=లేకుంటే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు
=బీడువారనున్న పంట పొలాలు
=విశాఖను నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేయాలి
=ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
=రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విభజన జరిగితే భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్ర లో విలీనం చేయాలని ఉత్తరాంధ్ర మే దావులు డిమాండ్ చేశారు. నగరంలోని ఓ హాటల్‌లో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక, ఫోరం ఫర్ యాక్షన్ రీసెర్చ్ అండ్ పాల సీ ఎనాలిసెస్(ఫార్పా) సంయుక్తంగా ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏయూ రిటైర్డ్ ప్రొఫెస ర్ సూరప్పడు, నీటిపారుదలశాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, బ్రహ్మణయ్య, ఎ.వి.భుజంగరావు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు పి.శివశంకర్ మాట్లాడుతూ భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో అంతర్భాగం చేయడం ద్వారానే పోలవరం ముంపు సమస్య పరిష్కారమవుతుందన్నారు.
ఈ పాజెక్టు ను అడ్డుకునేందుకు తెలంగాణ నేతలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిం చారు. జలవనరులను దృష్టిలో ఉంచుకునే భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి చెందినదని, సీతారాముల మీద కపట ప్రేమ చూపుతున్నారని ఎద్దేవా చేశారు. వారు కోరిన విధంగా డిజైన్ మార్చితే తూర్పుగోదావరి, విశాఖ, విజయనగ రం, శ్రీకాకుళం జిల్లాలు తాగు, సాగునీరు లేక ఎడారిగా మారుతాయని అభిప్రాయడ్డారు.
ఈ ప్రాంతంలో సుమారు 20 లక్షల ఎకరాలు సాగులో ఉండగా కేవలం 11 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి సదుపాయం ఉండడం దురదృష్టకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి, రూ. 7,600 కోట్ల నిధులతో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవ్ కూడా చేశారని గుర్తిచేశారు.
సుజల స్రవంతి పూర్తయితే సుమారు 8 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నా రు. విశాఖ జిల్లాకు చాలా వరకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. భద్రాచలం డివిజన్‌లో నివస్తున్న గిరిజనులు పాడేరు, పార్వతీపురం డివిజన్‌లోని ఆదివాసీలతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు. భద్రాచలాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలపాలని తీర్మానం చేసి కేంద్ర మంత్రుల బృందానికి పంపనున్నట్టు పేర్కొన్నారు.
భద్రాచలం సీమాంధ్రలో అంతర్భాగమే..
Published Mon, Nov 18 2013 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement
Advertisement