ప్రపంచ మేధావి అంబేద్కర్
Published Mon, Sep 16 2013 4:23 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
వర్ని, న్యూస్‌లైన్: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ప్రపంచ మేధావిగా గుర్తించి అ మెరికాలోని కొలంబియా విశ్వవిద్యాల యం ప్రాంగణంలో చిత్రపటాన్ని ఏర్పా టుచేయడం దేశానికే గర్వకారణమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచా న్ని శాసించే దేశ అధ్యక్షుడు బరాక్ ఒ బా మా చేతుల మీదుగా కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రపంచ మేధావిగా అం బేద్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం చాలా అరుదైన విషయమన్నారు. అ ణగారిన బహుజనుల సంక్షేమం కోసం తీవ్రంగా శ్రమించారన్నారు.
ఆయన రా సిన రాజ్యాంగంలోని ప్రతి పదం ఎంతో విలువైందన్నారు. దేశంలోని ధనిక, పేద వర్గాల్లో పేదలకు దారి చూపిన మహనీ యుడు అంబేద్కర్ అని కొనియాడారు. నేటికి ప్రభుత్వాలు కులాల పేరుతో వ సతి గృహాలు, పాఠశాలలు ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. చదువు ఆయుధంలాంటిదని, కులమతాలకు అతీతంగా అందరికి ఉచితంగా రెసిడెన్షియల్ విద్య అందించాలని కోరారు. విద్యతో పాటు రాజ్యధికారం దళితులకు లభిస్తేనే సమన్యాయం జరుగుతుందన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికే అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ప్రతిపాదన చేశారని గుర్తు చే శారు. మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘ భవనం ఏర్పాటుకు, లక్ష్మాపూర్‌లో కమ్యూనిటీ హాలు పూర్తి చేయడానికి సహ కరిస్తానని హామీ ఇచ్చారు.
సభకు అధ్యక్షత వహించిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు నీరడి సాయిలు మాట్లాడుతూ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఎన్నో అవమానాలు, కష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విగ్రహ దాతలను కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దల్‌సింగ్, ప్రొఫెసర్ సంజీవ్‌కుమార్, టీడీపీ బాన్సువాడ సెగ్మెంట్ ఇన్‌చార్జి బద్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement