మానించారు. అధికార పార్టీ నాయకులు, అనుచరుల కోలాహలంతో ఆయన చాంబర్ సందడిగా మారింది. అనంతరం రోడ్లు–భవనాలు, ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ నూతన మంత్రిగా నిరంజన్‌రెడ్డి గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమైఖ్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయిపోయిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. దూరదృష్టితో ప్రాజెక్టులను నిర్మించిన కేసీఆర్ రైతులను రాజులుగా చూడటమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదని, ఇప్పుడు కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోందన్నారు. రైతుబంధు దేశంలోనే గొప్ప పథకమని, దీని వల్ల రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. -
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు
-
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలు కేటాయించారు. సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమశాఖలు కేటాయించగా, మరో సీనియర్ నేత ఇంద్రకరణ్‌రెడ్డికి న్యాయ, అటవీ, దేవాదాయశాఖలు అలాట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవమరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి వైద్యారోగ్యశాఖ దక్కగా.. గతంలో విద్యుత్‌శాఖ మంత్రిగా వ్యవహరించిన జగదీశ్‌రెడ్డికి ఈసారి విద్యాశాఖ లభించింది. గత హయంలోనూ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌కు పశుసంవర్థకశాఖ కేటాయించారు. ఇక, తొలిసారి మంత్రి పదవి నిర్వహిస్తున్న వారిలో నిరంజన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, ప్రశాంత్‌రెడ్డికి రోడ్లు-భవనాలు, రవాణాశాఖలు కేటాయించారు. మేడ్చల్ మల్లారెడ్డికి కార్మిక శాఖ దక్కగా.. శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్, పర్యాటక శాఖలు లభించాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా పదిమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, సాగునీటి పారుదల, ఐటీ, పరిశ్రమలు, పట్టాణాభివృద్ధి వంటి శాఖలను కేసీఆర్ తనవద్దే ఉంచుకోవడం గమనార్హం. గత హయాంలో తన తనయుడు కేటీఆర్ నిర్వహించిన ఐటీ, పట్టాణాభివృద్ధి శాఖలను, హరీశ్‌రావు నిర్వహించిన సాగునీటి పారుదల శాఖను కేసీఆర్ ఎవరికీ కేటాయించలేదు. -
ఓటు వేసిన తెలంగాణ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలువురు మంత్రులు ఈ ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సామాన్యుల్లా వరుసలో నిలబడి ఓటు వేశారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునచ్చారు. సూర్యాపేట జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి సూర్యాపేట శ్రీ చైతన్య స్కూల్ లో 82వ నెంబర్ బూత్ లో ఓటు వేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో సతీమణితో కలిసి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా మంత్రి హరీశ్‌రావు దంపతులు సిద్దిపేటలోని 102వ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు వేయాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు పిలుపునిచ్చారు. -
ఉద్యమ కేసులు.. కీలక సమీక్ష!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ కేసుల విషయమై రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలువురు ఉద్యమకారులపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులను ఎత్తివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిందని మంత్రులు తెలిపారు. ఎక్కడైనా కేసులు పెండింగ్‌లో ఉంటే.. 15 రోజుల్లో వివరాలను ప్రభుత్వానికి అందించాలని కోరారు. ఉద్యమకాలంలో నమోదైన మిగతా కేసుల ఎత్తివేతపై న్యాయనిపుణులతో చర్చిస్తామని మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి, కేటీఆర్ తెలిపారు. ఉద్యమకాలంలో నమోదైన కొన్ని కేసులు సాంకేతిక కారణాలు చూపుతూ.. న్యాయస్థానాలు ఎత్తివేసేందుకు నిరాకరించాయి. పలు కేసులు పెండింగ్‌లో ఉండటంతో అవి ఎదుర్కొంటున్న ఉద్యమకారులకు న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదు. ఇటీవల ఓ ఉద్యమకారుడికి తెలంగాణ ఉద్యమకాలం నాటి కేసులో న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
మంత్రి కేటీఆర్‌కు కోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రులకు రైల్వే కోర్టులో ఉపశమనం లభించింది. 2011లో ప్రత్యే తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో నిర్వహించి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారనే ఆరోపణలతో కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిపై గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ రైల్వేకోర్టులో జరుగుతున్న విచారణకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావు సికింద్రాబాద్ రైల్వే కోర్టులో తరచూ హాజరవుతున్నారు. బుధవారం మంత్రులు తుది విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దీనిపై పలుసార్లు విచారించిన రైల్వేకోర్టు, కేసులో సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావు సహా 14 మందిపై ఉన్న కేసులను కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో మౌలాలి జంక్షన్లో రైల్‌రోకో నిర్వహించిన సందర్భంగా కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి కె తారకరామారావు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు ఇలా గడిచింది అనుకొనేలోపు ఇంకా ఆరు కేసలు పెండింగ్‌లో ఉన్నాయంటూ లాయర్ గుర్తుచేశారని సోషల్ మీడియా ట్విట్టర్లో తెలిపారు. Just when I was about to heave a sigh of relief after completion of a railway court case today, lawyer informs me that 6 more are pending!🙄 — KTR (@KTRTRS) August 30, 2017 -
తెలంగాణ మంత్రుల్లో జూన్ టెన్షన్
-
గవర్నర్ సమక్షంలో మంత్రుల భేటీ
-
గవర్నర్ సమక్షంలో మంత్రుల భేటీ
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి సమస్యలను పరిష్కరించుకునేందుకు గురువారం రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సభ్యులు రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి లోబడి ఉద్యోగుల విభజన, భవనాల అప్పగింత, తొమ్మిది, పదో షెడ్యూల్లోని సంస్థల విభజన... తదితర అంశాలపై చర్చించారు. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ మంత్రి హరీశ్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గవర్నర్ సూచనల మేరకు ఇరు రాష్ట్రాల్లోని విభజన సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈనెల 1న గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించినప్పటికీ పరిష్కారం కొలిక్కిరాకపోవడంతో ఈరోజు మరోసారి సమావేశమయ్యారు. సమస్యలపై కోర్టులను ఆశ్రయించి సాగదీసుకోకుండా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు ఇరు రాష్ట్రాల మంత్రులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. -
నాలాల పరిశీలనకు బయల్దేరిన మంత్రులు
జంటనగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. దీంతో నాలాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించేందుకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఉదయాన్నే బయల్దేరారు. మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు బల్కాపూర్ నాలాను, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ డబీర్‌పురాకు, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ముషీరాబాద్‌కు, తలసాని శ్రీనివాసయాదవ్ కుత్బుల్లాపూర్‌కు, పద్మారావు లాలాపేటకు బయల్దేరి వెళ్లారు. మరోవైపు.. భారీ వర్షాల కారణంగా రంగారెడ్డి జిల్లా మొత్తానికి కలెక్టర్ సెలవు శుక్రవారం నాడు ప్రకటించారు. అందువల్ల అందరు ఎంఈఓలు, డివైఈఓలు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేయాలని రంగారెడ్డి జిల్లా డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. -
నిజామాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో శనివారం మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బిర్కూర్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తాలో రూ.11 కోట్లతో నిర్మించే డబుల్‌లైన్ రోడ్డు పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం తిమ్మాపూర్ వెంకటేశ్వరాలయంలో భక్తుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. రోడ్లపై కేజీ వీల్స్‌తో ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల రైతులను హెచ్చరించారు. రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో వారు పాల్గొన్నారు. జకోరా క్రాస్‌రోడ్డు నుంచి మొండిసడక్ వరకు రూ.35 కోట్ల డబుల్ రోడ్డు, రుద్రూరు నుంచి పొతంగల్ వరకు నిర్మించే రూ.17 కోట్ల రోడ్డు పనులను వారు శంకుస్థాపన చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు
తిరుమల: తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావులు ఆదివారం ఉదయం తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు మంత్రులకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. శ్రీవారి పాదాల వద్ద ఉంచిన పట్టువస్త్రాలను మంత్రులకు కప్పారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. (చదవండి: కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్న మంత్రి!) -
'తెలంగాణకు రూ.100 కోట్లు విడుదల'
న్యూఢిల్లీ : తెలంగాణకు తక్షణ సాయం కింద రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ బుధవారం న్యూఢిల్లీలో తెలిపారు. అలాగే రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తామన్నారు. ఆ బృందం నివేదిక అందించిన వెంటనే రాష్ట్రానికి మరింత సాయం అందిస్తామని ఆయన చెప్పారు. అంతకుముందు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌తో తెలంగాణ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీతోపాటు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కరవు మండలాలను ఆదుకోవాలని కేంద్రమంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. అలానే రాష్ట్రంలోని కరవు మండలాలకు రూ. 2, 514 కోట్లు సాయం అందించాలని కేంద్రమంత్రిని వారు కోరారు. కరవు మండలాలకు సంబంధించి ప్రాధమిక నివేదికను ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఈ సందర్బంగా తెలంగాణ మంత్రులు గుర్తు చేశారు. ఉద్యానవన వర్సిటీకి కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ జనవరి 7వ తేదీన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ యూనివర్శిటీ కోసం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఇప్పటికే స్థలం సిద్ధం చేశామని వారు చెప్పారు. ఆ భేటీ అనంతరం కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ తో కలసి మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కడియం శ్రీహరిలు విలేకర్లతో మాట్లాడారు. -
తెలంగాణ మంత్రుల్లో టెన్షన్
-
విపక్షాల బంద్ అట్టర్‌ఫ్లాప్
హైదరాబాద్: రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ పిలుపు ఇచ్చిన విపక్షాల బంద్ అట్టర్‌ఫ్లాప్ అయిందని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. శనివారం వారు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. రైతులెవరూ ఈ బంద్‌లో పాల్గొనలేదని తెలిపారు. రైతులకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతుల ఆత్మహ్యతలు జరుగుతున్నాయని పోచారం, జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు. ఓ వేళ అధికార టీడీపీలో ఏపీ కాంగ్రెస్ పార్టీ విలీనమైయిందా అని వారు సందేహం వ్యక్తం చేశారు. త్వరలోనే రైతులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ చేస్తామని పోచారం,జూపల్లి తెలిపారు. -
'రైతు యాత్రలు కావు.. అవి విహారయాత్రలు'
హైదరాబాద్: ప్రతిపక్ష నేతలు బస్సుయాత్రల పేరుతో విహారయాత్రలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆత్యహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే పేరిట ప్రతిపక్షాలు తలపెట్టిన యాత్రలను ఆయన తప్పుబట్టారు. గత పాలకుల అసమర్థత వల్లే రైతులకు ప్రస్తుతం ఈ దుస్థితి తలెత్తిందన్నారు. రైతుల పరిస్థితుల చక్కదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. మరోమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రైతు పక్షపాతి అని అన్నారు. యాత్రల పేరిట ప్రతిపక్షాలు నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. రైతుల ఆత్యహత్యలు ఎప్పటినుంచో జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రుణమాఫీ అమలుచేయాలని తమకు కాదు, చంద్రబాబు ప్రభుత్వానికి చెప్పాలని ఆయన టీటీడీపీ నేతలకు సూచించారు. హైదరాబాద్‌లో కాదు ఢిల్లీలో ఆందోళనలు చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. -
టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ భవన్లో గురువారం టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నామినేటెడ్ పోస్టులను, పార్టీ పదవులను, మార్కెట్ కమిటీలను ఖరారు చేసే అవకాశముంది. -
టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌పై మంత్రుల్లో టెన్షన్
హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంపై తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ పట్టుకుంది. కేబినెట్లో మార్పులకు సంబంధించి గురువారం జరిగే ఈ సమావేశంలో స్పష్టం వచ్చే అవకాశముంది. కేబినెట్లో మార్పులు తప్పవని సీనియర్ మంత్రులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఉదయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. నామినేటెడ్ పోస్టులను, పార్టీ పదవులను, మార్కెట్ కమిటీలను ఖరారు చేసే అవకాశముంది. -
ముంబై వెళ్లిన మంత్రులు, అధికారుల బృందం
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం సోమవారం ఉదయం ముంబై నగరానికి వెళ్లారు. అక్కడ అంతర్ రాష్ట్ర సరిహద్దులు, చెక్ పోస్టులు, వాణిజ్య పన్నుల విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈ అధ్యయనం కోసమే మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీ బాల్క సుమన్, అధికారుల బృందం సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. -
తాటి, ఈత మొక్కలు నాటుతున్నాం
వరంగల్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత మొక్కలను ఎక్సైజ్ శాఖ ద్వారా చెరువు గట్లపై నాటుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు వెల్లడించారు. ఆ చెట్లను కాపాడుకునే బాధ్యత ప్రజలదే అని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో మంగళవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పద్మారావు పాల్గొన్నారు. అలాగే అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'మీడియాలో మైలేజీ కోసమే పోజులిచ్చారు'
హైదరాబాద్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలది ప్రచార ఆర్భాటమేనని కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. పుష్కర ఘాట్లలో సౌకర్యాలు సరిగాలేవని అన్నారు. ప్రజలు పోటెత్తడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయని, మేం కూడా ఇబ్బందులు పడ్డామని వీహెచ్ చెప్పారు. తెలంగాణ మంత్రులు మీడియా మైలేజీ కోసమే ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నట్టు పోజులిచ్చారని వీహెచ్ విమర్శించారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంపై గవర్నర్ నరసింహన్‌ను ఎన్నిసార్లుగా అడిగినా స్పందించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రశ్నిస్తామని చెప్పారు. -
సూత్రధారికీ జైలు తప్పదు: తెలంగాణ మంత్రులు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు దీంతో సంబంధం ఉన్న వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు. ఈ కేసులో పాత్రదారి జైలుకు వెళ్లాడని, సూత్రధారి కూడా వెళ్లక తప్పదన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ఎన్టీఆర్ ఆశయాలకు ఎప్పుడో నీళ్లొదిలిందని, ఇప్పుడున్న నేతలు స్వార్థంతో ఎన్టీఆర్, పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని విమర్శించారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటే మంత్రిని సస్పెండ్ చేసిన పార్టీలో రూ.50 లక్షలు లంచం ఇచ్చిన వారికి హారతులు పడుతున్నారని తుమ్మల ఎద్దేవా చేశారు. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కేసులో బెయిల్ వస్తే.. ఓ గొప్ప వ్యక్తికి, స్వాత్రంత్య్ర సమర యోధునికి స్వాగతం పలికినట్లు చేయడం విడ్డూరమని పోచారం వ్యాఖ్యానించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే డబ్బులు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి ఇరికించారని బుకాయిస్తున్నారని అన్నారు. రేవంత్‌కు బెయిల్ మాత్రమే వచ్చిందని మళ్లీ జైలుకు వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోలేరని, అసలు కథ ముందుందని, రెండు రోజుల్లో ఏం జరుగుతుందో రుచి చూస్తారని మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
'స్వచ్ఛ హైదరాబాద్'లో మంత్రులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో భాగంగా గురువారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, అబ్కారీ శాఖ మంత్రి పద్మారావులు సుడిగాలి పర్యటనలు చేశారు. జీహెచ్ఎమ్సీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌తో కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
‘నిఘా’ నీడలో నాయకులు
-
‘నిఘా’ నీడలో నాయకులు
నిఘా విభాగం నిరంతర నిఘాతో నేతల హడల్ ఉక్కిరిబిక్కిరవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నీడను కూడా నమ్మలేని స్థితిలో నాయకులు అన్ని వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సీఎంకు నివేదికలు ఇప్పటికే పలువురిని హెచ్చరించిన కేసీఆర్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మంత్రులు సీఎంతో సమావేశమై రాగానే ఫోన్లు స్విచాఫ్ మీడియా ముందుకు వచ్చేందుకే జంకుతున్న వైనం సాక్షి, హైదరాబాద్: మంత్రుల వ్యవహారశైలిపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు వస్తున్న కథనాలతో అమాత్యులెవరికీ కంటి మీద కునుకుండటం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజా ప్రతినిధులపై ఇంటెలిజెన్స్ నిఘా వేసినట్లు ఇటీవలి ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలంతా బిక్కుబిక్కుమంటూ వ్యవహరిస్తున్నారు. వైద్య, ఆరోగ్య మంత్రిగా రాజయ్య వ్యవహరించిన తీరుపై నిఘా విభాగం ప్రభుత్వానికి వరుసగా నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. ఆయన తీసుకున్న నిర్ణయాలు, జరిపిన సంప్రదింపులు, వైద్య శాఖలో అవినీతి వ్యవహారాలకు సంబంధించి నిఘా విభాగం గత ఆరు మాసాల్లో అరడజను నివేదికలు ఇచ్చింది. అవినీతి ఆరోపణల కంటే ఆయన వ్యవహారశైలిపైనే నిఘా విభాగం ఎక్కువ నివేదికలిచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ వ్యవహారంలో ఆయన ప్రమేయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అంతే కాకుండా రాష్ట్ర మంత్రులకు సంబంధించి వారు తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలిపైనా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదికలు అందుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో మంత్రులు తమ నీడను తామే నమ్మడం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అందరిమీదా నిఘా ఉందనే ప్రచారం జరుగుతుండటంతో ప్రైవేట్ కార్యక్రమాలకు సైతం మంత్రులు దూరంగా ఉంటున్నారు. అన్ని వ్యవహారాలపైనా నివేదికలు ఈ నెల 25న ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంలో తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను కేసీఆర్ బయటపెట్టడంతో మంత్రులు తమపై నిఘా ఉన్నట్లు గుర్తించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, వ్యక్తిగత వ్యాపారాలు, శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలు, ముఖ్యంగా బదిలీలు, డిప్యుటేషన్లు, కాంట్రాక్టులు తదితర అంశాలపై నిఘా పెట్టినట్లు సమాచారం. పార్టీ నేతలు ఎవరెవరు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. ‘‘వైద్య, ఆరోగ్య శాఖలో పారామెడికల్ సిబ్బంది నియామక ఏజెన్సీల వ్యవహారం, ఆసుపత్రుల్లో యంత్ర పరికరాల కొనుగోళ్లు, 108 వాహనాల కొనుగోలుకు పర్సెంటేజీలు మాట్లాడుకోవడం వంటి అంశాలు నిఘా నివేదికలతోనే వెల్లడయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు’’ అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాలో తన తల్లికి పదోన్నతి రాదని తెలిసి మొత్తం ప్రక్రియనే నిలిపివేసిన ఓ ఎమ్మెల్యే వ్యవహారంపైనా ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలియడంతో ఎమ్మెల్యేల్లోనూ గుబులు మొదలైంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు అధికార వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కూడా ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిందట. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు వ్యవహారంపైనా కేసీఆర్‌కు నివేదికలు అందాయి. మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని నస్పూర్‌లో సర్వే నంబర్ 46లోని ఆరెకరాల సీలింగ్ భూమి, మరో పది ఎకరాల ప్రభుత్వ భూమిని సదరు ఎమ్మెల్యే బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరోచోట 102 ఎకరాల భూమిలో పట్టాలు మార్చినందుకు ఏకంగా 25 శాతం కమీషన్ చేతులు మారిందని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులు అందినట్లు చెబుతున్నారు. నాయకులందరిపైనా నిఘా విభాగం నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం, ఈ వైనాన్ని వ్యూహాత్మకంగా ప్రచారంలో కూడా పెడుతోంది. దీంతో ఒకరకమైన అభద్రతాభావం ప్రజాప్రతినిధుల్లో నెలకొంది. సీఎం సమావేశం తర్వాత ఫోన్లు స్విచాఫ్ ఆయా శాఖలకు సంబంధించి సీఎం ఆధ్వర్యంలో సమీక్షలు జరిగిన తర్వాత మంత్రులు ఆ వివరాలను మీడియాకు చెప్పడం పరిపాటి. కానీ, ఇటీవల మంత్రులు నోరు విప్పడం లేదు. సీఎం సమావేశాల నుంచి బయటకు రాగానే తమ ఫోన్లు స్విచాఫ్ చేసుకుంటున్నా రు. వారి శాఖలో ఏం జరుగుతుందో చెప్పేం దుకు కూడా కొందరు మంత్రులు మందుకు రావడం లేదు. ముఖ్యంగా మీడియాతో మా ట్లాడితే ఇబ్బందులు వస్తాయని వారు భయపడుతున్నారు. ఇక కుటుంబ సభ్యులు, బంధువులను సచివాలయంలో తమ పేషీల దరిదాపులకు రానీయడం లేదు. ‘మా అబ్బాయి ఏదో పని మీద సచివాలయం వచ్చాడు. మంచిది కాదని వారించి వెంటనే అతన్ని కిందనుంచే వెనక్కి వెళ్లమని చెప్పా’ అని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రి చెప్పారు. మొత్తం మీద నిఘా విభాగం నీడ తమను వెంటాడుతుందేమోనన్న అనుమానంతో మంత్రులు, ఇతర నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిటికెలో సీఎంకు సమాచారం దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రి ఇటీవల తన సన్నిహితులతో కలిసి విదేశాలకు వెళ్లాలని అనుకున్నారట. ఈ విషయం ముందే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిసింది. తనకు అత్యంత సన్నిహితులైన వారితో పంచుకున్న విషయం కూడా బయటకు ఎలా పొక్కిందో తెలియక ఆయన అయోమయానికి లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఇతర మంత్రులు ఆత్మరక్షణలో పడిపోయారు. తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం దక్కిన వారిలో సీనియర్లు కొందరే. మెజారిటీ మంత్రులంతా తొలిసారి అవకాశం దక్కిన వారే. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మదీనగూడ సర్వే నంబర్ 60లోని స్థలంలో ప్రహరీగోడను మున్సిపల్ అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఎందుకని ప్రశ్నించిన వారికి, ‘మంత్రిని అడగండి’ అని సిబ్బంది సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని నిఘా విభాగం వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా భూ కబ్జాలపై ఒకరిద్దరు ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయి. ‘కాగ్నా’ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ వ్యాపారం చేస్తున్న కొందరు వ్యక్తులు మంత్రి అనుచరులేనన్న ఆరోపణలతో ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. తనమీద నిఘా విభాగం ఇలాంటి నివేదికలను ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు బయటికి పొక్కడంతో సదరు మంత్రి ఇబ్బందిగా ఫీలయ్యారు. -
క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అబిడ్స్ అబిడ్స్ చాపెల్ రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్...కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులకు క్రైస్తవ భవన్ నిర్మిస్తున్నామని, జీసస్ దయతో క్రిస్మస్కు ఒకరోజు ముందే భవనానికి శంకుస్థాపన జరిగిందన్నారు. అందుకోసం రూ.10కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, కత్తి పద్మారావు, కె. కేశవరావు, ఎంపీ కవితతో పాటు పలువురు హాజరయ్యారు. -
'కంటోన్మెంట్'పై టీ మంత్రులు కసరత్తు
హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అందులోభాగంగా ఆ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రులు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీకి మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్తోపాటు పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టవలసిన కార్యచరణపై వారు ఈ సందర్భంగా చర్చిస్తారు. 2015, జనవరి 11న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. కంటోన్మెంట్లో మొత్తం ఎనిమిది వార్డులకు చెందిన దాదాపు 2.30 లక్షల మంది ఓటర్లు.... ఎనిమిది మంది సభ్యులను ఎన్నుకుంటారు. కంటోన్మెంట్ చట్టం -1924 స్థానంలో కొత్తగా ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006 అమల్లోకి వచ్చింది. ఆ చట్ట ప్రకారం 2008లో మే 18 కంటోన్మెంట్‌కు ఎన్నికలు జరిగాయి. తద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తొలి పాలకమండలి ఏర్పాటైంది. ఆ పాలక మండలి గడువు 2013 జూన్ 5వ తేదీతో ముగిసింది. అయితే పాలక మండలి గడువును మరో రెండు సార్లు పొడిగించారు. 2014 జూన్ 5వ తేదీతో ఆ గడువు కూడా పూర్తి అయింది. అప్పటి నుంచి కంటోన్మెంట్ అధికారుల పాలన సాగుతోంది. -
ప్రభుత్వ ప్రతిష్టను కాపాడండి
* కేబినెట్ భేటీలో సహచరులకు సీఎం కేసీఆర్ ఉద్బోధ * ఆరు నెలల్లో వచ్చిన మంచిపేరును ఐదేళ్లూ కాపాడుకోవాలి * జిల్లాల్లో అన్ని శాఖలను స్థానిక మంత్రులే పర్యవేక్షించాలి * పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పార్టీ కార్యకర్తలకు దగ్గరవ్వాలి సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వానికి ఇప్పటివరకు వచ్చిన ప్రతిష్ట, మంచి పేరును కాపాడాలని మంత్రివర్గ సభ్యులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్బోధించారు. మంగళవారం కేబినెట్ విస్తరణ అనంతరం కొత్త మంత్రులతో కూడిన కేబినెట్ భేటీ అయింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సహచరులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ర్ట పునర్నిర్మాణ బాధ్యతను సమర్థంగా చేయగలమనే విశ్వాసంతో టీఆర్ఎస్కు అధికారం అప్పగించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన గురుతరమైన, పవిత్రమైన బాధ్యత మనపై ఉంది’ అని సీఎం అన్నారు. గత ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ప్రజల్లో చాలా మంచి పేరు వచ్చిందన్నారు. ‘వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి దీర్ఘకాలిక పథకాలను అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారు. ప్రతి మండలాన్ని రాజధానితో అనుసంధానిస్తాం. వీటిని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఈ పథకాలను దేశమంతటా చర్చించుకునే విధంగా పూర్తిచేయాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘మంత్రులు కాగానే కొమ్ములు వచ్చినట్టుగా భావించొద్దు. ఇప్పటిదాకా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే నిరాడంబరంగా ఉండాలి. మంత్రి అయ్యాక ఇంకా దగ్గరయ్యారన్న సంకేతాన్ని ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి పంపించండి. అవినీతి రహితంగా, పారదర్శకంగా శాఖలను నిర్వహించాలి. ఐదేళ్లదాకా ప్రభుత్వంపై ఎలాంటి మచ్చ రావొద్దు. దేశవ్యాప్తంగా మన ప్రభుత్వానికి చాలా మంచిపేరు వచ్చింది. మంత్రిగా మీ ఒక్క శాఖకే పరిమితం కావొద్దు. జిల్లా స్థాయిలో అన్ని శాఖల పనితీరును ఆ జిల్లా మంత్రి పర్యవేక్షించాలి, సమీక్షించాలి. జిల్లాలో అన్ని శాఖల పనితీరును మెరుగుపర్చాలి. ఒక్క శాఖకే పరిమితమై మిగిలిన శాఖలను ఉపేక్షిస్తే పథకాల అమలు సంపూర్ణంగా ఉండదు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు కోసం జిల్లా స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను మంత్రులు తీసుకోవాలి’ అని సీఎం సూచించారు. పార్టీ ప్లీనరీ, నిర్మాణంపై తర్వాతే నిర్ణయం టీఆర్ఎస్ ప్లీనరీ, పార్టీ నిర్మాణంపై మరోసారి మాట్లాడుకుందామని కేసీఆర్ సూచించారు. మంత్రివర్గ సమావేశం నుంచి అధికారులంతా వెళ్లిపోయిన తర్వాత మంత్రులతో కొంతసేపు రాజకీయ అంశాలపై కేసీఆర్ చర్చించారు. పార్టీ ప్లీనరీ గతంలో వాయిదాపడిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించాలన్న ప్రతిపాదన తాజాగా వచ్చింది. అయితే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్నే భారీగా, ఘనంగా నిర్వహించుకుంటే బాగుంటుందనే సూచన కూడా వచ్చింది. దీనిపై మరోసారి చర్చించుకుందామని సీఎం పేర్కొన్నారు. -
మీడియాకు దూరంగా మంత్రులు
తెలంగాణ ఉద్యమం సమయంలో మీడియా ప్రతినిధులు కనిపిస్తే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన నేతలు ఇప్పుడు మంత్రులయ్యాక మైకులు కనిపిస్తే చాలు దూరం దూరం పోతున్నారు. విలేకరులు ఏం అడుగుతారో, వారికి ఏం చెబితే ఏ ఇబ్బందులు వచ్చిపడతాయోనన్న శంక వారిని పట్టి పీడిస్తోంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ విలేకరి రుణమాఫీ గురించి అడిగినప్పుడు ఏడాదిలో పూర్తి చేస్తామంటూ వ్యాఖ్యానించడంతో ముఖ్యమంత్రి ఆయనపై ఇంతెత్తున లేచారట! ఆ సంగతి మంత్రులకూ తెలిసింది. ఎందుకొచ్చిన తంటా.. అసలు ఏమీ మాట్లాడకపోతే ఏ బాధ ఉండదు కదా అని వారు భావిస్తున్నారు. దీంతో సచివాలయంలో మీడియా పాయింట్ దగ్గర ఇప్పుడు మాట్లాడేవారు కరువయ్యారు. -
మంత్రులెవరూ హైదరాబాద్ లో ఉండొద్దు: కేసీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులెవరూ హైదరాబాద్ లో ఉండడానికి వీల్లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. పంచాయతీరాజ్, రహదారుల శాఖ పనితీరుపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రహదారుల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీరాజ్ పరిధిలో రూ. 5 వేల కోట్లతో రోడ్లను మెరుగుపరచాలని, ఆర్ అండ్ బీ పరిధిలో 2400 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. -
డైలీ సీరియల్లా టీ-మంత్రుల అబద్ధాలు: పరకాల
-
డైలీ సీరియల్లా టీ-మంత్రుల అబద్ధాలు: పరకాల
తెలంగాణ మంత్రులు అబద్ధాలను సీరియల్లా చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. 233 జీవోలో ఎక్కడా 834 అడుగుల వరకు నీరు వాడుకోవచ్చనే పదమే లేదని ఆయన అన్నారు. చెప్పిన అబద్ధాలనే వాళ్లు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 107 జీవోకు, 170 జీవోకు మధ్య తేడా ఏంటో హరీష్‌రావుకు తెలియదా అని ప్రశ్నించారు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, అబద్ధాల డైలీ సీరియల్‌ను ఇకనైనా ఆపాలని పరకాల ప్రభాకర్ అన్నారు. మీ నీటిని మీరు వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని, అంతేతప్ప.. తమకు రావల్సిన న్యాయబద్ధమైన వాటాలో కూడా వేలు పెడితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఇక విద్యుత్తు విషయంలో కూడా.. తమకు వెయ్యి మెగావాట్లు రావాలని అడుగుతున్నారని, అవి ఎక్కడినుంచి రావాలని ప్రశ్నించారు. దానికి ఏమైనా లెక్క ఉందా.. ఎక్కడెక్కడ రావల్సిన దానికన్నా అదనంగా తీసుకుంటున్నారో కూడా లెక్కలు చెబుతానని అన్నారు. థర్మల్ విద్యుత్తులో ఏపీ ఉత్పత్తి చేసిన దాంట్లోంచి 769 మిలియన్ యూనిట్లు తెలంగాణకే ఇచ్చామని ఆయన చెప్పారు. జల విద్యుత్తులో కూడా ఆంధ్రా డిస్కంలు 1621, తెలంగాణ డిస్కంలు 2224 మిలియన్ యూనిట్ల చొప్పున వాడుకున్నాయన్నారు. ఇలా అన్నిచోట్లా ఎక్కువ వాడుకుంటూ.. తమ మీద తప్పునెట్టడం తెలంగాణ మంత్రులకు తగదని పరకాల ప్రభాకర్ చెప్పారు. -
హోంగార్డులకు ఇక ప్రతి నెల జీతాలు !
హైదరాబాద్: రాష్ట్రంలోని హోంగార్డులకు 3 నెలల జీతం బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఆ రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్లు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో నాయిని, ఈటెల రాజేందర్లు విలేకర్లతో మాట్లాడుతూ... రానున్న రోజుల్లో పోలీసులకు వలే హోంగార్డులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి... నెలనెల వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెల్లరేషన్ కార్డుపై పేదలకు రూ.1 కే కిలో బియ్యం ప్రభుత్వం అందిస్తుందని వారు గుర్తు చేశారు. అయితే ఆ బియ్యం ధర అంతే ఉంచాలా లేక మరో రూపాయి పెంచి... మరిన్ని కేజీలు అదనంగా ఇవ్వాలా అన్న అంశంపై ప్రభుత్వం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని వారు వెల్లడించారు. -
రుణమాఫీపై సీఎం స్పష్టత ఇస్తారు
విపక్షాల విమర్శలపై మంత్రుల ధ్వజం సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో రుణమాఫీతో సహా అన్ని విషయాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారని తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, పద్మారావు, శాసనసభ్యులతో కలసి వారు బుధవారం మీడియాపాయింట్లో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై విమర్శలు చేయడం ద్వారా విపక్షాలు తమ కుసంస్కారాన్ని చాటుకున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గవర్నర్ ప్రసంగం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించేలా ఉందన్నారు. అన్ని వర్గాలవారికి సమాన విద్యావకాశాలు కల్పిస్తామని, జనాభా ప్రాతిపదిక న ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాజకీయ అవినీతికి తావు లేకుండా నిధులు ఖర్చుచేస్తామని, ప్రతి జిల్లాలో నిమ్స్ స్థాయిలో ఆస్పత్రిని నెలకొల్పుతామన్న హామీలను నెరవేరుస్తామని స్పష్టంచేశారు. రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్టు ఇదివరకే తేల్చి చెప్పామన్నారు. పోలవరం ముంపుగ్రామాల అంశంపై అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని, సభలో తీర్మానం చేస్తామని పోచారం తెలిపారు. -
వాళ్లను పీఏలుగా, పీఎస్లుగా పెట్టుకోవద్దు!
-
'ఆ పీఎస్, పీఏలను మంత్రులెవరూ పెట్టుకోవద్దు'
హైదరాబాద్ : గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన పీఎస్ (పర్సనల్ సెక్రటరీ), పీఏ(పర్సనల్ అసిస్టెంట్)లను ప్రస్తుత మంత్రులెవరూ నియమించుకోరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఒకవేళ వారిని నియమించుకుంటే వెంటనే తొలగించాలని కేసీఆర్ బుధవారం మంత్రలకు ఆదేశాలు ఇచ్చారు. కొత్తవారిని నియమించుకోవాలని కేసీఆర్ ఈనేపథ్యంలో మంత్రులకు స్పష్టం చేశారు. దాంతో మంత్రులు తమ పేషీల్లో కొత్తవారిని,పాలనాపరంగా అనుభవం ఉన్నవారినే నియామించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. -
తెలంగాణ మంత్రుల ప్రమాణ స్వీకారం
-
మహిళా మంత్రి లేని కేసీఆర్ కేబినెట్
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన11 మందిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం. మహిళా కోటాలో కొండా సురేఖ లేదా పద్మాదేవేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. సామాజిక కోణంలోనే మహిళలకు పదవి ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా మహిళలకు కేసీఆర్ ప్రాతినిథ్యం కల్పిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ఉద్యోగ సంఘాల నేతలకు కేసీఆర్ నిరాశ మిగిల్చారు. స్వామిగౌడ్ కు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కు మొండిచేయి చూపారు. అలాగే మంత్రి పదవులు దక్కుతాయని ఎదురుచూసిన మరి కొంతమందికి నిరాశే ఎదురయింది. కొప్పుల ఈశ్వర్, సి.లక్ష్మారెడ్డి కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించారు. అయితే వీరిద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మంత్రివర్గంలో మిగిలిన ఖాళీలను రాబోయే నాలుగైదు రోజుల్లోనే భర్తీ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల ఆశలు మళ్లీ చిగురించాయి. -
తెలంగాణ మంత్రులు వీరే
హైదరాబాద్: తెలంగాణ మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. రాజ్‌భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మహమూద్ అలీ, డాక్టర్ తాటికొండ రాజయ్య, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తన్నీరు హరీష్‌రావు, టి. పద్మారావు, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు, జోగు రామన్న, గుంటకట్ల జగదీశ్వర్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రమాణం చేశారిలా... * మహమూద్ అలీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. * డాక్టర్ తాటికొండ రాజయ్య పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. * నాయిని నర్సింహారెడ్డి పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేశారు. * ఈటెల రాజేందర్ పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. * పోచారం శ్రీనివాస్‌రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. * తన్నీరు హరీష్‌రావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. * టి.పద్మారావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. * పట్నం మహేందర్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. * కల్వకుంట్ల తారక రామారావు పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేశారు. * జోగు రామన్న దైవసాక్షిగా ప్రమాణం చేశారు. * గుంటకట్ల జగదీశ్వర్ రెడ్డి పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేశారు. -
'సీమాంధ్రకు ఎంత మేలు చేసినా అడ్డు చెప్పం'
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, పలువురు నేతలు శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవద్దని దిగ్విజయ్‌ని కోరారు. భేటీ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినందకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. త్వరలోనే తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సోనియా, రాహుల్‌ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. సోనియా, రాహుల్ వల్లే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావంతో... సీమాంధ్రకు ఎంత మేలు చేసినా తాము అడ్డు చెప్పమన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఒకరిద్దరు కూడా వెళ్లరని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. వీరిలో డీ శ్రీనివాస్ గీతారెడ్డి, ఆమోస్ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్ సోనియాతో పది నిమిషాలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కాగా సోనియాను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు తెలంగాణ ప్రాంత నేతలు ఆమె నివాసానికి క్యూ కడుతున్నారు. -
టీ మంత్రులపై బొత్స అసంతృప్తి
రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తెలంగాణ ప్రాంత మంత్రులు రాకపోవడాన్ని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. వాళ్లు ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి కూడా నష్టం కలిగిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయానికి అంచనాల పెంపును కూడా పీసీసీ చీఫ్ బొత్స తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు బడ్జెట్ విషయమై సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన తన నిరసన తెలియజేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక లేఖ కూడా ఇచ్చారు. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచడాన్ని గతంలోనే బొత్స సత్యనారాయణ వ్యతిరేకించారు. ఈమేరకు ఇంతకుముందు కూడా ఒకసారి ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు లేఖలు సైతం రాశారు. -
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
హైదరాబాద్ : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు వ్యయానికి సంబంధించి బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పిస్తారు. సమావేశాల కోసం రాష్ట్ర అసెంబ్లీ నేడు సమావేశం కానుంది. బడ్జెట్ సమర్పణ ముగియగానే బుధవారం నాటికి అసెంబ్లీని వాయిదా వేస్తారు. బడ్జెట్‌పై అధ్యయనం చేయడానికి మంగళవారం నాడు సభకు సెలవు ప్రక్రించారు. తిరిగి అసెంబ్లీ బుధవారం సమావేశమవుతుంది. 13వ తేదీతో సమావేశాలు ముగుస్తున్నాయి. ఆతర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. ఉదయం పదిన్నర గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మరోవైపు సీఎం కిరణ్ వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రాంత మంత్రులు కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. అంతేకాకుండా వారు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నారు. -
బడ్జెట్ సమావేశాలు బహిష్కరణ
హైదరాబాద్ : కేబినెట్ సమావేశానికి గైర్హాజరు అయిన తెలంగాణ ప్రాంత మంత్రులు.... బడ్జెట్ సమావేశాలను కూడా బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే నిరసన తెలిపి వాకౌట్ చేయాలని వారు నిర్ణయించారు. మంత్రి జానారెడ్డి నివాసంలో సోమవారం తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, బస్వరాజు సారయ్య, సుదర్శన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. మరోవైపు అసెంబ్లీలో ఉండి కూడా కేబినెట్ భేటీకి మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ హాజరు కాలేదు. -
తెలంగాణ మంత్రులకు దిగ్విజయ్ ఫోన్
-
తెలంగాణ మంత్రులకు దిగ్విజయ్ ఫోన్
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత మంత్రులకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సోమవారం ఫోన్ చేశారు. కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని ఆయన ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలు రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి హాజరు కావాలని సూచించారు. సమావేశాలకు ఆటంకం కలిగించకూడదని అన్నారు. తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని, అందుకు ఎటువంటి అడ్డంకులు లేవని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 9గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, టీ. మంత్రులను పట్టించుకోవటం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. దిగ్విజయ్ కొందరు మంత్రులకు ఫోన్ చేశారని...సీఎంకు సహకరించాలా ....వద్దా... అనేదానిపై తాము చర్చించుకున్న అనంతరం కేబినెట్ భేటీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు మంత్రి జానారెడ్డి నివాసంలో సమావేశం అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. -
ప్రత్యేక తెలంగాణపై నివేదిక సిద్ధం చేసిన జీవోఎం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం తుది అంకానికి చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి జీవోఎమ్(కేంద్ర మంత్రుల బృందం)కు అప్పచెప్పిన పనిని పూర్తి చేసి ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ నివేదికను అందజేశారు. కొత్తరాజధానికి నిధులు కేటాయించడంతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలలో వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయింపుపై ప్రధానంగా దృష్టి సారించారు. హైదరాబాద్ విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల కాలపరిమితి పొడిగింపుపై, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో ఉంచడంపై ఎటువంటి స్పష్టత రాలేదు. జనాభా ప్రాతిపదిక ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపకాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. కాగా, సీమాంధ్ర కేంద్ర మంత్రుల డిమాండ్లను కేంద్రం పక్కకుపెట్టింది. హైదరాబాద్ ను యూటీ(కేంద్ర పాలిత ప్రాంతం)చేయాలన్న సీమాంధ్ర మంత్రుల విన్నపాన్ని కొట్టిపారేసింది. తెలంగాణ రాష్ట్ర అంశంపై కేంద్ర కేబినెట్ రేపు మరోసారి ప్రత్యేక భేటీ కానుంది. ఇదిలా ఉండగా టి.బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీజేపీ సూచించిన సవరణల్లో కొన్నింటినైనా పరిష్కారించాలనే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రేపటి కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు స్పష్టత రానుంది. -
దిగ్విజయ్‌తో తెలంగాణ మంత్రుల మంతనాలు
న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను సోమవారం తెలంగాణ ప్రాంత మంత్రులు కలిశారు. తెలంగాణ బిల్లుపై వారు ఈ బేటీలో చర్చించారు. ఇక రాష్ట్ర సచివాలయం నుంచి తెలంగాణ బిల్లు, బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం హస్తినకు చేరింది. ఈ నెల ఐదు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. కాగా అంతకు ముందు మంత్రి డీకె అరుణ ఢిల్లీ విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ జీవోఎంను కలిసేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. తమ ప్రాంత సమస్యలను మరోమారు జీవోఎం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. మరో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం కావడం తథ్యమన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ ప్రాంత సమస్యలు జీవోం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. పార్లమెంటులో టీబిల్లు పాస్ అయ్యేలా కృషి చేయాలని అన్నారు. -
టీ-బిల్లు ప్రతులతో మంత్రుల ఫొటోలు
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) ఢిల్లీకి చేరడంతో తెలంగాణ ప్రాంత నాయకులు సంబరపడుతున్నారు. త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెడతారని, ఇక రాష్ట్రం సిద్ధించినట్లేనని భావిస్తున్నారు. హస్తిన చేరిన మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో తెలంగాణ బిల్లు ప్రతులు సూట్ కేసులతో ఫోటోలు దిగారు. కాగా 400 కిలోల గల 15 బండిల్స్ ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ లలితాంబిక ఆధ్వర్యంలో తెలంగాణ బిల్లు ముందుగా ఏపీ భవన్ కు, అక్కడ నుంచి కేంద్ర హోంశాఖకు చేరింది. మరోవైపు తెలంగాణ బిల్లుపై సభ్యుల అభిప్రాయాల నివేదిక ఉదయం 11.45 గంటలకు ఢిల్లీ చేరనుంది. -
తీర్మానం ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకోండి: కె.తారకరామారావు
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో నిబంధన 77 ప్రకారం చేసే తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికే పంపుతారని స్పష్టమైన నేపథ్యంలో.. సభలో జరిగిన తీర్మానాన్ని ఢిల్లీకి పంపకుండా ఉప ముఖ్యమంత్రి సహా టీ మంత్రులు అడ్డుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండ్ చేశారు. ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై సీఎం కిరణ్ ఒత్తిడి తీసుకొచ్చినా... వారు ఆపే ప్రయత్నం చేయాలన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపినా.. తెలంగాణ ఏర్పాటులో ఫరక్ పడేది ఏమీ లేదు. కానీ, అనేక ఉల్లంఘనలతో అనైతికంగా చేసిన ఆ తీర్మానం ఢిల్లీకి వెళ్లకూడదన్నదే మా ప్రయత్నం’’ అని ఆయన చెప్పారు. సభలో తీర్మానాన్ని ఆమోదించే విషయంలో స్పీకర్ మనోహర్ స్పష్టంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని కేటీఆర్ విమర్శించారు. స్పీకర్ తనపై సీఎం తెచ్చిన ఒత్తిడితో పాటు సొంత నియోజకవర్గం తెనాలిలో తన దిష్టిబొమ్మలు దహనం చేయడంతో ఒత్తిడికి లోనయి.. రాజ్యాంగబద్ధ పదవికే కళంకం తెచ్చారని మండిపడ్డారు. తనకు సభలో మాట్లాడే అవకాశమివ్వలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా ‘‘చంద్రబాబు మాట్లాడలేదని టీటీడీపీ నేతలు సంబరపడుతున్నారు. బాబు మాట్లాడి ఉంటే ఆయన బండారం బయటపడి ఉండేది’’ అని పేర్కొన్నారు. ఢిల్లీకి తరలివెళ్లిన కేసీఆర్, ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఢిల్లీకి తరలివెళ్లారు. ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, హరీశ్వర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, కె.విద్యాసాగరరావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, అలీ తదితరులు ఉదయం రైలులో ఢిల్లీ బయలుదేరి వెళ్లగా.. పార్టీ అధినేత కేసీఆర్‌తో కలిసి మరికొందరు ఎమ్మెల్యేలు రాత్రి విమానంలో వెళ్లారు. నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, నారదాసు లక్ష్మణరావు ఢిల్లీ వెళ్లారు. -
రాజ్యాంగ విరుద్ధం: టీ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తూ శాసనసభ చేసిన తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ మంత్రులు అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 3 నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సదరు తీర్మానానికి ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ పూర్తయిందని, పార్లమెంట్లో ఆమోదం పొందడమే తరువాయి అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ర్టం ఏర్పాటవుతుందని, ఆ తరువాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో మంత్రులు జె.గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, బసవరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి కె.జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో రాజ్యాంగ పద్ధతుల్లో చర్చ జరిగిందన్నారు. చర్చ ముగిసిన తరువాత బిల్లును తిరస్కరిస్తూ ఆమోదించిన తీర్మానానికి, బిల్లుకు సంబంధం లేదన్నారు. అర్ధంలేని ఆవేదన, ఆక్రోశంతో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం సీమాంధ్రుల కంటితుడుపు కోసమే తప్ప రాజ్యాంగ బద్ధత లేదన్నారు. అలాంటి తీర్మానంతో కూడిన బిల్లును కేంద్రానికి పంపుతారా? లేదా? అనేది స్పీకర్ విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ తీర్మానం అడ్డంకి కానేకాదని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించాలా? లేదా? అనే అంశం హైకమాండ్ పరిధిలోనిదన్నారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ విభజన విషయంలో అసెంబ్లీ తీర్మానాలకు రాజ్యాంగ, చట్టబద్దత ఉండదన్నారు. మంత్రి పొన్నాల ఈ సందర్భంగా స్వీట్లు పంచారు. -
'తిరస్కార తీర్మానాన్ని అనుమతించొద్దు'
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తిరస్కార తీర్మానాన్ని అనుమతించరాదని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు తెలంగాణ మంత్రులు లేఖ ఇచ్చారు. ప్రభుత్వంలో తాము భాగస్వాములైనప్పటికీ తమను సంప్రదించకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానం ఇచ్చారని తెలిపారు. కాబట్టి దీన్ని ప్రభుత్వ తీర్మానంగా పరిగణించరాదని కోరారు. సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానంగానే పరిగణించాలని సూచించారు. కాగా శాసనసభ, శాసనమండలి ఈ ఉదయం ప్రారంభమైన వెంటనే అరగంట వాయిదా పడ్దాయి. విభజన బిల్లును తిప్పి పంపాలని సీమాంధ్ర సభ్యులు, వద్దని తెలంగాణ సభ్యులు పోటీపోటా నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. -
మనమేం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను తిరస్కరించాలని కోరుతూ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లేకుండా ప్రభుత్వం పక్షాన స్పీకర్‌కు కిరణ్‌కుమార్‌రెడ్డి నోటీస్ ఇవ్వడంపై తెలంగాణ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. అయినప్పటికీ దీనిపై తొందరపాటు నిర్ణయానికి రాకూడదని భావించిన తెలంగాణ మంత్రులు ఈ విషయంలో హైకమాండ్ దిశానిర్దేశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లు పంపితే, దానిని తిరస్కరించాలని చెప్పడమంటే కాంగ్రెస్ పార్టీని ధిక్కరించడమే అవుతుందని, దీనికి చెక్‌పెట్టేందుకు హైకమాండ్ పెద్దలు వ్యూహం రూపొందిస్తారనే భావనలో ఉన్నారు. హైకమాండ్ పిలుపు మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి వచ్చే ఆదేశాల మేరకే సభలో వ్యవహరించాలని తెలంగాణ నేతలు భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి జానారెడ్డి హైదరాబాద్ వచ్చిన అనంతరం అందుబాటులో ఉన్న తెలంగాణ ప్రజాప్రతినిధులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని యోచిస్తున్నారు. తెలంగాణ బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడం, ఆమోదించడం ఖాయమైన నేపథ్యంలో అసెంబ్లీలో బిల్లుపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమైనా నష్టమేమీ లేదని పలువురు నేతలు భావిస్తున్నారు. అలాగని శాసనసభ విభజన బిల్లును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి కేంద్రానికి పంపితే రాష్ట్రపతి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అంతవరకు రాకుండా ఉండాలంటే సీఎం తీర్మానం పెట్టకుండా అడ్డుకోవడమే మేలని అభిప్రాయపడుతున్నారు. జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విభజన తీర్మానాన్ని తిరస్కరించాలని కోరుతూ సీఎం నోటీస్ ఇచ్చిన విషయంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామన్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతూ గవర్నర్, శాసనసభ స్పీకర్లకు లేఖ కూడా రాస్తున్నట్లు పేర్కొన్నారు. కిరణ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం పదవికి రాజీనామా చేసి విభజన బిల్లును వ్యతిరేకిస్తే మంచిదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. -
టే-మంత్రులకు బంపర్ ఆఫర్
-
సిగ్గుంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలి
హైదరాబాద్ : శ్రీధర్ బాబు శాఖ మార్పు దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత మంత్రులు అవకాశం దొరికినప్పుడల్లా తమ నోటికి పని చెబుతున్నారు. సిగ్గు ఉంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలని మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో మంత్రి శ్రీధర్ బాబును బలిపశువును చేశారని ఆయన అన్నారు. కాగా టీజీ వెంకటేష్ వ్యాఖ్యలకు మంత్రి దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రులు రాజీనామా చేస్తే సీమాంధ్ర మంత్రులు కిరాణా దుకాణం పెట్టుకోవాలన్నారు. -
సీఎంపై టీ మంత్రుల ఆగ్రహం
-
సీఎంపై టీ మంత్రుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ముఖ్యమంత్రి తప్పించడం రాష్ట్ర రాజకీయాల్లో.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయాన్ని తెలంగాణ మంత్రులు తీవ్రంగా నిరసించారు. శాఖ వూర్పు సంగతి తనకు తెలియుదని పేర్కొన్న వుంత్రి శ్రీధర్‌బాబు ఉదయుమే వుంత్రి జానారెడ్డితో పాటు సీనియుర్ వుంత్రులతో భేటీ అయ్యూరు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్యు, సుదర్శన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కొందరు ఎమ్మెల్యేలు సవూవేశంలో పాల్గొన్నారు. పదవికి రాజీనావూ చేస్తానని అందుకు సంబంధించిన లేఖను శ్రీధర్‌బాబు వారికి చూపించారు. అనంతరం వారు గవర్నర్ వద్దకు వెళ్లారు. అసెంబ్లీ వులివిడత సవూవేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సభావ్యవహారాల శాఖనుంచి వుంత్రి శ్రీధర్‌బాబును తప్పించడం సరికాదని ఆయనకు విన్నవించారు. తనకింకా సంబంధిత ఫైల్ రాలేదని, వచ్చాక పరిశీలించి రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ వుంత్రులు వివరించారు. అనంతరం వుళ్లీ జానారెడ్డి నివాసానికి చేరుకొని, శ్రీధర్‌బాబు రాజీనావూ లేఖ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తరువాత దానిపై చర్చ కొనసాగించినా, కొనసాగించకపోయినా ఒక్కటేనని, అంతివుంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేసే అధికారం కేంద్రానికి ఉంది కనుక ఎలాంటి ఇబ్బంది కలగదన్న భావనను వ్యక్తపరిచారు. శాఖల వూర్పు సీఎం అభీష్టం మేరకే ఉంటుంది కనుక దాన్ని ప్రశ్నించేలా కాకుండా అసెంబ్లీ సవూవేశాల సవుయుంలో శాఖల వూర్పులు చేయుడాన్ని తప్పుబట్టాలని నిర్ణరుుంచారు. తెలంగాణ అనుకూల వాదనతో సభకు అడ్డు తగిలేవారిని సభ నుంచి బయుటకు పంపి ఆ తరువాత చర్చలో సీవూంధ్ర కాంగ్రెస్ నేతలతో సమైక్య వాదాన్ని గట్టిగా వినిపించేందుకే సీఎం ఈ వ్యూహాన్ని రచిస్తున్నారన్న అభిప్రాయూనికి వచ్చారు. చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈనెల 3వ తేదీన తెలంగాణలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సవూవేశం కావాలని నిర్ణరుుంచారు. శ్రీధర్‌బాబు రాజీనావూ నిర్ణయం సరికాదని జానారెడ్డి సహా ఇతర వుంత్రులు అభిప్రాయుపడ్డారని సవూచారం. ‘ఒకరు రాజీనావూ చేస్తే తక్కిన వారి రాజీనావూలూ అనివార్యవువుతారుు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిన తరుణంలో వుూకువ్ముడి రాజీనావూల ప్రభావం సభపై పడుతుంది. చర్చకు ఆటంకం వునమే కల్పించిన వారవువుతాం. తెలంగాణ అంశం చివరి దశకు చేరిన తరుణంలో లక్ష్యసాధనను వునమే దెబ్బతీసుకున్న వారవువుతాం’ అని జానారెడ్డి సవూవేశంలో సూచించారు. శ్రీధర్‌బాబు రాజీనామా లేఖను కూడా ఆయున తనదగ్గరే పెట్టుకున్నారు. అనంతరం శ్రీధర్‌బాబు పీసీసీ వూజీ చీఫ్ డి. శ్రీనివాస్‌ను కలుసుకొని తాజా పరిణావూలను వివరించారు. అధిష్టానానికి ఒకటి చెబుతూ సీఎం కిరణ్ అసెంబ్లీలో వేరేలా చేస్తున్నట్లు కనిపిస్తోందని డీఎస్ వ్యాఖ్యానించారు. సభలో గందరగోళం రేపి చర్చను పక్కదారి పట్టించేందుకు సీఎం ఈ శాఖల వూర్పు నిర్ణయుం తీసుకున్నట్లుగా ఉందని వివుర్శించారు. మరోవైపు, శాఖల వూర్పు నిర్ణయూన్ని సీవూంధ్ర కాంగ్రెస్ నేతలు సవుర్థించారు. ఆ అధికారం వుుఖ్యవుంత్రికి ఉందని, ఏవైనా అభ్యంతరాలుంటే సీఎంతో తెలంగాణ వుంత్రులు వూట్లాడితే బాగుంటుందని వుంత్రి ఆనం రావునారాయుణరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చర్యను తావుు సవుర్థిస్తున్నావుని, తెలంగాణ నేతలు మెజారిటీ ప్రజల గొంతునొక్కేందుకు ప్రయుత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీధర్‌బాబు శాఖ మార్పు వ్యవహారంపై టీడీపీలోనూ ప్రాంతాలవారీగా భిన్న వ్యాఖ్యలు వినిపించడం విశేషం. సీవూంధ్ర టీడీపీ నేత పయ్యూవుల కేశవ్ వూట్లాడుతూ సభ నడపాల్సిన బాధ్యత సభానాయుకుడిపై ఉంటుందని, శాఖల వూర్పుతో శాసనసభా వ్యవహారాలను సీఎం కిరణ్ తన చేతుల్లోకి తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. అదే సవుయుంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన రావుల చంద్రశేఖరరెడ్డి తదితర నేతలు వూట్లాడుతూ సీఎం కిరణ్ తీరును తప్పుబట్టారు. -
శ్రీధర్ బాబు శాఖ మార్పుపై రగడ
-
శ్రీధర్ బాబు శాఖ మార్పుపై రగడ
రాష్ట్ర శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు స్థానచలనం కల్పించడంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర మంత్రులు సీఎం కిరణ్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రేపు తమ పరిస్థితి ఎంటో అన్న సందిగ్థత వారిని పట్టి పీడిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులంతా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. తమ ప్రాంతానికి చెందిన మంత్రులపై మొండివైఖరిని అవలంభిస్తున్నారని ఇప్పటికే కొందరు తెలంగాణ మంత్రులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. శ్రీధర్ బాబుకు శాసన సభ వ్యవహారాలను తప్పించి, వాణిజ్య పన్నులు కేటాయించడం వారి ఆగ్రహన్ని మరింత పెంచింది. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టడం భావ్యం కాదని వారు ఆరోపిస్తున్నారు. సీఎం కిరణ్ వ్యవహార శైలిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ మంత్రులు సమాయత్తమయ్యారు. అందులోభాగంగా మరికాసేపట్లో వారు గవర్నర్ నర్సింహన్‌తో భేటీ కానున్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాంతానికి చెందిన, తెలంగాణకు అనుకూలమైన శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు తనదైన శైలీలో దూసుకెళ్తున్నారు. కొంతకాలంగా శ్రీధర్ బాబు అనుసరిస్తున్న శైలీ పట్ల కిరణ్ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతో శాసనసభ వ్యవహారాల శాఖను ఎస్.శైలజానాథ్‌కు బదిలీ చేశారు. అలాగే వాణిజ్య పన్నుల శాఖను శ్రీధర్ బాబుకు అప్పగించారు. అయితే వాణిజ్య శాఖను తీసుకునేందుకు తాను సిద్ధంగా లేనని శ్రీధర్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రపతిని కలవాలని టీ మంత్రుల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లుపై చర్చను సాగదీస్తున్న వైఖరిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వివరించాలని తెలంగాణ మంత్రులు నిర్ణయానికొచ్చారు. అసెంబ్లీ లాబీలోని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ మంత్రి కె.జానారెడ్డి కార్యాలయాల్లో గురువారం పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దఫదఫాలుగా సమావేశమయ్యారు. బిల్లును అడ్డుకునేందుకే సమావేశాలను సాగదీస్తున్నారని, ఈ ఆలస్యాన్ని ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించారు. శాసనసభను పక్షం రోజులపాటు వాయిదా వేసి జనవరి 3 నుంచి 23దాకా తిరిగి కొనసాగించాలని నిర్ణయించడంలో ఆంతర్యం అదేనని వారు అభిప్రాయపడ్డారు. రాష్ర్టపతి తగినంత గడువిచ్చినప్పటికీ ఉభయ సభలను సమావేశపరచకుండా వాయిదా వేసుకుని, మరింత గడువు కోరాలన్న ఆలోచనలు సాగుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్రపతిని కలిసి వివరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతిని రెండు మూడు రోజుల్లో కలవాలని భావిస్తున్న ఆయా నేతలు డిప్యూటీ సీఎం ద్వారా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. నలుగురితో కమిటీ వేయండి ప్రభుత్వ ఉద్యోగుల విభజన పారదర్శకంగా ఉండేలా నలుగురు సీనియర్ అధికారులతో కమిటీని నియమించాలని టీఎన్జీవోల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో సీఎస్‌ను కలిసి తమ డిమాండ్ గురించి తెలిపింది. -
సీఎం నిజమైన కాంగ్రెస్ వాది: టి.మంత్రులు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ వాది అని తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రశంసించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు మంగళవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ హైకమాండ్‌కు వీరవిధేయుడన్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు తెలంగాణ ప్రాంత మంత్రులు....మంత్రి జానారెడ్డి ఛాంబర్లో భేటీ అయ్యారు. -
గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తారని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్టు తెలంగాణ మంత్రులు తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని సీఎం కిరణ్ గౌరవిస్తారంటూ మంత్రులు డీకే అరుణ, సునీత, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీకి ఇవాళ తెలంగాణ బిల్లు రాకపోవడం వెనుక సీఎం కిరణ్ హస్తమేమీ లేదని దిగ్విజయ్ అన్నట్టు మంత్రులు తెలపారు. సోమవారం బీఏసీ భేటీలో బిల్లు చర్చకు వస్తుందిని, మంగళవారం నుంచే బిల్లుపై సభలో చర్చించేలా పట్టుబడతామని తెలంగాణ మంత్రులు డీకె అరుణ, సునీత, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. -
టీ ముద్దు.. రాయల వద్దు: టీ మంత్రులు
సాక్షి, హైదరాబాద్: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేయాలని, రాయల తెలంగాణ వద్దని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ అంటూ జాప్యం చేయడానికి ప్రయత్నించడమంటే ఇక తెలంగాణ రాదన్న అనుమానం వెలిబుచ్చారు. పది జిల్లాల తెలంగాణ మాత్ర మే కావాలంటూ ఈ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ నేతల తరఫున ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ బుధవారం జీవోఎంకు లేఖ రాశారని, జీవోఎం సభ్యుల్ని కలవడానికి స్వయంగా ఢిల్లీకి వెళ్లారని టీ మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. బుధవారం వారు సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ కాకుండా మరే ప్రతిపాదన తెచ్చినా తమకు ఆమోద యోగ్యం కాదన్నారు. రాయలసీమకు, తెలంగాణకు ముందు నుంచి ఎలాంటి సంబంధం లేదని, సంస్కృతి, సంప్రదాయం, చారిత్రాత్మక నేపథ్యం అంతా వేరని, మద్రాస్ నుంచి విడివడినప్పుడు వారు ఆంధ్రాతో ఉన్నారని వివరించారు. ఉమ్మడి రాజధానికి అంగీకరించాక ఇప్పుడు కొత్తగా రాయల తెలంగాణ అంశాన్ని తేవటం మంచిది కాదని జీవోఎంకు ఇదివరకే స్పష్టం చేశామని, ఈరోజు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి హోంమంత్రి షిండేతో మాట్లాడి తమ వాదనను వినిపించారన్నారు. రాయల తెలంగాణను ప్రకటిస్తే అప్పుడు పరిస్థితుల ఆధారంగా కార్యాచరణ చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు. నేటి బంద్‌కు మా మద్దతు లేదు రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన బంద్‌కు తమ మద్దతు లేదని, ప్రజలు ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయాలని మంత్రులు కోరారు. బంద్‌కు పిలుపునిచ్చినప్పుడు మాకేమైనా చెప్పి ఇచ్చారా? అని జానారెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. జీవోఎంకు దామోదర రాసిన లేఖ.. పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీడబ్ల్యూసీ, యూపీఏ ప్రభుత్వం ప్రకటించాక కృతజ్ఞతగా టీ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున సభలు నిర్వహించారు. కానీ ఇప్పుడు జీవోఎం రాయల తెలంగాణ గురించి తీవ్రంగా ఆలోచిస్తోందని, ఆ మేరకు నివేదిక, ముసాయిదా రూపొందించినట్టు పత్రికల్లో, టీవీల్లో వస్తున్న వార్తలు తెలంగాణ ప్రజల్ని తీవ్ర ఆందోళనపరుస్తున్నాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణను మాత్రమే ఈ ప్రాంత ప్రజలు అంగీకరిస్తారని గతంలో పలుమార్లు మీకు తెలిపాం. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగానూ ఆమోదించారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్నిగాక మరోవిధంగా ఎలాంటి నివేదిక ఇచ్చినా, బిల్లు తెచ్చినా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినట్లే. -
సీఎంకు వత్తాసు పలకడమేమిటి?
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: తెలంగాణను దోచుకుని ముఖ్యమంత్రి తన సొంత జిల్లా చిత్తూరుకు తాగునీటి కోసం రూ.ఏడువేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ మంత్రులు ప్రశ్నంచకుండా ఆయన వత్తాసు పలుకడమేమిటని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ప్రశ్నించారు. ఈ నిధుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం పొందకుండా చూడాలన్నారు. మహబూబ్‌నగర్‌లో సోమవారం జరిగిన పాలమూరు విద్యార్థి గర్జన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈ విషయమై హైకోర్టులో కేసు వేశానన్నారు. దీంతో సీఎం హడావిడిగా నిధుల దోపిడీకి ఆమోదం తెలి పేందుకే మంగళవారం మంత్రివర్గ సమావేశం పెట్టారని ఆరోపించారు. నిధుల దోపిడీని అడ్డుకోవాలని, డిసెంట్‌నోట్ రాయాలని తెలంగాణ మంత్రులకు సూచించారు. మంత్రివర్గంలో నిధుల కేటాయింపునకు తెలంగాణ మంత్రులు ఎవరెవరు ఆమోదం తెలుపుతారో సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుని ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణను అన్ని విధాలుగా అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి కుర్చీని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై అదే చిత్తూరు జిల్లాకు చెందిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. సమన్యాయం అంటే వేల కోట్లు ఒక్క జిల్లాకు కట్టిపెట్టడమేనా? అని ప్రశ్నించారు. నీది చిత్తూరే, నాదీ చిత్తూరే అన్నట్లు సీఎం, బాబుల వ్యవహరం ఉందని విమర్శించారు. -
‘టీ మంత్రుల వల్లే సీఎం విభజన వ్యతిరేకవాదం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత మంత్రుల అలసత్వం వల్లే ముఖ్యమం త్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ మండిపడింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజ్ శ్రవణ్ మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గంలో చర్చించకుండా ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా జీవోఎంకు నివేదికలు ఇవ్వడం అప్రజాస్వామికమన్నారు. సీఎం రాష్ట్రంలో రెం డు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని, రాష్ట్ర అంతర్గత భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదులుంటే రాష్ట్ర ఇంటిలిజెన్స్ పసిగట్టలేకపోయిందని.. తమిళనాడు ఇంటిలిజెన్స్ చెప్పిన తరువాతే తెలిసిందన్నారు. పరిస్థితి అలా ఉంటే విభజన జరిగితే ఉగ్రవాదం వస్తుందని కిరణ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. -
రేపు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు మరోమారు ఢిల్లీ పయనం కానున్నారు. శుక్రవారం ఉ.6.30 గం.లకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన తెలంగాణ మంత్రులు జీఓఎంతో సమావేశమవుతారు. వీరిలో డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రి జానారెడ్డి, ఇతర మంత్రులు జీఓఎంతో భేటీ అవుతారు. ఈ రోజు జీఓఎంతో సమావేశమైన కేంద్ర కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఈనెల 18 వ తేదీన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జీఓఎం సభ్యులతో భేటీ కానున్నారు. వచ్చే సోమవారం ఉ.10.30కు టి.కేంద్ర మంత్రులతో జీఓఎంతో భేటీ కానుందని కేంద్రమంత్రి జైరాం రమేష్ తెలిపారు. ఉ.11.30కు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సమావేశమవుతారన్నారు. అనంతరం మ.12.30 గంటలకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జీఓఎంతో బేటీ అవుతారు. ఈ నెల 20వ తేదీలోగా ముసాయిదా బిల్లుకు తుది రూపమిచ్చే అవకాశం ఉందని జైరాం రమేష్ తెలిపారు. -
‘సమైక్య’ ఊసే వద్దు
పీసీసీ చీఫ్‌కు స్పష్టం చేసిన తెలంగాణ మంత్రులు, ఎంపీలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మంత్రివర్గ బృందానికీ (జీవోఎం) సమర్పించే నివేదికలో రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనే ప్రస్తావనే తీసుకురావొద్దని తెలంగాణ మంత్రులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తెగేసి చెప్పారు. అయితే, విభజన వల్ల సీమాంధ్రలో తలెత్తే సమస్యలను ప్రస్తావిస్తే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అవసరమైతే తాము కూడా అందుకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలోనూ సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు వ్యవహరించాలని, ఈ విషయంలో పార్టీ ప్రతినిధిగా పీసీసీ అధ్యక్షుడు వెళితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రుల నివాస ప్రాంగణంలో సోమవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తెలంగాణ మంత్రులు సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, రాంరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బసవరాజు సారయ్య, పి.సుదర్శన్‌రెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మాజీమంత్రి షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు బొత్సతో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ నేతలంతా డిప్యూటీ సీఎం నివాసంలో సమావేశమై పీసీసీ చీఫ్‌కు, జీవోఎంకు సమర్పించాల్సిన నివేదికపై కసరత్తు చేశారు. అప్పుల్లో ఎక్కువ భారాన్ని తెలంగాణపై మోపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు.