Beauty Pageants
-
అందాల పోటీల్లో.. తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది!
అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది. శనివారం ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఓ వేడుకలో 22 ఏళ్ల డచ్ మొలుకన్ మోడల్ రిక్కీ వాలెరీ కొల్లె అనే ట్రాన్స్ జెండర్ ఈ ఘనతను సృష్టించింది. ఆమె ఈ వేడుకలో హబీబా మోస్టాఫా, లౌ డిర్చ్లు, నథాలీ మోగ్బెల్జాదాలను వెనక్కి నెట్టి మరీ మిస్ నెదర్లాండ్స్ టైటిల్‌ను గెలుచుకుంది. అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్‌కి కిరీటం దక్కడం తొలిసారి. ఈ చారిత్రత్మక విజయం 72వ మిస్ యూనివర్స్ టైటిల్‌కు పోటీదారుగా తన స్థానాన్ని పదిలం చేసింది. ఈ మేరకు ట్రాన్స్‌జెండర్ హబీబా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..నా కమ్యూనిటీని గర్వించేలా చేశాను. నేను విజయం సాధించడం నాకు అత్యంత ముఖ్యం. అందుకోసం ప్రతిక్షణం తపనపడ్డా. నేను గెలుస్తానని భావించిన మిస్ నెదర్లాండ్స్ జట్టులోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తాను తనలాంటి వాళ్లందరికీ ఒక రోల్‌మోడల్‌గా ఉండాలని కోరుకున్నా. సమాజంలో తమ పట్ల ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడేలా శక్తిమంతం చేసేందుకు దీన్ని ఒక ఫ్లాట్‌ఫాంగా చేయాలనుకుంటున్నా. నిబద్ధత, బలం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం, తమలాంటి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే తన ధ్యేయం అని పేర్కొంది రిక్కీ. మిస్ నెదర్లాండ్స్ సంస్థ నా వెనుక ఉండటం వల్లే ఈ విజయం సాధించగలిగానని సంతోషంగా చెబుతోంది రిక్కీ. (చదవండి: కెమెరా లాక్కున్న ఆక్టోపస్..ఇచ్చేదే లే! అంటూ యుద్ధమే చేసింది) -
అందాల పోటీలు: మీరు ఎలా ఉన్నా పర్వాలేదు.. కాళ్లు బావుంటే చాలు
అందాలపోటీలు అనగానే అందమైన యువతులు స్టైల్‌గా ర్యాంప్‌వాక్ చేస్తున్న దృశ్యం మన కళ్లముందు కనిపిస్తుంది. 90వ దశకం నుంచి సౌందర్యపోటీలు వెలుగులోకి వచ్చాయి. బ్యూటీ విత్ ఏ పర్సన్ అన్నట్లు బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా చాలా ప్రధానం. ఈ పోటీలు వివిధ దశల్లో జరుగుతుంటాయి. అయితే 1930 -53 కాలంలో చెప్పులతో అందాల పోటీలు జరిగేవి. వినడానికి విడ్డూరంగా ఉన్నా సౌందర్యం చూసో, ఫిజికల్ ఫిట్నెస్ చూసో కాకుండా కాళ్లను చూసి విజేతలుగా ప్రకటించేవారు. సౌందర్య పోటీల్లో వస్త్రధారణ, ర్యాంప్‌వాక్ వంటివి ప్రత్యేక ఆకర్షణ. అయితే 1900 ప్రారంభంలో మహిళల అందాల పోటీల్లో "ది ప్రెట్టీ యాంకిల్ కాంటెస్ట్" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు ముఖం చూపించకుండా తెర వెనుక నిల్చుంటారు. మోకాలి కింద వరకు డ్రెస్ చేసుకొని అందరూ ఒకే వరుసలో నిల్చుంటారు. ఈ పోటీల్లో ప్రధానంగా కాళ్లను బట్టి విజేత ఎవరో ప్రకటించేవారు. అల వైకుంఠపురములో సినిమాలో పూజాహెగ్డే కాళ్లను చూసి అల్లు అర్జున్ మెస్మరైజ్ అయినట్లు ఈ యాంకిల్ కాంటెస్ట్ పోటీల్లో అందమైన కాళ్లతో ఫిదా చేయాలన్నమాట. సాధారణంగా అందాల పోటీల్లో పాల్గొనేవారు అవివాహితులై ఉండాలి కానీ యాంకిల్ కాంటెస్ట్‌కి మాత్రం ఈ రూల్ అవసరం లేదు. ఎవరైనా ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే..ఈ పోటీలకు పోలీసులు లేదా క్లర్క్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. When women were judged by the attractiveness of their ankles (1930-1953) "The pretty ankle contest" appeared in the early 1900s as special shows within women's beauty competitions. Contestants would have to stand behind a curtain to conceal their bodies, so that all that could… pic.twitter.com/RTsB1JkHQU — Historic Vids (@historyinmemes) July 5, 2023 -
Video: వైకల్యం శరీరానికి మాత్రమే! మనసుకు కాదు.. బాహుబలిలో నటించా!
ప్రతిభ, ఉన్నత స్థానాన్ని అధిరోహించాలన్న పట్టుదల ఉంటే శారీరక వైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించింది వరంగల్ జిల్లాకు చెందిన సరిత. తన అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో మోడల్ ఎదిగి పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఫ్యాషన్ మోడల్‌గా కెరీర్‌ను నిర్మించుకుంటోంది. తొలుత మిస్ తెలంగాణ డెఫ్ అండ్ డంబ్‌గా ఎంపికైన సరిత.. ఇటీవల టాంజానియా మిస్టర్ అండ్ మిస్ డెఫ్ అండ్ డంబ్ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని రన్నరప్‌గా కిరీటం అందుకుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. చిన్ననాటి నుంచే స్కూల్లో ఉన్ననాటి నుంచే మోడలింగ్‌పై మక్కువ పెంచుకున్న సరిత.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. వైకల్యాన్ని జయించి విజయాలను చిరునామాగా మార్చుకుని తన ప్రయాణం కొనసాగిస్తోంది. మూగ, చెవుడు వంటి సమస్యల కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ చిరునవ్వుతోనే వాటిని దాటుకుంటూ సినిమాల్లోనూ తన ప్రతిభ నిరూపించుకుంటోంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లతో పాటు కీర్తి సురేశ్ తన ఫేవరెట్ అంటున్న సరిత స్ఫూర్తిదాయక కథ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి! తన కాళ్ల మీద తాను నిలబడి సొంతంగా ఇక్కడి దాకా చేరుకున్న సరిత మరిన్ని విజయాలు సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పేయండి! చదవండి: ట్రెండ్: కుటుంబాలకు రీల్స్ గండం -
అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ
జెరూసలేం: అలనాటి నాజీ మారణహోమం భయాందోళనలను భరిస్తూ జీవనం సాగించిన మహిళలను గౌరవించే నిమిత్తం రూపొందించిన వార్షిక ఇజ్రాయెల్ అందాల పోటీల్లో 86 ఏళ్ల బామ్మ కుకా పాల్మోన్ విజేతగా నిలిచి "మిస్ హోలోకాస్ట్ సర్వైవర్" కిరీటాన్ని గెలిపొందారు. ఈ మేరకు జెరూసలేంలోని ఒక మ్యూజియంలో ఈ పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల్లో సుమారు 10 మంది 79 నుంచి 90 సంవత్సరాల వయసు ఉన్న బామ్మలు మంచి హెయిర్ స్టైల్, మేకప్ వేసుకుని గౌనులాంటి చీరలను ధరించి క్యాట్వ్యాక్తో సందడి చేశారు. (చదవండి: వామ్మో! మొసలిని కౌగలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!) ఈ మేరకు కుకా పాల్మోన్ మాట్లాడుతూ.."హోలోకాస్ట్‌లో గడిపిన తర్వాత నేను నా కుటుంబసభ్యులతో కలిసి జీవిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, నలుగురు మనవరాళ్ళు, ఇద్దరు ముని మనవరాళ్ళు ఉన్నారు. పైగా నేను ఇక్కడకు వచ్చి పాల్గొంటానని కలలో కూడా అనుకోలేదు. ఈ వయసులో విజేతగా నిలిచి ఈ కిరిటాన్ని గెలుచకోవడం అద్భతమైన విషయం వర్ణించలేనిది". అంటూ చెప్పుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో అప్పటి నాజీల మారణహోమం కారణంగా ఇజ్రాయెల్ పెద్ద సంఖ్యలో యువతను కోల్పోయింది. అప్పటి భయానక పరిస్థితులను భరిస్తూ ప్రాణాలతో బయటపడిన అతి కొద్ది మంది యూదు మహిళలను గౌరవించే నిమిత్తం ఈ అందాల పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఇజ్రాయెల్ అందాల పోటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు కరోనా మహమ్మారి దృష్ట్యా గతేడాది నిర్వహించ లేకపోయినట్లు తెలిపారు. (చదవండి: ఇదే ఆఖరి రోజు!.. బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు..) -
మిస్ సింగపూర్‌గా తెలుగమ్మాయి
కౌలలాంపూర్: విదేశాల్లో జరిగే అందాల పోటీల్లో మన భారతీయులు ప్రతిభ చాటిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఓ తెలుగుమ్మాయి వచ్చి చేరింది. సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్ యూనివర్స్ సింగపూర్-2021గా ఎన్నికయ్యింది నందిత. ఆ వివరాలు.. నందిని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా. దాదాపు 25 సంవత్సరాల క్రితం నందిత తల్లిదండ్రులు మాధురి, గోవర్ధన్‌లు సింగపూర్ వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. వీరికి నందితతో పాటు మరో కుమారుడు ఉన్నారు. నందితకు ఫ్యాషన్ ప్రపంచం అంటే చిన్ననాటి నుంచి అమితమైన ఆసక్తి. దానిలో భాగంగానే పార్ట్ టైమ్ మోడల్‌గా పని చేసేది నందిత. ఆ ఆసక్తితోనే నందిత ఈ ఏడాది మిస్ యూనివర్స్ సింగపూర్-2021లో పోటీలో పాల్గొంది. అందం, తెలివితేటలతో ప్రథమ స్థానంలో నిలిచి అందాల కిరీటం దక్కించుకుంది. టైటిట్ గెలిచిన అనంతరం నందిత జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్లో ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఆమె సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. (చదవండి: షాకింగ్: అందాల పోటీ విజేతకు వేదిక మీదే ఘోర అవమానం) ప్రస్తుతం నందిత సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (బిజినెస్ అనలిటిక్స్) కోర్సును అభ్యసిస్తోంది. కోడింగ్ వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఆమె హాబీలలో స్కేటింగ్, వంట, డ్యాన్స్ ఉన్నాయి. నందిత సింగపూర్‌లోని కేర్ కార్నర్లో వాలంటీర్‌గా పని చేస్తూ.. అక్కడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మార్గదర్శకత్వం చూపడమే కాక జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. (చదవండి: అశ్లీల నృత్యం.. అందాల కిరీటం వెనక్కి) గత సంవత్సరం, నందిత సింగపూర్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్‌ను ప్రమోట్ చేసే టీవీ యాడ్‌లో కనిపించింది. ఈ సంవత్సరం మార్చిలో, ఆమె సింగపూర్‌లోని ఆర్ట్-సైన్స్ మ్యూజియంలో లూయిస్ విట్టన్ ఉమెన్స్ స్ప్రింగ్ సమ్మర్ 2021 లో మోడల్‌గా చేసింది. అలానే డిసెంబర్ 2020-జనవరి 2021 వోగ్ సింగపూర్ సంచికలో కూడా కనిపించింది. చదవండి: Miss Universe: ఏంటీ ఆండ్రియాకు పెళ్లైందా?! -
Miss Universe: ఏంటీ ఆండ్రియాకు పెళ్లైందా?!
మెక్సికో సిటీ: మిస్ యూనివర్స్-2020 విజేత, మిస్ మెక్సికో ఆండ్రియా మెజాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెకు ఇది వరకే పెళ్లి అయ్యిందని, భర్తతో కలిసి దిగిన ఫొటోలే ఇందుకు నిదర్శనమంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆండ్రియా మెజా ఖండించారు. తనకు వివాహం కాలేదని స్పష్టం చేశారు. కాగా మెక్సికోని చిహువాకు చెందిన ఆండ్రియా... సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మోడలింగ్‌పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. అప్పటి నుంచి తమ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం.. మెజా ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో.. తెల్లటి వెడ్డింగ్ గౌనులో మెరిసిపోతున్న ఆమె.. సూటులో ఉన్న ఓ పురుషుడిని హత్తుకుని ఉన్నారు. ‘‘ఇందుకు 3-09-2019’’ అనే క్యాప్షన్‌తో పాటు ఉంగరం ఎమోజీని జతచేశారు. ఇక ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీల్లో మిస్ యూనివర్స్‌గా ఆండ్రియా మెజా కిరీటం దక్కించుకున్న క్రమంలో ఈ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో.. కొంతమంది ఆమెకు పెళ్లైందని, నిర్వాహకులను మోసం చేసి పోటీ చేసిందని కొంతమంది కామెంట్లు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆండ్రియా మెజా... ఈ వ్యాఖ్యలను కొట్టిపడేశారు. చిహువా టూరిజం డెవలప్మెంట్లో భాగంగా కాపర్ కెనన్ వద్ద చేసిన ఫొటోషూట్‌కు సంబంధించిన దృశ్యం అది అని వివరణ ఇచ్చారు. అంతేగాక ఆ ఫొటోలో ఉన్నది తన బెస్ట్‌ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు అని, స్నేహితులను ఆటపట్టించేందుకు డేట్ వేసి, వెడ్డింగ్ రింగ్ ఎమోజీ పెట్టామని పేర్కొన్నారు. అయితే, ఈ ఫొటో విషయం ఇంత గందరగోళం సృష్టిస్తుందని ఊహించలేకపోయానని వాపోయారు. అయినా తను అసత్య ప్రచారాలకు భయపడేదానిని కాదని, కెరీర్‌పై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు. అది అవాస్తవం ఇక మిస్ యూనివర్స్ పోటీల అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఈ ఫొటో గురించి మాకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. కానీ మేం అన్ని పరిశీలించిన తర్వాతే పోటీకి అర్హురాలిగా పరిగణిస్తాం. మెజా వివాహిత అన్న ప్రచారం అవాస్తవం’’ అని స్పష్టం చేశారు. కాగా విశ్వ సుందరి పోటీల నియమం ప్రకారం... అందులో పాల్గొనే వారు అవివాహుతులై ఉండాలన్న సంగతి తెలిసిందే. చదవండి: Miss Universe: ఎవరీ ఆండ్రియా మెజా? The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I — Miss Universe (@MissUniverse) May 17, 2021 -
Miss Universe: ఎవరీ ఆండ్రియా మెజా?
వాషింగ్టన్: మెక్సికో భామ ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో గెలుపొంది విశ్వ సుందరి కిరీటం సొంతం చేసుకున్నారు. తొలి రన్నరప్‌గా మిస్ బ్రెజిల్ జులియా గామా, రెండో రన్నరప్‌గా మిస్ పెరూ జానిక్ మెసెటా డెల్ కాసిలో నిలిచారు. మిస్ ఇండియా అడెలిన్ కాస్టెలినో సైతం గట్టిపోటీనిచ్చి టాప్-5లో స్థానం సంపాదించుకున్నారు. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ మిస్ యూనివర్స్(2019) జోజిబినీ తుంజీ విజేత ఆండ్రియాకు కిరీటం అలంకరించారు. కాగా మొత్తం డెబ్బై మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలో విజయం సాధించారని ప్రకటించగానే ఆండ్రియా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమవుతూనే క్యాట్‌వాక్ పూర్తి చేశారు. ఎవరీ ఆండ్రియా? మిస్ యూనివర్స్ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం.. 26 ఏళ్ల ఆండ్రియా మెజా.. మెక్సికోని చిహువాకు చెందినవారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. మోడలింగ్‌పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెబుతున్నారు. అంతేగాకుండా, మహిళా హక్కులపై ఉద్యమిస్తూ.. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇక సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్టు మోడల్ అయిన ఆండ్రియాకు క్రీడల అంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని ఆమె.. వీగన్‌గా మారిపోయారు. పూర్తి శాకాహారమే తీసుకుంటున్నారు. కాగా మెక్సికో నుంచి మిస్ యూనివర్స్‌గా ఎంపికైన మూడో మహిళగా ఆండ్రియా నిలిచారు. అంతకు ముందు లుపితా జోన్స్(1991), షిమెనా నవరటె(2010) ఈ విశ్వ సుందరీమణులుగా నిలిచారు. గొప్ప హృదయం ఉన్నవాళ్లే.. ఫైనల్లో భాగంగా.. అందానికి ప్రామాణికత ఏమిటి అన్న ప్రశ్నకు..‘‘అత్యంత నాగరికమైన సమాజంలో మనం ఉన్నాం. అదే సమయంలో కొన్ని కట్టుబాట్లను కూడా మనతో పాటు ముందుకు తీసుకువెళ్తున్నాం. అందం అనేది కేవలం బాహ్య రూపురేఖలకు సంబంధించింది కాదు. మన ఆత్మలో, గొప్ప మనసు కలిగి ఉండటంలోనే ఉంటుంది. మనం విలువ గల వ్యక్తులం కాదని ఎదుటివాళ్లు అవహేళన చేసేందుకు అస్సలు అనుమతించకూడదు’’ అని బదులిచ్చి ఆండ్రియా 69వ మిస్ యూనివర్స్‌గా నిలిచారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది విశ్వ సుందరి పోటీలు రద్దు అయిన సంగతి తెలిసిందే. The new Miss Universe is Mexico!!!! #MISSUNIVERSE pic.twitter.com/Mmb6l7tK8I — Miss Universe (@MissUniverse) May 17, 2021 -
అశ్లీల నృత్యం.. అందాల కిరీటం వెనక్కి
పోర్టు మోర్స్‌బే: దేశంలో కానీ, సమాజంలో కానీ ఏదైనా విశిష్ట పురస్కారం, అవార్డు వంటివి పొందిన వ్యక్తులు తమ ప్రవర్తన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదు నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను అంటే ఈ అందాల సుందరికి పట్టిన గతే పడుతుంది. అందాల పోటీలో కిరీటం సాధించిన ఓ మహిళ అశ్లీల నృత్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యింది. దాంతో నెటిజనులు సదరు మహిళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసలు నీలాంటి దానికి ఇంతటి గౌరవం ఎలా లభించింది’’ అంటూ విమర్శించారు. ‘‘ఆ కిరీటం ధరించడానికి నీవు అనర్హురాలివి’’ అని ట్రోల్ చేశారు. ఈ దుమారం కాస్త పెద్దది కావడంతో షో నిర్వహకులు ఆమె వద్ద నుంచి కిరీటం వెనక్కి తీసుకున్నారు. ఆ వివరాలు.. లూసి మైనో అనే మహిళ(25) 2019లో మిస్ పాపువా న్యూగినియాగా ఎన్నికైంది. ఈ క్రమంలో ఆమె కొద్ది రోజుల క్రితం తన టిక్‌టాక్ అకౌంట్లో ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. చాలా అశ్లీలంగా ఉన్న ఈ వీడియో పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దాంతో మిస్ పసిఫిక్ ఐస్‌ల్యాండ్స్ పీజంట్ పీఎన్జీ కమిటీ లూసి మైనోకు ప్రదానం చేసిన కిరీటాన్ని వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘‘మా ప్రధాన ఉద్దేశం మహిళా సాధికారిత. మా వేదికది చాలా ప్రత్యేకమైన శైలి. సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ విలువలు ద్వారా మా దేశం, ఇక్కడి ప్రజల గురించి మిగతా లోకానికి తెలియజేస్తాం. ఇక మేం నిర్వహించే అందాల పోటీల ద్వారా స్వీయ విలువ, సమగ్రత, సామాజిక సేవ, విద్య వంటి అంశాలను ప్రచారం చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఇంత విలువైన అవార్డు సొంతం చేసుకున్న లూసి మైనో ఇలాంటి అశ్లీల డ్యాన్స్ వీడియోని షేర్ చేయడం మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. రోల్‌మోడల్‌గా నిలవాల్సిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదు. అందుకే ఆమెకు ప్రధానం చేసిన కిరీటాన్ని వెనక్కి తీసుకున్నాం’’ అని తెలిపారు. ఇదే పని ఓ మగాడు చేస్తే మేం నవ్వుకునే వాళ్లం. కానీ లూసీ మైనో ఇలా చేయడం మమ్మల్ని నిరాశకు గురి చేసింది అన్నారు. చదవండి: షాకింగ్: అందాల పోటీ విజేతకు వేదిక మీదే ఘోర అవమానం -
షాకింగ్: అందాల పోటీ విజేతకు వేదిక మీదే ఘోర అవమానం
కొలంబో: ‘‘మిసెస్ శ్రీలంక’’ పోటీ ఫైనల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విజేతగా ప్రకటించిన అనంతరం కిరీటం ధరించిన ఓ మహిళకు ఘోర అవమానం జరిగింది. భర్తతో విడాకులు తీసుకున్నందున ఆమె గెలుపునకు అర్హురాలు కాదంటూ మిసెస్ శ్రీలంక వరల్డ్, మాజీ మిసెస్ శ్రీలంక, ఆమె తలపైనున్న కిరీటాన్ని లాగిపడేశారు. ఈ క్రమంలో సదరు మహిళ అవమానభారంతో వేదిక మీది నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మిసెస్ శ్రీలంక వరల్డ్ నేషనల్ డైరెక్టర్ చండీమాల్ జయసింఘే, తొలుత విజేతగా ప్రకటించిన మహిళకే కిరీటం దక్కుతుందని స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది. విజేత పుష్పిక డి సిల్వా(ఫొటో కర్టెసీ: ఫేస్బుక్) స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఆదివారం జరిగిన అందాల పోటీల్లో శ్రీమతి పుష్పిక డి సిల్వా విజేతగా నిలిచారు. దీంతో ఆమె తలపై కిరీటం అలంకరించగా, మరోసారి ర్యాంప్‌వాక్ చేసి ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇంతలో వడివడిగా అక్కడికి వచ్చిన మాజీ విన్నర్ కరోలిన్ జూరీ ఒక్కసారిగా సిల్వా కిరీటాన్ని లాగిపడేసి, పక్కనే నిల్చుని ఉన్న మొదటి రన్నరప్‌నకు అలకరించారు. ఈ క్రమంలో సిల్వా జుట్టు మొత్తం చెదిరిపోయింది. కరోలిన్ ప్రవర్తనతో కంగుతిన్న సిల్వా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం గురించి కరోలిన్ మాట్లాడుతూ.. ‘‘వివాహితలకు మాత్రమే విజేతగా నిలిచే హక్కు ఉంటుంది. విడాకులు తీసుకున్న వారికి కాదు’’ అని వ్యాఖ్యానించారు. నేను విడాకులు తీసుకోలేదు ఇక ఫేస్బుక్ వేదికగా ఈ విషయంపై స్పందించిన డి సిల్వా.. ‘‘నేను విడాకులు తీసుకోలేదు. ఒకవేళ నాపై నిందలు వేసిన వారు ఈ విషయాన్ని నిరూపించాలంటే నా విడాకుల పత్రాలు అందరికీ చూపించాలి’’ అని సవాల్ విసిరారు. అంతేగాక, తనను అవమానపరిచిన వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా.. ‘‘ఒక మహిళ కిరీటం లాక్కునే మరో మహిళ ఎన్నటికీ నిజమైన రాణి అనిపించుకోదు’’అని కరోలిన్‌కు చురకలు అంటించారు. ఈ విజయం వారికే అంకితం ఈ పరిణామాలపై అందాల పోటీ నిర్వాహకులు స్పందిస్తూ.. డి సిల్వానే విజేత అని మరోసారి స్పష్టం చేశారు. ‘‘ఆమెకు కిరీటం తిరిగి ఇచ్చేస్తాం. కరోలిన్ ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టాం’’ అని బీబీసీతో వ్యాఖ్యానించారు. ఇక అందాల రాణి టైటిల్‌ను మంగళవారం తిరిగి పొందిన డి సిల్వా, ఈ గౌరవాన్ని ఒంటరి తల్లులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చదవండి: గదికి వెళ్లి పెద్దగా ఏడ్చేశాను.. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను -
శ్రీమతి .. అమరావతి
సాక్షి, మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రముఖ మోడల్స్ అంజనా, అపర్ణ, మిసెస్ తెలంగాణ టైటిల్ విన్నర్ స్నేహా చౌదరి అన్నారు. మొగల్రాజపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో శుక్రవారం తేజాస్ ఎలైట్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మిసెస్ అమరావతి-2019 పేరుతో సంప్రదాయ ఫ్యాషన్ షో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. నగరంతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి 60 మంది మహిళలు హాజరై సంప్రదాయ, టాలెంట్ రౌండ్స్‌లో ప్రతిభను ప్రదర్శించారు. ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు. ఈ విషయం గురించి తేజాస్ ఎలైట్ ఈవెంట్స్ అధినేత, పోటీల నిర్వాహకుడు ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ సంప్రదాయ ఫ్యాషన్ షోకు మహిళల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభ పెళ్లి అయిన తర్వాత కొంతమందిలో పోతుందని చెప్పారు. చాలామంది తమ వృత్తికి, ఇంటికే పరిమితం అవడం వల్ల వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం లేకుండా పోతుందన్నారు. అలాంటి వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఈ నెల 20న ఇబ్రహీంపట్నంలో ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తామని, ప్రతిభ చూపిన వారికి శ్రీమతి అమరావతి-2019 టైటిల్‌ను సినీ హీరోయిన్ ప్రేమ చేతుల మీదుగా అందజేస్తామన్నారు. ఆ రోజు జరిగే ఫైనల్స్ పోటీలకు జబర్దస్త్ టీమ్‌తో పాటు సినీ రంగానికి చెందిన పలువురు పాల్గొంటారని చెప్పారు. మిసెస్ అమరావతి టైటిల్ మాజీ విన్నర్స్ వర్షితా వినయ్ (2017), మంజులా (2018), పోటీల సహ నిర్వాహకులు సుమన్ బాబు, విష్ణు బొప్పన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘మిస్ టీన్ ఆసియా వరల్డ్‌గా తెలుగమ్మాయి
టెక్సాస్ : మిస్ టీన్ ఆసియా వరల్డ్ 2019-21 అందాల పోటీలో డల్లాస్‌కు చెందిన తెలుగమ్మాయి సైషా కర్రి విజేతగా నిలిచింది. టెక్సాస్‌లోని ప్లానో ఈవెన్ సెంటర్లో జరిగిన వేడుకలో అందాల రాణి కిరీటం సొంతం చేసుకుంది. ఆసియా అమెరికన్ మహిళలను విద్యావంతులను చేసి వారి సాధికారతకు కృషి చేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం. మహిళల విజయాలను గుర్తించి వాళ్లను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన సాంస్కృతిక, స్కాలర్షిప్ ఈవెంట్ ఇది. భారత్‌తో పాటు చైనా, ఫిలిప్పైన్స్, వియత్నాం సహా ఇతర ఆసియా దేశాల భిన్న సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేసే వీలును కల్పిస్తుంది. అదేవిధంగా ఆసియన్ అమెరికన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. కాగా సైషా తల్లిదండ్రులు శశి కర్రి, నాగ్ కర్రి అమెరికాలో ఐటీరంగ నిపుణులుగా పనిచేస్తున్నారు. ఇక సైషాకు చిన్నప్పటి నుంచి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ ఎక్కువ. గత 11 ఏళ్లుగా కథక్ నేర్చుకుంటున్న ఆమె.. ఈ ఏడాది నవంబరులో ఆరంగేట్రం చేయనుంది. అదే విధంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటుంది. ‘ఛారిటబుల్ స్టూడెంట్స్ ఆఫ్ అమెరికా’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వారాంతరాల్లో అన్నదాత ఛారిటీ సంస్థతో కలిసి నేపాల్, భూటాన్ శరణార్థులకు ఆహారం, దుస్తులతో పాటు ఇతర వస్తువులు వారికి అందేలా కృషి చేస్తోంది. చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలతో పాటు, వ్యాపార రంగాల్లో ఆసక్తి కనబరిచే లక్షణాలే సైషాకు ఈ అందాల కిరీటాన్ని కట్టబెట్టాయి. -
బ్యూటీ తలపై నిప్పు.. షాక్‌కు గురైన అభిమానులు..!!
-
బ్యూటీ తలపై నిప్పు.. షాక్‌కు గురైన అభిమానులు..!!
కాంగో : ఇటీవల జరిగిన మిస్ ఆఫ్రికా -2018 పోటీల్లో చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది. మిస్ ఆఫ్రికాగా ఎంపికైన మిస్ కాంగో- 2018 విజేత డార్కస్ కాసిందే తల్లో మంటలు చెలరేగాయి. అందాల పోటీల్లో కాసిందేను విన్నర్‌గా ప్రకటించగానే ఫైర్ క్రాకర్స్‌ను పేల్చగా ప్రమాదవశాత్తూ నిప్పు కణికలు ఆమె తలపై పడ్డాయి. దాంతో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది క్షణాల్లో వాటిని ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం ఆమె తలకు కిరీటాన్ని అలంకరించారు. అప్పటికే తీవ్ర భయాందోళనకు గురైన ఈ అందాల సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సభికులు, అభిమానులకు అభివాదం చేశారు. నైజీరియాలోని క్రాస్ రివర్ రాష్ట్రంలో ఈ పోటీలు జరిగాయి. ఇదిలాఉండగా.. కాసిందే మిస్ కాంగో-2018గా ఎంపికైన సమయంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. కిరీటం ధరిస్తున్న సమంయలో ఆమె విగ్‌కి ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. దీంతో డార్కస్ కాసిందే అసలైన ఫైర్ బ్రాండ్ అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
అందాల పోటీలు.. న్యాయనిర్ణేతకు దిమ్మ తిరిగే జవాబు
సాక్షి, న్యూఢిల్లీ : అందాల పోటీల్లో విజయం సాధించి కిరీటం సొంతం చేసుకోవాలంటే అందం ఒక్కటే సరిపోదు. తెలివి తేటలు కూడా తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని అందాల పోటీల్లో ప్రశ్న జవాబుల అంకం చాలా ఆసక్తిగా ఉంటుంది. నిర్వాహకులు అడిగిన ప్రశ్నకు చక్కని, వినూత్నమైన సమాధానాలు చెప్పి వారినే ‘క్వీన్’కిరీటం వరిస్తుంది. ముంబైలో కూడా ఉంది.. మిస్‌వరల్డ్ బంగ్లాదేశ్-2018 పోటీల్లో భాగంగా నిర్వాహకులు అడిగిన ఒక సులభమైన ప్రశ్నకు ఓ కంటెస్టెంట్ చెప్పిన సమాధానం అక్కడున్న వారికి దిమ్మతిరిగేలా చేసింది. H2o (నీరు ఫార్ములా) అంటే ఏమిటి? అని ప్రశ్నించిన నిర్వాహకుడు.. ఆమె చెప్పిన సమాధానానికి నోరెళ్లబెట్టాడు. H2o పేరుతో ఢాకాలో రెస్టారెంట్ ఉంది కదా..! అని ఆమె బదులిచ్చింది. ఢాకాలోనే కాదు ముంబైలో కూడా మరో రెస్టారెంట్ ఉందని నిర్వాహకులు అసహనం వ్యక్తం చేశారు. ఆమె ‘సృజనాత్మకత’కు జోహార్లు అంటూ పోటీ నుంచి ఆ కంటెస్టెంట్‌ను తొలగించారు. వింత వింత పేర్లతో జనాలను ఆకర్షిస్తున్న వ్యాపారస్తుల కారణంగా ఇలాంటి సమాధానాలే వస్తాయని అక్కడున్నవారు నవ్వుకున్నారు. కాగా, మిస్‌వరల్డ్ బంగ్లాదేశ్-2018 పోటీల్లో జెనాతుల్ ఫిర్దౌస్ ఓయిషి విజేతగా నిలిచారు. మిస్‌వరల్డ్ బంగ్లాదేశ్-2018 విజేత జెనాతుల్ ఫిర్దౌస్ ఓయిషి