
మంత్రులెవరూ హైదరాబాద్ లో ఉండొద్దు: కేసీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులెవరూ హైదరాబాద్ లో ఉండడానికి వీల్లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
పంచాయతీరాజ్, రహదారుల శాఖ పనితీరుపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రహదారుల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీరాజ్ పరిధిలో రూ. 5 వేల కోట్లతో రోడ్లను మెరుగుపరచాలని, ఆర్ అండ్ బీ పరిధిలో 2400 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.