తల్లాడ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రజల ను కాంగ్రెస్ పార్టీయే రెచ్చగొడుతోందని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మండలంలోని కలకొడిమ గ్రామం లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడా రు. విధి విధానాలు లేకుండా తెలంగాణ ప్రాం తంలో తన ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రె స్ పార్టీ తెలంగాణపై ప్రకటన చేసిందని అన్నా రు. దివంగత నేత రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేద ని, ఇప్పుడు జగన్‌కూడా వ్యతిరేకించడం లేద ని వివరించారు. ఇరుప్రాంతాలవారికీ న్యాయం చేయాలనే డిమాండ్‌తోనే తమ పార్టీ పోరాడుతోందని స్పష్టం చేశారు. తెలంగాణకు తమ పార్టీ అనుకూలమేనని చెప్పారు.
సహకార సంఘాల నిర్వీర్యం తగదు..
రాష్ట్రంలో సహకార సంఘాలను వాణిజ్య బ్యాంకులుగా మార్చాలనే యోచనను మానుకోవాలని మచ్చా, పొంగులేటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన సంస్థలను కమర్షియల్‌గా మార్చితే రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సహకార సంఘాలు ప్రజాబ్యాంక్‌లుగా మాత్రమే ఉండాలని సూచించారు. ప్రకాష్‌భక్షి నివేదికను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.
వారి వెంట పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మట్టా దయానంద్ విజయ్‌కుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తుమ్మలపల్లి రమేష్, మండల కన్వీనర్ గొడుగునూరి లక్ష్మీరెడ్డి, మండల నాయుకులు దగ్గుల కాంతారెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, కొమ్మినేని వెంకటేశ్వర్లు, శీలం సత్యనారాయణరెడ్డి, అయిలూరి సత్యనారాయణరెడ్డి, పెరికె నాగేశ్వర్‌రావు, వడ్డే రామారావు, బస్వాపురం సర్పంచ్ వెంకటమైబు, కీసర వెంకటేశ్వర్‌రెడ్డి, పాలెపు రామారావు, నీరుకొండ రమేష్ ఉన్నారు.
ప్రజలను రెచ్చగొట్టేది కాంగ్రెస్సే
Published Tue, Aug 27 2013 4:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement