simandhra
-
అశోక్‌బాబుకు మతిభ్రమించింది
- స్వలాభం కోసమే సెక్షన్-8 జపం - హెచ్‌టీఎన్‌జీవోస్ నేత సత్యనారాయణ ధ్వజం - ఇరు రాష్ట్రాల ఉద్యోగులు సఖ్యతగా ఉన్నారని వెల్లడి కాచిగూడ: హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని, ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట సీమాంధ్రలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్‌బాబుకు మతిభ్రమించిందని, అందుకే అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని హెచ్‌టీఎన్‌జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సత్యనారాయణగౌడ్ ధ్వజమెత్తారు. మంగళవారం నారాయణగూడలో హెచ్‌టీఎన్‌జీవోస్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి పి.బలరామ్, కేశియానాయక్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే బదులు, హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులతో తెలంగాణ ఉద్యోగులందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా, అక్కా చెల్లెళ్ల మాదిరిగా పనిచేస్తున్నామని, హైదరాబాద్ విషయాన్ని హైదరాబాద్‌లో తేల్చకుండా సీమాంధ్రలో సమావేశాలు నిర్వహిస్తే ప్రయోజనమేంటని వారు ప్రశ్నించారు. నగరంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులందరూ ఆశోక్‌బాబుకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆశోక్‌బాబు చేస్తున్న అసత్యపు ప్రకటనలు చూసి మోసపోయే స్థితిలో ఏవరూ లేరని వారు పేర్కొన్నారు. సమైక్య ఉద్యమ సమయంలో వంద కోట్లు రూపాయలు దండుకుని అక్కడి ప్రజలకు, ఉద్యోగులకు తీరని ద్రోహం చేసి ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఆవే కోట్ల రూపాయలతో రాజకీయ నాయకులతో కలిసి రియల్ ఎస్టేట్ దందాలోకి దిగి అక్కడి ఉద్యోగులను, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. స్వలాభాల కోసం రెచ్చగొట్టే నాయకుల వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, లేకుంటే ఇరు రాష్ట్రాల ప్రజలు, ఉద్యోగులు కలిసి మెలిసి జీవిస్తున్నారని తెలిపారు. ఆశోక్‌బాబు లాంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు కోరారు. కార్యక్రమంలో హెచ్‌టీఎన్‌జీవోస్ నేతలు జి.మల్లారెడ్డి, ఎంఆర్ డేవిడ్‌రాజు, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
భద్రాచలం సీమాంధ్రలో అంతర్భాగమే..
=లేకుంటే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు =బీడువారనున్న పంట పొలాలు =విశాఖను నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేయాలి =ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి =రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు విశాఖపట్నం, న్యూస్‌లైన్: విభజన జరిగితే భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్ర లో విలీనం చేయాలని ఉత్తరాంధ్ర మే దావులు డిమాండ్ చేశారు. నగరంలోని ఓ హాటల్లో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక, ఫోరం ఫర్ యాక్షన్ రీసెర్చ్ అండ్ పాల సీ ఎనాలిసెస్(ఫార్పా) సంయుక్తంగా ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏయూ రిటైర్డ్ ప్రొఫెస ర్ సూరప్పడు, నీటిపారుదలశాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, బ్రహ్మణయ్య, ఎ.వి.భుజంగరావు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు పి.శివశంకర్ మాట్లాడుతూ భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో అంతర్భాగం చేయడం ద్వారానే పోలవరం ముంపు సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఈ పాజెక్టు ను అడ్డుకునేందుకు తెలంగాణ నేతలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిం చారు. జలవనరులను దృష్టిలో ఉంచుకునే భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి చెందినదని, సీతారాముల మీద కపట ప్రేమ చూపుతున్నారని ఎద్దేవా చేశారు. వారు కోరిన విధంగా డిజైన్ మార్చితే తూర్పుగోదావరి, విశాఖ, విజయనగ రం, శ్రీకాకుళం జిల్లాలు తాగు, సాగునీరు లేక ఎడారిగా మారుతాయని అభిప్రాయడ్డారు. ఈ ప్రాంతంలో సుమారు 20 లక్షల ఎకరాలు సాగులో ఉండగా కేవలం 11 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి సదుపాయం ఉండడం దురదృష్టకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి, రూ. 7,600 కోట్ల నిధులతో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవ్ కూడా చేశారని గుర్తిచేశారు. సుజల స్రవంతి పూర్తయితే సుమారు 8 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నా రు. విశాఖ జిల్లాకు చాలా వరకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. భద్రాచలం డివిజన్లో నివస్తున్న గిరిజనులు పాడేరు, పార్వతీపురం డివిజన్లోని ఆదివాసీలతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు. భద్రాచలాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలపాలని తీర్మానం చేసి కేంద్ర మంత్రుల బృందానికి పంపనున్నట్టు పేర్కొన్నారు. -
విభజనతో సీమాంధ్రకు తీరని నష్టం
మంత్రులు అమ్ముడుపోయారు సీమాంధ్రకు చెందిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడుపోయారు. వారిని గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి.. జరుగుతున్న అన్యాయాన్ని కళ్లప్పగించి చూస్తుండి పోవడం బాధాకరం. కొంతమంది మంత్రులు అధిష్టానానికి అనుకూలంగా మాత్రమే పనిచేస్తానని చెప్పడం ప్రజలపై వారి చిత్తశుద్ధిని తెలుపుతోంది. - ఎల్.సూర్యారావు, నీటిపారుదల శాఖ రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ నేల తల్లి గొంతు తడారిపోతుంది ఇప్పటివరకూ వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్నాం. మొన్న వచ్చిన తుపానుకు పంటలు మునిగిపోయాయి. ఇలా చాలాసార్లు జరిగినా నేల తల్లిపైనే మా బతుకులు ఆధారపడి ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగితే ఆ తల్లి గొంతు పూర్తిగా తడారిపోతుంది, మా గుండెలాగిపోతాయి. కుటుంబాలు రొడ్డున పడతాయి. మా ఉసురు తప్పక వారికి తగులుతుంది. - కోటిపల్లి వెంకట్రావు, అడవికొలను, రైతు గోదారే దిక్కు ఏమీ లేని వాడికి దేవుడే దిక్కన్నట్టు మా ప్రాంతానికి గోదారమ్మే దిక్కు. గోదారి కరుణిస్తేనే మా పంటలు పండుతాయి. మా ఇళ్లు కళకళలాడుతాయి. రాష్ట్రం విడిపోతే మా ప్రాంతానికి సాగునీరు అందదు. దానితో మా పొలాలు ఎండి ఎడారిగా మారిపోతాయి. మా జీవితాలు అథోగతి పాలౌతాయి. - ఎరగం సత్యనారాయణ, రైతు, అడవికొలను కృష్ణానదిని ఎండబెట్టారు పాలకుల అసమర్థత కారణంగా ఇప్పటికే కృష్ణానది ఎండిపోయింది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా ఆపి ఉంటే కృష్ణా డెల్టాలో రెండు పంటలు పండి రైతులు సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు గోదావరి డెల్టా ప్రజల వంతు వచ్చింది. నాయకుల చేతిలో రైతులు ఎప్పడూ మోసపోతూనే ఉన్నారు. - కొమ్మన మురళీ కృష్ణారావు, రైతు, వట్లూరు పోలవరంపై పెట్టిన డబ్బు వృథాయేనా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల అవసరాలు గుర్తించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడితే, కొంతమంది రాజకీయ దురుద్ధేశంతో నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం పేరుతో తెలంగాణ నాయకులు పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు విచారకరం. ఇప్పటి వరకూ జరిగిన నిర్మాణం నిమిత్తం ఖర్చు పెట్టిన మా డబ్బు కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు కావలసిందేనా. - ఉప్పాటి సత్యం, రైతు, నల్లజర్ల నాయకులంతా ఏకతాటిపైకి రావాలి మన ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నాయకులూ ఏకతాటిపైకి వచ్చి కేంద్రానికి ఈ ప్రాంత ప్రజల అబిప్రాయాన్ని చెప్పి ఉంటే రాష్ట్ర విభజన అంశం ఇంత దుమారం రేపి ఉండేది కాదు. ఎవరికి వారు వారి స్వప్రయోజనాలకోసమే రాజకీయాలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి చులకనైపోయాం. ఇప్పటికైనా అందరూ కలిసి పోరాడండి. - పెండ్యాల వీర రాఘవులు, రైతు, పోతవరం ఒక్క పంటకూ నోచుకోము గతంలో సార్వా, దాళ్వా రెండు పంటలనూ మా ప్రాంతంలో పండించే వాళ్లం. సాగునీరందక ఇప్పుడు కేవలం సార్వా మాత్రమే వేస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ వాళ్లు తప్పకుండా మన ప్రాంతానికి నీరు రానివ్వరు. అదే జరిగితే ఒక్క పంట కూడా వేయలేము. మా కుటుంబాల పరిస్థితి ఏమికావాలి. - మిరియాల ఆదినారాయణ, రైతు, పిప్పర ముక్కలు చేయాలని చూస్తే.. తెలుగు గడ్డపై పుట్టాం. తెలుగు మాట్లాడే వాళ్లం దరం కలిసి ఉండడం మా జన్మ హక్కు. మీ రాజకీయా ల కోసం కలిసిమెలిసి ఉంటున్న మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తారా. మా ఇష్టానికి వ్యతి రేకంగా మా ప్రాంతాన్ని విడగొట్టడానికి మీరెవరు. ముక్కలు చేయాలని చూస్తే ఖబడ్దార్, తరిమితరిమికొడతాం. - చల్లగోళ్ళ జయలక్ష్మి, మహిళా రైతు, పెదకడిమి మా పిల్లల భవిష్యత్తేంటి అష్టకష్టాలు పడి పిల్లల్ని చదివించుకుంటున్నాం. మీ ఇష్టానికి రాష్ట్రాన్ని విభజిస్తే వారికి ఉద్యోగావకాశాలు ఎక్కడ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగానికి చెందిన సంస్థలు సైతం తెలంగాణ ప్రాంతంలోనే అధికంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మా ప్రాంతానికి మేమే వలసలు వెళ్లాలా? - కె. దయావతి, అంగన్వాడీ టీచర్, గంటావారిగూడెం విద్యాహక్కును కాలరాయకండి దేశం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని పాలకులే చెబుతారు. అందుకోసం కోట్లాది నిధులను ఖర్చు పెడుతున్నారు. తెలంగాణలో ఉన్న విద్యా సంస్థలు ఇక్కడ లేవు. ఒకటే రాష్ట్రమైతే అక్కడికి వెళ్లి చదువుకుంటాం. వేరే రాష్ట్రంగా విడిపోతే మా విద్యావకాశాలు మరింత సన్నగిల్లిపోతాయి. విద్య లేకపోతే ఉద్యోగాలు రావు. దీంతో భవిష్యత్తరాలు విద్య జోలికి వెళ్లరు. మా విద్యా హక్కును కాలరాయకండి ప్లీజ్. - జె.సౌందర్య, ఇంటర్ విద్యార్థిని -
జిల్లాలోనూ కరెంటు కోతలు
రాయికల్, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ఉద్యమ ప్రభావం జిల్లాపైనా పడింది. ఆ ప్రాంత ఉద్యోగులు విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తిని నిలిపివేసి ఆందోళనబాట పట్టడంతో మూడు రోజు లుగా సీమాంధ్రలో చీకట్లు అలుముకున్నాయి. విద్యుత్ సరఫరాలో తీవ్రమైన లోటు ఏర్పడడం వల్ల తెలంగాణలోనూ కోతలు విధిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మండల కేంద్రాల్లో రెండు గంటలు, గ్రామాల్లో మూడు గంటలు అధికారిక కోతలు అమలు చేస్తున్నారు. తాజాగా సోమవారం రాత్రి నుంచి మరో రెండు మూడు గంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకే సమయంలో కాకుండా పలు దఫాలుగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. అరగంట, గంట చొప్పున సరఫరా నిలివేస్తూ ప్రజల దృష్టి కోతలవైపు మరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు కొన్ని ప్రాంతాల్లో, ఉదయం వేళల్లో మరికొన్ని ప్రాంతాల్లో కరెంటు కట్ చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళన ఇలాగే కొనసాగితే గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలిపోయి తెలంగాణలోనూ అంధకారం అలుముకునే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ఢిల్లీలో సత్తా చాటుతాం
కడపసిటీ, న్యూస్‌లైన్: ఢిల్లీలో సీమాంధ్రుల సత్తా చాటుతామని బీసీ ఐక్య కార్యాచరణ ఛైర్మన్ సీఆర్ఐ సుబ్బారెడ్డి హెచ్చరించారు. నగరంలో బుధవారం ఏపీ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ద్వారా బయలుదేరింది. ఈ సందర్భంగా సీఆర్ఐ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని ఈనెల 4న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం సీమాంధ్ర జిల్లాల్లోని సుమారు 500 మంది ఢిల్లీకి పయనమైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని కులవృత్తుల వారితో ధర్నా చేపడతామన్నారు. బీసీ రిజర్వేషన్లను 25శాతం తగ్గించే ప్రక్రియను అడ్డుకుంటామన్నారు. ఢిల్లీకి కమిటీ నాయకులు వివి శ్యామ్‌ప్రసాద్, ఓబులేసు, పవన్, సుధాకర్, రామ్మోహన్, మునెయ్య, సమద్ బయలుదేరారు. -
రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు తీరని నష్టం
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘ నాయకుడు తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ విద్యా సిబ్బంది జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ) కార్యాలయం ఎదుట కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఐదో రోజు దీక్షను సోమవారం ఇంటర్మీడియట్ విద్య జేఏసీ కన్వీనర్ పీ రంగనాయకులు, విశ్రాంత అధ్యాపకులు కే గణపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల నదీ జలాల పంపిణీ విషయంలో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఆదాయం, రుణాలు, హైదరాబాద్ లాంటి కీలక అంశాల పరిష్కారం, సీమాంధ్ర ప్రజలకు జరిగే అన్యాయం గురించి వెంకటేశ్వరరెడ్డి వివరించారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీష్.. విభజన వల్ల విద్య, ఉపాధి తదితర విషయాల్లో తలెత్తే సమస్యలను వివరించారు. సీమాంధ్ర విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్ఐఓ పి.మాణిక్యం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమైఖ్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది జిల్లా అధ్యక్షుడు యూ కోటేశ్వరరావు సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. జిల్లాలోని 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల బోధనేతర సిబ్బంది ఉద్యమంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 5వ రోజు దీక్షలో దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జే సువర్ణబాబు, అధ్యాపకులు సీహెచ్ తారావాణి, వీ కోటయ్య, జీ మనోహర్‌రెడ్డి, రామాచారి, ఇతర కళాశాలలకు చెందిన బోధనేతర సిబ్బంది ఎం.మాల్యాద్రి, పీ వెంకటేశ్వర్లు, టీ ప్రవీణ్‌కుమార్, ఐవీ సుజాత, ఫాతిమా మేరి, అద్దంకి తెలుగు అధ్యాపకులు ఆనందబాబు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని ప్రిన్సిపాళ్ల సంఘం నాయకులు డీఆర్ కే పరమహంస, ఎస్.సత్యనారాయణ, ఎయిడెడ్ కళాశాల సంఘ నాయకులు పోటు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి, జీజేఎల్ఏ నాయకులు నారాయణరావు, టీ వెంకటేశ్వరరెడ్డి, పీడీ సంఘ నాయకులు ఎం.హరనాథబాబు, రిటైర్డ్ డిగ్రీ అధ్యాపకులు కంచర్ల సుబ్బారావు, ఎండీ రహమాన్, పీ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాళ్ల సంఘ మాజీ అధ్యక్షుడు పీ నరసింహారెడ్డి, ఎన్జీఓ నాయకులు గోవిందరావు, తిరుమలయ్య, ఆర్ఐఓ కార్యాలయం ఏవో ఆంజనేయులు, సిబ్బంది సందర్శించి సంఘీభావం తెలిపారు. -
ప్రజల గోడు మీకు పట్టదా..?
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని కోరుతూ సీమాంధ్రలో అన్ని వర్గాలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారి గోడు పట్టనట్టు వ్యవహరిస్తోందని విద్యార్థులు, ఉద్యోగులు మండిపడ్డారు. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొనసాగించాలని కోరుతూ ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైబ్రరీ సిబ్బంది శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వర్సిటీ సమైక్యాంధ్ర జేఏసీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఆచార్య జడ్.విష్ణువర్ధన్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.మధుసూదనరావు నూటా అధ్యక్షుడు ఆచార్య పి.వరప్రసాదమూర్తి, సీమాంధ్ర విశ్వవిద్యాలయాల అధ్యాపక జేఏసీ కార్యదర్శి డాక్టర్ జి. రోశయ్య, ఉద్యోగ జేఏసీ నాయకులు డాక్టర్ పి. జాన్సన్,లైబ్రరీ సిబ్బంది జేవీ. కృష్ణయ్య, కొండలరావు, కోడూరి కనకరాజు, వర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కె. కిషోర్, బి. ఆశిరత్నం, బి.వెంకటేశ్వర్లు, పి. శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగిన రిలేనిరాహార దీక్షలు సమైక్యాంధ్రను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద శనివారం వర్సిటీ లైబ్రరీ సిబ్బంది, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు రిలేనిరాహారదీక్షలు కొనసాగించారు. -
రాజకీయ సంక్షోభంతోనే ‘సమైక్యం’
బొబ్బిలి, న్యూస్‌లైన్ : సీమాంధ్రలోని మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి, రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే రాష్ట్ర విభజన నిర్ణయం ఆగుతుందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జి ల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్ కృష్ణ రం గారావు అన్నారు. మంత్రులు, ఎంపీలు ప్రజ లు, ఉద్యోగుల ఒత్తిడికి లొంగకపోతే వైఎస్సా ర్ సీపీ ముందుండి మెడలు వంచైనా వారితో రాజీనామా చేయిస్తుందని తెలిపారు. శనివా రం ఆయన తన జన్మదినం సందర్భంగా కోర్టు సమీపంలోని పాత పెట్రోల్ బంకు ఆవరణలో సమైక్యాంధ్రాకు మద్దతుగా ఒక రోజు నిరాహా ర దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు మాజీ ఎంపీపీలు కురమాన రాయప్ప, గర్బా పు పరశురాం జేఏసీల సమక్షంలో సుజయ్‌కు నిమ్మరసం వచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా సుజయ్ మాట్లాడుతూ మంత్రు లు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని ఓ రాజకీయ పార్టీగా ఒత్తిడి తేవడం సరైనది కాక పోయినా ఉద్యోగులు, ప్రజల వల్ల అదిసా ధ్యం కాకపోతే వైఎస్సార్ సీపీ రంగంలోకి దిగుతుందన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడితేనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన మారుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకు న్న ప్రణాళిక ప్రకారం రాష్ట్ర విభజన ప్రక్రియ ను వేగవంతం చేస్తుందని, అందుకు ధీటుగా ఉద్యమాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలను ముట్టడిం చి, వారు రాజీనామాలు చేసేలా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ చీఫ్ బొత్స ప్రజల మధ్యకు రాకుండా హైదరాబాద్, ఢిల్లీలో చక్క ర్లు కొడుతున్నారన్నారు. అటువంటి వారి కి ప్రజల్లో స్థానం ఉండదని స్పష్టంగా తెలి యాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేం దుకు వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకుందన్నారు. పుట్టినరోజు వేడుకలకు దూరంగా సుజయ్ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సుజయ్ కృష్ణ రంగారావు తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. బొబ్బిలి రాజుల పుట్టిన రోజు వేడుకంటే కోటతో పాటు బొబ్బిలి పట్టణమంతా సంబరంగా ఉంటుంది. అభిమాను లు.. కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో కిటకిటలాడుతుంది. కానీ శనివారం ఆ పరిస్థితి ఎక్కడా కానరాలేదు. దీక్షా శిబిరానికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు బొబ్బిలి ని యోజకవర్గంలోని జేఏసీల నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శిబిరం వద్ద ప్రముఖుల చిత్రాలను ఉంచారు. రాష్ర్ట విభ జనకు టీడీపీ ఇచ్చిన లేఖ, విభజనపై వైఎ స్సార్ సీపీ స్పందించిన తీరును ఫెక్సీలలో వివరించారు. దీక్షకు ముందు సుజయ్ వాటిని పరి శీలించి, నిర్వాహకులు చెలికానిమురళీకృష్ణ, గంగుల మదన్మోహన్, గునాన వెంకటరావును అభినందించారు. దీక్షా శిబిరం సమీపంలో బొబ్బిలి రాజుల ఆధ్వర్యంలో శాంతి హోమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎ స్సార్ సీపీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబ శివరాజు,అరుకు పార్లమెంట్ పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు తూముల రాంసుధీర్, ఎస్. కోట, గజపతినగరం, పార్వతీపురం, చీపురుపల్లి, సాలూరు, విజయనగరం నియోజకవర్గాల ఇన్చార్జిలు బోకం శ్రీనివాస్, మక్కువ శ్రీధర్, డాక్టర్ పెద్దినాయుడు, కొయ్యాన శ్రీవా ణి, జమ్మాన ప్రసన్నకుమార్, ఉదయభాను, బొత్స కాశి నాయుడు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కోట్ల సూర్యనారాయణ, తుమ్మగంటి సూర్యనారాయణ, ప్రశాంత్‌కుమార్, ము న్సిపల్ మాజీ చైర్మన్ ముగడ గంగమ్మ, గొర్లె వెంకటరమణ, ఆదాడ మోహనరావు, రాయ లు, తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర న్యాయవాదుల దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులపై సీమాంధ్ర న్యాయవాదుల దాడికి నిరసనగా తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలోని జిల్లా కోర్టు ముందు సీమాంధ్ర న్యాయవాదుల దిష్టిబొమ్మను న్యాయవాదులు దహనం చేశారు. తొలుత, దిష్టిబొమ్మతో ఊరేగింపుగా వైరా ప్రధాన రహదారిపైకి చేరుకుని, అక్కడ కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని, అరెస్టు చేసిన తెలంగాణ న్యాయవాదులను తక్షణమే విడుదల చేయాలని, దాడి చేసిన సీమాంధ్ర న్యాయవాదులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎం, డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్ బి.తిరుమలరావు, కో-కన్వీనర్ కొండపల్లి జగన్‌మెహన్‌రావు, నాయకులు వేపచేదు మధు, రానేరు కిరణ్‌కుమార్, కర్లపూడి శ్రీనివాసరావు, మరీదు రామారావు, పుల్లారెడ్డి, సిహెచ్.నాగులు, కనిశెట్టి మధుసూదన్‌రావు, అజీజ్ పాషా, వలరాజు, టీఆర్ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు గుండ్లపల్లి శేషగిరిరావు, మధిర ఇంచార్జి బమ్మెర రామ్మూర్తి, నాయకులు పిడతల రాంమూర్తి, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలంలో... భద్రాచలం టౌన్: హైకోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులపై దాడులకు నిరసిస్తూ భద్రాచలం బార్ అసోసియేషన్ అద్యక్షుడు పివి.కృష్ణమాచారి ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం విధులను బహిష్కరించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, భద్రాచలం జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌కు, సబ్ కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తాకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో న్యాయవాదులు పాపినేని కృష్ణకుమార్, ఎంవి.రమణారావు, ప్రసాదరావు, కె.విద్యాసాగర్, కొడాలి శ్రీనివాస్, జెట్టి సాల్మన్‌రాజు, పడవల శ్రీనివాస్, అక్తర్, వసంతరావు, పడిసిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందులో.. ఇల్లెందు అర్బన్: తెలంగాణ న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ, పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండుతో ఇల్లెందులో అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ జేఏసీ ఇల్లెందు అధ్యక్షుడు సుడిగాలి వెంకట నర్సయ్య, న్యాయవాదులు నాగండ్ల మల్లిఖార్జున్‌రావు, కర్ణాకర్, దంతాల అనంద్, సత్యనారాయణ, చెన్నకేశవరావు, ప్రభాకర్‌రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్రలో అల్లకల్లోలానికి కారణం కాంగ్రెస్సే
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించి సీమాంధ్రలో అల్లకల్లోలం సృష్టించి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చింది కాంగ్రెస్ పార్టీయేనని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర కోరుతూ శనివారం స్థానిక రాష్ట్ర ప్రధాన రహదారిపై జేఏసీ నేతలు, రైతులు చేపట్టిన రాస్తారోకోలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం అశువులు బాసిన వారి కుటుంబాల పాపం కాంగ్రెస్ మూటకట్టుకుందని నిప్పులు చెరిగారు. ప్రజల మనోభీష్టం తెలుసుకోకుండా ప్రకటనలు చేస్తే ఆగ్రహ జ్వాలలు చవిచూడాల్సి వస్తుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే భాషాప్రయుక్త రాష్ట్రాలను ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా చివరకు జిల్లాను ఒక రాష్ట్రంగా చేసినా ఆశ్చర్యపోనక్కలేదన్నారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి ఇప్పుడు మొసలికన్నీరు కార్చుతూ ఆత్మద్రోహ యాత్రను చేస్తున్నారని బాలరాజు ఎద్దేవా చేశారు. సమైక్యవాదులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాస్, వామిశెట్టి హరిబాబు, పోల్నాటి బాబ్జి, మంగరామకృష్ణ, అడబాల రాంబాబు, డి.మధు, పాలపర్తి శ్రీనివాస్, చిన్నంగాంధీ, దుగ్గిరాల బలరామకృష్ణ పాల్గొన్నారు. 65 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల ర్యాలీ కొయ్యలగూడెం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం శనివారం రైతన్నలు జీలుగుమిల్లి నుంచి తాళ్లపూడివరకూ స్టేట్‌హైవేపై 65 కిలోమీటర్లమేర ట్రాక్టర్లర్యాలీ నిర్వహించారు. డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు, జిల్లా జేఏసీ సభ్యుడు చిన్నం గాంధీ ర్యాలీని ప్రారంభించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. మట్టా లక్ష్మీపతి, గొడ్డటి నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో రైతులు తమ ట్రాక్టర్లతో పాల్గొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మాటూరి నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు బొలుసు నాగేశ్వర్రావు, బయ్యనగూడెంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మద్దు బాలనాగేశ్వర్రావు, కంభంపాటి బుజ్జిబాబు, రైతులు పాల్గొన్నారు. మొత్తంగా 400 వందల ట్రాక్టర్లతో వెయ్యిమందికిపైగా రైతులు పాల్గొన్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. -
బాబు యాత్ర బూటకం
చీరాల, న్యూస్‌లైన్ :టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సీమాంధ్రలో చేస్తోంది తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర కాదని, బూటకపు యాత్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ 2008 అక్టోబర్ 18న ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి విభజనకు సానుకూలమంటూ లేఖ ఇచ్చి రాష్ట్రం ముక్కలు కావడానికి కాంగ్రెస్‌తో కలిసి బాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. తన పదవికి రాజీనామా చేయకుండా సీమాంధ్రలో ప్రజా ఉద్యమాన్ని చూసి పార్టీ తుడిచి పెట్టుకుపోతుందనే భయంతో బాబు బస్సు యాత్ర చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని స్వచ్ఛందంగా ఉద్యమంలోకి రావాలేకానీ స్వార్థ రాజకీయాల కోసం బాబు యాత్రలు చేపట్టడం సిగ్గు చేటన్నారు. తెలంగాణకు అనుకూలంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవహరించారంటూ టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ విడిపోతే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే మరో దేశానికి వెళ్లినట్లు ఉంటుందని వైఎస్ ఆనాడే రాష్ట్ర విభజనను వ్యతిరేకించారని గుర్తు చేశారు. 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ సొంతగా పోటీ చేయడం కూడా అందులో భాగమేనన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మొట్టమొదటి సారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. 13 జిల్లాల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా పాల్గొంటున్నారని, సీమాంధ్ర ప్రజలు తమ పార్టీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి సీమాంధ్రుల మన్ననలు అందుకున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూడలేకే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు యాత్రలు, దీక్షలు చేపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ మునిగిపోతోందన్న భయంతోనే దీక్షలు చేస్తున్నారన్నారు. రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, సోనియాగాంధీని నిలదీయాలని ప్రజాప్రతినిధులకు బాలాజీ పిలుపునిచ్చారు. చీరాల నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ యడం చినరోశయ్య, అవ్వారు ముసలయ్య, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అమృతపాణిలు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో పోరాడుతోందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమ బాట పట్టారన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ నిరవధిక నిరాహార దీక్ష చేసి సీమాంధ్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేసి 48 గంటల పాటు దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో షర్మిల బస్సు యాత్ర చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పీకర్ ఫార్మెట్లో కాకుండా ఉత్తుత్తి రాజీనామాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చడానికి కారణమైన కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కర్నేటి వెంకటప్రసాద్, పార్టీ పట్టణ కన్వీనర్ యాతం ఆనందరావు, వేటపాలెం మండల కన్వీనర్ పులి వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ సీపీ నాయకులు యడం బాలాజీ, దేటా జోసఫ్, కొరబండి సురేశ్, పారిచర్ల దయమ్మ, డక్కుమళ్ల సురేశ్, మల్లెల బుల్లిబాబు, కర్నేటి రవికుమార్, కొమ్మనబోయిన వీరయ్య, చింతా శ్రీను, కోటి ఆనంద్, పొదిలి ఐస్వామి, విల్సన్, మేడిద రత్నకుమార్, షేక్ ఆజాద్, గంధం చంద్ర, దార్ల శాస్త్రి, మనోహరి, గుడూరి జేమ్స్, శ్రీనివాసరావు, మచ్చా సువార్తరావు, నారాయణ పాల్గొన్నారు. -
సభలు పెట్టే సత్తా మాకూ ఉంది
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగుల సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జె.ప్రవీణ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులు తలుచుకుంటే హైదరాబాద్‌లో లక్ష కాదు.. పది లక్షల మందితో సభ పెట్టేంతా సత్తా మాకూ ఉందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సభలకు అనుమతి ఇవ్వని సీఎం, డీజీపీ సీమాంధ్రుల ఉద్యోగుల సభలకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. సీఎం, డీజీపీల అండతోనే సీమాంధ్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉద్యమాన్ని నడుపుతున్నారని విమర్శించారు. మహెబూబ్నగర్ జిల్లాలో లక్ష మందితో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సభ జరిగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అశోక్‌బాబు డిగ్రీ పట్టాపై కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు వేరు కుంపటి పెట్టుకోగా ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అశోక్‌బాబు ఎలా కొనసాగుతారని ఆయన ప్రశ్నించారు. కేవలం ఆయన సీమాంధ్ర ప్రాంతానికే అధ్యక్షుడని నొక్కి చెప్పారు. అలాగే ఈ నెల 7న జరగనున్న సద్భావన యాత్రకు పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనికోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మయ్య, జిల్లా అధ్యక్షుడు రాజన్న, నాయకుడు ప్రకాశ్ ఉన్నారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తీర్మానం చేసిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే ఇప్పుడు దీక్షలు చేయడమేమిటని టీఆర్ఎస్ ప్రశ్నించింది. అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో అందరం కలసి మాట్లాడింది వాస్తవం కాదా? అని నిలదీసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, కె.విద్యాసాగరరావు, జోగు రామన్న, పార్టీ నేతలు మంగళవారం తెలంగాణభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు వాటితోనే చరిత్రహీనులుగా మారిపోవడం ఖాయమని సీమాంధ్ర నేతలను హరీష్‌రావు హెచ్చరించారు. సీమాంధ్రలో అందరూ మాట మీద నిలబడరన్న అపవాదు వచ్చే ప్రమాదం ఉందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాటల్లో మూడోసారి అధికారం దక్కదన్న నైరాశ్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, అంతేకాలం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరించిన నాయకుడిలా ఆయన వ్యవహారశైలి లేదని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజుకో మాట చెబుతోందని ఆరోపించారు. మొదటి నుంచీ తమది సమైక్య ఆంధ్రప్రదేశ్ నినాదమే అని చెబుతున్న వారు... గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ, జగన్, షర్మిల ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణకు చెందిన కొన్ని మీడియా చానెళ్లను సీమాంధ్ర ప్రాంతం వారు బహిష్కరిస్తే తాము కూడా అదే తీరున వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ సీఎం కిరణ్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలపై హరీష్‌రావు, టీఆర్ఎస్ నేత డి.శ్రవణ్‌లు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. -
ప్రజలను రెచ్చగొట్టేది కాంగ్రెస్సే
తల్లాడ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రజల ను కాంగ్రెస్ పార్టీయే రెచ్చగొడుతోందని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మండలంలోని కలకొడిమ గ్రామం లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడా రు. విధి విధానాలు లేకుండా తెలంగాణ ప్రాం తంలో తన ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రె స్ పార్టీ తెలంగాణపై ప్రకటన చేసిందని అన్నా రు. దివంగత నేత రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేద ని, ఇప్పుడు జగన్‌కూడా వ్యతిరేకించడం లేద ని వివరించారు. ఇరుప్రాంతాలవారికీ న్యాయం చేయాలనే డిమాండ్‌తోనే తమ పార్టీ పోరాడుతోందని స్పష్టం చేశారు. తెలంగాణకు తమ పార్టీ అనుకూలమేనని చెప్పారు. సహకార సంఘాల నిర్వీర్యం తగదు.. రాష్ట్రంలో సహకార సంఘాలను వాణిజ్య బ్యాంకులుగా మార్చాలనే యోచనను మానుకోవాలని మచ్చా, పొంగులేటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన సంస్థలను కమర్షియల్‌గా మార్చితే రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సహకార సంఘాలు ప్రజాబ్యాంక్లుగా మాత్రమే ఉండాలని సూచించారు. ప్రకాష్భక్షి నివేదికను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. వారి వెంట పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మట్టా దయానంద్ విజయ్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తుమ్మలపల్లి రమేష్, మండల కన్వీనర్ గొడుగునూరి లక్ష్మీరెడ్డి, మండల నాయుకులు దగ్గుల కాంతారెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, కొమ్మినేని వెంకటేశ్వర్లు, శీలం సత్యనారాయణరెడ్డి, అయిలూరి సత్యనారాయణరెడ్డి, పెరికె నాగేశ్వర్రావు, వడ్డే రామారావు, బస్వాపురం సర్పంచ్ వెంకటమైబు, కీసర వెంకటేశ్వర్‌రెడ్డి, పాలెపు రామారావు, నీరుకొండ రమేష్ ఉన్నారు. -
ఇద్దరే ఇద్దరు
ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలతో సీమాంధ్ర ప్రాం తం హోరెత్తుతోంది. ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, న్యాయవాదులు, జిల్లా స్థారుు అధికారులు ఇలా అన్నివర్గాల వారు స్వచ్ఛం దంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలు, రోడ్డు దిగ్బంధనం, ఆమరణ, రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఉపాధ్యాయులు కూడా సంఘాలకు అతీతంగా ఉద్యమబాట పడుతున్నారు. అరుుతే, ఎల్.ఎన్.పేట మండలంలోని ఉపాధ్యాయుల తీరు దీనికి భిన్నంగా ఉంది. మండలంలో 5 జెడ్పీ ఉన్నత , 9 ప్రాథమికోన్నత, 35 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. పాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 102 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరో 63 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో ఇద్దరంటే ఇద్దరు ఉపాధ్యాయులే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటుం డడం గమనార్హం. కరకవలస, లక్ష్మీనర్సుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న జె.నరేంద్ర, చింతాడ నారాయణమూర్తిలు ఆయూ హెచ్ఎంలకు సమ్మెనోటీసు ఇచ్చి శుక్రవారం అర్థరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. మిగిలిన వారంతా సమ్మెకు దూరంగా ఉంటున్నారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించి, రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేయూల్సిన ఉపాధ్యాయులే ఉద్యమానికి దూరం గా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఆయూ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు, అలవెన్స్‌లు, సెలవులు, పీఎఫ్, జీఎఫ్ లు చాలవలని ఏడాదిలో నాలుగు సార్లు ధర్నాలు, సమ్మెలు చేసే ఉపాధ్యాయులు ఇప్పుడెందుకు కిమ్మనడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. విభజన జరిగితే విద్యార్థుల ఎంత నష్టపోతారు, రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతారుు తదితర అంశాలను వివరించాల్సిన ఉపాధ్యాయులు సమ్మెకు దూరంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. జిల్లాస్థాయి అధికారు లు సమ్మెలో పాల్గొంటున్నా ఉపాధ్యాయులు ఆసక్తిచూపకపోవడంపై యువకులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలకు తాళాలు వేసి ఉద్యమంలో పాల్గొనేలా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
నేటి నుంచి ఉపాధ్యాయుల సమ్మె
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో కొనసాగుతున్న ప్రజాఉద్యమంలో గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులూ భాగస్వాములు కానున్నారు. 13 జిల్లాల ఉపాధ్యాయ జేఏసీ నిర్ణయం మేరకు విధులు బహిష్కరించి సమైక్య గళం వినిపించేందుకు జిల్లాలో టీచర్లు సన్నద్ధమయ్యారు. దీంతో గురువారం నుంచి కనీసం 50 శాతం ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని భావిస్తున్నారు. ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కో-కన్వీనర్ కేఎస్ జవహర్ మాట్లాడుతూత గురువారం నుంచి ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ఉపాధ్యాయులు ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. జిల్లాలో సుమారు 50 శాతం మంది ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని, దశలవారీగా ప్రజల ఒత్తిడిమేరకు ఉపాధ్యాయులంతా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో సుమారు 3వేల ప్రాథమిక పాఠశాలలు, 200 ప్రాథమికోన్నత పాఠశాలలు, 450 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 14వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఎంసెట్ ఆప్షన్లు వాయిదా ఎంసెట్ కౌన్సెలింగ్‌ను పోలీసుల సహకారంతో కొనసాగిస్తున్న ప్రభుత్వం కాలేజీ ఎంపిక షెడ్యూల్‌ను మాత్రం వాయిదా వేసింది. ఈనెలాఖరు వరకు సర్టిఫికెట్ల పరిశీలన మాత్రం చేయాలని భావిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకులు కూడా విధులకు హాజరుకాకపోవటం, కొన్ని జిల్లాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ సక్రమంగా జరగకపోవటం తో గత్యంతరం లేనిస్థితిలో గురువారం నుంచి ప్రారంభిం చాల్సిన ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 27నుంచి సెకండరీ ప్రధానోపాధ్యాయుల సమ్మె పెదపాడు, న్యూస్‌లైన్ : సెకండరీ ప్రధానోపాధ్యాయులు ఈనెల 27నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు సెకండరీ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు దేవినేని వెంకటరమణ, కె.నాగేశ్వరరావు తెలిపారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలపాలని రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. -
ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాలి
పాన్‌గల్, న్యూస్‌లైన్: సీమాంధ్రకు అనుకూలంగా వ్యవ హరిస్తూ, తెలంగాణపై వివక్ష చూపుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవీ నుంచి తప్పించాలని కొల్లాపూర్ ఎమ్మె ల్యే జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శనివా రం పాన్గల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలు సామరస్యంతో ఉన్నా... సీమాంధ్ర ప్రాంత నాయకు లు, ప్రజలు తెలంగాణ వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. తిరుమలలో కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావుపై దాడి చేయడం అమానుషమన్నారు. సీమాంధ్రులు దాడులు చేస్తున్నా పోలీ సులు పక్షపాతంతో వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సీమాంధ్ర నేత లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు. వీహెచ్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జూపల్లి డిమాండ్ చేశారు.సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు వెంకటేష్‌నాయుడు, చక్రవెంకటేష్, బాలరాజు పాల్గొన్నారు. -
శాంతియుతంగా విడిపోదాం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సీమాంధ్ర, తెలంగాణ భాయీ.. భాయీ. విడిపో యి కలిసుందాం.. అంటూ సద్భావన శాంతిసందేశాన్ని అందించేందుకు ఓరుగల్లు వేదికైంది. సీమాంధ్ర ఉద్య మానికి వ్యతిరేకంగా.. తెలంగాణ ఉద్యోగులపై దాడుల కు నిరసనగా శుక్రవారం టీజేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా టీఎన్జీఓలు, ఉద్యోగులు, న్యాయవాదులు, తెలంగాణవాదులు, జేఏసీల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ లు నిర్వహించారు. వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిం చారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండించారు. సంఘటన లు ఇలాగే జరిగితే ‘ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్’ నినాదాన్ని తీసుకోవాల్సి ఉంటుందని రాష్ర్ట బార్ కౌన్సిల్ మెంబర్ ముద్దసాని సహోదర్‌రెడ్డి హెచ్చరించారు. అనంతరం డీఆర్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్ర మం చేపట్టారు. తెలంగాణపై వెనక్కి తగ్గితే వచ్చే ఉద్యమాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష్, గుడిమల్ల రవికుమార్, అబ్దుల్నబీ, రాజేంద్రకుమార్, జనార్దన్‌గౌడ్, నీలా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పరకాలలో.. పరకాలలో స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కోర్టు ప్రాంగణం నుంచి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమరధామంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యోగులపై దాడులను ఖండించారు. సహృద్భావ వా తావరణంలో విడిపోయేందుకు అన్ని వర్గాలు సహకరిం చాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు పున్నం రాజిరెడ్డి, నాయకులు నరేష్‌రెడ్డి, రాజ మౌళి, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొర్రూరులో.. తొర్రూరు కోర్టు నుంచి న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరారు. కురవిలో తెలంగాణవాదులు సీమాంద్రుల దాడులను ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో.. అమరవీరుల స్థూపం వద్ద దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ జైసింగ్ రాథోడ్, సమ్మయ్య, బానోతు బాలాజీ, సజ్జన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ములుగురోడ్డులో.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులపై దాడులపట్ల నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. విద్యుత్ జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు సంపత్‌రావు, నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో గుబులు
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వైఖరి ఆ పార్టీ క్యాడర్‌ను గందరగోళానికి గురిచేస్తోంది. సీడబ్ల్యూసీ ప్రకటన తరువాత సీమాంధ్ర రాజధాని తదితర అవసరాల కోసం భారీ ప్యాకేజీ ప్రకటించాలని కోరిన చంద్రబాబు.. తాజాగా తెలంగాణవాదుల్లో అనుమానాలు రేకెత్తేవిధంగా ప్రధానికి లేఖ రాయడం జిల్లాలోని పార్టీశ్రేణులను విస్మయపరిచింది. ఏ సందర్భం లేకుండా స్పందించడం, సమైక్యవాదులు లేవనెత్తుతున్న అంశాలనే పేర్కొంటూ ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరడంతో మరోసారి పార్టీ తెలంగాణపై వెనక్కు వెళ్తుందేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 2009 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణకు అనుకూలత ప్రకటించి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణను ప్రకటించగానే తన నిర్ణయాన్ని మార్చుకుంది. అప్పటినుంచి జిల్లాలో టీడీపీ పరిస్థితి దిగజారుతూనే ఉంది. 2009 ఎన్నికల్లో ఐదుగురు శాసనసభ్యులు గెలువగా ఇప్పుడు ముగ్గురు మాత్రమే మిగిలారు. వేములవాడ, కరీంనగర్ ఎమ్మెల్యేలు సిహెచ్.రమేష్‌బాబు, గంగుల కమలాకర్ టీఆర్ఎస్లో చేరారు. వేములవాడ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. సహకార, పంచాయతీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదు. చంద్రబాబు కాళ్లకు బలపాలు కట్టుకుని ఁవస్తున్నా మీ కోసంరూ. అంటూ జిల్లాలో తిరిగినా పార్టీ పరిస్థితి మాత్రం చక్కబడలేదు. దీంతో ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు అనేక మంది వలసబాట పట్టారు. ఎక్కడా అవకాశాలు లేనివారు, ఇతర పార్టీల్లో నిలదొక్కుకోలేమని భావించిన వారు మాత్రమే టీడీపీలో కొనసాగుతున్నారు. చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణపై అఖిలపక్ష సమావేశం జరిగింది. తాము విభజనకు వ్యతిరేకం కాదని, ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో పూర్వవైభవం సాధించాలని పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు కొత్త అనుమానాలు కలిగేలా వ్యవహరించడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా అనేక అవమానాలను భరించామని, తమ మనోభావాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు మార్చుకుంటున్నారని సీనియర్ కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణవాదుల్లో అనుమానాలు బలపడేలా పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని వాపోయాడు. ఇప్పటికే సీమాంధ్రలో ఉద్యమానికి టీడీపీ నేతలు నాయకత్వం వహిస్తుండడం తమకు ఇబ్బందిగా మారిందంటున్న కార్యకర్తలు వారికి వత్తాసు పలికేలా స్వయంగా చంద్రబాబే లేఖ రాయడం తప్పుబడుతున్నారు. కాంగ్రెస్‌లోనూ.. తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీలోనూ చర్చకు దారి తీస్తున్నాయి. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనపై వ్యక్తం చేసిన అభిప్రాయాలపై జిల్లా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సీఎంకు మొదటినుంచి వ్యతిరేకంగా ఉన్న ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆయన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. సీమాంధ్ర జేఏసీ నేతగా కిరణ్ మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డితో పాటు సీనియర్ నాయకులు సీఎం తీరును తప్పుబట్టారు. సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మంత్రి శ్రీధర్‌బాబుకు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. -
తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం
కొరిటెపాడు (గుంటూరు), న్యూస్‌లైన్ :సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని నరసరావుపేట లోక్‌సభ సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి స్పష్టంచేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిరోజూ పార్లమెంట్ సమావేశాలకు హాజరై, ఈ ప్రాంత ప్రజల ఆవేదనను వినిపించేలా సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలపై సీమాంధ్ర విద్యార్థి, ఉద్యోగ జేఏసీ,ఎన్జీవోలు ఒత్తిడి తేవాలని సూచించారు. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాల్సింది పార్లమెంట్‌లోనేనని గుర్తుచేశారు. సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తు ఊరుకోబోమని స్పష్టంచేశారు. హైదరాబాదు నగరంతోపాటు కృష్ణా, గోదావరి నదీజలాల సంగతి ముందుగా తేల్చాకే తెలంగాణపై ఆలోచించాలని హితవుపలికారు. ఆంటోనీ కమిటీ వల్ల సీమాంధ్రకు ఒరిగేదేమీ లేదని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన జరిగితే ఎన్నో అనార్థాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు వెన్నా సాంబశివారెడ్డి, సీహెచ్ చిట్టిబాబు, ఎన్.విజయలక్ష్మి, కె.నాగేశ్వరరావు, సీహెచ్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.