కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ మహిళ నాలుగో ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఆమెకు అత్తింటివారే నిప్పంటించి కాల్చి చంపిన అమానుష ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు భర్త సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...ఉత్తర 24 పరగణ జిల్లాకు చెందిన ఫాతిమాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇటీవలే నాలుగో కాన్పులోనూ అమ్మాయే పుట్టింది. మగబిడ్డ పుట్టనందున ఎక్కువ కట్నం తేవాలని ఫాతిమాను అత్తింటివారు మొదటినుంచీ వేధించేవారు. మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో ఆమె కష్టాలు పెరిగాయి. అత్తింటివారే ఫాతిమా చేతులు వెనక్కు మడిచి కట్టేసి నిప్పంటించారని ఆమె బంధువులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment