cm kiran kumar reddy
-
ఏజెన్సీలో రూ.80 లక్షల బకాయిలు
సీతంపేట: ఏజెన్సీలోని ఆదివాసులకూ ఇళ్ల తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే సుమారు రూ.80 లక్షల బిల్లులు పెండింగులో ఉండిపోగా.. ఇప్పుడు మొత్తం ఇళ్లే రద్దవుతాయన్న ఆందోళన గిరిజనులను వేధిస్తోంది. మూడు దశల్లో ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల్లో 6,105 ఇళ్లు మంజూరు కాగా సుమారు 4 వేల ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. అలాగే రచ్చబండ 1, 2 దశల్లో, 171 జీవో ద్వారా మరో 1342 ఇళ్లు మంజూరు కాగా 361 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. యూనిట్ విలువ రూ. లక్షలోపే ఉండడం, నిర్మాణానికి అది ఎంతమాత్రం సరిపోకపోవడంతో గిరిజన లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. గత సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమంలో సీతంపేట వచ్చినపుడు కొండపైనున్న గ్రామాల్లో ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇళ్లు కట్టిం చి ఇస్తుందని, నిర్మాణ వ్య యా న్ని రూ. లక్షా పదివేలకు పెంచుతామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ధరలు పెరిగిన పరిస్థితుల్లో కొండలపై ఇల్లు నిర్మించాలంటే కనీసం రూ. 3 లక్షలు అవసరం. దీనికి తోడు బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణా లు మధ్యలోనే నిలిచిపోతున్నా యి. రద్దవుతాయన్న ఆందోళన మరోవైపు మంజూరైన ఇళ్లు రద్దు అవుతాయని ప్రచారం జరుగుతుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇళ్లు మంజూరై ఆర్థికపరమైన కారణాలతో నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే సుమారు 1500 ఇళ్లు రద్దయ్యే అవకాశముంది. ఈ విషయమై హౌసింగ్ జేఈ లాలాలజపతిరాయ్ వద్ద ప్రస్తావించగా బిల్లుల చెల్లింపు విషయమై ఇంతవరకు ఆదేశాలు రాలేదన్నారు. -
'కిరణ్ ఏఐసీసీ నాయకుడిగా వస్తారు'
హైదరాబాద్: సీఎం కిరణ్ సమైక్య ముసుగులో ఉన్న విభజనవాదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ధ్వజమెత్తారు. విభజన బిల్లును అసెంబ్లీలో గట్టెక్కించాలనే కిరణ్ ఎజెండా పూర్తయిందని తెలిపారు. విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజే పదవికి రాజీనామా చేసుంటే రాజ్యాంగ సంక్షోభం వచ్చేదని, విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేదని అన్నారు. ఓ ఢిల్లీ నేత డైరెక్షన్ మేరకు ప్రభుత్వాన్ని కిరణ్ కాపాడుకున్నారని వెల్లడించారు. అసెంబ్లీలో బిల్లు గట్టెక్కించేందుకే కిరణ్ ఇప్పటి వరకు పదవిలో ఉన్నారన్నారు. సమైక్యాంధ్ర డిమాండ్ చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఇతర సమైక్యవాదులు సీఎం ట్రాప్‌లో పడ్డారని అన్నారు. 2012లో హైకమాండ్ తెలంగాణకు ప్యాకేజీ ప్రకటించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిర్ణయిస్తే పదవిని కాపాడుకోవడానికి కిరణ్ అడ్డుపడ్డారని వెల్లడించారు. తెలంగాణకు ప్యాకేజీ ఇస్తే సీఎం పదవి కూడా ఆ ప్రాంతానికే ఇవ్వాల్సి వస్తుందని హైకమాండ్ స్పష్టం చేసింది. అప్పుడే 25 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పంపి ప్యాకేజీ వద్దు.. తెలంగాణ రాష్ట్రమే కావాలని హైకమాండ్‌కు చెప్పించారని వివరించారు. ఎన్నికల ముందు తెలంగాణ ఇవ్వాలని హైకమాండ్‌కు సూచించారని పేర్కొన్నారు. రెండు ప్రణాళికలతో కిరణ్ ముందుకెళుతున్నారని చెప్పారు. కొత్తపార్టీ పెట్టి ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేయడం, రెండోది కొత్త పార్టీ పెట్టకుండా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి ఆ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కావాలన్న ఆలోచనతో ఉన్నారని వెల్లడించారు. సీఎం ఎత్తుగడలు నాలాంటి ఒకరిద్దరు కాంగ్రెస్ పసిగట్టినప్పటికీ, ప్రజలు ఆ వాస్తవాలను అర్థం చేసుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజల్లో ఉన్న సమైక్య భావోద్వేగాన్ని కిరణ్ తన రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకున్నారని మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. కొంత లగేజీ సర్దుకోవాల్సిన అవసరమున్నందున కిరణ్ రాజీనామా కొంత సమయం పట్టవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. -
అది చారిత్రక తప్పిదమే: బొత్స
-
అది చారిత్రక తప్పిదమే: బొత్స
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ సహా ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా ఒరిగేదేం ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసినా ఆ ప్రభావం తెలంగాణ బిల్లుపై ఏమాత్రం ఉందని అన్నారు. రాష్ట్ర విభజనపై అంతా అయిపోవస్తున్న తరుణంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తే ప్రయోజనమేమిటని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకున్న వెంటనే రాజీనామా చేయకపోవడం చారిత్రక తప్పిదమని అభిప్రాయపడ్డారు. తిరుగుబాటు ఎంపీల బహిష్కరణకు విభజన బిల్లుకు సంబంధం లేదని బొత్స అన్నారు. విభజన ప్రక్రియపై ఎంపీల బహిష్కరణ ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. -
సీఎం ఫోజ్ కొట్టారు : భూమనా
-
సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ సబబే: దిగ్విజయ్
-
కేసీఆర్‌నే అడగండి: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకే ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై సంతకం చేయడం పార్టీ వ్యతిరేక చర్య అని అన్నారు. ఎంపీల బహిష్కరణ సబబే అని ఆయన సమర్థించారు. తాము పార్టీ నుంచి మాత్రమే బయటకు పంపామని, పార్లమెంట్ సభ్యులను బహిష్కరించడం స్పీకర్ పరిధిలోని అంశమని చెప్పారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం గురించి కేసీఆర్‌నే అడగాలని సూచించారు. ఢిల్లీలో కేసీఆర్ అన్నిపార్టీల నేతలను కలుస్తున్నారని తెలిపారు. -
కాంగ్రెస్‌లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా: ఏరాసు
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో మూర్ఖంగా వ్యహరిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. విభజన జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తాను కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. విభజన జరగకుండా సీఎం శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీమాంధ్రులకు కలిగే లాభనష్టాలు, సాగునీటి పంపకం, నిరుద్యోగం సమస్యల వంటి వాటి గురించి తెలంగాణ బిల్లులో ప్రస్తావించలేదని అన్నారు. రాష్ట్రం ముక్కలయితే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏరాసు పునరుద్ఘాటించారు. -
కిరణ్‌ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్
-
కిరణ్‌ను సీఎంగా గుర్తించడం లేదు: హరీష్
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు విమర్శించారు. పదవుల్లో కొనసాగే నైతిక అర్హత వారికిలేదని ఆయన అన్నారు. సీఎం, స్పీకర్ సీమాంధ్ర నేతల్లా నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుకు అసెంబ్లీలో తీవ్రమైన నిరసన తెలుపుతామని ఆయన హెచ్చరించారు. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా గుర్తించడం లేదన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంటే చంద్రబాబు అన్యాయమనడాన్ని హరీష్‌రావు తప్పుబట్టారు. విపక్షాల నిరసనల మధ్య రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. -
సెలక్ట్ కమిటీకి పంపి పెండింగ్‌లో పెడతారు!
టీ-బిల్లుపై సీమాంధ్ర మంత్రులతో సీఎం అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లులో అనేక లోపాలున్నాయని, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా దీనిపై అభ్యంతరాలు తెలిపే అవకాశాలున్నాయని, బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టి చివరకు సెలెక్టు కమిటీకి పంపి అక్కడితో పెండింగ్‌లో పెట్టే అవకాశాలు ఉన్నాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడినట్లు తెలిసింది. మంత్రులు మహీధర్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, అహ్మదుల్లా, పార్థసార థి, కాసు కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ తదితరులు శనివారం సాయంత్రం సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘రాష్ట్ర విభజనపై బీజేపీ ఇదివరకు సానుకూలంగా ఉన్నా ఇప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేలా సహకరించకపోవచ్చు. పైగా ఆపార్టీలోనూ ఇప్పుడు రెండు రకాల వాదనలూ గట్టిగానే ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డట్లు సమాచారం. బిల్లు పార్లమెంటుకు వచ్చాక సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోరదామని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. -
ఏమిటీ.. ఎప్పుడు.. ఎలా?
* రాజకీయ భవిష్యత్‌పై సీఎం మల్లగుల్లాలు * రాజీనామా, సొంతపార్టీ ఏర్పాటుపై సన్నిహిత నేతలతో సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఇప్పటివరకు పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటూ వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ సూచనల మేరకు రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిని రంగం నుంచి తప్పించి పార్టీ అధికారిక అభ్యర్ధులు గెలిచేలా చేసిన ఆయన.. తన రాజకీయ భవితవ్యంపై సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు. విభజన బిల్లు పార్లమెంట్ ముందుకు రాకముందే రాజీనామా చేయాలా? సమైక్యవాదంతో కొత్త పార్టీని స్థాపిస్తే ఎలా ఉంటుంది? వంటి అంశాల్లో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. కేంద్రం విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయాన్ని అనుసరించి తుదినిర్ణయాన్ని తీసుకోవాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. తాను సీఎంగా ఉండగా విభజన జరగదని చెప్పుకుంటూ వచ్చిన కిరణ్ ఆ ప్రక్రియ చివరి దశలో పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం కాంగ్రెస్‌లో నెలకొంది. టీ-బిల్లును 12న రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశముందంటున్నారు. అంతకు ఒకరోజు ముందు అంటే 11న రాజీనామా చేస్తే ఎలా ఉంటుందని సీఎం తన సన్నిహితులతో సంప్రదింపులు జరిపారు. అయితే రాజీనామా చేశాక ఏం చేయాలన్న దానిపై సన్నిహితుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో ఆయన ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు సమాచారం. త్వరలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నందున ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీలో రకరకాల చర్చ సాగుతోంది. -
కిరణ్‌లాంటి వారుంటారనే ఆర్టికల్ 3: పొన్నాల
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను అడ్డుకోడానికి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిలాంటి వారు ఉంటారని ముందుగా ఊహించిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపర్చారని రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం ఆయన పార్లమెంటు వెలుపల ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయ, రాజ్యాంగ ప్రక్రియలు ఉంటాయని, రాజకీయ ప్రక్రియలో ఆందోళనలు, దీక్షలు, అనుకూల, వ్యతిరేక అగ్రనేతలను మెప్పించడాలూ ఉంటాయన్నారు. అందులో భాగంగానే సీఎం కిరణ్ దీక్ష చేసినట్లుగా అభివర్ణించారు. రాజ్యాంగ ప్రక్రియలో తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పార్టీలను సంప్రదించాకే ఆ బిల్లును రూపొందించారని చెప్పారు. బిల్లుపై అసెంబ్లీ, శాసన మండలి అభిప్రాయాలను కేంద్రానికి పంపడం, మళ్లీ జీవోఎం సమీక్షించి పార్లమెంటులో పెట్టడం సాధారణ ప్రక్రియేనని తెలిపారు. అలాగే హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు వాటా అడగడం సహేతుకం కాదన్నారు. -
మోడీతో వెళితే కాలిపోతావ్
* చంద్రబాబు రాజకీయాలపై నారాయణ వ్యాఖ్య తిరుపతి, న్యూస్‌లైన్: బీజేపీతో దోస్తీ చేస్తే టీడీపీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. దీపాన్ని చూసి భ్రమపడి శలభం వెళితే ఏం జరుగుతుందో...మోడీకి ఆకర్షితుడైతే చంద్రబాబుకూ అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర సమస్యలపై ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణకుమార్రెడ్డి దీక్ష చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సమైక్యరాష్ట్రంలో సమస్యలు లేవా ? గత మూడేళ్లలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సమస్యలు కనపడలేదా ? అని నారాయణ ప్రశ్నించారు. ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేయడం సబబు కాదన్నారు. ప్రత్యేక తెలంగాణకు సీపీఐ మద్దతిస్తున్నా.. రాయలసీమ సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాగా, పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్లే బిల్లును అడ్డుకునే అవకాశం ఉందంటూ ఆ పార్టీపై బీజేపీ నెపం మోపి చేతులెత్తేసే పరి స్థితి కనిపిస్తోందని నారాయణ విమర్శించారు. -
'సీఎం డ్యాన్స్ చేసినా అభ్యంతరం లేదు'
సిద్దిపేట: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు వాసిగా, సీమాంధ్ర బిడ్డగా దీక్షలు చేసినా, డ్యాన్స్‌లు చేసినా తమకు అభ్యంతరం లేదని, హైదరాబాద్ బిడ్డనని రాజధానికున్న బ్రాండ్ ఇమేజ్ను తన పిచ్చి చేష్టలతో డ్యామేజ్ చేయడం తగదని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్‌రావు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఆయన సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కిరణ్ సీఎం పదవి హుందాతనాన్ని మంటగలుపుతూ, విలువలను నాశనం చేస్తూ అతితెలివి ప్రదర్శిస్తున్నాడని ఆరోపించారు. బుధవారం తెలంగాణ మంత్రులను, ప్రజాప్రతినిధులను తోసుకుంటూ వెళ్లడమే కాకుండా వారిపై లాఠీచార్జి చేయించడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆహంకారానికి ఇది నిదర్శనమన్నారు. సొంత పార్టీ మంత్రుల పట్ల అనుచితంగా వ్యవహరించిన కిరణ్‌కుమార్‌రెడ్డికి కలిసుండాలని కోరే హక్కు లేదన్నారు. ఆయన వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం తెలంగాణలోని పది జిల్లాల్లో టీఆర్ఎస్ పక్షాన నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు తెలంగాణ అంతటా కొనసాగుతాయన్నారు. మంత్రుల పట్ల వ్యవహరించిన తీరుపై సీఎం భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో స్పీకర్‌గా ఉన్న కిరణ్‌ను మంచివాడు కాదని పక్షపాతి అని విమర్శించిన చంద్రబాబు నేడు కిరణ్‌ను నమ్ముతున్నాననడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో తెలంగాణ టీడీపీ ప్రజాప్రతినిధులు అనాధలుగా మిగిలి పోయారన్నారు. తెలంగాణకు తొలి ఒటుగా చెబుతున్న ఎంపీ నామా నాగేశ్వరరావుది సీమాంధ్ర డీఎన్ఎగా అభివర్ణించారు. -
ఫర్పెక్ట్ ఫ్లాన్... ఎక్సెలెంట్ డైరెక్షన్
-
‘ముఖ్యమంత్రివి డ్రామాలు’
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ విమర్శించారు. శనివారం ఆయన పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన కు అనుకూలంగా సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. విభజన నిర్ణయాన్ని కేం ద్రం ప్రకటించినప్పుడే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి, రాజ కీయ సంక్షోభం సృష్టిస్తే... పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదన్నారు. ఇప్పు డు తాను సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్లో విభజన బిల్లును అడ్డుకునే సత్తా ఒక్క టీడీపీకే ఉందన్నారు. జిల్లాలో గణతంత్ర దినోత్సవం నాడు ఏసీబీ కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు ప్రశంసాపత్రాలు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం నైజమన్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు కెఎ నాయుడు, డీవీజీ శంకరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మన్యాల కృష్ణ, ఎస్ఎన్ఎం రాజు, తదితరులు ఉన్నారు. -
నియంతలా వ్యవహరించిన కిరణ్: గండ్ర
వరంగల్: విభజన బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరు నియంతను తలపించిందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఫిబ్రవరి 20లోగా ఆమోదం పొందుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సాధారణ ఎన్నికలు తెలంగాణలోనే జరుగుతాయని అన్నారు. సోమవారం తామంతా ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజలను మరింత రెచ్చగొట్టడానికే కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలసి కుట్ర చేస్తున్నారని అంతకుముందు ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయాలను మాత్రమే చెప్పాలి తప్ప తిరస్కరించాలనుకోవడం సరికాదన్నారు. -
తిరస్క‘రణం’
సాక్షి, మంచిర్యాల : జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు మరోసారి భగ్గుమన్నారు. ముందు నుంచి ‘సమైక్య’ వాదానికే కట్టుబడి ఉన్నానని చెప్పుకొస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై వ్యవహరించిన తీరును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్అండ్బీ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఖానాపూర్ బస్టాండ్ ఎదురుగా ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యు) రాష్ట్ర కమిటీ పిలువు మేరకు నాయకులు కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో పీడీఎస్యు నాయకులు, కార్యకర్తలు కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. లక్సెట్టిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పీడీఎస్‌యూ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై జేఏసీ, టీఆర్ఎస్ నాయకులు సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ముందడుగు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు మరో ముందడుగు పడింది. ఎట్టకేలకు తెలంగాణ ముసాయిదా బిల్లుపై గురువారంతో అసెంబ్లీలో చర్చ ముగిసింది. బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్ మనోహర్ ప్రకటించారు. రాష్ట్రపతికి వెళ్లిన తర్వాత వచ్చే నెల మొదటి వారంలో బిల్లు కేబినెట్‌కు, రెండో వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పుడు జిల్లావాసుల దృష్టి హస్తినపై పడింది. తెలంగాణపై పార్లమెంటులో ఎలాంటి తీర్పు వస్తుందోనని తెలంగాణవాదుల్లో ఉత్కంఠత నెలకొంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బిల్లు తిరస్కరణకు గురైనంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మానదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం తీర్మానం విలువ లేనిది.. ముఖ్యమంత్రి సమైక్యరాష్ట్రం కోసం శాసనసభలో చేసిన తీర్మానం ఏమాత్రం విలువ లేనిది. తెలంగాణ బాల్ ప్రస్తుతం పార్లమెంట్ కోర్టులో ఉంది. 86 మంది ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనగా 9072 సవరణలు వచ్చాయి. తెలంగాణపై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించారు. టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ తెలంగాణకు అనుకూలంగా చర్చలో పాల్గొన్నాయి. - గుండా మల్లేశ్, సీపీఐ శాసనసభా పక్షనేత సీమాంధ్ర సీఎం.. స్పీకర్ కుట్ర.. తెలంగాణ బిల్లుపై 42 రోజులపాటు అసెంబ్లీలో చర్చ జరిగింది. బిల్లుపై ఎమ్మెల్యేలు కొందరు ప్రసంగంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇంకొందరు లిఖిత పూర్వకంగా అందజేశారు. బిల్లు తిరస్కరించినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మానదు. - నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే, చెన్నూరు. రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరు.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో బిల్లు తిరస్కరించామని పేర్కొనడం సిగ్గు చేటు. దీనిపై తెలంగాణ ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరుగకపోయిన ఆర్టికల్ -3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుంది. ఇది తెలంగాణ ప్రాంత విజయం. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి కేంద్రం మరో 15 రోజుల్లో ఆమోదిస్తుంది. - జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్. తెలంగాణవాదులు ఆందోళన చెందవద్దు సీమాంధ్రనేతలు, సీఎం కిరణ్ చేసే కుట్రలకు తెలంగాణవాదులు బయపడాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో పునఃనిర్మాణంపై ఓటింగ్ జరగలేదని, సీఎం రాసిన లేఖపై ఓటింగ్ జరిగిందన్నారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినపుడు మైనార్టీలుగా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ను విడదీశారని, అదే తరహాలో మెజార్టీ ప్రజాప్రతినిధులు సీమాంధ్ర నాయకులు ఉన్నా పార్లమెంట్లో టీ బిల్లు ఆమోదం పొందుతుంది. - లోక భూమారెడ్డి, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు పార్లమెంటులో ఆమోదం పొందుతుంది తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుంది. అసెంబ్లీలో చర్చ, చివరి అభిప్రాయ ఘట్టం ముగిసింది. ఆసెంబ్లీలో ఓటింగ్ జరగలేదు. బిల్లుపై అసెంబ్లీలోఎవరు అవును, కాదన్నా ఆగే ప్రసక్తి లేదు. - ఆత్రం సక్కు, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్ తెలంగాణ వస్తుందని సీఎంకు తెలుసు.. టీ-బిల్లుపై అసెంబ్లీలో చర్చించి అభిప్రాయాలు పంపమని రాష్ట్రపతి చెబితే.. సీఎం కిరణ్ ఆ బిల్లును తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని సీఎంకు తెలుసు అయినా.. సీమాంధ్రులను మభ్యపెట్టి మోసం చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. - గడ్డం అరవిందరెడ్డి, ఎమ్మెల్యే, మంచిర్యాల -
విభజనకు దారి చూపిన బాబు, కిరణ్: భూమన
-
టి.బిల్లు పెడితే రాజకీయ సన్యాసం-కిరణ్
-
రాజకీయాల నుంచి తప్పుకుంటా: కిరణ్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలనల వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి పంపిన బిల్లు ఉన్నది ఉన్నట్టు పార్లమెంట్లో ప్రవేశపెడితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. బిల్లుపై హోంశాఖ రాష్ట్రపతిని మోసం చేసినట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టప్రతి నుంచి వచ్చే బిల్లులో లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత హోంశాఖపై ఉందన్నారు. బిల్లులోని లోపాలను సరిచేయమని కోరడం లేదు బిల్లును తిరస్కరిస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేయమని కోరుతున్నామని వివరించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏకాభిప్రాయంతోనే గతంలో రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. విభజనకు కారణాలు, లక్ష్యాలు ఉన్న విభజన బిల్లు కావాలన్నారు. ఇదే బిల్లు పార్లమెంటులో పెట్టాలని సవాల్ చేశారు. ఇదే బిల్లు పార్లమెంటుకు పంపితే అస్సలు అడ్మిట్ కాదని చెప్పారు. ఒకవేళ అది జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సభకు అధికారం లేనప్పుడు ఓటింగ్‌పై నాయకులు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బిల్లుపై మళ్లీ పొడిగింపు అడగడంలో తప్పులేదన్నారు. బిల్లపై క్లాజులవారీగా చర్చ జరిపి తిరస్కరిస్తామన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో నిలిచిన రెబల్ అభ్యర్థులను ఉపసంహరించుకోమని చెప్పామని సీఎం తెలిపారు. -
కన్నీటి వీడ్కోలు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ బిల్లు వెనక్కి పంపిస్తామని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యల కు మనస్తాపం చెంది ఒంటిపై కిరోసి న్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న రాజ్‌కుమార్(30) అంతిమయాత్ర సోమవారం బెల్లంపల్లిలో జరిగింది. పట్టణంలోని బాబుక్యాంప్బస్తీలోని రాజ్‌కుమార్ ఇంటికి తెలంగాణవాదులు, ఆర్యవైశ్యులు తరలివచ్చారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి సీహెచ్ శంకర్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు మేడి పున్నం చంద్రు, టీ-జేఏసీ మహి ళా విభాగం బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షురాలు సువర్ణ తదితరులు రాజ్‌కుమార్ భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రాజ్‌కుమార్ భార్య పద్మ, కుమారుడు హరికృష్ణను ఓదార్చారు. పలువురి నివాళి మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందిన రాజ్‌కుమార్ భౌతికకాయాన్ని రాత్రి ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో అంతిమయాత్ర ప్రారంభమైంది. బాబుక్యాంప్బస్తీ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా సింగరేణి కళావేదిక వద్దకు చేరుకోగానే తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురిజాల రవీందర్రావు, టీ-జేఏసీ తూర్పు జిల్లా చైర్మన్ గోనె శ్యాంసుందర్‌రావు, మందమర్రి టీ-జేఏసీ కో-కన్వీనర్ హెచ్.రవీందర్, టీ-జేఏసీ తూర్పు జిల్లా అధికార ప్రతినిధి గజెల్లి వెంకటయ్య భౌతికకాయంపై పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ప్రధాన రహదారి, కాంటా చౌరస్తా, పాతబస్టాండ్ ఏరియా మీదుగా షంషీర్నగర్లోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. వందలాది మంది తెలంగాణవాదుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. రాజ్‌కుమార్ అమర్ రహే.. తెలంగాణ సాధిస్తాం.. అమరుల ఆశయాలు కొనసాగిస్తాం.. జై తెలంగాణ.. ముఖ్యమంత్రి కిరణ్ డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ అంతిమయాత్రలో తెలంగాణవాదులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. బంద్ సంపూర్ణం రాజ్‌కుమార్ మృతికి సంతాపంగా టీ-జేఏసీ, ఆర్యవైశ్య సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బెల్లంపల్లిలో సోమవారం బంద్ విజయవంతమైంది. పట్టణంలోని బజార్ ఏరియా, కాల్టెక్స్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లోని కిరాణ షాపులు, హోటళ్లు, టేలాలు బంద్ ఉన్నాయి. ఆటోలు, జీపులు, బస్సుల రాకపోకలు నిలిచాయి. పెట్రోల్ బంక్‌లు మూసి ఉంచారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పని చేయలేదు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన తెలిపారు. సినిమా థియేటర్లలో ఉదయం పూట ప్రదర్శనలను నిలిపి ఉంచారు. వ్యాపార, వాణిజ్యవర్గాలు సామూహికంగా దుకాణాలు మూసి ఉంచడంతో బజార్ ఏరియా నిర్మానుష్యంగా మారింది. ఉదయం పూట ఆటోలు నడవడంతో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. కాంటా చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఓటింగ్ పెట్టాలనే సీఎం నోటీసిచ్చారు: బొత్స
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని రాష్ట్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. విభజన బిల్లుపై ఓటింగ్ పెట్టాలనేదే సీఎం కిరణ్ ఇచ్చిన తిరస్కార నోటీసు సారాంశమని ఆయన వెల్లడించారు. కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన విభజన బిల్లు తిరస్కార నోటీసును అనుమతించొద్దని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉన్నప్పటికీ తమను సంప్రదించకుండా కిరణ్ నోటీసు ఇచ్చారని, అలాంటప్పుడు అది ప్రభుత్వ నోటీసు ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎం ఇచ్చిన నోటీసును ఆమోదించాలని సీమాంధ్ర ప్రతినిధులు కోరుతున్నారు. సీఎం అన్నివిధాలా ఆలోచించే తిరస్కార నోటీసుయిచ్చారని వెనకేసుకొస్తున్నారు. -
కిరణ్ అవమానించారు: రాజనర్సింహ
-
కిరణ్ అవమానించారు: రాజనర్సింహ
హైదరాబాద్: అసెంబ్లీలో విభజన బిల్లును తిరస్కరిస్తూ నోటీసు ఇచ్చే అంశంలో తెలంగాణ మంత్రులను సంప్రదించలేదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. ఇది తమను అవమానించడమేనని అన్నారు. సీఎం కిరణ్ చర్య రెచ్చగొట్టేలా ఉందన్నారు. సీఎంపై తాము విశ్వాసం కోల్పోయన్నారు. ముఖ్యమంత్రిది కుట్రపూరిత స్వభావమన్నారు. సీఎం తీరును వ్యతిరేకిస్తూ తమ మంత్రులు అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారని తెలిపారు. తమ విశ్వాసాన్ని కోల్పోయిన సీఎం కిరణ్ తక్షణమే రాజీనామా చేయాలని రాజనర్సింహ డిమాండ్ చేశారు. -
సీఎం నోటీసు చెల్లదు: షబ్బీర్ అలీ
హైదరాబాద్: రాష్ట్ర విభజనను సీఎం కిరణ్ అడ్డుకోలేరని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. పొలిటికల్ మైలేజీ, ప్రజలను గందరగోళ పర్చడానికే సీఎం కిరణ్ హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలెవరూ అయోమయానికి గురికావడం లేదని, విభజన ప్రక్రియ సాఫీగా జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విభజన బిల్లుపై 77వ నిబంధన కింద సీఎం కిరణ్ ఇచ్చిన తిరస్కార నోటీసును స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతించరని చెప్పారు. సమైక్య తీర్మానం చేయాలని, విభజన బిల్లును రాష్ట్రపతికి వెనక్కి పంపాలని 77, 78 నిబంధనల కింద నోటీసులిచ్చినా స్పీకర్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఈ రెండు నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ బిల్లులకే వర్తిస్తాయని షబ్బీర్ అలీ అన్నారు. రాష్ట్రపతి పంపిన విభజన బిల్లుకు ఇది వర్తించదన్నారు. గతంలో స్పీకర్‌గా ఉన్న సీఎంకు వీటిపై అవగాహన ఉందని గుర్తు చేశారు. -
సిఎంకు తెలియకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందా..?
-
సిగ్గుపడే పరిస్థితి తెచ్చారు..
సీఎం కిరణ్, చంద్రబాబులపై కోమటిరెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఆదర్శంగా నిలవాల్సిన సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలంగాణ విషయంలో తమ వైఖరితో నాయకులమని చెప్పుకోవటానికే సిగ్గుపడే పరిస్థితి తెచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ముందు చెప్పిన మాటను ఇప్పుడు మార్చి గందరగోళం సృష్టిస్తున్నార ని విమర్శించారు. బిల్లుపై చర్చలో గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ‘‘సీఎం సభలో మాట్లాడిన విషయాల్లో ఎన్నో తప్పులున్నారుు. ఆయన పదవికి రాజీనామా చేసి మాట్లాడితే బాగుంటుంది. చిత్తూరుకు మంచినీళ్ల కోసం రూ. వేల కోట్లు ఇచ్చిన ఆయనకు నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య కనిపించలేదా? యువకుల బలిదానాలను టీడీపీ జోక్‌గా తీసుకుంటోంది. బాబు నాయకత్వంలో కొనసాగుతున్నందుకు ఆ పార్టీ తెలంగాణ నేతలు సిగ్గుపడాలి’’ అని అన్నారు. -
కిరణ్, బాబు ముఖం ఎందుకు చాటేస్తున్నారు?
బీఏసీకి డుమ్మాపై శోభానాగిరెడ్డి సూటిప్రశ్న సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ బీఏసీ సమావేశానికి రాకుండా ఎందుకు ముఖం చాటేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందా?, లేదా? అనేదానికి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహచర ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, కాపు రామచంద్రారెడ్డి, కె.శ్రీనివాసులుతో కలిసి ఆమె గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘‘బిల్లుపై ఓటింగ్ విషయమై శాసనసభలో అడిగితే బీఏసీలో చెప్పాం కదా అని స్పీకర్ అంటారు. ఇదే విషయమై బీఏసీలో అడిగితే జవాబుండదు. గట్టిగా నిలదీస్తే ప్రభుత్వం నుంచి వాయిదా తీర్మానం ఇస్తే చేస్తామంటారు. అయితే ప్రభుత్వం తీర్మానం ఇస్తుందా? లేదా? అనేది తనకు సమాచారం లేదంటారు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో సీఎం చెప్పరు. బీఏసీ సమావేశానికి ముఖం చాటేసి మోసపూరిత విధానాన్ని అవలంబిస్తున్నారు. చంద్రబాబు కూడా బీఏసీ సమావేశానికి ముఖం చాటేసి పార్టీకి చెందిన ఇరు ప్రాంత నేతలను పంపి రెండు వాదనలు వినిపిస్తున్నారు’’ అని మండిపడ్డారు. రెండు పార్టీలూ రెండు రకాల అభిప్రాయాలు చెబుతూ... సిగ్గులేకుండా తమను విమర్శిస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు: విభజన బిల్లుపై తమ పార్టీ చర్చకు వ్యతిరేకం కాదని, అయితే దానిపై ముందు ఓటింగ్ నిర్వహించాకే చేపట్టాలని మొదట్నుంచీ డిమాండ్ చేస్తున్నామని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు మీడియాపాయింట్లో వేర్వేరుగా మాట్లాడారు. బిల్లుపై కాంగ్రెస్ ఆలోచనలకనుగుణంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. సీఎం కిరణ్ పదవి కాపాడుకునేందుకు నాటకాలాడుతున్నారన్నారు. చర్చలో టీడీపీ తీరుచూస్తుంటే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతోందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ముందుగా బాబు వైఖరేంటో వెల్లడించాక మాట్లాడాలని డిమాండ్ చేశారు. . -
'CWC సమావేశంలో గంగిరెద్దులా సీఎం తలూపారు'
-
కిరణ్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీ-ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో బుధవారం సాయంత్రం గందరగోళం రేగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం మొదలు పెట్టగానే టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. విభజన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని సీఎం ప్రకటింగానే సభలో గందరగోళం మొదలయింది. చరిత్రను వక్రీకరిస్తూన్నారని ఆరోపిస్తూ సీఎం ప్రసంగానికి టీ-ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే సభా నాయకుడి హోదాలో బిల్లును వ్యతిరేకిస్తున్నా లేక వ్యక్తిగతంగా చెప్పారా అనేది స్పష్టం చేయాలని జానారెడ్డి కోరారు. మరోవైపు టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడం సమంజసం కాదంటూ స్పీకర్ నాదండ్ల మనోహర్ నచ్చచెప్పినా వారు పట్టువీడలేదు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. జానారెడ్డి మరోసారి కలుగ జేసుకోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. తర్వాత సీఎం ప్రసంగం కొనసాగించారు. -
అభివృద్ధిని నీరుగారుస్తున్న కిరణ్: హరీష్‌రావు
ఖైరతాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదని తెలిసే సీఎం కిరణ్ తెలంగాణ జిల్లాల్లో అభివృద్దిని నీరుగారుస్తున్నారని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 2014 డైరీ ఆవిష్కరణకి ముఖ్యఅతిధిగా విచ్చేసి డైరీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 2010 నుంచి తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధి పథకాలు అమలుకు నోచుకోలేదని గుర్తుచేశారు. సీమాధ్రులకు 7 గంటల కరెంటు ఇస్తే, తెలంగాణ జిల్లాలకు కేవలం 5 గంటలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. కిరణ్, చంద్రబాబు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరన్నారు. అంతకుముందు ధూంధాం పాటలతో కళాకారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సమ్మయ్య, హౌసింగ్ సీజీఎం ఆర్.జగదీష్‌బాబు, జీఎం. రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.మహేందర్, రవీందర్‌రెడ్డి, ఎస్.మోహన్, వెంకట్రాం రెడ్డి, టి.లింగయ్య గౌడ్, ఆర్.సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ డ్రామా షురూ!
-
ఢిల్లీ డ్రామా షురూ!
* కిరణ్ నేతృత్వంలో ‘కొత్త పార్టీ’ * అంతా అధిష్టానం ఆదేశానుసారమే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరో డ్రామాకు శ్రీకారం చుట్టింది. అంతర్గతంగా రాష్ట్ర విభజనకు సహకరిస్తూ, పైకి మాత్రం సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఈ కొత్త నాటకానికి తెర లేపుతోంది. తన ఆదేశాలను తు.చ. తప్పకపాటిస్తూ, రాష్ట్ర విభజనను చివరి అంకంవరకు తీసుకొచ్చిన కిరణ్‌ను ఇప్పుడు సమైక్య నినాదం ముసుగులో జనంలోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సమైక్యం పేరుతో కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. సీమాంధ్ర జిల్లాల్లో కొద్ది రోజులుగా దర్శనమిస్తున్న ప్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులన్నీ అధిష్టానం మొదలుపెట్టిన కొత్త డ్రామాలో అంకమేనన్న విషయం మరో నాలుగు రోజుల్లో ప్రజల ముందు బహిర్గతం కానుంది. త్వరలో ముసుగును తొలగించి కొత్త నాటకంలో తన పాత్రలోకి ప్రవేశించేందుకు కిరణ్‌కు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఆయన సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చను సాఫీగా ముగించి, బిల్లు రాష్ట్రపతికి చేరేలా మార్గాన్ని సుగమం చేశాక కిరణ్ ద్వారా కొత్త పార్టీకి అంకురార్పణ చేయించడమే కొత్త నాటకంలో ప్రధానాంశంగా తేలుతోంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలే అందుకు వేదికగా మారనున్నాయి. శుక్రవారం నుంచి, అసెంబ్లీ సమావేశాలు ముగిసే 23వ తేదీ దాకా సమైక్య ప్రచారాన్ని కిరణ్ ముమ్మరం చేస్తారు. ఆ వెంటనే పార్టీ ప్రకటన వంటి పరిణామాలూ ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఉన్నాయని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎనిమిది రోజులూ సభ లోపల, బయట కిరణ్ సమైక్యవాదాన్ని వినిపించడంతో పాటు అందుకు పెద్ద ఎత్తున ప్రచారం లభించేలా రంగం చేశారు. ఆది నుంచీ... విభజన కీలక దశలకు ముందు కిరణ్‌కు వాటినే ప్రస్తావిస్తూ, అవి సాధ్యం కానే కావని చెప్పడం, ఆ తరవాత సరిగ్గా అదే దిశగా కేంద్రం చర్యలను పూర్తి చేయడం జరిగిపోతూ వచ్చాయుని గుర్తు చేసుకుంటున్నారు. అధిష్టానం ఆదేశాలను శిరసావహించి వచ్చినందునే కిరణ్ కోర్‌కమిటీలో తానేం మాట్లాడానో మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా, సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపించినట్లుగా బయుటకు మాత్రం లీకులు ఇప్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై తెలంగాణపై ఏకగ్రీవ తీర్మానం చేయడంతోపాటు యూపీఏ భాగస్వామ్యపక్షాల సమావేశాన్నీ నిర్వహించి వారి ఆమోదాన్నీ తీసుకుంది. ఈరెండు సమావేశాలు గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే సమైక్యవాదంపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడిగా కిరణ్‌కువూర్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి ఉండేవారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత పది రోజుల పాటు ఏమీ మాట్లాడకుండా సీఎం వనం దాల్చారు. పెద్ద ఎత్తున ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఆ తరువాత మీడియా సమావేశం పెట్టి నింపాదిగా సమస్యలు ఏకరవు పెడుతూ విభజన ఎలా చేస్తారంటూ అధిష్టానాన్ని ప్రశ్నించినట్లుగా మాట్లాడారు. తాను చెప్పే సమస్యలను తీర్చాకనే విభజన చేయాలన్నారు. అది పార్టీ నిర్ణయమే తప్ప కేంద్రం నిర్ణయం కాదని, కేంద్రం రాష్ట్ర విభజనపై అంత త్వరగా నిర్ణయం తీసుకోలేదన్నారు. విభజనకు కారణాలు చూపే పీఠికను రూపొందించడమే కష్టమని చెబుతూ వచ్చారు. తీరా కేంద్ర హోం శాఖ తెలంగాణ నోట్‌ను రూపొందించడంతోపాటు దాన్ని టేబుల్ ఐటెమ్‌గా కేబినెట్ ముందుకు తీసుకురావడం, ఎలాంటి చర్చకు తావులేకుండానే ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అయినా కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి స్పందన లేకుండా వారం గడిచాక నోరు విప్పారు. మరో వారంలో: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈనెల 23వ తేదీతో ముగియనుంది. ఆరోజుతో అసెంబ్లీలో బిల్లుపై అభిప్రాయ సేకరణ పూర్తిచేసి తిరిగి రాష్ట్రపతికి పంపాలి. ఈతరుణంలో సమైక్యం పేరిట కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రజల్లోకి పంపే సన్నాహాల వెనుక రాజకీయంగా బలమైన కారణాలే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమైక్య నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి దూసుకుపోతుండడంతో అటు కాంగ్రెస్, టీడీపీ రెండూ కూడబలుక్కొని ఈ కొత్త నాటకానికి తెర తీసినట్టు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని ఇప్పటివరకు దేశంలోని అన్ని కాంగ్రెసేతర జాతీయ పార్టీల నేతలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలసి విన్నవించారు. ఈ దశలోనే సీఎం కిరణ్‌తో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టించేందుకు అసెంబ్లీ వేదికగా సమైక్య ప్రచారం వినిపించేలా కార్యాచరణ రూపొందినట్టు తెలుస్తోంది. ఈ కొత్త పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించిన సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ చూస్తున్నట్లు చెబుతున్నారు. వివిధ బ్యాంకులకు సంబంధించి దాదాపు రూ.30 వేల కోట్ల మేర అక్రమాలు చేసినట్లు ఆరోపణలున్నప్పటికీ ఆ ఎంపీపై అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం వెనుక రాష్ట్ర విభజనకు ఆయన అందిస్తున్న సహకారమే కారణమని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తన ఆదేశాలను తూ.చ తప్పక పాటిస్తున్నందునే చివరి నిముషం వరకు సీఎం సీట్లో కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్టీ అధిష్టానం కొనసాగనిస్తోందని, అలా కాకపోతే ఈపాటికే ఆయన్ను మార్చేసేవారేనని పేర్కొంటున్నారు. తనకు వ్యతిరేకంగా ఉంటే ఢిల్లీలో విమానం ఎక్కి హైదరాబాద్‌లో దిగేలోపే సీఎంలను మార్చే సంస్కృతి ఉన్న కాంగ్రెస్ కిరణ్ పట్ల ఇంత ఉదారతతో ఉందంటే అందుకు కారణం ఆయన విభజనకు పూర్తి సహకారం అందించడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సమైక్యం కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను ఎలా కట్టడి చేయాలో అంతుబట్టక కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వారా కొత్త ముసుగులో త్వరలోనే తెరమీదకు రావడానికి సర్వం సిద్ధమైంది. సీమాంధ్రులను మభ్యపెట్టి విభజనపై అధిష్టానానికి ఆది నుంచి కిరణ్ పూర్తి సహకారాన్ని అందించడమే కాకుండా, సమైక్య ముసుగులో సీవూంధ్ర పార్టీ ఎమ్మెల్యేలను భ్రమల్లో ఉంచడం ద్వారా ఎక్కడా అడ్డంకులు లేకుండా చేయడం తెలిసిందే. బిల్లును అడ్డుకుంటానంటూ చెబుతూనే, దానిపై చర్చను చివరి దశ దాకా తీసుకెళ్లడమే గాక, సహచర ఎమ్మెల్యేల నుంచి కూడా అందుకు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆయన నైజం అర్థమయ్యాక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కూడా కంగుతిన్నారు. కిరణ్ సమైక్య నినాదం వెనుక రాష్ట్ర విభజనకు సహకారం, కొత్త పార్టీ వ్యూహం దాగున్నాయని అర్థమై, తాము పూర్తిగా మోసపోయామంటూ ఆవేదనకు గురవుతున్నారు. రాష్ట్ర సమైక్యతకు కిరణ్ అడుగడుగునా తూట్లు పొడిచిన వైనాన్ని వారు వరుసగా గుర్తుచేసుకుంటున్నారు. విభజనపై ప్రతి అడుగూ కిరణ్‌కు ముందే తెలుసునని, అయినా అధిష్టానంతో కుమ్మక్కై వ్యవహారాన్ని ముందుకు నడిపించారని నిర్ధారణకొస్తున్నారు. గత ఏడాది జనవరిలో జైపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్లీనరీలోనే అధిష్టానం తెలంగాణపై నిర్ణయుం తీసుకొని కిరణ్‌కు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు తెలిపింది. ఈ విషయాన్ని బొత్సే పలుమార్లు స్పష్టంగా ప్రకటించారు. ఆ సమావేశంలో అధిష్టానం ఆదేశాలకు కిర ణ్ తలూపి, పార్టీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన రంగాన్ని సిద్ధంచేశారు. తెలంగాణపై నిర్ణయం అధికారికంగా ప్రకటించే ముందు అధిష్టానం పార్టీ కోర్‌కమిటీ సవూవేశానికి సీఎంను పిలిచి చర్చించింది. ఈ సమావేశంలో తాను రూపొందించిన రోడ్ మ్యాప్‌ను అధిష్టానానికి కిరణ్ అందించారు. అప్పుడే అధిష్టానం కూడా రాష్ట్ర విభజనకు సంబంధించి తన ముందున్న రోడ్‌వ్యూప్‌ను కిరణ్‌కు ఇచ్చి, దాని అవులు బాధ్యతను ఆయునపైనే పెట్టినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.. అందుకే విభజనకు సంబంధించి కేంద్రం వేసే ప్రతి అడుగు కిరణ్‌కు ముందే తెలుసునని పేర్కొంటున్నాయి. అడుగడుగునా బాబు సహకారం మరోపక్క రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. సభా నాయుకుడిగా సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబునాయుడు ఇద్దరూ పరస్పర సహకారంతో రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయుం వెలువడిన వెంటనే చంద్రబాబు దాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటన చేయడంతోపాటు సీమాంధ్రలో కొత్త రాజధాని కోసం నాలుగు లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని కూడా కోరారు. ఆ తరువాత రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకొనే ప్రతి కీలక దశకు ముందు ఆయన ఢిల్లీలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ కాంగ్రెస్ పెద్దలకు సహకారం అందించేలా వ్యవహరించారు. కేబినెట్ ఆమోదం ముందురోజు ఆయన ఢిల్లీలోనే పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఢిల్లీలో సమన్యాయం పేరిట చంద్రబాబు దీక్షకు దిగిన రోజునే కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఆ తరువాత మరో సందర్భంలో బాబు ఢిల్లీయూత్ర సమయంలోనే మంతత్రుల బృందం తొలి భేటీ జరిగింది. అటు కిరణ్, ఇటు చంద్రబాబులు ఇద్దరూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను అనుసరించి విభజన ను ముందుకు నడిపించుకుంటూ తీసుకువచ్చారు. తనపై ఎమ్మార్, ఐఎంజీ భారత్ భూముల కుంభకోణంతోపాటు మద్యం కేసులు ఇతరత్రా అనేక అవినీతిపై విచారణ జరిపించకుండా ఉండేందుకు చంద్రబాబు ప్రతి అడుగులోనూ కాంగ్రెస్‌కు సహకరించారన్న విషయంలో అనేక విమర్శలొచ్చాయి. చిత్తశుద్ధే ఉండి ఉంటే... విభజనను వ్యతిరేకించే వ్యక్తే అయ్యుంటే కేబినెట్ నిర్ణయుం తరువాతైనా కిరణ్ వెంటనే రాజీనామా చేసి ఉండేవారు. తద్వారా సంక్షోభం ఏర్పడి కేంద్రం విభజన నిర్ణయం నుంచి వెనకడుగు వేసేదని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. కానీ ఆయన అలా చేయకపోగా, సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డా వారి ఆవేశంపై నీళ్లు చల్లారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాల్సి ఉంటుంది కనుక రాజీనామాలు వద్దంటూ నిలువరించారు. మరోపక్క సీమాంధ్రలో రెండు నెలలకుపైగా ఉధృతంగా సాగిన ఉద్యోగుల సమ్మెను సైతం భయుపెట్టి, బెదిరించి అర్ధంతరంగా ఉపసంహరించేలా చేసి విభజన ప్రక్రియకు ఆటంకం లేకుండా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడేలా చేశారు. ఇక రాష్ట్ర విభజనపై కేంద్రం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావలసిన సమాచారాన్ని మొత్తం ఆగమేఘాలపై అందేలా కిరణ్ సహకరించారు. రాష్ట్ర విభజనపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించే అధికారం తమకు లేదని, కేవలం విభజన సమస్యల పరిష్కారం మాత్రమే తమ బాధ్యత అని మంత్రుల బృందం ప్రకటించగా అదే బృందం ముందుకు వెళ్లి సీఎం తన అభిప్రాయాలు వినిపించారు. సమైక్యమన్న వాదనపైనే సీఎంకు చిత్తశుద్ధి ఉండి ఉంటే జీఓఎం ముందుకు వెళ్లే వారే కాదు. రాష్ట్రపతి నుంచి విభజన బిల్లు వచ్చే సమయానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేలా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తేదీలను ఖరారు చేయించారు. రాష్ట్ర విభజన బిల్లు రాకముందే సమైక్య తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పదేపదే విజ్ఞప్తి చేసినా కిరణ్ వినిపించుకోలేదు. సమైక్య తీర్మానం చేస్తే రేపటి రోజున పార్లమెంట్లో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ రకంగా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నిస్తూ అడ్డుకునే ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో సమైక్య తీర్మానం ప్రతిపాదనపైన కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూవచ్చారు. ఇలావుండగా, బిల్లు అసెంబ్లీకి వచ్చే సమయానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ హైదరాబాద్‌కు వచ్చి అది సభకు వెళ్లేలా ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. బిల్లు తన చేతికి వచ్చిన 17 గంటల్లోనే సీఎం ఆగమేఘాలపై అసెంబ్లీకి పంపారు. మరోవైపు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టించడం, చర్చను చేపట్టించడం అంతా నాటకీయు రీతిలో ముందుకు నడిపించారు. చర్చ ప్రారంభమైందా లేదా అన్న దానిపై మూడు రోజుల పాటు రసవత్తర డ్రామాను నడిపించి చివరకు ప్రారంభమైందని తేల్చేశారు. -
'సమైక్యమంటూనే విభజనకు సీఎం సహకారం'
-
సీఎం తీరుపై శ్రీధర్‌బాబు ఆగ్రహం
-
ప్రముఖుల సంక్రాంతి శుభాకాంక్షలు
పల్లెలు మళ్లీ కళకళలాడాలి ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల పాడిపంటలకు నెలవు కావాలని, శాంతి సౌభాగ్యాలతో రాష్ట్రం వర్థిల్లాలని, పల్లెలు మళ్లీ కళకళలాడాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. భోగి, మకర సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలకు అండదండగా నిలిచే వ్యవసాయాన్ని పండుగ చేసే విధానాలకు మరోసారి జయం కలగాలని అభిలషించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు, భోగభాగ్యాలతో తులతూగాలని.. ప్రత్యేకించి రైతన్నలు, రైతు కూలీలకు మరింత మంచి జరగాలని జగన్ ఆకాంక్షించారు. రాష్ట్రపతి, ప్రధానుల సంక్రాంతి శుభాకాంక్షలు న్యూఢిల్లీ: దేశ ప్రజలు భోగి, సంక్రాంతి పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ ఆకాంక్షించారు. ఆయా పండుగలు జాతిని ఐక్యంగా ముందుకు నడిపేందుకు దోహదపడతాయని, ఇవి వ్యవసాయ పండుగలని, అందరిలోనూ సరికొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివారం విడివిడిగా సందేశాలు విడుదల చేశారు. గవర్నర్, సీఎం, బాబు సంక్రాంతి శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. నారావారిపల్లెకు బాబు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చంద్ర బాబునాయుడు తన స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు సోమవారం వెళ్లనున్నారు. స్వగ్రామంలో బాల్యస్నేహితులతో కలసి భోగి, సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
వచ్చే నెలలో సీఎం, నేను రాజీనామా చేస్తున్నాం: పితాని
యలమంచిలి, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే నెలలో రాజీనామా చేసేందుకు ముహూర్తం నిర్ణరుుంచుకున్నారని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పితాని ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం కిరణ్ వచ్చే నెలలో రాజీనామా చేస్తారని, ఆ వెంటనే తాను కూడా రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. విభజనకు అనుకూలంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ లేఖలు ఇచ్చినందునే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. అయితే సీమాంధ్రలో ఉద్యమం వెల్లువెత్తడంతో మిగిలిన పార్టీలు యూటర్న్ తీసుకున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన నెపం కాంగ్రెస్ పార్టీపై పడిందన్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో తామం తా సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నామని చెప్పారు. ఆ దిశగానే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక రాజీనామాలు చేయాలని నిశ్చయించుకున్నట్టు పితాని తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ‘సమైక్య’ ముద్రకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీఎం.. తన సన్నిహిత మంత్రి పితాని నోటివెంట ఈ మాటలు చెప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుండడం గమనార్హం. -
నేనేంటో అసెంబ్లీలో చూపిస్తా: సీఎం కిరణ్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టమైన అభిప్రాయాలు తెలపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. అసెంబ్లీ నిర్ణయంపైనే రాష్ట్రపతిగానీ, కేంద్రం గానీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అభిప్రాయం చెప్పకుండా బిల్లు పంపిస్తే వ్యతిరేక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాబట్టి బిల్లుపై ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని అసెంబ్లీలో స్పష్టం చేయాల్సిన అవసరముందన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. బిల్లుపై చర్చ ద్వారా ప్రజాభిప్రాయాన్ని చెప్పొచ్చని అన్నారు. బిల్లుపై చర్చ జరగకపోతే విభజనను అంగీకరించినట్టేనని చెప్పారు. అసెంబ్లీ భిన్నాభిప్రాయాలు తెలిపిన తర్వాత దేశంలో ఎక్కడా రాష్ట్రాల విభజన జరగలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకునేందుకే బిల్లును కేంద్రం ఇక్కడకు పంపించిందని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్ కోసం ఆలోచించడం లేదని సీఎం కిరణ్ అన్నారు. సమైక్యవాదం తమ నినాదం కాదు, తమ విధానమన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి రావాలని మిగతా పార్టీలను కోరారు. సీఎంగా తన అధికారాలెంటో తనకు తెలుసునని అన్నారు. బిల్లుపై తానేం చేస్తానో అసెంబ్లీలో చూస్తారని అంటూ ముక్తాయించారు. -
'అవినీతిపై హజారే కంటే ఎక్కువ పోరాటం చేశా'
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రి పి. శంకర్రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నత్తి సీఎం కిరణ్, సత్తి బొత్సకు వచ్చే నెల 7 తర్వాత ఉద్వాస తప్పదని ఆయన జోస్యం చెప్పారు. విజయవాడలో దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని మంగళవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం కిరణ్ పార్టీ పెడితే పార్టీ పాతాళానికి, అందులో చేరినవారు కైలాసానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని అన్నారు. అవినీతిపై అన్నా హజారే కంటే తానే ఎక్కువ పోరాటం చేశానని ఆయన సొంత డబ్బా కొట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో పార్టీని భూస్థాపితం చేయడం తప్ప కిరణ్ కుమార్ రెడ్డి సాధించిందేమీలేదని అంతకుముందు శంకర్రావు అన్నారు. కిరణ్ కంటే తానే బెటర్ అని కూడా వ్యాఖ్యానించారు. -
కిరణ్ లీకులు భలే భలే
* రాహుల్ ముందు జీ హుజూర్ * బయటికేమో చాంపియన్‌లా పోజు * సమైక్యవాదం విన్పించానంటూ లీకులు * అనుమతితో వెనుదిరిగి.. అసంతృప్తి అంటూ కలరింగ్ సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య జరిగిన సమావేశంలో మాట్లాడిందొకటైతే, బయటకు లీక్ చేసిన విషయాలు వేరా? అంటే అవుననే అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో మొదలైన చర్చను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి, దానికి ఎలా ముగింపు పలకాలన్న దానిపై కిరణ్‌కు రాహుల్ మార్గనిర్దేశనం చేయగా, బయటికి మాత్రం అందుకు భిన్నంగా లీకులిచ్చారు. రాహుల్‌తో భేటీలో కిరణ్ గట్టిగా సమైక్య వాదన విన్పించారంటూ ప్రచారంలో పెట్టారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పార్టీ ఎన్నికల వ్యూహరచన కోసం కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో రాహుల్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. కిరణ్‌తో పాటు 12 రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, కపిల్ సిబల్, కేవీ థామస్, నారాయణ స్వామిలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్రం నిర్ణయాలు, ప్రజల్లోకి వెళ్లడం, ప్రధానంగా రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలపై సీఎంలు వివరించారు. అనంతరం వారితో రాహుల్ విడిగా సమావేశమై కొన్ని ఆదేశాలిచ్చారు. ఆ కోవలోనే దిగ్విజయ్ సమక్షంలోనే కిరణ్‌తో భేటీ అయి ఇక్కడి విషయాలను ఆరా తీశారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో అనుసరిస్తున్న వ్యూహమేంటని కూడా అడిగి తెలుసుకున్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయంపై ఎలాంటి భిన్నాభిప్రాయాలూ రాకుండా రాష్ట్రపతి నిర్దేశించిన గడువులోగా బిల్లును తిప్పిపంపేలా చూడాలని ఈ సందర్భంగా కిరణ్‌ను రాహుల్ ఆదేశించారు. తర్వాత అందరు సీఎంల సమక్షంలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. కిరణ్ మాత్రం అందులో పాల్గొనకుండా హైదరాబాద్ తిరుగుముఖం పట్టారు. ఆ తర్వాత కాసేపటికే, రాహుల్‌తో భేటీలో కిరణ్ గట్టిగా సమైక్యం గళం వినిపించారని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆయనకు చెప్పారని చానళ్లలో విస్తృతంగా ప్రచారమైంది. పైగా విభజన నిర్ణయానికి నిరసనగానే రాహుల్ మీడియా భేటీలో పాల్గొనకుండా కిరణ్ వెనుదిరిగారని కూడా ప్రచారం జరిగింది. దాంతో హైదరాబాద్‌లోని సీనియర్ నాయకులు హస్తినలోని ఏఐసీసీ నేతలకు, ముఖ్యంగా దిగ్విజయ్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. దాంతో, రాహుల్‌తో భేటీలో జరిగిన దానికి పూర్తి విరుద్ధంగా కిరణ్ మీడియా లీకులిచ్చిన వైనం ఏఐసీసీ నేతల దృష్టికి వెళ్లింది. విభజన బిల్లుపై అసెంబ్లీలో జరిగే చర్చలో అందరూ పాల్గొనేట్టు చూడాలన్నది ముఖ్యమైన ఆదేశమని, దాన్ని సజావుగా పూర్తి చేయడంలో తనకు కొన్ని ఇబ్బందులున్నందున సమైక్యం కోసం కట్టుబడ్డానని చెప్పక తప్పదని, ఈ విషయంలో తనకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలని కిరణ్ కోరినట్టు తెలిసింది. ఏఐసీసీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... విభజనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, వెనక్కు వెళ్తే దేశవ్యాప్తంగా పార్టీ విశ్వసనీయత కోల్పోతుందని కిరణ్‌తో రాహుల్ స్పష్టం చేశారు. విభజన వల్ల రాజకీయంగా నష్టపోతామని చెబుతున్న ప్రాంతంలో అనుసరించాల్సిన కార్యాచరణను అధిష్టానం రూపొందించిందని, రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఇలా విభజనపై అనుసరించాల్సిన వ్యూహంపై కిరణ్‌తో 40 నిమిషాల భేటీలో రాహుల్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఏఐసీసీ ముఖ్యుడొకరు చెప్పారు. వాటి అమలులో తలెత్తే ఇబ్బందుల నుంచి బయట పడటానికే కిరణ్ ఇలా ‘సమైక్య’ లీకులిచ్చారని అభిప్రాయపడ్డారు. సమైక్య చాంపియన్ అన్పించుకోవాలన్న కిరణ్ యత్నాలు కూడా హైకమాండ్ వ్యూహంలో భాగమేనని ఎందుకనుకోరని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పడం విశేషం! పైగా చిన్ననాటి స్నేహితుడి ఇంట్లో పెళ్లి ఉందని, దానికి తాను తప్పనిసరిగా హాజరవాల్సి ఉందని రాహుల్‌కు చెప్పి, ఆయన అనుమతి తీసుకుని మరీ కిరణ్ హైదరాబాద్ బయల్దేరారని సదరు నేత వివరించారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ హైటెక్స్‌లో వివాహానికి హాజరవడానికే కిరణ్ త్వరగా వెళ్లారు తప్ప ఏదో సమైక్యం, విభజనవాదమంటూ మీరే ఏదేదో ఊహించుకుంటే ఎలాగంటూ ఏఐసీసీ కార్యాలయ వర్గాలు స్పందించాయి. మీడియా సమావేశంలో కిరణ్ పాల్గొనకపోవడాన్ని ఒక విలేఖరి ప్రస్తావించగా రాహుల్ కూడా ఇదే మాట చెప్పారు. సన్నిహితుల ఇంట్లో శుభకార్యానికి హాజరు కావాల్సి ఉన్నందున అనుమతి తీసుకునే ఆయన హైదరాబాద్ వెళ్లారని స్పష్టంగా చెప్పారు. అధిష్టానాన్ని ధిక్కరించినట్టుగా మాట్లాడుతున్నా కిరణ్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు గనుకనే రకరకాల ప్రచారాలు జరుగుతుండవచ్చని ఏఐసీసీ కార్యాలయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఒక కీలక నిర్ణయాన్ని కార్యరూపంలో పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు తమ వ్యూహం తమకుంటుందని చెప్పాయి. షిండే, దిగ్విజయ్‌లతో భోజన విరామంలో కిరణ్ కాసేపు సమావేశమయ్యారు. పథకాలపై ప్రసంగం అమ్మ హస్తం, మీసేవ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బంగారు తల్లి పథకాలపై సీఎంల భేటీలో కిరణ్ మాట్లాడారు. అమ్మహస్తం ద్వారా అర్హులకు నెలకు సరిపడే నిత్యావసరాలను తక్కువ ధరకు ఇస్తున్నామన్నారు. -
23 తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జనవరి 23 వరకు వేచి చూద్దామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంత నేతలకు చెప్పారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిద్దామని, బిల్లుపై చర్చలో సీవూంధ్ర ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తే కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయులేదని వారికి నచ్చజెప్పారు. చర్చ ముగిసిన తర్వాత బిల్లు రాష్ట్రపతికి, అక్కడి నుంచి కేంద్రానికి, పార్లమెంటుకు చేరుతుందని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని గురువారం తనను కలసిన సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సీఎం అన్నారు. మాజీ మంత్రులు జేసీ, పాలడుగు, ఎమ్మెల్యే విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ శివరావుకృష్ణారావు తదితర నేతలు సచివాలయంలో సీఎంను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా విభజన బిల్లు ప్రస్తావనకొచ్చింది. సీమాంధ్ర నేతలంతా చర్చలో పాల్గొనడమే కాకుండా బిల్లుకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని సీఎం సూచించారు. అసెంబ్లీలో ఓటింగ్‌కు తెలంగాణ నేతలు అంగీకరించకపోవచ్చని, అటువంటి అవకాశం ఉండకపోతే పరిస్థితి ఏమిటని సీనియర్ నేతలు సీఎంను అడిగారు. ఏ బిల్లుపైనైనా ఓటింగ్‌కు మెజార్టీ సభ్యులు పట్టుబడితే సభాపతి చేపట్టక తప్పకపోవచ్చని సీఎం పేర్కొన్నారు. బిల్లుపై కనుక ఓటింగ్‌కు అవకాశం లేదని తేలితే అప్పుడు విభజన వ్యతిరేక తీర్మానాన్ని ప్రతిపాదిద్దామని సీఎం చెప్పినట్టు నేతలు వివరించారు. సభలో పునర్వ్యవస్థీకరణ బిల్లును ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తారో, లేదో? చర్చ సందర్భంగా గైర్హాజరవుతారో అని నేతలు సంశయుం వ్యక్తంచేయగా అలాంటి పరిస్థితి ఉండదని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. -
కిరణ్ దళిత ద్రోహి: ఎంపీ వివేక్
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దళిత, తెలంగాణ ద్రోహి అని ఎంపీ వివేక్ ఆరోపించారు. మాజీ మంత్రి, దళిత నేత టీఎన్ సదాలక్ష్మి 84వ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం వేడుకల కమిటీ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వివేక్, డిప్యూటీ సీఎం దామోదర రాజన రసింహ, మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఇందిరాపార్కు చౌరస్తాలో సదాలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న స్థలంలో ఆమె చిత్రపటానికి రాజనరసింహ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో వివేక్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్ర హ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభించడానికి మూడేళ్లు పట్టిందని, సదాలక్ష్మి విగ్రహ ఏర్పాటు అంశం ప్రభుత్వం వద్ద రెండేళ్లుగా పెండింగ్‌లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. -
రెండు ముక్కలపై 56 లెక్కలు
* రెండు రాష్ట్రాలకు ఆస్తులు, సంస్థల పంపిణీ క్రోడీకరణలో 56 రాష్ట్ర ప్రభుత్వ శాఖలు బిజీ * 10 మంది ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, 30 మంది ముఖ్య కార్యదర్శులు, * ఇంకో 10 మంది కార్యదర్శులు, వారి సిబ్బంది మొత్తం విభజన లెక్కల్లోనే.. * ఆస్తులు-అప్పుల పంపిణీపై ఆర్థికశాఖ ప్రత్యేక నమూనా పత్రం * హైదరాబాద్, రాష్ట్రాల మధ్య ప్రభుత్వ ఉద్యోగుల విభజనపై కుస్తీ * నెలవారీ పెన్షన్ చెల్లింపులు, పెన్షన్ అప్పుల పంపకాలపై కసరత్తు * విద్య, ఉపాధి అవకాశాలపై ఐటీ శాఖ కార్యదర్శి నేతృత్వంలో కృషి * నదీజలాలపై సాగునీటిశాఖ; విద్యుత్, జెన్కోపై ఇంధనశాఖ బిజీ * శాసనమండలి స్థానాలు, సభ్యుల కేటాయింపుపై సీఈఓ కసరత్తు * ప్రతిరోజూ సీఎస్ పేషీ సమీక్ష.. అటకెక్కిన సాధారణ పరిపాలన * ఉద్యోగులంతా సర్వీసు, స్థానికత వివరాలు నింపే పనిలో నిమగ్నం * విభజనను అడ్డుకుంటామంటున్న సీఎం కిరణ్ నేతృత్వంలోని ప్రభుత్వమే.. శరవేగంగా విభజనకు సర్వం సిద్ధం చేస్తున్న వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని.. అసెంబ్లీలో విభజన బిల్లును ‘ఒడిస్తా’మని ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని.. జరగనివ్వబోమని ఘంటాపథంగా చెప్తున్నారు. కానీ.. మరోవైపు అదే ముఖ్యమంత్రి నేతృత్వంలో పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం.. విభజన ప్రక్రియ అమలు కోసం పాలనాపరమైన భూమికను ఆగమేఘాల మీద పూర్తిచేస్తోంది. సాధారణ పరిపాలన వ్యవహారాలన్నింటినీ పక్కనపెట్టేసి.. విభజనకు సంబంధించిన లెక్కలు తేల్చే పనిలో తలమునకలైపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రభుత్వ యంత్రాంగంలోని మొత్తం 56 శాఖలూ.. వాటికి సంబంధించిన 10 మంది ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, 30 మంది ముఖ్య కార్యదర్శులు, మరో 10 మంది కార్యదర్శులతో పాటు, వారి నేతృత్వంలోని ఉద్యోగులంతా.. రాష్ట్ర విభజన కోసం ఆస్తులు, సంస్థలు, ఉద్యోగుల పంపిణీ వివరాలను క్రోడీకరించే పనిలో మునిగిపోయారు. ఐదు రోజులుగా మిగతా కార్యక్రమాలన్నీ అటకెక్కగా.. ప్రభుత్వ యంత్రాంగమంతా ఇదే కార్యక్రమంలో నిమగ్నమైంది. రాష్ట్ర విభజనకు శరవేగంగా సన్నాహాలు చేసే క్రమంలో.. సమాచార క్రోడీకరణ కోసం ఆర్థిక, శాఖపరమైన అనుభవం గల పదవీ విరమణ చేసిన అధికారుల సహకారాలు కూడా తీసుకుంటున్నారు. రోజువారీ పాలనా కార్యక్రమాలు కానీ, మరే ఇతర పనులను కానీ ఆయా శాఖల అధికారులు, కానీ ఇతర ఉద్యోగులు కానీ పట్టించుకోవటం లేదు. సచివాలయంతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి నమూనా పత్రం రూపకల్పన; ప్రభుత్వ ఉద్యోగులను హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు కేటాయింపు; నెలవారీ పెన్షన్ చెల్లింపులు, పెన్షన్ అప్పులు; రాష్ట్ర విభజన అనంతరం ఇరు ప్రాంతాలకు శాసనమండలి స్థానాలు, సభ్యుల కేటాయింపు; ప్రాంతాలు, ప్రాజెక్టుల వారీగా నదీజలాల పంపిణీ, విద్యుత్, బొగ్గు, జెన్కోల విభజన వంటి అన్ని అంశాలనూ ఆగమేఘాల మీద తేల్చేసే పనిలో కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పనిచేసే సర్కారు యంత్రాంగం బిజీ అయిపోయింది. విభజన బిల్లులోని పదో షెడ్యూల్లో పేర్కొన్న 42 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పనితీరు విభజన తరువాత ఎలాగ ఉండేది కూడా నోట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక ఉద్యోగులు తమ సర్వీసు, స్థానికత వివరాలకు సంబంధించి జారీ చేసిన కంప్యూటరైజ్డ్ దరఖాస్తును నింపే పనినీ పూర్తిచేస్తున్నారు. ఆయా విభాగాలు చేస్తున్న పనిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ప్రతి రోజూ శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తోంది. విభజన పంపిణీలకు సంబంధించి ఇప్పుడే ప్రాథమికంగా సిద్ధంగా ఉండే లక్ష్యంతోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలోపడ్డారు. బిల్లులో అచ్చు తప్పుల సవరణకు నిర్ణయం రాష్ట్ర విభజనకు పాలనాపరంగా భూమికను సిద్ధం చేస్తూనే.. విభజన బిల్లును మరింత పటిష్టం చేసేందుకు అందులో ఉన్న కొన్ని తప్పులను గుర్తించి, వాటిని సరిచేయాలని కూడా కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లులోని మూడో పేజీలో ఇంగ్లిష్‌లో మహబూబ్‌నగర్ పేరులో ఎ అక్షరం పడలేదని, దాన్ని సరిచేయాలని అధికారులు ప్రతిపాదించారు. అలాగే బిల్లులో కడప జిల్లా అని పేర్కొనగా.. దాన్ని వైఎస్సార్ జిల్లాగా, నెల్లూరు జిల్లాకు బదులుగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చాలని అధికారులు గుర్తించారు. అలాగే బిల్లులో తొమ్మిదవ షెడ్యూల్లో పేర్కొన్న 44 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను, ఏడవ షెడ్యూల్లో పేర్కొన్న 41 సంస్థల్లో ఏ సంస్థకు ఎన్ని నిధులు ఉన్నాయో లెక్కకట్టడంతో పాటు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తే ఏ రాష్ట్రానికి ఎన్ని ఫండ్స్ వస్తోయో తేల్చే పనిలో ఆర్థికశాఖ నిమగ్నమైంది. ఈ 41 సంస్థలే కాకుండా ఇంకా సంస్థలేమైనా ఉంటే వాటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. శాఖల వారీగా పనుల వివరాలివీ... * ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి (ఐఎఫ్): ఆస్తులు, అప్పులకు సంబంధించి ప్రత్యేక నమూనా పత్రం రూపకల్పన, సమాచార సేకరణ, జనాభా నిష్పత్తి ప్రకారం ఏ రాష్ట్రానికి ఎన్ని అస్తులు, అప్పులు వస్తాయో తయారీ. ఆదాయ, వ్యయాలకు సంబంధించి కేంద్రానికి పంపిన పుస్తకాల సేకరణ. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ప్రస్తుతం వస్తున్న ఆదాయం, పంపిణీ. హైదరాబాద్, పలు ప్రాంతాల్లో గత 55 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడులు, సంస్థల ఏర్పాటు సమాచారం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, వాటి ప్రస్తుత విలువ నివేదిక. మూడు ప్రాంతాలు, జీహెచ్ఎంసీ పరిధిలో రెవెన్యూ లోటుకు కారణాలు. 13వ ఆర్థిక సంఘం నిధులు వ్యయం, నిధులు పంపిణీ. * ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి (ఆర్ అండ్ ఈ): ప్రభుత్వ ఉద్యోగులను హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు కేటాయింపు. రీజియన్/ జోన్లలో ఉన్న ఖాళీలు. * ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి(రూల్స్): నెలవారీ పెన్షన్ చెల్లింపులు, పెన్షన్ అప్పు లు, ప్రాంతాలవారీగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమాచారం సేకరణ. * ఐటీ శాఖ కార్యదర్శి: మూడు ప్రాంతాల్లో విద్యా, ఉపాధి అవకాశాలు. హైదరాబాద్‌లో ప్రత్యేకించి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వివరాలు. * ఇరిగేషన్ ఈఎన్సీ: 3 ప్రాంతాల్లో ప్రాజెక్టుల వారీగా సాగు, తాగునీటి లభ్యత. విభజన నేపథ్యంలో ఇటీవల కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పర్యవసానాలు. * ఇంధన శాఖ అదనపు కార్యదర్శి: మూడు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల వివరాలు. కేటగిరీల వారీగా విద్యుత్ వినియోగం. * పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి: ప్రాంతం వారీగా ప్రధాన కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులు వివరాలతో పాటు ఇతర అంశాలు. * రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి: రాష్ట్ర విభజన అనంతరం ఇరు ప్రాంతాలకు ప్రస్తుత శాసనమండలి సభ్యుల కేటాయింపు. నియోజకవర్గాల పునిర్వభజన అనంతరం ఇరు ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలు, శాసనమండలి స్థానిక, గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల వివరాలు, విభజన తరువాత ప్రస్తుతం ఉన్న మండలి సభ్యులను ఇరు ప్రాంతాలకు కేటాయింపు. * సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి: తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల వివరాలు బిల్లులో పేర్కొన్నవి సరిగా ఉన్నాయా లేవా, ఇంకా అదనంగా కులాలు ఉన్నాయా అనే వివరాల సేకరణ. * గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి: తెలంగాణలో ఎస్టీల వివరాలు బిల్లులో పేర్కొన్నవి సరిగా ఉన్నాయా లేవా, అదనంగా చేర్చాలా అనే వివరాల సేకరణ. * ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి: ఏడవ షెడ్యూల్లో పేర్కొన్న 41 సంస్థలు, ఇతర పబ్లిక్ ఖాతాల్లోని నిధుల వివరాలు. ఆ నిధులను జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు పంపిణీ. పదవ షెడ్యూల్లో పేర్కొన్న 42 సంస్థలు ఏడాది లేదా కేంద్రం నిర్ణయించినంత కాలం ఇరు రాష్ట్రాలకు పనిచేయడం ఎలాగో నివేదిక. * సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి: నదీ జలాల పంపిణీ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కొనసాగింపు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులు, విభజన నేపథ్యంలో ఉత్పన్నమయ్యే వివరాల సేకరణ. * ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి: విద్యుత్, బొగ్గు, జెన్కో విభజన, విద్యుత్ నియంత్రణ మండలి ఆరు నెలలపాటు ఇరు రాష్ట్రాలకు పనితీరు ఎలా ఉండాలి, ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు వివరాలు సేకరణ. * రవాణా, ఉన్నత విద్య, పరిశ్రమలు, ఇంధన శాఖల ముఖ్యకార్యదర్శులు: 13వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా విద్య, విద్యుత్, యూనివర్శిటీలు పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాల వివరాల సేకరణ. * తెలంగాణకు చెందిన పది జిల్లాలు, మిగతా 13 జిల్లాలకు సంబంధించిన ప్రాధమిక సమాచారాన్ని అన్ని శాఖలు సేకరిస్తున్నాయి. ఉద్యోగులు నెలాఖరులోగా వివరాలివ్వాలి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగులు తమ సర్వీసు వివరాలను ఈ నెల 30లోగా అందజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన ఉన్నా లేకున్నా ప్రతి ఉద్యోగి స్థానికత వివరాల డిజిటలైజేషన్ జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 12 లక్షల మంది ఉన్నారని, వీరికి అదనంగా కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారని, వారి సర్వీసు వివరాలన్నింటినీ డిజిటల్ సర్వీసు రిజిస్టర్‌లోకి తీసుకురావడానికి మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (హెచ్ఆర్ఎంఎస్) కింద కంప్యూటరైజ్డ్ దరఖాస్తులో ఉద్యోగులు వివరాలను కోరామని తెలిపారు. డిజిటల్ సర్వీసు రికార్డుల విధానం జనవరి నెలాఖరుకు లేదా ఫిబ్రవరి మొదటివారానికి నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. -
శైలజానాథ్‌ను అడ్డుకున్న సీఎం!
-
శైలజానాథ్‌ను అడ్డుకున్న సీఎం!
* రాష్ట్రపతికి సమైక్య వినతిపత్రం ఇవ్వకుండా లాక్కున్న వైనం సాక్షి, అనంతపురం: సమైక్య ముసుగులో విభజన వీరుడిని తానేనని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి చాటుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం సమర్పించేందుకు యత్నించిన ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్‌ను అడ్డుకున్నారు. సాక్షాత్తూ ప్రణబ్ ముఖర్జీ, వందలాదిమంది అధికారులు, వేలాదిమంది విద్యార్థులు చూస్తుండగా వినతిపత్రాన్ని లాక్కున్నారు. ఈ సంఘటనకు నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకలు వేదికయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మాజీ రాష్ట్రపతి నీలం శత జయంతి ముగింపు వేడుకలు సోమవారం అనంతపురంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పాల్గొన్నారు. మంత్రి శైలజానాథ్ ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించాలని.. సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తున్నానని సభాముఖంగా ప్రకటించారు. రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లారు. కానీ రాష్ట్రపతి పక్కనే కూర్చున్న కిరణ్.. శైలజానాథ్ చేతుల్లో ఉన్న వినతిపత్రాన్ని విసురుగా లాక్కున్నారు. ఇప్పుడు వినతిపత్రం ఇవ్వొద్దంటూ మంత్రిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ ఒత్తిడి మేరకు శైలజానాథ్ వెనక్కి తగ్గి, తన స్థానంలో కూర్చుండిపోయారు. ఆ తర్వాత ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముగింపు ఉపన్యాసం చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్రణబ్‌ను డిమాండ్ చేశారు. తెలుగుజాతి ఐక్యతను కాపాడాల్సిన ధర్మం రాష్ట్రపతిపై ఉందన్నారు. ప్రణబ్ వేదిక దిగుతున్న సమయంలో మంత్రిని వెంట తీసుకుని వెళ్లారు. వినతిపత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. ఆ సమయంలో సీఎం కిరణ్ అక్కడే ఉన్నా మిన్నకుండిపోవడం గమనార్హం. సమైక్యవాదులను నిర్బంధించిన పోలీసులు రాష్ట్రపతి పర్యటనను సమైక్యవాదులు అడ్డుకుంటారనే భావనతో వైఎస్సార్సీపీ, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీఎం విభజనకు సహకరిస్తున్నారు
లేకపోతే ఈపాటికే జైల్లో ఉండేవారు: కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్ : h సీఎం వసూళ్ల చిట్టా అంతా హైకమాండ్ పెద్దల దగ్గర ఉందని, వారి మా ట వినకుంటే ఈపాటికే చంచల్‌గూడ జైల్లో ఊచలు లెక్కపెట్టేవారని వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లోని చంద్రబాబు ఛాంబర్ ఎదుట కోమటిరెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్న సమయంలో మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, వట్టి వసంతకుమార్, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అక్కడ ఆగారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరంగా చర్చ జరిగింది. తొలుత కోమటిరెడ్డి మాట్లాడుతూ, విభజన విషయంలో పూర్తిగా సహకారం అందిస్తానని ఢిల్లీలో హైకమాండ్ పెద్దలకు హామీ ఇచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ వచ్చి సమైక్యముద్ర వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. నిజంగా ఆయన విభజనకు సహకరించకపోతే, ప్రక్రి య ఇంతవరకు వచ్చేది కాదన్నారు. తనకు ఆత్మాభిమానం ఉన్నందువల్లే మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు సమన్యాయం అని ఒకసారి, విభజన అడ్డగోలుగా ఎలా చేస్తారంటూ మరోసారి చెప్తున్న మాటలతో తెలంగాణలో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. ఆ సమయంలో కాసు కృష్ణారెడ్డి జోక్యం చేసుకుని.. కృష్ణా, గుంటూరు జిల్లాలను కూడా చేర్చుకుంటే తెలంగాణ రాష్ర్టం ఇవ్వాల్సిందిగా రాసిస్తామని, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కూడా ఆ ప్రాంతం వారికే ఇచ్చేటట్లు హామీ పత్రం రాసిస్తామని అన్నారు. వెంటనే కోమటిరెడ్డి ‘‘పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. వారు మాట్లాడే తెలుగు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. మీ భాషకు, మా భాషకు చాలా వ్యత్యాసం ఉంటుంది, మీరు సంక్రాంతి పండుగను ఆడంబరంగా చేసుకుంటే మేం దసరా పండుగను అట్లా చేసుకుంటాం. మీకు మాకు పొత్తే కుదరదు’’ అన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి మినహా ఎవరు సీఎంగా ఉన్నా రాష్ట్రం సమైక్యంగా ఉండేదన్నారు. -
హైకోర్టు చీఫ్ జస్టిస్ జ్యోతిసేన్‌గుప్తాతో సీఎం కిరణ్ భేటీ
రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర కేబినెట్ సుదీర్ధ సమావేశం జరుపుతున్న నేపథ్యంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ జ్యోతిసేన్‌గుప్తాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గత కొద్దికాలంగా అసంతృప్తితో రగులుతున్న ముఖ్యమంత్రి కీలక సమయంలో గుప్తాతో సమావేశం కావడం చర్చకు దారి తీసింది. కేంద్ర కెబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే తలెత్తే పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. -
సర్కార్ చదువులు డీలా
సాక్షి, సంగారెడ్డి: సర్కార్ బడుల్లో చదువులు మొక్కుబడిగా సాగుతున్నాయి. ఉపాధ్యాయులు లేకుండానే ఆరు నెలలుగా పాఠశాలలను నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీ ప్రకటన వెలువడుతుందని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రకటించినా ఇప్పటివరకు అతీగతి లేకుండా పోయింది. డీఎస్సీ, టెట్‌ను వేర్వేరుగా నిర్వహించాలా?, సంయుక్తంగా నిర్వహించాలా? అన్న అంశాన్ని ప్రభుత్వం తేల్చకపోవడంతో ఐదు నెలలుగా నోటిఫికేషన్‌కు నోచుకోవడం లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశాలూ కనిపించడం లేదు. ఓవైపు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు విద్యా వలంటీర్లు సైతం లేకపోవడంతో విద్యార్థులు అరకొర చదువులు సాగిస్తున్నారు. పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఆటపాటలతో కాలం గడుపుతున్నారు. 926 పోస్టుల కోసం ప్రతిపాదనలు.. జిల్లాలో మొత్తం 926 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ విద్యాశాఖ అధికారులు డీఎస్సీ కోసం ప్రతిపాదనలు పంపారు. నోటిఫికేషన్ జారీలో జాప్యం జరుగుతోండడంతో జిల్లాలో వంద మంది ప్రత్యేక విద్యా వలంటీర్లను నియమించుకోడానికి అనుమతించాలని కలెక్టర్ నెల రోజుల క్రితం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వలంటీర్ల నియామకం కూడా నిలిచిపోయింది. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్న బడులకు ఇతర పాఠశాలల నుంచి 117 మంది ఉపాధ్యాయులను పంపించి తాత్కాలికంగా సర్దుబాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు రెండో రోజుల క్రితం కలెక్టర్ అనుమతి కోరారు. టెన్త్ ఫలితాలపై ప్రభావం పదోతరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. మరో నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. డిసెంబర్ నెలాఖరులోగా సిలబస్ పూర్తి చేయాల్సి ఉన్నా ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గతేడాది పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. ఈ సారి ఉపాధ్యాయుల కొరత టెన్త్ ఫలితాలను మరింత దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. దయనీయంగా ఉర్దూ బడులు జిల్లాలో 729 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడూ సెలవు తీసుకుంటే ఆ పాఠశాలలు సైతం మూతబడుతున్నాయి. ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని పాఠశాలలు 76 ఉన్నాయి. అందులో ఉర్దూ మీడియం బడులే 46 ఉన్నాయి. ఉర్దూ మాధ్యమం బడులు మరీ దయనీయ స్థితికి చేరుకున్నాయి. ఈ మాధ్యమంలోని ప్రాథమిక పాఠశాలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. 2010-11లో 158 ఉన్న ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలల సంఖ్య 2011-12లో 154కు తగ్గిపోగా 2012-13లో 149కు పడిపోయింది. -
సీఎం మార్పును వ్యతిరేకించిన కేఎల్ఆర్
-
మంత్రి ఉత్తమ్.. వెనకడుగు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెనకడుగు వేశారా..? పులిచింతల ప్రాజెక్టును ఈ నెల 27వ తేదీ.. లేదంటే 30వ తేదీన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారని ప్రకటించిన మంత్రి ఆదివారం మాట మార్చారు. శనివారం హైదరాబాద్‌లో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయిన మంత్రి ఈ అంశంపైనే చర్చించారని అంటున్నారు. అయితే, పులిచింతల ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన వెంటనే జిల్లాలో వ్యతిరేకత వ్యక్తమయ్యింది. మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశంపై తీవ్రంగానే స్పందించారు. ‘పులిచింతల ప్రాజెక్టు ప్రారంభించే సాకుతో జిల్లాలో అడుగుపెడితే సీఎంను అడ్డుకుంటాం. తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తే తగిన మూల్యం చెల్లిస్తారు. సీఎంకు తొత్తులుగా వ్యవహరిస్తున్న నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు తెలంగాణవాదాన్ని వాడుకుంటున్నారు..’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన హెచ్చరికలు పనిచేసినట్లే కనిపిస్తున్నాయి. తెలంగాణ మట్టిమనుషుల సంఘం నాయకుడు వేనేపల్లి పాండురంగారావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితర నేతలు కూడా సీఎంను అడ్డుకుంటామని ప్రకటించారు. పై-లీన్ తుపానుతో నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు, వారికి మానసిక ైధె ర్యం కల్పించేందుకు పర్యటన పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అడ్డుకోవడానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేయాల్సిన పనులన్నీ చేశారు. ఆయన పోలీసుల ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. విజయమ్మను అడ్డుకోవడానికి మంత్రి తెలంగాణవాదాన్ని అడ్డంపెట్టుకున్నారు. నిత్యం సమైక్యాంధ్ర నినాదం వినిపిస్తూ, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని జిల్లా పర్యటనకు ఎలా తీసుకువస్తారన్న విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో పునరాలోచనలో పడిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎంను కలిసి పర్యటనను మార్పించారని అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఈ నెల 30వ తేదీన పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఖరారైంది. దీనికి సీఎం రానున్నారు, ఈ మేరకు మాకు సమాచారం అందింది. గుంటూరు జిల్లా సరిహద్దులో ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ, ఎటువైపు ప్రారంభిస్తారో మాకు తెలియదు. నల్లగొండ కలెక్టర్, ఎస్పీలు ఆదివారం పులిచింతలను సందర్శించి ఏర్పాట్లు చూశారు..’ అని పులిచింతల సీఈ సాం బయ్య ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఆదివారం హుజూర్నగర్ నియోజకవర్గలో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం సీఎం కార్యక్రమం గుంటూరు జిల్లా వైపే జరగనుందని ప్రకటించారు. -
ఆంక్షలు పెడితే ఊరుకోం
మక్తల్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌పై ఆంక్షలు, భద్రాచలం డివిజన్‌పై మెలికలు పెట్టి ఆంధ్రాలో కలపాలని భావించి విభజనకు అడ్డంకులు సృష్టిస్తే ఊరుకునేది లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు. ఆ రెండు ప్రాంతాలు తెలంగాణలో అంతర్భాగమేనని తేల్చిచెప్పారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని, సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకోవడానికి ఎత్తులువేయడం సరికాదన్నారు. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు శాంతియుతంగా సహకరించాలని కోరారు. సోమవారం మక్తల్ పట్టణంలోని నెహ్రూగంజ్ ఆవరణలో ప్రజాసంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర నాయకుల వివక్షకు గురయ్యారని, విద్యావైద్యం, తాగునీరు, అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిపోయారని తెలిపారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మా నిధులు, మా ఉద్యోగాలు, మా నీళ్లు మాకే దక్కాలన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధించుకోవడానికి నాయకులు కృషిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని ఎద్దేవాచేశారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా 13 జిల్లా ప్రజల గురించే మాట్లాడుతున్నాడని, తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాంతప్రజల గురించి మాట్లాడకపోయినా ఫరవాలేదని, అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ పండుగ ఇంకా మొదలుకాలేదని, పార్లమెంట్లో బిల్లు పాసైన తరువాత సంబరాలు జరుపుకోవాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయహోదా కల్పించాలి సమైక్యపాలనలో తెలంగాణలోని పాలమూరు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కోదండరామ్ అన్నారు. విశాలాంధ్రలో కలపడం వల్ల కృష్టాజలాల సమస్య ఏర్పడిందన్నారు. అప్పట్లో కృష్ణానదిపై ఎగువ కృష్ణ, భీమానదిపై భీమా ప్రాజెక్టులను నిర్మించాలని నిజాం పాలనలోనే ప్రతిపాదనలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు కర్ణాటకలోకి వెళ్లాయన్నారు. నెహ్రూ సూచనల మేరకు బచావత్ ట్రిబ్యూనల్ కమిటీ జిల్లాను సందర్శించి జూరాల ప్రాజెక్టును ఏర్పాటుచేసిందన్నారు. ఇప్పటికీ జూరాల ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీటిని ఉపయోగించుకోవడం లేదన్నారు. 18టీఎంసీల నీటిని కేటాయించగా ఆరు టీఎంసీల నీరు మాత్రమే నిల్వచేస్తున్నామని ఇది ఈ ప్రాంత నాయకుల అలసత్వమే అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను కల్పించేందుకు పార్టీలకతీతంగా నాయకులు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో టీజేఏసీ కోకన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షులు రాజేందర్‌రెడ్డి, మక్తల్ నియోజకవర్గం చైర్మన్ సూర్యప్రకాష్, ప్రజాసంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ కన్వీనర్ నర్సింహులు, నాయకులు పోలప్ప, రవీందర్, కృష్ణారెడ్డి, మున్వర్‌అలీ పాల్గొన్నారు. -
పితానికి సీఎం క్లాస్
ఏలూరు, న్యూస్‌లైన్ :సభలు, సమావేశాల్లో జాగ్రత్తగా మాట్లాడాలంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ శనివారం క్లాస్ తీసుకున్నారు. పెనుగొండ మండలం జగన్నాథపురంలో శుక్రవారం నిర్వహించినరచ్చబండ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ‘మరో ముఖ్యమంత్రి’ అని మంత్రి పితాని సంబోధించిన నేపథ్యంలో ఆయనపై సీఎం కిరణ్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పితాని చేసిన వ్యాఖ్యను సభావేదికపై ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తేలికగానే తీసుకున్నారు. సభ ముగిశాక పెనుగొండలోని మార్కెట్ కమిటీ కార్యాలయూనికి చేరుకున్న సీఎం శుక్రవారం రాత్రి అక్కడే బస చేసిన విషయం విదితమే. పితాని చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో మంత్రి పితానిని ఉద్దేశించి ‘మరో ముఖ్యమంత్రి అనడం కరెక్ట్ కాదు. జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులొస్తాయ్’ అంటూ శనివారం ముఖ్యమంత్రి చిరుకోపం ప్రదర్శించారని సమాచారం. -
సీఎం డ్రామాలాడుతున్నారు: అంబటి
-
అన్నీ పీలేరుకే..!
సాక్షి, చిత్తూరు : తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేయగా, ఇప్పుడు మూడేళ్లుగా సీఎం కుర్చీలో కూర్చున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అదేబాట పట్టారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో నిధులన్నీ పీలేరు నియోజకవర్గానికే తరలిస్తూ జిల్లా అభివృద్ధిని పట్టించుకోవటం లేదు. జిల్లాలో పీలేరు నియోజకవర్గానికి తప్ప మిగిలిన వాటికి నిధులు రావడం లేదు. చాలా చోట్ల మంజూరైన పనులు కూడా నిధుల కొరతతో పెండింగ్ పడుతున్నాయి. కేవలం బీఆర్జీఎఫ్ నిధులు, ఎంపీ లాడ్స్, ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధులను చిన్న, చిన్న పనులకు వెచ్చిస్తున్నా రు. మరో ఆరు నెలల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అధికారం చివరి దశలో ఉన్న సీఎం పీలేరు నియోజకవర్గానికి అవకాశం ఉన్నంత మేర నిధులు కుమ్మరించి అభివృద్ధి పనులు జరిగేలా చూస్తున్నారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, వీధిలైట్ల ఏర్పాటు, నీటిసరఫరా, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల పేరిట ఇప్పటికే దాదాపు రూ.200 కోట్లకు పైగా నిధులు ఒక్క పీలేరు నియోజకవర్గంలోనే వెచ్చించారు. ఇటీవలే 126 పంచాయతీ రాజ్ రోడ్లను ఆర్అండ్బీ రోడ్లుగా మారుస్తూ రూ.88 కోట్లు మంజూరు చేశా రు. అలాగే రూ.90 కోట్లు ఖర్చు చేసి కలికిరి, కలకడ, కేవీపల్లె మండలాలకు నీటి వసతి కల్పించే ఝరికోన తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేశారు. కమ్యూనిటీ భవనాలు, పంచాయతీ రోడ్ల నిర్మాణానికి మరో రూ.50 కోట్ల వరకు నిధులు వ్యయం చేశా రు. ఇండస్ట్రియల్ పార్కుకోసం రూ.100 కోట్లకు పైగా నిధులు వ్యయం చేసి 12,000 ఎకరాల భూములు కలికిరి-వాల్మీకిపురం మధ్యలో సేకరించారు. ఇక్కడే ఐటీఆర్పార్కు(ఐటీ జోన్) ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కలకడ, కలికిరి, వాల్మీకిపురంలో మూడు ఏరియా ఆస్పత్రులు(100 పడకలు) నిర్మాణం ఎంత వరకు వచ్చింది ఏమిటనేది వివరాలు పంపమని ఇటీవలే సీఎం పేషీ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. జిల్లాకు నిధులు గుండు సున్నా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చాలా అభివృద్ధి పనులు నిధులు లేక మూలనపడ్డాయి. ప్రధానంగా వందలాది గ్రామీణ, జిల్లా రహదారులు వర్షాలకు దెబ్బతిని దారుణంగా ఉన్నాయి. రెండు సంవత్సరాలుగా వీటి మరమ్మతులకు గానీ, పునర్ నిర్మాణానికి గానీ నిధుల కేటాయింపులేదు. చిత్తూరు-తిరుపతి మధ్య మూడు రైల్వే ఓవర్బ్రిడ్జిల నిర్మాణానికి నిధుల మంజూరు లేదు. కేవలం నేనషనల్ ైెహ వేస్ (కేంద్ర ప్రభుత్వ రహదారుల) శాఖ నిధులతో మాత్రమే అంతర్రాష్ట్ర రహదారుల అభివృద్ధి జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా తాగునీటి కొరత ఉంది. దీనిని నివారించేందుకు ఇంతవరకు చర్యలు లేకపోగా, రూ.5,900 కోట్లతో కండలేరు జలాల పేరిట పథకం ప్రకటించారు. దీనికి రెండవ దశకు మరో రూ.1400 కోట్లు కావాలి. ఈ పథకం ఇంకా టెండర్ల దశలోనే ఉంది. ఎన్నికల్లోపు ఈ పథకం పూర్తి కాదు. కేవలం ఎన్నికల ప్రచారానికి దీనిని ఉపయోగించుకోవడం కోసం అధికారుల ద్వారా హడావుడి చేయిస్తున్నారు. అదే సమయంలో జిల్లాకు సాగునీరు అందించే గాలేరు-నగరి, హంద్రీ- నీవా ప్రాజెక్టులు చాలా చోట్ల భూసేకరణ స్థాయిలోనే ఉన్నాయి. వీటికి నిధులు విడుదల చేయటంతో పాటు భూసేకరణలో రైతులకు తగిన నష్టపరిహారం ఇప్పించటంలోనూ సీఎం దృష్టి సారించలేదు. అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు వైద్యులు, మందుల కొరతతో అల్లాడుతున్నాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి, తిరుపతి రూయా ఆస్పత్రిలోనూ మందుల కొరత పీడిస్తోంది. జిల్లావ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాల్లో ఇళ్లకోసం, సాగు భూమికోసం, రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరు కోరుతూ పేదలు వేల సంఖ్యలో అర్జీలు సమర్పించారు. వీటి ల్లో చాలా వరకు బుట్టదాఖలు కాగా, మిగిలినవి మండల పరిషత్ కార్యాలయాల్లో అటకెక్కాయి. ముఖ్యంగా కొత్త పింఛన్ల మంజూరుకు నిధులు మం జూరు కావటం లేదు. దీంతో అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న వృద్ధులు తమకు పింఛన్ మంజూరు అవుతుందో లేదో తెలియక ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇన్ని సమస్యలు జిల్లాలో ఉన్నప్పటికీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తన సొంత నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేయడానికి వందల కోట్లు కుమ్మరించడం విమర్శలకు దారితీస్తోంది. -
సీఎం తీరుపై మండిపాటు
సాక్షి, చిత్తూరు: రెండున్నర సంవత్సరాలుగా సీఎం కుర్చీలో ఉన్న పీలే రు శాసనసభ్యుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో పార్టీ నాయకులకు, కిందిస్థాయి శ్రేణులకు నియోజకవర్గాల స్థాయిలో నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. కేవలం పార్టీ పదవులు కట్టబెట్టడానికి మాత్రమే పరిమితమయ్యా రు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతల్లో అసహనం మొదలయింది. తిరుపతి నియోజకవర్గంలో తుడ చైర్మన్ పదవిపై ఇద్దరు ఆశతో ఉన్నా ఆ దిశగా సీఎం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. శ్రీకాళహస్తిలో ఆలయ చైర్మన్ పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నా వారి ఆశ నిరాశగానే మిగిలింది. జిల్లాలోని కాణిపాకం దేవస్థానానికి కూడా పాల కమండలిని, చైర్మన్‌ను నియమించలేదు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాలు కూడా చేపట్టలేదు. పీలేరు నియోజకవర్గంలో కొన్ని, పలమనేరు, చంద్రగిరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో మినహా ఇంకెక్కడా మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాలు చేపట్టలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాలోని పలు దేవాలయాలకు పాలకమండళ్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు ఆరు నెలల కిందట మంత్రి సీ.రామచంద్రయ్య సూచనల మేరకు పాలకమండళ్ల నియామకాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు కూడా అలాగే ఉన్నాయి. తిరుపతి గంగమ్మగుడి దేవస్థానం పాలకమండలి నియామకం కూడా గ్రూప్ తగాదాలతో పెండింగ్‌లో ఉంచారు. పార్టీ పదవులతో బుజ్జగింపు సీఎం సొంత జిల్లాలో కేవలం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అమాసకు డీసీసీబీ చైర్మన్ కట్టబెట్టడం మినహా కొత్తగా ఇంకెవరికీ పదవులు ఇవ్వలేదు. పార్టీ పరంగా ఊరూరికీ పీసీసీ పదవులు ఇస్తూ అందరినీ సంతృప్తిపరచాలని చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు పదిమందికి పీసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల పదవులు కట్టబెట్టారు. గతంలో ఎంఆర్‌సీరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి పీసీసీ ఆఫీస్ బేరర్స్‌గా ఉండగా వీరికి పీసీసీ కార్యదర్శి పదవులు ఇచ్చారు. శ్రీకాళహస్తి నాయకులు కోలా ఆనంద్‌కు, తిరుపతి మాజీ కౌన్సిలర్ టీకే బ్రహ్మానందంకు, ఐకేపీ మహిళా సంఘాల నాయకురాలు శ్రీదేవికి , మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్‌కు, పీఆర్పీ మాజీ నాయకులు ఊకా విజయకుమార్‌కు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కుమారుడు హరికృష్ణకు పీసీసీ కార్యదర్శి పదవులు కట్టబెట్టారు. ఇలా నియోజకవర్గానికి ఒక పీసీసీ కార్యదర్శి లెక్కన రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు ఇచ్చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఏదైనా ప్రభుత్వ నామినేటెడ్ పదవి వస్తుందనుకున్న వారికి ఇలా పార్టీ పదవులతో సరిపెట్టడంతో వారు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. సీఎం తనకు కావాల్సిన వారికి పదవులు ఇచ్చుకోవడం, నిజంగా పార్టీకోసం కష్టపడిన వారిని విస్మరించడం మినహా ఈ రెండున్నర సంవత్సరాల్లో చేసిందేమి లేదని, అడిగితే ముఖాన పార్టీ పదవులు విధిలిస్తున్నారని, ఇవి తమకెందుకని కొందరు జిల్లా స్థాయి నాయకులు మండిపడుతున్నారు. నియోజకవర్గాల్లో కింది క్యాడర్‌ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు బుజ్జగించినా పార్టీలో కొనసాగే పరిస్థితి కనపడడం లేదు. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న ఆశ లేకపోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
సమ్మెకు బ్రేక్
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు తెరపడింది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు శుక్రవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. జిల్లాలో సమ్మెను విరమిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. సమ్మె విరమించినా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిత్యం ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమంలో 25 వేల మంది ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీఓల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 67 రోజుల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఎన్జీఓలతో పాటు జిల్లా గెజిటెడ్ అధికారులు, ఆర్టీసీ కార్మికులు, రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ, నాలుగో తరగతి ఉద్యోగులు, న్యాయవాదులు ఇలా దాదాపు 70 విభాగాల ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఉద్యోగులు రెండు నెలల పాటు విధులు బహిష్కరించారు. ఫలితంగా జిల్లాలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిపోయింది. రెండు నెలల పాటు కలెక్టరేట్, జిల్లాలోని ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ బోసిపోయాయి. సమ్మెకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో ఉద్యోగులు మరింత ఉత్సాహంగా ఉద్యమాన్ని కొనసాగించారు. రెండు నెలల నుంచి ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోయాయి. పలు అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. తొలుత ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 10, 11వ తేదీల్లో ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు సమ్మె విరమించారు. అదే కోవలో ఎన్జీఓలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఉధృతంగా సాగిన ఉద్యమం జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే మొదలైన ఉద్యమం జిల్లాలో గురువారం 79వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమబాట పట్టారు. ఉద్యోగులు జీతాలను సైతం వదులుకొని సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం చేశారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలను ముందుండి నడిపించారు. రోడ్డు పక్కన చిరువ్యాపారం చేసుకునే వారి నుంచి ఆటో కార్మికులు, చెక్కపని, రిక్షా కార్మికులు, టైలర్లు, వివిధ సామాజికవర్గ ప్రజలు ఇలా ప్రతి ఒక్కరూ ఉద్యమానికి అండగా నిలిచారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే మరోసారి మెరుపు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. తలుపులు తెరుచుకోనున్న కార్యాలయాలు ... ఉద్యోగుల సమ్మెతో మూతబడిన ప్రభుత్వ కార్యాలయాల తలుపులు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయి. జిల్లా పరిపాలన భవనం కలెక్టరేట్ తోపాటు, కార్పొరేషన్ కార్యాలయం, విద్యాశాఖ, జెడ్పీ, వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ పీఆర్, ఇరిగేషన్, ట్రెజరీ, రెవెన్యూ కార్యాలయాలు యాథావిధిగా పనిచేయనున్నాయి. రెండు నెలల పాటు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు మోక్షం కలగనుంది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకునే... సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన ప్రజలకు ఎన్జీఓ అసోసియేషన్ నగర కమిటీ నాయకుడు నాసర్‌మస్తాన్‌వలి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకే సమ్మె విరమిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొనే సమ్మె చేసినట్లు వివరించారు. సమ్మెకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె విరమించినా సమైక్యాంధ్ర ఉద్యమం ఆగదన్నారు. రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చే సూచనలకనుగుణంగా పలు రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని నాసర్‌మస్తాన్‌వలి పేర్కొన్నారు. -
సీఎం జిల్లాకు రూ.6వేల కోట్లా..?
చాదర్‌ఘాట్,న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, సొంత జిల్లాకు రూ.6 వేల కోట్లు కేటాయించటం అమానుమాషమని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం పాతబస్తీకి చెందిన పలువురు యువకులు పార్టీ ఎమ్మెల్సీ మహిమూద్ అలీ, ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో గులాబీదళంలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారం కోసం పూటకోమాట మాట్లాడుతున్న చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిని గాడ్సేగా చిత్రీకరించిన చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో మోడీని గాంధీజీతో పోల్చటం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధిచేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు కేవలం వారి బంధువుల ఆస్తులను పెంచుకోవడం కోసం చేశారన్నారు. ఓల్డ్‌సిటీలో నిరుద్యోగ ముస్లిం యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు రేస్‌కోర్స్ గ్రౌండ్లో ఐటీపార్కు ఏర్పాటు చేయిస్తామని, చంచల్‌గూడ జైలును ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని హామీఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తధ్యమని, హైదరాబాద్ పై కావాలని రాద్ధాంతం చేస్తున్నారని..హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో గ్రేటర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్మాలిక్, జలమండలి గౌరవాధ్యక్షుడు చవ్వా సతీశ్, మలక్ పేట,నాంపల్లి నియోజకవర్గాల ఇంచార్జీలు ఆజంఅలీ,కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. -
'తెలంగాణ మంత్రులు పునఃరాలోచించుకోవాలి'
సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల నుంచి వచ్చిన ఉద్యమమని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో యన మాట్లాడుతూ... తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు సమైక్యాంధ్రలాంటి ఉద్యమం చూడలేదన్నారు. అక్టోబర్ 3న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం శుక్రవారం కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మాట్లాడిన తీరు బాధకరంగా ఉందని పితాని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. సీఎం వ్యాఖ్యలపై మాట్లాడిన తీరును తెలంగాణ మంత్రులు మరోసారీ పునరాలోచించుకోవాలని పితాని సత్యనారాయణ సూచించారు. -
పీలేరులో ప్రభుత్వ భూముల సంతర్పణ
పీలేరు, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులో ప్రభుత్వ భూముల సంతర్పణ ప్ర క్రియ మూడు పువ్వులు, ఆరు కాయల చందం గా కొనసాగుతోంది. స్థానికేతరులకు పట్టాల పంపిణీ పరంపర కొనసాగుతోంది. పీలేరు శివారు ప్రాంతం నాగిరెడ్డి కాలనీ సమీపంలోని సర్వే నెంబరు 72/2లో 12మందికి పట్టాలు ఇచ్చిన వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల నజరానాలో భాగంగా ప్రభుత్వ సిబ్బందికి కూడా ఇక్కడ పట్టాలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నారుు. రెండు రోజులుగా సర్వే నెంబర్ 72/ 2లోని గుట్టలను, పెద్ద పెద్ద వృక్షాలను ఇటాచీలతో గుట్టుచప్పుడు కాకుండా కూల్చి చదును చేస్తున్నారు. మూడు తరాలుగా ఈ భూములను అనుభవిస్తున్న స్థానికులు కొందరు మంగళవారం ఈ విషయం తెలుసుకుని అక్కడికి చే రుకుని పనులను అడ్డగించారు. దీంతో పరి స్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఓ దశలో పోలీసులు, రెవెన్యూ అధికారులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. తాము అనుభవిస్తున్న స్థలాన్ని ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎలా చదును చేస్తారని నిలదీశారు. తాము పెంచిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకలించడం ఎంత వరకు సమంజసమని, సమ్మెలో ఉన్న అధికారులు వి ధుల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. అధికారు లు మాట్లాడుతూ గత మే నెలలోనే 19 మందికి ఇళ్ల పట్టాలు జారీ చే శారని తెలిపారు. పోలీసు లు సర్దిచెప్పడంతో స్థానికులు వెళ్లిపోయూరు. స్థానికేతరులకే పట్టాలు.. 72/2లో పట్టాలు తీసుకున్న వారిలో ఉపాధి హామీ, ఐకేపీకి చెందిన అధికారులు, సిబ్బంది, వారి బంధువులు ఉండడం గమనార్హం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేశారన్న కృతజ్ఞతతో పట్టాలు మంజూరు చేసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. మూడు తరాలుగా అనుభవంలో ఉంది మూడు తరాలుగా ఈ భూములు జోలికి ఎవరూ రాలేదు. పీలేరు పట్టణం, మండలానికి సంబంధం లేని వారికి పట్టాలు ఎలా ఇస్తారు ?. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని ఇలా చేసి ఉంటారనే అనుమానం కలుగుతోంది. ఇంత దారుణంగా గతంలో ఎన్నడూ ప్రభుత్వ భూములను సంతర్పణ చేయలేదు. -వీ.రాజారెడ్డి, స్థానికుడు. మాకు తెలియకుండానే ఎలా పట్టాలు ఇస్తారు గుట్టలను సైతం కూల్చి పట్టాలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద గుట్టలను ఇటాచీలతో చదును చేసి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాల్సిన అవసరమేమొచ్చింది. మా పొలాల వద్దకు వెళ్లాలన్నా దారి లేకుండా పోతోంది. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. -గుర్రం వెంకట్రమణారెడ్డి, స్థానికుడు. -
పీలేరులో ప్రభుత్వ భూముల సంతర్పణ
పీలేరు, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులో ప్రభుత్వ భూముల సంతర్పణ ప్ర క్రియ మూడు పువ్వులు, ఆరు కాయల చందం గా కొనసాగుతోంది. స్థానికేతరులకు పట్టాల పంపిణీ పరంపర కొనసాగుతోంది. పీలేరు శివారు ప్రాంతం నాగిరెడ్డి కాలనీ సమీపంలోని సర్వే నెంబరు 72/2లో 12మందికి పట్టాలు ఇచ్చిన వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల నజరానాలో భాగంగా ప్రభుత్వ సిబ్బందికి కూడా ఇక్కడ పట్టాలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నారుు. రెండు రోజులుగా సర్వే నెంబర్ 72/ 2లోని గుట్టలను, పెద్ద పెద్ద వృక్షాలను ఇటాచీలతో గుట్టుచప్పుడు కాకుండా కూల్చి చదును చేస్తున్నారు. మూడు తరాలుగా ఈ భూములను అనుభవిస్తున్న స్థానికులు కొందరు మంగళవారం ఈ విషయం తెలుసుకుని అక్కడికి చే రుకుని పనులను అడ్డగించారు. దీంతో పరి స్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఓ దశలో పోలీసులు, రెవెన్యూ అధికారులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. తాము అనుభవిస్తున్న స్థలాన్ని ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎలా చదును చేస్తారని నిలదీశారు. తాము పెంచిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకలించడం ఎంత వరకు సమంజసమని, సమ్మెలో ఉన్న అధికారులు వి ధుల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. అధికారు లు మాట్లాడుతూ గత మే నెలలోనే 19 మందికి ఇళ్ల పట్టాలు జారీ చే శారని తెలిపారు. పోలీసు లు సర్దిచెప్పడంతో స్థానికులు వెళ్లిపోయూరు. స్థానికేతరులకే పట్టాలు.. 72/2లో పట్టాలు తీసుకున్న వారిలో ఉపాధి హామీ, ఐకేపీకి చెందిన అధికారులు, సిబ్బంది, వారి బంధువులు ఉండడం గమనార్హం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేశారన్న కృతజ్ఞతతో పట్టాలు మంజూరు చేసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. మూడు తరాలుగా అనుభవంలో ఉంది మూడు తరాలుగా ఈ భూములు జోలికి ఎవరూ రాలేదు. పీలేరు పట్టణం, మండలానికి సంబంధం లేని వారికి పట్టాలు ఎలా ఇస్తారు ?. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని ఇలా చేసి ఉంటారనే అనుమానం కలుగుతోంది. ఇంత దారుణంగా గతంలో ఎన్నడూ ప్రభుత్వ భూములను సంతర్పణ చేయలేదు. -వీ.రాజారెడ్డి, స్థానికుడు. మాకు తెలియకుండానే ఎలా పట్టాలు ఇస్తారు గుట్టలను సైతం కూల్చి పట్టాలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద గుట్టలను ఇటాచీలతో చదును చేసి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాల్సిన అవసరమేమొచ్చింది. మా పొలాల వద్దకు వెళ్లాలన్నా దారి లేకుండా పోతోంది. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. -గుర్రం వెంకట్రమణారెడ్డి, స్థానికుడు. -
పీలేరులో ప్రభుత్వ భూముల సంతర్పణ
పీలేరు, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులో ప్రభుత్వ భూముల సంతర్పణ ప్ర క్రియ మూడు పువ్వులు, ఆరు కాయల చందం గా కొనసాగుతోంది. స్థానికేతరులకు పట్టాల పంపిణీ పరంపర కొనసాగుతోంది. పీలేరు శివారు ప్రాంతం నాగిరెడ్డి కాలనీ సమీపంలోని సర్వే నెంబరు 72/2లో 12మందికి పట్టాలు ఇచ్చిన వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల నజరానాలో భాగంగా ప్రభుత్వ సిబ్బందికి కూడా ఇక్కడ పట్టాలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నారుు. రెండు రోజులుగా సర్వే నెంబర్ 72/ 2లోని గుట్టలను, పెద్ద పెద్ద వృక్షాలను ఇటాచీలతో గుట్టుచప్పుడు కాకుండా కూల్చి చదును చేస్తున్నారు. మూడు తరాలుగా ఈ భూములను అనుభవిస్తున్న స్థానికులు కొందరు మంగళవారం ఈ విషయం తెలుసుకుని అక్కడికి చే రుకుని పనులను అడ్డగించారు. దీంతో పరి స్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఓ దశలో పోలీసులు, రెవెన్యూ అధికారులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. తాము అనుభవిస్తున్న స్థలాన్ని ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎలా చదును చేస్తారని నిలదీశారు. తాము పెంచిన పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకలించడం ఎంత వరకు సమంజసమని, సమ్మెలో ఉన్న అధికారులు వి ధుల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. అధికారు లు మాట్లాడుతూ గత మే నెలలోనే 19 మందికి ఇళ్ల పట్టాలు జారీ చే శారని తెలిపారు. పోలీసు లు సర్దిచెప్పడంతో స్థానికులు వెళ్లిపోయూరు. స్థానికేతరులకే పట్టాలు.. 72/2లో పట్టాలు తీసుకున్న వారిలో ఉపాధి హామీ, ఐకేపీకి చెందిన అధికారులు, సిబ్బంది, వారి బంధువులు ఉండడం గమనార్హం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేశారన్న కృతజ్ఞతతో పట్టాలు మంజూరు చేసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. మూడు తరాలుగా అనుభవంలో ఉంది మూడు తరాలుగా ఈ భూములు జోలికి ఎవరూ రాలేదు. పీలేరు పట్టణం, మండలానికి సంబంధం లేని వారికి పట్టాలు ఎలా ఇస్తారు ?. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని ఇలా చేసి ఉంటారనే అనుమానం కలుగుతోంది. ఇంత దారుణంగా గతంలో ఎన్నడూ ప్రభుత్వ భూములను సంతర్పణ చేయలేదు. -వీ.రాజారెడ్డి, స్థానికుడు. మాకు తెలియకుండానే ఎలా పట్టాలు ఇస్తారు గుట్టలను సైతం కూల్చి పట్టాలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద గుట్టలను ఇటాచీలతో చదును చేసి ఇళ్ల స్థలాలుగా ఇవ్వాల్సిన అవసరమేమొచ్చింది. మా పొలాల వద్దకు వెళ్లాలన్నా దారి లేకుండా పోతోంది. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. -గుర్రం వెంకట్రమణారెడ్డి, స్థానికుడు. -
జిల్లా బంద్ సంపూర్ణం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్రెడ్డిలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం బంద్ పాటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. అన్ని సంఘాలూ బంద్‌లో పాల్గొనడంతో జిల్లాలోని ఆరు డిపోల్లో ఉన్న 635 బస్సులు రోడ్డెక్కలేదు. విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, వ్యవసాయ మార్కెట్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రగతిభవన్‌నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. నిజామాబాద్ బస్టాండ్ ఆవరణలో తెలంగాణ వాదులు నల్లజెండాను ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. బోధన్ ఎన్డీఎస్ఎల్ కర్మాగారంలో కార్మికులు విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. బోధన్‌లో ఆర్టీసీ డిపో గేటుకు తాళం వేశారు. నాగన్‌పల్లి, రెంజల్ మండలం తూంపల్లిలలో రాస్తారోకో చేశారు. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, మహిళలు, కులసంఘాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారంతా బంద్‌ను జయప్రదం చేయడం ద్వారా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పక్షపాత వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. నిజామాబాద్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బంద్‌ను పర్యవేక్షించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సభకు ముఖ్యమంత్రి, డీజీపీల అండదండలున్నాయని నేతలు ఆరోపించారు. బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు వెలవెలబోయాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాలు జనం లేక బోసిపోయాయి. శనివారం ప్రగతిభవన్‌లో జరగాల్సిన నీటి సలహా బోర్డు సమావేశాన్ని బంద్ కారణంగా అధికారులు వాయిదా వేశారు. నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతల చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెలంగాణ వాదులు రాస్తారోకోలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యునివర్సిటీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తరగతులు బహిష్కరించి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ తీసి నిరసన తెలిపారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ హాస్టల్‌తో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యకాండను తెలంగాణవాదులు తీవ్రంగా ఖండించారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణప్రాంతానికి చెందిన కానిస్టేబుల్‌పై సీమాంధ్ర పోలీసులు దాడి చేయడాన్ని తప్పుపట్టారు. ఉద్యోగుల పేరుతో సంఘ వ్యతిరేక శక్తులను హైదరాబాద్ తరలించి, తెలంగాణవాదులపై దాడి చేయించారని ఆరోపించారు. విద్యార్థులపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంద్‌ను జయప్రదం చేయడానికి రాజకీయ జేఏసీ భాగస్వామ్య పక్షాలైన టీఆర్ఎస్, న్యూడెమోక్రసీలోని రెండు వర్గాలు, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు తీశారు. -
కిరణ్ డెరైక్షన్లోనే ‘సమైక్యాంధ్ర’
ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి దర్శక నిర్మాతగా మారా రని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్ ఆరోపించారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న ఆయన.. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత మాటమార్చి సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారని మర్శించారు. మరోసారి అడ్డుకునే కుట్ర గతంలో కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటన చేస్తే అడ్డుకున్న సీమాంధ్ర నాయకులు ప్రస్తుతం మరోసారి అదే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖరాశారని, ఇప్పుడు మాట మా ర్చి ప్రజల ఆకాంక్షను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో సీమాంధ్రుల సభకు అనుమతి ఇవ్వడం వెనుక సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, డీజీపీ దినేశ్‌రెడ్డిల కుట్ర దాగుందన్నారు. హైదరాబాద్ తెలంగాణదే అని, కేంద్ర పాలిత ప్రాంతానికి ఒప్పుకునేది లేదని పేర్కొన్నారు. తెలంగాణ బంద్ విషయమై జేఏసీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అయినా పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. పదవినుంచి తొలగించాలి తెలంగాణకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు పల్ల వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యక్రమా ల్లో భాగంగా ఈనెల 23వ తేదీన జిల్లాలో సైకిల్‌యాత్ర నిర్వహించనున్నామన్నారు. వచ్చేనెల 3, 4, 5 తేదీల్లో కలెక్టరేట్ ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వేల్పూర్ భూమయ్య, నాయకులు ఓమయ్య, ఎనుగందుల మురళి, రాజు గౌడ్, సుధాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు -
సీఎం ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నడు
ఎన్జీవోస్కాలనీ, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నారని, హింసను ప్రేరేపిస్తున్నారని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. సీమాంధ్రులకు తెలంగాణను పాలించే హక్కులేదన్నారు. ముల్కీ వారోత్సవాల్లో భాగంగా హన్మకొండలోని కాళోజీ సెంటర్లో టీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మహాదీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఏనాడూ హింసకు పాల్పడలేదన్నారు. తమపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. ఏడో తేదీన ఏపీఎన్జీవోస్ జరుపుతున్న సభ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దాడి చేయడమేనన్నారు. మద్రాసు నుంచి తరిమికొట్టినట్టే హైదరాబాద్ నుంచి తరమికొట్టే రోజులు తీసుకురావద్దని సూచించారు. తెలంగాణ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిస్తే తన చేతిలో ఏమీ లేదని... అంతా కాంగ్రెస్ అధిష్టానం, కేంద్రం చేతుల్లో ఉందని చట్టసభలోనే చెప్పారని గుర్తు చేశారు. తీరా సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. సీమాంధ్ర పార్టీలు తెలంగాణలో లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమం న్యాయమైందని మాట్లాడుతున్నారని, తెలంగాణలో చేసేది అధర్మ యుద్ధమా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో... అయనకే తెలియడం లేదని విమర్శించారు. అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నిరోజులైనా సీమాంధ్ర ప్రాంతం వారు.. వారి స్వస్థలంకు వెళ్లాల్సిందేనన్నారు. సాగరహారంకు అనుమతివ్వాలని 30 మంది ఎమ్మెల్యేలం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు వెళ్లామని, రేపు రాత్రి ఉందనగా అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. దీక్షలో తక్కళ్లపల్లి రవీందర్రావు, మర్రి యాదవరెడ్డి, నున్నా అప్పారావు, సదానందం, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి, పాపిరెడ్డి, సీతారాం నాయక్, శ్రీనివాస్‌రావు, బొట్ల బిక్షపతి, పరిటాల సుబ్బారావు, కోల రాజేశ్‌కుమార్, ఎ.జగన్మోహన్రావు, ఈగ వెంకటేశ్వర్లు, రాంకిషన్, వీరాచారి, రత్నాకర్‌రెడ్డి, శ్యాంసుందర్, దాస్యనాయక్, షేక్ హుస్సేన్, ఆర్ శ్రీనివాస్, పి.విజయలక్ష్మి, బి.రాము, ధరంసింగ్, కేవీ.నరేందర్, కె.సామ్యూల్, కంతి రమేష్ పాల్గొన్నారు. ఇక్కడి ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటలేరు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్టేడియంలో క్రీడలకు, క్రీడాకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ జీఓ ఉన్నా... దాన్ని కాలరాస్తూ ఏపీఎన్జీవోల సభకు ఎలా అనుమతి ఇస్తారు. - దేవీప్రసాద్, టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాబు, కిరణ్ అడ్డుకుంటున్నరు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నరు. సీమాం ధ్రులకు తెలంగాణను పాలించే హక్కు లేదు. సీమాంధ్రుల కుట్రలను తిప్పి కొడతాం. తెలంగాణ ప్రజలకు శాంతి దీక్షలు తెలుసు..సమరాలు తెలుసు. -పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నరు రాష్ట్ర విభజన ప్రక్రియ ఆలస్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకుని నెల రోజులు గడుస్తున్నా... కేంద్రం ముందుకు పోవడం లేదు. దీంతో ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణపై బీజేపీకి స్పష్టమైన వైఖరి ఉంది. యూపీఏ ప్రభుత్వం ఇవ్వకున్నా, ఆ తరువాత అధికారంలోకి వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తుంది. ఇప్పటికే తెలంగాణపై నరేంద్ర మోడీచే హైదరాబాద్‌లో సభ నిర్వహించాం. త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించాలి. - నరహరి వేణుగోపాల్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి టీడీపీ గద్దెలు కూలుతయ్... తెలంగాణలో టీడీపీ గద్దెలు కూలుతయ్. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ నమ్మబలికి చంద్రబాబు తెలంగాణకు మోసం చేశారు. బాబు చేపట్టిన సమైక్య బస్సు యాత్ర, నిర్ణయంపై చెంచాగిరి చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏం సమాధానం చెబుతరు. తెలంగాణను దోచుకున్న వారికి అనుమతిచ్చిండ్రు. మేము హైదరాబాద్‌లో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తామంటే అనుమతియ్యలె. పైగా అనేక ఇబ్బందులు పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తున్నా సహనంతో ఉంటున్నాం. శాంతియుతంగా, గాంధేయ మార్గంలో వెళ్తున్నం. ఏపీఎన్జీవోలు సభ జరుపుకుంటే స్టేడియంలో ఉన్న తెలంగాణ తేల్లు, పాములు, కుక్కలు కరుస్తాయి. - దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే కల్లోలం సృష్టించాలని చూస్తున్నరు ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చి హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించాలని సీమాంధ్రుల నేతృత్వంలో ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వారికి ఇచ్చిన అనుమతి రద్దుచేయాలి. తెలంగాణ ప్రక్రియ వేగవంతమవుతున్న క్రమంలో సమైక్యవాదం అంటూ సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు బుసలు కొడుతున్నరు. కూతురి వివాహానికి సినీ నటుడు బాలకృష్ణ తన సోదరుడు హరికృష్ణనే పిలువలేదు. ు కుటుంబమే కలసి ఉండనప్పుడు భయపెట్టి బలవంతంగా ఉండాలంటే ఎలా కలిసి ఉంటాం. పోలీసులు అత్యుత్సాహం చూపి అనుమతిచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు, రౌడీషీట్లను ఎత్తేయాలి. ఏడో తేదీన జరిగే శాంతి ర్యాలీకి రెండు రోజుల ముందుగానే చేరుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులను వేదించిన అధికారులను, పోలీసులను రాష్ట్రం ఏర్పడ్డాక వదిలిపెట్టం. - శ్రీనివాస్‌గౌడ్ , తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర పాలితం చేస్తే ఊరుకోం హైదరాబాద్‌ను కేంద్ర పాలితం చేస్తే ఊరుకునేది లేదు. హైదరాబాద్ సహా 10 జిల్లాల తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలిచి ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇప్పించిండు. టీఎన్జీవోస్ దీక్షకు 10 రోజుల కిందట అనుమతి కోరితే ఇవ్వలేదు. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని కుట్రలు చేస్తున్నరు. - కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
క్యాంపు ఆఫీస్‌కు పరిమితమైన కిరణ్
ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. రవీంద్రభారతిలో గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా వెళ్లలేదు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ ప్రకటన నేపథ్యంలో సీఎం కిరణ్ పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ హైకమాండ్ నిర్ణయాన్ని మార్చేందుకు ప్రయత్నించారు. సీమాంధ్ర ప్రాంతంతో పెద్ద ఎత్తున జరుగుతున్న సమైక్య ఉద్యమం గురించి అధిష్టానికి వివరించారు. రాష్ట్ర విడిపోతే ఎదురయ్యే సమస్యల గురించి కోర్ కమిటీ, ఆంటోనీ కమిటీ, అధిష్టాన పెద్దల ముందు ఏకరువు పెట్టారు. అయితే విభజనకు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని హైకమాండ్ స్పష్టం చేయడంతో ఆయన అధికార కార్యక్రమాలకు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు చేస్తుండడంతో సచివాలయానికి రావడం బాగా తగ్గించేశారు. కాగా, ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, డీజీపీ దినేష్ రెడ్డి ఇవాళ సీఎం కిరణ్‌ను కలిశారు. 7న హైదరాబాద్‌లో జరిగే ఏపీఎన్జీవో సభపై చర్చించారు. అంతకుముందు మంత్రులు పితాని సత్యనారాయణ, విశ్వరూప్ కూడా కిరణ్‌తో సమావేశమయి ఢిల్లీ పర్యటనలో చర్చించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. -
'సీమాంధ్ర ఉద్యమాన్ని సీఎం, డీజీపీలు నడుపుతున్నారు'
సీఎం కిరణ్, డీజీపీ దినేష్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు బుధవారం మెదక్ లో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7వ తేదీన ఏపీఎన్జీవోలు చేపట్టనున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదే రోజు తెలంగాణ ఉద్యోగులు చేపట్టనున్న శాంతి ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన కిరణ్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సర్కార్ సీమాంధ్రవారిని ఓ విధంగా, తెలంగాణ ప్రాంతం వారిని మరో విధంగా చూస్తుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యమాన్ని సీఎం,డీజీపీలు దగ్గర ఉండి నడపుతున్నారని ఆయన ఆరోపించారు. -
మళ్లీ హస్తిన బాటలో సీఎం, బొత్స
సాక్షి, హైదరాబాద్: అధికారిక కమి టీ ఏర్పాటుతో సహా విభజన అం శంపై నోట్ రూపకల్పనకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉండాల్సిం దిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ పెద్దల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో సీఎం ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సోమవారం మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలు ముఖ్యమంత్రిని కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరగా, తొందరపడొద్దని సీఎం సూచించారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం తాను ఢిల్లీ వెళ్తున్నందున ఒక స్పష్టత వస్తుందని, ఆపై నిర్ణయం తీసుకుందామని వివరించారు. ఇలావుండగా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. మరి కొందరు మంత్రులు కూడా మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. -
కిరణ్, బాబు సీమాంధ్రకే ప్రతినిధులు: కోదండరాం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుల స్వభావం తేటతెల్లమైందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. ఆదిలాబాద్‌లో ముల్కీ అమరుల సంస్మరణ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ హయాంలో విభజనను అడ్డుకున్నది తానేనని చంద్రబాబు చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడమేనని చెప్పారు. తెలంగాణ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన కిరణ్.. ఇప్పుడేమో నిర్ణయాలు పార్టీలు కాదు ప్రజలు తీసుకుంటారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వారిద్దరు ఆంధ్ర ప్రాంత నాయకుల్లా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రులను హైదరాబాద్‌లో బతకనివ్వరనడంలో వాస్తవం లేదన్నారు. హైదరాబాద్‌లో భూములమ్మి ఫ్లై ఓవర్లు, రింగ్‌రోడ్లు, హైటెక్‌సిటీని నిర్మించి సీమాంధ్రులకు లబ్ధి చేకూర్చిన చంద్రబాబు, అంతా తానే చేశానని చెప్పుకోవడం సరికాదన్నారు. సీమాంధ్ర నేతల పాలన కారణంగానే హైదరాబాద్‌లో ఫార్మా, ఇతర పరిశ్రమలన్నీ మూతడ్డాయని ధ్వజమెత్తారు. ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించే శాంతి ర్యాలీలో తెలంగాణవాదులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
మంత్రుల రాజీనామాలు తూచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత కోసమంటూ మంత్రులు చేసిన రాజీనామాలు పెద్ద ప్రహసనంగా మారాయి. ముఖ్యమంత్రికి మంత్రులిచ్చిన రాజీనామాలేవీ ఇప్పటికీ ఆమోదం పొందలేదు. పైగా మంత్రులంతా యథావిధిగా అధికార హోదాను అనుభవిస్తున్నారు. రాజీనామాల ఆమోదమంటూ అడపాదడపా వారు చేస్తున్నది ఉత్తుత్తి హడావుడిగానే మిగిలిపోతోంది. సోమవారం కూడా అదే పునరావృతమైంది. తమ రాజీనామాల ఆమోదం కోసమంటూ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు గవర్నర్ నరసింహన్‌ను, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వేర్వేరుగా కలిశారు. తమ రాజీనామాలు ఆమోదించాలని గంటా, ఏరాసు సీఎంను కోరారు. మంత్రులుగా కొనసాగుతూ సమైక్యోద్యమంలో భాగస్వాములం కాలేమన్నారు. తమ రాజీనామా లేఖను వెంటనే గవర్నర్‌కు పంపాలన్నారు. అయితే రాజీనామాల విషయంలో అందరం కలిసే ఒక నిర్ణయం తీసుకుందామని, తొందరపాటు వద్దని సీఎం వారించారు. ‘‘ఒకటి రెండు రోజుల్లో నేను ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. పెద్దల స్పందన, పరిణామాలను అనుసరించి అంతా కలసి ఒకే బాటలో వెళ్దాం. రాష్ట్ర సమైక్యత కోసం అధిష్టానంతో నేను ఎప్పటి కప్పుడు చర్చిస్తున్నాను. పార్టీ పెద్దలను అంగీకరింపజేసే ప్రయత్నం చేస్తున్నాను. వారి వైఖరిపై నా పర్యటన తర్వాత స్పష్టత వస్తుంది’’ అన్నారు. రాజీనామాల ఆమోదంపై కిరణ్ సూచనల మేరకు వెళ్లాలన్న అభిప్రాయానికి కాసు, శత్రుచర్ల వచ్చారని సమాచారం. అంతా కలిసి నిర్ణయం తీసుకుందామని సీఎం చెబుతున్నందున ఆయన మాట ప్రకారం ముందుకెళ్తామని శత్రుచర్ల తనను కలసిన మీడియాతో అన్నారు. అంతా ఒకేసారి రాజీనామాలు ఆమెదింపజేసుకునే కన్నా ఒకరి తరవాత ఒకరుగా చేస్తే మేలన్న అభిప్రాయాన్ని వినిపించినట్టు తెలిసింది. గవర్నర్‌ను కలిసింది ఇద్దరు మంత్రులే: రాజీనామాల ఆమోదం కోసం నలుగురు మంత్రులు గవర్నర్‌ను కలవబోతున్నారంటూ ఆదివారం లీకులిచ్చారు. ముగ్గురు మంత్రులు గవర్నర్‌ను కలుస్తారని ప్రచారం జరిగినా చివరకు గంటా, ఏరాసు రాజ్‌భవన్‌కు వెళ్లారు. ‘కొత్తగా నాకు రాజీనామా లేఖలిచ్చినా తిరిగి వాటిని సీఎంకే పంపాల్సి ఉంటుంది. దానికి బదులు మీరిప్పటికే సీఎంకు ఇచ్చిన రాజీనామా లేఖలు నాకందేలా చేయండి చాలు. వెంటనే ఆమోదిస్తా’నని గవర్నర్ వారితో వ్యాఖ్యానించారని సమాచారం. దాంతో మంత్రులు ఆయనకు కొత్తగా రాజీనామా లేఖలివ్వకుండానే వెనుదిరిగారు. రాష్ట్ర విభజన జరిగితే మంత్రులుగా కొనసాగలేమని ముందు నుంచి చెబుతున్నామని అనంతరం వారు మీడియాతో అన్నారు. ‘‘33 రోజులయినా మా రాజీనామాలను ఆమోదించలేదు. సీఎంను కలిసి, రాజీనామాలను తొందరగా గవర్నర్‌కు పంపాలని కోరాం. రాజీనామాలై నా, ఇంకేదైనా కొద్దిరోజుల్లోనే అంతా కలిసే నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ స్థాయికైనా వెళ్దామన్నారు’’ అంటూ వివరించారు. రాజీనామాల ఆమోదానికి సీఎంపై ఒత్తిడి చేస్తామన్నారు. నవంబర్ 2న రాజీనామా: విశ్వరూప్: మంత్రి విశ్వరూప్ సోమవారం సాయంత్రం కిరణ్‌తో వేరుగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనను కాంగ్రెస్ వెనక్కు తీసుకుంటుందని, రాష్ట్రం సమైక్యంగానే ఉంచుతామని స్పష్టం చేస్తుందని తాను నూటికి నూరుపాళ్లు విశ్వసిస్తున్నట్టు చెప్పారు. అందుకోసం నవంబర్ 1 దాకా ఎదురు చూస్తాన్నారు. అలా చెప్పని పక్షంలో 2న గవర్నర్‌ను కలిసి రాజీనామాను ఆమోదింపచేసుకొని ప్రజా ఉద్యమంలో భాగస్వామిని అవుతానన్నారు. -
విభజనతో నీటి సమస్యలు తీవ్రతరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం కలసి ఉన్నప్పుడే రాయలసీమకు సరిగ్గా నీళ్లు రావడం లేదని, విడిపోతే సమస్య మరింత సంక్లిష్టమవుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోతే నీటి ఇబ్బందులు ఏర్పడతాయని గ్రహించే తాను సమైక్యవాదం వినిపిస్తున్నానని అన్నారు. సీపీఐ నేతృత్వంలో వందలాది మంది రైతులు సోమవారం ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తుంగభద్ర డ్యాం నుంచి పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు కేటాయించిన పది టీఎంసీల నీటిని విడుదల చేసి, కుడి కాలువ కింద ఉన్న 49 చెరువులు నింపాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో 871 అడుగుల నీటి స్థాయి ఉంటేనే రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వడం సాధ్యపడుతుందన్నారు. వాస్తవం ఇలా ఉంటే రామకృష్ణ వంటి సీపీఐ నేతలు విభజన జరగాలంటున్నారని అన్నారు. రైతు సమస్యల్ని గుర్తించయినా సమైక్యవాదాన్ని వినిపించాలని సూచించారు. కాగా, హంద్రీ-నీవా కాలువ ద్వారా పూర్తి స్థాయిలో నీటిని పంపింగ్ చేసి కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ వరకు చెరువుల్ని నింపాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరింది. అనంతపురం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పది వేలు, పంట వేయని రైతులకు ఎకరానికి ఐదు వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ అధికారులతో చర్చించి ఆయకట్టుకు నీటి విడుదలపై ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలసిన వారిలో రైతు సంఘం నేతలు కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, రావుల వెంకయ్య, పశ్య పద్మ, జగదీష్ తదితరులు ఉన్నారు. -
విభజనతో జలయుద్ధాలు: సీఎం కిరణ్
రాష్ట్రం విడిపోతే నీటియుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులు సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ సంక్షోభంలో పడిపోతుందని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ వివాదాలకు కేంద్ర బిందువు అవతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ రైతు సమస్యలు పరిష్కరించాకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రైతులతో సీఎం అన్నారు. కేంద్రం ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేపడితే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని సీఎం కిరణ్ అంతకుముందు అన్నారు. రాష్ట్రం కలిసివుండాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణకు విద్యుత్ సమస్య ఎదురవుతుందని తెలిపారు. 610 జీవో విషయంలో అస్యతాలు ప్రచారం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు. -
గూగుల్‌లో వరంగల్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వరల్డ్ హెరిటేజ్ సిటీగా ఇప్పటికే ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం దక్కించుకున్న వరంగల్ మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. మరో కొన్ని గంటల్లో అరుదైన ఘట్టాన్ని చేరుకోనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లా భౌగోళిక స్వరూపం ప్రపంచం ముంగిట్లోకి వెళ్లనుంది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, రోడ్లు, భవనాలు, ప్రభుత్వ కార్యాలయూలు, ఆస్పత్రులు, గ్రామాల ఛాయూచిత్రాలను గూగుల్‌లో ప్రత్యక్షంగా వీక్షించే అద్భుత గడియ రానే వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్లో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘వరంగల్ ఆన్లైన్’ను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్‌జాజ్, కలెక్టర్ కిషన్, గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ లతిటేష్ కాట్రగడ్డ, న్యూ బిజినెస్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కిరణ్‌బాప్న, ప్రోగ్రాం మేనేజ్మెంట్ డెరైక్టర్ సురేన్ రేహలా హాజరుకానున్నారు. హైదరాబాద్ తర్వాత జిల్లాకే.. రాష్ర్ట రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లాకే ఈ అవకాశం దక్కనుంది. కాకతీయుల ఖిల్లా, రామప్ప చెరువు, వరంగల్‌లోని విద్య, వైద్య సముదాయాలు, వారసత్వ కట్టడాలను గూగుల్ వెబ్సైట్ నుంచి మనం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. జిల్లాలోని ప్రధాన రహదారులు, పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు, రెవెన్యూ గ్రామాలు, సహజ వనరులన్నింటినీ ఎన్ఐటీ, జవహర్ నాలెడ్జ్ సెంటర్ విద్యార్థుల సహాయంతో గూగుల్ విజ్వలైజ్ చేసింది. విజువల్స్ కోసం అధునాతన 3డీ టెక్నాలజీని ఉపయోగించారు. జిల్లా అంతకు ముందు పనిచేసిన కలెక్టర్ రాహుల్‌బొజ్జా హయాంలో గూగుల్ విజువలైజేషన్ కార్యక్రమం చేపట్టగా... ఇప్పటి కలెక్టర్ జి.కిషన్ ఆధ్వర్యంలో గూగుల్ ద్వారా ‘వరంగల్ ఆన్లైన్’ అందుబాటులోకి రానుంది. మంత్రి పొన్నాల చొరవ.. జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్‌ను గుగూల్లో చూపించేందుకు ప్రత్యేక చొరవ చూపించారు. గూగుల్ సంస్థ ప్రతినిధులకు అందుకు కావాల్సిన సహకారాన్ని ఆయన అందించారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదేశాలతో జిల్లాలోని సమగ్ర సమాచారాన్ని క్రోఢీకరించడంలో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా... అధికార యత్రాంగాన్ని భాగస్వాములను చేశారు. రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో విలేజ్ రెవెన్యూ, సర్వేల్యాండ్ అధికారుల సహకారంతో భౌగోళిక స్వరూపాన్ని గుగూల్లో పొందుపరిచారు. 51 మండలాల సమాచారం జిల్లాలోని 51 మండలాల్లో ఉన్న 1066 గ్రామాలు, 10వేల ప్రాంతాలు, 700 ప్రధాన రోడ్లు ‘వరంగల్ ఆన్లైన్’లో కనిపిస్తాయి. ఇవేగాక ఖిలావరంగల్ కోట, వేరుుస్తంభాలగుడి, రామప్ప గుడి, కోటగూళ్లు, పాకాల, లక్నవరం సరసులు, కాకతీయ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) , ఎంజీఎం, కాకతీయ మెడికల్ కళాశాల, కాజీపేట రైల్వే స్టేషన్... ఇలా అనేక చారిత్రక ప్రదేశాలు, పురావస్తు కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ‘వరంగల్ ఆన్లైన్’లో ప్రత్యక్షంగా కనిపించనున్నాయి. -
సీఎంతో సీమాంధ్ర నేతల భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకరరెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో కిరణ్‌తో మంతనాలు జరిపారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం గురించి చర్చించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రయత్నాలు కొనసాగించాలని వారు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మరోసారి ఢిల్లీకి వెళ్లి అధిష్టానం ముందు తమ వాదనలు బలంగా వినిపించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే వీరు ఎప్పుడు ఢిల్లీ వెళతారనే దానిపై స్పష్టత లేదు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, మరో ఇద్దరు సీమాంధ్రకు చెందిన మంత్రులు కూడా రేపు గవర్నర్‌ను కలసి తమ రాజీనామా లేఖలను అందజేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
‘మెట్రో ఇండియా’ ఆంగ్ల పత్రిక ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ప్రచురితమయ్యే‘మెట్రో ఇండియా’ ఆంగ్ల దినపత్రికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో పత్రికావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు ‘మెట్రో ఇండియా’ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తూ పత్రికలకు విశ్వసనీయత ఉండాలని అన్నారు. పత్రికలు విలువలకు పెద్దపీట వేస్తూ జాతిని ముందుకు నడిపించాలని ఆకాంక్షిం చారు. ప్రస్తుతం దేశంలో మీడియా సత్యాల కంటే సంచలనాలకే అధిక ప్రాధాన్యమిస్తోందని, ఇది దేశ ప్రగతి ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పత్రిక దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో వెలువడుతుందని పత్రిక సీఎండీ సీఎల్ రాజం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంఐఎం పార్టీ నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, సీఎల్ రాజం సతీమణి విజయ రాజం తదితరులు పాల్గొన్నారు. -
నిమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ నరేంద్రనాథ్
సాక్షి; హైదరాబాద్: నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ లావు నరేంద్రనాథ్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం నిర్ణయం తీసుకున్నారు. 25 ఏళ్లుగా నిమ్స్‌లో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తున్న నరేంద్రనాథ్ గత ఐదేళ్లుగా ఆ విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిమ్స్ డెరైక్టర్ పోస్టు కోసం నియమించిన సెర్చ్‌కమిటీ డాక్టర్ ముకుంద్‌రెడ్డి, డాక్టర్ జీఎస్ఎన్ రాజులతో పాటు డాక్టర్ నరేంద్రనాథ్ పేరునూ సూచించింది. ప్రభుత్వం చివరకు నరేంధ్రనాథ్నే ఖరారు చేసింది. వాస్తవానికి ఆయన పదవీకాలం ఆగస్టు 30వ తేదీతోనే ముగిసింది. సోమవారం బాధ్యతలు చేపట్టనున్న ఆయన మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. నరేంద్రనాథ్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇంతకుముందు డెరైక్టర్‌గా పనిచేసిన డాక్టర్ ధర్మరక్షక్ అవినీతి ఆరోపణల కారణంగా తప్పుకున్నారు. అప్పటినుంచి వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని నిమ్స్‌కు ఇన్చార్జిగా ఉన్నారు. -
సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీఎం
ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర జేఏసీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రొళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్వీ మండల శాఖ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణపట్ట వివక్షతతో వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్, టీడీపీ నాయకులు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో కొనసాగుతున్న కృత్రిమ ఉద్యమాల వెనక పెట్టుబడిదారుల హస్తం ఉందన్నారు. వ్యాపారాలు, ఆస్తుల రక్షణ కోసమే పెట్టుబడిదారులు సీమాంధ్రలో ఉద్యమాలను నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు అబ్బసాని యాదగిరియాదవ్, టీఆర్ఎస్వీ మేడ్చల్ నియోజకవర్గ అధ్యక్షుడు చాప భాస్కర్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు అరవింద్, మేడ్చల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ రవీందర్‌యాదవ్, సెక్రెటరీ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు అనంతగిరి, న్యూస్‌లైన్: రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో తెలంగాణ న్యాయవాదుల అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ పిలుపుమేరకు వికారాబాద్‌లో శుక్రవారం లాయర్లు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంపూర్ణ ఆనంద్, మాధవరెడ్డిలు మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలోనూ ఉద్యమం ఉధృతి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నాగరాజు, జాయింట్ సెక్రెటరీ రమేష్, న్యాయవాదులు నాగేందర్‌గౌడ్, రాంచెందర్‌రావు తదితరులున్నారు. -
కిరణ్ సీమాంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్నారు
బోనకల్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకు మాత్రమే సీఎంలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరిక ఉపేందర్ మిమర్శించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రెండు రోజుల పాటు మండల జేఏసీ ఆధ ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతి రిలే నిరాహార దీక్షకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం సీమాంధ్ర పెట్టుబడిదారుల దొపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని జల, ఖనిజ సంపదతో పాటు ఉద్యోగాలను సైతం ఆంధ్ర వారు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఆంధ్ర పెట్టుబడిదారులు ప్రయత్నించడం తగదన్నారు. ప్రస్తుతం ఆంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాలు అర్థరహితమైనవని విమర్శించారు. ఖమ్మంలో త్వరలో 500 మంది వీఆర్ఓలతో శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ శిబిరంలో వీఆర్ఓల సంఘం మండల అధ్యక్షుడు జె నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ మాస్తాన్, పి.సాయిలు, కె.నాగేశ్వరరావు, కె.మేరి, శ్రీనివాసరావు, వెంకటరమణ తదితరులు కూర్చున్నారు. శిబిరాన్ని తహశీల్దార్ షేక్ ముంతాజ్, ఎంపీడిఓ కె చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, నాగేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కళ్యాణపు నాగేశ్వరరావు, తన్నీరు రవి తదితరులు సందర్శించారు. -
రింగ్‌రోడ్డుకు బాలారిష్టాలు
గద్వాల, న్యూస్‌లైన్: సరిగ్గా రెండేళ్ల క్రితం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేసిన గద్వాల రింగ్‌రోడ్డు పనులు నేటికీ టెండర్ల దశ దాటడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఉద్దేశించిన రింగ్‌రోడ్డు పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయో, ఎన్నేళ్లకు పూర్తవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జిల్లాలోనే అతిపెద్ద పట్టణంగా అవతరించిన గద్వాల ప్రాజెక్టులకు కేంద్రంగా మారింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రింగ్‌రోడ్డును ప్రతిపాదించారు. రాజీవ్ యువకిరణాలు కార్యక్రమాన్ని మూడు ప్రాంతాల్లో ఒక్కొక్క చోట సీఎం ప్రారంభించారు. అందులో భాగంగా 2011 ఆగస్టు 27న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి యువకిరణాలు కార్యక్రమాన్ని గద్వాలలో ప్రారంభించేందుకు వచ్చి రింగ్‌రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మంగళవారంతో శంకుస్థాపన జరిగిన రెండేళ్లు పూర్తయింది. రూ.40కోట్ల అంచనావ్యయంతో.. గద్వాల చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్ల అంచనా వ్యయం తో 2011లో ప్రభుత్వం మంజూరు ఇ చ్చింది. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి జమ్మిచేడు వద్ద నుంచి అయిజ రోడ్డు ద్వారా రాయిచూర్ రోడ్డు వరకు నిర్మాణం చేపట్టాలని మొదట ప్రతిపాదించారు. పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ను తెరపైకి తెచ్చారు. దీంతో పనులను రెండు దశలుగా విభజించారు. మొద టి దశ జమ్మిచేడు నుంచి వయా అయి జ రోడ్డు ద్వారా రాయిచూర్ రోడ్డు వర కు, రెండో దశలో రాయిచూరు రోడ్డు నుంచి డ్యాం రోడ్డు, నదిఅగ్రహారం రోడ్డు, వెంకంపేట రోడ్డుల ద్వారా జమ్మిచేడు రోడ్డును కలిపేలా నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశ పనులకు సంబంధించి ఆర్అండ్బీ అధికారులు అంచనాలు రూపొందించారు. రూ.23.12కోట్ల వ్యయంతో తయారుచేసిన నివేదికను సాంకేతిక అనుమతి కోసం ఈఎన్సీకి పంపారు. సాంకేతిక అనుమతి రాగానే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. టెండర్ల ప్రక్రియ పూర్తికావడం, కాంట్రాక్టర్లకు వర్క్ఆర్డర్ ఇవ్వడం వంటి దశలను పూర్తి చేసుకోవడం ఎప్పుడో, రోడ్డు నిర్మాణ పనులు ఇంకెన్నాళ్లకు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. ఈ విషయమై ఆర్అండ్బీ గద్వాల డీఈఈ నాగార్జున్రావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, సాంకేతిక అనుమతి రాగానే రింగ్‌రోడ్డు పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
అందరూ అంగీకరించాకే విభజన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షునితో సహా రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులంతా అంగీకరించారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. మంగళవారం రాత్రి ఇక్కడ ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. గత రెండేళ్లుగా సాగించిన విస్తృతస్థాయి సంప్రదింపులు, అన్ని రాజకీయ పార్టీల అంగీకారం తర్వాతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుందని పునరుద్ఘాటించారు. అయితే, తొలుత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మాటపై నిలబడకుండా వెనక్కు తగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు. తమను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా, హడావుడిగా నిర్ణయం తీసుకొన్నదని బీజేపీ సీనియర్ నేత అద్వానీ వ్యాఖ్యానించినట్లు మీడియాలో చూశానన్న దిగ్విజయ్... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ రాసిన లేఖను అద్వానీ ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ప్రశ్నించారు. విభజన నిర్ణయాన్ని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం... తాను గతంలో చేసిన సూచనలను పట్టించుకోకుండా, తమను సంప్రదించకుండానే అధిష్టానం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ విమర్శించడాన్ని ప్రస్తావించగా... రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలూ అధిష్టానం నిర్ణయానికి బద్ధులమై ఉంటామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఆంటోనీ కమిటీతో గురువారం కొన్ని రాజకీయేతర సంఘాల ప్రతినిధులు, ఇతరులు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో వాయిదా పడినట్లు చెప్పారు. వచ్చే నెల మూడోతేదీన తిరిగి సమావేశం కానున్న కమిటీ ఆ రోజున రావాల్సిందిగా వారిని ఆహ్వానించిందని ఆయన తెలిపారు. -
కిరణ్, దినేష్‌లకు పదవిలో కొనసాగే హక్కులేదు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. వారికి పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ముల్కీ అమరవీరుల వారోత్సవం నిర్వహిస్తామని కోదండరామ్ మంగళవారమిక్కడ తెలిపారు. వచ్చే నెల 7వ తేదీన హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని కోదండరామ్ వెల్లడించారు. రాష్ట్ర విభజన అంశంలో సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని అమలు చేయటంలో జాప్యం వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు సక్రమంగా లేదని కోదండరామ్ అన్నారు. దీనిపై త్వరలో వారిని కలవనున్నట్లు ఆయన తెలిపారు. -
కిరణ్‌ను దిగ్విజయ్ అదుపు చేయాలి: కేటీఆర్
హైదరాబాద్ : రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావాలంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని దిగ్విజయ్ సింగ్ అదుపు చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంతో మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోలు ముఖ్యమంత్రి అదుపు ఆజ్ఞల్లోనే పని చేస్తున్నారని ఆరోపించారు. సీఎంను కలిసిన తర్వాతే ఏపీ ఎన్జీవోలు సమైక్యరాగం ఎత్తుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే నడుస్తోందని ఆయన అన్నారు. -
కేంద్రం నుంచి రూ.1.50 లక్షల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: పద్నాలుగవ ఆర్థిక సంఘ కాలంలో కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రూ.1,50,000 లక్షల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా 14వ ఆర్థిక సంఘానికి ప్రజంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 12 నుంచి 14వ తేదీ వరకు సంఘం చైర్మన్ వై.వి.రెడ్డి, ముగ్గురు సంఘ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయమై సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 14వ ఆర్థిక సంఘానికి సమర్పించాల్సిన మెమోరాండంలో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో పాటు సాంఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీటి రంగాలలో చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటుతో పోల్చుకుంటే అధికంగా ఉన్నా.. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాలు జాతీయ సగటుకు తక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అంశాలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లి వెనుకబడిన జిల్లాలకు అదనపు ఆర్థిక సహాయం అందేలా, తద్వారా జాతీయ సగటును చేరుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలకు ఇచ్చే గ్రాంట్లపై ఆర్థిక సంఘం దృష్టి సారించేలా చేసి, అదనపు సహాయాన్ని సాధించాలని ఆయన సూచించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 14వ ఆర్థిక సంఘ కాలం ప్రారంభమవుతుంది. -
దాడులను అరికట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని హైదరాబాద్‌లో వరుసగా సీమాంధ్ర ఉద్యోగులపై జరుగు తున్న దాడులను అరికట్టాలని ఆంటోనీ కమిటీని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కోరారు. తెలంగాణలోని సీమాంధ్రులకు ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని తెలంగాణ నేతలు చేస్తున్న ప్రకటనలు కేవలం మాటల్లోనే తప్ప చేతల్లో కన్పించడం లేదన్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌లతో సోమవారం రాత్రి వారు గంటకు పైగా భేటీ అయ్యారు. సమైక్యవాదంతో ఉద్యమిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగులు నాలుగు రోజులుగా దాడులకు దిగుతున్నా వాటి కట్టడికి ప్రభుత్వపరంగా, తెలంగాణ నేతల పరంగా ఎలాంటి చర్యలూ లేవని ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం తక్షణం జోక్యం చేసుకొని దాడులను కట్టడి చేయాలని కోరారు. దాంతో దిగ్విజయ్ వెంటనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డిలతో ఫోన్ మాట్లాడారు. అందరితో మాట్లాడి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని వారాయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఎంపీలు కె.వి.పి.రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, జి.వి.హర్షకుమార్ తదితరులు కమిటీ ముందు గంటకు పైగా వాదనలు విన్పించారు. హైద్రాబాద్ లో చోటుచేసుకొంటున్న హింసాత్మక సంఘటనలు, అభద్రతా భావం నెలకొన్న సీమాంధ్ర ఉద్యోగులకు, ప్రజలకు రక్షణ క ల్పించేందుకు కేంద్రం తీసుకోవాల్సిన తక్షణ చర్యలపైనే కమిటీతో వారు మాట్లాడినట్టు సమాచారం. తెలంగాణవాదులను అదుపు చేయలేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు మరింతగా విషమిస్తాయన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య ఇటీవల వరుసగా జరుగుతున్న ఘర్షణలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ‘‘రెండు రోజుల కింద ఎపీఎన్జీవో కార్యాయంలో తెలంగాణ ప్రాంత న్యాయవాదులు దాడికి ఇగారు. , సోమవారం జలసౌధ, దేవాదాయ శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులపై దాడులకు దిగారు. తెలంగాణ నేతలు, ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలు ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టజూస్తున్నారు. ఘర్షణ జరుగుతున్న చోట్లకు వెళ్లి ఉద్రిక్తత సృష్టిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న తలపెట్టిన బహిరంగ సభ విషయంలోనూ తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థుల ధోరణి పూర్తి రెచ్చగొట్టేలా ఉంది’’ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా తామెలాంటి మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించబోమని ఎంపీలు పునరుద్ఘాటించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కూడా వచ్చి పలు అంశాలపై వపర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉన్నా లోక్‌సభలో ఆహార భద్రతపై చర్చ, ఓటింగ్‌తో రాలేకపోయారు. మరోవైపు ఏపీ ఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు కూడా విభజనను వ్యతిరేకిస్తూ మంగళ, బుధవారాల్లో ఆంటోనీ కమిటీని, కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలను ఢిల్లీలో కలవనున్నారు. దౌర్జన్యం చేస్తే ఫలితం అనుభవిస్తారు: ఉండవ ల్లి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశామని అనంతరం విలేకరులకు ఉండవల్లి వివరించారు. ‘హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై జరుగుతున్న దాడులను కమిటీకి వివరించాం. వారు స్పందించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. హైదరాబాద్‌లో తెలంగాణ వారికి నిరసన తెలిపే హక్కు ఎంతుందో, సీమాంధ్రులకూ అంతే ఉంది. రౌడీయిజం, గూండాగిరీ చేస్తామంటే రాజ్యాంగం దాని పని అది చేస్తుంది. సీమాంధ్రల ప్రదర్శనలను దౌర్జన్యం చేసి అపగలమనుకుంటే దాని దుష్ఫలితాలను అనుభవిస్తారు’’ అని హెచ్చరించారు. -
ఇందిర, రాజీవ్ విగ్రహాల ధ్వంసం సీఎం పనే
నిజామాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇందిర, రాజీవ్‌ల విగ్రహాలను ఎవరూ ముట్టుకోలేదని, సమైక్యాంధ్ర ఉద్యమంలో మాత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే ముందుండి వారి విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కూడా సీఎం, డీజీపీల వైఖరిపై టి.కాంగ్రెస్ మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో టీ విద్యార్థి జేఏసీ నిర్వహించే మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరుతూ నిర్వహించే యాత్రను సోమవారం నిజామాబాద్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. సీమాంధ్ర పాలకుల నాటకాలు, దాడులు ఆపాలని హెచ్చరించారు. 7న జరిగే సీమాంధ్రుల సభకు అనుమతిస్తే, అదే రోజున తెలంగాణ మిలియన్ మార్చ్‌కూ అనుమతినివ్వాలన్నారు. అనుమతి ఇవ్వకపోయినా మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేసి తీరుతామన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు తెలంగాణకు ద్రోహం చేస్తూ, సీమాంధ్ర ఉద్యమానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
కిరణ్, చంద్రబాబులు నోరు ఎందుకు మెదపరు?
ఆంధ్రప్రదేశ్ విభజనపై రాష్ట్రం అట్టుడికిపోతుంటే సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు నోరు మెదపడంలేదు ఎందుకని ఆయన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సోమవారం ప్రశ్నించారు. ఓ వేళ రాష్టం విడిపోతే వారిద్దరు తెలంగాణలో ఉంటారా లేక సీమాంధ్రలో ఉంటారా అని వ్యాఖ్యానించారు. జైల్లో ఉండి వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సీమాంధ్రలోని టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఉద్యమం ఎందుకు చేయరని ఆయన అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదివారం చంచల్‌గూడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జగన్‌కు మద్దతుగా కృష్ణాజిల్లాలోని మైలవరంలో జోగి రమేష్ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం దీక్ష శిబిరంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు జోగి రమేష్ పై విధంగా సమాధానం ఇచ్చారు. -
రాష్ట్రాల ఏర్పాటులో సీఎం పెద్దన్న పాత్ర పోషించాలి
అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెద్దన్న పాత్ర పోషించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో కాంగ్రెస్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో గండ్ర ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని గండ్ర వెంటకరమణారెడ్డి ఆరోపించారు. అయితే రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు ఉదయం వరంగల్‌లో సీమాంధ్ర ఉద్యమంపై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ఉద్యమం కోసం ఒక్కరు కూడా బలిదానం చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎందరో బలిదానం చేసుకున్నారని సారయ్య ఈ సందర్బంగా గుర్తు చేశారు. సీమాంధ్రలో 25 రోజుల ఉద్యమాన్ని చూసీ భయపడాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు. -
పునరాలోచనే లేదు: సోనియా
-
కానరాని కాంగ్రెస్ నేతలు
సాక్షి, తిరుపతి: జిల్లాలో సమైక్య ఉద్యమం ప్రారంభమై 20 రోజులైనా ఇంతవరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు సమైక్య ఉద్యమంలో పాల్గొనటం లేదు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు అసలు సమైక్యం మాటే ఎత్తటం లేదు. సాధారణ ప్రజానీకం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాలో చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు మినహా సమైక్య ఉద్యమంలో గట్టిగా పాల్గొంటున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు. సీఎం సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. జనం ముందుకు వస్తే తమను ఎక్కడ నిలదీస్తారోనన్న భయం కూడా కాంగ్రెస్ నాయకులను పీడిస్తోంది. ఉద్యమాలు చేస్తూ జైళ్లకు వెళ్తున్నవారిని పరామర్శించటం, ఎవరైనా ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తుంటే అక్కడకు వచ్చి మద్దతు ప్రకటించటం మినహా సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితి లేదు. తిరుపతి ఎంపీ చింతామోహన్ పార్లమెంట్ సమావేశాల పేరిట ఢిల్లీలోనే మకాం వేశారు. ఇంతవరకు తిరుపతి వీధుల్లోకి రానేలేదు. మంత్రి గల్లా అరుణకుమారి, ఆమె కుమారుడు పీసీసీ కార్యదర్శి గల్లా జయదేవ్ కంటి తుడుపుగా తిరుపతిలో ఒక రోజు ర్యాలీ నిర్వహించి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో ఏపీ ఎన్జీవోల నుంచి వ్యాపారుల వరకు అందరూ తమ వృత్తులను, ఉపాధిని వదులుకుని సమ్మె బాటపడితే, మంత్రి గల్లా అరుణకుమారి ఫ్యాక్టరీల్లో మాత్రం సమ్మెకు అనుమతివ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు విధులకు హాజరవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సీఎం సోదరుడు అయితే సమైక్య ఉద్యమం మొదలైనప్పటి నుంచి పత్తా లేకుండా పోయారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతుహలమ్మ ప్రత్యక్షంగా సమైక్య ఉద్యమంలో పాల్గొనలేదు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవిది కూడా అదే పరిస్థితి. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాత్రం ఇటీవల రెండుసార్లు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలమనేరు నియోజకవర్గ ఇన్చార్జ్, సీఎం సన్నిహితుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డెప్ప రెడ్డి కూడా ఇంత వరకు ప్రత్యక్ష ఉద్యమాలు నడపలేదు. కంటితుడుపు చర్యగా పలమనేరులో పాల్గొని మద్దతు ప్రకటించారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇదే. ఉద్యమకారులు జంతువుల రూపాలకు నేతల ఫొటోలు చేర్చి, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నా, టీవీ చానళ్లలో బహిరంగంగానే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఏకి పారేస్తున్నా స్పందించే పరిస్థితి లేదు. నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు సమైక్య ఉద్యమాలకు దూరంగా ఉన్నారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలో ఉంటున్న మరో ఎమ్మెల్సీ జయచంద్రనాయుడు కూడా ఇంత వరకు సమైక్య ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు లేవు. మరోవైపు మండలాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పట్టణాల్లో చోటా మోటా కాంగ్రెస్ నాయకులు ఉద్యమానికి దూరంగా ఉంటే ప్రజల్లో ఉనికి కోల్పోతామన్న భయంతో ఉద్యమకారులకు మద్దతు ప్రకటిస్తున్నారు. -
విభజన తప్పదు
* పునరాలోచనే లేదు: సోనియా * రాష్ట్రపతి పాలనకూ వెనకాడం * నిర్ణయాన్ని అమలు చేయాలంటూ కిరణ్‌కు ఆదేశం * ఆ దిశగా క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచన * సోనియా, రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై పునరాలోచన చేసే సమస్యే లేదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియాగాంధీ, ఉపాధ్య క్షుడు రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. రాష్ట్ర విభజన ప్రక్రియతో ముందుకు సాగాల్సిందేనని బుధవారం తనను కలిసిన కిరణ్‌కు సోనియా స్పష్టం చేసినట్టు సమాచారం. మంగళవారం రాత్రి ఏకే ఆంటోనీ కమిటీతో ఆయన సమావేశమవడం తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరినా, తెలంగాణ నిర్ణయంపై పునరాలోచన ఉండబోదని కమిటీ కూడా చెప్పడంతో చివరి ప్రయత్నంగా సీఎం బుధవారం మధ్యాహ్నం సోనియాతో సమావేశమయ్యారు. రాహుల్‌తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్ కూడా భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ నిర్ణయం వెలువడ్డాక రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను, సీమాంధ్ర ప్రజల మనోభావాలను కిరణ్ వివరించబోయినా, మేడమ్ సానుకూలంగా స్పందించలేదని ఏఐసీసీ వర్గాలన్నాయి. పైగా, రాష్ట్రపతి పాలన విధించేందుకు కూడా వెనకాడబోమని ఆమె స్పష్టం చేసినట్టు వివరించాయి. అవసరమైతే రాష్ట్రపతి పాలనకు వెళ్తామే తప్ప తెలంగాణపై ఇచ్చిన మాట తప్పేది లేదంటూ కుండబద్దలు కొట్టారని సమాచారం. అంతేగాక, ‘సీమాంధ్ర ప్రజల సమస్యలకు పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి అందరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు కొనసాగించండి. విభజన నిర్ణయాన్ని అమలు చేయడంలో ముఖ్యమంత్రిగా క్రియాశీల పాత్ర పోషించండి’ అని కిరణ్‌కు సూచించారని తెలిసింది. నివేదికల సమర్పణ రాష్ట్ర విభజన దిశగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోనుందని కిరణ్‌కు ముందునుంచే స్పష్టంగా తెలిసినా మిన్నకుండిపోవడం, ఆ మేరకు సీడబ్ల్యూసీ ప్రకటన వెలు వడ్డాక కూడా 9 రోజుల పాటు మౌనముద్రకే పరిమితం కావడం తెలిసిందే. అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం ఢిల్లీ వచ్చిన ఆయన, విభజనతో తలెత్తే సమస్యలను వివరిస్తూ రూపొందించిన రెండు నివేదికలను బుధవారం నాటి భేటీలో సోనియా, రాహుల్‌లకు సమర్పించినట్టు తెలిసింది. విభజనతో రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ పూర్తిగా న్యాయం జరగకపోగా, కాంగ్రెస్‌కు రాజకీయంగా కూడా పెద్దగా లబ్ధి చేకూరదని ఆయన వాదించినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం... విభజనతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే భావన సీమాంధ్ర ప్రజానీకంలో బలంగా ఉందని, అందుకే అన్ని వర్గాల వారూ సమైక్య రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారని కిరణ్ చెప్పారు. ‘‘హైదరాబాద్ నగరంలో, శివారు ప్రాంతాల్లో స్థిరపడిన దాదాపు 50 లక్షల పై చిలుకు సీమాంధ్రవాసులతో పాటు సీమాంధ్ర ప్రజలంతా అభద్రతా భావంతో ఆందోళన చెందుతున్నారు. విభజనతో తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య తిరిగి విజృంభించే ప్రమాదముంది. తీవ్రవాద బెడద అంతిమంగా దేశ ఐక్యత, సమగ్రతలకే సవాలుగా మారనుంది. హైదరాబాద్ నగర ప్రతిపత్తితో పాటు సీడబ్ల్యూసీ తీర్మానంలో పేర్కొన్న నదీజలాల పంపిణీ తదితర కీలకాంశాలపై రెండు ప్రాంతాలకు పూర్తి న్యాయం జరిగేలా ఏకాభిప్రాయాన్ని సాధించేదాకా ప్రభుత్వ స్థాయిలో అధికారిక విభజన ప్రక్రియను ప్రారంభించకుండా నిలిపేయాలి. లేదంటే రాష్ట్రం మరింత అల్లకల్లోలమవుతుంది. విభజనతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ అస్తిత్వాన్నే కోల్పోవాల్సి రావచ్చు. సమైక్యంగా కొనసాగిస్తే తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ బతికి బట్టకట్టడం సాధ్యమే’’ అని వివరించే ప్రయత్నం చేశారు. విభ జన తర్వాత ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ నివేదికల సారాంశాన్ని తన వాదనకు మద్దతుగా సోనియా తదితరులకు కిరణ్ అందజేసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. సీమాంధ్రలో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో ప్రజలే స్వచ్ఛందంగా వీధుల్లోకి వస్తున్నారని కిరణ్ చెప్పారు. కాంగ్రెస్ నేతలెవరూ నియోజకవర్గాలకు వెళ్లగలిగే పరిస్థితులు లేవన్నారు. లాభం లేదు ‘‘రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అధిష్టానం పునఃపరిశీలించే అవకాశాలేమీ కనబడటం లేదు. విభజన ప్రక్రియపై ముందుకెళ్లడమే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని పార్టీ ముఖ్యులే కుండబద్దలు కొట్టి చెబుతున్నారు’’ అంటూ సీమాంధ్ర ముఖ్య నేతల వద్ద కిరణ్ నిర్వేదం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బుధవారం సోనియా, రాహుల్‌లతో భేటీకి ముందు, తర్వాత వారితో ఏపీభవన్‌లో ఆయన పలుమార్లు భేటీ అయ్యారు. ఆంటోనీ కమిటీతో, అనంతరం సోనియాతో తన భేటీల సారాంశాన్ని వివరించారు. సీమాంధ్రుల ఆందోళనను ఆలకించేందుకు పార్టీపరంగా నియమించిన ఆంటోనీ కమిటీ విభజన సమస్యలను పరిష్కరించేందుకే ఉంది తప్ప, నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కనబడటం లేదని మంత్రులు అన్నట్టు తెలిసింది. పరిస్థితి చేయి దాటినట్టే కనిపిస్తోందని, టీడీపీ సహా అన్ని పార్టీలూ తెలంగాణపై ఒకే వైఖరి ప్రకటించడమే విభజన నిర్ణయానికి కారణమని కిరణ్ అన్నట్టు చెబుతున్నారు. పార్టీలన్నీ ఒకే వైఖరితో ఉన్నప్పుడు మీరెందుకు అభ్యంతరం చెబుతున్నారనే ప్రశ్నలు పెద్దల నుంచి వస్తున్నాయని కిరణ్ చెప్పారు. ఆయన్ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి పల్లంరాజు, మంత్రులు శైలజానాథ్, కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు, సీనియర్ నేత గాదె వెంకట్‌రెడ్డి తదితరులున్నారు. అనంతరం కిరణ్ హైదరాబాద్ ప్రయాణమయ్యారు. కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక్క లేఖ ఇస్తే విభజన ప్రక్రియ ఆగుతుందని కొండ్రు మురళి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం శిలాశాసనమేమీ కాదని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమాలతో ప్రభావితం చేయగలిగితే నిర్ణయాలు అవే మారిపోతాయి’’ అని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా ఏమాత్రం లాభం కాదు: గాదె విభజన నిర్ణయం తర్వాత కాంగ్రెస్‌కు తెలంగాణలో 4, సీమాంధ్రలో 3 ఎంపీ సీట్లే వస్తాయని ఇటీవలి సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయని గాదె అన్నారు. ‘‘విభజన నిర్ణయంతో కాంగ్రెస్‌కు ఏమాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి దీనిపై పునరాలోచించాలి. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్... ఒక రాష్ట్రం విషయంలో ఒకలా, ఇతర రాష్ట్రాల డిమాండ్ల విషయంలో మరోలా వ్యవహరించడం దురదృష్టకరం’’ అని ఆయనన్నారు. -
విస్తరణ ఒట్టిమాటే..!
జహీరాబాద్, న్యూస్‌లైన్: రెండు జిల్లాలను కలిపే రోడ్డిది. జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రం వెళ్లాలన్నా ఈ రోడ్డుపైనే వెళ్లాలి. ఇంతటి ప్రాధాన్యంగల ఈ రోడ్డును విస్తరణపై సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లా ప్రజలంతా రోజుల తరబడి వేడుకోగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సంవత్సరం కిందట జహీరాబాద్ నుంచి కర్ణాటక రాష్ర్ట సరి హద్దు వరకు తాండూరు రోడ్డును విస్తరించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన హామీకి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఈ రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. ఈ రోడ్డు మండలంలోని హోతి(కె), మల్చల్మ, శేఖాపూర్ గ్రామాల మీదుగా రంగారెడ్డి జిల్లాలోని తాండూరుకు వెళుతుంది. నాపరాతి పరిశ్రమకు పేరుగాంచిన తాండూరుకు జహీరాబాద్ ప్రాంతం నుంచి వెళ్లే వాహనాల సంఖ్య అధికంగానే ఉంటుంది. సింగిల్ రోడ్డు కావడం, రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఎదురెదురుగా వాహనాలు వస్తే రోడ్డు దిగక తప్పని పరిస్థితి. ఇక వర్షాకాలంలో వాహనాలు రోడ్డు కిందకు దిగితే బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం వాహనదారులకు నరకంగా మారింది. అందువల్లే ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు 2012 మే 3వ తేదీన ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనేందుకు మండలంలోని మల్చల్మ గ్రామానికి వచ్చిన సీఎంకు తాండూరు రోడ్డు దుస్థితిని, ప్రయాణికుల ఇబ్బందిని తెలిపారు. రోడ్డును విస్తరిస్తే తాండూరు వెళ్లే ప్రయాణీకులు, వాహన దారులతో పాటు మండలంలోని మల్చల్మ, శేఖాపూర్, హోతి(కె) గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇందుకు స్పందించిన సీఎం కిరణ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 10 కిలో మీటర్ల మేర రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు రూ.10 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు హామి కూడా ఇచ్చారు. హామి ఇచ్చి ఏడాది గడిచినా ఇప్పటి వరకు రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. ఇప్పటికైనా సీఎం తన మాటను నిలబెట్టుకుని తాండూరు రోడ్డును విస్తరించి తమ ఇక్కట్లు తీర్చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
సోనియాగాంధీతో కిరణ్‌కుమార్ రెడ్డి భేటీ
-
సోనియాగాంధీతో కిరణ్‌కుమార్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. అధిష్టానం పిలుపు మేరకు హస్తినకు చేరుకున్న ముఖ్యమంత్రి పార్టీ ముఖ్యులను కలుస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్, ఆంటోనీ కమిటీని కిరణ్ నిన్న కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను వారికి వివరించారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతను కూడా వారికి వివరించారు. రాష్ట్ర విభజన చేపడితే ఎదురయ్యే సమస్యలపై కిరణ్‌కుమార్ రెడ్డి ఎనిమిది పేజీల నివేదిక సమర్పించారు. అయితే, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆంటోని కమిటీ స్పష్టం చేసినట్టు తెలిసింది. అందుకే ముఖ్యమంత్రి బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి మరోసారి తమ వాదన వినిపిస్తున్నారు. -
సీఎం కిరణ్‌పై నిప్పులు కక్కిన కేటీఆర్
సీఎం కిరణ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు కిరణ్‌కుమార్ రెడ్డికి ఎంత మాత్రం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ సీఎం కిరణ్‌పై నిప్పులు కక్కారు. ఆంటోని కమిటీ ఎదుట హాజరైన సీఎం కిరణ్ అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కిరణ్‌కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దమ్ముంటే తమతో చర్చకు రావాలని కేటీఆర్ ఈ సందర్భంగా సీఎం కిరణ్‌కు సవాల్ విసిరారు. అబద్దాలు మాట్లాడే కిరణ్ మంత్రి వర్గంలో ఎలా కొనసాగుతున్నారని ఈ సందర్భంగా టి.మంత్రులను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. -
సోనియా అపాయింట్మెంట్ కోరిన సీఎం కిరణ్
ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరారు. ఈరోజు సీఎం సోనియాను కలిసే అవకాశం ఉంది. అధిష్టానం పిలుపు మేరకు ఇక్కడకు వచ్చిన సీఎం పార్టీ ముఖ్యులను కలుస్తున్నారు. నిన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను, ఆంటోనీ కమిటీని కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులను వారికి వివరించారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతను కూడా వారికి వివరించారు. ఈ రోజు సోనియాను కూడా కలిసి పరిస్థితులను వివరిస్తారు. -
ఇక ‘బాబు’ మార్కు పింఛన్లు
* లబ్ధిదారుడు మరణిస్తేనే కొత్తవారికి పెన్షన్ * వితంతు, వికలాంగుల పెన్షన్లపై ప్రభుత్వం నిర్ణయం * టీడీపీ ప్రభుత్వం నాటి విధానాన్ని ప్రవేశపెట్టిన సర్కారు * వృద్ధులు, గీత కార్మికులకు మొండిచేయి * అర్హులని తేలినా పింఛన్ల మంజూరుకు నో * రచ్చబండ ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడే ఇవ్వాలని నిర్ణయం * ఇప్పటికే 7 లక్షల మందిని అర్హులుగా తేల్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: వితంతు, వికలాంగుల పెన్షనర్లు ఎవరైనా మరణిస్తే తప్ప మరొకరికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్న వారిలో ఖాళీలు ఏర్పడిన పక్షంలోనే కొత్తవారికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లు ఖాళీలు ఏర్పడితేనే కొత్త పింఛన్లు ఇవ్వాలనేది తెలుగుదేశం ప్రభుత్వ విధానం. ఇప్పుడు అదే పద్ధతిని అనుసరించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు నిర్ణయించడం గమనార్హం. వితంతు, వికలాంగుల పెన్షన్లను.. ఖాళీలు ఏర్పడిన తర్వాతే అర్హులైన వారితో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్న సర్కారు.. వృద్ధులు, గీత కార్మికులను పూర్తిగా విస్మరించింది. వీరిలో కొత్తగా పెన్షన్లకు అర్హులని తేలినా వారికి వెంటనే ఇవ్వడానికి వీల్లేదని, ప్రభుత్వం రచ్చబండ ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడు మాత్రమే పంపిణీ చేయాలని అప్పటి వరకు చెల్లించవద్దని నిర్ణయం తీసుకున్నారు. 2011 డిసెంబర్ తర్వాత మళ్లీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించలేదు. ఇప్పటికే దాదాపు ఏడు లక్షల మందిని పింఛన్లకు అర్హులని తేల్చిన ప్రభుత్వం.. వాటిని మంజూరు చేయకుండా అట్టిపెట్టుకుంది. ఇలా అర్హులని తేలిన వారిలోనూ రెండేళ్ల కాలంలో ఎంతమంది మరణించారన్న సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర లేదు. వాస్తవంగా వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారిలో ఏటా దాదాపు 20 వేలకుపైగా లబ్ధిదారులు మరణిస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. 42 లక్షల మంది వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాల్సి ఉంటే.. రెండేళ్లుగా ఏర్పడిన ఖాళీలే దాదాపు ఎనిమిది లక్షల వరకు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మొత్తం 76 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు చెబుతున్నా.. అందులో నాలుగున్నర లక్షలు వైఎస్సార్ అభయహస్తం పెన్షన్లే ఉన్నాయి. వైఎస్సార్ అభయహస్తంలో మహిళలు కూడా తమ వంతు వాటా చెల్లించారు. వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం 18 లక్షలు మాత్రమే పెన్షన్లు ఉంటే.. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సంఖ్యను ఏకంగా 71 లక్షలకు చేర్చారు. అంతేకాదు వీరందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ చేతికందేలా కృషి చేశారు. ఇప్పుడు ప్రభుత్వ తాజా విధానంతో గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుడు చనిపోయిన తర్వాతే ఆ గ్రామంలో మరొకరికి అవకాశం లభిస్తుందన్నమాట! మీ-సేవ కేంద్రాలుగా గ్రామ సమాఖ్యలు! గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని గ్రామ సమాఖ్య కార్యాలయాలను మీ-సేవ కేంద్రాలుగా మార్చే ప్రతిపాదనను పరిశీలించడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా సాంఘిక సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు ఉంటారు. -
ఏపీ భవన్లో సీఎంతో సీమాంధ్ర నేతల భేటీ
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో సీమాంధ్ర ప్రాంత నేతలు మంగళవారం ఏపీ భవన్లో సమావేశం అయ్యారు. అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ చేసిన ముఖ్యమంత్రి ఈరోజు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఏకే ఆంటోనీతో భేటీ కానున్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించిన తర్వాతే రాష్ట్రాన్ని విభజించాలని ముఖ్యమంత్రి అధిష్టానాన్ని కోరనున్నట్లు సమాచారం. అప్పటివరకూ విభజన ప్రక్రియ నిలిపివేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కిరణ్ కుమార్ రెడ్డి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా సీఎంతో సమావేశం అయిన నేతల్లో శైలజానాథ్, గాదె వెంకటరెడ్డి, రుద్రరాజు పద్మరాజు, పితాని సత్యనారాయణ తదితరులు ఉన్నారు. విభజన కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో అవి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని సీమాంధ్ర ప్రాంత నేతలు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు సీమాంధ్రప్రాంత నేతలతో వరుసగా రెండుసార్లు నిర్వహించిన సమావేశంలో వారంతా ఈ సమస్యలను ఏకరవుపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రెండుసార్లూ తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ రెండింటిపైనా సీఎం, పీసీసీ అధ్యక్షులిద్దరూ సంతకాలు చేశారు. ఈ లేఖలు ఆంటోనీ కమిటీకి కూడా పంపించారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేడు ఆంటోనీ కమిటీని కలవనున్న నేపథ్యంలో అంతకుముందుగానే సీఎం ఆ కమిటీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెలువరిస్తున్న అనుమానాలను ఆయన పార్టీ అధిష్టానానికి, ఆంటోనీ కమిటీకి వివరించనున్నారు. విభజన నిర్ణయం అమలులో తలెత్తే ఇతర క్లిష్ట సమస్యలను కూడా ఆయన పార్టీ పెద్దలకు తెలియచేయనున్నారని తెలుస్తోంది. -
ఢిల్లీ బయల్దేరిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ : అధిష్టానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. మంగళవారం ఉదయం ఆయన హస్తనకు పయనం అయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్రలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు సీఎంను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో ఇటీవలి కాలంలో చెదురుమదురుగా అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయపరమైన తాజా పరిస్థితులపై సీఎంతో పార్టీ పెద్దలు చర్చించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి ఆంటోనీ కమిటీతో భేటీ కానున్నట్లు సమాచారం. సీమాంధ్రప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు నేడు కమిటీని కలవనున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. -
కిరణ్, బాబులపై సీమాంధ్ర నేతల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: విభజన విషయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ముందే తెలుసా? రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాలలో ఉన్న వారిద్దరూ, అన్ని విషయాలూ ముందే తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా మౌనం దాల్చారా? రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న కనీవినీ ఎరుగని సంక్షోభానికి అదే కారణమైందా? పైగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలే వారి మౌనానికి కారణమా? అటు కాంగ్రెస్ పార్టీలోనూ, ఇటు టీడీపీలోనూ ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. విభజన నిర్ణయం వెలువడ్డాక ఏకంగా తొమ్మిది రోజుల పాటు కిరణ్ మౌనముద్రకు పరిమితమవడం, బాబు కూడా కొద్ది రోజుల తర్వాత నింపాదిగా స్పందించడమే గాక సీమాంధ్రకు నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తే చాలంటూ మాట్లాడటం వెనక ఉన్నదంతా ఢిల్లీ స్క్రిప్టేనంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోమని తనను కలిసిన వారితో సోనియాగాంధీ స్పష్టంగా చెబుతుండటంతో ఇరు పార్టీల నేతలూ నిరాశలో కూరుకుపోయారు. ‘‘విభజన నిర్ణయం తీసుకున్నప్పుడే ‘ఆ ఇద్దరూ’ అడ్డు చెప్పి ఉండాల్సింది. అలా చేయకుండా ఇప్పుడు పైపైన హడావుడి చేయడం వల్ల లాభమేముంది? కిరణ్, బాబు ముందుగానే అడ్డుపడి ఉంటే ఇంతదాకా వచ్చేదే కాదు’’ అంటూ వారంతా వాపోతున్నారు. తాజాగా శనివారం తన క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతో జరిగిన భేటీలో కిరణ్ ధోరణి కూడా ఆద్యంతం ఉత్తుత్తి హడావుడినే తలపించిందని అందులో పాల్గొన్న నేతలే చెబుతున్నారు. పైగా ఇటు కిరణ్, అటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో గందరగోళాన్ని పెంచజూడటం తమను నివ్వెరపరిచిందని వారన్నారు. విభజన నిర్ణయంపై పునరాలోచన లేదని, ఆంటోనీ కమిటీకీ దానికీ సంబంధం లేదని అధిష్టానం కుండబద్దలు కొట్టిందని భేటీలో బొత్స చెప్పడం తెలిసిందే. కిరణ్ మాత్రం ఇంకా ఏమీ మించిపోలేదని, విభజన ప్రక్రియ పది శాతం కూడా జరగనే లేదని, ఆంటోనీ కమిటీకి గట్టిగా సమైక్య వాదన విన్పిద్దామని చెబుతూ నేతలను అనునయించజూశారు. చూస్తుంటే ఇదంతా అధిష్టానంతో కలిసి తమతో కిరణ్ ఆడుతున్న గేమ్‌గానే కన్పిస్తోందని భేటీలో పాల్గొన్న సీనియర్ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. ఇక తొలుత విభజనను సమర్థిస్తూ మాట్లాడిన బాబు, సీమాంధ్ర భగ్గుమనడంతో నాలుక్కరుచుకుని హడావుడిగా నష్ట నివారణ చర్యలకు దిగారని టీడీపీ నేతలంటున్నారు. సీమాంధ్రలో వైఎస్సార్సీపీ హవాను తట్టుకునేందుకు ఏదో ఒకటి చేయక తప్పదంటూ పార్టీపరంగా ఒత్తిళ్లు పెరుగుతుండటంతో సంపాదకులతో భేటీ తదితరాల పేరుతో కొద్ది రోజులుగా నామమాత్రపు హడావుడితో బాబు సరిపెడుతున్నారంటూ వాపోతున్నారు. మరోవైపు అన్ని ప్రాంతాలకూ సమ న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్టు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రకటించడంతో మరేం చేయడానికీ దిక్కు తోచక అదే దీక్షను తమతో అధినేత కాపీ కొట్టిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. విజయమ్మ దీక్ష తలపెట్టిన విజయవాడలోనే తానూ దీక్ష చేస్తానంటూ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమ ప్రకటించడం తెలిసిందే. అక్కడ అనుమతి రాకపోవడంతో విజయమ్మ దీక్షా వేదిక గుంటూరుకు మారగానే ఆ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కూడా తాను దీక్ష చేస్తానని హడావుడిగా ప్రకటించారు. ఇదంతా బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న కాపీయింగేనని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అటు బాబు, ఇటు కిరణ్ అసలు సమయంలో మౌనం దాల్చి, ఇప్పుడిలా ఉత్తుత్తి హడావుడి చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండబోదంటూ ఆ పార్టీల నేతలు మండిపడుతున్నారు. ‘‘విభజన దిశగా సీడబ్ల్యూసీలో నిర్ణయం జరగకముందే అడ్డుకునే శక్తి ఉండి కూడా వారిద్దరూ అలా చేయలేదు. ఇప్పుడిక ఎన్ని చెప్పినా లాభం లేదు. సారథులుగా ఉంటూ మాలాంటి నేతల భవిష్యత్తును చేజేతులా అంధకారంలోకి నెట్టేశారు’’ అంటూ దుయ్యబడుతున్నారు. ఆనాడే స్పందించి ఉంటే... ముఖ్యంగా చంద్రబాబైతే నాలుగేళ్లుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ కూడా విభజన పట్ల అభ్యంతరం చెప్పలేదని, కనీసం నిర్ణయం తీసుకున్న తర్వాతైనా అందుకు వ్యతిరేకంగా స్పందించలేదని టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. కిరణ్ సర్కారుపై మిగతా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజే, దానికి మద్దతిద్దామని తామెంత చెప్పినా, ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేదే లేదు’ అని బాబు కరాఖండిగా చెప్పడమే గాక దాన్ని ఒంటి చేత్తో కాపాడారని గుర్తు చేస్తూ మండిపడుతున్నారు. ఆ రోజు అవిశ్వాసానికి టీడీపీ మద్దతిస్తే అస లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కాదనీ, ఈ పరిస్థితి కూడా వచ్చేదే కాదని ప్రైవేటు సంభాషణల్లో వారంతా గగ్గోలు పెడుతున్నారు. టీడీపీకి సీమాంధ్రలో 45 మంది ఎమ్మెల్యేలున్న విషయం తెలిసిందే. విభజన నిర్ణయం వెలువడ్డాకైనా ‘ప్రభుత్వాన్ని పడగొడతాం’ అని చెప్పినా, డొంకతిరుగుడుమాని స్పష్టమైన వైఖరి తీసుకున్నా మిగతా పార్టీల్లో కదలిక వచ్చేదని, అసెంబ్లీ మనుగడే ప్రశ్నార్థకమయ్యేదని టీడీపీ నేతలంటున్నారు. అదేదీ చేయకుండా కాంగ్రెస్ పెద్దలతో సంబంధాల కారణంగా వారు చెప్పినట్టల్లా బాబు నడుచుకుంటున్నారంటూ తూర్పారబడుతున్నారు. కిరణ్ మనసేమిటో!: విభజన వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత కిరణ్ మాట్లాడినా, తెలంగాణ ఏర్పాటుకు ఆయన వ్యతిరేకంగా ఉన్నారని గట్టిగా విశ్వసించే పరిస్థితులు అసలే లేవని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే భావిస్తున్నారు. ఆయన అధిష్టానం బాటలోనే నడుస్తున్నారని, కాకపోతే సీమాంధ్రలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరగొద్దనే ఉద్దేశంతోనే విభజనను తాను స్వాగతించడం లేదని ప్రకటన చేశారని అంటున్నారు. ఇందులో సీమాంధ్రలో తానే హీరోనవ్వాలన్న ఉద్దేశమే కన్పిస్తోందని, అలాగాక నిజంగా విభజనకు కిరణ్ వ్యతిరేకే అయ్యుంటే ఆయన ఎత్తుగడలే వేరేగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ‘‘విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోబోతోందని కిరణ్‌కు ముందే తెలుసు. అయినా అవకాశముండి కూడా ఆ ప్రక్రియను అడ్డుకోలేకపోయారు. ఆయన అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారనేందుకు ఇదే తార్కాణం. ఎందుకంటే విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలని సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలంతా నిర్ణయించుకున్నా కిరణే వారించారు’’ అని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఆ రోజే తాము రాజీనామాలు చేసినా ఇంత జరిగేది కాదంటున్నారు. ‘‘సీమాంధ్రలో కాంగ్రెస్‌కు 97 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పటికైనా వారిలో 20, 30 మంది నేరుగా వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నామంటూ నోటీసిచ్చినా కేంద్రం విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశముంది’’ అని కాంగ్రెస్ మంత్రులే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగూ గెలవదని తేలిపోయిన తర్వాత ఉన్న కొద్దికాలం పదవులను ఎందుకు వదులుకోవాలన్న అభిప్రాయానికి రావడం వల్లే నేతలెవరూ రాజీనామాలకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ‘నిజానికి తెలంగాణ ఇచ్చేందుకే అధిష్టానం నిర్ణయం తీసుకుందన్న విషయం కేంద్ర మంత్రివర్గంలో సీమాంధ్ర నేతలకు భారీగా పదవులు కట్టబెట్టినప్పుడే స్పష్టమైంది. కానీ పార్టీ ముఖ్యులంతా తమ పదవులకే ప్రాధాన్యమిచ్చి, తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది’ అని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు. బాబు లేఖే కొంప ముంచింది! తెలంగాణకు టీడీపీ అనుకూలమంటూ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి ముందే కేంద్రానికి బాబు లేఖ రాయడం తెలిసిందే. పైగా ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని కోరుతూ ప్రధానికీ లేఖ పంపారు. అదే తమ కొంప ముంచిందని సీమాంధ్ర టీడీపీ నేతలంటున్నారు. వారితో పాటు ప్రజల్లో కూడా బాబు తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విభజన నిర్ణయం గురించి బాబుకు కాంగ్రెస్ పెద్దలు ముందే సమాచారమిచ్చారని సీమాంధ్ర టీడీపీ నేతలంటున్నారు. అప్పుడు దాన్ని అడ్డుకునే అవకాశముండి కూడా బాబు అందుకనుగుణంగా వ్యవహరించలేదంటూ వారు తప్పుబడుతున్నారు. ‘‘కాంగ్రెస్ ఆలోచన తెలిసినప్పుడు సీమాంధ్రలోని 45 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామాలు చేయిస్తే అధికార పార్టీ అంత ధైర్యంగా విభజన నిర్ణయం తీసుకునేదే కాదు. ప్రధాన ప్రతిపక్షమే ఎదురు తిరిగితే కచ్చితంగా వెనకడుగు వేసేదే. కానీ బాబు నిత్యం కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు సాగిస్తూ తెలంగాణకు ఓకే అన్నారు. అందుకే ఇప్పుడు మేమంతా ఇబ్బందుల్లో చిక్కుకున్నాం’’ అంటూ దుయ్యబడుతున్నారు. రాజీనామాల విషయంలో కాంగ్రెస్‌లోని సమైక్యవాదులు కూడా టీడీపీతో కలిసొచ్చేవారని, ప్రభుత్వంకూలి విభజనకు ఆస్కారమే ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇంత జరిగాక కూడా ఇటు బాబు, అటు కిరణ్ మాట్లాడుతున్న తీరు చూస్తే వారిద్దరూ ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నించారని స్పష్టమవుతోందంటున్నారు. ప్రతిపక్ష నేతగా కాం గ్రెస్ నిర్ణయాన్ని విమర్శించాల్సిన చంద్రబాబేమో దాన్ని స్వాగతించారు. కిరణే అధిష్టానం నిర్ణయాలను స్వాగతించబోననీ, అలాగని వ్యతిరేకించనని చెప్పడంతో ప్రజల ంతా విస్మయానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కాంగ్రెస్ అధిష్టానం గేమ్‌ప్లాన్‌లో భాగంగానే ఇలా వ్యవహరించారన్న అనుమానాలు ఇరు పార్టీల నేతల్లో బలపడుతున్నాయి. -
ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాలి
పాన్‌గల్, న్యూస్‌లైన్: సీమాంధ్రకు అనుకూలంగా వ్యవ హరిస్తూ, తెలంగాణపై వివక్ష చూపుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవీ నుంచి తప్పించాలని కొల్లాపూర్ ఎమ్మె ల్యే జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివా రం పాన్గల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలు సామరస్యంతో ఉన్నా... సీమాంధ్ర ప్రాంత నాయకు లు, ప్రజలు తెలంగాణ వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. తిరుమలలో కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావుపై దాడి చేయడం అమానుషమన్నారు. సీమాంధ్రులు దాడులు చేస్తున్నా పోలీ సులు పక్షపాతంతో వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సీమాంధ్ర నేత లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు. వీహెచ్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జూపల్లి డిమాండ్ చేశారు.సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు వెంకటేష్‌నాయుడు, చక్రవెంకటేష్, బాలరాజు పాల్గొన్నారు. -
ఎఫ్‌సీఐ పునరుద్ధరణలో సీఎం పాత్ర శూన్యం
కరీంనగర్, న్యూస్‌లైన్ : రామగుండలం ఎఫ్‌సీఐ పునరుద్ధరణలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిందేమీ లేదని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ అన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎఫ్‌సీఐ పునరుద్ధరణ విషయంలో మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి ని పొగడడం సరికాదన్నారు. తనతోపాటు తన తండ్రి, మాజీ మంత్రి జి.వెంకటస్వామి అనేకసార్లు చేసిన విజ్ఞప్తుల మేరకే కేంద్రం ఎఫ్‌సీఐని పునరుద్ధరిస్తోందని తెలిపారు. నేదునూరు గ్యాస్ ఆధారిత ప్లాంట్‌కు గ్యాస్ కేటాయింపుల పై సీఎం కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదని, సీమాంధ్రలోని జెన్కో, జీఎంఆర్ ప్లాంట్లకు మాత్రం గ్యాస్ కేటాయింపులు చేయించుకున్నారని విమర్శించా రు. నదీ జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సూచనలు ఉన్నాయని, కుట్రలు, కుతంత్రాల కు తెరదించి అన్నదమ్ముల్లా విడిపోయి కలిసుందామని అన్నారు. కేసీఆర్ పోరాటంతోనే కేంద్రం తెలంగాణ ప్రకటించిందని, తాను టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని, కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. సీఎం, డీజీపీని బర్తరఫ్ చేయాలి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి సీమాంధ్ర పక్షపాతులుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చుపెట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న సీఎంకు పాలించే నైతిక అర్హత లేదన్నారు. సమావేశంలో ఎమ్మె ల్యే గంగుల, కట్ల సతీశ్, రఘువీర్‌సింగ్, అక్బర్‌హుస్సేన్, లక్కాకుల మోహన్‌రావు, నందెల్లి మహిపాల్, మొగిలోజు వెంకట్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
కోత పెట్టి.. కొత్తగా!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఎన్నికల పుణ్యమా! అంటూ గతంలో కోత పెట్టిన పింఛన్ల ను ప్రభుత్వం తిరిగి ఇచ్చే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. వివిధ కారణాలు చూపి జిల్లాలో 97వేల సామాజిక పింఛన్లను రద్దుచేసిన అధికారులు వచ్చే రచ్చబండ కార్యక్రమం ద్వారా 44,830 పిం ఛన్లు మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా వయస్సు తక్కువగా ఉందని వృద్ధాప్య పింఛన్లు, సదరన్ క్యాంపులు నిర్వహించి అంగవైకల్య శాతం తక్కువగా ఉందని పిం ఛన్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ‘బంగారు తల్లి’ పథకం అమలులో భాగంగా గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కొ త్త పింఛన్లను మంజూరుచేసే విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకుని అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తే ఆయన మరణానంతరం వచ్చిన సీఎంలు కె.రోశయ్య, ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డిలు గతంలో ఉన్న పలువురి పింఛన్లను తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గతంలో తిరస్కరించిన వికలాంగులందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలగించిన పింఛన్లు ఇలా.. అయితే జిల్లాలో జిల్లాలో దాదాపు 21వేల వికలాంగుల పింఛన్లు తొలగించారు. తిరిగి వారందరికీ పింఛన్లు మంజూరుకావాల్సి ఉండగా, అందులో కేవలం 2454 మంది వికలాంగులకు మాత్రమే పింఛన్లు మంజూరుచేసి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు దాదాపు 43 వేలు తొలగించగా కొత్తగా 25,466 పింఛన్లు మంజూరు చేశారు. వితంతువులకు సంబంధించి 33వేల పింఛన్లను తొలగించగా..వాటి స్థానంలో ప్రస్తుతం 13,491 పింఛన్లు మంజూరుచేశారు. చేనేత, కల్లు గీత కార్మికుల పింఛన్లు కూడా అరకొరగానే ఇవ్వడంతో ఆయా వర్గాలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సార్వత్రిక ఎన్నిలు కూడా ఆ వెంటనే వచ్చే అవకాశం ఉండటం, ఈ ఎన్నికలన్నీ కూడా పార్టీ గుర్తులపైనే జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో భయం పట్టుకుంది. కాగా, ఇటీవల నిర్వహించిన సొసైటీ, సర్పంచ్ ఎన్నికలు పార్టీల రహితంగా జరగడంతో ఎక్కువ స్థానాలు తమకే వచ్చాయని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ప్రకటించుకుని సంబరపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా పరువు దక్కించుకోవాలంటే వైఎస్ హయాంలో లబ్ధిపొందిన ప్రతి ఒక్కరికీ తిరిగి లబ్ధి చేకూర్చకపోతే ఇబ్బందులు తప్పవని భావించి ఆ మేరకు అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. సునీతా ల క్ష్మారెడ్డి చేసిన ప్రకటనతో గతంలో పింఛన్లు కోల్పోయిన వికలాంగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. -
కోత పెట్టి.. కొత్తగా!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ఎన్నికల పుణ్యమా! అంటూ గతంలో కోత పెట్టిన పింఛన్ల ను ప్రభుత్వం తిరిగి ఇచ్చే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. వివిధ కారణాలు చూపి జిల్లాలో 97వేల సామాజిక పింఛన్లను రద్దుచేసిన అధికారులు వచ్చే రచ్చబండ కార్యక్రమం ద్వారా 44,830 పిం ఛన్లు మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా వయస్సు తక్కువగా ఉందని వృద్ధాప్య పింఛన్లు, సదరన్ క్యాంపులు నిర్వహించి అంగవైకల్య శాతం తక్కువగా ఉందని పిం ఛన్లను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ‘బంగారు తల్లి’ పథకం అమలులో భాగంగా గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కొ త్త పింఛన్లను మంజూరుచేసే విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకుని అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తే ఆయన మరణానంతరం వచ్చిన సీఎంలు కె.రోశయ్య, ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డిలు గతంలో ఉన్న పలువురి పింఛన్లను తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. బంగారు తల్లి పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గతంలో తిరస్కరించిన వికలాంగులందరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలగించిన పింఛన్లు ఇలా.. అయితే జిల్లాలో జిల్లాలో దాదాపు 21వేల వికలాంగుల పింఛన్లు తొలగించారు. తిరిగి వారందరికీ పింఛన్లు మంజూరుకావాల్సి ఉండగా, అందులో కేవలం 2454 మంది వికలాంగులకు మాత్రమే పింఛన్లు మంజూరుచేసి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు దాదాపు 43 వేలు తొలగించగా కొత్తగా 25,466 పింఛన్లు మంజూరు చేశారు. వితంతువులకు సంబంధించి 33వేల పింఛన్లను తొలగించగా..వాటి స్థానంలో ప్రస్తుతం 13,491 పింఛన్లు మంజూరుచేశారు. చేనేత, కల్లు గీత కార్మికుల పింఛన్లు కూడా అరకొరగానే ఇవ్వడంతో ఆయా వర్గాలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సార్వత్రిక ఎన్నిలు కూడా ఆ వెంటనే వచ్చే అవకాశం ఉండటం, ఈ ఎన్నికలన్నీ కూడా పార్టీ గుర్తులపైనే జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో భయం పట్టుకుంది. కాగా, ఇటీవల నిర్వహించిన సొసైటీ, సర్పంచ్ ఎన్నికలు పార్టీల రహితంగా జరగడంతో ఎక్కువ స్థానాలు తమకే వచ్చాయని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ప్రకటించుకుని సంబరపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లోనైనా పరువు దక్కించుకోవాలంటే వైఎస్ హయాంలో లబ్ధిపొందిన ప్రతి ఒక్కరికీ తిరిగి లబ్ధి చేకూర్చకపోతే ఇబ్బందులు తప్పవని భావించి ఆ మేరకు అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. సునీతా ల క్ష్మారెడ్డి చేసిన ప్రకటనతో గతంలో పింఛన్లు కోల్పోయిన వికలాంగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. -
ఖమ్మంలో సీఎం దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలనే డిమాండ్‌తో ఉద్యోగ జేఏసీ చేపట్టిన నిరసనలు రెండోరోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా జోరందుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేసేవరకు ఉద్యమం ఆగదని, తెలంగాణను అడ్డుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యమానికి పరోక్షంగా సహకారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి సీమాంధ్రుల తొత్తుగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ పట్ల నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తూ సీమాంధ్ర ఉద్యమానికి సహకరించడం సరికాదని నినాదాలు చేశారు. సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు కృత్రిమ ఉద్యమాన్ని చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఇరిగేషన్ శాఖ ఉద్యోగులు పువ్వులతో వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గె జిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు ఖాజామియా ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమం ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూడటం సీమాంధ్ర ఉద్యోగులకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీనాయకులు కారుమంచి శ్రీనివాసరావు, మల్లెల రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీను, నందగిరి శ్రీను, వల్లోజు శ్రీను తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించి సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఉద్యోగ జేఏసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటచలపతి రాజు పేర్కొన్నారు. భద్రాద్రి భవిత అనే అంశంపై గాంధీపథం ఆధ్వర్యంలో పట్టణంలోని అన్నపూర్ణా ఫంక్షన్ హాల్లో చ ర్చా వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో పీఆర్ మినిస్టీరియల్ సంఘం జిల్లా కోశాధికారి గౌసుద్ధీన్, గాంధీ పథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి, టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు, తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ రేగలగడ్డ ముత్తయ్య పాల్గొన్నారు. మధిరలో జేఏసీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంవద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ఏపీఎన్జీవోలు చేస్తున్న ఉద్యమానికి నిరసనగా ప్రదర్శన చేశారు. టీజెఏసీ మధిర డివిజన్ చైర్మన్ ఎస్ విజయ్, పట్టణ కన్వీనర్ చెరుపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తెలంగాణ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ తాలూకా యూనిట్ అధ్యక్షులు రామారావు తదితరులు పాల్గొన్నారు. పాల్వంచలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నభోజన సమయంలో ఉద్యోగులు బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.వి.రమణ, ఎస్.కె.మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఇల్లందులో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పలు శాఖల ఉద్యోగులు భోజన విరామ సమయంలో రెండో రోజు ఆందోళన నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఇల్లెందు డివిజన్ తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షులు పి.అప్పారావు, ఉద్యోగ జేఏసీ నాయకులు శ్రీనివాస్, బాలాజీ, మహేష్, రవి,ప్రభావతీ,స్వర్ణలత, మహబూబ్అలీ పాల్గొన్నారు. అశ్వారావుపేటలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మండలపరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ ప్రకాష్‌రావు, ఎంపీడీఓ రవి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఏపీఎన్జీఓలు,సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర విభజనను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని టీజేఏసీ నాయకులు ఆరోపించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
సీమాంధ్ర మంత్రులు రాజీనామా సరికాదు: కేఎల్ఆర్
సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయడం సరికాదని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) మంగళవారం హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. మంత్రుల రాజీనామాలతో రాష్ట్రంలో పాలన స్తంభిస్తుందన్నారు. సీఎం కిరణ్ తక్షణమే మంత్రివర్గాన్ని సమావేశపరిచి, తాజా పరిస్థితిపై సమీక్షించాలని సూచించారు. రాజీనామాలు చేసిన మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పాలనను మెరుగుపరిచి అభివృద్ధి, సంక్షేమ పథకాలు సజావుగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి హితవు పలికారు. -
‘గులాబీ’కి గట్టి దెబ్బ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్‌బ్యూరోకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుసుకున్నారు. కాంగ్రెస్‌కు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చంద్రశేఖర్ రాజీనామాతో జిల్లాలో గులాబీ శిబిరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2004 ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరిన ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో చిన్న నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో విభేదాలు పొడచూపాయి. ఆయనపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధించినప్పటికీ, పార్టీని మాత్రం వీడలేదు. ఆ తర్వాత కేసీఆర్‌తో కలుపుగోలుగా వ్యవహరించినప్పటికీ, మునుపటి ప్రాధాన్యం దక్కలేదు. ఈ క్రమంలోనే పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లు వ్యవహరించిన చంద్రశేఖర్ అదను కోసం ఎదురుచూశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం ఆయనకు కలిసివచ్చింది. పార్టీని వీడేందుకు ఇదే తగిన సమయమని భావించిన చంద్రశేఖర్ వారం రోజుల క్రితం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కావడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సన్నిహితులు, ముఖ్య అనుచరులతో సమాలోచనలు జరిపిన చంద్రశేఖర్ టీఆర్ఎస్ను వీడుతున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం సీఎం కిరణ్నుకలిసి తాము కాంగ్రెస్‌లో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పారు. -
అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో తీవ్ర సందిగ్ధత నెలకొంది.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ర్యా లంపాడు పంప్‌హౌస్ నుంచి నీటి విడుద ల కార్యక్రమానికి ఈనెల 17న సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుద్దామా?..వద్దా? అ నే మీమాంస అందరిలోనూ నెలకొంది. ఈ ఖరీఫ్‌లో ర్యాలంపాడు జలాశయం ద్వారా 50వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ని ర్ణయించారు. అయితే ర్యాలంపాడు ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను ప్రారంభించేం దుకు ముఖ్యమంత్రిని ఆహ్వానించి పెద్దఎ త్తున కార్యక్రమం చేపట్టాలని జిల్లా కాంగ్రె స్ నేతలు ముందుగా నిర్ణయించుకున్నారు. తెలంగాణపై సీఎం తన అభిప్రాయం వెల్లడించి.. సొంతపార్టీ నేతల ఆగ్రహానికి గురైన నేపథ్యంలో ఆయనను జిల్లాకు ఆహ్వానిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని కాంగ్రెస్‌పార్టీ నేతలు ఆలోచనలోపడ్డారు. ముందుగానే సీఎం పర్యటన ఖరారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి *1428 కోట్ల అంచనా వ్యయంతో జల యజ్ఞం పథకంలో భాగంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంలో ర్యాలంపాడు రెండోదశ లిఫ్ట్ కింద ఐదు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు అంద నుండగా ఈ ఖరీఫ్‌లో 50వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే జూరాల రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మొదటి దశ కింద గుడ్డెందొడ్డి పంప్‌హౌస్‌ను గతేడాది సెప్టెంబర్ 14న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ర్యాలంపాడు వద్ద నిర్మించిన రెండోదశ పంప్‌హౌస్ పనులను ఈనెల 17న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించి ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై గతంలో మంత్రి డీకే అరుణ ముఖ్యమంత్రితో మాట్లాడి తేదీని కూడా నిర్ణయించారు. ఏం చేద్దామబ్బా?! తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ సాగునీరు, విద్యుత్, విద్య, ఉద్యోగాలు, హైదరాబాద్‌పై స్పష్టత ఇచ్చాకే ముందుకు వెళ్లాలని తన మనోభావాలను వెల్లడించడంతో ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ‘నాయకుడు కుట్రదారు కావొద్దు’ అంటూ సీఎంను ఉద్దేశించి డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, ‘సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనం’ అంటూ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, ‘హై కమాండ్‌నే ఎదిరిస్తావా.. సోనియా దయతో ఆ సీట్లో కూర్చొన్నావ్’ అంటూ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడటంతో తెలంగాణ జిల్లాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించాలా? వద్దా? అని కాంగ్రెస్ నాయకులు ఆలోచనలో పడ్డారు. అందుకే ర్యాలంపాడు రెండోదశ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ ప్రారంభించేందుకు సీఎంను ఆహ్వానించకపోవడమే మంచిదని జిల్లా కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వర్గంగా ముద్రపడిన డీకే అరుణ కూడా సీఎంను పిలువాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తే ఇబ్బందులు తప్పవని సంకేతాలు అందడంతో నాయకులు ఇరకాటంలో పడ్డారు. అయితే ర్యాలంపాడు రెండోదశ పంప్‌హౌస్‌ను ప్రారంభించకుండా వాయిదావేస్తే ఈ ఖరీఫ్‌లో సాగునీటి విడుదలకు ఆటంకం కలుగుతుందని, సీఎం కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ముగిస్తే ఒక పనైపోతుందని జిల్లా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నటు సమాచారం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానిస్తున్నారా? లేదా? అని మంత్రి డీకే అరుణ వద్ద ప్రస్తావించగా.. ఈ విషయమై గతంలో ఒకసారి సీఎంతో చర్చించామని తిరిగి వాటి గురించి మాట్లాడలేదన్నారు. -
‘సరిహద్దు సమస్యలపై అంతర్గత విమర్శలు తగదు’
-
ముఖ్యమంత్రితో బొత్స సత్యనారాయణ భేటీ
హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఏకే ఆంటోనీ కమిటీ ముందు వాదనలు వినిపించే నేతల జాబితాపై ఈ సమావేశంలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర రక్షణశాఖ మంత్రి ఏకె ఆంటోనీ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ మాజీ నేతలు విజయ రామారావు, చంద్రశేఖర్ ఈరోజు ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. విజయరామారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. -
సీఎం వ్యాఖ్యలపై స్పందించని నేతలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుంటే సొంత పార్టీ నేతలు కొందరు నోరు మెదపడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం హోదాలో చేసిన సమైక్యాంధ్ర అనుకూల వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెర తీశాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఉటంకిస్తూ జిల్లాలో తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కిరణ్ దిష్టిబొమ్మలు దహనం చేయడంతోపాటు ఆయనకు సద్బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఒంటికాలుపై లేచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవరోధాలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. డీసీసీ అధ్యక్షుడు సి.రాంచద్రారెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సీఎం వ్యాఖ్యలను ఖండించారు. సొంత పార్టీతోపాటు టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలతోపాటు విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీలు తీవ్రంగా స్పందిస్తుండగా కాంగ్రెస్ పార్టీ, సీఎం లాబీయింగ్‌లో కీలకంగా ఉన్న నేతలు మాత్రం మౌనంగా ఉంటుండటం దేనికి సంకేతమన్న చర్చ సాగుతోంది. సీఎం వ్యాఖ్యలపై ప్రేంసాగర్‌రావు, ఆయన వర్గం మౌనం సీఎం కిరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మౌనం వహించడం వెనుక మర్మం ఏమిటన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకునే ప్రతీ ఒక్కరిలో ప్రేంసాగర్, ఆయన అనుచరవర్గం అనుసరిస్తున్న తీరు అనుమానాలను రేకెత్తిస్తుంది. సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, సీఆర్ఆర్, దివాకర్‌రావు సీఎం తీరును ఎండగట్టగా, ప్రేంసాగర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి తదితరులు మౌనం వహించడం తెలంగాణ వాదులను ఆలోచింప చేస్తోంది. గతంలోను జిల్లాలో సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతున్న సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న ప్రేంసాగర్‌రావు జిల్లా నుంచి సుమారు 1000 మందిని తీసుకెళ్లి సీఎం కిరణ్‌కుమార్‌కు అభినందనలు తెలపడం కూడా వివాదాస్పదమైంది. రూపాయి కిలో బియ్యం పథకం ప్రకటించిన నేపథ్యంలో సీఎంను అభినందించేందుకు వెళ్లిన ఆయన తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారికి ఏం సంకేతాలిచిన్నట్లన్న చర్చ అప్పట్లో జరిగింది. ఎమ్మెల్యే సక్కు, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, డీసీసీ రేసులో ఉన్న జాదవ్ అనిల్‌కుమార్‌లతోపాటు ఎవరూ కూడా సీఎం వ్యాఖ్యలపై స్పందించలేదని, వారి అనుచరులను నోరు మెదపనివ్వడం లేదన్న చర్చ బహిరంగంగానే సాగుతోంది.ఏదేమైనా సీఎం వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా భగ్గుమంటున్న తరుణంలో తెలంగాణవాదులుగా పలువురు నేతలు స్పందించని వైనం తెలంగాణవాదులు, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. -
గణాంకాలు చెప్పి మభ్యపెట్టే యత్నం
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గణాంకాలు చెప్పి సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిత్యానందరెడ్డికి శనివారం సాయంత్రం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గణాంకాలు చెప్పడం గొప్పతనం కాదని, సమైక్య రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఓవైపు పదవిలో ఉంటూ ప్రజలకు నీతులు చెబుతారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పులిబిడ్డలా రాజీనామా చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారన్నారు. గతంలో ఇందిరాగాంధీ విదేశీ అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెప్పేవారని, కానీ తన కోడలే ఒక అరాచక శక్తి అని ఆమె గ్రహించలేకపోయిందన్నారు. సీమాంధ్రలోని కొందరు నాయకులకు మంత్రి పదవులు ఎరగా వేసి విభజన నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. విభజన జరుగుతుందని తెలిసి కూడా మౌనంగాఉన్న నేతలను సమైక్య వాదులు నిలదీయాలని పిలుపునిచ్చారు. సీఎం, చంద్రబాబు రాజీనామా చేయాలి : రఘురామిరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించిఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. చేతగాని ముఖ్యమంత్రి, మంత్రులు రాయలసీమను ఎడారిగా చేయడానికే విభజన నిర్ణయం తీసుకుంటున్నా మౌనంగా ఉన్నారని విరుచుకుపడ్డారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ రాజీనామాలు చేయడం శుభపరిణామమన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఏకమై రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయని మండిపడ్డారు.నిత్యానందరెడ్డికి మద్దతు ప్రకటించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రామకృష్ణ కళాశాల కరాస్పాండెంట్ కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. -
'ఓ భాష వారు ఒకే రాష్టంగా ఉండాల్సిన అవసరం లేదు'
ఒక భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాల్సిన అవసరం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శనివారం స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. సీఎం కిరణ్ మాట్లాడిన తీరును ఆయన తప్పుపట్టారు. 23 జిల్లాలకు ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కిరణ్ విస్మరించారని నారాయణ ఆరోపించారు. తెలంగాణలో సీమాంధ్రుల రక్షణకు తాము భరోసా ఇస్తామని ఆయన స్ఫష్టం చేశారు. ప్రస్తుతం సీమాంధ్రు వాసులను ఆంధ్రా గో బ్యాక్ అని ఎవరూ అనడం లేదని నారాయణ తెలిపారు. -
కేసీఆర్ వ్యాఖ్యలు అసమంజం: కోండ్రు
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై మంత్రి కోండ్రు మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యలు అసమంజంగా ఉన్నాయని కోండ్రు మండిపడ్డారు. కొందరు తెలంగాణనేతలు సీమాంధ్ర ప్రజలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన శనివారమిక్కడ అన్నారు. కోమటిరెడ్డి, పొన్నం వంటివారి వ్యాఖ్యలు గర్హనీయమని, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకునేలా మాట్లాడుతున్నరని కోండ్రు వ్యాఖ్యానించారు. మరోమంత్రి బాలరాజు మాట్లాడుతూ ముందు చూపున్న నేతగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వాస్తవాలే మాట్లాడారని అన్నారు. సీఎం అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. సీఎం వ్యాఖ్యలను కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని అన్నారు. కాగా రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థించిన విషయం తెలిసిందే. -
కిరణ్ వాస్తవాలు వెల్లడించారు: ఉండవల్లి
రాజమండ్రి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కఠోరమైన నిజాలు వెల్లడించారని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆయన శనివారమిక్కడ అభిప్రాయపడ్డారు. ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చనేది కాంగ్రెస్ విధానమన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పారని ఉండవల్లి అన్నారు. హైదరాబాద్‌లో మెజార్టీ శాసనసభ్యులు విశాలాంధ్రను కోరుతున్నారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు విప్లుండవన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై ఉండవల్లి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ వల్లే ఇరుప్రాంతాల్లోనూ వైషమ్యాలు పెరిగాయన్నారు. చరిత్రను కేసీఆర్ వక్రీకరిస్తున్నారని ఉండవల్లి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంటిన్ పెట్టువాలనటం కేసీఆర్‌కు తగదని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడితే జలపంపకాల కోసం పాకిస్తాన్‌తో మాట్లాడనట్లు చేయాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి తాము పోతామని అనలేదని ఆయన పేర్కొన్నారు. -
సీఎం వ్యాఖ్యలపై ఓరుగల్లులో ఆగ్రహ జ్వాల
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఓరుగల్లు రగిలింది. జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు నిరసన గళం వినిపించారు. సీఎం రాజీనామా చేయూలని, లేనిపక్షంలో కేంద్రం స్పందించి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. పలు సెంటర్లలో ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. కిరణ్... తెలంగాణ వ్యతిరేకిగా మారారని, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్రలను ఇప్పటికైనా మానుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడెక్కడ.. ఎలా.. కేయూ జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రెండో గేటు వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం డౌన్, డౌన్ అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. విద్యార్థుల నిరసనతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కేయూ జంక్షన్ వద్ద యువజన, ప్రజాసంఘా లు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశాయి. హన్మకొండ అమరవీరుల స్థూపంవద్ద బీసీ జేఏసీ నాయకులు, న్యాయవాదులు, విద్యార్థులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో వినూత్న నిరసన తెలిపారు. కిరణ్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి చెట్టుకు ఊరితీశారు. వరంగల్ పోచమ్మమైదాన్ , కురవి, నర్సింహులపేట, పాలకుర్తి, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, పరకాల, గీసుగొండ, బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు మండల కేంద్రాల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనల్లో టీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, బోడ డిన్నా, చాగంటి రమేష్, కిషన్, దామోదర్, లంక రాజగోపాల్, సైదిరెడ్డి, తిరునహరి శేషు, కేయూ జేఏసీ, టీజేఏసీ, బీసీ జేఏసీ, టీఎస్‌జేఏసీ, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. మరో ఉద్యమానికి సిద్ధం తెలంగాణపై కుట్రలను ఆపకుంటే మరోసారి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధం. ఇప్పటికైనా అన్నదమ్ముల్లా విడిపోయేందుకు సహకరించాలి. సీఎం లాంటివారు కుట్రలు చేస్తే సహించేదిలేదు. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాలి. మంత్రులు స్పందించి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలవాలి. ఇప్పటికే టీజేఏసీ ఈ అంశంపై చర్చించింది. ఒకటి, రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశముంది. - ప్రొఫెసర్ పాపిరెడ్డి, టీ జేఏసీ చైర్మన్ -
భగ్గుమన్న కన్నారం
తెలంగాణ విభజన విషయమై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా ప్రజలు భగ్గుమన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి సీమాంధ్ర ప్రాంత పక్షపాతిగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, నదీ జలాల పంపిణీ, విద్యుత్ రంగంలో సమస్యలు వస్తాయంటూ అసత్య ్రపచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలు దహనం చేశారు. - న్యూస్‌లైన్ నెట్వర్క్ -
సీఎంపై భగ్గు భగ్గు
సాక్షి, నల్లగొండ : రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్‌కుమారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో తెలంగాణవాదులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం సీఎం దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. శవయాత్రలు నిర్వహించి వ్యతిరేకంగా నినదించారు. సీల్డ్ కవర్ సీఎం అని, తెలంగాణకు బద్ధవ్యతిరేకి అని పలువురు దుమ్మెత్తిపోశారు. సీడబ్ల్యూసీ తీర్మానంపై ఆయన స్పందించిన తీరుతో 4.50 కోట్ల తెలంగాణ ప్రజలు మానసికంగా ఆందోళన చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా తెలంగాణ ద్రోహిగా చరిత్రకెక్కారని వ్యాఖ్యానించారు. సీఎంగా కొనసాగేందుకు ఏ ఒక్క అర్హతా లేదని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని రామగిరిలో టీజేఎస్ఎఫ్, బీడీఎస్ఎఫ్ ఆధ్యర్యంలో సీఎం దిష్టిబొమ్మకు నిప్పుపెట్టారు. కనగల్ మండలం రేగట్టేలో జేఏసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి అనంతరం దహనం చేశారు. తిప్పర్తిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆలేరు మండలం కొలనుపాక, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, వలిగొండ, చౌటుప్పల్, మునుగోడు, సూర్యాపేట, రామన్నపేట, నకిరేకల్ మండలాల్లో టీఆర్ఎస్, సంస్థాన్ నారాయణపురం, చండూరు, చివ్వెంలలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. -
సీఎం కిరణ్‌పై సొంత పార్టీ నేతల ఫైర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర విభజనతో తెలంగాణ ఏర్పడితే సమస్యలు వస్తాయంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా కేవలం సీమాంధ్ర ప్రాంత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అపరిపక్వ మనస్తత్వంతో కిరణ్ రాష్ట్ర విభజనపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి సీఎం కట్టుబడి ఉండాల్సిందేనంటూ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హైదరాబాద్ మీట్ ది ప్రెస్‌లో సీఎం వైఖరిని ఎండగట్టారు. సీఎం వ్యాఖ్యలపై శుక్రవారం జరిగే ప్రెస్మీట్లో స్పందిస్తానని మంత్రి గీతారెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రాంతం నుంచి సమైక్యవాదం వినిపిస్తున్న ఏకైక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తూ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సంయమనం పాటిద్దాం ఎవరేం వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ప్రజలు, నాయకులు సంయమనం పాటించాలి. రాష్ట్ర ఏర్పాటు, పునర్మిర్మాణంపై దృష్టి సారిద్దాం. ఎవరో ఏదో మాట్లాడారని అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్నందున ఏ ప్రాంతం వారికీ నష్టం ఉండదు. - సునీతా లక్ష్మారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందే! సుదీర్ఘకాలంగా నలుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఏర్పాటుకు ప్రాం తాలకు అతీతంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహకరించాలి. కిరణ్ రాష్ట్రం మొత్తానికి సీఎం అనే విషయాన్ని గుర్తించి, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. - సురేశ్ షెట్కార్, ఎంపీ, జహీరాబాద్ సీఎం వ్యాఖ్యలు విడ్డూరం సీఎం కిరణ్ అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రిననే విషయాన్ని గ్రహించాలి. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానంటూ ప్రకటనలు ఇచ్చిన సీఎం కిరణ్ ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నారు. నా చేతిలో ఏమీ లేదంటూనే సీమాంధ్ర ప్రతినిధిగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. - టి. నర్సారెడ్డి, ఎమ్మెల్యే, గజ్వేల్ సీఎం వ్యాఖ్యలు విడ్డూరం సీఎం కిరణ్ అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రిననే విషయాన్ని గ్రహించాలి. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానంటూ ప్రకటనలు ఇచ్చిన సీఎం కిరణ్ ప్రస్తుతం యూ టర్న్ తీసుకున్నారు. నా చేతిలో ఏమీ లేదంటూనే సీమాంధ్ర ప్రతినిధిగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. - టి. నర్సారెడ్డి, ఎమ్మెల్యే, గజ్వేల్ మనోభావాలు దెబ్బతీసేలా మాటలు ముఖ్యమంత్రి కిరణ్ ముఠా నాయకుడిలా మాట్లాడుతున్నా రు. దివంగత సీఎం వైఎస్, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హయాంలో ఇలాం టి అంశాలు ప్రస్తావనకు వచ్చి నా ఎన్నడూ ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడలేదు. కిరణ్ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎం సీమాంధ్ర ప్రతినిధిగా వ్యవహరించారు. సీఎం వైఖరిని ఖండిస్తున్నాం. - టి. నందీశ్వర్‌గౌడ్, ఎమ్మెల్యే, పటాన్చెరు సీఎం తీరు సరికాదు మూడేళ్లుగా రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి ఒక ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు. సీఎం వ్యాఖ్యలతో మా మనసు గాయపడింది. - పి. కిష్టారెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్ -
సీఎంగా కొనసాగే హక్కు కిరణ్‌కు లేదు
హైదరాబాద్ : కిరణ్‌కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కులేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. పార్టీలో...బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ వల్లే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని కోదండరామ్ మండిపడ్డారు. సీఎం తీరుకు నిరసనగా మూడు రోజుల పాటు ర్యాలీలు, దిష్టిబొమ్మలు దగ్దం కార్యక్రమాలు చేపడతామన్నారు. 10,11, 12 తేదీల్లో నిరసన చేస్తామని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమకార్యాచరణను తీవ్రతరం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు కూడా సంబరాలు వదిలి పక్షపాతంతో వ్యవహరిస్తున్న సీఎం కింద తాము పనిచేయలేమని స్పష్టం చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. -
సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నం
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ విద్యార్థులు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. తెలంగాణా రాష్ట్ర లోక్ దళ్, విద్యార్థి దళ్ కార్యకర్తలు క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులుకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులును అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. మరోవవైపు అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు ఒక్క ప్రాంతానికి చెందిన ప్రతినిధిగా మాట్లాడటం సబబు కాదని టీఆర్ఎస్ ఆరోపించింది. ఆ పార్టీ మహిళ విభాగం కార్యకర్తలు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చోటుచేసుకుంది. పోలీసు జూలం నశించాలని మహిళా కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
సీఎం సామాన్య పౌరుడిలా మాట్లాడటం హాస్యాస్పదం
రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ సామాన్య పౌరుడిలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి శుక్రవారం కర్నూలులో పేర్కొన్నారు. పార్టీ జెండా పట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు సమైక్యవాదులమని చెప్పడం సరికాదని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నాయకులు పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజనపై హోంశాఖ ఆధ్వర్యంలో చట్టబద్ధ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఆంటోనీ కమిటీకి చెప్పేది లేదని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. -
రాజీనామా చేశాకే కిరణ్ మాట్లాడాలి: జీవన్‌రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కిరణ్ సీమాంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కిరణ్.. ఎమ్మెల్యేల ద్వారా సీఎంగా ఎంపికైన నేత కాదని అన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించేలా ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాకే కిరణ్ మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రకియపై ముందుకెళ్లాలని సీఎం కిరణ్ నిన్న అన్నారు. రాష్ట్ర విభజన అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీదేనని కేంద్రానికి కాదని స్పష్టం చేశారు. -
కిరణ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు:డీఎస్
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలపై శుక్రవారం ఆయన నిజామాబాద్‌లో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని, సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మొగ్గు చూపారని డీఎస్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గత ఐదు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ గమనిస్తుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కిరణ్ సిఎంగా ఉన్నప్పుడే పలుమార్లు ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన సంగతిని డీఎస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ కమిటీ సమావేశాల్లో సీఎం పాల్గొన్నారన్నారు. ప్రస్తుత కేబినేట్ సహచరులే ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రితో చర్చించకుండా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోదని డీఎస్ చెప్పారు. -
వైఎస్‌పై నిందలు వేయటం సరికాదు: గుత్తా
నల్గొండ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు విరుచుకు పడ్డారు. కిరణ్‌కుమార్ రెడ్డికి తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిలుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. సొంత జిల్లాలో సర్పంచ్‌లను గెలిపించుకోలేని ముఖ్యమంత్రి సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు.... ముఖ్యమంత్రి కార్యక్రమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. విభజనకు ఆధ్యుడు ... చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమంటూ అపనిందలు వేయటం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు సూచించారు. కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజలనుంచి వచ్చే అనేక అంశాలపై చర్చించాలని, ఆ తరువాతే విభజన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ఒట్టి మాటలే..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం :మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడం అంటే ఇదే! హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ ఆయకట్టు 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 2012 నవంబర్ 29న జీడిపల్లి రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంలో హామీ ఇచ్చారు. కానీ.. ఆ తర్వాత నీళ్లందించే ఆయకట్టును 1.98 లక్షల ఎకరాల నుంచి 40 వేలకు కుదించారు. పోనీ.. ఆ 40 వేల ఎకరాలకైనా నీళ్లందిస్తారా అంటే నీటిపారుదలశాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. కారణం.. ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులను కాంట్రాక్టర్లు ఇప్పటికీ ప్రారంభించకపోవడమే. దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.6,850 కోట్లతో పరిపాలనపరమైన అనుమతులను జారీ చేసి.. పనులను ప్రారంభించారు. ఇందులో హంద్రీ-నీవా తొలి దశ అంచనా వ్యయం రూ.2,774 కోట్లు. ఇప్పటిదాకా 2,750 కోట్ల విలువైన పనులను పూర్తి ఒట్టి మాటలే..!చేశారు. తొలి దశ పనులు పూర్తి కావాలంటే మరో రూ.400 కోట్లను ఖర్చు చేయాలి. కానీ.. సర్కారు సక్రమంగా నిధులను విడుదల చేయకపోవడంతో హంద్రీ-నీవా తొలి దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటరీల పనులనే కాంట్రాక్టర్లు ప్రారంభించకపోవడం అందుకు తార్కాణం. హంద్రీ-నీవా తొలి దశలో 1.98 లక్షల ఆయకట్టు ఉండగా.. ఇందులో 80 వేల ఎకరాల ఆయకట్టు కర్నూలు జిల్లా పరిధిలోనూ.. తక్కిన 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు మన జిల్లాలోనూ ఉంది. హంద్రీ-నీవా తొలి దశ పనులను పాక్షికంగా పూర్తి చేసిన ప్రభుత్వం నవంబర్ 18న ట్రయల్ రన్ చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 2.5 టీఎంసీల నీటిని ట్రయల్ రన్లో భాగంగా ఎత్తిపోసింది. ఇందులో 0.58 టీఎంసీల జలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరాయి. జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు చేరిన సందర్భంగా నవంబర్ 29న రఘువీరా పాదయాత్రను అక్కడ ముగించారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ మాట్లాడుతూ హంద్రీ-నీవా తొలి దశ ఆయకట్టుకు 2013 ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణమ్మ పొంగిపొర్లుతున్నా.. హంద్రీ-నీవాను మిగులు జలాల ఆధారంగా చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో 2012 నవంబర్ 18న ట్రయల్ రన్ సందర్భంగా 2.5 టీఎంసీల నీళ్లను హంద్రీ-నీవా కాలువల్లోకి ఎత్తిపోస్తే ఓ ప్రాంతం ప్రజాప్రతినిధులు రాద్ధాంతం చేశారు. మిగులు జలాలతో చేపట్టిన ప్రాజెక్టుకు నికర జలాలను ఎలా విడుదల చేస్తారని నానా యాగీ చేశారు. హంద్రీ-నీవాకు కృష్ణా మిగులు జలాల్లో కేటాయించిన 40 టీఎంసీలను.. శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద వచ్చే 120 రోజుల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. గత 20 రోజులుగా శ్రీశైలం రిజర్వాయర్‌ను వరద ముంచెత్తుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో పక్షం రోజుల క్రితమే నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ కూడా బుధవారం నిండిపోయింది. దాంతో.. గురువారం నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. ఎట్టకేలకు బుధవారం ఉదయం 7.30 గంటల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి హంద్రీ-నీవాకు 700 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. అదే 20 రోజుల క్రితమే నీటిని విడుదల చేసి ఉంటే.. వర్షాభావంతో అలమటిస్తోన్న ‘అనంత’ దాహార్తి అయినా తీరి ఉండేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక బుధవారం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి హంద్రీ-నీవా కాలువల్లోకి ఎత్తిపోసిన జలాలు గురువారం మధ్యాహ్నానికి బ్రాహ్మణకొట్కూరు వద్దకు చేరాయి. మన జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు వచ్చే బుధవారం నాటికి కృష్ణా జలాలు చేరే అవకాశం ఉందని హంద్రీ-నీవా ఎస్ఈ సుధాకర్‌బాబు వెల్లడించారు. ఆయకట్టు కనికట్టే.. 2010 ఖరీఫ్‌లోనే హంద్రీ-నీవా తొలి దశ కింద ఆయకట్టుకు నీళ్లందిస్తామని అప్పటి సీఎం రోశయ్య 2010 ఏప్రిల్ 24న ప్రకటించారు. కానీ.. 2010 ఖరీఫ్ నాటికి తొలి దశ పనులే పూర్తి కాలేదు. 2011 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లందిస్తామని ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ.. 2011 నాటికి పనులు పూర్తి కాలేదు. దాంతో.. ముహూర్తాన్ని 2012 ఖరీఫ్‌కు వాయిదా వేశారు. కానీ.. ఆ ముహూర్తం కూడా కుదరలేదు. చివరకు 2013 ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని ప్రకటించారు. పోనీ.. ఈ సారైనా జాగ్రత్తలు తీసుకున్నారా అంటే అదీ లేదు. తొలుత 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని సీఎం ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత మాట మార్చి 80 వేల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు. పోనీ.. ఆ మాటపైనైనా నిలబడ్డారా అంటే అదీ లేదు.. చివరకు 40 వేల ఎకరాలకు నీళ్లందిస్తామని తేల్చారు. ఇందులో కర్నూలు జిల్లాలో 20 వేల ఎకరాలకు.. మన జిల్లాలో 20 వేల ఎకరాలకు నీళ్లందిస్తామని ప్రకటించారు. కానీ.. ఆ ఆయకట్టుకు కూడా నీళ్లందించే పరిస్థితులు కన్పించడం లేదు. ఎందుకంటే.. జిల్లా పరిధిలో ఎక్కడా డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తికాలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమేనన్నది స్పష్టమవుతోంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోని రెవెన్యూ మంత్రి రఘవీరారెడ్డి హంద్రీ-నీవా కింద ఆరుతడి పంటలు సాగు చేసుకునే రైతులను చైతన్య పరచాలని అధికారులకు దిశానిర్దేశం చేయడం కొసమెరుపు. -
కరువు తీరగా... సిరులు పండగ
గద్వాల, న్యూస్‌లైన్: పాలమూరు జిల్లాలో కరువు నేలగా పేరొందిన ధరూర్, గట్టు మండలాల్లోని మెట్టభూముల వైపు కృష్ణమ్మ పరుగులు తీయనుంది. వ ర్షాభావ పరిస్థితుల కారణంగా బీళ్లు గా మారిన భూములు ఇక సస్యశ్యామలం కానున్నాయి. దశాబ్దాల కల ను నెరవేరుస్తూ నేడు(శుక్రవారం) నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నుం చి ఖరీఫ్ ఆయకట్టుకు సాగునీరు అం దించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. గతేడాది సెప్టెంబర్ 14న నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి లిఫ్టును సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించి నా.. ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫీల్డ్ చానల్స్ సిద్ధంగా లేకపోవడం వల్ల ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేకపోయారు. అయితే ఈ వేసవిలో ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి ధరూరు, మల్దకల్ మండలాల్లోని చెరువులను నింపి తాగునీటి అ వసరాలను తీర్చేందుకు నీటిని విడుదల చేశారు. అయితే నెట్టెంపాడు ప థకం నుంచి ఆయకట్టు కోసం మొదటిసారిగా లిఫ్టులను ప్రారంభిస్తున్నా రు. మంత్రి డీకే. అరుణ శుక్రవారం ఉదయం 11 గంటలకు గుడ్డెందొడ్డి లిఫ్టు వద్ద నీటి ఎత్తిపోతల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ రెండు లిఫ్టుల ద్వారా కనీసం 50వేల ఎకరాలకు సా గునీటిని అందించే విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగానే ధరూరు, గట్టు, అయిజ, మల్దకల్, గద్వాల మండలాల్లోని పలు చెరువులను నింపుతారు నెరవేరనున్న మహానేత ఆశయం కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డగా పిలువబడే గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో నిర్మించి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌తో లక్ష్యం నెరవేరబోతుంది. దశాబ్దాలుగా ఎన్నికల హామీల్లో ఉన్న నెట్టెంపాడు పథకాన్ని చేపట్టడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. 2004 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం 25వేల ఎకరాల లక్ష్యంతో శంకుస్థాపన చేసింది. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా రీసర్వే చేయించి రూ.1428 కోట్ల అంచనా వ్యయంతో మంజూరుఇచ్చారు. నేడు నెట్టెంపాడు జలాలు నడిగడ్డను సస్యశ్యామలం చేయనుండటంతో మహానేత ఆశయం నెరవేరినట్లయ్యింది. 50వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం: ఎస్ఈ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి, ర్యా లంపాడు రిజర్వాయర్ల ద్వారా కనీసం 50వేల ఎకరాలకు ఈ ఖ రీఫ్ సీజన్లో సాగునీటిని అందించాలని నిర్ణయించినట్లు ఎస్ ఈ ఖగేందర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మంత్రి అరుణ మొదటి లిఫ్టును ప్రారంభి స్తారన్నారు. నె ట్టెంపాడు ద్వారా ఆయకట్టుకు సా గునీటిని అందించడంతోపాటు, చెరువు, కుంటల ను నింపేందుకు నిర్ణయించినట్లు ఆయన వివరించారు. -
నిర్ణయానికి ముందు సిఎం ఏంచేశారు?: మైసూరా
-
సిఎమ్ స్వాగతిస్తే ఏంటీ, వ్యతిరేకిస్తే ఏంటీ? - రేణుక
-
స్పష్టత ఇచ్చిన తర్వాతే విభజన: సీఎం
-
నిర్ణయానికి ముందు సిఎం ఏంచేశారు?: మైసూరా
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే ముందు మీరేం చేశారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన నివాసం నుంచి సాక్షిటివితో మాట్లాడారు. నీటి సమస్య భయాందోళన కలిగిస్తుందని చెప్పారు. భౌగోళిక, జల సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు. పార్టీ నిర్ణయం తీసుకునే సమయంలో ఎందుకు మాట్లడలేదు? అని అడిగారు. సీఎం ఇతర పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ ఏం నాటకాలు ఆడుతోందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పది తలల రావణాసురుడు లాంటిది, ఒక్కో తల ఒక్కో మాట మాట్లాడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజనకు చాలా చిక్కు సమస్యలు ఉన్నాయి. ఆ విషయాలను కోర్ కమిటీలో ఎందుకు చర్చించలేదని ఆయన సిఎంను ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన అందరితో మాట్లాడాలని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు. ఎప్పుడో ఇచ్చిన లేఖలను ఇప్పుడు రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు. ఆంటోనీ కమిటీలో మంత్రులు ఉన్నప్పటికీ ఆ కమిటీని కాంగ్రెస్ పార్టీ కమిటీగానే పరిగణిస్తారన్నారు. అధిష్టానం చెప్పిన ప్రకారమే ఆ కమిటీ నివేదిక ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
సీఎం వైఖరిని తప్పుబట్టిన జీవన్‌రెడ్డి
రాష్ట్ర విభజన నిర్ణయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానానికి పార్టీ నేతగా సీఎం కిరణ్ కట్టుబడి ఉండాలని సూచించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించడమంటే అధిష్టానాన్ని ధిక్కరించడమేనని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ తీర్మానించడం కూడా క్రమశిక్షణ ఉల్లంఘించడమేడని పేర్కొన్నారు. అధిష్టానం నియమిస్తేనే కిరణ్ సీఎం అయిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. హైకమాండ్ కూడా సీఎం తీరును తీవ్రంగా పరిగణించాలని జీవన్‌రెడ్డి కోరారు. -
తెలంగాణపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు
ప్రత్యేక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని మంత్రి గీతారెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలిపారు. విస్తృత సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని ఆమె స్పష్టం చేశారు. చారిత్రక నిర్ణయం తీసుకున్న యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తెలంగాణ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తరపున గీతారెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును అధిష్టానం గమనిస్తోందని అన్నారు. అలాగే సీఎంతోపాటు అందరిపైనా నిఘా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్రులంతా స్థానికులే అని గీతారెడ్డి తన అభిప్రాయాని వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యోగులను హైదరాబాద్ నుంచి వెళ్లిపోమ్మనే అధికారం ఎవరికి లేదన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందవచ్చని గీతారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
ముఖ్యమంత్రిని కలిసిన సీమాంధ్ర మంత్రులు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని గురువారం పలువురు సీమాంధ్ర మంత్రులు కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన వీరు సీఎంతో భేటీ అయ్యారు. కిరణ్‌ను కలిసినవారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, వట్టి వసంత్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, తోట నర్సింహం, పితాని సత్యానారాయణ, డొక్క మాణిక్య వరప్రసాద్, ఆనం రాంనారాయణ, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా వీరు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్ర విభజన, ఆంటోనీ హైలెవల్ కమిటీ, సీమాంధ్ర ఉద్యమంతో పాటు తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసులపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. -
ఊరూరా నిరసనల హోరు
సాక్షి, అనంతపురం : జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆరో రోజైన సోమవారం కూడా ఉద్యమాన్ని హోరెత్తించారు. సోనియా, కేసీఆర్, సీఎం కిరణ్, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతపురం నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి కేసీఆర్, దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం పిండ ప్రదానం చేసి.. ఓ ఉద్యోగి శిరోముండనం చేయించుకున్నారు. కేసీఆర్, దిగ్విజయ్ దిష్టిబొమ్మలకు కర్మకాండ చేస్తూ... దాదాపు వెయ్యి మందికి రోడ్డుపైనే భోజనం వడ్డించారు. హిందూ దేవాదాయ, ధర్మాదాయ అర్చక సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్‌కు చావు మేళం వాయిస్తూ నగరంలోని సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారు దారి వెంబడి ‘అమ్మా.. అయ్యా.. సోనియాగాంధీ వెళ్లిపోయింది’ అంటూ కన్నీరు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సప్తగిరి సర్కిల్లో దిష్టిబొమ్మను దహనం చేశారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పెన్షనర్లు, జీవిత బీమా, ఏడీసీసీబీ, జేఎన్టీయూ, పశు సంవర్ధక శాఖ, రెవెన్యూ, నీటి పారుదల, ఆర్టీసీ, సంక్షేమ, ప్రణాళిక తదితర శాఖల ఉద్యోగులతో పాటు నాయీ బ్రాహ్మణులు, భవన నిర్మాణ కార్మికులు, బేకరీ, ప్రింటింగ్ ప్రెస్, సూర్యనగర్ మినీ వ్యాన్ అసోసియేషన్ల సభ్యులు, కుమ్మరి శాలివాహన సంఘం, ఆటో యూనియన్ నాయకులు, పెట్రోల్ బంకుల కార్మికులు, విద్యాసంస్థల నిర్వాహకులు, విద్యార్థులు పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు పౌరాణిక వేష ధారణలలో ట్రాక్టర్లలో ర్యాలీగా వచ్చారు. కురుబ సంఘం ఆధ్వర్యంలో పాతూరు కనకదాస విగ్రహం నుంచి నగరం మొత్తం ర్యాలీ చేపట్టారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మాజీ మేయర్ రాగే పరశురాం తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో హేమసాగర్ మద్దతు తెలిపారు. హౌసింగ్ ఉద్యోగులు మోకాళ్లపై ర్యాలీ చేశారు. సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్, సాయినగర్, ఆర్ట్స్ కళాశాల ఎదురుగా రోడ్లపై సమైక్యవాదులు వంటా-వార్పు చేపట్టారు. స్థానిక కోర్టు రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి చేదు అనుభవం ఎదురైంది. అదే సమయంలో ర్యాలీగా వచ్చిన న్యాయవాదులు...‘పార్థసారథి గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. వారికి సర్దిచెప్పడానికి ఎమ్మెల్యే ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో అనుచరులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు జైకొట్టిన ఎస్కేయూ వీసీ విద్యార్థులు, బీసీ సంఘాల నాయకులు ఎస్కే యూనివర్సిటీ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎస్కేయూ వైస్‌చాన్సలర్ రామకృష్ణారెడ్డి అక్కడికొచ్చి రాస్తారోకో విరమించాలని కోరారు. అందుకు వారు ససేమిరా అన్నారు. ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు నీడ లేకుండా చేస్తున్నారని, వెంటనే హాస్టళ్లు తెరవాలని వీసీతో వాగ్వాదానికి దిగారు. రెండు రోజుల్లో హాస్టళ్లు తెరుస్తామని ఆయన హామీ వచ్చారు. వీసీతో ‘జై..సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేయించారు. కళ్యాణదుర్గంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మంత్రి రఘువీరారెడ్డి ఇంటిని సమైక్య వాదులు ముట్టడించారు. సోనియాగాంధీ డౌన్‌డౌన్ అని జేఏసీ నాయకులు నినాదాలు చేయగా.. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు సోనియా జిందాబాద్ అని నినదించారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. రాయదుర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డుపై నిద్రపోయి బజారు నిద్ర కార్యక్రమాన్ని చేశారు. సమైక్యాంధ్ర కోసం నిరంతరం ఆందోళనలు చేయాలని.. అందుకు తన మద్దతు ఉంటుందని తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి సమైక్యవాదులకు సూచించారు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తెలంగాణకు అనుకూలంగా టీవీల్లో వార్తలు వస్తుండటం చూసి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. -
‘ఆప్కాబ్’ భవితవ్యంపై బదులివ్వలేను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) భవితవ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలకు తన వద్ద సమాధానం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మున్ముందు ఆప్కాబ్ తీరుతెన్నులెలా ఉండబోతాయో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఆప్కాబ్ ఆవిర్భవించి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లీహాల్లో జరిగిన స్వర్ణోత్సవ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భవిష్యతు ్తలో కూడా ఆప్కాబ్ ఇలాంటి వేడుకలను జరుపుకుంటుందా, లేక ఇదే ఆఖరుది అవుతుందా అని కార్యక్రమంలో పాల్గొన్న నాబార్డ్ చైర్మన్ ప్రకాశ్బక్షి కిరణ్‌ను ప్రశ్నించారు. ఆయన చాలా పెద్ద ప్రశ్నే అడిగారన్న కిరణ్, ప్రస్తుతం తనకు జవాబు తెలిదని బదులిచ్చారు. ఆప్కాబ్‌కు ఉజ్వల భవిష్యత్తుండాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తన తండ్రి అమరనాథరెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా మొదలైందని గుర్తు చేసుకున్నారు. ఉపాధి హామీ వల్ల రాష్ట్రంలో గ్రామీణ పేదలకు 100 రోజుల ఉపాధి లభిస్తోందన్న కిరణ్, అదే సమయంలో రైతులకు కూలీల ఖర్చు పెరిగిపోయి సాగు గిట్టుబాటు కాని పరిస్థితులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. సాగులో సగటున ఎకరాకయ్యే కూలీల ఖర్చులో 30 శాతాన్ని రైతుకు అందించేలా ఉపాధి పథకాన్ని అనుసంధానించాల్సిన అవసరముందన్నారు. ముల్కనూరు సహకార సంఘాన్ని రాష్ట్రంలోని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రుణ అర్హత కార్డుల కాలపరిమితి పెంచాలి: బక్షి కౌలు రైతులకు బ్యాంకు రుణాలందించేందుకు జారీ చేస్తున్న రుణ అర్హత కార్డుల కాలపరిమితి ఏడాదే ఉండటంతో వారికి ఏటా రుణాలందడం కష్టమవుతోందని బక్షి అన్నారు. కౌలుదారీ చట్టాన్ని సవరించో, మరో మార్గం ద్వారానో దీర్ఘ కాలపరిమితి ఉండేలా కార్డులు మంజూరు చేయాలని కోరారు. -
సెటిలర్లకు కాంగ్రెస్ అండ: జానారెడ్డి
-
సంయమనం పాటించండి: సిఎం
-
మౌన ముద్రలో కిరణ్‌కుమార్‌రెడ్డి
-
ఢిల్లీ బయలుదేరిన సిఎం
-
సీఎం జిల్లాలో కాంగ్రెస్‌కు మెజారిటీ తగ్గింది: బొత్స