సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల నుంచి వచ్చిన ఉద్యమమని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో యన మాట్లాడుతూ... తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు సమైక్యాంధ్రలాంటి ఉద్యమం చూడలేదన్నారు.
అక్టోబర్ 3న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం శుక్రవారం కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మాట్లాడిన తీరు బాధకరంగా ఉందని పితాని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. సీఎం వ్యాఖ్యలపై మాట్లాడిన తీరును తెలంగాణ మంత్రులు మరోసారీ పునరాలోచించుకోవాలని పితాని సత్యనారాయణ సూచించారు.