
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) క్షమాపణలు చెప్పారు. సైఫ్‌పై జరిగిన దాడిని చాలామంది సినీ ప్రముఖులు తవ్రంగా ఖండించారు. కానీ, డాకు మహారాజ్ (Daaku Maharaaj) సక్సెస్‌లో ఉన్న ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సైఫ్‌పై జరిగిన దాడి గురించి కామెంట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంటూనే తన చేతికి ఉన్న వ్రజపు ఉంగరాన్ని చూపుతూ మాట్లాడటం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆమె క్షమాపణలు చెబుతూ సోషల్‌మీడియాలో ఒక నోట్ విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్)
'డియర్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) సర్.. మీకు క్షమాపణలు చెబుతూ పంచుకుంటున్న ఈ పోస్ట్ చేరుతుందని ఆశిస్తున్నాను. ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడుతున్న సమయంలో నేను వ్యవహరించిన తీరుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్న సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు తెలియదు. డాకు మహారాజ్ విజయం వల్ల వచ్చిన సంతోషంలో నేను ఉన్నాను. ఆ సక్సెస్ వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. మీపై జరిగిన దాడి తీవ్రత గురించి తెలుసుకున్న తర్వాత సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. కష్ట సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్యం చాలా గొప్పది' అని పేర్కొన్నారు.
సైఫ్‌పై ఊర్వశి చేసిన కామెంట్లు
'డాకు మహారాజ్' విజయం వల్ల తనకు చాలామంది బహుమతులు పంపించారని ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అదే సమయంలో తనకు వచ్చిన బహుమతులను సైఫ్ దాడికి ముడిపెట్టి మాట్లాడడటం వల్ల ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. 'సైఫ్‌పై దాడి దురదృష్టకరం. నేను నటించిన డాకు మహారాజ్ రూ.105కోట్లు వసూళ్లతో మంచి విజయం సాధించింది. నాకు మా అమ్మ డైమండ్ ఉంగరం కానుకగా ఇచ్చింది.
మా నాన్న ఖరీదైన రోలెక్స్ వాచ్ ఇచ్చారు. అయితే, వాటిని ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకుంటే ఎవరైనా మనపై అలా దాడి (సైఫ్) చేస్తారనే భయం ఉంటుంది' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్ రావడంతో ఊర్వశీ తాజాగా క్షమాపణలు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ దాడి జరిగింది దొంగతనం కోసమే కావడంతో ఆమె వ్యాఖ్యలు కూడా ఆ సంఘటనను గుర్తు చేస్తూ మాట్లాడటం వల్ల విమర్శలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment