మిస్ ఆఫ్రికా -2018 పోటీల్లో చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది. మిస్ ఆఫ్రికాగా ఎంపికైన మిస్ కాంగో- 2018 విజేత డార్కస్ కాసిందే తల్లో మంటలు చెలరేగాయి. అందాల పోటీల్లో కాసిందేను విన్నర్‌గా ప్రకటించగానే ఫైర్ క్రాకర్స్‌ను పేల్చగా ప్రమాదవశాత్తూ నిప్పు కణికలు ఆమె తలపై పడ్డాయి. దాంతో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది క్షణాల్లో వాటిని ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం ఆమె తలకు కిరీటాన్ని అలంకరించారు. అప్పటికే తీవ్ర భయాందోళనకు గురైన ఈ అందాల సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సభికులు, అభిమానులకు అభివాదం చేశారు. నైజీరియాలోని క్రాస్ రివర్ రాష్ట్రంలో ఈ పోటీలు జరిగాయి. ఇదిలాఉండగా.. కాసిందే మిస్ కాంగో-2018గా ఎంపికైన సమయంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. కిరీటం ధరిస్తున్న సమంయలో ఆమె విగ్‌కి ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. దీంతో డార్కస్ కాసిందే అసలైన ఫైర్ బ్రాండ్ అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బ్యూటీ తలపై నిప్పు.. షాక్‌కు గురైన అభిమానులు..!!
Published Tue, Jan 1 2019 12:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement