కళాకారులకు హెల్త్ కార్డులు:కేసీఆర్
హైదరాబాద్:త్వరలో కళాకారులకు హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం మాదాపూర్ ఆర్ట్స్ గ్యాలరీలో జరిగిన సాంస్కృతికి సారధి సభకు కేసీఆర్ హాజయ్యారు. కళాకారులకు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రజల మధ్య కళాకారులు ఒక వారధిలా పని చేయాలని కేసీఆర్ తెలిపారు.
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రుల కంటే కళాకారులపైనే ఉందన్నారు.మిషన్ కాకతీయ, హరితహారం పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. త్వరలోనే కళాభవనాన్ని నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. కళాకారులకు కావల్సిన సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తెలంగాణ సాంస్కృతి కళా భవనానికి మిద్దె రాములు పేరు పెట్టనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.మార్చి నెల నుంచే రైతులకు పగటిపూట తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని తెలిపారు.