శివశంకర్ మృతికి ఎన్టీటీపీఎస్ అధికారుల సంతాపం
Published Thu, Aug 8 2013 1:57 AM | Last Updated on Sat, Aug 18 2018 9:09 PM
ఇబ్రహీంపట్నం,న్యూస్‌లైన్ : ఎన్టీటీపీఎస్‌లో ఉద్యోగం చేస్తూ రాష్ట్రస్థాయి కార్మిక నాయకుడిగా ఎదిగిన వేజండ్ల శివశంకర్రావు ఆకస్మికంగా మృతి చెందడం దురదృష్టకమరమని ధర్మల్ కేంద్రం ఇన్‌చార్జి చీఫ్ ఇంజనీర్ కెఎస్.సుబ్రమణ్యరాజు పేర్కొన్నారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేజండ్ల సంతాప సభ బుధవారం ఎన్టీటీపీఎస్‌లోని మూడవ అంతస్తు భవనంలో ఏర్పాటు చేశారు. వేజండ్ల చిత్ర పటానికి పూల దండ వేసి నివాళ్లర్పించిన ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక శాంతిని నెలకొల్పడంలో యాజమాన్యానికి ఆయన పూర్తిగా సహకరించారని అన్నారు.
పారిశ్రామిక సంబంధాల్లో నూతన ఒరవడికి నాంది పలికి నిస్వార్థ సేవలో పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రెండవ దశ పర్యవేక్షక ఇంజనీర్ జి.శ్రీరాములు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుడి నుంచి జేపీఏగా 1996లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి కష్టపడి పనిచేసే వారని, 2011లో ఫోర్‌మేన్ గ్రేడ్-2 గా పదోన్నతి పొందారని తెలిపారు. కార్యక్రమంలో 1535 యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్.వెంకట్రావు, అధ్యక్షుడు జాన్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు పీ రాధాకష్ణ, వైస్ ప్రెసిడెంట్ పీ శ్రీనివాసరావు, హెచ్ 43 అధ్యక్షుడు వీ మధుప్రకాశ్‌రెడ్డి, కోశాధికారి వీ శ్రీనివాసరావు, ఏపీ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.
Advertisement