ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీని పేరుకి తగ్గట్టుగానే ఈ కుంభ మేళ ఆధ్యాత్మిక గురువులుగా మారిన మహా మహా మేధావులను పరిచయం చేసింది. ఎందరో గొప్ప గొప్ప చదువులు చదివి వాటన్నింటిని పరిత్యజించి సాధువుగా జీవిస్తున్న వాళ్లను కళ్లకుకట్టినట్లు చూపించింది.
చూడటానికి సాదాసీదా సాధువుల అనుకుంటే పొరపడ్డట్టే.. అనేలా వాళ్ల చరితలు ఉన్నాయి. వారంతా ఏకంగా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో చదివి, మంచి జీతాలతో హుందాగా జీవించినవారే. ఆధ్యాత్మికతకు ఆకర్షితులై..అందుకోసమే జీవితాన్ని అర్పించి..సాధువులుగా జీవిస్తూ..అందర్నీ ఆశ్చర్యచికితుల్ని చేశారు. వారి జీవన విధానం మహాత్తర జీవన సారాన్ని గురించి వెలుగెత్తి చాటింది. అలాంటికోవకు చెందిన వ్యక్తే ఈ మహకుంభమేళలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతనెవరంటే..
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh,)ని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో పాల్గొని త్రివేణి సంగమ పవిత్ర జలాల్లో స్నానమాచరించి తరిచేందుకు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. ఈ ఆధ్మాత్మిక సంబరంలో మునిగితేలుతున్న ఎందరో సాధువులు, రుషులు, మత గురువుల మధ్య ఓ వ్యక్తి మీడియా దృష్టిని ఆకర్షించాడు. అతడే హర్యానా(Haryana,)కు చెందిన అభిసింగ్(Abhey Singh). ఆయన్ని అంతా ఇంజనీర్ బాబాగా పిలుస్తారు.
ఎంతో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి అకస్మాత్తుగా దైవ చింతన వైపుగా మళ్లాడు. అంతే ఇక వెంటనే ఉన్నతోద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా విడిచి పెట్టి సన్యాసిలా జీవిస్తున్నాడు. అతడి కథ వింటే విస్తుపోతారు. అంతటి హోదాను వదలుకుని సాదాసీధాగా బతకాలని ఎలా నిర్ణయించుకున్నాడు?. ఇది మనోనిబ్బరమా..? ఆధ్యాత్మికతకున్న శక్తినా? అనేది మాటలకందనిది.
ఇక్కడ అభిసింగ్ ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్(Aerospace Engineer) డిగ్రీని పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్ మంచి ఉద్యోగాన్ని కూడా పొందాlo. అయితే ఇది తన కెరీర్ కాదని త్రీ ఇడియట్స్‌లోని మాధవన్ మాదిరి ఫోటోగ్రఫీపై మక్కువతో ట్రావెల్ ఫోటోగ్రఫీ కెరీర్ వైపుకి మళ్లాడు.
ఆ కళ అతనికి జీవతం విలువ, తత్వశాస్త్రం గురించి తెలుసుకునేందుకు దోహదపడింది. ఆ తర్వాత భౌతిక శాస్త్రాన్ని బోధించే కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు. అలా ఓ ఎంటర్‌ప్రెన్యూర్ టీచర్‌గా మంచి సక్సెస్‌ని కూడా అందుకున్నాడు. అయినా అవేమి అతడికి సంతృప్తినివ్వలేదు. క్రమంగా అతడి మనసు దైవ చింతన, ఆధ్యాత్మికత వైపుకి దృష్టిమళ్లింది.
అందులో మమేకమై..గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస రేకెత్తింది. అలా అతను శివ సాధువుగా మారిపోయాడు. ఆయన తరచుగా అంతా శివమయం, సత్యమే శివుడు అని మాట్లాడుతుంటాడు. అంతేగాదు ఇంత సాధారణంగా ఉండే ఇంజనీరింగ్ బాబాకు సోషల్ మీడియాలో దాదాపు 30 వేలకు పైగా మంచి ఫాలోయింగ్ ఉంది కూడా.
ప్రస్తుతం ఈ కుంభమేళలో పాల్గొన్న ఆయన అక్కడకు వచ్చిన మీడియా ముందు జర్నలిస్ట్‌లతో అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడటంతో అతడెవరనే ఉత్సుకతను రేకెత్తించింది. ఈ క్రమంలోనే అతడి ఆధ్మాత్మికత ప్రయాణం వెలుగులోకి వచ్చింది.
(చదవండి: సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ ఆరోగ్యానికి మంచి గేమ్ ఛేంజర్..!)
Comments
Please login to add a commentAdd a comment