సీమాంధ్ర న్యాయవాదుల దిష్టిబొమ్మ దహనం
Published Thu, Sep 12 2013 2:18 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులపై సీమాంధ్ర న్యాయవాదుల దాడికి నిరసనగా తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలోని జిల్లా కోర్టు ముందు సీమాంధ్ర న్యాయవాదుల దిష్టిబొమ్మను న్యాయవాదులు దహనం చేశారు. తొలుత, దిష్టిబొమ్మతో ఊరేగింపుగా వైరా ప్రధాన రహదారిపైకి చేరుకుని, అక్కడ కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును తక్షణమే ప్రవేశపెట్టాలని, అరెస్టు చేసిన తెలంగాణ న్యాయవాదులను తక్షణమే విడుదల చేయాలని,
దాడి చేసిన సీమాంధ్ర న్యాయవాదులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎం, డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్ బి.తిరుమలరావు, కో-కన్వీనర్ కొండపల్లి జగన్‌మెహన్‌రావు, నాయకులు వేపచేదు మధు, రానేరు కిరణ్‌కుమార్, కర్లపూడి శ్రీనివాసరావు, మరీదు రామారావు, పుల్లారెడ్డి, సిహెచ్.నాగులు, కనిశెట్టి మధుసూదన్‌రావు, అజీజ్ పాషా, వలరాజు, టీఆర్‌ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు గుండ్లపల్లి శేషగిరిరావు, మధిర ఇంచార్జి బమ్మెర రామ్మూర్తి, నాయకులు పిడతల రాంమూర్తి, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలంలో...
భద్రాచలం టౌన్: హైకోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులపై దాడులకు నిరసిస్తూ భద్రాచలం బార్ అసోసియేషన్ అద్యక్షుడు పివి.కృష్ణమాచారి ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం విధులను బహిష్కరించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, భద్రాచలం జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌కు, సబ్ కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తాకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో న్యాయవాదులు పాపినేని కృష్ణకుమార్, ఎంవి.రమణారావు, ప్రసాదరావు, కె.విద్యాసాగర్, కొడాలి శ్రీనివాస్, జెట్టి సాల్మన్‌రాజు, పడవల శ్రీనివాస్, అక్తర్, వసంతరావు, పడిసిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లెందులో..
ఇల్లెందు అర్బన్: తెలంగాణ న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ, పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండుతో ఇల్లెందులో అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ జేఏసీ ఇల్లెందు అధ్యక్షుడు సుడిగాలి వెంకట నర్సయ్య, న్యాయవాదులు నాగండ్ల మల్లిఖార్జున్‌రావు, కర్ణాకర్, దంతాల అనంద్, సత్యనారాయణ, చెన్నకేశవరావు, ప్రభాకర్‌రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement