Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

YSR Jayanthi 2025: YS Jagan Pays Tributes YSR at YSR Ghat Tweet Updates1
YSR Jayanthi: ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ జగన్‌ నివాళి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో విజయమ్మ, వైఎస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు.వైఎస్‌ జగన్‌ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్‌ వద్దకు పోటెత్తారు.👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)మిస్‌ యూ డాడ్‌.. వైఎస్సార్‌ జయంతిని ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. మిస్‌ యూ డాడ్‌ అంటూ ఎక్స్‌ ఖాతాలో ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన ఫొటోలను పంచుకున్నారు.Miss you Dad! pic.twitter.com/0jINDcR1Fj— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025ఆందోళన వద్దు.. అండగా ఉంటాంకడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్‌ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘విద్యార్ధులకు మంచి యూనివర్సిటీ కడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్సీపీ విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటుంది వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు విద్యార్థుల వెంట ఉన్నారు.

Nallapareddy Prasanna Kumar Allegations On Vemireddy Prashanthi Reddy2
నా తల్లిని బెదిరించారు.. నేను ఇంట్లో ఉంటే చంపేవారు: ప్రసన్నకుమార్‌

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో పచ్చ మూకల దాడిపై ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో ఉంటే ఆయనను కచ్చితంగా హత్య చేసేవారిని అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న రాత్రి నా నివాసం పై జరిగిన దాడి నన్ను హతమార్చడానికే అని అర్థమవుతోంది. నేను ఇంట్లో ఉండి ఉంటే నన్ను ఖచ్చితంగా చంపేసేవారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నా తల్లిని బెదిరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చరిత్ర నెల్లూరు వాసులు అందరికీ తెలిసిన విషయమే. నేను చేసిన ప్రతీ వ్యాఖ్యకి కట్టుబడి ఉన్నాను. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. ఈ దాడి విషయంలో పోలీస్ శాఖ న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇటువంటి దాడులపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. డిప్యూటీ సీఎం అయిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చుని పోవటం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు.. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ..‘200 మంది అరాచక వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించారు. కంటికి కనపడిన వస్తువులు అన్నింటినీ ధ్వంసం చేశారు. నీ కుమారుడు ఎక్కడ అంటూ నన్ను బెదిరించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నిన్న రాత్రి జరిగిన ఘటనతో భయాందోళనకు గురయ్యాను. ఇలాంటి దాడులు ఏనాడు చూడలేదు. నా కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే అతన్ని చంపేసేవారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మారణాయుధాలతో దాడి..ఇదిలా ఉండగా.. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమ­యంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్‌ తలు­పులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభా­గంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టిం­చారు. కంటి ఆపరేషన్‌ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్ట­బోమని దుండగులు హెచ్చరించారు.అయితే, పోలీసులు వస్తున్నా­రని తెలుసుకుని దుండగులు బైక్‌లపై పరార­య్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్‌శ్‌ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రసన్నను హత్య చేసేందుకేనా?దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకు­మా­ర్‌రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగ­ట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణా­యుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్న­కుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు.

CM Revanth And KTR Political Challenge Security At Press Club3
సీఎం రేవంత్‌ Vs కేటీఆర్‌.. అసెంబ్లీలో కాంగ్రెస్‌.. ప్రెస్‌క్లబ్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల సవాల్‌ అప్‌డేట్స్‌.. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్‌ కామెంట్స్‌..ముఖ్యమంత్రికి బేసిక్‌ నాలెడ్జ్‌ లేదు.18 నెలలుగా రైతులను మోసం చేశారు.ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రంకెలేస్తున్నారు.రేవంత్‌కు రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదు.రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తే చర్చకు ఆయన రాలేదు.రేవంత్‌ మాట తప్పుతారని తెలిసినా సవాల్‌ను స్వీకరించాం.సీఎం కాకపోయినా మంత్రి అయినా వస్తారని అనుకున్నాం.తెలంగాణ నిధులు ఢిల్లీకి పారిపోతున్నాయి.రైతులపై సీఎం రేవంత్‌ రెడ్డి గౌరవం లేదు.ఢిల్లీకి సీఎం ఎందుకు వెళ్లారని అడిగితే ఎరువుల కోసం అని చెబుతున్నారు.రైతుబంధు అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు.కొడంగల్‌లో ఎంత మంది రైతులకు రైతుబంధు పడలేదో లిస్ట్‌ రెడీగా ఉంది.రైతుల మరణాల లిస్ట్‌ కూడా తీసుకొచ్చాం.ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. ఇప్పటికైనా మరోసారి సవాల్‌ చేస్తున్నా. రేవంత్‌తో చర్చకు సిద్ధం.. ప్లేస్‌ ఎక్కడో డిసైడ్‌ చేయాలని సవాల్‌ చేస్తున్నా. డేట్‌ కూడా మీరే ఫిక్స్‌ చేయండి.. ఎక్కడి రమ్మంటే అక్కడి వస్తాం. మీకు నిజయితీ ఉంటే చర్చకు రండి. అసెంబ్లీకి కాంగ్రెస్‌ నేతలు..అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఅసెంబ్లీ వేదికగానే సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.అసెంబ్లీకి రమ్మంటే బీఆర్‌ఎస్‌ నేతలు పారిపోతున్నారు.సభ పెట్టేందుకు కేసీఆర్‌తో లేఖ రాయించండి.9 రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.బీఆర్‌ఎస్‌ మాటలపై చర్చ పెడదాం. ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్‌ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్‌ప్రెస్‌క్లబ్‌ వద్దకు భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు. ప్రెస్‌కబ్ల్‌లో సీఎం రేవంత్‌కు కుర్చీ వేసిన కేటీఆర్‌. తెలంగాణ భవన్‌ నుంచి ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరిన కేటీఆర్‌భారీ కాన్వాయ్‌తో ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్‌. ప్రెస్‌క్లబ్‌ వద్ద టెన్షన్‌ టెన్షన్‌.. కాంగ్రెస్‌ నేతలకు కేటీఆర్‌ సవాల్‌ సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఈరోజు ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకోనున్నారు. ఇక, ఇప్పటికే సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌ వద్దకు బీఆర్‌ఎస్‌ నేతలు చేరుకుంటున్నారు. దీంతో, ప్రెస్‌క్లబ్‌ ఎదుట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.మరోవైపు.. తెలంగాణ భవన్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. రైతు సంక్షేమంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ సవాల్‌ చేశారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నేతలు మర్చిపోయారు. హామీలు అమలు చేయాలని 18 నెలలుగా కోరుతున్నాం. అడ్డగోలు హామీలతో రైతులతో పాటు అందరినీ మోసం చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టరు.. పెట్టినా మాకు మైక్‌ ఇవ్వరు. దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్‌ సవాల్‌ విసిరారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరించి ప్రెస్‌క్లబ్‌కు వెళ్తున్నాను. రేవంత్‌ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మంత్రులు అయిన వస్తారేమో చేస్తాం. మంత్రులతోనైనా మేం చర్చలకు సిద్దం అని అన్నారు.

Dr YS Rajasekhara Reddy 76th Birth Anniversary4
జన్మ సార్థకత వైఎస్‌కే చెల్లింది!

‘పుట్టిన రోజు పండగే ప్రతి ఒక్కరికి.. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే’’ పాత సినిమా పాట ఇది. కాకపోతే... దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అతికినట్లు సరిపోతుంది ఇది. వచ్చిన అవకాశాలను ప్రజల కోసం వినియోగించిన తీరు గమనిస్తే పుట్టింది ఎందుకో తెలిసిన వ్యక్తులలో వైఎస్సార్‌ అగ్రభాగాన ఉంటారు. సంపన్న కుటుంబంలో జన్మించినా సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడడం ఆయన ప్రత్యేకత. ఎంబీబీఎస్‌ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మలమడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు. రూపాయి డాక్టర్‌గా సేవలందించి ప్రజల మన్నన చూరగొన్నారు. రాజకీయాలలోనూ ఆయన తన విధానాలను వదులుకోలేదు. ఎన్నో ఎగుడు దిగుడులు చూశారు. సవాళ్లు ఎదుర్కున్నారు. అయినా ఓటమి ఎరుగని నేతగా రికార్డు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు... విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఈ రికార్డు దక్కింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌కు మాత్రమే. ఎమ్మెల్యేగా పోటీచేసినా, ఎంపీగా ఎన్నికల బరిలో దిగినా ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు. 1996లో కడప లోక్‌సభ సీటు నుంచి పోటీచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ గెలవడం ఒక సంచలనం. 1999లోనే ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కాని అప్పట్లో టీడీపీ బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం, కార్గిల్ యుద్ద ప్రభావం, ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కోల్పోయారన్న సానుభూతి వంటి కారణాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేశాయి. ఆ దశలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వైఎస్ నాయకత్వం వహించారు. అప్పట్లోనూ చంద్రబాబు నాయుడు తన సహజశైలిలో వైఎస్ వ్యక్తిత్వ హననం నానా ప్రయత్నాలూ చేశారు. బ్యానర్లు కట్టారని, ఎన్నికల నిబంధనలు సరిగా పాటించలేదని, ర్యాలీలు తీశారన్న చిన్న చిన్న కారణాలపై కూడా కేసులు పెట్టించి వ్యతిరేక ప్రచారం చేసేవారు. వాటిని బూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగేది. ఇందుకు టీడీపీ మీడియా తోడు ఉండనే ఉంది.1999లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా వైఎస్‌ దానిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. తదుపరి పాదయాత్రను ప్లాన్ చేసుకుని జనంలోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు వ్యతిరేకించాయి. సొంతంగా ఎదగడానికి యత్నిస్తున్నారని, భవిష్యత్తులో సోనియా గాంధీని కూడా ధిక్కరిస్తారని పితూరీలు చెప్పేవారు. అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తూండేది. దాంతో వైఎస్ కొన్నిసార్లు ఇబ్బందులు పడేవారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వద్ద అనారోగ్యానికి గురయ్యారు. సోనియా గాంధీని అక్కడకు తీసుకురావాలని కొంతమంది నేతలు యత్నించారు కాని ఎందువల్లో ఆమె రాలేదు. అయినా వైఎస్ తన పాదయాత్రను వదలి పెట్టలేదు. 2003లో చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ దాడి చేసినప్పుడు వైఎస్ తిరుపతి వెళ్లి పరామర్శ చేసి దాడికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. అప్పట్లో చంద్రబాబు సానుభూతి వస్తుందని ఆశించి శాసనసభను రద్దు చేశారు. కాని వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూశారు. పాదయాత్ర ద్వారా ప్రజలలో వచ్చిన ఆదరణను నిలబెట్టుకునేందుకు వైఎస్‌ యత్నించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ గ్రూపులను సైతం కలుపుకుని వెళ్లడానికి సిద్దపడ్డారు. అక్కడ నుంచి ఆయన రాష్ట్ర చరిత్రను ,గతిని మార్చేశారని చెప్పాలి. 2004లో కాంగ్రెస్‌ను విజయపథంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కరాదని కొన్ని యత్నాలు జరగకపోలేదు. అయినా ఆయన తొణకలేదు. చివరికి వైఎస్ కాకుండా మరెవరికైనా సీఎం పదవి ఇస్తే ప్రభుత్వం నడవడం కష్టమని తెలుసుకుని, అధిష్టానం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం మొదలు అనేక హామీల అమలుకు కృషి చేశారు. అంతకుముందు ఒకసారి ఎంపీల సమావేశంలోకాని, ఇతరత్రాకాని నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టకపోతే చరిత్ర హీనులవుతారని ఆనాటి పాలకులను రాజశేఖరరెడ్డి హెచ్చరించే వారు. వైఎస్‌కు భయపడి ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాని 2004 వరకు ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఆ సమయంలో వైఎస్ ఒక కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాల వద్ద పూలు పెట్టివచ్చారు. ఆ సంగతులు అన్నిటిని గుర్తుంచుకున్న వైఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే ప్రాజెక్టులపై సమీక్ష చేసి వాటిని ఎలా పరుగు పెట్టించాలా అని ఆలోచన చేశారు. వైఎస్‌ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు. ఉమ్మడి ఏపీలో ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి. రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు విస్తరణతో సహా హంద్రీ నీవా, గాలేరు-నగరి, గండికోట ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టారు. తెలంగాణలో ఎల్లంపల్లి, కల్వకర్తి, బీమా, ప్రాణహిత-చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోస్తాంద్రలో పోలవరం, పులిచింతల, వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలైవని ఉన్నాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో తెలంగాణ వారితో పాటు ఆంధ్రకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు, నిరసనలు ఎదుర్కున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు తవ్వుతుంటే టీడీపీ ఎన్నో ఆటంకాలు కల్పించింది. అయినా ఆయన ఆగలేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కావల్సిన అనుమతులు తేవడంలో వైఎస్ చూపిన శ్రద్ద నిరుపమానం. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకున్నదంటే ఆ ఘనత ఆయనదే. పులిచింతల నిర్మాణం దశాబ్దాల తరబడి స్తంభించిపోతే వైఎస్సార్‌ దానిని చేసి చూపించారు. దానిని వ్యతిరేకించే తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఒప్పించి మరీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. ఒక నేత ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావని భావిస్తే, వైఎస్ మాత్రం మనం మొదలుపెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారంటూ విశాల దృక్పథంతో ఆరంభించారు. ఈ రోజు విభజిత ఆంధ్ర ఈ మాత్రమైనా నిలబడిందంటే అది వైఎస్ గొప్పదనమని అంగీకరించక తప్పదు. ఇది మాబోటివాళ్లం ఇప్పుడు చెప్పడం లేదు. 2009 నుంచే చెబుతున్నాం. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం కట్టిన ఒక సీఎం హైదరాబాద్ తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ ప్రచారం లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఒక రూపం తెచ్చారు. అదంతా ఒక ఆధునిక నగరంగా మారిందంటే బీపీ ఆచార్య అనే ఐఎఎస్ అధికారిని నియోగించి వైఎస్ చేసిన కృషే అని చాలామందికి తెలియక పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ప్రచారం చేసుకోలేకపోయింది. టీడీపీ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకతను భరిస్తూ ఔటర్‌ రింగ్ రోడ్డు నిర్మాణం మూడువంతులు పూర్తిచేశారు. హైదరాబాద్ దశ, దిశను మార్చిన గొప్ప ప్రాజెక్టు అది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణమే కాకుండా, అక్కడకు వెళ్లడానికి వీలుగా ఎక్స్‌ప్రెస్‌ వంతెనను 13 కిలోమీటర్ల దూరం నిర్మించడం ద్వారా ఆయనకు ఉన్న విజన్‌ను ప్రజలకు తెలియ చేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన నేతగా, విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టి పేదలకు విద్యాదానం చేసిన వ్యక్తిగా చరిత్రపుటలలోకి ఎక్కారు. 2009లో ఆయనను ఓడించడానికి టీడీపీ ఏకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసిందంటేనే వైఎస్ ఎంత శక్తిమంతుడుగా అవతరించారో అర్థం చేసుకోవచ్చు. పరస్పర విరుద్ద భావాలు కలిగిన టీడీపీ, టీఆర్‌ఎస్‌(నేటి బీఆర్‌ఎస్‌), సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూటమి కట్టినా 2009లో వైఎస్‌ను ఓడించలేకపోయాయి. మొత్తం బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి రావడానికి కూడా వైఎస్ కారణభూతులయ్యారు. అయినా ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. వైఎస్ జీవించి ఉన్నా, వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌ను సీఎంగా చేసినా ఉమ్మడి ఏపీ భవిష్యత్తు మరోలా ఉండేదని చాలామంది నమ్ముతారు. ఏది ఏమైనా వైఎస్ సీఎంగా చేసింది ఐదేళ్ల మూడునెలల కాలమే అయినా, ఒక శతాబ్దానికి సరిపడా పేరు తెచ్చుకుని గొప్పనేతగా ప్రజల మదిలో నిలిచిపోయారు.వైఎస్ రాజశేఖరరెడ్డికి జయంతి సందర్భంగా ఇదే నివాళి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Edgbaston Hero Akash Deep Inspiring Story: Sister Says Do Well For Country5
బాధపడకు తమ్ముడు!.. ఇంకో ఆర్నెళ్ల సమయం ఉంది.. అన్నీ తానై..

లక్నో: భారత పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ (Akash Deep) విజయవంతమైన బౌలింగ్‌ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన అతని సోదరి అఖండ్‌ జ్యోతి సింగ్‌ భావోద్వేగానికి గురైంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న జ్యోతికి.. ఎడ్జ్‌బాస్టన్‌లోని పది వికెట్ల ప్రదర్శన అంకితమిస్తున్నట్లు మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఆకాశ్‌దీప్‌ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన జ్యోతి తన సోదరుడికి తన ఆనారోగ్యంపై చింతించకుండా దేశం కోసం శ్రమించాలని చెప్పినట్లు వెల్లడించింది.మా నాన్న చనిపోయినపుడు..క్యాన్సర్‌ బారిన పడటంతో తన కుటుంబానికి దూరమైన ఆనందాన్ని ఆకాశ్‌దీప్‌ తన ఆటతీరు ద్వారా తిరిగి తీసుకొచ్చాడని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని 2015 ఏడాది పెను విషాదంలో ముంచిందని... మళ్లీ ఇన్నాళ్లకు ఆనందం వెల్లివిరిసిందని జ్యోతి చెప్పింది. ‘మా నాన్న చనిపోయినపుడు ఆకాశ్‌ ఢిల్లీలో క్లబ్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. అయితే ఆశించిన ఎదుగుదల రాలేదు. దీంతో నేను గట్టిగా చెప్పాను. క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకుంటేనే రాణిస్తావని చెప్పా. ఇక్కడ కుదరకపోతే మరో చోటయినా ప్రయత్నించాలని సూచించాను. దీంతో 2017లో కోల్‌కతాకు మారాక బెంగాల్‌ అండర్‌–23 జట్టు తరఫున నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు. ఒకే ఏడాది తండ్రి, ఓ తమ్ముడు మరణించడంతో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా సరే దేనికి దిగులు చెందక ఆకాశ్‌ లక్ష్యాన్ని చేరుకునేందుకు మా వంతు ప్రయత్నం మేం చేశాం’ అని జ్యోతి వివరించింది.జబ్బు గురించి చెప్పాలనుకోలేదు ఈ మ్యాచ్‌ను మేమంతా చూశాం. వికెట్‌ తీసిన ప్రతీసారి గట్టిగా చప్పట్లతో సంబరం చేసుకున్నాం. దీంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఏమైందని అడిగి వెళ్లిపోయారు. దేశానికి విజయాన్నిచ్చిన అతని ప్రదర్శన మాకైతే పండగను తెచ్చింది. ఇక మీడియాలో నా జబ్బు సంగతి చెప్పినట్లు మొదట తెలియదు.ఎందుకంటే నా క్యాన్సర్‌ గురించి బయటికి వెల్లడించేందుకు మా కుటుంబం సిద్ధంగా లేదు. బహుశా నాపై అప్యాయత కొద్దీ ఆ క్షణం భావోద్వేగానికి గురై అక్కకు అంకితం చేస్తున్నానని చెప్పి ఉండొచ్చు. నేనన్నా... కుటుంబమన్నా అతనికి వల్లమాలిన ప్రేమ. నాకిప్పుడు క్యాన్సర్‌ మూడో దశలో ఉంది. ఇంకో ఆర్నేళ్ల చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఆ తర్వాతే ఏమవుతుందో చూడాలి. ఐపీఎల్‌ సమయంలో హాస్పిటల్‌కు... ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించే ఆకాశ్‌ లీగ్‌ జరిగే సమయంలో పది వేదికలు మార్చి మార్చి ఆడే అంతటి బిజీ షెడ్యూల్‌లోనూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నన్ను పరామార్శించేందుకు మ్యాచ్‌ ముందో, తర్వాతో తప్పకుండా వచ్చేవాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికపై విజయం సాధించాక రెండుసార్లు వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం.అప్పుడు అతను.. నాతో .. ‘‘అక్క ఏమాత్రం బాధపడకు. దేశం మొత్తం మనవెంటే ఉందని చెప్పడంతో ఆ క్షణం నన్ను నేను నియంత్రించుకోలేక భావోద్వేగానికి గురై ఏడ్చేశాను. నిజం చెబుతున్నా... ఇలాంటి తమ్ముడు చాలా అరుదుగా ఉంటాడు. మాకెప్పుడు అండగా ఉంటాడు. మాకు చెప్పందే ఏదీ చేయడు. ప్రతి విషయాన్ని కుటుంబంతో పంచుకుంటాడు. ఆర్నెళ్ల వ్యవధిలోనే మా నాన్న, ఒక సోదరుడు మరణించడంతో కుటుంబభారాన్ని ఆకాశే అన్నీ తానై మోస్తున్నాడు.ఆకాశమంత ధైర్యం నేను క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆకాశ్‌ మాటలే నా స్థయిర్యాన్ని పెంచేవి. నా ఆరోగ్యం గురించే ఆలోచించేవాడు. అప్పుడు నేను అతని దృష్టి ఆటపైనే కేంద్రీకరించేందుకు ధైర్యం చెప్పేదాన్ని. ‘నేనిప్పుడు బాగానే ఉన్నాను. నా కోసం బాధపడొద్దు. నాకు తోడుగా నా భర్త ఉన్నాడు. నీవేం విచారించకు’ అని చెబితే... వెంటనే కల్పించుకుని తానేం చేసినా, సాధించినా సోదరిల కోసం, కుటుంబం కోసమే అని బదులిచ్చాడు.మా తల్లిదండ్రులకు మేం ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలం. ఆకాశ్‌ అందరికంటే చిన్నవాడు. నేను తనకంటే పదేళ్లు పెద్ద. చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య ఆప్యాయత ఎక్కువే. మ్యాచ్‌కు ముందు, తర్వాత నాకు వీడియో కాల్‌ చేసి మాట్లాడతాడు. నేను తీసిన ఈ వికెట్లు నీ కోసం, దేశం కోసం’ అని గర్వంగా చెబుతాడు.రాగానే దహీ వడ తినిపిస్తా ఇంగ్లండ్‌ నుంచి స్వదేశానికి రాగానే ఆకాశ్‌ దీప్‌కు ఇష్టమైన వంట చేసి పెడతా. తనకిష్టమైనవే కాదు... తను ఏం కావాలన్నా సరే వండిపెడతా. నేను చేసే దహీ వడ అంటే అతనికెంతో ఇష్టం. ఆకుకూరలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటాడు. మా ఇంటికి ఎప్పుడొచ్చినా అవే చేసిపెట్టాలంటాడు. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్‌ గిల్‌

Keeravani Father Sivadatta Passed AWAY6
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం కలిగింది. కీరవాణి తండ్రి 'శివశక్తి దత్త' (92) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన తెలుగు సినిమా గీత రచయిత, స్క్రీన్ రైటర్, చిత్రకారుడిగా గుర్తింపు పొందారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గీత రచయితగా అనేక పాటలను రచించారు. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘రామం రాఘవం’ ను ఆయనే రాశారు. అతను తెలుగు చిత్రాలలో సంస్కృతం ఆధారిత పాటలకు సాహిత్యాన్ని వ్రాసినందుకు ప్రసిద్ధి చెందారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా సోదరులు అనే విషయం తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరుకు చెందిన శివశక్తి దత్తా అప్పట్లోనే ఇంటర్‌ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచీ కళల వైపు మొగ్గు చూపిన అతను చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి ముంబైలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు . రెండు సంవత్సరాల తరువాత డిప్లొమా పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మళ్లీ తన స్వస్థలం కొవ్వూరుకు తిరిగి వచ్చారు. చిత్రకారుడిగా కమలేష్ అనే కలం పేరును ఉపయోగించడం ప్రారంభించారు . తరువాత సుబ్బారావు తన పేరును శివ శక్తి దత్తగా మార్చుకున్నారు. దత్తాకు సంగీతంపై కూడా ఆసక్తి ఉంది. గిటార్ , సితార్ , హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు.రాఘవేంద్రరావుతో తొలిసారి జానకి రాముడు (1988) కోసం స్క్రీన్ రైటర్‌గా శివశక్తి దత్తా పనిచేశారు. సై , చత్రపతి , రాజన్న , బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి 2: ది కన్‌క్లూజన్ , RRR , హను-మాన్ వంటి చిత్రాలలో వివిధ పాటలకు సాహిత్యం రాశారు . దర్శకుడిగా చంద్రహాస్‌ (2007) సినిమా కోసం ఆయన పనిచేశారు. బాహుబలి సినిమాలో 'సాహోరే బాహుబలి' , 'మమతల తల్లి' 'దీవర' వంటి సాంగ్స్‌ రాశారు.

New Trains, Projects and Tech Parks ahead of Bihar elections7
ఎన్నికల వేళ.. బీహార్‌కు కనీవినీ ఎరుగని వరాలు

పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ సందడి మొదలయ్యింది. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో తలమునకలై ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్ర రైల్వే మంత్రి బీహార్‌లో కొత్తగా ప్రారంభమయ్యే రైళ్లు, రైలు ప్రాజెక్టులు, టెక్ పార్కుల గురించిన వివరాలను వెల్లడించారు.బీహార్‌లో పర్యటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో చేపట్టబోయే కార్యక్రమాలను మీడియాకు తెలిపారు. బీహార్‌ను దేశంలోని పలు నగరాలతో అనుసంధానించే బహుళ రైలు సర్వీసుల ప్రణాళికలను ఆవిష్కరించారు.కొత్త రైళ్లుపట్నా నుండి ఢిల్లీ: పట్నా-ఢిల్లీ కారిడార్‌ను బలోపేతం చేస్తూ, కొత్తగా రోజూ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు మంత్రి తెలిపారు.దర్భంగా నుండి లక్నో (గోమతి నగర్): వారంలో ఒక్కరోజు నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రారంభం కానుంది.మాల్డా టౌన్ నుండి లక్నో (గోమతి నగర్): పశ్చిమ బెంగాల్- ఉత్తరప్రదేశ్‌లను బీహార్ ద్వారా కలుపుతూ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు.జోగ్బాని నుండి ఈరోడ్ (తమిళనాడు): బీహార్‌ను దక్షిణ భారతానికి అనుసంధానించే రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి ఎక్కనుంది.సహర్సా నుండి అమృత్‌సర్: పంజాబ్‌కు కనెక్టివిటీని పెంచేందుకు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు.మౌలిక సదుపాయాలుభాగల్పూర్-జమాల్పూర్ మూడవ లైన్: రూ. 1,156 కోట్ల అంచనా వ్యయంతో 53 కి.మీ. మేరకు కొత్త మూడవ రైల్వే లైన్ త్వరలో మంజూరు కానుంది.భక్తియార్పూర్-రాజ్‌గిర్-తిలైయా డబ్లింగ్: రూ. 2,017 కోట్ల అంచనా వ్యయంతో 104 కి.మీ. కంటే ఎక్కువ ట్రాక్‌ల డబ్లింగ్ ఏర్పాటు కానుంది.రాంపూర్హాట్-భాగల్పూర్ డబ్లింగ్: రూ. 3,000 కోట్ల అంచనా వ్యయంతో 177 కి.మీ. మేరకు మరో డబ్లింగ్ ప్రాజెక్ట్ మంజూరు కానుంది.సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులురైల్వే మౌలిక సదుపాయాలతో పాటు, బీహార్‌లో సాంకేతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా రెండు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Indian rupee reaction to Donald Trump tariff announcements8
ట్రంప్‌ అదనపు డ్యూటీల ప్రస్తావన.. రూపాయి నేలచూపు

డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ తాజాగా 54 పైసలు పతనమైంది. దాంతో 85.94 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్‌ 85.53 వద్ద ప్రారంభమైంది. తదుపరి 85.51–86.03 మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ప్రపంచ కరెన్సీలతో డాలరు బలపడటం, యూఎస్‌ టారిఫ్‌ల గడువు దగ్గరపడటం తదితర అంశాలు రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఆయా దేశాలపై 10% అదనపు డ్యూటీలను విధించనున్నట్లు ప్రకటించడం సైతం రూపాయిపై ప్రభావం చూపినట్లు తెలియజేశారు. కాగా, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.25 శాతం పుంజుకుని 97.41కు చేరింది. రూపాయి విలువ ఎలాంటి సందర్భాల్లో ఎలా ఉంటుందో నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ‘పాస్‌వర్డ్‌ సరైందే! ఎందుకు లాగిన్‌ అవ్వట్లేదు’టారిఫ్‌లు వేయడం రూపాయికి ప్రతికూలంగా మారుతుంది. ఎగుమతులు తగ్గిపోతాయి.కొత్తగా ఇతర దేశాలతో చేసుకునే కాంట్రాక్ట్‌లు రూపాయి విలువకు ఊతం ఇస్తాయి.భారత్‌ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు వాటి ధరలు పెరగడం నెగిటివ్‌గా ఉంటుంది.ఆర్‌బీఐ జోక్యం చేసుకొని రూపాయి విలువను స్థిరీకరిస్తుంది.గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్‌ కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తుంది.ట్రంప్ టారిఫ్ వైఖరి మళ్లీ కఠినతరంగా మారితే లేదా భారత్ విస్తృత వాణిజ్య ఉద్రిక్తతల్లోకి వెళితే రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు.

Tamil Nadu: Cuddalore Train Hits School Van News Details9
తప్పెవరిది?.. తమిళనాడు ఘోర ప్రమాదంపై చర్చ

తమిళనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఓ స్కూల్‌ వ్యాన్‌ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.సాక్షి, చెన్నై: తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్‌ వ్యాన్‌ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే.. గేట్‌మేన్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్‌ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్‌మేన్‌ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్‌మేన్‌ పంకజ్‌శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ప్రమాదం ధాటికి వ్యాన్‌ చిన్నారుల మృతదేహాలు ముక్కలై పడ్డాయి. రైలు ఢీ కొట్టిన వేగానికి 50 మీటర్ల దూరం ఎగిరిపడి తుక్కు అయిన వ్యాన్‌ దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.கேட் கீப்பரின் அலட்சியத்தால் பள்ளி வேன் மீது ரயில் மோதி 2 மாணவர்கள் ப**யான கோர விபத்து... தண்டவாளத்தில் சிதறிக்கிடந்த புத்தகப்பை... மனதை நொறுக்கிய காட்சிகள்....!#Cuddalore | #SchoolVan | #RailwayTrack | #GateKeeper | #CuddaloreAccidentUpdate | #TrainAccident | #PolimerNews pic.twitter.com/yv79s6oamO— Polimer News (@polimernews) July 8, 2025

Mangaluru Trans Woman From Begging on the Streets To Owning Autos Becoming a Gym Trainer10
Ajibabu చౌరస్తా నుంచి జిమ్‌ వరకు...!

‘మాట్లాడితే నవ్వు. నడిస్తే నవ్వు. నా జీవితం నవ్వుల పాలైంది’ అంటూ నిరాశ చీకట్లో అనీ మంగుళూరు మగ్గిపోయి ఉంటే... ఎంతో మందికి ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చేది కాదు. భిక్షాటన స్థాయి నుంచి అయిదు ఆటోల యజమాని స్థాయికి ఎదిగిన అనీ ఇతరులకు ఉపాధి ఇవ్వడంతో పాటు ట్రాన్స్‌జెండర్‌ వృద్ధులకు అండగా ఉంది.కర్నాటకలోని రాయచూర్‌లో పేదింట్లో పుట్టిన అజిబాబు మాటతీరు, నడక అమ్మాయిలను పోలి ఉండేవి. దాంతో స్కూల్‌ రోజుల నుంచి వెక్కిరింపులు, అవమానాలు కొత్త కాక΄ోయినా మంగుళూరులో డిగ్రీ చేయడానికి వెళ్లినప్పుడు ఎదుౖరైన చేదు అనుభవాలు తనకు చదువును దూరం చేశాయి. చదువును మధ్యలోనే వదిలేసిన అజిబాబు బెంగళూరులోని ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీలో చేరాడు.జెండర్‌ చేంజ్‌ సర్జరీ తరువాత అనిబాబు అనీ మంగుళూరుగా మారింది. సిటీలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టం అయింది. ఉద్యోగం దొరకడం గగనం అయింది. గత్యంతరం లేక భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అమ్మ ఇచ్చిన కొద్దిమొత్తంతో ఆటో కొనుగోలు చేసి నడపడం మొదలుపెట్టింది అనీ. ఆటో కొనడం తన జీవితానికి టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. మరో మూడు ఆటోలు కొనేస్థాయికి, ఇతరులకు ఉపాధిని ఇచ్చే స్థాయికి ఎదిగింది.అయినప్పటికీ ‘ఇక నాకు ఎలాంటి కష్టాల్లేవు’ అనుకోలేదు అనీ. కష్టాల్లో ఉన్న ట్రాన్స్‌జెండర్‌లకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది.అనీ నటి కూడా. ‘శివలీల’ అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమాకు లైన్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసింది. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపే అనీ ఇప్పుడు జిమ్‌ ట్రైనర్‌గా మారింది.ట్రాన్స్‌ జెండర్‌ వృద్ధుల కోసం భవిష్యత్తులో ఆశ్రమం నిర్మించాలనేది అనీ లక్ష్యంఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement