మోడల్‌గా అందాల పోట్లీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచి అందర్నీ ఆకర్షించింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించి ప్రజలను మెప్పించింది. అలాగే నిర్మాతగా మారి ఎన్నో విజయాలను అందుకుంది. ఆఖరికి టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించడం తోపాటు కొన్ని టీవీ షోలను కూడా హోస్ట్ చేసింది. అలాంటి ఆమె గ్లామర్ ఫీల్డ్‌ని వదిలిపెట్టి బౌద్ధం వైపు ఆకర్షితురాలై అన్నింటిని పరిత్యజించింది. ఇప్పుడామె ఎలా జీవిస్తుందో వింటే విస్తుపోతారు..!.
గతంలో బర్ఖా మదన్‌గా పిలిచే గ్యాల్టెన్ సామ్టెన్ అనే నన్ ఒకప్పుడు బాలీవుడ్ నటి. సినీ ఇండస్ట్రీలో ప్రముఖ అగ్ర హీరోయిన్‌లో ఒకరిగా వెలుగొందింది. 1994లో మిస్ ఇండియా అందాల పోటీలో(Beauty Pageants) పాల్గొంది. అప్పుడు బాలీవుడ్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సుస్మితా సేన్ విజేతగా నిలిచారు. అదే పోటీలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు.
బర్ఖా మదన్(Barkha Madan) మాత్రం మిస్ టూరిజం ఇండియాగా ఎంపికైంది. మలేషియాలో కూడా మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడవ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 1996లో, అక్షయ్ కుమార్, రేఖ రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం 'ఖిలాడియోన్ కా ఖిలాడి ద్వారా బాలీవుడ్(Bollywood)లోకి అడుగుపెట్టింది. ఖిలాడీ సిరీస్ నాల్గోవ సీజన్‌లో ఆమె నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు అందుకుంది.
సెన్సెషన్ డైరెక్టర్‌గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ భయానక చిత్రం భూత్‌లో మంజీత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రను పోషించి మెప్పించడమే గాకండా ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేసింది. అలాగే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది కూడా. అంతలా గ్లామర్ ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని, కెరీర్ మంచీ పీక్‌లో ఉన్న సమయంలో అందర్నీ విస్మయానికి గురిచేసేలా అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది.
సన్యసించసడానికి కారణం..
సెరా జే అనే బౌద్ధ ఆశ్రమంలోని గురువు జోపా రిన్‌పోచేని చేస్తున్న సుదీర్ఘ పూజలో పాల్గొన్న బర్ఖా మదన్ తాను సన్యసిస్తానని చెప్పింది. అందరి ప్రయోజనం కోసం ఇలా సన్యసించడం మంచిదా? కాదా? అని ప్రశ్నించి మరీ ఈ నిర్ణయానికి సిద్ధపడింది. సన్యసించాలని అనుకుంది గానీ వారిలాంటి ఆహర్యానికి అలవాటు పడగలనా అనుకుంది. ఇలా తర్జనాభర్జన పడుతుండగా.. ఒక పొడవైన తెల్లటి అమ్మాయి జుట్టు లేకండా గుండ్రని గుండుతో ఎదురవ్వతుంది.
ఆమెతో మాటలు కలిపి తనను తాను పరిచయం చేసుకుని ఇలా సన్యసించి ఉండటం సాధ్యమేనా అని ప్రశ్నించింది. ఆమె చిరునవ్వుతో సులభమే అంతగా కావాలంటే శీతాకాలపు వస్త్రాలు అదనంగా ఉన్నాయి. వేడుకల టైంలో మీరు ధరించవచ్చు అని చెప్పింది. ఆ సంభాషణ తర్వాత తన గదిలోకి వచ్చి కళ్లు ముసకున్నా.. ఆమె మాటలే బలంగా మనసుకు తాకాయి. ఏదో తెలియని శక్తి తన గురువు రిన్‌పోచే నంచి తనలోకి ప్రవేశిస్తున్న భావన కలిగింది.
వెంటనే బలంగా సన్యాసించాలని డిసైడ్ అయ్యి తన తల్లికి తన కోరికను చెప్పింది. ఆమె వెంటనే బర్ఖాతో "నీక నీ గురువుపై విశ్వాసం ఉందా..? ఆయన నీకు ఖచ్చితంగా మంచి సలహానే ఇస్తారని భావిస్తే..సంకోచించకుండా నిర్ణయం తీసుకోమని చెప్పింది. దీనికి ఆమె తండ్రి కూడా మద్దతు తెలపడంతో ఏ మాత్రం ఆలస్యించకుండా బౌద్ధ సన్యాసినిగా మారిపోయింది.
పదేళ్ల ప్రాయంలోనే..
నిజానికి బర్ఖాకు ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయాణం పదేళ్ల వయసు నుంచే ప్రారంభమైంది. సిక్కింలోని రుంటెక్ మఠాన్ని సందర్శించడం బౌద్ధ తత్వశాస్త్రంపై ఆమె ఆసక్తిని రేకెత్తించింది. ఎప్పుడైతే బర్ఖా దలైలామాని కలిసిందో అది మరింతగా బలపడి అన్నింటిని త్యజించి సన్యాసం తీసుకునేందుకు దారితీసింది. అలా బర్ఖా 2012లో సెరా జే మఠంలో వెనరబుల్ చోడెన్ రిన్‌పోచే ఆధ్వర్యంలో బౌద్ధ సన్యాసం స్వీకరించి(Buddhist Nun) పేరుని గ్యాల్టెన్ సామ్టెన్(Gyalten Samten)గా మార్చుకుంది.
హిమాలయ ప్రాంతేతర భారతీయ బౌద్ధ సన్యాసినులలో ఒకరిగా ధ్యాన విహారయాత్రలు, బౌద్ధ అధ్యయనాల, సామాజిక సేవలకు తనను తాన అంకితం చేసుకుంది. ఇటీవలే లడఖ్‌లో మూడేళ్ల విహారయాత్రను పూర్తి చేసినట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకుంది. అంతేగాదు బౌద్ధ సన్యాసిగా మారిన క్రమం గురించి కూడా షేర్ చేసుకుంది. మన ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అంతా ఇంత కాదు..ఎందరో గొప్ప వ్యక్తులను తన వైపుకి ఆర్షితులయ్యేలా బలంగా ప్రభావితం చేసి ఆకళింపు చేసుకంటుంది.
(చదవండి: మాములు వెయిట్ లాస్ జర్నీ కాదు..! ఏకంగా 145 కిలోలు నుంచి..)
Comments
Please login to add a commentAdd a comment