set on fire
-
మరాఠా రిజర్వేషన్ల పోరాటం.. ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు..
ముంబై: మహారాష్ట్రలో రిజర్వేషన్ ఉద్యమ నిరసనలు హింసకు దారి తీశాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిని నిరసనకారులు ముట్టడించారు. మరాఠా కోటా డిమాండ్ నేపథ్యంలో బీద్ జిల్లాలోని ఎమ్మెల్యే నివాసంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బిల్డింగ్ వద్ద ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంటి సమీపంలోని కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రకాశ్ సోలంకి ఇంటి వద్ద భారీగా మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చుట్టుపక్కలా ప్రాంతమంతా దట్టమైన మంటలు వ్యాపించాయి. కాగా ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే తెలిపారు. అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఆయన వెల్లడించారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు, తెలిపారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు. అయితే మరాటా రిజర్వేషన్ల ఉద్యమం గురించి సోలంకే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటిపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ గత అయిదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. సోలంకే ఈ దీక్షపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరాఠా రిజర్వేషన్ సమస్యను పిల్లల ఆటగా ఆయన అభివర్ణించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు ఆగ్రహంతో రగిలిపోయి.. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. చదవండి: ఈడీ ఎదుటకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు #WATCH | Beed, Maharashtra: Maratha reservation agitators vandalised and set the residence of NCP MLA Prakash Solanke on fire. pic.twitter.com/8uAfmGbNCI — ANI (@ANI) October 30, 2023 -
అమెరికాలో భారత దౌత్య కార్యాలయంపై దాడి..
శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియన్ కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దుండగులు దౌత్య కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత ఐదు నెలల్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. గత మార్చి నెలలోనే ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడి చేశారు. దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగగా అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తమైంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో గాయపడినవారి సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదు. అమెరికా అధికార ప్రతినిధి ఈ దాడిని ఖండించారు. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ARSON ATTEMPT AT SF INDIAN CONSULATE: #DiyaTV has verified with @CGISFO @NagenTV that a fire was set early Sunday morning between 1:30-2:30 am in the San Francisco Indian Consulate. The fire was suppressed quickly by the San Francisco Department, damage was limited and no… pic.twitter.com/bHXNPmqSVm — Diya TV - 24/7 * Free * Local (@DiyaTV) July 3, 2023 మార్చి లోనే.. మార్చి నెలలో భారత్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ కోసం గాలింపు చేపట్టింది ప్రభుత్వం. ఆ సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు శాన్ఫ్రాన్సిస్కోలో దౌత్య కార్యాలన్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అమృత్‌పాల్ సింగ్‌ను వదిలేయండి అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు నిర్వహించారు. The U.S. strongly condemns the reported vandalism and attempted arson against the Indian Consulate in San Francisco on Saturday. Vandalism or violence against diplomatic facilities or foreign diplomats in the U.S. is a criminal offense. — Matthew Miller (@StateDeptSpox) July 3, 2023 ఇదీ చదవండి: రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్.. -
భార్యకు వేరొకరితో సంబంధం.. అనుమానం ఉన్మాదిని చేసింది
బెంగళూరు: భార్య, ఇద్దరు పిల్లలపై దాడి చేసి వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో ప్రబుద్దుడు. ఈ ప్రమాదంలో ముగ్గురూ సజీవ దహనమయ్యారు. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్ట తాలూకా హెణ్ణూరులో జరిగింది. నేత్రావతి (37), కుమార్తెలు స్నేహ (11), హర్షిణి (9)లు మరణించారు. అక్రమ సంబంధం అనుమానమే ఈ మారణకాండకు కారణంగా భావిస్తున్నారు. గొడవపడి దారుణం వృత్తిరీత్యా భర్త సొణ్ణేగౌడ (48) వ్యవసాయం చేస్తుండగా, భార్య నేత్రావతి గృహిణి. పిల్లలు 5, 3 తరగతులు చదువుతున్నారు. భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని సొణ్ణేగౌడ అనుమానించేవాడు. మంగళవారం రాత్రి ఈ విషయమై భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. కోపం పట్టలేక ఉన్మాదిగా మారాడు. భార్య, ఆ తర్వాత పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతున్న వారి అరుపులు విన్న స్థానికులు వచ్చి వాటిని ఆర్పేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు ఉవ్వెత్తున రావడంతో ప్రయత్నం ఫలించలేదు. నిమిషాల్లోనే తల్లీ కూతుళ్లు తీవ్రంగా కాలిపోవడంతో ప్రాణాలు వదిలారు. నిందితుడు ఆత్మహత్యాయత్నం అప్పటికే సొణ్ణేగౌడ ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని బెంగళూరుకు తరలించారు. సంఘటన స్థలానికి శిడ్లఘట్ట గ్రామీణ పోలీసులు చేరుకుని పరిశీలించారు. ముగ్గురి మృతదేహాలను శిడ్లఘట్ట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చిక్కబళ్లాపుర ఎస్పీ డీఎల్ నాగేశ ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్యభర్తలు తరచు గొడవలు పడుతున్నా, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదని గ్రామస్తులు వాపోయారు. నేత్రావతి, పిల్లలు స్నేహ, హర్షిణి (ఫైల్) -
నా చావుకు మల్లికార్జున్ సార్ కారణం..‘కాల్మొక్తా.. కాపాడన్నా’
సాక్షి, రంగారెడ్డి: ‘కాల్మొక్తా కాపాడన్నా’.. అంటూ ఓ యువకుడు మంటల్లో కాలిపోతూ వేడుకున్నాడు. తను పనిచేసే పరిశ్రమ యాజమాన్యంతోపాటు మేనేజర్ మోసం చేశారని ఆరోపించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లేడ్ చౌదరిగూడ మండలం లచ్చంపేట గ్రామానికి చెందిన కమ్మరిపేట లక్ష్మి, నర్సింలుకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు తిరుమలేశ్ (27) ఐదేళ్లుగా వనంపల్లి శివారులోని జీబీ బేకర్స్ పరిశ్రమలో మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గత జూలైలో పరిశ్రమలో పనిచేస్తుండగా చేయి ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి గాయాలపాలయ్యాడు. పరిహారం ఇవ్వడంతోపాటు ఉద్యో గం పర్మినెంట్ చేస్తామని పరిశ్రమ యాజమాన్యం, మేనేజర్ మల్లికార్జున్ హామీ ఇచ్చారు. ఈ విషయమై తిరుమలేశ్ కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. యాజమాన్యంతో మాట్లాడతానంటూ మల్లికార్జున్ మభ్యపెడుతూ వచ్చాడు. శనివారం మరోసారి గుర్తు చేయగా ‘పరిహారం లేదు, ఏమీ లేదు.. నీ చావు నీవు చావు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పరిశ్రమలో పనిచేసేందుకు యథావిధిగా తిరుమలేశ్ వెళ్లగా లోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురై తుమ్మలపల్లి శివారు కంకల్ దారిలోని ఎల్లమ్మ దేవాలయం దగ్గరలో ఒంటి పై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. నా చావుకు మల్లికార్జున్ సార్ కారణం.. లాల్‌పహాడ్ వైపు నుంచి యెన్కెపల్లి వైపు ట్రాక్టర్ డోజర్‌తో వెళ్తున్న లచ్చంపేట గ్రామానికి చెందిన వడ్డెగారి శ్రీనివాస్ మంటల్లో కాలిపోతున్న తిరుమలేశ్ను చూశాడు. ఏమైంది.. ఎందుకిలా చేశావు అనగా ‘కాల్మొక్తా అన్నా.. నన్ను కాపాడు’ అంటూ అరిచాడు. వెంటనే స్థానికుల సాయంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన చావుకు మల్లికార్జున్ సార్ కారణం అంటూ తిరుమలేశ్ ఆత్మహత్యాయత్నానికి ముందు తన మొబైల్లో స్టేటస్ పెట్టుకున్నాడు. అది చూసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు తిరుమలేశ్ను వెతుకుతున్న క్రమంలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలిసింది. మల్లికార్జున్‌తోపాటు లేబర్ కాంట్రాక్టర్ వెంకట్‌రెడ్డి, అసిస్టెంట్ బాలకృష్ణ వేధింపులే కారణమని బాధితుడి సోదరుడు కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సక్రమ్, షాద్‌నగర్ రూరల్ సీఐ సత్యనారాయణ ఉస్మానియాలో చికిత్స పొందుతున్న తిరుమలేశ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమ యాజమాన్యంతోపాటు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి -
విద్యార్థిపై జాత్యహంకార దాడి.. పక్కాగా ప్లాన్ చేసి, సీట్లో ఆల్కహాల్ పోసి నిప్పు
మెక్సికో: స్థానిక భాష మాట్లాడినందుకు 14 ఏళ్ల విద్యార్థికి తరగతి గదిలోనే నిప్పంటించారు తోటి విద్యార్థులు. ఈ దారుణ ఘటన మెక్సికో క్వెరెటరో రాష్ట్రంలో జూన్‌లో జరిగింది. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. చాలా రోజుల చికిత్స అనంతరం ఈ వారమే డిశ్ఛార్జి అయ్యాడు. జాతి వివక్ష వల్లే తన కుమారుడిపై దాడి జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు విద్యార్థులు సహా పాఠశాల సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన ఈ విద్యార్థి పేరు జువాన్ జమొరానో. క్వెరెటరోలోని హైస్కూళ్లో చదవుతున్నాడు. అయితే ఇతను మెక్సికో సంప్రదాయ తెగ అయిన ఒటోమి కుటుంబం నుంచి వచ్చాడు. ఈ విషయం తెలిసి తోటి విద్యార్థులు అతడ్ని వివక్షపూరితంగా చూస్తున్నారు. ఓ రోజు ఇద్దరు విద్యార్థులు జువాన్ కూర్చొనే సీట్లో ఆల్కహాల్ పోశారు. అది చూసుకోకుండా అతను అలానే కూర్చుకున్నాడు. ప్యాంట్ తడిచాక విషయాన్ని గమినించి వెంటనే పైకి లేచాడు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు జూవన్కు నిప్పంటించారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. టీచర్ కూడా వేధిస్తోంది పాఠాలు చెప్పే టీచర్ కూడా తమ బిడ్డను వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు జువాన్ తల్లిదండ్రులు. ఒటోమి భాష మాట్లాడితే తోటి విద్యార్థులు జువాన్‌తో గొడవపడేవారని, అతడ్ని వేధించేవారని తెలిపారు. అందుకే స్కూళ్లో ఆ భాష మాట్లాడాలంటేనే అతను భయంతో వణికిపోయేవాడని వివరించారు. అధ్యక్షుడి రియాక్షన్ మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుల్ లోపెజ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. అవసరమైతే ఈ కేసును దేశ అటార్నీ జరనల్ కార్యాలయం తమ చేతుల్లోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒటోమి భాష మాట్లాడటమే జువాన్ చేసిన నేరమా అని, జాతివివక్షను అంతం చేయడం అందరి బాధ్యత అని లోపెజ్ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. 12.6కోట్ల జనాభా ఉన్న మెక్సికోలో జాతి వివక్ష దాడులు సాధారణం అయిపోయాయి. ఈ దేశంలో దాదాపు 2.3 కోట్ల మంది సంప్రదాయ తెగలకు చెందినవారున్నారు. వీరిలో 73లక్షల మంది స్థానిక భాషే మాట్లాడుతారు. దాదాపు 40 శాతం మంది సంప్రదాయ తెగలు తమను వివక్షతో చూస్తున్నారని ఫిర్యాదు చేశారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదవండి: ప్రధాని నివాసం వద్ద వేల మంది నిరసనకారులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం -
అన్నతోనే ‘సంబంధం’ అని పంచాయితీ.. భార్యపై చేయిచేసుకోవడంతో..
సాక్షి, కొండపాక(గజ్వేల్., సిద్దిపేట): కుటుంబ కలహాలతో రెండేళ్ల కుమారుడికి నిప్పంటించి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సిర్సనగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. సిర్సనగండ్లకు చెందిన గవ్వల అయ్యల్లం, బీరవ్వల రెండో కుమారుడు స్వామికి చేర్యాల మం డలం వేచరేణికి చెందిన పోశయ్య, మల్లవ్వల చిన్న కుమార్తె నవితను ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. స్వామి వ్యవసాయ పనులతో పాటు కూలీ పను లు చేసుకుంటూ భార్య నవిత (25), కుమారుడు మణిదీప్ (2)ను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో స్వామి అన్న భాస్కర్‌కు నవితకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వారం రోజుల క్రితం కులపెద్దలు సముదాయించి స్వామికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో శనివారం స్వామి వ్యవసాయ బావి వద్ద పత్తి ఏరేందుకు భార్యను రమ్మని చెప్పగా.. ఆమె రానని అనడంతో ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో స్వామి భార్య పై చేయి చేసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన నవిత మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు మణిదీప్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను కూడా నిప్పంటించుకుంది. చదవండి: ఇంతమంది చనిపోతుంటే ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తోంది? ఇంట్లో నుంచి వస్తున్న పొగను గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు పగుల గొట్టి చూడగా ఇద్దరూ విగత జీవులై కనిపించా రు. తమ కూతురు నవితపై లేనిపోని అభాండాలు వేసి, వేధించి చంపారని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కూతురు మృతికి కారణమయ్యారని అత్త బీరవ్వ, బావ భాస్కర్, భర్త స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. చదవండి: బాత్రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య -
సరదా తీర్చిన ట్రూత్ ఆర్ డేర్.. జీవిత ఖైదు
లండన్: ఫన్ కోసం సరదాగా ఆడే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఓ యువకుడిని జైలు పాలు చేసింది. గేమ్‌లో భాగంగా సదరు యువకుడు తన నానమ్మను చంపేశాడు. ఈ సంఘటన రెండేళ్ల క్రితం జరగ్గా.. తాజగా కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఆ వివరాలు.. లాంక్షైర్ కాన్స్టాబులరీ ప్రకారం, యూకేకి చెందిన టియర్నాన్ డార్న్‌టన్ అనే యువకుడికి రిస్కీ పనులు చేయడం అంటే చాలా ఇష్టం. థ్రిల్ కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికే కాదు.. తీయడానికి కూడా రెడీనే. ఈ క్రమంలో 2018, మే 28న ఇలాంటి థ్రిల్లింగ్ పనికే పూనుకున్నాడు. స్నేహితులతో కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాడు. (చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!) ఈ క్రమంలో తన వంతు వచ్చినప్పుడు డేర్ సెలక్ట్ చేసుకున్నాడు డార్న్‌టన్. దానిలో భాగంగా తన నానమ్మ మేరీ గ్రెగోర్ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటనలో మేరీ మరణించింది. న్యూమోనియా, ఊపిరిడకపోవడం వల్ల చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు, లాంక్షైర్ కాన్స్టాబులరీ ఉమ్మడి పరిశోధనలో సిగరెట్‌ని ఆర్పకుండా పడేయడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు. మరి ఇప్పుడెలా బయటపడింది అంటే డార్న్టనే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల క్రితం డార్న్‌టన్ ఓ కౌన్సిలర్ని కలిశాడు. మాటలో మధ్యలో గతంలో తాను తన నానమ్మ ఇంటికే నిప్పు పెట్టానని.. ఈ ప్రమాదంలో ఆమె మరణించిందని తెలిపాడు. ఈ విషయాన్ని కౌన్సిలర్ పోలీసులుకు తెలపడంతో వారు కేసును రీఒపెన్ చేశారు. (చదవండి: ఇదేం ట్రెండ్రా నాయనా... డస్ట్‌బిన్ కవరే డ్రెస్సు.!) కేసు విచారణలో డార్న్‌టన్ సంచలన విషయాలు తెలిపాడు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో భాగంగా తానే తన నానమ్మ ఇంటికి నిప్పు పెట్టినట్లు వెల్లడించాడు. దీని తర్వాత మరో సారి కూడా ఇలాంటి పని చేసినట్లు తెలిపాడు. ఈ క్రమంలో 2021, మార్చిలో డార్న్‌టన్ మీద హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టు డార్న్టన్కు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో పెరోల్ లభించాలంటే.. డార్న్‌టన్ కనీసం 15 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి. ఆ తర్వాతే అతడికి పెరోల్ లభించనుంది. చదవండి: 17 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. గ్రాండ్‌గా విడాకుల పార్టీ -
శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణం
-
Medak: కారు డిక్కీలో శవం.. ప్రధాన నిందితుడు అరెస్ట్
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండల పరిధిలో కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దగ్ధం చేసిన కేసును జిల్లా పోలీసులు చేధించారు. మృతుడిని రియల్టర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. గొంతు కోసి శ్రీనివాస్‌ను చంపేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 10న యశ్వంత్ రావ్పేట గ్రామంలో మృతదేహం దొరికింది. ఆగస్టు 9 రాత్రి దగ్దం చేయడం జరిగింది. మృతదేహాన్ని రియల్టర్ శ్రీనివాస్‌దిగా గుర్తించాము. శ్రీనివాస్ భార్య మాకు ఫిర్యాదు ఇచ్చింది. ముగ్గురు నిందితులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రధాన నిందితుడు శివను అరెస్ట్ చేసాం. ఏ-2 పవన్, ఏ-3 నిఖిల్‌లు పరారీలో ఉన్నారు’’ అని తెలిపారు. ‘‘మృతుడు శ్రీనివాస్ మెదక్ నుంచి ఆగస్టు 9 న ఇంటి నుండి బయటకు వచ్చాడు. శివ, నిఖిల్ ఇద్దరు కార్లో శ్రీనివాస్‌ను ఎక్కించుకుని వెళ్లారు. కార్ దగ్దం చేసిన ప్రాంతంలోనే శ్రీనివాస్‌ను హత్య చేశారు. హత్య కు ప్రధాన కారణం వ్యాపార లావాదేవీలు. టెక్నీకల్ ఏవిడెన్స్, సయింటిఫిక్ ఏవిడెన్స్ ఆధారంగా కేసును ఛేదించాము. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివను పోలీసు కస్టడీకి తీసుకుంటాము. గతంలో శివపై రౌడీ షీట్ ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది’’ అని తెలిపారు. -
డిక్కీలో మృతదేహం.. కారు దగ్దం: అక్రమ సంబంధమే కారణమా?
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో మంగళవారం తెల్లవారుజామున దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్‌దిగా గుర్తించారు. అతడు వేసుకున్న డ్రస్, పెట్టుడు బంగారు పళ్ల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇక అక్రమ సంబంధమే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పోలీసులు ఓ మహిళ, ఆమె భర్త, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. శ్రీనివాస్‌ను వేరేచోట హత్య చేసి.. ఆ తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచి దహనం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అటు వ్యాపార లావాదేవీల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కారుని దగ్ధం చేసిన దుండగులు.. డిక్కీలో డెడ్‌బాడీ
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు మంగళవారం తెల్లవారు జామున కారుని తగలబెట్టేశారు. దగ్ధమైన కారుని పరిశీలించగా డిక్కీలో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. కారుతోపాటు గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం కాలిపోయి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహం ఎవరిదన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మంటల్లో కాలిబూడిదైన కాగా TS 05 EH 4005 అనే నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ధర్మకారి శ్రీనివాస్‌రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ నిన్న స్వగ్రామం నుంచి హైద్రాబాద్ వచ్చాడు. అయితే శ్రీనివాస్ మొబైల్ రాత్రి నుంచి స్విచ్చాఫ్‌లో ఉందని అతని భార్య తెలిపింది. కారులోని మృతదేహం ఎవరిదనే విషయంపై ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది. -
సోషల్ మీడియా పోస్ట్ రచ్చ.. లవర్ని సజీవదహనం
తిరువనంతపురం: కేరళలో దారుణం చోటు చేసుకుంది. సోషల్ మీడియా పోస్ట్ వల్ల చెలరేగిన వివాదం చివరకు మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీ వద్ద మహిళను సజీవ దహనం చేశాడు ఆమె భాగస్వామి. ఆ వివరాలు.. షానవాజ్(30), అతిరా గత కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నారు. కొల్లాం అంచల్లో నివసిస్తున్నారు. వీరికి మూడు నెలల పాప ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అతిరా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. దీనిపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాట మాట పెరిగింది. ఆగ్రహించిన షాన్వాజ్ అతిరా మీద కిరోసిన్ పోసి, లైటర్‌తో నిప్పంటించాడు. ఆమె ఆరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఇక ఈ ఘటనలో షాన్వాజ్కు కూడా తీవ్రంగా గాయలయ్యాయి. ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. ఇక తీవ్రంగా గాయపడిన అతిరా మృతి చెందగా.. షాన్వాజ్ చికిత్స పొందుతున్నాడు. ఇక అతిరా తల్లి ఫిర్యాదు మేరకు కొల్లాం పోలీసులు షాన్వాజ్ మీద కేసు నమోదు చేశారు. చదవండి: సహజీవనం.. గదిలో బంధించి అత్యాచారం -
సంతానం కలగడం లేదని.. భార్యను!
సాక్షి, నల్గొండ : సంతాన భాగ్యం కలగడం లేదని ఓ భర్త కిరాతకానికి తెగబడ్డాడు. ఆదమరచి నిద్దరోతున్న భార్యపై పెట్రోల్ పోసి, నిప్పంటించి మట్టుబెట్టాడు. ఈ దారుణ ఘటన జిల్లా కేంద్రం శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారు అక్కలాయిగూడేనికి చెందిన పరశురామ్ మున్సిపాలిటీలో జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన జ్యోతితో 14ఏళ్ల క్రితం వివా హం జరిగింది. వీరికి పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇదే విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి పూటుగా మద్యం తాగిన పరశురామ్ తెల్లవారుజామున నిద్దరోతున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. పరశురామ్ ఇంటినుంచి పొగ వస్తుండడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకునేలోపే జ్యోతి మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: నోయిడాలో ఉద్యోగం.. స్వగ్రామానికి వచ్చి లాడ్జిలో.. వివాహేతర సంబంధం: మెడ నొక్కి.. పెట్రోల్ పోసి! -
లిఫ్ట్ అడిగిన మహిళపై తండ్రీకొడుకుల అఘాయిత్యం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారం చేసిన తండ్రీ కొడుకులు ఆమెను చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. వివరాలు.. బాధితురాలు యూపీ సీతాపూర్ జిల్లా సిధౌలి ప్రాంతంలోని తన పుట్టింటి నుంచి మిశ్రీఖ్‌లోని అత్తారింటికి వెళ్తోంది. అదే సమయంలో ఇద్దరు తండ్రీ కొడుకులు ఎడ్ల బండిపై అదే మార్గంలో వెళ్తున్నారు. దాంతో బాధితురాలు వారిని లిఫ్ట్ అడిగి.. ఎడ్ల బండి ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వారిద్దరూ సదరు మహిళను రోడ్డు పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆమె బతికి ఉంటే తమకు ప్రమాదం అని భావించి మహిళ ఒంటికి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు. ఆ దారిన వెళ్తున్న స్థానికులు ఆమెను గుర్తించి ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించారు. బాధితురాలిని సీతాపూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 30 శాతం గాయాలు అయ్యాయని ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. బాధితురాలు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి.. నిందితులైన తండ్రికొడుకులిద్దరిని అరెస్ట్ చేశారు. చదవండి: ‘అది ఖచ్చితంగా బ్యాడ్ టచే.. నాకు తెలుసు’ -
శ్మశానాన్ని కాపాడలేని ఈ బతుకు ఎందుకు!!
లక్నో : శ్మశాన స్థలాన్ని కబ్జాదారులనుంచి రక్షించలేకపోతున్నానన్న బాధతో ఓ వ్యక్తి తనతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేశాడు. కుటుంబంతో కలిసి మూకుమ్మడి ఆత్మహత్యలకు ప్రయత్నించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు... కాన్పూర్ దేహత్, మూసా నగర్‌కు చెందిన గుల్ఫమ్(35) ఊర్లోని శ్మశాన వాటిక స్థలానికి కాపలాగా ఉంటున్నాడు. అయితే ఆ స్థలాన్ని ఆక్రమించుకున్న కొందరు నిర్మాణాన్ని చేపట్టారు. గుల్ఫమ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికి లాభం లేకపోయింది. దీంతో భార్య, బిడ్డలతో కలిసి చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడు. గురువారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అనంతరం తనపై, వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతున్న వారి అరుపులు విన్న దారినపోయేవారు ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేట్టారు. ( లేడీ డాక్టర్‌ను కాల్చిచంపిన ఇండియన్ డాక్టర్) -
పైశాచిక చర్య.. గజరాజు బలి
ఉదకమండలం: ఓ రిసార్టు యజమాని పైశాచిక చర్య ఓ ఏనుగు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా మసినగుడి వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నీలగిరి అడవుల్లో సంచరించే 50 ఏళ్ల గజరాజు సమీపంలోని మసినగుడి వద్ద ఉన్న ఓ ప్రైవేట్ రిసార్టు ప్రాంగణంలోకి ప్రవేశించింది. దానిని భయపెట్టి, పారదోలేందుకు ఆ రిసార్టు నిర్వాహకులు కాలుతున్న టైరును ఏనుగు పైకి విసిరేశారు. మండుతున్న ఆ టైరు ఏనుగు చెవి చుట్టూ ఇరుక్కుపోయింది. తీవ్రంగా కాలుతుండటంతో ఏనుగు బాధతో ఘీంకరిస్తూ తీవ్ర రక్త స్రావం కారణంగా సమీపంలోని రిజర్వాయర్ వద్ద పడిపోయింది. అటవీ సిబ్బంది గమనించిన చికిత్సకు తరలించే లోగానే కన్నుమూసింది. అటవీశాఖ అధికారులు రిసార్టు యజమాని రేమండ్, సహాయకుడు ప్రశాంత్‌లను అదుపులోకి తీసుకున్నారు. సమీపలోని భవనం పైనుంచి ఏనుగుపైకి మండుతున్న టైరును విసిరి వేస్తున్న ఫొటోలు వారి సెల్ఫోన్లలో లభ్యమయ్యాయి. ఈ ఫుటేజీని శుక్రవారం అటవీ శాఖ విడుదల చేసింది. (చదవండి: ఏనుగు మృతి.. వెక్కివెక్కి ఏడ్చిన అధికారి) -
దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. సరిగా చదవడం లేదని కొడుకుపై తండ్రి కిరాతకానికి ఒడిగట్టాడు. చరణ్ అనే పదేళ్ల యువకుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే కుమారుడు సరిగా చదువుకోవడం లేదని తండ్రి అతనిపై పలుమార్లు విచక్షణారహితంగా కొట్టాడు. అంతేగాక కొడుకుపై కోపం చల్లారకపోవడంతో ఆదివారం రాత్రి టీవీ చూస్తున్న చరణ్‌పై టర్పెంటైల్ పోసి నిప్పంటించి తగలబెట్టాడు. ఒంటినిండా గాయాలవ్వడంతో బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చదవండి: ఈ అగ్ని ప్రమాదం హైదరాబాద్‌లో జరిగిందా? -
అప్పు తీర్చలేదని సర్పంచ్ భర్త సజీవ దహనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళితుడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మరణించాడు. మృతుడి భార్య గ్రామ్ ప్రధాన్(సర్పంచ్) కావడం గమనార్హం. ఈ ఘటన శుక్రవారం అమేథీలోని మున్షిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందోయియా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన అర్జున్ కోరి(40)కి.. మరి కొందరికి మధ్య డబ్బుకు సంబంధించి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో గురువారం 5-6గురు వ్యక్తులు కలిసి అర్జున్ కోరిని చంపేందుకు ప్రయత్నించారు. బతికి ఉండగానే అతడిని సజీవ దహనం చేయాలని భావించి నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బాధితుడి ఇంటి సరిహద్దు ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో ఉన్న అర్జున్‌ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తక్షణమే అతడిని చికిత్స కోసం నౌగిర్వాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని సుల్తాన్పూర్ జిల్లా ఆస్పత్రికి అక్కడి నుంచి లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. కానీ దురదృష్టవషాత్తు ఆస్పత్రికి చేరేలోపే అతడు మరణించాడు. (బర్త్‌డే పార్టీలో ఓవరాక్షన్ : సింగర్‌పై కాల్పులు) ఈ సందర్భంగా గ్రామ పెద్ద(సర్పంచ్), బాధితుడి భార్య ప్రత్యర్థులే ఈ హత్య చేశారని తెలిపింది. ఐదురుగిరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామ పంచాయతీ సభ్యులు మాత్రం డబ్బుల కోసమే అర్జున్ కోరిని హత్య చేశారని తెలిపారు. ఇక ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంగటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు గ్రామంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘విషయం తెలిసిన వెంటనే మేం సంఘటన స్థలానికి చేరుకుని గ్రామ్ ప్రధాన్ భర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాము. ఈ రోజు ఉదయం లక్నో ట్రామా సెంటర్‌కు తీసుకెళ్తుండగా.. అతడు మరణించాడు’ అని తెలిపారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
అందుకే కారుకు నిప్పంటించాడు
సాక్షి, విజయవాడ: బెజవాడలో కారు దుర్ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు. వ్యాపార లావాదేవీల్లో వివాదమే హత్యాయత్నానికి దారి తీసినట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు వేణుగోపాల్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ హర్షవర్ధన్‌రాజు మీడియాతో మాట్లాడుతూ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నమ్మించి మోసం చేసినందుకే ముగ్గురిపై హత్యాయత్నం చేసినట్లు వేణుగోపాల్‌రెడ్డి విచారణలో తెలిపినట్లు పేర్కొన్నారు. ‘‘ఆర్థిక లావాదేవీల విషయంలో వేణుగోపాల్‌రెడ్డికి క్రిష్ణారెడ్డి, గంగాధర్‌లతో విభేదాలు వచ్చాయి. గంగాధర్ రియల్ ఎస్టేట్ విషయంలో మోసం చేయడమే గాకుండా క్రిష్ణారెడ్డికి డబ్బులు కూడా ఇప్పించాడు. తాను ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అందుకే తనను మోసం చేసి, అప్పుల పాలు చేసిన క్రిష్ణారెడ్డిపై వేణుగోపాల్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. అందుకే వారిని చంపేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందులో భాగంగానే సోమవారం కారులో ఉన్న వాళ్లను సజీవ దహనం చేసేందుకు యత్నించాడు’’అని తెలిపారు.(కారుపై పెట్రోలు పోసి.. ముగ్గురిపై హత్యాయత్నం) కాగా సోమవారం సాయంత్రం విజయవాడ నోవాటెల్ సమీపంలోని భారతీనగర్‌లో కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. తాడేపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి.. విజయవాడ వెటర్నరీ కాలనీకి చెందిన గంగాధర్, అతడి భార్య నాగవల్లి, గాయత్రీనగర్‌కు చెందిన కృష్ణారెడ్డిలను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఆర్థిక విభేదాలు తలెత్తిన నేపథ్యంలో కారులో కూర్చొని చర్చలు జరుపుతూనే హఠాత్తుగా బయటకొచ్చిన వేణుగోపాల్‌రెడ్డి, తనతోపాటు తెచ్చుకున్నపెట్రోలును కారుపై పోసి నిప్పంటించి పారిపోగా.. 24 గంటల్లోపే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇక ఈ ఘటనలో కృష్ణారెడ్డికి తీవ్రంగా.. గంగాధర్, నాగవల్లిలకు స్వల్పంగా గాయాలయ్యాయి. -
ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస
-
బెంగళూరు: తీవ్ర స్థాయిలో అల్లర్లు..
బెంగళూరు: ఓ వ్యక్తి ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి ప్రేరేపించింది. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగగా రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో సిటీలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాలు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు షేర్ చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన కొంతమంది వ్యక్తులు అతడిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎమ్మెల్యే అండతోనే అతడు ఇలా చేస్తున్నాడని భావించి మంగళవారం రాత్రి కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అంతేగాక ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది పట్ల కూడా నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు.(బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన అల్లరి మూక పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో అనేక హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాలు అయినట్లు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 110 మందిని అరెస్టు చేశామని బెంగళూరు జాయింట్ కమిషనర్(క్రైం) సందీప్ పాటిల్ తెలిపారు. అదే విధంగా వివాదాస్పద పోస్టుతో ఘర్షణ వాతావారణానికి మూల కారణమైన నవీన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషను పరిధిలో కర్ఫ్యూ విధించామని, బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడినట్లు పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర బంధం
లక్నో : మహిళతో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే ఆరోపణలతో ఓ యువకుడిని సజీవ దహనం చేసిన ఘటన యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో వెలుగుచూసింది. హతుడిని భుజామి గ్రామానికి చెందిన అంబికా పటేల్‌గా గుర్తించారు. కొద్ది నెలల కిందట మహిళ వీడియో క్లిప్‌ను ఆ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడం మహిళ బంధువులకు ఆగ్రహం కలిగించింది. దీంతో అనైతిక బంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో మహిళ బంధువులు సోమవారం బాధితుడిని ఇంటి నుంచి వెలుపలకి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితుడిపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టారు. యువకుడి హత్యపై బాధిత కుటుంబ సభ్యులు, స్ధానికులు ఆగ్రహంతో పోలీస్ వాహనాలను దగ్ధం చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఘటనా ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. చదవండి : మహిళా లెక్చరర్‌ను వెంబడించి.. -
పండగ వేళ కిరాతకం..కిటికీలోంచి పెట్రోలు పోసి
మీరట్ : పండగపూట ఉత్తర ప్రదేశ్ మీరట్‌లో ఒక అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. కలకాలం తోడు వుంటాన్న భర్త , నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోతే.. తన ఐదుగురు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడు కుంటోంది. కూలీ నాలి చేసి వారిని రక్షించుకుంటోంది. ఇంతలో ఏమి జరిగిందో ఏమోగానీ, తల్లీ బిడ్డలు ఇంట్లోనిద్రిస్తుండగా, గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో మొత్తం కుటుంబం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరి పరిస్థితి విషమయంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం ఢిల్లీకి తరలించారు. మీరట్‌లోని ఖార్ఖోడా ప్రాంతంలోని జాహిద్‌పూర్ గ్రామంలో మంగళవారం ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఖార్ఖోడా పోలీస్ స్టేషన్ స్టేషన్ ఇన్‌ఛార్జి మనీష్ బిష్ట్ అందించిన సమాచారం ప్రకారం రహీన(40) ను ఎనిమిదేళ్ల కిత్రం భర్త విడిచిపెట్టి ఎటో వెళ్లిపోయాడు. దీంతో తల్లీ తండ్రీ తనే అయి, కూలి పనులకెళుతూ .. వచ్చిన డబ్బులతో బిడ్డల్ని పోషించుకుంటోంది. కానీ విధి వారి జీవితాలను తీరని కష్టాల్లోకి నెట్టేసింది. మంగళవారం రాత్రి బిడ్డలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు వారుండే ఇంటికి కిటికీకి వుండే వైర్ మెష్ ద్వారా ఒక పైపు వేసి మరీ పెట్రోల్ పోసి, నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కిరాతకం వెనుక ఎవరు ఉండవచ్చనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. రహీనాకు ఎపుడూ పిల్లలు, వారి పోషణ తప్ప, వేరే ధ్యాస వుండేది కాదనీ, ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవని సమీప బంధువు ఫాతిమా తెలిపారు. ఈ ఘోరం ఎలా జరిగిందో అర్థంకావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేకపోవడంతో, ఆమె భర్తే ఈ దురాగతానికి పాల్పడి వుంటాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రహీనా కోలుకుని, ఆమెతో మాట్లాడిన తరువాత గానీ ఏమీ చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. -
కోరిక తీర్చలేదని వదినపై మరిది ఘాతుకం..
లక్నో : సొంత వదినపై లైంగిక దాడికి విఫలయత్నం చేసిన మరిది బాధిత మహిళకు నిప్పంటించిన ఘటన యూపీలో వెలుగుచూసింది. హరికిషన్పూర్కు చెందిన మహిళపై సొంత మరిదే లైంగిక దాడి చేయడంతో ప్రతిఘటించినందుకు ఆమెపై కిరోసిన్ చల్లి నిప్పంటించాడు. జూన్ 11న ఈ ఘటన జరిగినా కాలిన గాయాలతో బాధిత మహిళ స్టేట్మెంట్ నమోదు చేయడం వీలుకాలేదని పోలీసులు తెలిపారు. బరేలిలోని ఆస్పత్రిలో 80 శాతం కాలిన గాయాలతో మహిళ చికిత్స పొందుతోందని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. తమ సోదరి క్రమంగా కోలుకుంటున్నారని ఘటన గురించి ఇప్పుడే వివరించారని బాధిత మహిళ సోదరుడు చెప్పారు. మే 2016లో ఆమె వివాహం జరిగినప్పటి నుంచే తమ సోదరిపై ఆమె మరిది అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడని, మరిది తీరుపై భర్తకు చెప్పగా ఆయన తమ సోదరినే మందలించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ సోదరుడు పేర్కొన్నారు. లైంగిక దాడి ప్రయత్నం విఫలం కావడంతో కుటుంబ సభ్యుల సహకారంతోనే మరిది తన సోదరిపై కిరోసిన్ చల్లి నిప్పంటించాడని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకుంటామని నీరుయా ఎస్హెచ్ఓ బిర్జా రామ్ వెల్లడించారు. -
జై శ్రీరాం అనలేదని 15 ఏళ్ల బాలుడికి నిప్పు
లక్నో : జై శ్రీరాం అంటూ నినదించలేదని ఓ 15 ఏళ్ల ముస్లిం బాలుడికి నలుగురు వ్యక్తులు నిప్పంటించిన ఘటన యూపీలోని చందౌలీ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో 60 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలుడిని కబీర్ చౌరా ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. జై శ్రీరాం అని నినదించేందుకు నిరాకరించడంతోనే తనకు నిప్పంటించారని బాలుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆస్పత్రి కెమెరాలో రికార్డయింది. మరోవైపు పోలీసులు చెబుతున్నవివరాలు బాలుడి స్టేట్మెంట్కు విరుద్ధంగా ఉన్నాయి. దుధారి బ్రిడ్జ్‌పై తాను వెళుతుండగా నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేశాడని, వారిలో ఇద్దరు తన చేతులను కట్టివేయగా..మరో వ్యక్తి తనపై కిరోసిన్‌పోసి నిప్పటించాడని, అనంతరం వారు పారిపోయారని బాధిత బాలుడు పేర్కొన్నాడు. కాగా, బాలుడు ఇంటికి చేరే సమయానికే కాలిన గాయాలయ్యాయని పోలీసులు చెబుతూ దీన్ని అనుమానిత కేసుగా పరిగణిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
దారుణం : గదిలో బంధించి, కిరోసిన్ పోసి నిప్పు
సాక్షి, ముంబై : మహరాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది.కులాంతర వివాహం చేసుకున్న యువ జంటపై స్వయంగా అమ్మాయి తరపు బంధువులే కిరోసిన్ పోసి నిప్పంటించారు. సంఘటన మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని నిగోజ్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మే 1వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగేష్ రాన్సింగ్(23),రుక్మిణి(19) కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. అయితే కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. చివరకు మంగేష్ తల్లిదండ్రుల సమక్షంలో గత అక్టోబరులో వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవలే మంగేష్‌తో రుక్మిణికి గొడవ జరిగింది. దీంతో ఆమె ఏప్రిల్ 30న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. రుక్మిణిని తీసుకెళ్లేందుకు మంగేష్ మే 1న అత్తగారింటికి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన రుక్మిణి బంధువులు మంగేష్‌ను తీవ్రంగా చితకబాదారు. అనంతరం కన్నకూతురు అన్న కనికరం కూడా ఒక గదిలో బంధించి తాళం వేసి మరీ ఈ దంపతులపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. అయితే వీరి అరుపులను గమనించిన పొరుగువారు వారిని ఆసుపత్రికి తరలించారు. 50 శాతం త్రీవ గాయాలతో ప్రస్తుతం మంగేష్ శరీరం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ మృత్యువుతో పోరాడిన రుక్మిణి మాత్రం చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించి బాధితుల వాంగ్మూలం ఆధారంగా రుక్మిణి తండ్రి రమా భర్టియా మరో ఇద్దరు బంధువులు సురేంద్ర భర్టియా, జ్ఞాన్‌శ్యామ్ సరోజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తండ్రి రమా భర్టియా పరారీలో ఉండగా, సురేంద్ర, జ్ఞాన్‌శ్యామ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. -
ప్రేమోన్మాది ఘాతుకం : పెట్రోల్ పోసి నిప్పు
దేశంలో మహిళలపై, యువతులపై అరాచకాలకు అడ్డు లేకుండా పోతోంది. ఏదో ఒక మూల హింసాత్మక ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. తెలంగాణా రాష్ట్రంలో వరంగల్ రవళి విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే మరో ప్రేమోన్మాది అఘాయిత్యానికి తెగబడ్డాడు. ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధిస్తూ వెంటబడుతున్న ఒక యువకుడు చివరికి ఆ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పటించాడు. 80శాతం గాయాలతో బాధితురాలు ఆసుప్రతిలో మృత్యువుతో పోరాటాడుతోంది. కేరళలోని పాతానంతిట్టలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. తిరువళ్ల పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ పని చేశానని నిందితుడు కుంబానాడ్ నివాసి, అజిన్ రేజి మాథ్యూ (20)ఒప్పుకున్నాడు. బాధితురాల్ని టాటా మెడికల్ సైన్సెస్‌లో బీఎస్సీ చదువుతున్న కవిత విజయ్‌కుమార్ (18)గా గుర్తించారు. రెండు బాటిళ్ల పెట్రోల్‌తో వచ్చిన అజిన్ మొదట అమ్మాయితో గొడవకు దిగాడు. అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు సంఘటనా స్థలం నుంచి పారిపోతున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. -
ప్రేమించాలని వేధింపులు.. కాదనడంతో దారుణం ..!!
-
ప్రేమించాలని వేధింపులు.. కాదనడంతో దారుణం ..!!
సాక్షి, కర్నూలు : కౌతాళం మండలం బదినేహల్‌లో దారుణం చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలికపై ఓ కామాంధుడు హత్యాయత్నం చేశాడు. వివరాలు.. గ్రామానికి చెందిన బాలికను మౌలానా సాహెబ్ అనే వ్యక్తి తనను ప్రేమించాలని గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో శుక్రవారం అర్ధరాత్రి నిప్పటించాడు. బాలిక కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు మంటలార్పి ఆమెను ఆదోని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై నిర్భయ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏమీ తోచక ఇళ్లకు నిప్పంటించాడు..!
మీకు బోర్‌కొడితే ఏం చేస్తారు? వీడియో గేమ్స్ ఆడతారు. టైం ఉంటే సినిమాకెళ్తారు. ఇంకా ఏం చేస్తారు? తింటారు లేదా పడుకుంటారు. అయితే, ముంబైలో ఓ కుర్రాడు తనకు బోర్ కొడుతుందని ఏకంగా ఇళ్లకు నిప్పంటించడం మొదలు పెట్టాడు. ముంబైకి చెందిన అతని పేరు ర్యాన్ లుభం (19). పైగా, అతగాడు వాలంటీర్ ఫైర్‌ఫైటర్ కూడా! ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే అగ్నిమాపకశాఖకు కబురందిస్తాడు. అవసరమైతే వారితో కలసి రంగంలోకి దిగి మంటలు కూడా ఆర్పడం అతని పని. గత నెల ముంబైలోని ఆగ్నేయా పిట్స్‌బర్గ్‌లో ర్యాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 3, 10 తేదీల్లో స్థానికంగా ఉన్న ఇళ్లకు నిప్పంటించిన కేసులో అతడు దోషి. ఇళ్లకు నిప్పంటించి బయటకు వచ్చి.. మళ్లీ తానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గుట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. నేరాన్ని అంగీకరించిన ర్యాన్.. బోర్ కొట్టడం వల్లనే ఆ పని చేసినట్లు విచారణలో చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఫైర్ ఫైటర్లే నిప్పంటించడం ఇప్పుడే కొత్త కాదు. అమెరికా సహా అన్ని దేశాల్లో ఏడాదికి వంద మందికి పైగా ఫైర్‌ఫైటర్లు ఇలాంటి కేసుల్లో అరెస్టవుతున్నారు. జర్మనీలో 30 అగ్ని ప్రమాదాలకు కారకుడైన ఆ దేశ ఫైర్‌ఫైటర్ గతేడాది అరెస్టయ్యాడు. ఇందుకు కోర్టు అతనికి 3 మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. ఎందుకలా చేశావని అతన్ని పోలీసులు ప్రశ్నించగా.. నిప్పంటించడం తనకు సరదా అని, అందులో ఆనందం ఉందని చెప్పాడు! -
బ్యూటీ తలపై నిప్పు.. షాక్‌కు గురైన అభిమానులు..!!
-
బ్యూటీ తలపై నిప్పు.. షాక్‌కు గురైన అభిమానులు..!!
కాంగో : ఇటీవల జరిగిన మిస్ ఆఫ్రికా -2018 పోటీల్లో చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది. మిస్ ఆఫ్రికాగా ఎంపికైన మిస్ కాంగో- 2018 విజేత డార్కస్ కాసిందే తల్లో మంటలు చెలరేగాయి. అందాల పోటీల్లో కాసిందేను విన్నర్‌గా ప్రకటించగానే ఫైర్ క్రాకర్స్‌ను పేల్చగా ప్రమాదవశాత్తూ నిప్పు కణికలు ఆమె తలపై పడ్డాయి. దాంతో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది క్షణాల్లో వాటిని ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం ఆమె తలకు కిరీటాన్ని అలంకరించారు. అప్పటికే తీవ్ర భయాందోళనకు గురైన ఈ అందాల సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సభికులు, అభిమానులకు అభివాదం చేశారు. నైజీరియాలోని క్రాస్ రివర్ రాష్ట్రంలో ఈ పోటీలు జరిగాయి. ఇదిలాఉండగా.. కాసిందే మిస్ కాంగో-2018గా ఎంపికైన సమయంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. కిరీటం ధరిస్తున్న సమంయలో ఆమె విగ్‌కి ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. దీంతో డార్కస్ కాసిందే అసలైన ఫైర్ బ్రాండ్ అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
తాగుడుకు డబ్బు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి..
బెంగళూర్ : మద్యం సేవించేందుకు డబ్బు ఇవ్వలేదని ఏకంగా తల్లికి నిప్పంటించిన కొడుకు ఉదంతం బెంగళూర్‌లో వెలుగుచూసింది. కుమారుడి నిర్వాకంతో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సదాశివనగర్ ప్రాంతంలో మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని 20 ఏళ్ల ఉత్తమ్‌కుమార్ తల్లితో గొడవపడ్డాడు. తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉత్తమ్ తన తల్లిపె పెట్రోల్ చల్లి నిప్పు పెట్టాడు. మహిళ భర్త ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. మహిళ ముఖం, చేయి, ఛాతీపై గాయాలయ్యాయి. కాగా నిందితుడు ఉత్తమ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు నగరంలో ఇదే తరహా ఘటనలో తల్లిని కొట్టిన కుమారుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
తాగిన మైకంలో వాహనాలను తగలేశాడు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో తాగిన మైకంలో ఓ వ్యక్తి వాహనాలకు నిప్పుపెట్టిన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీలోని మదన్‌గిర్ ప్రాంతంలో నాలుగు కార్లతో సహా 18 వాహనాలను తగులబెట్టిన తాగుబోతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 ద్విచక్ర వాహనాలు, నాలుగు కార్లను నిందితుడు తగులబెట్టాడని పోలీసులు తెలిపారు. బైక్‌ల పెట్రోల్ ట్యాంక్‌ను తీసి అగ్గిపుల్లతో నిప్పుపెడుతున్న వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వాహనాలు దగ్ధం కావడంతో సమీపంలో పార్క్ చేసిన కార్లు సైతం మంటల్లో చిక్కుకున్నాయని పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 3.05 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తమకు సమచారం అందినట్టు పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుడుని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు పూర్తిగా దగ్ధమవగా, ఆరు బైక్‌లు, రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. -
ప్రియుడి చేతిలో వివాహిత..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సంతోష్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదని పగ పెంచుకున్న ఓ కిరాతకుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు.. పంజాబ్‌కు చెందిన సానియాకు ఇదివరకే వివాహమైంది. ఆమె నగరానికి చెందిన సల్మాన్‌తో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా సానియా తనను పట్టించుకోవడం లేదంటూ రగిలిపోయిన సల్మాన్ ఆమెపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశాడు. అనంతరం సంతోష్‌నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
నగరంలో దారుణం.. ప్రేమను నిరాకరించిందనీ!
-
ప్రాణాలమీదికొచ్చిన ఫేస్బుక్ పరిచయం..!
సాక్షి, హైదదాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందనీ యువతికి ఓ వ్యక్తి నిప్పుపెట్టాడు. తను కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో యువతితో పాటు ఆమె వదిన కూడా తీవ్ర గాయాలపాలైంది. 90 శాతం కాలిన గాయాలతో ఇద్దరూ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. యువకుడికి 40 శాతం గాయాలయ్యాయి. టప్పచబుత్రలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు.. బహ్రెయిన్‌కు చెందిన ఇబ్రహీం గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. టప్పచబుత్రకు చెందిన అజీనా బేగంతో అతనికి ఫేస్బుక్లో పరిచయమేర్పడింది. తనను ప్రేమించాలంటూ ఇబ్రహీం కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. అందుకు యువతి నిరాకరించడంతో ఇటీవల ఇండియాకి వచ్చి ఆమెను కలవడానికి ప్రయత్నించాడు. అయితే, ఇబ్రహీంకు ఇదివరకే పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో అజీనా అతనికి లొంగలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.. తన వెంటపడొద్దని వేడుకుంది. అయినా, కనికరించిన ఆ రాక్షసుడు శనివారం ఉదయం పెట్రోల్ క్యాన్‌తో యువతి ఇంటికి వెళ్లాడు. అజీనాపై పెట్రోల్ పోసి, తను కూడా నిప్పించుకున్నాడు. అజీనా వదిన ఘటనలో తీవ్రంగా గాయపడింది. ఊహించని పరిణామంతో ఆ కాలనీ వాసులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటనలో బాధితుల ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. చికిత్స పొందుతూ షబానా బేగం మృతి ఇబ్రహీం దాడిలో 90శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన బాధితురాలు చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది. షబానా మృతి చెందటంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గుట్కా ఇవ్వలేదని ఘోరం..!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. గుట్కా ఇవ్వలేదని ఓ వ్యక్తిపై కిరోసిన్ పోసి అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటన మధుర జిల్లాలోని సపోహ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుని సోదరుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్‌దేసీ (32) సరుకులు కొనుగోలు చేద్దామని స్థానికంగా ఉండే దుకాణం వద్దకు వెళ్లాడు. అతని వద్ద ఉన్న గుట్కా ఇవ్వుమని రాజు, రాహుక్ టాకూర్ దురుసుగా ప్రవర్తించారు. వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో తన తమ్ముడిపై కిరోసిన్ పోసి రాజు, టాకూర్ నిప్పటించారని తెలిపాడు. కాగా, ఈ ఉదంతంపై మరో వాదన వినిపిస్తోంది. గుట్కా విషయంలో వాగ్వాదం జరిగింది నిజమేననీ నిందితులు తెలిపారు. అయితే, పార్‌దేసీపై తామెలాంటి దుశ్చర్యకు పాల్పడలేదని వెల్లడించారు. గొడవ అనంతరం ఇంటికి వెళ్లిన పార్‌దేసీ ఒంటిపై కిరోసిన్ పోసుకుని వచ్చాడనీ, తమ ముందే నిప్పంటిచుకున్నాడని తెలిపారు. బాధితుడి కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామనీ పోలీసులు వెల్లడించారు. కాగా, పార్‌దేసీ జిల్లా ఆస్పత్రితో చికిత్స పొందుతున్నాడు. అతని ఒంటిపై 20 శాతం కాలిన గాయాలయ్యాయనీ, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
లైంగిక దాడి చేసి నిప్పంటించిన కిరాతకుడు
రాంచి: జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు శుక్రవారం మరణించింది. ఈ ఘటన పాకూర్ జిల్లాలోని కాకర్‌వానా గ్రామంలో మే 4న జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాకర్‌వానా గ్రామంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై బచ్చన్ మండల్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలోని మరుగుదొడ్ల వద్దకు తీసుకెళ్లి ఆమెకు నిప్పంటించి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, మొదట బాధితురాలి తల్లిదండ్రులు ఆమె ఆత్మహత్యకు పాల్పడొచ్చని భావించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగు పడక పోవడంతో ఆమెను బొకారో జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన ఘోరాన్ని పోలీసులకు తెలిపింది. నిందితునిపై పోక్సో చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పాకూర్ డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. కాగా, నిందితునిపై చర్యలు తీసుకోవడంలో మెతక వైఖరి ప్రదర్శించిన ముసఫిర్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ ను సస్పెండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇటీవల జార్ఖండ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, హత్యా ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. చాత్రా జిల్లాలో జరిగిన మైనర్ బాలికపై హత్యాచార ఘటనలో ప్రమేయమున్న 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. -
బాలికపై ముగ్గురు యువకులు దారుణం
గౌహతి : ఐదో తరగతి చదువుతున్న బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది. ముగ్గురు యువకులు లైంగిక దాడి చేసి, అనంతరం కిరోసిన్ పోసి నిప్పటించారు. ఈ దుర్ఘటన అస్సాంలోని నాగోన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి చదువుతున్న బాలిక స్కూల్ అయిపోగా ఇంటికి తిరిగొచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. దాంతో అదే పాఠశాలకు చెందిన ముగ్గురు ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగికదాడి చేశారు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. అది గమనించిన ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకున్నారు. అప్పటికే 90శాతం కాలిన గాయాలు అవడంతో ప్రాణాలు పోయాయి. కాగా, ఇంతటి దారుణానికి పాల్పడిన ఆయన ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు జువైనల్స్ అని పోలీసులు పేర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందినవారని ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
నాలుగోసారీ ఆడపిల్లే పుట్టిందని...
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ మహిళ నాలుగో ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఆమెకు అత్తింటివారే నిప్పంటించి కాల్చి చంపిన అమానుష ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు భర్త సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...ఉత్తర 24 పరగణ జిల్లాకు చెందిన ఫాతిమాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇటీవలే నాలుగో కాన్పులోనూ అమ్మాయే పుట్టింది. మగబిడ్డ పుట్టనందున ఎక్కువ కట్నం తేవాలని ఫాతిమాను అత్తింటివారు మొదటినుంచీ వేధించేవారు. మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో ఆమె కష్టాలు పెరిగాయి. అత్తింటివారే ఫాతిమా చేతులు వెనక్కు మడిచి కట్టేసి నిప్పంటించారని ఆమె బంధువులు చెప్పారు. -
సనా బేగం మృతి
-
రైలు ఇంజిన్‌కు నిప్పుపెట్టిన మావోయిస్టులు
జార్ఖండ్: సాయుధులైన మావోయిస్టులు జార్కండ్లోని ఓ రైలు స్టేషన్‌పై దాడి చేసి నిప్పుపెట్టారు. అక్కడ ఉన్న ఓ గూడ్స్ రైలు ఇంజిన్‌ను తగులబెట్టారు. దుమ్రి బిహార్ రైల్వే స్టేషన్ వద్ద మావోయిస్టులు గురువారం రాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సీఎన్టీ-ఎస్పీటీ యాక్ట్‌లో గిరిజనులకు వ్యతిరేకంగా సవరణలను తీవ్రంగా నిరసిస్తున్నామని ఘటనా స్థలం వద్ద వదిలివెళ్లిన కరపత్రాల్లో మావోలు పేర్కొన్నారు. ఈ దాడిలో సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు. గూడ్స్ రైలు డ్రైవర్, కో డ్రైవర్ల వద్ద ఉన్న వాకీటాకీలను సైతం నక్సల్స్ లూటీ చేశారని తెలిపారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని నష్ట వివరాలను అంచనా వేస్తున్నారు. మావోయిస్టుల దాడి విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్నాయి. బొకారో-గోమో రైలు మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. -
సనా బేగం మృతి
నిజామాబాద్: భర్త కట్న దాహంతో నిప్పుపెట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సనా బేగం తుదిశ్వాస విడిచింది. కాలిన గాయాలతో మృత్యువుతో పొందుతున్న ఆమె.. గురువారం రాత్రి కన్నుమూసింది. నిజామాబాద్‌లోని నిజాం కాలనీకి చెందిన సనాపై భర్త రజాక్ ఎప్రిల్ 18న కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. గర్భణి అయిన సనా నిద్రిస్తున్న సమయంలో రజాక్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. 60 శాతం కాలియనగాయాలతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. నెలలు నిండకుండానే పుట్టిన ఆ పసికందు ఈ నెల 24న చనిపోయింది. ఈ క్రమంలో 38 రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతన్న సనా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చదవండి: పురిటి మంటలు -
నిజామాబాద్ జిల్లాలో దారుణం
బోధన్: నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పన్నెండేళ్ల బాలికపై గుర్తుతెలియని దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. బోధన్ మండలం తెగడపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(12) ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో గట్టిగ కేకలు వేస్తూ బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ బాలికది హత్యా? ఆత్మహత్యా?
న్యూఢిల్లీ: ప్రియుడి చేతిలో అత్యాచారానికి గురై, అనుమానాస్పద స్థితిలో మంటలంటుకుని తీవ్రంగా గాయపడిన బాలిక(16) బుధవారం చనిపోయింది. వంద శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచింది. దీంతో ఆకుటుంబం విషాదంలో మునిగిపోయింది. అటు బాధిత బాలిక కనీసం మాట్లాడలేని స్థితిలో ఉండడంతో మేజిస్ట్రేట్ ఆమెను స్టేట్ మెంట్ ను రికార్డు చేయలేకపోయారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత బాలిక ఆత్మహత్య చేసుకుందా.. లేక ప్రియుడే ఆమెను అత్యాచారంచేసి, హత్య చేశాడా అనే అంశంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే గ్రేటర్ నోయిడా పరిధిలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో కాలిన గాయాలతో కనిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అజయ్ కుమార్ (18)ని అరెస్ట్ చేశారు. అయితే తన కుమార్తెను రేప్ చేసి, కిరోసిన్ పోసి నిప్పటించాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తోంటే.. తనకే పాపం తెలియని నిందితుడు అజయ్ అంటున్నాడు. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నిస్తే..కాపాడబోయానని.. అందుకే తన చేతికి గాయాలయ్యాయని వాదించాడు. గత రెండు సంవత్సరాలుగా బాధిత బాలిక, అజయ్ కుమార్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందనీ పోలీసులంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఏప్రిల్ లో వీరిద్దరూ ఒకసారి పారిపోయినట్టు తెలిపారు. తమ విచారణ కొనసాగుతుందనీ...పోస్ట్ మార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. -
ఫిర్యాదు చేసిందని...నిప్పంటించారు
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం వెలుగు చూసింది. తమ వాడిపై ఫిర్యాదు చేసిందనే అక్కసుతో నిందితుడి కుటుంబ సభ్యులు.. బాలిక (11) పై హత్యాయత్నం చేసిన ఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సం రోజు వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపుల కేసు పెట్టిందనే ఆగ్రహంతో బాధిత బాలికను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఇంటర్ విద్యార్థిని గతంలో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన నిందితుడి కుటుంబ సభ్యులు ఆమెను హతమార్చడానికి పూనుకున్నారు. ఆమె తల్లిదండ్రులెవరూ ఇంట్లో లేని సమయంలో దాడి చేసి..కిరోసిన్ పోసి నిప్పంటించారని పోలీసులు మంగళవారం తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
గ్యాంగ్ రేప్ చేసి.. నిప్పు పెట్టారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజిపూర్ జిల్లాలో ముగ్గురు దుండగులు ఓ దళిత బాలిక (14)ను సామూహిక అత్యాచారం చేసి, నిప్పు పెట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు. 7వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి శుక్రవారం స్వగ్రామం నుంచి దగ్గరలోని శివన్ పట్టణానికి వెళ్లేందుకు బయల్దేరింది. ఊరు దాటిన తర్వాత ముగ్గురు యువకులు ఆమెను బలవంతంగా చెరుకుతోటలోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ఒంటిపై కిరోసిన్ పోసి అంటించి పరారయ్యారు. బాధితురాలు సాయం చేయాల్సిందిగా కేకలు వేస్తూ చెరుకుతోటలో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయింది. స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
మరో రైలుకు నిప్పు..
హర్యానా : హర్యానాలో జాట్ వర్గీయుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. బివాని, హిస్సర్ సహా , రెండు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసిన నేపథ్యంలో పరిస్థితికి అదుపులోకి వస్తున్న తరుణంలో జాట్ కులస్తులు రోహతక్ జిల్లాలో మరోసారి పోరాటానికి దిగారు. ఢిల్లీ- హర్యానా హైవేపై పెద్ద ఎత్తున మోహరించి ఆందోళనకారులు సోమవారం రాస్తారోకో చేశారు. ఓ స్కూలు బస్సుపై కూర్చుని రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పిస్తూ నినాదాలతో హోరెత్తించారు. విద్యా ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాతపూర్వక హామీ కావాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా మునక్ కెనాల్ నీరు ఢిల్లీ చేరుకోవడానికి 24 గంటలు పడుతుందని అధికారులు ఇలా ప్రకటించారో లేదో అలా ఆందోళనలు మళ్లీ మిన్నంటాయి. ఢిల్లీ- బహదుర్గా రహదారి దిగ్బంధించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్పించారు. అటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం వాహనానికి నిప్పుపెట్టారు. సోనిపట్ లో గూడ్స్ రైలుకు నిప్పంటించారు. దీంతో ఉద్రిక్తత రాజుకుంది. కాగా తమను ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాట్ వర్గీయులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 12మంది మృతి చెందగా, వందలాదిమంది గాయపడ్డారు. -
గుడికి వెడుతున్న దళిత వృద్ధుడి సజీవదహనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గుడికి వెళుతున్న ఓ దళిత వృద్ధుడిపై దాడిచేసి సజీవదహనం చేసిన ఘటన కలకలం రేపింది. జలౌన్ జిల్లా హమీర్పూర్ సమీపంలో బిల్గాం గ్రామంలో మైదాని బాబా గుడిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిమ్మ (90) అనే వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. చిమ్మ.. తన భార్య, కొడుకుతో కలిసి స్థానిక మైదాని బాబా గుడికి వెళ్లేందుకు బయలుదేరాడు. గుళ్లోకి వెళ్లడానికి వీల్లేదంటూ సంజయ్ తివారీ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. అయితే సంజయ్ మాటలను లెక్కచేయని చిమ్మా ముందుకు కదిలాడు. దీంతో రెచ్చిపోయిన సంజయ్ గొడ్డలితో నరికి, ఆపై నిప్పంటించాడు. మిగతా భక్తులందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. కొంతమంది భక్తులు సంజయ్ తివారిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మద్యం మత్తులో ఉన్న తివారీ చిమ్మాతో పాటు ఇంకా చాలామంది భక్తులను గుడిలోకి వెళ్లొద్దంటూ వారించాడు. అయితే వారందరూ తిరస్కరించారు. దీంతో అప్పటికే కోపంతో ఉన్న తివారీ.. చివరకు వృద్ధుడు కూడా తనను లెక్కచేయలేదని అతడిపై గొడ్డలితో దాడిచేశాడు. అతని భార్య సహాయం కేకలు పెట్టింది. అయినా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న తివారీ.. మరింత రెచ్చిపోయి, చిమ్మపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసి సంజయ్ తివారీని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. -
మణిపూర్ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు
ఇంఫాల్: మణిపూర్‌లో భారీ హింస చెలరేగింది. సోమవారం రాత్రి మణిపూర్ దక్షిణ ప్రాంతంలోని చురచంద్‌పూర్‌లో ఓ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మణిపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఫుంగ్జతాంగ్ టాన్సింగ్ ఇంటిని దహనం చేశారు. ఇన్నర్ లైన్ పర్మిట్ అంశంపై వారు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మొదలైన ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అత్యాచారం చేసి..నిప్పు పెట్టాడు!
కాన్పూర్: అత్యాచారాల రాజధానిగా పేరు గాంచిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ(35) పై భర్త స్నేహితుడు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమెను తగులబెట్టిన ఘటన కాన్పూర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. జూన్ 25 వ తేదీన పిప్రీ గ్రామంలో ఉంటున్న మహిళపై భర్తకు అత్యంత సన్నిహితంగా ఉండే దినేష్ అనే వ్యక్తి విచక్షణారహితంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆమె బ్రతికితే తన గురించి బయటకు చెప్పేస్తుందని భావించి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలు పాలైన ఆమె గత కొన్నిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె వాంగ్మూలం, భర్త ఫిర్యాదు ఆధారంగా దినేష్ ను ఈ ఘటన జరిగిన రెండు రోజులకే అదుపులోకి తీసుకున్నారు. -
టీడీపీ నేత గెస్ట్‌హౌస్‌కు నిప్పెట్టిన 'తమ్ముళ్లు'
విశాఖపట్నం జిల్లా టీడీపీలో వరుసగా రెండవరోజు కూడా అసమ్మతి సెగ ఎగసిపడింది. అరకు ఎమ్మెల్యే టికెట్ స్థానికేతరుడికు ఎట్లా ఇస్తారంటూ స్థానిక టీడీపీ కార్యకర్తుల బుధవారం చెలరేగిపోయారు. అందులోభాగంగా టీడీపీ టికెట్ కేటాయించిన ఎమ్మెల్యే అభ్యర్థి కుంభా రవిబాబు గెస్ట్ హౌస్‌పై దాడి చేశారు. గెస్ట్ హౌస్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం గెస్ట్ హౌస్ పై ప్రెట్రోల్ పోసి నిప్పు అంటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జిల్లా నేతకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోమని స్థానిక టీడీపీ కార్యకర్తులు టీడీపీ నేతలను హెచ్చరించారు. అయితే విజయనగరం జిల్లా ఎస్.కోట నుంచి గతంలో ఎమ్మెల్యేగా కుంభా రవి విజయం సాధించారు. ఆయనకు ఈ సారి అరకు ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించారు. దాంతో పార్టీకి ఎన్నో ఏళ్లుగా స్థానికంగా సేవలు చేస్తున్నా తమను కాదని బయట వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తారా అంటూ తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. అలాగే ఇటీవలే టీడీపీలో చేరిన భీమీలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌పై మంగళవారం నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సీహెచ్ అయ్యన్న పాత్రుడు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. -
అత్యాచారాన్ని అడ్డుకుందని.. నిప్పంటించేశాడు!!
తనపై జరగబోయిన అత్యాచారాన్ని అడ్డుకున్నందుకు ఓ బాలిక మీద ఆ దుండగుడు కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు! ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ర జిల్లాలో గురువారం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక 90 శాతం కాలిన గాయాలతో అలీగఢ్ వైద్యకళాశాల ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పహసు ప్రాంతంలో ఈ దారుణ సంఘటన జరిగింది. బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి అదే గ్రామానికి చెందిన నిందితుడు ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపం వచ్చిన అతడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు. దీంతో పోలీసులు అతడిపై అత్యాచారయత్నంతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.