Shiv Shankar
-
చిక్కిన బాబా శివ శంకర్..
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న, అవతార పురుషుడిగా చెప్పుకునే శివశంకర్ బాబ ఢిల్లీలో పోలీసులకు చిక్కాడు. బుధవారం అక్కడి ఖాజీయాబాద్లోని ఓ భక్తుడి ఇంట్లో సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు చెందిన సుశీల్ హరి ఇంటర్నేషనల్ పాఠశాలలో సోదాలు నిర్వహించారు. ఇలా బుక్కయ్యాడు... లైంగిక ఆరోపణలు రావడంతో శివశంకర్ బాబా ఆధ్యాత్మిక అదృశ్యం అయ్యాడు. జార్ఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఓ ఆస్పత్రిలో గుండెపోటు చికిత్స తీసుకుంటున్నట్లు గుర్తించిన సీబీసీఐడీ విచారణ ముమ్మరం చేశారు. విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో బయటకు వెళ్లే మార్గం లేక ఢిల్లీలోని ఓ భక్తుడి వద్ద తలదాచుకునే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైయ్యారు. భక్తుడి ఇంట్లో బస.. డెహ్రాడూన్‌లో ఓ భక్తురాలితో కలిసి ప్రత్యక్షమైన బాబా, ఆ తర్వాత పత్తా లేకుండా పోయినట్టు సీబీసీఐడీ బృందం విచారణలో తేలింది. అంతే కాకుండా సాధారణ రోజుల్లో ఢిల్లీ వెళ్లినప్పుడు ఓ భక్తుడి ఇంట్లో బస చేసే వాడని సమాచారం అందడంతో అతని ఇంటిపై నిఘా ఉంచారు. బుధవారం వేకువ జామున అక్కడికి ఈ బాబా రాగానే, ఢిల్లీ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరు పరిచి, అనంతరం చెన్నైకి తరలించే ఏర్పాట్లు చేశారు. ముమ్మరంగా తనిఖీలు.. ఉండగా, కేలంబాక్కంలోని బాబుకు చెందిన సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్లో సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఏడు మందితో కూడిన బృందం సోదాలు నిర్వహించింది. 73 మంది టీచర్లు పని చేస్తున్నట్లు గుర్తించారు. వారిలో పలు కేసులను ఎదుర్కొంటున్న భారతి, దీపా అనే టీచర్ల వివరాలను సేకరించారు. బాబా లీలకు సంబంధించిన అనేక వీడియోలు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు బయట పడినట్లు సమాచారం. ఈ పాఠశాలలను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవాలని పిల్లల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మాజీ మంత్రికి నో బెయిల్.. నటి చాందిని ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మంత్రి మణికంఠన్‌పై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు పీఏ, గన్‌మెన్‌గా వ్యవహరించిన వారందరిని పోలీసులు ఇప్పటికే విచారించారు. ఆయన అరెస్ట్‌కు దాదాపు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మణి కంఠన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, బెయిల్ ఇస్తే, సాక్షుల్ని, ఫిర్యాదుదారులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసు తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. బాబ్జీ మదన్ కోసం వేట.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ జైళ్లో ఉన్న అథ్లెటిక్ అకాడమి శిక్షకుడు నాగరాజన్ మీద విదేశాల్లోని ఇద్దరు తమిళనాడు క్రీడాకారిణులు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేశారు. అలాగే లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జూడో అకాడమి మాస్టర్ ఏబీన్ రాజ్‌కు చెన్నై కోర్టు బెయిల్ నిరాకరించింది. దానితో పాటు యూట్యూబ్ ద్వారా మహిళలను అసభ్య పదజాలాలతో దూషించడం, ఆన్లైన్ ద్వారా నగదు వసూళ్లలో ఉన్న టాక్సిక్ మదన్ ఛానల్ నిర్వాహకుడు బాబ్జి మదన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయన తండ్రి, భార్య కృతికనును బుధవారం విచారించారు. కృతికను అరెస్ట్ చేశారు. చదవండి: కీచక బాబాకు సాయం.. మహిళా టీచర్లపై పోక్సో చట్టం -
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. శివశంకర్ బాబాపై కేసు నమోదు
చెన్నై: ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న శివశంకర్ బాబాపై చెన్నై పోలీసులు ఆదివారం లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. చెన్నై సమీపంలోని కీలంబాక్కంలో తన స్కూలుకు చెందిన పలువురు విద్యార్థినులను ఈ బాబా లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. శివశంకర్ బాబా సుశీల్ హరి పేరిట ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా స్కూల్లో చదివిన పలువురు విద్యార్థినులు …బాబా తమపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతే తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ శివశంకర్ బాబాకు సమన్లు జారీ చేసింది. కాగా ముగ్గురు విద్యార్థినులు చేసిన ఫిర్యాదుతో కీలంబాక్కం మహిళా పోలీసులు శివశంకర్ బాబాపై పోక్సో చట్టం కింద పలు కేసులు దాఖలు చేశారు. అయితే కేసు తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం దీన్ని సీబీసీఐడీకి ట్రాన్స్ ఫర్ చేసింది. కేసుకు సంబంధించి సమాచారం పొందడానికి ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 13 మంది బాధితులను అధికారులు కలిసి వివరాలు సేకరించనున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇచ్చిన సమన్లపై శివశంకర్ కమిటీ ముందు హాజరు కాలేదు. ఛాతీ నొప్పితో తమ గురువు డెహ్రాడున్ లోని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని ఆయన శిష్యులు కమిటీకి తెలిపారు. చదవండి: మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్‌టాక్ స్టార్ -
‘సంతోషపడ్డ తండ్రి చంద్రబాబు ఒక్కడే’
సాక్షి, హైదరాబాద్ : స్వార్ధ ప్రయోజనాల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ ఆరోపించారు. రాష్ట్రంలో సంతోషపడ్డ ఒకే ఒక్క తండ్రి చంద్రబాబు మాత్రమేనని.. తన కొడుకు లోకేష్‌కు మాత్రమే మంత్రిపదవి వచ్చిందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాదిమంది యువత ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారని.. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. -
సీమాన్ ఎన్నికల ప్రచారం
మదురై: నత్తం అసెంబ్లీ నియోజకవర్గ నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి శివశంకర్‌కు ఓటేయాలని పార్టీ నేత సీమాన్ కోరారు. గత 50 సంవత్సరాలుగా తమిళనాడును పాలిస్తోన్న ద్రవిడ పార్టీల అధికారానికి పుల్‌స్టాప్ పెట్టండి అని అన్నారు. గత 50 ఏళ్లుగా పార్టీలు మారుతున్నాయి కాని నేతలు మారడం లేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మానేసి వారి ధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా ద్రవిడ పార్టీలు ముందుకు సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘తమిళనాడును తమిళ ప్రజలే పాలించాలి..వేరే భాష మాట్లాడేవారు పాలించడం అన్యాయం గత 50 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. ఇకపై కళ్లు తెరవండి’ అని అన్నారు. మేం అధికారంలోకి వస్తే వైద్యం, తాగునీరు వంటి వాటిని ఉచితంగాఅందిస్తామని చెప్పారు. -
తల్లీకూతుళ్ల దారుణ హత్య
బషీరాబాద్/యాలాల: తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. దాదా పు ఏడాది తర్వాత విషయం వెలుగుచూసింది. వివాహిత భర్తే దారుణా నికి ఒడిగట్టాడు. శుక్రవారం పోలీసు లు వివాహిత మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించా రు. పోలీసుల కథనం ప్రకారం.. యాలాల మండలం బెన్నూరు గ్రా మానికి చెందిన అమృత(20)ను ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన అబ్దుల్లా ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు అనీసా(16 నెలలు) ఉంది. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భర్త వేధింపులు భరించలేక అమృత వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో కక్షగట్టిన అబ్దుల్లా దాదాపు ఏడాది క్రితం భార్యకు మాయమాటలు చెప్పి బషీరాబాద్ మండలం నీళ్లపల్లి సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ భార్యను రాయితో మోది హత్య చేశాడు. అనంతరం నీళ్లపల్లి-పర్వత్‌పల్లి మార్గంలో ఓ గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అనంతరం అబ్దుల్లా కూతురిని కూడా స్వగ్రామంలో చంపేసి పూడ్చివేశాడు. కొద్దికాలానికి ముంబై వెళ్లిపోయాడు. ఇటీవల ఒంటరిగా అబ్దుల్లా గ్రామానికి వచ్చాడు. కూతురు, మనవరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అమృత తల్లిదండ్రులు యాలాల ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు తాండూరు రూరల్ సీఐ శివశంకర్ అనుమానంతో ఇటీవల అబ్దుల్లాను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు అబ్దుల్లా. అతడు చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం రూరల్ సీఐతో పాటు బషీరాబాద్, యాలాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తవ్వకాలు జరుపగా అమృత అస్థిపంజరం లభ్యమైంది. పోలీసు లు అక్కడే వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. చిన్నారి మృతదేహాన్ని శనివారం వెలికి తీస్తుండొచ్చని సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది. -
కొడుకు-ఖతం
అమ్మ ఆగ్రహ ఫలితం - ఆ బాధలు భరించలేకనే పనీ లేదు, ఆదాయం లేదు. నిత్యం తాగుడే. దీనికితోడు తాగుడుకు డబ్బులు కావాలని దాడులు. కన్న తల్లి అని చూడకుండా కొట్టేవాడు. చిత్రహింసలకు గురిచేసేవాడు. భార్య, పిల్లలకు నరకం చూపించేవాడు. చంపడమే సరైన మార్గంగా అనిపించింది. భార్యలోనూ ఆనందం - వితంతువునైనా సంతోషమే చాలా సంతోషంగా ఉంది. రోజూ హింసించేవాడు. అలాంటి భర్త ఉండే కన్నా చావడమే మేలు. డబ్బులు ఇవ్వాలంటూ కాలనీలో తిప్పితిప్పి కొట్టేవాడు. ఆ బాధకంటే విధవగా ఉండడమే మేలు. మా అత్త చేసిన పని మంచిదే. కనిగిరి : కొడుకు వేధింపులకు విసిగి వేసారిన తల్లి సహనం కోల్పోయి కన్న బిడ్డను గొడ్డలితో నరికి చంపింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని బహిరంగంగా ఈడ్చూకుంటూ తీసుకెళ్లి కొండల్లో పూడ్చి వేసింది. ఈ సంఘటన పట్టణ పరిధిలోని కాశిరెడ్డి నగర్లో బుధవారం జరిగింది. వివరాలు.. కాశిరెడ్డి కాలనీలో నివసించే నర్సమ్మకు భర్త, చిన్న కొడుకు ఇదివరకే చనిపోయారు. పెద్ద కుమారుడు శివశంకర్(29)కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. శివశంకర్‌కు కందుకూరుకు చెందిన గోపాల కుమారితో పదేళ్ల క్రితం వివాహమైంది. తోటలకు కాపలా ఉండటంతో పాటు చేపల వేటకు వెళ్లే శివశంకర్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం రోజూ తల్లీభార్యను వేధించేవాడు. కూలీ నాలి చేసుకుని తెచ్చుకున్న డబ్బు లాక్కునే వాడు. భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. పది రోజుల క్రితం భార్య, తల్లిని చితకబాదాడు. ఆమె అలిగి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లింది. మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలని తల్లిని కొట్టాడు. తల్లి నర్సమ్మ వద్ద ఉన్న రూ.200లు లాక్కెళ్లాడు. విరక్తి చెందిన నర్సమ్మ.. కుమారుని హత్యకు పథకం పన్నింది. నిద్రమాత్రలు నీళ్లలో కలిపింది. కుమారుడు మద్యంతో ఇంటికి రాగా ఆ నీరు ఇచ్చింది. మద్యంలో కలుపుకుని తాగడంతో శివశంకర్ మైకంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కట్టెలు కొట్టే గొడ్డలితో నర్సమ్మ కసితీరా నరికి చంపింది. రాత్రంతా శవం వద్దే.. కుమారుని శవానికి తల్లి నర్సమ్మ రాత్రంతా ఇంట్లోనే కాపలాగా ఉంది. తెల్లవారిన తర్వాత కాలనీలో నుంచి శవాన్ని బహిరంగంగా ఈడ్చుకుంటూ కాలనీ శివారు ప్రాంతమైన కొండ వద్దకు తీసుకెళ్లింది. అక్కడ గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చింది. తాపీగా ఇంటి కొచ్చి నీళ్లతో చేతులు శుభ్రం చేసుకుంది. శివశంకర్‌ను చంపానని, ఇంటికి వచ్చి ప్రశాంతంగా జీవించాలని కొడలు కుమారికి ఫోన్లో తెలిపింది. వీఆర్వో ఫిర్యాదు మేరకు సీఐ సుధాకరరావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. శవాన్ని పూడ్చిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయన తో పాటు ఎస్సై థెరిస్సా ఫిరోజ్ ఉన్నారు. -
విద్యుత్ ఆదా చేయండి : కలెక్టర్
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : విద్యుత్ ఆదా చేసి ఖర్చు తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ దీపాలకు బదులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బులు వినియోగిస్తే కరెంటు ఆదా అవుతుందని ఆయన అన్నారు. సౌరశక్తి వినియోగం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని, అన్ని వివరాలు నెట్‌క్యాప్ వెబ్సైట్లో పొందుపరిచామని ఇందన వనరుల శాఖ జిల్లా మేనేజరు కే శ్రీనివాసరావు వివరించారు. ఇందన పొదుపు వారోత్సవాల వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఆర్జీలకు న్యాయం చేయండి.... ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు న్యాయం చేసి వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ పీ ఉషాకుమారి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన వాటిపై విచారణ జరిపి తగిన న్యాయం చేయాలన్నారు. డీఆర్డీఏ పీడీ కే శివశంకర్, జిల్లా పరిషత్ సీఈవో బీ సుబ్బారావు, డీపీవో కే ఆనంద్, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, డీఈవో డి దేవానందరెడ్డి, ఆర్వీఎం పీవో డి పద్మావతి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, డీఎంఅండ్‌హెచ్‌వో సరసజాక్షి, మచిలీపట్నం మునిసిపల్ కమీషనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అర్జీలు ఇవే .... మండవల్లి మండలం మూడుతాళ్లపాడు గ్రామంలో ప్రభుత్వ భూమి ఏమీలేదని రెవెన్యూ అధికారులు నివేదికలిస్తున్నారని....చెరువులనైనా సరే పూడ్చివేసి వ్యవసాయ భూములుగా మార్చి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని కైకలూరు శాసనసభ్యులు జయమంగళ వెంకటరమణ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు తమ కుటుంబసభ్యుల మధ్య ఆస్తి తగాదాలున్నాయని....ఈ విషయంపై పెదపారుపూడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, డీఎస్పీ స్థాయి అధికారితో తమ కేసు విచారణ చేయించి న్యాయం చేయాలని కడలి లక్ష్మీప్రసన్న వినతిపత్రం అందించారు. చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో దళితుడు బీ కాంతారావును అగ్రకులాలకు చెందిన వారు హత్య చేశారని, ఈ కేసు విషయంపై అట్రాసిటీ చట్టం ప్రకారం మృతుని కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలోని ఓ వ్యక్తికి ఉద్యోగం, భూమిని కేటాయించాలని బహుజన పరిరక్షణ సంఘం నాయకులుఅన్నవరపు నాగేశ్వరరావు, నీలం పుల్లయ్య అర్జీలు ఇచ్చారు. చాట్రాయి మండలం బోలవరం గ్రామంలోని శ్మశానభూమి ఆక్రమణకు గురైందని, అక్కడ దళితులకు శ్మశానవాటిక ఏర్పాటు చేసి రహదారి నిర్మించాలని గ్రామస్తులు అర్జీ సమర్పించారు. పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో రెండు సంతవ్సరాల క్రితం పశువుల వైద్యశాల భవనాన్ని నిర్మించారని,వెంటనే ఈ భవనాన్ని ప్రారంభించి వినియోగంలోకి తేవాలని మహాకవి గురజాడ సేవాసమితి కార్యదర్శి పరసా శివప్రసాద్ అర్జీ ఇచ్చారు. అవనిగడ్డ, పులిగడ్డ ఆర్అండ్బీ రహదారిలో కోటగిరిలంక, సీతాయలంక వద్ద స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేయాలని గ్రామస్తుడు కర్రా సుధాకర్ వినతిపత్రమిచ్చారు. గంపలగూడెం మండల పరిషత్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు పాఠశాల విధులకు గైర్హాజరవుతూ ఉత్తర్వులు లేకపోయినా ఎంఈవో కార్యాలయంలో పనిచేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీయూటీఎఫ్ గంపలగూడెం మండల ప్రధాన కార్యదర్శి పీ ఏడుకొండలు అర్జీ ఇచ్చారు. మచిలీపట్నం 1వ వార్డు పీకేఎం కాలనీలోని దేవునిచెరువు ప్రాంతంలో నివసించే మహిళలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని,అలాగే హెచ్‌బీ కాలనీలోని వైఎస్సార్ పార్కులో వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం కావాల్సిన నిధులు విడుదల చేయాలని మాజీ కౌన్సిలర్ బత్తిన శ్రీనివాసరావు (వాసు) అర్జీ ఇచ్చారు. -
భద్రాచలం సీమాంధ్రలో అంతర్భాగమే..
=లేకుంటే పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు =బీడువారనున్న పంట పొలాలు =విశాఖను నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేయాలి =ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి =రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు విశాఖపట్నం, న్యూస్‌లైన్: విభజన జరిగితే భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్ర లో విలీనం చేయాలని ఉత్తరాంధ్ర మే దావులు డిమాండ్ చేశారు. నగరంలోని ఓ హాటల్లో ఉత్తరాంధ్ర రక్షణ వేదిక, ఫోరం ఫర్ యాక్షన్ రీసెర్చ్ అండ్ పాల సీ ఎనాలిసెస్(ఫార్పా) సంయుక్తంగా ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏయూ రిటైర్డ్ ప్రొఫెస ర్ సూరప్పడు, నీటిపారుదలశాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ, బ్రహ్మణయ్య, ఎ.వి.భుజంగరావు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు పి.శివశంకర్ మాట్లాడుతూ భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో అంతర్భాగం చేయడం ద్వారానే పోలవరం ముంపు సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఈ పాజెక్టు ను అడ్డుకునేందుకు తెలంగాణ నేతలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిం చారు. జలవనరులను దృష్టిలో ఉంచుకునే భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి చెందినదని, సీతారాముల మీద కపట ప్రేమ చూపుతున్నారని ఎద్దేవా చేశారు. వారు కోరిన విధంగా డిజైన్ మార్చితే తూర్పుగోదావరి, విశాఖ, విజయనగ రం, శ్రీకాకుళం జిల్లాలు తాగు, సాగునీరు లేక ఎడారిగా మారుతాయని అభిప్రాయడ్డారు. ఈ ప్రాంతంలో సుమారు 20 లక్షల ఎకరాలు సాగులో ఉండగా కేవలం 11 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి సదుపాయం ఉండడం దురదృష్టకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి, రూ. 7,600 కోట్ల నిధులతో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవ్ కూడా చేశారని గుర్తిచేశారు. సుజల స్రవంతి పూర్తయితే సుమారు 8 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నా రు. విశాఖ జిల్లాకు చాలా వరకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. భద్రాచలం డివిజన్లో నివస్తున్న గిరిజనులు పాడేరు, పార్వతీపురం డివిజన్లోని ఆదివాసీలతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలిపారు. భద్రాచలాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలపాలని తీర్మానం చేసి కేంద్ర మంత్రుల బృందానికి పంపనున్నట్టు పేర్కొన్నారు. -
40 ఏళ్లుగా నా ఆశ.. నా శ్వాస... నృత్యమే!
40 ఏళ్లుగా నా ఆశ.. నా శ్వాస... నృత్యమే! నాట్యాన్ని శ్వాసిస్తారు శివశంకర్ మాస్టార్. ఆయనతో కాసేపు మాట్లాడు తుంటే... చక్కని శాస్త్రీయ నృత్యాన్ని చూస్తున్న ఫీలింగ్. తన దేహాన్నీ, ప్రాణాన్నీ నాట్యంతో మమేకం చేశారాయన. 40 ఏళ్ల సినీ నాట్య ప్రస్థానంలో ఎన్నో మలుపులు, ఎన్నో పురస్కారాలు, ఇంకెన్నో అభినం దనలు. అవన్నీ... తనతో పనిచేసిన అందిరివీ అంటారు శివశంకర్. నాట్యం చేస్తుండగానే తుదిశ్వాస విడవాలని కోరుకుంటారాయన. ‘బెంగళూర్ అంత ర్జాతీయ గ్లోబల్ ట్రస్ట్’ ఈ కళాకారుణ్ణి త్వరలో గౌరవ డాక్టరేట్‌తో సత్కరించ నుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు శివశంకర్. డాక్టరేట్ అందుకోబోతున్నారు. ఆ అనుభూతిని చెప్పండి? నృత్య దర్శకులు డాక్టరేట్ అందుకోవడం అరుదు. అలాంటి అరుదైన గౌరవం నన్ను వరించడం ఆనందంగా ఉంది. అసలు నాకీ డాక్టరేట్ ఎందుకిస్తున్నారని వాళ్లను అడిగా. ‘మీ డాన్సులో పవిత్రత ఉంటుంది. మీ హావభావాలు ఈ తరంవారికి దుర్లభం... అందుకే మీకీ డాక్టరేట్’ అని చెప్పారు. అది వారి అభిప్రాయం. నేనైతే ఆ పొగడ్తలను తలకెక్కించుకోను. నా తల్లిదండ్రులు, నా శ్రేయోభిలాషులు, నా దర్శక, నిర్మాతలు, నా హీరోలు... ఇలా అందరి దీవెనలవల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. ‘మగధీర’తో జాతీయ పురస్కారం అందుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అనేకం అందుకున్నా. ఇవేమీ నాకు ఆనందాన్ని ఇవ్వలేవు. ఒక మంచి డాన్స్ స్కూల్ పెట్టిన రోజు, మన సంప్రదాయ నృత్యానికి ఒక విలువ తెచ్చిన రోజు అప్పుడు నేను నిజంగా ఆనందిస్తాను. మీరు తెలుగువారా? తమిళంవారా? నేను భారతీయుణ్ణి. కళాకారుడికి ప్రాంతంతో పనిలేదు. నిజానికి నేను పెట్టింది, పెరిగింది తమిళనాటే. కానీ కళాకారుడిగా ఎదిగింది మాత్రం తెలుగునేలపై. ఇక్కడి ప్రజలు నన్ను సొంతం చేసుకున్నారు. మీ పూర్తి పేరు? పేరు ముందు ఇంటిపేరు పెట్టుకోవడం తెలుగువాళ్ల ఆచారం. పేరుకు ముందు తండ్రిపేరు పెట్టుకోవడం తమిళుల ఆచారం. మా నాన్నపేరు కల్యాణసుందరం. నా పూర్తి పేరు ‘కల్యాణసుందరం శివశంకర్’. నాట్యం వైపు మీ తొలి అడుగు ఎలా పడింది? అది నా పూర్వజన్మ సుకృతం. నా ఆశ, నా శ్వాస నృత్యం. నిజానికి నా కుటుంబంలో ఎవరూ కళాకారులు కారు. దైవదత్తంగా నాకీ విద్య అబ్బింది. డాన్స్ మాస్టర్ కావాలని ఈ రంగంలోకొచ్చాను. కాళ్లకు గజ్జెకట్టి అరంగేట్రం చేయాలనే కోరిక ఉండేది. నా పాతికో ఏట ఆ కోరిక తీరింది. సలీంగారి వద్ద దాదాపు పదేళ్లు సహాయకునిగా పనిచేశాను. అలాగే చిన్ని సంపత్, హీరాలాల్, పసుమర్తి కృష్ణమూర్తి లాంటి ఉద్దండుల వద్ద కూడా పనిచేశాను. నృత్య దర్శకునిగా తొలి అడుగు? పి.మాధవన్ దర్శకత్వం వహించిన ‘కురివిక్కూడు’ నా తొలి చిత్రం. తెలుగులో తొలి సినిమా ‘కాయ్ రాజా కాయ్’. పరుచూరి బ్రదర్స్ డెరైక్ట్ చేశారు. తొలినాళ్లలో క్రాంతికుమార్‌గారు బాగా ప్రోత్సహించారు. నృత్య దర్శకునిగా నేటి తరం స్పీడ్‌ని ఎలా తట్టుకోగలుగుతున్నారు? దాని కోసం ప్రత్యేకమైన కసరత్తులేం చేయను. నా ప్రతిభే నన్ను నిలబెడుతోంది. శివశంకర్ అనగానే చాలామంది సంప్రదాయ నృత్యమే అనుకుంటారు. నేను అన్ని రకాల డాన్సులూ చేయగలను. బాలకృష్ణ, విజయశాంతి నటించిన ‘దేశోద్దారకుడు’లో నేను చేసిన బ్రేక్‌డాన్స్ మూమెంట్స్ అప్పట్లో ఓ సంచలనం. దాదాపు అందరు హీరోలతో పనిచేశాను. మహేష్, ప్రభాస్‌లతో తప్ప. త్వరలోనే వారితో కూడా పనిచేస్తా. ప్రభాస్ ‘బాహుబలి’కి మీకు కచ్చితంగా పిలుపురావాలే? అదే జరిగితే నా పంట పండినట్లే. దర్శకుడు రాజమౌళి ఎవరిదగ్గరైనా అద్భుతంగా పని రాబట్టుకోగల దిట్ట. దాసరి, రాఘవేంద్రరావు తర్వాత తెలుగు సినిమాకు దొరికిన ఆణిముత్యం ఆయన. రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగ, మగధీర చిత్రాలకు పనిచేశాను. ‘బాహుబలి’ చేస్తే ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. మీ అభ్యున్నతి విషయంలో కుటుంబం పాత్ర ఎంత? చాలానే ఉంది. నా భార్యపేరు సుకన్య శివశంకర్. నా ఎదుగుదలలో ఆమె పాత్ర చాలానే ఉంది. మా పెద్దబ్బాయి పేరు విజయ్ శివశంకర్, చిన్నబ్బాయి పేరు అజయ్ శివశంకర్. ఇద్దరూ డాన్సు మాస్టర్లే. డాన్స్ మాస్టర్‌గా మీ లక్ష్యం? ఒక స్కూల్ పెట్టాలని ఉంది. తమిళనాడులో అది సాధ్యం కాదు. నృత్యాన్ని అమితంగా ఇష్టపడే తెలుగునాటే అది సాధ్యం. సరైన సహకారం లభిస్తే తప్పకుండా కోరిక తీర్చుకుంటా. అలాగే.. ప్రస్తుతం డాన్సులన్నీ ఒకేరీతిలో ఉంటున్నాయి. ఆ విధానానికి స్వస్తి పలకాలని ఉంది. నాట్యంలో వివిధ రకాల ప్రయోగాలు చేయాలని ఉంది. -
శివశంకర్ మృతికి ఎన్టీటీపీఎస్ అధికారుల సంతాపం
ఇబ్రహీంపట్నం,న్యూస్‌లైన్ : ఎన్టీటీపీఎస్లో ఉద్యోగం చేస్తూ రాష్ట్రస్థాయి కార్మిక నాయకుడిగా ఎదిగిన వేజండ్ల శివశంకర్‌రావు ఆకస్మికంగా మృతి చెందడం దురదృష్టకమరమని ధర్మల్ కేంద్రం ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ కెఎస్.సుబ్రమణ్యరాజు పేర్కొన్నారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేజండ్ల సంతాప సభ బుధవారం ఎన్టీటీపీఎస్లోని మూడవ అంతస్తు భవనంలో ఏర్పాటు చేశారు. వేజండ్ల చిత్ర పటానికి పూల దండ వేసి నివాళ్లర్పించిన ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక శాంతిని నెలకొల్పడంలో యాజమాన్యానికి ఆయన పూర్తిగా సహకరించారని అన్నారు. పారిశ్రామిక సంబంధాల్లో నూతన ఒరవడికి నాంది పలికి నిస్వార్థ సేవలో పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రెండవ దశ పర్యవేక్షక ఇంజనీర్ జి.శ్రీరాములు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుడి నుంచి జేపీఏగా 1996లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి కష్టపడి పనిచేసే వారని, 2011లో ఫోర్మేన్ గ్రేడ్-2 గా పదోన్నతి పొందారని తెలిపారు. కార్యక్రమంలో 1535 యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్.వెంకట్రావు, అధ్యక్షుడు జాన్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు పీ రాధాకష్ణ, వైస్ ప్రెసిడెంట్ పీ శ్రీనివాసరావు, హెచ్ 43 అధ్యక్షుడు వీ మధుప్రకాశ్‌రెడ్డి, కోశాధికారి వీ శ్రీనివాసరావు, ఏపీ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.