ప్రజల గోడు మీకు పట్టదా..?
Published Sun, Sep 15 2013 1:44 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని కోరుతూ సీమాంధ్రలో అన్ని వర్గాలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారి గోడు పట్టనట్టు వ్యవహరిస్తోందని విద్యార్థులు, ఉద్యోగులు మండిపడ్డారు. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొనసాగించాలని కోరుతూ ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైబ్రరీ సిబ్బంది శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
వర్సిటీ సమైక్యాంధ్ర జేఏసీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఆచార్య జడ్.విష్ణువర్ధన్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.మధుసూదనరావు నూటా అధ్యక్షుడు ఆచార్య పి.వరప్రసాదమూర్తి, సీమాంధ్ర విశ్వవిద్యాలయాల అధ్యాపక జేఏసీ కార్యదర్శి డాక్టర్ జి. రోశయ్య, ఉద్యోగ జేఏసీ నాయకులు డాక్టర్ పి. జాన్సన్,లైబ్రరీ సిబ్బంది జేవీ. కృష్ణయ్య, కొండలరావు, కోడూరి కనకరాజు, వర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కె. కిషోర్, బి. ఆశిరత్నం, బి.వెంకటేశ్వర్లు, పి. శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగిన రిలేనిరాహార దీక్షలు
సమైక్యాంధ్రను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద శనివారం వర్సిటీ లైబ్రరీ సిబ్బంది, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు రిలేనిరాహారదీక్షలు కొనసాగించారు.
Advertisement