Dr. Ambedkar B.R.
-
ప్రపంచ మేధావి అంబేద్కర్
వర్ని, న్యూస్‌లైన్: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ప్రపంచ మేధావిగా గుర్తించి అ మెరికాలోని కొలంబియా విశ్వవిద్యాల యం ప్రాంగణంలో చిత్రపటాన్ని ఏర్పా టుచేయడం దేశానికే గర్వకారణమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచా న్ని శాసించే దేశ అధ్యక్షుడు బరాక్ ఒ బా మా చేతుల మీదుగా కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రపంచ మేధావిగా అం బేద్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం చాలా అరుదైన విషయమన్నారు. అ ణగారిన బహుజనుల సంక్షేమం కోసం తీవ్రంగా శ్రమించారన్నారు. ఆయన రా సిన రాజ్యాంగంలోని ప్రతి పదం ఎంతో విలువైందన్నారు. దేశంలోని ధనిక, పేద వర్గాల్లో పేదలకు దారి చూపిన మహనీ యుడు అంబేద్కర్ అని కొనియాడారు. నేటికి ప్రభుత్వాలు కులాల పేరుతో వ సతి గృహాలు, పాఠశాలలు ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. చదువు ఆయుధంలాంటిదని, కులమతాలకు అతీతంగా అందరికి ఉచితంగా రెసిడెన్షియల్ విద్య అందించాలని కోరారు. విద్యతో పాటు రాజ్యధికారం దళితులకు లభిస్తేనే సమన్యాయం జరుగుతుందన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికే అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ప్రతిపాదన చేశారని గుర్తు చే శారు. మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘ భవనం ఏర్పాటుకు, లక్ష్మాపూర్‌లో కమ్యూనిటీ హాలు పూర్తి చేయడానికి సహ కరిస్తానని హామీ ఇచ్చారు. సభకు అధ్యక్షత వహించిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు నీరడి సాయిలు మాట్లాడుతూ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఎన్నో అవమానాలు, కష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విగ్రహ దాతలను కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దల్సింగ్, ప్రొఫెసర్ సంజీవ్‌కుమార్, టీడీపీ బాన్సువాడ సెగ్మెంట్ ఇన్చార్జి బద్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల గోడు మీకు పట్టదా..?
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని కోరుతూ సీమాంధ్రలో అన్ని వర్గాలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారి గోడు పట్టనట్టు వ్యవహరిస్తోందని విద్యార్థులు, ఉద్యోగులు మండిపడ్డారు. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొనసాగించాలని కోరుతూ ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైబ్రరీ సిబ్బంది శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వర్సిటీ సమైక్యాంధ్ర జేఏసీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఆచార్య జడ్.విష్ణువర్ధన్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.మధుసూదనరావు నూటా అధ్యక్షుడు ఆచార్య పి.వరప్రసాదమూర్తి, సీమాంధ్ర విశ్వవిద్యాలయాల అధ్యాపక జేఏసీ కార్యదర్శి డాక్టర్ జి. రోశయ్య, ఉద్యోగ జేఏసీ నాయకులు డాక్టర్ పి. జాన్సన్,లైబ్రరీ సిబ్బంది జేవీ. కృష్ణయ్య, కొండలరావు, కోడూరి కనకరాజు, వర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కె. కిషోర్, బి. ఆశిరత్నం, బి.వెంకటేశ్వర్లు, పి. శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగిన రిలేనిరాహార దీక్షలు సమైక్యాంధ్రను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద శనివారం వర్సిటీ లైబ్రరీ సిబ్బంది, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు రిలేనిరాహారదీక్షలు కొనసాగించారు.