
గుంటూరు, సాక్షి: స్ధానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ని ఆయన ఆవిష్కరించారు.
మన హయాంలో గ్రామ స్వరాజ్య స్థాపనకు అనేక చర్యలు తీసుకున్నాం. స్థానిక సంస్థల బలోపేతానికి ఎంతో కృషి చేశాం. ఆర్థికంగా వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని అన్నారాయన.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ ఎంపీపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరకపూడి గాంధీ, కడప మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment