ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాలి | CM Kiran Kumar Reddy should be Avoid from office | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాలి

Published Sun, Aug 18 2013 4:53 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

CM Kiran Kumar Reddy should be Avoid from office

పాన్‌గల్, న్యూస్‌లైన్: సీమాంధ్రకు అనుకూలంగా వ్యవ హరిస్తూ, తెలంగాణపై వివక్ష చూపుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవీ నుంచి తప్పించాలని కొల్లాపూర్ ఎమ్మె ల్యే జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివా రం పాన్‌గల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలు సామరస్యంతో ఉన్నా... సీమాంధ్ర ప్రాంత నాయకు లు, ప్రజలు తెలంగాణ వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. తిరుమలలో కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావుపై దాడి చేయడం అమానుషమన్నారు.
 
 సీమాంధ్రులు దాడులు చేస్తున్నా పోలీ సులు పక్షపాతంతో వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సీమాంధ్ర నేత లు ఎన్ని  కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు. వీహెచ్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జూపల్లి డిమాండ్ చేశారు.సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు వెంకటేష్‌నాయుడు, చక్రవెంకటేష్, బాలరాజు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement