monk
-
82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క స్త్రీని కూడా చూడకుండా ఉండే అవకాశం లేదు. సన్యాసీ జీవితాన్ని అనుసరించిన బాల్యదశలో అయిన తల్లి లేదా నానమ్మ, తోబుట్టువుల రూపంలో ఆడవాళ్లను చూడటం జరుగుతుంది. కానీ ఈ వ్యక్తి తన జీవితకాలంలో ఒక్క స్త్రీని కూడా చూడలేదట. మరణాంతరం వరకు ఒక్క స్త్రీని కూడా చూడని, కలవని ఏకైక వ్యక్తిగా నిలిచాడు. అతడెవరంటే..గ్రీస్ దేశానికి చెందిన మిహైలో టొలటోస్ అనే వ్యక్తి 1856లో తను పుట్టిన నాలుగు గంటలకే తల్లి చనిపోయింది. ఆ పసికందుని పెంచుకునేందుకు ఎవ్వరు ముందుకు రాలేదు. ఆ పసికందుని మౌంట్ అతోస్ అనే పర్వతంపైన ఉన్న ఆశ్రమం మెట్లపై నిర్ధాక్షణ్యంగా వదిలేసి వెళ్లిపోయారు. ఆశ్రమం మెట్లపై కనిపించిన ఆ పసికందుని అక్కడ ఆశ్రమ వాసులు చేరదీశారు. అతడికి మిహైలో టొలటోస్ అనే నామకరణం చేసి ఆశ్రమ పద్ధతులకు అనుగణంగా పెంచారు. దీంతో మిహైలో బాల్యం మంతా ఆశ్రమంలోనే సాగింది. అక్కడే చదువుకుని పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే ఆశ్రమలో "మోక్స్ అవటోన్ అనే యూనిక్ రూల్"ని ఫాలో అవుతారు. ఈ రూల్ ప్రకారం మౌంట్ అథోస్ పర్వతం పైకి మహిళలకు ఎంట్రీ పూర్తిగా నిషేధం. అక్కడ కేవలం ఆశ్రమ జీవితమే గడపాలి, సన్యాసం తీసుకోవాలి. అంతేగాదు సన్యాసం తీసుకోవాలన్న పురుషులకు మాత్రమే ఎంట్రీ. ఈ కారణం చేతనే తన జీవిత కాలంలో ఎప్పుడూ స్త్రీలను చూడలేదు. అయితే సన్యాసం స్వీకరించేందుకు ఆశ్రమానికి వచ్చిన వారంతా ఏదోఒక సందర్భంలో మహిళలను చూసినవారే. కానీ మిహైలో విషయం అలా కాదు.తన జీవితాంతం ఆధ్యాత్మిక మార్గంలోనే పయనించి 1938లో 82 ఏళ్ల వయసులో మరణించాడు. అలా ఈ ప్రపంచంలో ఆడవాళ్లను చనిపోయేంత వరకు చూడని ఏకైక వ్యక్తిగా మిహైలో నిలిచాడు. అతడి గురించి వార్తాప్రతికల్లో రావడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే అథోస్ పర్వతాల సమీపంలో ఆడ జంతువులు ఉండటం గానీ గుడ్లు పెట్టే పక్షులు, పాలిచ్చే క్షీరదాలు గానీ కనిపించవట. అందువల్ల అక్కడ సన్యాసులకు ఏం కావల్సిన బయట నుంచి లభించేలా నుంచి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయట. అంతేగాదు ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుందట. ప్రతి రోజు దాదాపు రెండువేల మంది పురుష పర్యాటకులు సందర్శిస్తుంటారని సమాచారం.(చదవండి: ‘నీల్’ కాన్సెప్ట్' ఒకే ఒక రంగుతో అద్భుతం ..!) -
అపుడు భిక్షాటన...ఇపుడు డాక్టరమ్మగా! ఇంట్రస్టింగ్ జర్నీ
అదృష్టం కలిసి వస్తే.. ఏ స్థితిలో ఉన్నా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అందివచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుంటే ఆకాశమంత ఎత్తు ఎదగవచ్చు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మురికి వాడలో పుట్టిన పింకీ ప్రేరణాత్మక కథ చదివితే ఈ మాటలు అక్షరాలా నిజం అనిపిస్తుంది.స్టోరీ ఏంటీ అంటే: పండుగ సీజన్లో కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలోని మెక్లియోడ్గంజ్లోని బుద్ధ దేవాలయం దగ్గర తన తల్లి కృష్ణతో కలిసి పింకీ హర్యాన్ అనే బాలిక భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేది. అయితే 2004లో ఆమె అదృష్టవశాత్తూ టిబెటన్ బౌద్ధ సన్యాసి జమ్యాంగ్ కంటపడింది. జమ్యాంగ్ ఆమెను ఆదరించి సాయం చేశాడు. విద్యాబుద్ధులు నేర్పించాడు. చివరికి చైనీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ధర్మశాలకు తిరిగి వచ్చింది.#WATCH | Dharamshala: "I was 4.5 years old when I came to the hostel and before that, my mother and I used to beg...In 2004 Guru ji selected me and I am grateful for that...I am also grateful to my parents that they gave me a chance to get my education...," says Pinki Haryan,… https://t.co/czbhOFjfHB pic.twitter.com/HTQEg7HsoE— ANI (@ANI) October 4, 2024అయితే ఈ జర్నీ అంత ఈజీగా జరగలేదు. బిచ్చమెత్తుకుంటూ కనిపించిన బాలిక కోసం వెదికి, చరణ్ ఖుద్ వద్ద ఉన్న మురికివాడను సందర్శించి బాలికను గుర్తించాడు. ఆమెను చదివిస్తానని చెప్పాడు. కానీ ఇందుకు ఆమె తండ్రి మొదట్లో ఇష్టపడలేదు. ధర్మశాలలోని దయానంద పబ్లిక్ స్కూల్‌కు పంపమని పింకీ హర్యాన్ తల్లిదండ్రులను ఒప్పించాడు. చివరికి పింకీ తండ్రి కాశ్మీరీ లాల్ అంగీకరించి, కొత్తగా ప్రారంభించిన టోంగ్లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ హాస్టల్‌కు పంపడంతో అసాధారణ ప్రయాణం మొదలైంది. పింకీ హర్యాన్ చదువులో బాగా రాణించింది. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి తర్వాత నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. కానీ ఇక్కడ ఫీజులు చాలా ఎక్కువ కాబట్టి 2018లో చైనాలోని ప్రతిష్టాత్మకమైన వైద్య విశ్వవిద్యాలయంలో చేరింది. ఆరేళ్ల ఎంబీబీఎస్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ధర్మశాలకు తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా "నా తండ్రి చెప్పులు కుట్టేవాడు , బూట్లకు పాలిష్ చేయడం ద్వారా జీవనం సాగించేవాడు అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. తన విజయానికి తాను టిబెటన్ సన్యాసి జమ్యాంగ్కు రుణపడి ఉన్నానని, ఇప్పుడు పేదరికం కారణంగా చదువుకునే స్థితిలో లేని ఇతర పేద పిల్లలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పింకీ చెప్పింది. చిన్నప్పుడు, మురికివాడలో నివసించాను కాబట్టి నా నేపథ్యమే అతిపెద్ద ప్రేరణ అని తెలిపింది. అంతేకాదు పింకీ ప్రేరణతో ఆమె సోదరుడు, సోదరి అదే ఎన్జీవో పాఠశాలలో చేరడం విశేషం. కాగా డబ్బు సంపాదించే యంత్రాలుగా మారడానికి బదులుగా మంచి మానవులుగా మారడానికి పిల్లలను మార్చడమే సన్యాసి జమ్యాంగ్ లక్ష్యమని, గత 19 సంవత్సరాలుగా ఎన్జీవో టోంగ్లెన్ ట్రస్ట్‌తో అనుబంధం కలిగి ఉన్న సిమ్లాలోని ఉమంగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆయన తన జీవితమంతా ధర్మశాల, మురికివాడల పిల్లలకు అంకితం చేశాడన్నారు. జమ్యాంగ్ దత్తత తీసుకున్న పిల్లలంతా ఒకప్పుడు అడుక్కునేవారు లేదా చెత్తను ఏరేవారే. కానీ ఇప్పుడు వాళ్లంతా డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, హోటల్ మేనేజర్లుగా మారారని చెప్పారు. జమ్యాంగ్ 1992లో టిబెట్ నుండి తప్పించుకుని నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చాడు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పేదరికం ఆయనను కదిలించింది. పేదలకు సాయం చేయడం, ముఖ్యంగా మురికివాడల్లో పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు -
రెండు దశాబ్దాల ఎదురుచూపు ఫలించింది: అంతలోనే ట్విస్ట్
కొంగట్టుకు తిరుగుతూ కబుర్లు చెప్పే బిడ్డ కళ్లముందునుంచి అదృశ్యమైతే, ఆ వేదన వర్ణనాతీతం. ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియక ఆ తల్లిపేగు అల్లాడిపోతుంది. కానీ రెండుదశాబ్దాల తరువాత ‘అమ్మా’ అంటూ తిరిగొస్తే.. కలో మాయో తెలియని అయోమయంలో అకస్మాత్తుగా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే.. ఎన్డీవీటీ కథనం ప్రకారం ఢిల్లీలో నివసించే రతీపాల్ సింగ్, భానుమతి కుమారుడు పింకు. పింకు 2002లో దాదాపు పదకొండేళ్ల వయస్సులో తండ్రితో చిన్న తగాదాపడటంతో తల్లి మందలించింది. అంతే క్షణికావేశంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొడుకు కోసం ఎంతవెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎప్పటికైనా రాకపోతాడా అనే ఆశతో జీవిస్తున్నారు. వారి ఆశలు ఫలించి 22 ఏళ్ల తరువాత అమేథిలోని తన అమేథీలోని ఖరౌలిగ్రామానికి వచ్చాడు పింకు. అతణిని గుర్తించిన స్థానికులు, బంధువులు ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పరుగున పరుగున వచ్చి కన్నవాళ్లు పింకూ శరీరంపై ఉన్న మచ్చను చూసి పింకూని గుర్తుపట్టారు. ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సన్యాసిలా మారిపోయిన తమ కుమారుడి పరిస్థితి చూసి ఆవేదనకు లోనయ్యారు. ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి సంపన్నమైన రాజ్యాన్ని విడిచిపెట్టి సన్యాసిగా మారిన రాజు లాంటి జానపద కథలు చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేస్తూ కాలం గడిపాడు. చివరికి పుట్టిన ఊరును, కన్నతల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. కన్నతల్లి గుండెలు పగిలే మరో ట్విస్ట్ ఏంటంటే.. తల్లిదండ్రులను ఓదార్చుతూనే, మళ్లీ తాను వెళ్లిపోవాలని తేల్చి చెప్పాడు పింకూ. వారు ఎంత మొర పెట్టుకున్నా వినకుండా, మీతో కలిసి జీవించలేనంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. అంతేకాదు ఒక సన్యాసిగా తప్పనిసరిగా తల్లి నుండి భిక్షను స్వీకరించే కర్మను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు చెప్పాడు. ఈ పరిణామంతో వారు ఆవేదనలో మునిగిపోయారు. అయితే తమ కుమారుడికి చెందిన మతపరమైన విభాగం పింకూని విడిచిపెట్టడానికి రూ.11 లక్షలు అడుగుతోందని పింకు తండ్రి ఆరోపించాడు. రూ.11లు కూడా లేని తాము సొమ్ము ఎక్కడనుంచి తేవాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #Delhi | Boy, who went missing 22 years ago, returns to mother as a monk. Read here: https://t.co/YWDMh5u9aT pic.twitter.com/HQeEA78XCY — NDTV (@ndtv) February 7, 2024 -
జైనముని హత్య.. అట్టుడుకుతున్న కర్ణాటకం
శివాజీనగర(కర్ణాటక): బెళగావి జిల్లా చిక్కోడి వద్ద ఉన్న నంది ఆశ్రమం జైనముని కామకుమార నంది హత్యపై సోమవారం విధానసౌధలో ఉభయ సభల్లో తీవ్ర చర్చ జరిగింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. విధానసభ మొదలు కాగానే బీజేపీ నేత బసవరాజ బొమ్మై వాయిదా తీర్మానం కింద జైనముని హత్యపై చర్చించాలని స్పీకర్ యూ.టీ.ఖాదర్‌కు విన్నవించారు. చివరకు జీరో అవర్‌లో చర్చ ఆరంభమైంది. బీజేపీ సభ్యులు అభయ్ పాటిల్, బసవనగౌడ పాటిల్ యత్నాళ్, శశికళా జొల్లె తదితరులు మాట్లాడుతూ జైనముని హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. చరిత్రలోనే మునుపెన్నడూ జరగని సంఘటన ఇదని అన్నారు. జైన సముదాయానికి భంగం వాటిల్లింది, పోలీసులు సక్రమంగా విచారణ జరపలేరు, సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టారు. హత్యలో తొలి నిందితుడైన నారాయణ మాళియను అరెస్ట్ చేసి, రెండో నిందితుడు హసేన్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యుడు లక్ష్మణ సవది ఈ హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి హంతకులకు మరణశిక్ష విధించాలన్నారు. డబ్బు కోసమే హత్య జరిగిందనేది అవాస్తవమని వీరందరూ అన్నారు. జైనముని హత్య జరిగి మూడు రోజులు గడిచినా కూడా ముఖ్యమంత్రి సంతాపం తెలపలేదు, వేరే మతాలవారైతే చూస్తూ మౌనంగా ఉండేవారా? హిందువులకు భద్రత లేదా అని యత్నాళ్ ఘాటుగా ప్రశ్నించారు. నిందితులను దాచిపెడుతున్నారు సభాపతి యూటీ ఖాదర్ జోక్యం చేసుకుంటూ, జైనముని హత్య భయంకరమైనది. నిందితులకు కఠిన శిక్ష విధించాలి. ఇందులో రాజకీయం చేయరాదని సలహానిచ్చారు. బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ భయంకరమైన హత్యతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసులో మిగతా నిందితుల పేర్లను ఎందుకు బహిరంగపరచటం లేదు. ఎందుకు నిందితులను కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఇదే మాదిరిగా విధాన పరిషత్‌లో కూడా జైనముని హత్య కేసుపై గందరగోళం నెలకొంది. మంత్రులు హెచ్‌కే పాటిల్, ప్రియాంక్ ఖర్గేలు మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేస్తారని తెలిపారు. మరోవైపు హత్యను ఖండిస్తూ చిక్కోడిలో జైనసంఘాల వారు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హోంమంత్రి హుబ్లీ: బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా హిరేకోడి ఆశ్రమం జైనముని కామకుమార నంది మహారాజ హత్యోదంతంపై రాజకీయ చేయరాదని, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని హోంమంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన నగర విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎవరూ కూడా పక్షపాతం చూపరని అన్నారు. జైనముని అదృశ్యంపై ఫిర్యాదు నమోదైన తక్షణమే పోలీసులు అన్వేíÙంచారన్నారు. బావిలో వేసిన మృతదేహాన్ని కనుగొని చర్యలు తీసుకున్నారన్నారు, పోలీసులు బాగా పనిచేశారని అభినందిస్తున్నానన్నారు. హత్యపై నిరసనకు దిగిన జైనమునితో తాను కూడా మాట్లాడానని, వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చానన్నారు. హత్య కేసును సీబీఐకు అప్పగించాలన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించామని, ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: ఈ జైనమునిని ఎందుకింత కర్కశంగా హత్య చేశారు? -
40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?
సత్యాన్వేషణలో రాజ్యాన్ని భార్యా బిడ్డల్నీ త్యజించిన సిద్ధార్థుడి గురించి చదువుకున్నాం. ప్రజలకోసం వేల ఎకరాల సొంత ఆస్తిని వదులుకున్న కమ్యూనిస్టు నేతల గురించి విన్నాం. ఇపుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా మారే అవకాశాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్న బౌద్ధ సన్యాసి గురించి తెలుసుకుందాం. ఆయనే బుద్ధిస్ట్ మాంక్ వెన్ అజాన్ సిరిపన్యో. బిలియనీర్ ఆనంద కృష్ణన్ ఏకైక కుమారుడు. సిరిపన్యో గురించి తెలుసుకునేముందు అతని తండ్రి ఆనంద కృష్ణన్ గురించి తెలుసుకోవాలి. రూ. 40,000 కోట్ల సంపద మలేషియా-తమిళ వ్యాపారవేత్త బిజినెస్టైకూన్. తత్పరానందం ఆనంద కృష్ణన్‌ను ఏకే అని కూడా పిలుస్తారు. టెలికాం, మీడియా, ఉపగ్రహాల్లో వ్యాపారం, అయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్ లాంటి వాప్యారాల్లో ఆరితేరిన దిగ్గజం. దీంతోపాటు కృష్ణన్‌కి కలిపి కనీసం 9 కంపెనీల్లో వాటాలున్నాయి. ఈ భారీ సంపద మలేషియా టాప్ బిలియనీర్లలో మూడోవాడిగా ఆనంద్ కృష్ణన్‌ను నిలిపింది. అంతేకాదు ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని నేతృత్వంలోని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌కు స్పాన్సర్ చేసిన భారతీయ ఫోన్ కంపెనీఎయిర్సెల్ యజమాని. సిరిపన్యోతోపాటు, కృష్ణన్‌కి ఇద్దరు కుమార్తెలున్నారు. (వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్తి తెలిస్తే..?) 18 ఏళ్లకే సన్యాసం మలేషియాలో విద్య, కళలు, క్రీడలు తదితర విషయాల్లో భూరి విరాళాలిచ్చిన గొప్ప పరోపకారి. ఆనంద కృష్ణన్ కూడా బౌద్ధుడే కావడం గమనార్హం. బహుశా ఈ నేపథ్యమే ఆయన కుమారుడు సిరిపన్యో కేవలం 18 సంవత్సరాల వయస్సులో బౌద్ధ సన్యాసిగా మారడానికి దారి తీసి ఉంటుంది. సరదా కోసం సన్యాసం స్వీకరించిన అతను చివరికి శాశ్వత సన్యాసిగా మారిపోయినట్టు తెలుస్తోంది. అలా తండ్రినుంచి వచ్చిన కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని వదులుకొని ఆధ్యాత్మిక శాంతికోసం దాదాపు రెండు దశాబ్దాలుగా పైగా సిరిపన్యో భిక్షాటన చేస్తూ జీవించడం ప్రముఖంగా నిలుస్తోంది. సిరిపన్యో తల్లి థాయ్ రాజ కుటుంబానికి చెందిన వారట. యూకేలో తన 2 సోదరీమణులతో పెరిగిన సిరిపన్యో ఇంగ్లీష్, తమిళం, థాయ్ పాటు దాదాపు 8 భాషలు మాట్లాడ గలడని ప్రతీతి. అతని కదలికలు, వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. కానీ ఒకసారి ఇటలీలో తండ్రి 70వ పుట్టినరోజు సందర్భంగా కృష్ణన్‌ను కలవడానికి ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తుండగా గుర్తించినట్టు చెబుతారు. "నా సంపదతో నా స్వంత కొడుకును పోషించే స్తోమత కూడా లేదు" అని తన కుమారుడు సన్యాసిగా మారిపోయిన వైనాన్ని గుర్తించిన కృష్ణన్ వ్యాఖ్యానిచారట. -
బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?
దేశ రాజధానిలో గూఢచర్య కలకలం రేగింది. బౌద్ధ సన్యాసి వేషంలో ఉన్న ఓ మహిళను చైనా పౌరురాలిగా నిర్ధారించుకున్న ఢిల్లీ పోలీసులు.. పలు అభియోగాల కింద ఆమెను అరెస్ట్ చేశారు. మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఆమె.. కీలక సమాచారం ఏమైనా చైనాకు చేరవేసిందా? ఏదైనా కుట్రకు తెర తీసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ ఉత్తరంగా ఉన్న టిబెట్ శరణార్థి శిబిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూఢచర్యానికి పాల్పడిందనే అనుమానంతో పాటు చోరీలకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే అనుమానంతోనూ ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు చెందిన డోల్మా లామా అనే బౌద్ధ సన్యాసి.. టిబెట్ శరణార్థి కాలనీలోని మంజు కా టిల్లాలో ఉంటున్నాడు. అయితే అతను అతను కాదని.. ఆమె అని పోలీసులు వెల్లడించారు. చైనాకు చెందిన కాయ్ రువో(30).. బౌద్ధ సన్యాసి వేషంలో ఇక్కడికి వచ్చినట్లు తేల్చారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సేకరించిన ఆధారాలతో అతన్ని.. ఆమెగా ప్రకటించారు పోలీసులు. చైనీస్ పాస్‌పోర్ట్‌తో 2019లో భారత్‌లోకి కాయ్ రువో ప్రవేశించిందని ప్రకటించారు. ఇంగ్లీష్‌తో పాటు మాండరిన్, నేపాలీ భాషలను ఆమె మాట్లాడుతోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే.. చైనా కమ్యూనిస్ట్ నేతలు కొందరు తనను చంపే యత్నం చేస్తున్నారని.. తప్పించుకునేందుకు ఇలా వేషం కట్టినట్లు ఆమె ప్రాథమికంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు ఆమెను క్షుణ్ణంగా విచారించాలని నిర్ణయించుకున్నారు. ఇదీ చదవండి: ఎవరూ ఎత్తుకెళ్లలే.. గ్యాంగ్ రేప్ చేయలే!! -
నమ్మలేని నిజం.. 10 ఏళ్లకుపైగా ఎత్తిన చేతిని దించలేదు..!
మీ చేతిని పైకి ఎత్తి ఎంత సమయం వరకు ఉండగలరు? మహా అయితే ఓ 10-20 నిమిషాలు అతి కష్టంతో పైకి ఎత్తి ఉంచగలరేమో. కానీ, గంటలు కాదు, రోజులు కాదు.. ఏళ్ల తరబడి ఎత్తిన చేతిన దించకుండా ఉండటం అంటే నమ్మశక్యంగా లేదు కదా. అయితే, అది నిజం. ఓ సాధువు దానిని గతంలోనే చేసి చూపించారు. 70 ఏళ్ల సాధువు అమర్ భర్తీ.. సుమారు 50 ఏళ్లకుపైగా తన కుడి చేతిని పైకే ఎత్తి ఉంచినట్లు అప్పట్లో తెగవైరల్గా మారింది. తొలి రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదటా! కానీ అది క్రమంగా తగ్గిపోయిందని, ఆ తర్వాత ఎలాంటి నొప్పిలేదని సాధువు అమర్ భర్తీ వెల్లడించారు. మరోవైపు.. ఆ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవటం వల్లే ఎలాంటి నొప్పి కలగటం లేదని, ఇకపై ఆ చేతిని కిందకు దించలేదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. 1973 వరకు అమర్ భర్తీ ఒక సాధారణ వ్యక్తే. అందరిలా వివాహం చేసుకుని పిల్లాపాలతో జీవించేవారు. ఆ తర్వాత తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలని నిశ్చయించుకుని సాధువుగా మారారు. తనలోని శివుడిపట్ల ఉన్న నిబద్ధతను చాటుకునేందుకు కుడి చేతిని పైకి ఎత్తి ఉంచటం మొదలు పెట్టారు. భర్తీ అంశం 2020లోనే వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే భర్తీ లాగే మరో వ్యక్తి చేతిని పైకి ఎత్తి ఉంచుతుండటం వెలుగులోకి వచ్చింది. అమర్ భర్తీ 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయలేకపోయినా.. తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకి ఎత్తే ఉంచుతానని చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా చేతిని పైకి ఎత్తే ఉంచానని వెల్లడించారు. ఓ రిపోర్టర్ సాధువుతో మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్ని రోజుల పాటు ఇలా చేతిని పైకి ఎత్తి ఉంచుతారని విలేకరి ప్రశ్నించగా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చేతిని పైకి ఉంచే నిద్రపోతానని, ఆ సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలిగినట్లు అనిపించదని తెలిపారు. Guy from India hasen't put his arm down for 10 Years to honor his God 😱#amazing #india #pandit #guru #sacrifice #ENGvIND @unexpected_new pic.twitter.com/ldAVoXpMJi — Next Level (@NextInteresting) September 24, 2022 ఇదీ చదవండి: Viral Video: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు -
బ్యాంకు వద్ద తుపాకితో సన్యాసి హల్చల్... షాక్‌లో ఉద్యోగులు
చెన్నై: ఒక బ్యాంకు వద్ద సన్యాసి తుపాకితో హల్ చల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్‌లో చోటు చేసుకుంది. ఒక సన్యాసి రైఫిల్ చేతపట్టుకుని బ్యాంకు ఉద్యోగులపై బెదరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తిరుమలై స్వామి అనే సన్యాసి తిరువారూర్ జిల్లాలోని మూలంగుడి గ్రామ నివాసి. ఆ సన్యాసి తన కుమార్తె చదువు కోసం లోన్ కావాలంటూ ఒక ప్రైవేట్ బ్యాంకు వద్దకు వచ్చాడు. తన కూతురు చైనాలో మెడిసిన్ చదివేందుకు లోన్ కావాలని అడిగాడు. అందుకు హామీ పత్రాలు సమర్పించాల్పి ఉంటుందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐతే సన్యాసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేందుకు నిరాకరించాడు. తానే వడ్డితో సహా కట్టేస్తాను కాబట్టి హామీ పత్రాలు ఎందుకంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అధికారులు వివరంగా చెప్పేందుకు యత్నించినా ససేమిరా అన్నాడు. చేసేదేమి లేక బ్యాంకు అధికారుల లోన్ ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో సన్యాసి ఇంటికి వెళ్లి తుపాకిని తీసుకుని లోన్ ఇస్తారా? లేదా? అని ఉద్యోగులను బెదిరించడం ప్రారంభించాడు. సామాజిక మాధ్యమాల్లో సైతం సదరు సన్యాసి లోన్ ఇవ్వనందుకు బ్యాంకును లూటీ చేస్తానంటూ లైవ్ వీడియోని పోస్ట్ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సదరు సన్యాసిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఘోరం: మరుగుదొడ్డిలో ఆటగాళ్లకు భోజనం) -
కుప్పకూలిన విమానం: 12 మంది దుర్మరణం
న్యాపిడా: ఘోర విమాన ప్రమాదం సంభవించి ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసితో పాటు మొత్తం 12 మంది మృతి చెందిన సంఘటన మయన్మార్‌లో చోటుచేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో సైనిక విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. న్యాపిడా నుంచి పైన్ ఓ ఎల్విన్ నగరానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మఠం శంకుస్థాపన చేసేందుకు విమానం పై ఓ ఎల్విన్ పట్టణానికి వెళ్తోంది. దేశ రాజధాని న్యాపిడా నుంచి గురువారం బయల్దేరిన కొద్దిసేపటికి కుప్పకూలింది. విమానంలో ఆరుగురి మిలిటరీ సిబ్బందితో పాటు ఇద్దరు బౌద్ధమత సన్యాసులు, ఆరుగురు భక్తులు ఉన్నారు. ప్రమాదంలో అందరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే వారిలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. అయితే ఘటనలో ఓ సైనికుడు ప్రాణాలతో బయటపడినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. 400 మీటర్ల ఎత్తుకు ఎగిరిన అనంతరం వాతావరణం సహకరించక సిగ్నల్స్ అందలేదు. దీంతో విమానం కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ దేశంలో సైనిక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా.. చదవండి: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
సన్యాసి అవతారంలో ధోని.. షాక్‌లో అభిమానులు
చెన్నై: ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోని కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సన్యాసి అవతారంలో నైరాశ్యంలో మునిగి ఉన్న ధోనిని చూసి అభిమానులు షాక్ తిన్నారు. కాగా ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోనీ.. అక్కడ సీఎస్కే క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం నెట్స్‌లో బౌలర్లని ఉతికారేస్తూ సిక్సర్ల వర్షం కురిపించిన ధోని అకస్మాత్తుగా ఇలా సన్యాసిగా మారిపోవడం ఏంటని నెటిజన్ల నోరెళ్లబెడుతున్నారు. సన్యాసిలా మారి నైరాశ్యంలో ఉన్న ధోని ఫోటోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. వాస్తవానికి ధోనీ అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అతని ఆట కంటే హెయిర్ స్టయిల్ గురించే ఎక్కువగా చర్చ నడిచింది. అప్పట్లో పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైతం ధోనీ జులపాల జుట్టుకి ముచ్చటపడ్డాడు. ఆ తర్వాత 2011లో భారత్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచాక గుండు చేయించుకున్న ధోనీ.. మొహక్ స్టయిల్ని కూడా ట్రై చేసేశాడు. గత ఏడాది ఐపీఎల్‌కి ముందు గుబురు గడ్డం, లేయర్డ్ హెయిర్‌తో కనిపించాడు. ధోనీ సన్యాసి అవతారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యాడ్ షూటింగ్ కోసం ధోనీ ఆ వేషం వేసినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. సన్యాసి అవతారంలో లేకపోయినా.. ధోనీ ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటాడని మరికొందరు చెప్పుకొస్తున్నారు. కాగా గతేడాది ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో ధోని కెప్టెన్సీలోని సీఎస్కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. చదవండి: వైరల్: ధోని సిక్సర్ల వర్షం.. సిక్సర్లతో యువీ, బౌండరీలతో సచిన్.. 😮😮😮 - our faces since we saw #MSDhoni's new avatar that could just break the Internet! 🙊What do you think is it about? pic.twitter.com/Mx27w3uqQh — Star Sports (@StarSportsIndia) March 13, 2021 -
వైరల్: వందేళ్ల కిందటి శవం నవ్వుతోందా?
బ్యాంకాక్: పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అచ్చం నవ్వుతున్నట్లుగా కనిపిస్తున్న ఈ సాధువు వందేళ్ల క్రితం మరణించాడని, అయినప్పటికీ అతని శరీరం, ముఖ్యంగా ఆ నవ్వు చెక్కు చెదరలేదంటూ వార్తలు ఊపందుకున్నాయి. దీంతో సాధారణ ప్రజానీకం అతడికి ఏదో శక్తులు ఉన్నట్లు భావిస్తూ ఇతరులకు తెగ షేర్ చేస్తున్నారు. పైగా ఆ సాధువు ఇంకా ధ్యాన ముద్రలోనే ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. వందేళ్ల క్రితం పెట్టెలో భ్రదపరిచిన ఇతని శరీరం ఈ మధ్యే మంగోలియాలోని ఉలాన్‌బాతర్‌లో లభ్యమైనట్లు పేర్కొంటున్నారు. (చదవండి: దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు) కాగా నిజానిజాలు నిగ్గు తేల్చే క్రమంలో ఈ వార్త పూర్తిగా కట్టుకథ అని నిర్ధారణ అయింది. అసలు నిజమేంటేంటే.. ఫొటోలో కనిపిస్తున్న సాధువు పేరు లుయాంగ్ ఫోర్ పియాన్. అతడు 2017లో అనారోగ్యం కారణంగా థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో ఓ స్థానిక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. అయితే అతడి మృతదేహాన్ని వెంటనే దహనం చేయలేదు. బౌద్ధుల ఆచారం ప్రకారం రెండు నెలల పాటు భద్రపరిచి తర్వాత ఆ శవానికి కొత్త వస్త్రాలు తొడిగించారు. ఆ సందర్భంలో తీసిన ఫొటో ఇది. కానీ అన్ని రోజుల తర్వాత కూడా సాధువు శరీరం ఏమాత్రం కుళ్లిపోకుండా ఉండటం గమనార్హం. ఇక ఆయన చనిపోయిన వంద రోజుల తర్వాత మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. (చదవండి: దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు!) వాస్తవం: ఫొటోలో కనిపిస్తున్న సన్యాసి వందేళ్ల క్రితం మరణించలేదు. -
గుండు వెనుక ఉన్న అసలు నిజం ఇదే!
-
చిరంజీవి గుండు వెనుక ఉన్న అసలు నిజం ఇదే!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా సరికొత్త లుక్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఈ లుక్‌లో చిరు గుండుతో, మీసాలు లేకుండా కనిపించారు. ఒక స్టైలిష్ కళ్లజోడు పెట్టుకొని ఉన్న ఫోటోను ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘అర్బన్ మాంక్’ లుక్ అనే పేరుపెట్టారు. చిరును ఆ లుక్‌లో చూసిన అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. పలువురు చిరు న్యూలుక్ సూపర్ అంటూ స్పందించారు. అయితే తాజాగా విడుదలయిన వీడియోతో చిరు గుండు వెనుక ఉన్న అసలు నిజం బయటపడిపోయింది. చిరు ఓ సినిమాలో క్యారెక్టర్ కోసం నిజంగానే గుండు చేయించుకొని ఉంటారని అందరూ భావించారు. అయితే చిరంజీవి గుండు చేయించుకోలేదని, ముగ్గురు మేకప్ ఆర్టిస్ట్‌లు కష్టపడి చిరుకు ఆ లుక్ తెచ్చినట్లు తెలుస్తోంది. మీరు కూడా ఒకసారి చిరు ‘అర్బన్ మాంక్’ మేకింగ్ వీడియోని చూసేయండి. చదవండి: సన్యాసిలా ఆలోచించగలనా? -
సన్యాసిలా ఆలోచించగలనా?
లాక్డౌన్లో షూటింగ్ లేకపోయినా కొత్త స్క్రిప్ట్‌లు, తదుపరి సినిమాల విషయాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి. తాజాగా లుక్ టెస్ట్ కోసం ఇలా గుండు బాస్‌గా మారారు. లుక్ ఫిక్సయిందా? మరి చిరు నెక్ట్స్ సినిమాలో ఇలాంటి క్రేజీ గెటప్‌తో కనిపిస్తారా? వేచి చూడాలి. ఈ ఫోటోను చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి – ‘అర్బన్ మాంక్ (సిటీ సన్యాసి). మరి సన్యాసిలా ఆలోచించగలనా?’ అని క్యాప్షన్ చేశారు. -
అమ్మపై అలిగి.. సన్యాసినులుగా మారదామని
సాక్షి, పలమనేరు(చిత్తూరు) : తల్లి మందలించిందని అలిగిన కవల బాలికలు.. కశ్మీర్ వెళ్లి అక్కడ ఆశ్రమంలో సన్యాసినులుగా బతకాలని భావించి, అక్కడకు వెళ్లే ప్రయత్నంలో పోలీసులకు చిక్కారు. సీఐ శ్రీధర్ వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన విశ్వనాథ్‌కు కవల పిల్లలున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన పిల్లలను తల్లి మందలించడంతో వారు తల్లిపై అలిగారు. దీంతో తండ్రి వారిని తమిళనాడులోని కాట్పాడిలో ఉంటున్న బంధువుల ఇంటికి మూడు రోజుల కిందట తీసుకెళ్లాడు. వారిని అక్కడి వదిలి పనిమీద బయటకెళ్లాడు. ఇదే అదునుగా భావించిన కవల పిల్లలు అక్కడి రైల్వేస్టేషన్‌కెళ్లి రైలెక్కి కర్నూలు వైపునకు వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న తండ్రి.. పిల్లలు కనిపించకపోవడంతో భార్యకు సమాచారమిచ్చాడు. ఆపై ఎక్కడ వెదికినా వారి ఆచూకీ లభించలేదు. వారి వద్దనున్న సెల్‌ఫోన్ సైతం స్విచాఫ్‌లో ఉంది. దీంతో తల్లిదండ్రులు మంగళవారం పలమనేరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పిల్లలు అదృశ్యమైంది తమిళనాడులోని కాట్పాడి కావడంతో సీఐ శ్రీధర్ జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసును కాట్పాడికి బదిలీచేశారు. కవలలు బుధవారం సాయంత్రం సెల్ ఆన్‌చేయడంతో.. టవర్ లొకేషన్ ఆధారంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో వారున్నట్టు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని గురువారం వారిని పలమనేరుకు తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. స్నేహితురాలి సలహాపై దేశముదురు సినిమాలో హీరోయిన్లా సన్యాసినులుగా మారదామనుకున్నామని కవలలు పోలీసులతో చెప్పారు. -
పంచ భూతాధికారి ప్రాణవాయువుపై పర్యవేక్షణ
ఏ తల్లి అయినా తన సంతానాన్ని కేవలం ప్రేమిస్తూ మాత్రమే పెంచలేదు. తన అనురాగంతో పాటు వాళ్లు గనుక తెలియనితనం(అజ్ఞానం)తో తప్పు చేసినా కావాలని ఓ మొండితనంతో తెలిసి తెలిసి (జ్ఞానం) తప్పు చేసినా తప్పక దండించి తీరుతుంది. ఆ దండన కారణంగా సంతానానికి ఏది చేస్తే అది తప్పు అవుతుందో, ఎలా ప్రవర్తిస్తే అది తప్పుకాదో అమ్మ అనురాగానికి పాత్రతని పొందగల ప్రవర్తన అవుతుందో వాళ్లకి అర్థమైపోతుంది. గత భాగంలో పంచభూతాల మీదా ఆధిపత్యం ఉన్న సాయి తన అంతేవాసి (తన వద్దే ఉంటూ సాయినే సర్వస్వంగా భావించేవాడు) అయిన శ్యామాని ఎలా ప్రాణి(వాయువు) పోకుండా రక్షించాడో తెలుసుకున్నాం కదా! పైన చెప్పుకున్న తల్లి ఉదాహరణలో తల్లి అనుగ్రహంతో పాటు ఆగ్రహాన్ని కూడా చూపిస్తుందనుకున్నాం కదా! అదే తీరుగా సాయి కొందరి విషయంలో ప్రాణ (వాయు) రక్షణ చేయడంతో పాటు కొందరిని తన సమక్షంలోనే ప్రాణ(వాయు) త్యాగం చేసేలా కూడా చేశాడు. ఈ విషయాన్ని వింటూనే సాయి కళ్లముందే చచ్చిపోతుంటే కళ్లారా చూస్తూ కూడా మంత్రం వేసి రక్షించకుండా చంపేశాడా? అనుకుంటారు కొందరు. అందుకే పెద్దలంటారు. స్పష్టమగ్రే భవిష్యతి– ఏ విషయమైనా పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆది నుండి తుది దాకా శ్రద్ధతో వినాలి అనీ. అప్పుడే లోవిషయం స్పష్టంగా అవగాహనకి వస్తుందనీను. నేటికాలంలో వారికి ఏదో ఓ కథకి సంబంధించిన నీతి అనే సూచిక పక్కన ఉన్న వాక్యాన్ని చదివేసి – కథలో నీతి ఇదన్నమాట అనుకుంటూ కథని చదవకుండా పెదవి విరిచేసినట్టు, ఓ విషయాన్ని ఓ వాక్యంలో వినేసి ఓ నిర్ణయానికొచ్చేయడం అలవాటైపోయింది. కాబట్టి సాయి సమక్షంలో ఎవరెవరి ప్రాణాలు పోయాయో ఆ సంఘటనలని కూడా తెలుసుకున్న పక్షంలో సాయితత్త్వం మనకి బోధపడి తీరుతుంది. నీ సంగతి చూసుకో! మద్రాసు నుంచి మానససరోవరానికి యాత్రకి బయలుదేరాడు విజయానందుడనే సన్యాసి. తోవలో షిర్డీకి వచ్చాడు. హరిద్వారం నుండి వచ్చిన ఓ స్వామితో మాట్లాడుతుంటే ఆయన మానససరోవర ప్రయాణపు కష్టాలనీ, అక్కడి చలినీ, పైగా అక్కడి భూటాన్ ప్రజలు కావాలని పెట్టే ఇబ్బందుల్నీ వివరించి చెప్పగానే ఈ సన్యాసి మానససరోవర యాత్రకి స్వస్తి చెప్పి బాబా దర్శనం చేద్దామని సాష్టాంగపడ్డాడు సాయి మందిరానికి వెళ్లి. బాబా ఈ విజయానందుడు సాష్టాంగపడుతుండగానే కోపంతో ఇతడో పనికిమాలిన సన్యాసి. అతని సాంగత్యం, సాహచర్యం మనకి మంచిది కాదు. ఇతడ్ని ఎందుకు రానిచ్చారు. పంపించివేయండి అన్నాడు. భక్తులకేమీ అర్థం కాలేదు. విజయానంద సన్యాసి తనని అలా సాయి అవమానించినా ఏ మాత్రం చలించకుండా మందిరంలోనే కూచుని సాయికి భక్తులు జరుపుతున్న అర్చనలని చూస్తూ అలాగే కూచుండిపోయాడు. ఎందుకో తెలియని ఆనందం, ఆకర్షణ బాబా విషయంలో కలిగిన విజయానందుడు షిర్డీని విడువకూడదని నిశ్చయించుకుని రెండు మూడు రోజులు అలాగే ఉండిపోయాడు. బాబా దగ్గరే ఉండిపోవాలనే కోరిక బలంగా కలిగిన విజయానందునికి తల్లి నుండి ఉత్తరం వచ్చింది. ఆమెకి జబ్బు చేసిందని. ఇష్టం లేకున్నా షిర్డీ నుంచి వెళ్లాలంటే బాబా అనుమతిని పొంది వెళ్లాల్సిందేనని భావించిన విజయానందుడు సాయి అనుమతి కోసం ప్రార్థించాడు. సాయి ఆ సన్యాసిని చూస్తూ ‘నువ్వో సన్యాసివా? కేవలం కాషాయవస్త్రాలని ధరించినంత మాత్రాన సన్యాసివి అయిపోయినట్లేనా? నీ తల్లి మీద అంత ప్రేమ ఉండి వెంటనే ఆమెకి సపర్య చేయాలని భావించేవాడివైతే ఎందుకు సన్యాసాన్ని తీసుకున్నావు? భవబంధాలని తెంచుకోవడమంటే ఇదేనా? ఓపిక పట్టి కొన్ని రోజులు ఇక్కడే ఉండు! అయినా ముందు నీ సంగతి చూసుకో! (ఈ వాక్యం మరాఠాభాషలో ఉన్న ‘ఓవీ’ల్లో ఉంది) ఇక్కడ దొంగలున్నారు. తలుపు గడియ వేసుకో! ధనం, అధికారం... వంటివన్నీ నిత్యం కాదు. శ్రీహరి చరణాలని పట్టుకో! శాశ్వత సుఖమైన మోక్షాన్ని పొందగలవు. నీ పూర్వ పుణ్యం ఎక్కువైన కారణంగా ఈ పవిత్ర స్థలానికి, నిత్యం దైవభక్తిపరులే ఉండే ప్రదేశానికి రాగలిగావు. మిగిలిన కోరికలన్నింటినీ వీడి.. రేపటి నుండి భాగవత పారాయణాన్ని చేస్తూ ఉండు. ఇదిగో! శ్రద్ధగా విను! ఒక్కో వారం రోజులకి ఓ మారు పారాయణంచొప్పున చేస్తూ మూడు సప్తాహాలని (ఏడు రోజులు) చేస్తే భగవంతుడు ఆనందపడి నీకున్న విచారాలని పోగొడతాడు. నీకు చెప్పలేని శాంతి లభిస్తుంది’’ అన్నాడు.ఈ మాటల్ని వింటూన్న అందరికీ కూడా తల్లి జబ్బు గురించి ఆత్మసిద్ధినీ సాక్షాత్కారాన్ని గురించి ఆలోచించనివాడూ ఆలోచించుకోనివాడూ సన్యాసి ఎందుకు అవుతాడనే తీరు ఆలోచనలే కలిగాయి. లోఅర్థం అది కాదు. బాబా మాటలలో అర్థం బాబాకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసనేది అనేక సందర్భాల్లో మనం గమనించుకున్నాం. గోవా నుండి భక్తులొస్తే వాళ్లకి జరిగిన విశేషాలని చెప్పి 15 రూపాయలే దక్షిణగా తీసుకోవడం ద్వారా భూతకాల విశేషాలని బాబా గ్రహించగలడని అర్థం చేసుకున్నాం. చాంద్‌పాటిల్ గుర్రం ఎక్కడుందో చెప్పగలగడం ద్వారా వర్తమానం బాబాకి తెలుసనే విశేషాన్ని గ్రహించగలిగాం. ఇంతకు ముందనుకున్న శ్యామాకి జరిగిన పాముకాటు సంఘటన ద్వారా శ్యామాకి మరణకాలం కాలేదని తెలుసుకున్న సాయి అతనికి ఏం చేయాలో చెప్పి బ్రతికించడాన్ని స్పష్టంగా చూసి, శ్యామా మరణం ఇప్పుడు కాదనే భవిష్యత్ కాల విశేషాన్ని బాబా గ్రహించగలిగాడని సాక్ష్యపూర్వకంగా దర్శించుకున్నాం కదా! అదే తీరులో బాబా ఈ వచ్చిన విజయానందుడ్ని చూశాడు. అతనికి సంబంధించిన భూత భవిష్యత్ వర్తమానాల మూటనీ తన లోదృష్టితో పరిశీలించాడు. మానససరోవరానికి యాత్రకంటూ బయలుదేరిన సన్యాసి తన ప్రయాణమధ్యంలో ఎవరో ఒక సన్యాసి చెప్పిన మాటల్ని విని మానససరోవరయాత్రని మానుకున్నాడని అర్థమయింది బాబాకి. ‘సన్యాసమంటేనే కష్టానికి సిద్ధపడి ఉండాల్సిన పదవి’ కదా! మరి తాను తట్టుకోగలిగి వెళ్లగలుగుతాననకుండా మానుకోవడం ద్వారా సరైన సన్యాసి కాదని అర్థమైంది సాయికి. అందుకే విజయానందస్వామి తనకి సాష్టాంగపడగానే ఈ పనికిమాలిన స్వామిని ఎందుకిక్కడికి రప్పించారు? రానిచ్చారు? ఇతని సాహచర్యం, సాంగత్యం ద్వారా స్థిర బుద్ధి ఉన్న మన భక్తులు కూడా చంచల స్వభావులుగా అయిపోతారంటూ సన్యాసి సమక్షంలోనే మాట్లాడాడు. ఇందులో తప్పు పట్టుకోవాల్సిందేముంది? ఈ లోతు అర్థం కాని కొందరు భక్తులు సాయి మాటలని మరోలా అనుకుని ఉండచ్చు. లోఅర్థం తెలియని స్థాయిలో ఉన్నవాళ్లు మాత్రం సాయి ఇలా అంటున్నాడంటే ఏదో చెప్పలేని విశేషం ఉండి ఉండవచ్చని అర్థం చేసుకున్నారు. ఆ విశేషం ఇదన్నమాట. కాబట్టి విజయానందుని భూతకాల పరిస్థితి అది! ఇక వర్తమానపరిస్థితిని చూస్తే... సన్యాసి అయ్యుండీ తన తల్లి నుండి ఉత్తరం రాగానే, వెంటనే బయలుదేరి మద్రాసు వెళ్తానంటూ అనుమతిని ప్రార్థించే స్థాయిలో ఉన్నాడు ఈ సన్యాసి. ఇది కూడా సన్యాస« ధర్మవిరుద్ధమే కదా! అందుకే తల్లి గురించి ఆలోచించే నీకు భవబంధవిముక్తి ఏమైంది? ఏముందంటూ బహిరంగంగానే మాట్లాడాడు సాయి. దీంతో సాయిని ఎదుటివ్యక్తి భూతమూ వర్తమానమూ కూడా తెలిశాయనే విషయం తెలుస్తోందిగా! ఇక విజయానందుని భవిష్యత్కాలాన్ని కూడా సాయి గమనించాడు తన లోదృష్టితో. ఆశ్చర్యమనిపించింది సాయికి. ఎందుకంటే.. విజయానందునికి సరిగా ఆ రోజునుండి 3“7 (మూడు సప్తాహాలు అంటే 21 రోజులు) రోజుల్లో ఏనాడైనా మరణించవలసిన.. అంటే తన ప్రాణవాయువుని త్యాగం(విడిచివేయవలసిన) అవసరముందని గ్రహించాడు సాయి. అందుకే తల్లి వద్దకి పోవద్దని ఇటు సన్యాసధర్మం ప్రకారం చెప్తున్నట్టుగా పైకి చెప్తూ, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడాన్ని చూసుకోవాలనే ధర్మబోధని చేస్తున్నట్లుగా లోవిశేషంతో ఉపదేశిస్తూ.. నీ సంగతి చూసుకో! అన్నాడు సాయి. ఇది నిజంకాని పక్షంలో ‘న మాతుఃపరదైవతమ్ – అన్నారు కాబట్టి, తల్లికంటె మరో దైవమే లేదని ధర్మశాస్త్రం చెప్తోంది కాబట్టీ ఆ తల్లి వద్దకి పోవద్దని చెప్పిన సాయి అధర్మపరుడు అయ్యుండేవాడు కాడూ? రుషులూ సిద్ధులూ సద్గురువులూ అలాగే నేటికాలంలోనైతే పెద్దలూ అనుభవజ్ఞులూ వృద్ధులూ సరైన మార్గాన్నే ఉపదేశిస్తారు. ఎక్కడైనా జరగరానిది జరిగే పరిస్థితి గాని వాళ్లకి గోచరిస్తే ఆ విషయాన్ని కుండ పగలగొట్టినట్టుగా చెప్పకుండా వాళ్లకి మాత్రమే అవగాహనతో అర్థమయ్యే తీరులో నర్మగర్భంగా చెప్తారు. ఆ లోఅర్థం తెలియని పక్షంలో సూటిగా చెప్తారు తప్ప ముందే సూటిగా చెప్పి ఆందోళనకీ భయభ్రాంతులకీ గురిచేయరు. ఈ నేపథ్యంలో సాయి ఆ విజయానందుని అవశ్యమరణం(తప్పక మరణించవలసిన పరిస్థితి) గమనించి తాను మరణాన్ని వాయిదా వేయించగలశక్తి (శ్యామా విషయం లోలాగా) కలవాడే అయినా ఆ పనిని చేయలేదు. దానికి కారణం అతనికి రాబోయే మరణం దైవనిశ్చితం అయ్యుండటమే. సాయి ఎంత గొప్పవాడంటే తాను నిత్యం మననం చేస్తూండే ‘అల్లాహ్ హో మాలిక్!’ మంత్రాన్ని మననం చేస్తూ ఉండవలసిందని ఆజ్ఞాపించకుండా, శ్రీహరి చరణాలని ఆశ్రయించు. అందుకే భాగవతాన్ని 7 రోజుల్లో (ఆ పరీక్షిస్మహారాజులాగా) పారాయణాన్ని పూర్తి చేస్తూ 3 వారాల పాటు కొనసాగించవలసిందన్నాడు కూడా. అలా కాక 21 రోజుల్లో భాగవతాన్ని పూర్తి చేయవలసిందనిగాని సాయి ఆజ్ఞాపించి ఉంటే దురదృష్టవశాత్తూ ఏ 16వ రోజునో అతడు గాని మరణిస్తే ఇటు భాగవత పారాయణం ముగిసి ఉండేది కాదు. అతని మరణానికి ముందు సరైన మార్గదర్శనాన్ని తాను చేసినట్లు అయ్యుండేదీ కాదు. ఇంత ఆలోచించి సాయి చెప్పాడు విజయానందునికి భగవత పారాయణం చేయవలసిందని. సాయినోటి నుంచి వచ్చిన ఆ వాక్యాలు విజయానందునికి ఆజ్ఞలుగా తోచాయి. కర్తవ్యాలుగా అనిపించాయి. అంతే! ఆ మరురోజునుండే పారాయణాన్ని ప్రారంభించదలిచి ఉదయం స్నానాన్ని ముగించి లెండీ తోటకి వెళ్లి ఏకాంతంగా కూచుని భాగవతగ్రంథాన్ని తెరిచాడు. తీవ్రమైన ఏకాగ్రతతో రెండు రోజుల పాటు పారాయణాన్ని చేసి తీవ్రంగా అలసిపోయాడు. మళ్లీ మందిరానికొచ్చి ఆ మందిరం పక్కనే భక్తులందరూ వచ్చి కూర్చునే ‘వాడా’కి వచ్చి విశ్రాంతికోసం మరో రెండురోజులున్నాడు. మూడవ రోజున మళ్లీ పారాయణం చేద్దామనుకుంటూ తన పక్కనే కూచున్న ‘బడేబాబా’ అనే ఆయన తొడమీదికి ఒరిగిలపడి అక్కడే అప్పుడే ప్రాణాలని విడిచాడు.మరి ప్రాణవాయువు తన అధీనంలో ఉన్న సాయి ఇతడ్ని బతికించలేకపోవడానికి కారణం పైన అనుకున్నతీరుగా ఆయన మరణం దైవనిర్ణయమని సాయికి ముందుగానే తెలిసి ఉండటం. నిజంగా తన తల్లి నుండి ఉత్తరం వచ్చింది కాబట్టి ఈ విజయానందునికే సాయి అనుమతిని ఇచ్చి వెళ్లవలసిందన్నట్లయితే ఆ సన్యాసి శీఘ్రప్రయాణ సౌకర్యాలులేని ఆ కాలంలో ఏ మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచి ఉండేవాడు. ఇటు సాయి దర్శనానికీ, అటు తల్లి దర్శనానికీ కూడా నోచుకోగలిగి ఉండేవాడే కాకపోయేవాడు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్! యం ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ‘ఎవరైతే మరణించబోతున్న కాలంలో భగవంతుడైన తనని స్మరిస్తూ శరీరంలోని ప్రాణాలని విడుస్తూ శరీరంలోని చైతన్యాన్ని కోల్పోతారో వాళ్లు తనలో ఐక్యమవుతారంటూ ఏ శ్రీకృష్ణుడు తన గీతా ఉపదేశంలో చెప్పాడో, దానికి అనుగుణంగా ఈ విజయానంద సన్యాసి తల్లి దర్శనానికై ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ప్రాణత్యాగం చేయడం కాకుండా, పవిత్రషిర్డీ ప్రదేశంలో, భక్తి భావం మాత్రమే కల సాయి భక్తుల సమక్షంలో మరణించగలిగాడు. అలా అంత్యకాలంలో భగవత్ స్మరణ చేస్తూ ప్రాణత్యాగాన్ని చేయగల సహాయాన్ని ఆ సన్యాసికి చేశాడు సాయి. సాయి తన తొలిమాటలలో ఈ సన్యాసితో వాడాలో ఎందరో దొంగలున్నారు, తలుపులకి గడియవేసుకోవలసిందని కూడా సూచించాడు. సాయి సంస్థానంలో కూడా దొంగలుగా భక్తులు ఉన్నట్లయితే ఇక ఆ సమాధి మందిరానికి పవిత్రత ఎక్కడున్నట్లు? భక్తుల్లో సత్ప్రవర్తన ఎక్కడున్నట్లు? అనిపిస్తుంది మనకి. సాయి మాట్లాడిన ‘దొంగలున్నారు–గడియవేసుకోవలసిందనే మాటలకి అర్థం ఉంది.వాడా అంటే ఈ శరీరమనీ, దానిలో దొంగలున్నారంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే పేర్లున్న ఆరుగురు దొంగలు ఉన్నారనీ, వాళ్లు అజాగ్రత్తగా ఉన్నవారి సంపదనంతా దోచుకుని పారిపోతారనీ ఆ మాటలకర్థం. కాబట్టి సాయి అతనిని ప్రాణ (వాయు) త్యాగం చేసేలా చేసి, అంత్యకాలంలో భగవత్స్మరణ ద్వారా మోక్షాన్ని కూడా ఇప్పించాడని చెప్పితీరాలి. ప్రాణ(వాయు)త్యాగం ఇక బాబా మరోవారం రోజులకి సమాధి అవుతారనగా కొందరు గ్రామస్థులు ఒక పులిని ఒక నాటుబండిలో బంధించి, సాయి దర్శనం కారణంగా దాన్ని జీవింపజేయాలనుకుని తెచ్చారు సాయి సమ్ముఖానికి. ఆ పులిని ఇలాగే ఒక బందిఖానా వంటి ఊచలున్న ఓ బోనులో బంధించి ఊరూరా దాన్ని తిప్పుతూ దానిమీద వచ్చే సొమ్ముతో జీవనాన్ని చేసుకుంటూ ఉండేవారు ఆ మనుష్యులు. బాగా వృద్ధాప్యం వచ్చి ఉండటం, అదీకాక ఆ పులి జబ్బుపడి ఉండటం, దాంతో ఏం చేయాలో తోచని స్థితితో పులి ముందుకీ వెనక్కీ వడివడిగా అడుగులేస్తూ అక్కడే తిరుగుతూ ఉండటం, బోను తలుపుగాని తీస్తే మీదపడి ఎందరి ప్రాణాలని తీస్తుందో లెక్కించలేని తనంతో జనం ఉండటం కారణంగా ఆ పులిని సాయి దర్శనానికంటూ తెచ్చారు. దీనిమీద మీరు సొమ్మును సంపాదించుకుంటూ దానికి ఏ మాత్రపు ఆరోగ్యపరిరక్షణనీ చేయకుండా దాదాపు విడిచేసినట్లున్నారే? అని సాయి మందలించాడు ఆ అంగడివాడ్ని. సాయికి పులిని చూపించే ఉద్దేశ్యంతో గొలుసులతో కట్టిఉంచిన ఆ పులిని సాయి ఎదురుగా ఉంచారు. పైకి బాగా కనిపిస్తున్నా దానికి మాత్రం జబ్బు ముదిరిన కారణంగా సాయి తానే ఆజ్ఞ చేశాడు పులిని తేవలసిందని. బాబాముఖ కాంతికీ తేజస్సుకీ తట్టుకోలేని పులి తనలోని చైతన్యాన్ని కోల్పోయి తలవంచి తెలివి తప్పి నేలమీద పడిపోయింది. సాయి ముఖాన్నే చూస్తూ తన తోకతో నేలని ముమ్మారు కొట్టి అంతలోనే ప్రాణ(వాయు)త్యాగం చేసింది పులి. ప్రాణవాయువుని తన అధీనంలో ఉంచుకున్న సాయి ఆ పులిని రక్షించలేకపోవడానికి కారణం... దానికి దైవాజ్ఞ ప్రకారం మరణం సిద్ధంగా ఉండి ఉండటమే. ఆ పులి తన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కారణంగా సాయిని చూస్తూ మరణించాల్సి ఉంది. అదే జరిగింది కూడా!యోగులూ సిద్ధులూ అయిన వారిని దర్శిస్తూ ఆ తన ప్రాణాలని విడిచినవాడు ఎంతటి ధర్మబద్ధుడో తెలియజేయడానికి సాక్ష్యం పులి. ఇంత శక్తిగల సాయి ప్రాణవాయువు తర్వాత అపానమనే వాయువు మీద ఎలా ఆధిపత్యాన్ని కలిగినవాడు అయ్యాడో తెలుసుకుందాం! – సశేషం. - డా. మైలవరపు శ్రీనివాసరావు -
సన్యాసినిగా మారనున్న ఇద్దరు యువతులు
తమిళనాడు, తిరువణ్ణామలై: తిరువణ్ణామలైలో ఇద్దరు యువతులు సన్యాసిగా మారేందుకు నిర్ణయించుకున్నారు. వివరాలు.. తిరువణ్ణామలైకి చెందిన పారిశ్రామికవేత్తలు గౌతమ్‌కుమార్, అరవింద్‌కుమార్ అన్నదమ్ములు. గౌతమ్‌కుమార్ రెండో కుమార్తె బ్రేక్సా (26), అరవింద్‌కుమార్ రెండో కుమార్తె శ్వేత (25) వీరద్దరూ కలిసి జైన్ మత సన్యాసినులుగా జీవించేందుకు నిర్ణయించుకున్నారు. దీనిపై గౌతమ్‌కుమార్, అరవింద్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. బ్రేక్సా ఎంబీఏ పూర్తి చేసిందని, శ్వేత సీఏ పూర్తి చేసిందన్నారు. వీరిద్దరూ 22ఏళ్ల వయసులోనే సన్యాసినులుగా మారేందుకు నిర్ణయించుకున్నారన్నారు. తమ కన్నీటి గాథ వారిని మార్చలేక పోయిందని ప్రేమతోనే గాక, బెదిరించి కూడా చూశామని వారి నిర్ణయం మార్చుకోలేదన్నారు. సన్యాసిగా మారాలంటే ఎంఏ జైనాలజీ చదవాలని ఇందుకోసం రాజస్థాన్‌లోని మత కళాశాలలో చేర్చామని దాదాపు నాలుగేళ్ల పాటు పూర్తిగా సన్యాసులుగా మారేందుకు అవసరమైన సర్టిఫికెట్‌ను కూడా పొందారన్నారు. జైన్ మతంలో సన్యాసులుగా మారేందుకు కఠినమైన నిబంధనలు పాటించాలని భిక్షాటన చేసి ఆహారం భుజించాలని, ఎక్కడికి వెళ్లినా నడిచే వెళ్లాలని, సాయంత్రం 6 గంటల తరువాత ఆహారం తీసుకోరాదు, మూడు జతల దుస్తులు మాత్రమే వెంట ఉంచుకోవాలన్నారు. కుటుంబ సభ్యులతో ప్రేమ పెంచుకోరాదని, మూడు నెలలకోసారి తల వెంట్రుకలను తీసి వేయాలని ఇలాంటి నిబంధనలు పాటించాలన్నారు. ఈనెల 26వ తేదీన తిరువణ్ణామలై మీనాక్షి కళ్యాణ మండపంలో తమ కుమార్తెలను సన్యాసినిలుగా మార్చే కార్యక్రమం జరగనుందని జిల్లా న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ, రాజకీయ నేతలు పాల్గొననున్నట్టు తెలిపారు. తిరువణ్ణామలై జిల్లాలోనే మొట్టమొదట సారిగా జైన్ మతానికి చెందిన ఇద్దరు యువతులు సన్యాసినులుగా మారనుండడంతో పట్టణంలో అక్కడక్కడ బ్యానర్లు ఏర్పాటు చేశారు. -
వజ్రాభరణమా? ధర్మాభరణమా?ర్మాభరణమా?
రాజ్యం, అధికారం, సంపదల కంటె సత్యం, ధర్మం ఎంతో విలువైనవిగా ఎంచి బుద్ధుడు అన్నిటినీ త్యజించి భిక్షువుగా మారాడు. భిక్షుసంఘాన్ని స్థాపించి ధర్మప్రబోధాలు చేస్తూ దేశదేశాలు తిరుగుతున్నాడు.శాక్యవంశానికి చెందిన యువరాజులు అనిరుత్థుడు, భిద్ధయుడు, ఆనందుడు, కింబిలుడు, దేవదత్తుడు అనే ఐదుగురు భిక్షువులుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజున వారు తమ ఇంట్లోని వారికి చెప్పకుండా బయలుదేరారు. వారు తమకు తోడుగా ఆస్థాన క్షురకుడైన ఉపాలిని వెంటతీసుకుని వెళ్లారు. నగర పొలిమేరలు దాటాక, వారు తాము ధరించిన విలువైన వస్త్రాల్ని, ఆభరణాల్ని తీసి మూటగట్టారు. నారబట్టలు ధరించారు. ఉపాలితో కేశఖండనం చేయించుకుని, ‘‘ఓ ఉపాలీ! విలువైన మా వస్త్రాలూ, ఆభరణాలూ నీవు తీసుకో: వాటితో జీవితాంతం హాయిగా జీవించు’’అని వెళ్లిపోయారు. ఆ మూటలు తీసుకుని వెనుదిరిగాడు ఉపాలి. కొంతదూరం పోయాక ఉపాలికి ఒక ఆలోచన వచ్చింది. ‘రాకుమారులు ఇంత విలువైన ఆభరణాలు త్యజించి, వాటిని గడ్డిపోచగా ఎంచి నాకు ఇచ్చేశారు. అంటే... వారు ఈ ఆభరణాల కంటె విలువైనదాన్ని పొందడం కోసమే ఈ పని చేసి ఉంటారు. మరి నాకెందుకూ ఈ ఆభరణాలు? నేను కూడా వారితోనే పోయి ఆ వెలలేని ఆభరణాల్ని పొందాలి’ అనుకుని ఆ వస్త్రాల్ని, మూటల్ని అక్కడే పడేసి, పరుగు పరుగున వచ్చి, వారిని కలిశాడు. ‘‘ఆ విలువైన ఆభరణాల్ని నీవు కూడా అందుకుందువుగాని రా’’ అని చెప్పి వారు తమ వెంట తీసుకుపోయారు. బుద్ధుడు ఆ ఆరుగురిలో ముందుగా ఉపాలికి దీక్ష ఇచ్చాడు. న వరత్నాలు పొదిగిన ఆభరణాల కంటె బుద్ధుడు ప్రవచించిన ధర్మం అనే ఆభరణమే విలువైనదని గ్రహించిన ఉపాలి, అతి తొందరలోనే అగ్రభిక్షువు కాగలిగాడు. ఉపాలికి బౌద్ధసంఘంలో ఎంతటి గౌరవం దక్కిందంటే... బుద్ధుడు నిర్వాణం పొందిన మూడు నెలలకి జరిగిన మొదటి బౌద్ధ సంగీతికి అతడే అధ్యక్షుడు. త్రిపిటకాలలో భిక్షు నియమావళిని బోధించే వినయపిటకం కూర్పుకు సారథి. రత్నాభరణాల్ని వదిలి ధర్మాభరణాన్ని ధరించిన ఉపాలి బౌద్ధసంఘంలో ఒక వజ్రంలా ప్రకాశించాడు. -
మనది కానిది
తెల్లవారగనే ఆ అధికారి, దొంగల్ని వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాడు. అతను వచ్చే సమయానికి ఈ బాటసారి మూటలోని నాణేల్ని లెక్కబెట్టుకుంటూ కనిపించాడు. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలసి ఒక పొలం గట్టు మీదుగా వెళ్తున్నాడు. దారిలో ఒక చెట్టు పక్కన ఒక భిక్షువుకి ఒక డబ్బు మూట కనిపించింది. ఆ భిక్షువు –‘‘భగవాన్! ఇదిగో ధనం మూట’’ అని చూపించాడు. ‘‘నాయనా! అది ఒక కాలసర్పం లాంటిది. దాని జోలికి వెళ్లొద్దు. ఇటు వచ్చేయ్’’అని వెళ్లిపోయాడు. మిగిలిన భిక్షువులు ఆ మూటకి కాస్త దూరం జరుగుతూ ఆయన వెంట వెళ్లిపోయారు. కొద్దిదూరంలో ఉన్న ఒక బాటసారి ఈ తతంగం అంతా చూస్తున్నాడు. ‘‘ఈ భిక్షువులకు అక్కడ పామేదో కనిపించినట్లుంది. ఉట్టి పిరికివాళ్లలా ఉన్నారు. అంతమంది ఉండి కూడా దానిని ఏమీ చేయలేక తప్పుకుని పారిపోతున్నట్లున్నారు’’అనుకుంటూ అక్కడికి వచ్చాడు. తీరా వచ్చి చూస్తే అక్కడ డబ్బు మూట ఉంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని– ‘ఆ భిక్షువులు పిరికివాళ్లే కాదు వెర్రిబాగులవాళ్లలాగున్నారు.లేకపోతే డబ్బు మూటను చూసి పాముని చూసినట్టు పరుగు పెడుతున్నారు’ అనుకుంటూ మూట విప్పి డబ్బు లెక్కపెట్టుకుంటున్నాడు. నిజానికి అసలు జరిగిందేమిటంటే.. ఆ ముందు రోజు రాత్రి రాజు కొలువులో పని చేసే ఒక అధికారి ఇంట్లో దొంగలు పడి, ఎన్నో కుండల కొద్దీ ధనాన్ని దోచుకుపోతూ... దారిలో ఉన్న ఈ చెట్టుకింద కూర్చుని మూటల్ని లెక్కపెట్టుకున్నారు. అప్పుడు ఆ చీకట్లో ఒక మూట జారి పక్కన పడిపోయింది. అది గమనించకుండా వారు వెళ్లిపోయారు. తెల్లవారగనే ఆ అధికారి, దొంగల్ని వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాడు. అతను వచ్చే సమయానికి ఈ బాటసారి మూటలోని నాణేల్ని లెక్కబెట్టుకుంటూ కనిపించాడు. ఇతడే దొంగతనం చేసి ఉంటాడని భావించి, ఆ బాటసారిని తన్ని, రాజుగారి దగ్గరకు లాక్కుపోయాడు. ఇదీ కథ. పరుల సొమ్ము పాము వంటిది– అనే నానుడి ఇలా పుట్టింది. అందుకే బుద్ధుడు ‘ఇతరులు ఇవ్వకుండా నీకు దొరికింది కూడా నీది కాదు. అదీ ఒక రకంగా దొంగతనమే’ అని తన శిష్యులకు చెప్పాడు. అంటే ‘నీ శ్రమ కానిది నీది కాదు. మరొకరు దానంగా ఇవ్వనిదేదీ నీది కాదు’ అని దాని అర్థం. – బుద్ధుని ‘పంచశీల’ నుంచి -
దేవాలయంపై దావా వేసిన సన్యాసి
టోక్యో : బలవంతంగా తనతో ఎక్కువ సమయం పని చేయిస్తున్నారనే ఆరోపణతో ఏకంగా దేవాలయంపైనే దావా వేశాడో బౌద్ధ సన్యాసి. ఈ ఉదంతం జపాన్‌లోని టోక్యోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని మౌంట్కోయ మీద ఉన్న కోయాసన్ ఆలయం బౌద్ధులకు ప్రముఖమైంది. ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూవుంటారు. సన్యాసులుగా శిక్షణ పొందటానికి వచ్చిన వారు శిక్షణలో భాగంగా అక్కడ సేవ చేయాల్సి ఉంటుంది. శిక్షణా సమయాన్ని మించి ఎక్కువ సేపు పని చేయించారని సన్యాసి తరపు న్యాయవాది మీడియాకు తెలిపారు. కొన్నిసార్లు ఒక రోజులో 17 గంటల కంటే ఎక్కువ సమయం అతనితో పని చేయించారని పేర్కొన్నారు. సెలవు దినాల్లో కూడా తనతో ఎక్కువ సమయం పని చేయిస్తున్నారన్న కారణంగా అక్కడి కార్మిక సంఘం మద్దతు కూడగట్టుకున్నాడు సదరు సన్యాసి. బలవంతంగా తనతో ఎక్కువ పని చేయించినందుకు పరిహారంగా 70 వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు శ్రమ జపాన్‌లో ప్రధాన సమస్యగా మారింది. 2017లో అదనపు శ్రమ కారణంగా 191 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. షింజో అబే ప్రభుత్వం అదనపు శ్రమను నివారించడానకి తగిన చర్యలు తీసుకున్నా అవి క్షేత్ర స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
తనది కాని దానం!
ఒకరోజున శీలవర్థనుడు అనే భిక్షువు తన మార్గంలో పోతూ ఒక మామిడి తోపులో ఆగాడు. కొంతసేపు ఒక చెట్టుకింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. తోటలో చెట్లన్నీ మామిడిపండ్లతో నిండి ఉన్నాయి. అతనికి బాగా ఆకలిగా ఉంది. పైగా తోటలో కాపలాదారు కూడా లేడు. కోసుకు తినడం దొంగతనంగా భావించి అలాగే కూర్చొని పోయాడు. ఇంతలో ఒక మామిడిపండు రాలి తన ముందే పడింది. దోరమగ్గిన పండు వాసన ఘుమాయించి కొచ్చింది. ఇతరులు దానంగా ఇవ్వకుండా ఇలా తీసుకుని తినడం కూడా నేరంగానే భావించాడు. ఆ పక్క పొలంలో పశువుల్ని మేపుకుంటున్న ఒక వ్యక్తి ఇదంతా గమనించాడు. గబగబా వచ్చి ‘‘భంతే! మీ ముందు రాలి పడిన పండు ఉంది కదా! తీసుకోలేదేం?’’ అని అడిగాడు. ‘‘ఇతరులు దానం చేయకుండా గ్రహించను’’ అన్నాడు. ‘‘సరే, ఇదిగో తీసుకోండి’’ అని ఆ వ్యక్తి ఆ పండుని తీసి, భక్తితో భిక్షువుకి ఇచ్చాడు. ‘‘ఈ తోట నీదేనా?’’ అని అడిగాడు భిక్షువు. ‘‘కాదు భంతే! నాకు తెలిసిన వారిదే!’’అన్నాడు. ‘‘నీది కానప్పుడు దీన్ని దానం చేసే అర్హత నీకు లేదు. దాన్ని గ్రహించడం కూడా దోషమే’’ అన్నాడు భిక్షువు. ఆ వ్యక్తి ఆశ్చర్యపడి, వెంటనే పోయి తోట యజమానిని తీసుకుని వచ్చాడు. ఆ యజమాని ఇస్తే ఆ పండు స్వీకరించి ఆకలి తీర్చుకున్నాడు భిక్షువు. తగిన యజమానులు దానం చేయకుండా ఏ వస్తువుని గ్రహించినా అది ‘దొంగతనమే’ అని బుద్ధుడు చెప్పిన సూత్రాన్ని నిజాయితీగా పాటించి, అనతి కాలంలోనే మంచిభిక్షువుగా రాణించాడు శీలవర్థనుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
వందకోట్ల ఆస్తిని వదులుకుని...
అహ్మదాబాద్ : వందల కోట్ల ఆస్తి, విలాసవంతమైన జీవితం, పెద్ద వ్యాపారం, ప్రాణంగా ప్రేమించే కుటుంబం...ఇవేవీ ఈ 24 ఏళ్ల యువకునికి సంతృప్తినివ్వలేదు. జీవితం అంటే ఇంతేనా అనిపించింది. తన జీవిత గమ్యం వ్యాపారం చూసుకోవడం కాదని తెలుసుకున్నాడు. ఈ భౌతిక సుఖాలను, వాంఛలను వదిలి దైవాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు సన్యాసమే సరైన మార్గంగా భావించాడు. పూర్తిగా దేవుని సేవకు అంకితం అవ్వడానికి తనకున్న వందకోట్ల ఆస్తిని, వ్యాపారాన్ని వదిలి సన్యాసం స్వీకరిస్తున్నాడు అహ్మదాబాద్‌కు చెందిన మోక్షేష్ షేత్. గుజరాత్‌లోని దీసా పట్టణానికి చెందిన సందీప్ షేత్ వ్యాపార నిమిత్తం ముంబైలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం సందీప్ ముంబైలో అల్యూమినియం వ్యాపారం చేస్తున్నాడు. ఇతని పెద్ద కుమారుడైన మోక్షేష్ సీఏ పూర్తి చేసిన అనంతరం కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో మోక్షేష్‌కు దైవాన్ని తెలుసుకోవాలనే కోరిక కల్గింది. అందుకు సన్యాసం స్వీకరించడమే సరైన మార్గంగా తోచడంతో ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసాడు. వారి అంగీకారంతో మోక్షేష్ ఈ రోజు గాంధీనగర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో సన్యాసం స్వీకరిస్తున్నాడు. సన్యాసం స్వీకరించిన అనంతరం మోక్షేష్ పేరు ‘కరుణప్రేమ్ విజయ్ జీ’ గా మారుతుందిన అతని మామయ్య తెలిపాడు. మోక్షేష్ జైన సాంప్రదాయాలు పాటించే కుటుంబానికి చెందినవాడు. గుజరాత్‌కు చెందిన కోటీశ్వరుడైన వజ్రాల వ్యాపారి కొడుకు పన్నేండేళ్ల ‘భవ్య సాహ్’ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. -
మనసులో మోసే బండరాయి
ఒక పక్కన కూర్చుని ఆ గ్రామీణుడు వాళ్ల సంభాషణే వింటున్నాడు. ‘అసలు ప్రపంచంలో ఉన్నది ఏదైనా మన మనసులో ఉన్నదే’ అన్నాడు అందులో ఒక సన్యాసి. ఒక చిన్న ఊళ్లో, ఒక చిన్న గుడిలో ఒకాయన నివసించేవాడు. ఆ గ్రామీణుడు తన దైనందిన జీవితంలో మునిగి, తన పనులేవో చూసుకుంటూ బతికేవాడు. ఒకరోజు ఆ దారిన ప్రయాణిస్తున్న నలుగురు సన్యాసులు ఆ గుడి దగ్గర ఆగారు. రాత్రిపూట అక్కడ పడుకోవడానికి వీలవుతుందా అని అడిగారు. ఈయన ఎంతో అభిమానంగా వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాడు. రాత్రిపూట కట్టెపుల్లలు తెచ్చి వారికోసం చలిమంట వేశాడు. చలిమంట కాచుకుంటూ నలుగురు సన్యాసులు తీవ్రమైన ఆధ్యాత్మిక చర్చలోకి దిగిపోయారు. పదార్థమూ, చైతన్యమూ ఇట్లా ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక పక్కన కూర్చుని ఆ గ్రామీణుడు వాళ్ల సంభాషణే వింటున్నాడు.‘అసలు ప్రపంచంలో ఉన్నది ఏదైనా మన మనసులో ఉన్నదే’ అన్నాడు అందులో ఒక సన్యాసి. ‘అట్లా అయితే ఆ దూరాన ఉన్న ఆ పెద్ద బండరాయి కూడా మన మనసులోనే ఉందంటావా?’ అడిగాడు మరో సన్యాసి.‘ఒక లెక్కలో ఆలోచిస్తే అది మనలోనే ఉన్నట్టు’ మొదటి సన్యాసిని సమర్థించాడు మూడో అతను.‘అవునవును’ అంగీకరించాడు నాలుగో వ్యక్తి.కాసేపు చర్చ ఆగింది. మంట వెలుగుతోంది. వారి మాటల సారాన్ని ఆకళింపు చేసుకుంటూ అన్నాడు గ్రామీణుడు: ‘అయ్యలారా! అయితే మీ మనసులు ఇప్పుడు ఆ పెద్దబండరాయిని మోస్తూవుండాలి. ఈ కాసేపైనా దింపేయండి’. -
మంచి మాటల వాసన
అక్కడ ఒక సన్యాసి కూర్చునివున్నాడు. సన్యాసి మౌనంగా, ధ్యానంగా ప్రార్థిస్తూవున్నాడు. ఆయన పెదవులు చిన్నగా కదులుతున్నాయి. పాతకాలంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన పచ్చి అబద్ధాలు ఆడేవాడు. అందువల్ల ఆయన్ని ఎవరూ నమ్మేవాళ్లు కాదు. పైగా పరమ కోపిష్టి. కుటుంబ సభ్యులపై, బంధువులపై రుసరుసలాడుతుంటాడు. ఊరివాళ్లతో గొడవపడుతుంటాడు. దాంతో ఎవరూ ఆత్మీయంగా ఉండేవారు కాదు. ఆయనను చూస్తూనే ఏదో దుర్గంధం వీచినట్టుగా జనం పక్కకు తొలగిపోయేవారు. దీనితో వ్యాపారిలో దిగులు మొదలైంది.ఒకరోజు వ్యాపారి వీధిలో నడుస్తుండగా, ఏదో పరిమళాన్ని ఆయన ముక్కు గుర్తించింది. సుగంధ ద్రవ్యాల దుకాణం గానీ, అత్తర్ల దుకాణం గానీ సమీపంలో లేవని ఆయనకు తెలుసు. మరెక్కడినుంచి ఇంత మంచి వాసన వస్తోంది? ఇంకా నడుస్తుండగా ఆ పరిమళం మరింత హాయిగా, మెత్తగా అతడిని తాకుతోంది. చూస్తే వీధి చివర వున్న చింతచెట్టు కింద నుంచి వస్తోంది. అక్కడ ఒక సన్యాసి కూర్చునివున్నాడు. సన్యాసి మౌనంగా, ధ్యానంగా ప్రార్థిస్తూవున్నాడు. ఆయన పెదవులు చిన్నగా కదులుతున్నాయి. ఆ పరిమళం సన్యాసి నోట్లోంచి వస్తోందని వ్యాపారి తేలిగ్గానే గ్రహించాడు. కానీ అది అతడికి ఆశ్చర్యం కలిగించింది. దాంతో ప్రార్థన ముగించి, కళ్లు తెరిచేవరకూ ఓపిగ్గా వేచివుండి తన సందేహాన్ని సన్యాసి ముందుంచాడు. ‘నా నోట్లోంచి పరిమళమా? నేను సత్యంగా ఉంటాను. మృదువుగా సంభాషిస్తాను. అంతకుమించి నాకేమీ తెలీదు’ అన్నాడు నిరాడంబరంగా సన్యాసి. ‘నాకు అర్థమైంది స్వామీ’ అన్నాడు సాధువుకు వ్యాపారి భక్తిగా నమస్కరిస్తూ. -
ఏ కోరిక తీరడానికి ఏ ఆరాధన?
►జెన్‌పథం సంపూర్ణ జ్ఞానం అయిదేళ్ళ వయసులో ఒక కుర్రవాడు హిమాలయ పర్వత శిఖరాగ్రాల మీద ఉండే బౌద్ధారామాలకి విద్యాభ్యాసం కోసం పంపబడ్డాడు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సంవత్సరాల తరబడి సిద్ధాంత మూలసార జ్ఞానాన్ని సముపార్జించుకున్న తరువాత, ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్న గురువు ఆదేశంతో, ఆ భిక్షువు పర్వతశ్రేణుల మధ్య నుంచి దిగి మొట్ట మొదటిసారి నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు. అప్పటి వరకూ ఆశ్రమం దాటి బయటకురాని ఆ పద్దెనిమిదేళ్ళ యువకుడికి అంతా కొత్తగా ఉంది. బౌద్ధసాధువులకు సాంప్రదాయకమైన భిక్షాటన నాశ్రయించి, ఒక ఇంటి ముందు నిలబడి మధుకరం అర్థించాడు. ఇంటి యజమాని యువ సాధువు కాళ్ళు కడిగి సగౌరవంగా లోపలికి ఆహ్వానించి, భిక్ష వేయమని కూతుర్ని ఆదేశించాడు. ఒక పదహారేళ్ళమ్మాయి లోపల్నుంచి ఏడు రోజులకి సరిపడా బియ్యాన్ని తీసుకొచ్చి అతడి జోలెలో నింపింది. ఆమెని చూసి యువకుడు చకితుడయ్యాడు. అప్పటివరకూ పురుషులనే తప్ప ‘స్త్రీ’ని చూడలేదతడు. ఆమె గుండెల కేసి చూపించి తామిద్దరి మధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మనుష్యుల మధ్యకి తొలిసారి వచ్చిన సన్యాసి అని తెలుసు. స్త్రీ పురుషుల తేడా గురించి చెపుతూ, ‘వివాహం జరిగి తల్లి అయిన తరువాత క్షీరమునిచ్చి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత స్త్రీకి ఉన్నది కాబట్టి ప్రకృతి ఆమెకు ఆ విధమైన అవయవాలను సమకూర్చింది’ అని వివరణ ఇచ్చాడు. సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆ రోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజుల దినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరకు చేరుకున్నాడు. అలా ఎందుకు చేశావని అడిగాడు గురువు. ‘‘తర్వాతెప్పుడో దశాబ్ద కాలం తరువాత ప్రపంచంలోకి అడుగిడబోయే బిడ్డ కోసం తగు ఏర్పాట్లన్నీ ప్రకృతి ముందే సమకూర్చినప్పుడు, రేపటి ఆహారం గురించి ఈ రోజు తాపత్రయపడటం ఎంత నిష్పయ్రోజనమో నాకు అర్థమయింది స్వామీ..!’’ అన్నాడా భిక్షువు. ‘‘బౌద్ధం గురించీ, బంధం గురించీ సంపూర్ణమయిన జ్ఞానం నీకు లభించింది నాయనా‘ అంటూ శిష్యుణ్ణి కౌగిలించుకొని అభినందించాడు ఆచార్యుడు. ఏ కోరిక తీరడానికి ఏ ఆరాధన? కోర్కెల సాఫల్యం కోసం వివిధ దేవతా పూజలను చేయడమనేది వేదకాలం నుంచి ఉన్న ఆచారమే. ఉదాహరణకు చదువు బాగా రావాలనే కోర్కె సిద్ధించాలంటే సరస్వతీదేవిని, హయగ్రీవుణ్ణీ ఆరాధించాలంటారు ఆర్యులు. పుత్రసంతానాన్ని పొందేందుకు దక్షుడు మొదలైన ప్రజాపతులను ఆరాధించాలి. సంతాన ప్రాప్తికి ఆది దంపతులైన శివపార్వతులలో పార్వతీదేవిని ఆరాధిస్తే దాంపత్య సౌఖ్యం దక్కుతుందట. విద్యాబుద్ధులు రావాలంటే దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. సౌందర్యం సిద్ధించాలంటే చంద్రుణ్ణి ఆరాధన చేయాలంటోంది శాస్త్రం. అన్నం కలకాలం ప్రాప్తించాలంటే అదితి, అన్నపూర్ణాదేవిల ఆరాధన చేయాలి. వైభోగ ప్రాప్తికి ఇంద్రుణ్ణి ఆరాధించాలి. కష్టాలు తొలగేందుకు దుర్గాదేవిని, నిత్యసౌభాగ్యాన్ని అందించేందుకు ఆదిముల్తైదువ పార్వతీదేవిని, బలానికి వాయుదేవుణ్ణి, వీర్యపుష్టికి అగ్నిదేవుణ్ణీ, ఆరోగ్యానికి సూర్యభగవానుడినీ, ఆయుర్దాయం కోసం అశ్వినీ దేవతలనీ, పరమశివుణ్ణీ; ధర్మం తప్పకుండా ఉండాలనే కోర్కెను నారాయణమూర్తినీ పూజించాలి. ఈ విధంగా వివిధ కోర్కెలకు వివిధ దేవతా రూపాలను ఆరాధించడం వల్ల శీఘ్రంగా నెరవేరతాయని శాస్త్రోక్తి. పూజలలో కలశం ఎందుకు? మనం ఏ పూజ, నోము లేదా వ్రతం చేసుకున్నా కలశం తప్పనిసరిగా పెడతాం. ఈ కలశంలోని నీటినే మనం పూజించే దైవానికి సమర్పించే అర్ఘ్యపాద్య అభిషేకాదులకు ఉపయోగిస్తాం. ఎందుకంటే భగవంతునికి సమర్పించే నీరు పవిత్రంగా ఉండాలి కాబట్టి పుణ్యతీర్థాల నుంచి తెస్తే మంచిది. లేదంటే మనకు లభించిన నీటినే ఒక పాత్రలో ఉంచి, ఆ కలశానికి పూజ చేసి ఆయా దేవతలను ఆహ్వానించడం ద్వారా ఆ జలాన్ని పవిత్రీకరణ గావించి భగవంతునికి చేసే ఉపచారాలలో వాడటం శ్రేష్ఠం. నిత్యపూజావిధానంలో కలశంలోని జలంలోనికి త్రిమూర్తులను, మాతృగణాలను, సప్తసాగరాలను, సప్తద్వీపాలతో కూడిన భూ మండలాన్ని, చతుర్వేదాలను, వేదాంగాలను ఆహ్వానిస్తారు. కలశాన్ని గంధం, పుష్పాలు, అక్షతలతో అర్చించి, ఈ నీటిని పవిత్రీకరణ గావించి, ఆ జలాన్ని పూజాద్రవ్యాలపైన, తమపైన, దేవతా విగ్రహాలపైనా సంప్రోక్షణ చేసుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల శుద్ధి చేసినట్లేనని శాస్త్రం చెబుతోంది. ⇒ మనం పూజ చేసేటప్పుడు ఆచమనం చేసే పాత్ర, దేవతలకు ఉపచారాలు చేయడం కోసం ఉపయోగించే పాత్ర వేర్వేరుగా ఉండాలి. మనం వాడుకున్న పాత్రలోని నీటిని భగవంతుని కలశానికి వాడరాదు. జపమాలకు108 పూసలేఎందుకు? అష్టోత్తర శతం అని అంటూ ఉంటాం కదా, అష్ట అంటే ఎనిమిది. ఉత్తరం అంటే ఎక్కువయినదని అర్థం. శతం అంటే వంద. ఎనిమిది ఎక్కువైన వంద అంటే నూట ఎనిమిది. వేదంలో 108వ మంత్రం, 116వ మంత్రం పరమేశ్వరుణ్ణి నేరుగా సంబోధించి చెప్పే మంత్రం. ఆ కారణంగా ఆ సంఖ్యలలో 108 పరమేశ్వర సన్నిధానానికి చేర్చగలిగిన శక్తి ఉన్నదని, ఇక 116 అనేది గురువుకి దక్షిణ ఇచ్చే సందర్భంగా చదివే మంత్రం కాబట్టి, నూట పదహారు పండిత దక్షిణ అనీ ఓ పద్ధతి వచ్చింది. 108... పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగిన మంత్ర సంఖ్య. అలాగే 108 పురాణాలు, 108 ఉపనిషత్తులున్నాయి. గ్రహాల సంఖ్యను రాశుల సంఖ్యతో హెచ్చిస్తే 108. నాడులు 108, శక్తి పీఠాలు 108... ఇలా 108 అంకెకు విశిష్టత ఉంది కాబట్టే జపమాలలో పూసలు 108గా పెద్దలు నిశ్చయించి ఉండవచ్చు. నమస్కారంలోని గొప్పతనం ఏమిటి? అయిదువేళ్లలో మనకి దగ్గరగా ఉండే బొటనవేలు. మన దగ్గరి వాళ్లకి మంచి జరగాలని, కష్టాలు తొలగి, సుఖాలు కలగాలని చెబుతుంది. మనకి మార్గదర్శకులై, విద్యాబుద్ధులు నేర్పి, చక్కటి సలహాలిచ్చిన ఉపాధ్యాయులకి, మన ఆరోగ్యం తప్పుదారి పడితే దాన్ని సక్రమమార్గంలోకి తెచ్చే వైద్యులకు మంచి జరగాలని, వారి కష్టాలు తొలగి, సుఖాలు కలగాలని చూపుడు వేలు చెబుతుంది. తర్వాతి వేలు, అతిపెద్దదైన మధ్యవేలు... మన మతపెద్దలు, నాయకులు మహాత్ములకి మంచి జరగాలని గుర్తు చేస్తుంది. నాలుగోవేలు ఉంగరపు వేలు, అతి బలహీనమైన వేలు. హార్మోని, పియానో వాయించేవారికి ఇది తెలుస్తుంది. ప్రపంచంలోని బలహీనులు, పేదలు, రోగగ్రస్థులు, బాధల్లో ఉన్నవారి కష్టాలు తొలగిపోయి, శుభం చేకూరాలని ప్రార్థిస్తుంది. చివరగా చిటికెనవేలు, దేవుడి ముందు మనం ఎంతో చిన్నవాళ్లమని, అవతలివారికన్నా మనం అల్పులమని, కాబట్టి మనకన్నా ఉన్నతుడైన దేవుణ్ణి ప్రార్థించాలని గుర్తు చేస్తుంది. నమస్కారం ద్వారా మన వేళ్ల చివరలనున్న నాడులు చైతన్యవంతమవుతాయి. అవతలివారి పట్ల గౌరవం, వారు చెప్పేమాటలపై శ్రద్ధ, సావధానమూ కలుగుతాయి. సర్వం సాయిమయం! శిరిడీలో ఒక గజ్జి కుక్క ఉండేది. ఒక రోజు మహల్సాపతి తన ఇంట్లోచి ప్రసాదం తీసుకుని బాబా ఉండే మసీదుకు బయల్దేరాడు. అతని చేతిలోని ఫలహారం పళ్లెం వైపు చూసిన గజ్జికుక్క ఆశగా తోక ఊపుకుంటూ మహల్సాపతి వెంటపడింది. మహల్సాపతి రెండుమూడుసార్లు దానిని అదిలించాడు. అయినా అది వెనుకే రావటంతో విసుగెత్తి కర్రతో కొట్టాడు. ఆ కుక్క దీనంగా రోదిస్తూ వెళ్లిపోయింది. మహల్సాపతి ప్రసాదం తీసుకుని వెళ్లి బాబా ఎదుట పెట్టి భక్తితో రెండు చేతులూ జోడించాడు. బాబా ఆ ప్రసాదం పళ్లెం వైపు కన్నెత్తయినా చూడకుండా ఇలా అన్నారు. ‘మహల్సా!’ పాపం ఆ కుక్క నలుగురిపై ఆధారపడి ఎలాగో బతుకీడుస్తుంది. దానిని కొట్టడానికి మనసెలా వచ్చింది? అంటూ తన వీపుపై తగిలిన దెబ్బను చూపించారు. అన్ని జీవుల్లోనూ తానే ఉన్నాననేది బాబా ఉవాచ. మౌనమేమంచి జ్ఞానసాధనం ⇒ భగవంతుణ్ణి నీ అంతర్నేత్రంలో దర్శించడానికి సరళమైన మార్గం మౌనమే అని తన జీవితం ద్వారా నిరూపించిన ఆధ్యాత్మిక సంపన్నులు భగవాన్ రమణ మహర్షి. ఆయన బోధలు... ⇒ మౌనంలో విశ్రమించు, మనస్సు మూలాల్ని అన్వేషించు. ⇒ ‘నేను’ అనే భావం ఎక్కడినుంచి వస్తుందో చింతన చేస్తూ పరిశీలిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. ⇒ గురువు అనుగ్రహానికి ఉత్తమోత్తమరూపం మౌనమే. అదే అత్యుత్తమ ఉపదేశం కూడా. ⇒ మౌనంలోనే సాధకుని ప్రార్థన సైతం పరాకాష్ఠకు చేరుతుంది. ⇒ అన్ని దీక్షలకంటే మౌనదీక్ష ప్రశస్తమైంది. అదే అన్ని దీక్షలకు మూలం. ⇒ గురువు మౌనంలో ప్రతిష్థితుడైతే, సాధకుని మనస్సు దానంతట అదే విశుద్ధిని పొందుతుంది ఉత్తమమైనదానం అన్నదానానికి మించిన దానం ముల్లోకాల్లోనూ లేనేలేదని ప్రసిద్ధంగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏ వస్తువుని దానం చేసినా ‘మరికొంత ఇస్తే బాగుండేది– ఇంకా కొద్ది విలువైనదిస్తే చక్కగా ఉండేది’ అనే అభిప్రాయం కలగవచ్చునేమో కాని అన్నం వడ్డించడం ఆరంభిస్తే ‘ఇంక చాలు, వద్దు వద్దు’ అంటారట. అన్నం వద్దు, పప్పు వెయ్యద్దు, పులుసు చాలు, సరిపోయింది, పెరుగుకి ఖాళీయే లేదు అంటారు. అంటే కడుపు నిండిపోయిన సంతృప్త భావన కలుగుతుంది. మిగిలిన ఏ దానానికీ ఈ విధమైన భావన కలగదు. అందుకే అన్ని దానాలలోకీ అన్నదానమే గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆలయాలలోనూ, యాత్రాస్థలాలలోనూ అన్నదానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. – యామిజాల జగదీశ్