ఇద్దరే ఇద్దరు | Movements against the division of the state of the pram simandhra | Sakshi

ఇద్దరే ఇద్దరు

Aug 25 2013 4:49 AM | Updated on Mar 28 2019 6:26 PM

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలతో సీమాంధ్ర ప్రాం తం హోరెత్తుతోంది. ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు,

ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలతో  సీమాంధ్ర  ప్రాం తం హోరెత్తుతోంది. ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, న్యాయవాదులు, జిల్లా స్థారుు అధికారులు ఇలా అన్నివర్గాల వారు స్వచ్ఛం దంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, మానవహారాలు, ధర్నాలు,  రోడ్డు దిగ్బంధనం, ఆమరణ, రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఉపాధ్యాయులు కూడా సంఘాలకు అతీతంగా ఉద్యమబాట పడుతున్నారు. అరుుతే, ఎల్.ఎన్.పేట మండలంలోని ఉపాధ్యాయుల తీరు దీనికి భిన్నంగా ఉంది. మండలంలో 5 జెడ్పీ ఉన్నత , 9 ప్రాథమికోన్నత, 35 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 
 
 పాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 102 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరో 63 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో ఇద్దరంటే ఇద్దరు ఉపాధ్యాయులే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటుం డడం గమనార్హం. కరకవలస, లక్ష్మీనర్సుపేట  జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న జె.నరేంద్ర, చింతాడ నారాయణమూర్తిలు ఆయూ హెచ్‌ఎంలకు సమ్మెనోటీసు ఇచ్చి శుక్రవారం అర్థరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. మిగిలిన వారంతా సమ్మెకు దూరంగా ఉంటున్నారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించి, రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేయూల్సిన ఉపాధ్యాయులే ఉద్యమానికి దూరం గా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. 
 
 ఆయూ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు, అలవెన్స్‌లు, సెలవులు, పీఎఫ్, జీఎఫ్ లు చాలవలని ఏడాదిలో నాలుగు సార్లు ధర్నాలు, సమ్మెలు చేసే ఉపాధ్యాయులు ఇప్పుడెందుకు కిమ్మనడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. విభజన జరిగితే విద్యార్థుల ఎంత నష్టపోతారు, రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతారుు తదితర అంశాలను వివరించాల్సిన ఉపాధ్యాయులు సమ్మెకు దూరంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. జిల్లాస్థాయి అధికారు లు సమ్మెలో పాల్గొంటున్నా ఉపాధ్యాయులు ఆసక్తిచూపకపోవడంపై యువకులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలకు తాళాలు వేసి ఉద్యమంలో పాల్గొనేలా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement