ఒక పక్కన కూర్చుని ఆ గ్రామీణుడు వాళ్ల సంభాషణే వింటున్నాడు. ‘అసలు ప్రపంచంలో ఉన్నది ఏదైనా మన మనసులో ఉన్నదే’ అన్నాడు అందులో ఒక సన్యాసి.
ఒక చిన్న ఊళ్లో, ఒక చిన్న గుడిలో ఒకాయన నివసించేవాడు. ఆ గ్రామీణుడు తన దైనందిన జీవితంలో మునిగి, తన పనులేవో చూసుకుంటూ బతికేవాడు. ఒకరోజు ఆ దారిన ప్రయాణిస్తున్న నలుగురు సన్యాసులు ఆ గుడి దగ్గర ఆగారు. రాత్రిపూట అక్కడ పడుకోవడానికి వీలవుతుందా అని అడిగారు. ఈయన ఎంతో అభిమానంగా వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాడు. రాత్రిపూట కట్టెపుల్లలు తెచ్చి వారికోసం చలిమంట వేశాడు. చలిమంట కాచుకుంటూ నలుగురు సన్యాసులు తీవ్రమైన ఆధ్యాత్మిక చర్చలోకి దిగిపోయారు. పదార్థమూ, చైతన్యమూ ఇట్లా ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక పక్కన కూర్చుని ఆ గ్రామీణుడు వాళ్ల సంభాషణే వింటున్నాడు.‘అసలు ప్రపంచంలో ఉన్నది ఏదైనా మన మనసులో ఉన్నదే’ అన్నాడు అందులో ఒక సన్యాసి.
‘అట్లా అయితే ఆ దూరాన ఉన్న ఆ పెద్ద బండరాయి కూడా మన మనసులోనే ఉందంటావా?’ అడిగాడు మరో సన్యాసి.‘ఒక లెక్కలో ఆలోచిస్తే అది మనలోనే ఉన్నట్టు’ మొదటి సన్యాసిని సమర్థించాడు మూడో అతను.‘అవునవును’ అంగీకరించాడు నాలుగో వ్యక్తి.కాసేపు చర్చ ఆగింది. మంట వెలుగుతోంది. వారి మాటల సారాన్ని ఆకళింపు చేసుకుంటూ అన్నాడు గ్రామీణుడు: ‘అయ్యలారా! అయితే మీ మనసులు ఇప్పుడు ఆ పెద్దబండరాయిని మోస్తూవుండాలి. ఈ కాసేపైనా దింపేయండి’.
Comments
Please login to add a commentAdd a comment