
'ఓ భాష వారు ఒకే రాష్టంగా ఉండాల్సిన అవసరం లేదు'
ఒక భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాల్సిన అవసరం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శనివారం స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. సీఎం కిరణ్ మాట్లాడిన తీరును ఆయన తప్పుపట్టారు. 23 జిల్లాలకు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కిరణ్ విస్మరించారని నారాయణ ఆరోపించారు. తెలంగాణలో సీమాంధ్రుల రక్షణకు తాము భరోసా ఇస్తామని ఆయన స్ఫష్టం చేశారు. ప్రస్తుతం సీమాంధ్రు వాసులను ఆంధ్రా గో బ్యాక్ అని ఎవరూ అనడం లేదని నారాయణ తెలిపారు.