crowning
-
బ్రిటిష్ వారు 'తెలుగు భాష'కు ఇచ్చిన స్థానం చూసి..గాంధీనే కంగుతిన్నారు!
తెలగుకు తెగులు పుట్టిస్తున్నారని ఏవేవో కబుర్లు, లెక్చర్లు చెప్పేస్తుంటాం. తెలుగు దినోత్సవం అంటూ.. ఆరోజు ఆహో ఓహో అని తెలుగు గొప్పదనం చెప్పేసి మురిసిపోతాం. ఆ వైభవాన్ని తీసుకొచ్చే యత్నం చెయ్యం. ఆ భాషకు మహోన్నత స్థానం ఇచ్చేలా చిన్న ప్రయత్నం కూడా చెయ్యం. కనీసం నాటి కవులను తలుచుకోం. పోనీ}.. తెలుగు మాష్టర్లని గౌరవిస్తామా అంటే లేదు వారంటే చులకన!. కానీ అవకాశం వస్తే మాత్రం తెలుగు చచ్చిపోతుందని గగ్గోలు పెట్టేస్తాం. మనల్ని బానిసలుగా చేసుకుని పాలించిన బ్రిటిష్ వాళ్లే నయం. పరాయి వాళ్లైన మన భాషకు ఇచ్చిన విలువ చూసైనా సిగ్గుపడతారేమో చూద్దాం. ఇంతకీ వాళ్లు మన భాషకు ఎలా పట్టం కట్టారో తెలుసా..! మన నాణెం పై తెలుగు భాష. (బ్రిటిష్ వాళ్లు 1936లోనే తెలుగుకు ఎలా పట్టం కట్టారో చూడండి.) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ”ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య” ను సభ దృష్టికి తెచ్చారు. "పట్టాభీ ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం..ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు. అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? మీరంతా ‘మద్రాసీ’లు కదా?" అన్నారు గాంధీ గారు ఎగతాళిగా! వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి "అణా కాసు" ను తీసి ”గాంధీ జీ ! దీనిపై ‘ఒక అణా‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ, హిందీలోనే కాకుండా దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీ అండ్ తెలుగులోనూ ‘ఒక అణా‘ అని రాసి ఉంది. అది కూడా బ్రిటిష్ వారు ప్రింట్ చేసిన నాణెం! (అప్పటికి భారత దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు) "నాణెంపై తెలుగుభాషలో 'ఒక-అణా' అని ఉంది కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే?" అంటూ చురక వేశారు. గాంధీ గారితో పాటూ... కొంతమంది తెలుగు మాతృబాష కాని వారు కూడా ఆశ్చర్య పోయారు. (చదవండి: మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!) -
అంగరంగ వైభవంగా..చార్లెస్ పట్టాభిషేకం
లండన్: రవి అస్తమించినా అలనాటి రాజ వైభవానికి, అట్టహాసాలకు, ఆడంబరానికి మాత్రం ఏ లోటు లేని రీతిలో బ్రిటన్ రాజ సింహాసనంపై చార్లెస్ 3 కొలువుదీరారు. వెయ్యేళ్లకు పైగా కొనసాగుతున్న సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం బ్రిటన్ 40వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. పలువురు దేశాధినేతలు, ముఖ్య నేతలు తదితరుల సమక్షంలో లాంఛనంగా కిరీటధారణ చేశారు. దాంతో బ్రిటన్‌కు లాంఛనప్రాయ అధినేతగా చార్లెస్ అధికారికంగా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టినట్టయింది. లండన్ వీధుల గుండా భార్యాసమేతంగా బంగారు రథంలో ఊరేగుతూ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పట్టాభిషేకానంతరం దారి పొడవునా ప్రజలు, అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ బకింగ్‌హాం రాజప్రాసాదానికి చేరుకున్నారు. అనంతరం చారిత్రక బాల్కనీ నుంచి రాజ దంపతులు మరోసారి అందరికీ అభివాదం చేయడంతో కార్యక్రమం ముగిసింది. అత్యంత లేటు వయసులో బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించిన రికార్డును కూడా 74 ఏళ్ల చార్లెస్ సొంతం చేసుకున్నారు! ఆయనతో పాటు భార్య కెమిల్లా (75)కు కూడా రాణిగా పట్టాభిషేకం జరిగింది. 2022 సెప్టెంబర్‌లో తన తల్లి, బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణానంతరం బ్రిటన్ రాజుగా చార్లెస్ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. 70 ఏళ్ల తర్వాత... అప్పుడెప్పుడో 70 ఏళ్ల కిందట, అంటే 1953లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్–2కు పట్టాభిషేకం జరిగింది. తర్వాత మళ్లీ ఇంతకాలానికి జరిగిన పట్టాభిషేక క్రతువు అందరినీ ఎంతగానో ఆకర్షించింది. అప్పట్లాగే శనివారం కూడా కార్యక్రమం ఆసాంతం వాన పడటం విశేషం. దేశ విదేశాల్లో లక్షలాది మంది కార్యక్రమాన్ని అత్యంత ఆసక్తిగా వీక్షించారు. మరోవైపు ఈ ప్రజాస్వామిక యుగంలోనూ ఇంకా ఈ కాలం చెల్లిన రాచరికపు పోకడలు ఏమిటంటూ జోరుగా విమర్శలు కూడా వచ్చాయి. వందలాది నిరసనకారులు రాజ దంపతుల ఊరేగింపు మార్గంలో బారులు తీరి నినాదాలకు దిగారు. ముందుజాగ్రత్తగా వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. సునాక్ బైబిల్ పఠనం ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ సమక్షంలో మొదలైన కార్యక్రమం రాజుగా చార్లెస్‌ను గుర్తించడం, ప్రమాణం, ప్రకటన, కిరీటధారణ, పట్టాభిషేకం... ఇలా ఐదు దశల్లో 2 గంటలపాటు సాగింది. ముందుగా చార్లెస్‌ను సభికులందరికీ ఆర్చిబిషప్ పరిచయం చేశారు. చార్లెస్ అందరికీ కన్పించేలా నాలుగు దిక్కులకూ తిరిగారు. తర్వాత చట్టాన్ని కాపాడుతూ న్యాయంగా, దయతో పాలిస్తానని, ఇంగ్లండ్ చర్చికి విధేయుడైన క్రైస్తవునిగా ఉంటానని చార్లెస్ రెండు ప్రమాణాలు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం కెమిల్లాకు చార్లెస్ ఉంగరం తొడిగారు. తద్వారా రాజ దంపతులు లాంఛనంగా మళ్లీ పెళ్లాడారు. అనంతరం బ్రిటన్ తొలి హిందూ ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వ సారథి హోదాలో బైబిల్ పంక్తులు చదివి వినిపించారు! హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, యూదుమత ప్రతినిధులను కూడా తొలిసారిగా కార్యక్రమానికి ఆహ్వానించారు. హిందూ ప్రతినిధి రాజ చిహ్నాన్ని చార్లెస్‌కు అందజేశారు. అనంతరం బంగారు అంగవస్త్రం ధరించి దాదాపు 800 ఏళ్ల నాటి సింహాసనాన్ని అధిష్టించారు. దాని కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెప్పించిన పవిత్ర శిలనుంచారు. చార్లెస్‌పై తెరచాటుగా చాతి, చేతులు, ముఖంపై జెరూసలేం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పవిత్ర తైలం చిలకరించారు. చార్లెస్‌కు తెరచాటు కోసం ఉపయోగించిన వస్త్రంపై 56 కామన్వెల్త్ దేశాలకు ప్రతీకగా 56 ఆకులతో కూడిన చెట్టును చిత్రించారు. తర్వాత శిలువతో కూడిన గోళాకారపు బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్ అందుకున్నారు. వేలికి రాజముద్ర తొడిగాక చివరగా అతి ప్రధాన ఘట్టంలో 360 ఏళ్ల నాటి సెయింట్ ఎడ్వర్డ్ స్వర్ణ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. దీన్ని ఆయన మరింకెప్పుడూ ధరించబోరు. ఆ వెంటనే గాడ్ సేవ్ ద కింగ్ గీతాలాపనతో, గంటల మోతతో వెస్ట్ మినిస్టర్ అబే మారుమోగింది. అనంతరం చార్లెస్ రాజఖడ్గం చేబూని 1937లో క్వీన్ ఎలిజబెత్ దంపతులు పట్టాభిషేకానికి వాడిన సింహాసనంపై ఆసీనులయ్యారు. ఆర్చిబిషప్‌తో పాటు చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం మోకాళ్లపై కూర్చుని ఆయన కుడిచేతిని ముద్దాడారు. తర్వాత నిరాడంబరంగా కెమిల్లాకు రాణి కిరీటధారణ జరిగింది. ఆహూతుల కళ్లెదుట రాణిపై పవిత్ర తైలం చిలకరించారు. తర్వాత 1911లో క్వీన్ మేరీ ధరించిన 2,200 వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ఆమె ధరించారు. కోహినూర్ సహా మూడు పెద్ద వజ్రాలతో ఈ కిరీటం మెరిసిపోయేది. వివాదాలకు తావు లేకుండా ఇటీవల కోహినూర్‌ను కిరీటం నుంచి తొలగించారు. అనంతరం ఎడ్వర్డ్ కిరీటాన్ని తీసేసి అధికారిక రాజ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. రాణితో కలిసి దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ బంగారు రథంలో బకింగ్‌హాం ప్యాలెస్‌కు తిరిగి వెళ్లారు. ప్యాలెస్ బాల్కనీ నుంచి పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం దంపతులతో కలిసి చార్లెస్ దంపతులు ప్రజలకు దర్శనమివ్వడంతో పట్టాభిషేక కార్యక్రమానికి తెరపడింది. చివరగా రాయల్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు విన్యాసాలతో అలరించాయి. వర్షం కారణంగా చాలా కార్యక్రమాలను కుదించి త్వరగా ముగించారు. బంగారు ఆకుల డిజైన్లలో బైబిల్ చార్లెస్ ప్రమాణస్వీకారం కోసం వాడిన బైబిల్‌ను ఆక్స్ఫర్డ్ ప్రెస్‌లో ప్రత్యేకంగా తయారు చే యించారు. బంగారు ఆకులు తదితర డిజైన్లతో తీర్చిదిద్దారు. అందులో దాదాపు 350 అచ్చు తప్పులను సరిచేసి మరీ కార్యక్రమం కోసం సిద్ధం చేశారు. అచ్చం 1611 నాటి కింగ్ జేమ్స్ బైబిల్లా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజు వెడలె... లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ అబేలో శనివారం చార్లెస్ 3 పట్టాభిషేక కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. 1066లో విలియం ద కాంకరర్కి ఇక్కడే పట్టాభిషేకం జరిగింది. నాటి నుంచీ ఈ కార్యక్రమం ఇక్కడే జరుగుతోంది. చార్లెస్, కెమిల్లా దంపతులు ఉదయం 11 గంటలకు బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి ప్రత్యేక బంగారు రథంలో ఊరేగింపుగా వెస్ట్ మినిస్టర్స్ అబేకు తరలి వెళ్లారు. ఈ రథాన్ని 1831 నుంచి ప్రతి పట్టాభిషేక వేడుకకూ ప్రత్యేకంగా వాడుతున్నారు. సైనిక సిబ్బంది గుర్రాలపై, కాలి నడకన రథాన్ని అనుసరించారు. వేలాదిగా ప్రజలు సెంట్రల్ లండన్ వీధుల నిండా బారులు తీరి రాజ దంపతులకు చేతులూపుతూ కన్పించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన 2,200 మంది పై చిలుకు ఆహూతులు అబే వద్ద రాజ దంపతులకు స్వాగతం పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ దంపతులు పాల్గొన్నారు. వారు కామన్వెల్త్ దేశాధినేతల వరుసలో కూర్చున్నారు. దూరదూరంగా హారీ రాచరికాన్ని వదులుకుని రాజ కుటుంబానికి దూరమైన చార్లెస్ రెండో కుమారుడు హారీ పట్టాభిషేక కార్యక్రమంలో అంటీ ముట్టనట్టుగా పాల్గొన్నారు. 10 వరుసల ఆవల మౌనంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఆయన భార్య మెగన్ మార్కెల్, ఇద్దరు పిల్లలు కార్యక్రమానికి రాకుండా అమెరికాలోనే ఉండిపోయారు. శనివారమే నాలుగో పుట్టినరోజు జరు పుకున్న కుమారుడు ఆర్చీ కోసం కార్యక్రమం ముగియగానే హారీ అమెరికా పయనమయ్యా రు. రాజ దంపతులు, అన్న విలియం తనను ఎన్నడూ సరిగా చూడలేదంటూ ఇటీవలి ఆత్మకథలో ఆయన తూర్పారబట్టడం తెలిసిందే. చార్లెస్ తమ్ముడు కూడా... రాచరిక హోదాను కోల్పోయిన చార్లెస్ తమ్ముడు ఆండ్రూ కూడా దూరంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించడానికే పరిమితమయ్యారు. లైంగిక వేధింపుల కేసు తదితరాల్లో చిక్కడంతో ఆండ్రూ రాచరికపు హోదాలను తల్లి ఎలిజబెత్ తొలగించారు. 𝐓𝐡𝐞 𝐂𝐫𝐨𝐰𝐧𝐢𝐧𝐠 𝐨𝐟 𝐓𝐡𝐞 𝐊𝐢𝐧𝐠 The Archbishop of Canterbury places St Edward’s Crown on The King’s anointed head. The clergy, congregation and choir all cry ‘God Save The King’.#Coronation pic.twitter.com/kGrV3W0bky — The Royal Family (@RoyalFamily) May 6, 2023 look at camilla she can’t believe what her and charles have gotten away with and that smirk says it all #Coronation pic.twitter.com/gtQ9rIGiEj — ᴀᴅᴇʏᴇᴍɪ 🚩 (@LE4NDROAI) May 6, 2023 చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ -
రాజుగా ఛార్లెస్-3.. పట్టాభిషేకానికి ఆలస్యం ఎందుకంటే..
లండన్: క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో.. ఆమె తనయుడు ఛార్లెస్-3 అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్కు రాజు అయ్యారు. శనివారం.. ప్రవేశ మండలిAccession Council అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. బ్రిటన్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఈ ప్రకటన కార్యక్రమాన్ని టెలివిజన్ ప్రసారం చేసింది కౌన్సిల్. సాధారణంగా.. సింహాసనంపై ఉన్నవాళ్లు మరణిస్తే.. వారసులే ఆటోమేటిక్‌గా తదుపరి బాధ్యతలు స్వీకరిస్తారు. అంతర్గతంగా ఆ కార్యక్రమం ఉంటుంది. కానీ, బ్రిటన్ రాజరికంలో తొలిసారి ఇలా టీవీ టెలికాస్టింగ్ ద్వారా ప్రకటించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నాం సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 73 ఏళ్ల ఛార్లెస్ అధికారికంగా బాధ్యతలు చేపడుతూ.. ‘అనితరమైన సార్వభౌమాధికారానికి సంబంధించిన బాధ్యతలు తనకు తెలుస’ని ప్రమాణం చేశారు. ► వందల కొద్దీ ప్రైవేట్ కౌన్సిలర్లు.. అందులో బ్రిటన్ తాజా ప్రధాని లిజ్ ట్రస్, క్వీన్ ఎలిజబెత్-2 వారసులు, ఛార్లెస్ భార్య క్యామిల్లా, పెద్ద కొడుకు..తదుపరి వారసుడు విలియమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఛార్లెస్ లేని ప్రత్యేక ఛాంబర్లో ఆయన్ని అధికారికంగా రాజుగా ప్రకటించింది యాక్సెషన్ కౌన్సిల్. ► అనంతరం.. ఆయన సమక్షంలోనే మరోసారి ‘ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్’ ఇకపై యూకేకు సార్వభౌమాధికారి.. రాజు అంటూ ప్రకటించింది. ఆ వెంటనే ఆయన ప్రమాణం చేసి.. రాజపత్రాలపై సంతకం చేశారు. ఇక లోపలి కార్యక్రమం పూర్తికాగానే.. మధ్యాహ్నం 3గం.30ని. ప్రాంతంలో ట్రంపెట్ ఊది ఛార్లెస్-3ను అధికారికంగా బాహ్యప్రపంచానికి రాజుగా ప్రకటించింది మండలి. అయితే.. ► బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3ని ప్రకటించినప్పటికీ ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది. అదే మహారాజుగా ఆయనకు జరగాల్సిన పట్టాభిషేకం. తల్లి మరణించిన వెంటనే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన ఛార్లెస్.. రాజు హోదా దక్కించుకున్నారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో సంతాప సమయం ముగిశాకే.. ఆయనకు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ► బ్రిటన్ రాజరికాన్ని గమనిస్తే ఇంతకు ముందు.. 1952 ఫిబ్రవరి 6వ తేదీన జార్జ్-6 మరణించారు. ఆ సమయంలో వారసురాలు ప్రిన్స్ ఎలిజబెత్-2 రాణిగా ప్రకటించబడ్డారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకం మాత్రం 1953, జూన్ 2న జరిగింది. అయితే ఆమె భర్త ఫిలిప్.. ఆ తర్వాతి కాలంలోనూ ప్రిన్స్‌గానే కొనసాగారు. ► ఇవాళ జరిగిన.. ప్రవేశ వేడుక(ceremony of Accession), తర్వాత జరగబోయే పట్టాభిషేక వేడుక(ceremony of Coronation) మధ్య తేడా ఏంటంటే.. ప్రవేశ వేడుకలో కేవలం అధికారిక ప్రకటన, ప్రమాణం ఉంటుంది. కానీ, పట్టాభిషేకం అనేది కాంటర్బరీ ఆర్చ్‌బిషప్ నిర్వహించిన మతపరమైన వేడుక. లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో గత 900 సంవత్సరాలుగా పట్టాభిషేక సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ► సింహాసనంపై ఉన్నవాళ్లు మరణించాక.. తదనంతర రాజు/రాణికు వైభవంగా పట్టాభిషేకం నిర్వహించేందుకే అంత గ్యాప్ తీసుకుంటారు. ► పట్టాభిషేక సమయంలో సదరు వ్యక్తి రాజు/రాణి.. చట్టం ప్రకారం పాలించడం, దయతో న్యాయం చేయడం, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌ను నిర్వహించడం లాంటి ప్రమాణాలు చేస్తారు. ► అనంతరం ఆర్చ్‌బిషప్ సమక్షంలో.. కింగ్ ఎడ్వర్డ్ సింహానం మీద అధిరోహిస్తారు. ఆపై సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని రాజు/రాణి తలపై ఉంచుతారు ఆర్చిబిషప్. భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో క్వీన్ ఎలిజబెత్-2 ► 1626 నుంచి బ్రిటన్ సింహాసనం విషయంలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది. ► బ్రిటన్ పట్టాభిషేక కార్యక్రమానికి.. రాజరిక వంశస్థులతో పాటు చట్ట సభ్యులు, చర్చ్ సభ్యులు, కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు.. ప్రతినిధులు, ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులూ హాజరవుతారు. -
రాజాధిరాజ.. రాజ మార్తాండ..
రాజుగారు వెళ్తున్నారంటే మరి మాటలా.. రాజాధిరాజ దండకాలు.. విచ్చేస్తున్నారహో అంటూ సైనికుల గర్జనలు.. అన్నీ కామనేగా.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఆదివారం దాదాపు అలాంటి సీనే రిపీటైంది. మూడ్రోజుల మహాపట్టాభిషేక మహోత్సవంలో భాగంగా థాయ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్ సమీపంలోని ప్రముఖ బౌద్ధాలయాల్లో పూజలు చేయడానికి గ్రాండ్ ప్యాలెస్ నుంచి తన పరివారంతో ఇలా పల్లకీలో అంగరంగ వైభవంగా తరలివెళ్లారు. దీంతో రాజుగారిని చూడ్డానికి జనం వీధివీధినా పోటెత్తారు. శనివారం మహా వజిరా అధికారికంగా థాయ్ రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. 70 ఏళ్ల క్రితం మహా వజిరా తండ్రికి పట్టాభిషేకం జరిగింది. చాన్నాళ్ల తర్వాత దేశంలో ఈ వేడుక జరుగుతుండటంతో థాయ్‌లాండ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. -
బ్యూటీ తలపై నిప్పు.. షాక్‌కు గురైన అభిమానులు..!!
-
బ్యూటీ తలపై నిప్పు.. షాక్‌కు గురైన అభిమానులు..!!
కాంగో : ఇటీవల జరిగిన మిస్ ఆఫ్రికా -2018 పోటీల్లో చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది. మిస్ ఆఫ్రికాగా ఎంపికైన మిస్ కాంగో- 2018 విజేత డార్కస్ కాసిందే తల్లో మంటలు చెలరేగాయి. అందాల పోటీల్లో కాసిందేను విన్నర్‌గా ప్రకటించగానే ఫైర్ క్రాకర్స్‌ను పేల్చగా ప్రమాదవశాత్తూ నిప్పు కణికలు ఆమె తలపై పడ్డాయి. దాంతో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది క్షణాల్లో వాటిని ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం ఆమె తలకు కిరీటాన్ని అలంకరించారు. అప్పటికే తీవ్ర భయాందోళనకు గురైన ఈ అందాల సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సభికులు, అభిమానులకు అభివాదం చేశారు. నైజీరియాలోని క్రాస్ రివర్ రాష్ట్రంలో ఈ పోటీలు జరిగాయి. ఇదిలాఉండగా.. కాసిందే మిస్ కాంగో-2018గా ఎంపికైన సమయంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. కిరీటం ధరిస్తున్న సమంయలో ఆమె విగ్‌కి ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. దీంతో డార్కస్ కాసిందే అసలైన ఫైర్ బ్రాండ్ అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఇది కావాలనే చేశారు..!
మిస్ యూనివర్స్ గందరగోళం ఇంకా సర్దుమణగలేదు. గత ఆదివారం వెల్లడించిన మిస్ యూనివర్స్ పోటీ విజేతల ప్రకటనలో తప్పు దొర్లడం పెద్ద దుమారమే రేపింది. కార్యక్రమం నిర్వాహకుడు స్టీవ్ హార్వే విజేతల పేర్లు మార్చి ప్రకటించడం వెంటనే మళ్ళీ పేరు మార్చి సారీ చెప్పడం కొలంబియా ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇది కావాలనే చేశారని మండిపడుతున్నారు. 2015 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫిలిప్పైన్స్ కు చెందిన పియా అలోంజ్ దక్కించుకుంది. గత సంవత్సరం విజేత... కొలంబియా సుందరి పౌలినా వెగాపియా.. అలోంజ్ కు కిరీటం అలంకరించారు. అయితే రెండవస్థానంలో నిలిచిన కొలంబియా సుందరి అరియాడ్నా మాత్రం మొదట తానే విజేత అని చెప్పి... తిరిగి మాట మార్చారని ఎంతో అసహనం వ్యక్తం చేస్తోంది. దీని వెనుక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది. మరోవైపు ఇదే విషయంపై తాజాగా మిస్ జర్మనీ సారా లోరైన్ రెక్ కూడ విమర్శలు గుప్పించింది. ఓ వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మిస్ యూనివర్స్ ఫలితాలు... పోటీల్లో పాల్గొన్న వారెవరికీ సక్రమంగా అనిపించలేదని చెప్పింది. మిస్ ఫిలిప్పైన్స్ విజేత కావాలని తామెవ్వరూ కోరుకోలేదని అంది. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో మిస్ జర్మనీ లోరైన్ రెక్.. '' నేను నిజంగా ఇది నమ్మలేకపోయాను. ఎంతో బాధపడ్డాను. చెప్పాలంటే.. మిస్ ఫ్రాన్స్ రియల్ విన్నర్'' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మిస్ యూనివర్స్ పోటీల్లోని చివరి దశలో అమెరికా, ఫిలిప్పైన్స్, కొలంబియా దేశాల యువతులు నిలిచారు. అయితే మిస్ ఫిలిప్పైన్స్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోగా... నిర్వాహకుడు పొరపాటున మిస్ కొలంబియాను ప్రకటించడం సర్వత్రా విమర్శలు చోటు చేసుకున్నాయి. పొరపాటును గమనించిన క్షణాల్లోనే తిరిగి మిస్ ఫిలిప్పైన్స్ ను విజేతగా ప్రకటించారు. దీంతో ఎలాగైతేనేం తమకు న్యాయం జరిగిందని ఫిలిప్పైన్స్ ప్రజలు సంతోషపడుతుంటే.. కొలంబియన్లు మాత్రం దీన్ని తీవ్ర తప్పిదంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఇతర పోటీ దారులు కూడ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.