అమరుల తల్లిదండ్రులకు ఆహ్వానం | Invitation to Martyrs Parents : kcr | Sakshi
Sakshi News home page

అమరుల తల్లిదండ్రులకు ఆహ్వానం

Published Mon, Jun 2 2014 2:05 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

Invitation to Martyrs Parents : kcr

ఉద్యోగ, రాజకీయ జేఏసీల నేతలకు అందని పిలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా పలువురిని స్వయంగా ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం అందుకున్నవారిలో తెలంగాణ అమర వీరుల కుటుంబసభ్యులతో పాటు ఉద్యమకారులు, ప్రముఖ కవులు, కళాకారులు, క్రీడా, పారిశ్రామిక రంగాల ప్రముఖులు ఉన్నారు. ఆహ్వానం అందుకున్న అమర వీరుల కుటుంబ సభ్యుల్లో... ఇషాంత్‌రెడ్డి తండ్రి ఇంద్రసేనారెడ్డి,  శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, వేణుగోపాలరెడ్డి తల్లి కొండేటి లక్ష్మమ్మ, భోజ్యానాయక్ తండ్రి లూనావత్ నామా, యాదిరెడ్డి తల్లి మందడి చంద్రమ్మ, మందమర్రి శ్రీకాంత్ తండ్రి రాంటెంకి సమ్మయ్య ఉన్నారు.

ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి, కవి అంద్శై తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి పసునూరి దయాకర్, అమరవీరుల స్థూపాన్ని రూపొందించిన ఎక్కా యాదగిరి, చిత్రకారులు ఏలె లక్ష్మణ్, కవులు, కళాకారులు గోరటి వెంకన్న, అశోక్ తేజ, సాయిచంద్, నేర్నాల కిషోర్, మిట్టపల్లి సురేందర్, ఉద్యమ కారుడు భూపతి కృష్ణమూర్తి, క్రీడాకారులు సైనా నెహ్వాల్, గగన్ నారంగ్, గుత్తా జ్వాల, మిథాలీ రాజ్, గోపీచంద్, వాణిజ్య రంగానికి సంబంధించి సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, ఫిక్కీ డెరైక్టర్ జనరల్ దిదర్‌సింగ్, నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మైక్రోసాఫ్ట్ ఇండియా సీఈవో భాస్కర్ ప్రమాణిక్, సీఐఐ అధ్యక్షుడు అజయ్ శ్రీరాం, భారత ఫార్మా అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, హైదరాబాద్ మెట్రోరైల్ (ఎల్‌అండ్‌టీ) చైర్మన్ దియోస్ థలీ, సీఈవో, ఎండీ వివేక్ గాడ్గిల్, ఎంఆర్‌ఎఫ్ చైర్మన్ వినూ మన్నన్, సీఈవో రాహుల్ మన్నన్, సీనియర్ ఉపాధ్యక్షుడు ఇసాక్ తంబురాజ్, డెరైక్టర్ అంబికా మన్నన్, కోరమండల్ గ్రూప్ ఎండీ కపిల్ మెహన్, కార్వీ చైర్మన్ పార్థసారథి, విప్రో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరిహెగ్డే, సీఐఐ ఫిక్కీ హైదరాబాద్ ప్రతినిధులు సుమిత్ మజుందార్, సురేష్ చిత్తోరి, వనిత దాట్ల, శోభన కామినేని, అనిల్ కామినేని, నరేందర్ సురానా, సంగీతారెడ్డి తదితరులను కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

కాగా, జేఏసీ వుఖ్యనేతలెవరికీ కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానాలు అందలేదు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని కోరినా జేఏసీ నేతలు తటస్థంగా వ్యవహరించడమే కేసీఆర్ ఆగ్రహానికి కారణంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిన తరువాత కే సీఆర్‌ను అభినందించడానికి జేఏసీ చైర్మన్ కోదండరాం పలుమార్లు అపాయింట్‌మెంట్ కోరినా.. కేసీఆర్ నిరాకరించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ నుంచి పంపిన ఆహ్వానాల్లో ఉద్యోగ జేఏసీ నేతలుగానీ, రాజకీయ జేఏసీ నేతల పేర్లుగానీ లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement