Wife killed husband
-
మెడకు చున్నీ బిగించి భర్తను చంపిన భార్య
మియాపూర్: నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్త ఆగడాలను భరించలేకపోయింది ఆ ఇల్లాలు. సహనం కోల్పోయి అతని మెడకు చున్నీ బిగించి చంపేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన అలీ హుస్సేన్ లస్కర్ (35), రుస్తానా బేగం లస్కర్ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. బతుకుదెరువు నిమిత్తం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి మియాపూర్ హాఫీజ్‌పేటలోని ప్రేమ్‌నగర్ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అలీ హుస్సేన్ లస్కర్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను వేధించేవాడు. పిల్లలను కొట్టేవాడు. సోమవారం రాత్రి అలీ హుస్సేన్ లస్కర్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్య రుస్తానాతో గొడవ పడ్డాడు. మంగళవారం తెల్లవారు జామున మళ్లీ గొడవ పడడంతో సహనం కోల్పోయిన రుస్తానా చున్నీతో భర్త అలీ హుస్సేన్ లస్కర్ మెడకు బిగించింది. దీంతో అతడు మృతి చెందడంతో అక్కడి ఆమె నుంచి ఆమె పారిపోయింది. మృతుడి సోదరుడు అక్బర్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రుస్తానా బేగంను బుధవారం అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. భర్త వేధింపులకు విసుగు చెంది చునీతో మెడకు బిగించి తానే హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. -
ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. బోనాల పండుగకు రప్పించి..
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన బోర్వెల్ డ్రిల్లర్ సల్ల సైదులు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సఖ్యతకు అడ్డొస్తున్నాడన్న కారణంతో హతుడి ఇల్లాలు, ఆమె ప్రియుడు, మరో పాత్రధారుడితో కలసి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను సోమవారం డీసీపీ రాజేష్ చంద్ర భువనగిరిలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన సల్ల సైదులుకు శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నాయి.సైదులు బోర్‌వెల్‌పై డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం గ్రామానికి వచ్చి కట్టెకోత పనికి వెళ్తున్నాడు. మూడేళ్లుగా వివాహేతర సంబంధం సైదులు బోర్వెల్ డ్రిల్లర్‌గా పనిచేస్తున్న క్రమంలో నెలల తరబడి విధి నిర్వహణలో ఉంటూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. దీంతో ధనమ్మ తరచూ గురజాలలోని పుట్టింటి వద్దే ఎక్కువగా ఉంటుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎడ్ల నవీన్‌తో మూడేళ్ల క్రితం ధనలక్షి్మకి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ధనలక్ష్మి తరచూ పుట్టింటికి వెళ్తుండడంతో సైదులు అనుమానించాడు. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. విషయం పెద్దమనుషుల వద్దకు చేరడంతో సర్దిచెప్పగా ప్రస్తుతం సజావుగానే కాపురం సాగుతోంది. బోనాల పండుగకు రప్పించి.. ధనలక్షి్మని పుట్టింటికి వెళ్లనీయకుండా తమ సఖ్యతకు సైదులు అడ్డొస్తున్నాడని ఎడ్ల నవీన్ కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని ప్రియురాలు ధనలక్షి్మతో కలసి పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే సైదులు, ధనలక్ష్మి, పిల్ల లను తీసుకుని ఈ నెల 10వ తేదీన గురజాలలోని పుట్టింటికి వచ్చారు. అనుకున్న పథకం ప్రకారం సైదులు హత్య చేసేందుకు నవీన్ తన సమీప బంధువు స్వామి సహాయం కోరాడు. అందుకు అతడు ఒప్పుకోవడంతో ఈ నెల 11వ తేదీన ఇద్దరూ కలసి ధనలక్ష్మి పుట్టింటికి వచ్చారు. అనంతరం మద్యం తాగేందుకు సైదులును వెంటబెట్టుకుని ఆటోలో అమ్మనబోలుకు వెళ్లారు. అక్కడ నవీన్, స్వామి, సైదులు మద్యం తాగారు. పూటుగా మద్యం తాగిన సైదులు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం నవీన్, స్వామి ఇద్దరూ కలసి ఆటో స్టార్ట్ చేసేందుకు ఉపయోగించే తాడుతో సైదులు మెడకు ఉరి బిగించారు. అనంతరం సైదులు ఆటోలో వేసుకుని మోత్కూరు మండలం పొడిచేడులోని మూసీ నది బ్రిడ్జి వద్ద మట్టిరోడ్డులోకి వెళ్లి చనిపోయాడో లేదోనని మరో సారి తాడుతో ఉరి బిగించి ఘాతుకానికి ఒడిగట్టారు. ఆపై మృతదేహాన్ని పొడిచేడు లోని మూసీ నది ఒడ్డున గంగదేవమ్మ ఆలయం సమీపంలో పడవేసి వెళ్లిపోయారు. నిందితుడిని గుర్తించిన డాగ్‌స్కా్వడ్ మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలోని మూసీ నది ఒడ్డున వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సైదులు మెడకు రెండు చోట్ల తాడుతో ఉరిబిగించినట్లు ఆనవాళ్లు ఉండడంతో హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పటికే విష యం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన హ తుడి తల్లి గురజాలకు చెందిన నవీన్‌పై అనుమానం వ్యక్తం చేసింది. ఘటనా స్థలంలో ఆటో గుర్తులను గుర్తించిన పోలీసులు పోలీస్ డాగ్‌స్వా్కడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే, అప్పటికే నవీన్ తన ఆటోలో ధనలక్ష్మి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆటోలో ఘటనా స్థలానికి తీసుకువచ్చాడు. దీంతో పోలీస్ జాగిలం సైదులు మృతదేహాన్ని తీసుకువచ్చిన ఆటో చుట్టూ తిరగడంతో పాటు నవీన్‌ను గుర్తించింది. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మిగతా ఇద్దరు నిందితులు హైదరాబా ద్‌కు పారిపోతుండగా అనాజిపురం వద్ద పట్టుకున్నట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన తాడు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో పోలీస్ డాగ్‌స్కా్వడ్ కీలకంగా వ్యవహరించిందని డీసీపీ చెప్పారు. సమావేశంలో అడిషినల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ మొగులయ్య, రామన్నపేట సీఐ మోతీరాం, మోత్కూర్ ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని ప్రియుడితో కలిసి భర్త హత్య
అనంతగిరి: వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఈ సంఘటన వికారాబాద్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. సీఐ శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లికి చెందిన నక్క రాములు(38) భార్య స్వప్న ఇదే గ్రామానికి చెందిన ఎం.పవన్‌కళ్యాణ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన రాములు పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాములు గొంతు నులిమి చంపేశారు. ఉదయాన్నే ఏమీ తెలియనట్లు స్వప్న రోదిస్తూ కూర్చుంది. మృతుడి మెడపై గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న ఇరు కుటుంబాల వారు గొడవ పెట్టుకుని.. పోస్టుమార్టం చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, పోస్టుమార్టం పూర్తి చేయించారు. వికారాబాద్‌లో ఉండే మృతుడి చెల్లి ఎన్.యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి విచారణలో అసలు వివరాలు బహిర్గతమయ్యాయి. -
ఢిల్లీలో శ్రద్ధ తరహా ఘటన.. భర్తను చంపి ముక్కలు చేసిన భార్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహా ఘటన మరొకటి వెలుగు చూసింది. కుమారుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచింది. ఆ తర్వాత రోజుకు కొన్ని శరీర భాగాల చొప్పున తీసుకెళ్లి గ్రౌండ్లో పడేసింది. పాండవ్ నగర్లో ఈ దారుణం జరిగింది. తల్లి, కుమారుడిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు కలిసే హత్య చేసి, శవాన్ని ముక్కలుగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలను పాండవ్ నగర్‌లోని గ్రౌండ్‌తో పాటు, తూర్పు ఢిల్లీలో ఓ చోట పడేసినట్లు వెల్లడించారు. మొదట తూర్పు ఢిల్లీలో ఓ శవం శరీర భాగాన్ని గుర్తించామని.. సీసీటీవీలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. A woman along with her son arrested by Crime Branch in Delhi's Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch (CCTV visuals confirmed by police) pic.twitter.com/QD3o5RwF8X — ANI (@ANI) November 28, 2022 చదవండి: పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు.. -
మూడు నెలల క్రితం తండ్రి మృతి.. తల్లి కాల్ రికార్డు విని కూతురు షాక్
ముంబై: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో విస్తుపోయే ఘటన జరిగింది. తండ్రి చనిపోయిన మూడు నెలల తర్వాత కూతురు షాకింగ్ విషయం కనిపెట్టింది. తన తల్లే తండ్రిని చంపిందని తెలిసి నమ్మలేక పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వాళ్లు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ నేరం అంగీకరించింది. తానే భర్తను చంపినట్లు ఒప్పుకుంది. ఏం జరిగిందంటే..? రంజన రామ్తెకే భర్త విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఆగస్టు 6న ఆయన గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి రంజన అతడి మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసింది. దీంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసింది. తన భర్తను చంపేశానని, తెల్లవారాక బంధువులకు ఫోన్ చేసి గుండెపోటుతో చనిపోయాడని చెబుతానని అతనికి చెప్పింది. చెప్పినట్లుగానే మరునాడు అలానే చేసింది. అయితే బంధువులెవరికీ రంజనపై అనుమానం రాలేదు. నిజంగానే ఆమె భర్త గుండెపోటుతో చనిపోయాడు అనుకున్నారు. అంతిమసంస్కారాలు కూడా పూర్తయ్యాయి. అంతా ప్లాన్ ప్రకారమే జరగడంతో రంజన ఇక ప్రియుడితో హ్యాపీగా రిలేషన్ కొనసాగించవచ్చని సంబురపడింది. మూడు నెలల తర్వాత రంజనను చూసేందుకు కూతురు శ్వేత వచ్చింది. ఓ కాల్ చేసుకునేందుకు తల్లి ఫోన్ తీసుకుంది. ఈ క్రమంలోనే కాల్ రికార్డులను పరిశీలించగా ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. రంజన తన భర్తను చంపాక ప్రియుడితో మాట్లాడిన కాల్ రికార్డు అందులో ఉంది. వెంటనే శ్వేత పోలీసులకు సమాచారం అందించింది. వారు రంగంలోకి దిగి రంజన, ఆమె ప్రియుడు ముకేశ్ త్రివేదిని విచారించగా.. నేరం అంగీకరించారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు -
రెండేళ్లుగా వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య
కాకినాడ లీగల్: పథకం ప్రకారం భర్తను హత్య చేసిన కేసులో భార్యకు, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.కమలాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన పేకేటి నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఆమెకు ఇష్టం లేకపోయినా 2019 మే 15 తేదీన పేకేటి సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహం చేశారు. వివాహం జరిగిన వారం రోజుల్లోనే సూర్యనారాయణను హతమార్చేందుకు భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడు రాధాకృష్ణ పథకం వేశారు. ఇందులో భాగంగా 2019 మే 21వ తేదీన సూర్యనారాయణకు రాధాకృష్ణ ఫోన్ చేశాడు. సరదాగా బయటకు వెళదామంటూ పెనుగుదురు వద్దకు రమ్మన్నాడు. అక్కడి నుంచి పాతర్లగడ్డ మార్గంలోని çపంట పొలాల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ సూర్యనారాయణను కూర్చోబెట్టి వెంట తెచ్చుకున్న కత్తితో నరికి హత్య చేశాడు. హతుడి సోదరుడు సత్తిబాబు ఫిర్యాదు మేరకు అప్పటి కరప ఎస్సై జి.అప్పలరాజు ఈ హత్యపై కేసు నమోదు చేశారు. నాటి కాకినాడ రూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఈ కేసు దర్యాప్తు చేశారు. కోర్టు విచారణలో నాగలక్ష్మి, రాధాకృష్ణలపై నేరం రుజువైంది. దీంతో హత్య చేసినందుకు గాను ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా, సాక్ష్యాన్ని తారుమారు చేసినందుకు గాను ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రెండు శిక్షలూ ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై.ప్రశాంతి కుమారి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
డీజే ప్రవీణ్‌తో సుజాత వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య
నల్గొండ (భువనగిరి) : వివాహేతర సంబంధం బయటపడుతుందని ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా కడతేర్చింది. ఆపై ఇద్దరూ కలిసి మృతదేహాన్ని బ్రిడ్జి పైనుంచి కిందపడేసి ప్రమాదంగా చిత్రీకించారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో ఇద్దరు నిందితులు కటకటాలపాలయ్యారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేటశపెట్టి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లా నర్మెట మండలం హన్మంత్‌పూర్ గ్రామానికి చెందిన లకావత్ కొంరెల్లి తన భార్య లకావత్ భారతి అలియాస్ సుజాతతో కలిసి జీహెచ్ఎంసీలో పనిచేస్తూ సికింద్రాబాద్‌లోని నామలగుండు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వివాహ వేడుకలో పరిచయమై.. రెండేళ్ల క్రితం ఓ వివాహ వేడుకలో డీజే ప్లే చేసే జనగాం జిల్లా అడవి కేశవపురం గ్రామానికి చెందిన దరావత్ ప్రవీణ్‌తో సుజాతకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంరెల్లి ఈ నెల 18న సొంతూరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. ఆ వెంటనే సుజాత ప్రియుడు ప్రవీణ్‌కు ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. ఇంటికి చేరుకుని దారుణం చూసి.. అయితే, కొంరెల్లి అందరూ నిద్రపోయాయక అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో సుజాతతో ప్రవీణ్ సఖ్యతగా మెలుగుతుండడాన్ని చేసి హతాశుడయ్యాడు. ఇదేమిటని భార్యతో గొడవపడ్డాడు. ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని సుజాత, తన ప్రియుడు ప్రవీణ్‌తో కలిసి కొంరెల్లి మెడకు చున్నీతో ఉరి బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం అదే రోజు రాత్రి కొంరెల్లి మృతదేహాన్ని బైక్‌పై వేసుకుని వరంగల్ ప్రధాన రహదారి మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యలో భువనగిరి మండలం అనంతారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి పై నుంచి మృతదేహాన్ని కింద పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. కాగా, కొంరెల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘాతుకాన్ని అంగీకరించింది. అనంతరం ప్రవీణ్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద బైక్, చున్నీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐ వెంకటయ్య, ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌లు పాల్గొన్నారు. -
నల్లగా ఉన్నావంటూ భార్యతో గొడవ.. గొడ్డలితో భర్తను నరికింది
రాయ్‌గఢ్: భార్యను పదే పదే నల్లగా ఉన్నావంటూ హేళన చేస్తూ వేధించాడో భర్త. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయితే ఈసారి ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. అదే కసితో భర్తని ఒక్కవేటుతో గొడ్డలితో నరికి చంపింది. అంతేకాదు అతని మర్మాంగాలను సైతం ఛిద్రం చేసి.. ఆపై నేరం నుంచి తప్పించుకునే యత్నం చేసింది. ఛత్తీస్‌ఘడ్ దుర్గ్ జిల్లా అమలేశ్వర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంగీతకు, అనంత్ సోన్వానికి చాలాకాలం కిందట పెళ్లైంది. సంగీత.. అనంత్‌కు రెండో భార్య. అనంత్ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. మొదటి సంతానంతో కలిగిన కొడుకు.. సంగీత బిడ్డ, అనంత్.. అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే.. పెళ్లైన నాటి నుంచే భర్త ఆమె రంగును ప్రస్తావిస్తూ.. అసహ్యంగా ఉన్నావంటూ వేధించసాగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గతంలో చాలాసార్లు గొడవ కూడా జరిగింది. ఆదివారం రాత్రి కూడా అలాగే గొడవ జరగ్గా.. ఇంట్లో ఉన్న గొడ్డలితో నరికి చంపింది. అంతటితో ఆగకుండా భర్త మర్మాంగాలను గొడ్డలితో నరికి.. ముక్కలు చేసింది. భర్త శవం పక్కనే రాత్రంతా పడుకుని పోయిందామె. అయితే.. ఉదయం కాగానే భర్తని ఎవరో చంపారంటూ అరవడం ప్రారంభించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో విచారించే సరికి సంగీత నేరం ఒప్పుకుంది. ఇదీ చదవండి: ఘోరం: కలుద్దామని పిలిచి... కత్తితో దాడిచేసిన ఇక్బాల్ షేక్ -
భర్త గొంతుకు తాడు బిగించి చంపిన భార్య
పాపన్నపేట (మెదక్): భర్త చేసే చిల్లర దొంగతనాలతో విసిగి వేసారిందో? లేక రైతు బీమా డబ్బులకు ఆశపడిందో? తెలియదు గాని.. మెడలో మూడుముళ్లు వేసి తాళి కట్టిన భర్త గొంతుకు తాడు బిగించి చంపేసిందో భార్య. కనిపెంచిన కూతుళ్లు సైతం మానవత్వాన్ని మరచి తల్లికి సహకరించారు. గురువారం రాత్రి 8 గంటలకు ఈ దారుణం జరిగితే.. శుక్రవారం ఉదయం 8 గంటలకు బయటపడిన ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగరం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సీతానగరానికి చెందిన రైతు లంగడి బాలయ్య(56), కిసనమ్మ భార్యాభర్తలు. వీరికి రాధమ్మ, వినోద అనే కూతుళ్లు ఉన్నారు. కొడుకు మల్లేశ్ ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లకు గ్రామానికి చెందిన వారికే ఇచ్చి పెళ్లిళ్లు చేశాడు. కాగా, బాలయ్యను ఇంట్లో సరిగా చూడకపోవడంతో మద్యం సేవిస్తూ అప్పుడప్పుడూ చిల్లర దొంగతనాలు చేసేవాడు. ఇటీవల ఈ కుటుంబం ఏడుపాయల ఆలయంవద్ద విందు చేసుకొని తిరిగి వస్తుండగా, అద్దెకు తీసుకెళ్లిన ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు యువకులు చనిపోయారు. దీంతో ట్రాక్టర్ యజమానితో కలసి బాలయ్య.. బాధిత కుటుంబాలకు రూ.2.50 లక్షల పరిహారం చెల్లించాడు. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. గురువారం గొడవ తీవ్రం కావడంతో భార్య కిసనమ్మ భర్త గొంతుకు తాడు బిగించగా.. మనవడు దుర్గేశ్, కూతుళ్లు రాధమ్మ, వినోదలు తలోవైపునకు లాగారు. అనంతరం ఇంటి ముందు వీధిలోకి ఈడ్చుకొచ్చారు. అయితే 10వ తరగతి చదువుతున్న మరో మనవడు బాల్‌రాజ్.. తాతను చంపవద్దని ప్రాధేయ పడినప్పటికీ వారు వినలేదు. అప్పటికే బాలయ్య చనిపోవడంతో అంతా కలసి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. గ్రామస్తుల నిరసన అమాయకుడైన బాలయ్యను అమానుషంగా చంపిన కుటుంబీకులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు నిందితుల ఇంటి ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాపన్నపేట ఎస్ఐ విజయ్, మెదక్ సీఐ విజయ్.. గ్రామస్తులకు నచ్చజెప్పి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇంటి ముందు బైఠాయించిన గ్రామస్తులు -
పిల్లలను చంపాడని భర్త గొంతుకోసిన భార్య
కొల్లాపూర్ రూరల్: పిల్లలను హత్య చేశాడని కోపంతో రగలిపోయిన ఓ మహిళ తన భర్త గొంతుకోసి హత మార్చింది. తల్లితో కలిసి ఆమె ఈ హత్యకు పా ల్పడిన ఘటన వివరా లిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్లకు చెందిన ఓంకార్(40), మహేశ్వరి భార్యా భర్తలు. వీరికి కూతురు, కుమా రుడు ఉన్నారు. ఇటీవల భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 17న భార్య, తన ఇద్దరు చిన్నారులతో కలిసి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావు పల్లి సమీపంలో భా ర్యను బైక్‌పై నుంచి తోసేసి ఇద్దరు చిన్నారులను తీసుకొని వెళ్లిపోయాడు. కోడేరు మండలం నాగుపల్లి సమీపంలోని అడ్డగట్టు పైకి పిల్లలను తీసుకెళ్లి గొంతుకోసి, తాను కూడా కోసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా ఓంకార్ ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. అప్ప టికే కోపంతో ఉన్న మహేశ్వరి ఆదివారం ఉదయం తన తల్లి జోగమ్మతో కలిసి ఓంకార్ గొంతును కోసి హత్య చేసింది. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
కర్నూలు: వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్యతో పాటు హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ రవీంద్ర తెలిపారు. మహానందిలోని ఈశ్వర్‌నగర్ కాలనీకి చెందిన సంగటి రామును ఈ నెల 4న ముగ్గురు యువకులు కొట్టి, చొక్కాతో గొంతు బిగించి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. సంగటి రాము భార్య మధురేణుక మహానందికి చెందిన బాబా ఫకృద్దీన్ అలియాస్ బాబుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కొన్నాళ్లుగా భార్యాభర్తలు విడిపోయారు. అప్పటి నుంచి మధురేణుక నంద్యాలలోని బొమ్మలసత్రంలో నివాసం ఉంటోంది. వివాహేతర సంబంధానికి భర్త రాము అడ్డొస్తున్నాడని చంపించాలని పథకం రూపొందించారు. దీంతో బాబా ఫకృద్ధీన్, గిద్దలూరు మండలం దిగువమెట్టకు చెందిన మండ్ల వేణు, మహానందికి చెందిన ప్రేమ్కుమార్లు కలిసి రామును మద్యం సీసాలతో కొట్టి చొక్కాతో గొంతు బిగించి హతమార్చారు. మృతుడి తల్లి సంగటి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. వ్యవసాయ కళాశాల సమీపంలోని కాశినాయన ఆశ్రమం వద్ద సంచరిస్తున్న ముగ్గురితో పాటు మధురేణుకలను అరెస్ట్ చేశారు. డీఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ రవీంద్ర తెలిపారు. -
వివాహేతర సంబంధం: ప్రేమ పెళ్లి చేసుకున్నావ్ కదా!.. ఇదేం పని శ్రావణి?
కరీంనగర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారమే భార్య తన తల్లితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. రామగుండంలోని ఆటోనగర్‌కు చెందిన మహ్మద్ అజీంఖాన్ (36) హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సీఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు. అజీమ్‌ఖాన్ అదే ప్రాంతానికి చెందిన గరిశ శ్రావణిని 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అజీంఖాన్ కూలీగా.. శ్రావణి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో శ్రావణి వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు భర్త అనుమానించాడు. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఒకసారి ఇటుకతో దాడి చేసింది. మరోసారి యాసిడ్ పోసేందుకు యత్నించగా.. తప్పించుకున్నా డు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇద్దరు గొడవపడ్డారు. వీధిలోకి వచ్చిన అజీంఖాన్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి కిందపడేసి గొంతుపై కాలితో తొక్కింది. శ్రావణి తల్లి నర్మద అజీంఖాన్ కాళ్లు గట్టిగా పట్టుకుంది. పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్‌తో ఛాతిపై బలంగా కొట్టడంతో అజీంఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అజీంఖాన్ సోదరుడు నదీమ్‌ఖాన్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి శ్రావణితోపాటు ఆమెకు సహకరించిన ఆమె తల్లి నర్మదను అరెస్టు చేశామని తెలిపారు. అనాథలైన చిన్నారులు.. తండ్రి హత్యకు గురికావడం.. తల్లి శ్రావణి, అమ్మమ్మ నర్మద జైలు పాలుకావడంతో వారి ఇద్దరు కుమారులు హమాన్, హర్మాన్ అనాథలుగా మారారు. -
మొదట నుంచి స్రవంతి ప్రవర్తన అనుమానాస్పదమే..
నల్గొండ (శాలిగౌరారం) : శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో ఈ నెల 17న వెలుగుచూసిన మల్లాచారి(38) అనుమానాస్పద మృతి.. హత్యగానే పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. తన సఖ్యతకు అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతోనే అతడి భార్యనే ఘాతుకానికి తెగబడినట్లు తెలిసింది. ఇప్పటికే నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు.. మనిమద్దె గ్రామానికి చెందిన మల్లాచారి కులవృత్తితో పాటు కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. మల్లాచారికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రోజువారీ మాదిరిగానే ఈనెల 16న ఇంటివద్ద పనిచేసిన మల్లాచారి శాలిగౌరారంలో బ్యాంకువద్ద పని ఉన్నదని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని మద్యం తాగి రాత్రి మనిమద్దె గ్రామానికి చేరుకున్నాడు. గ్రామ సమీపంలోకి రాగానే బైక్ నడపలేని స్థితిలో ఉండగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మల్లాచారిని ఇంటికి చేర్చాడు. అయితే మల్లాచారి ఇంట్లోకి వెళ్లకుండా అరుగుపై నిద్రపోయాడు. తెల్లవారుజామున విగతజీవుడయ్యాడు. దీంతో తన కొడకుది హత్యేనని, కోడలిపైను అనుమానం ఉందని మృతుడి తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదినుంచి స్రవంతి ప్రవర్తన అనుమానాస్పదమే.. మృతుడు మల్లాచారి భార్య స్రవంతి ప్రవర్త అదినుంచి అనుమానాస్పదమే గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో స్రవంతి చనువుగా ఉండేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరి వ్యక్తులు మధ్యలు ఘర్షణలు జరిగిన సమస్య పెద్ద మనుషుల వద్దకు చేరినట్లు సమాచారం. అయినప్పటికీ తీరు మారకపోవడంతో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు స్రవంతిపై దాడి చేయగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తి స్రవంతికి దూరం కావడంతో ప్రస్తుతం గ్రామానికి చెందిన మరో ముగ్గురు యువకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలియవచ్చింది. గొంతునులిమి.. వివాహేతర సంబంధానికి మల్లాచారి అడ్డుగానే ఉన్నాడనే ఉద్దేశంతోనే హత్య చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల మల్లాచారి మద్యం తాగి ఇంటకి చేరుకుని లోనికి రాకుండా అరుగుపైనే నిద్రించగా గొంతునులిమి హత్య చేసినట్లు సమాచారం. అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులకు స్రవంతి విచారణలో నేరం అంగీకరించినట్లు సమాచారం. అయితే బలియమైన శరీర సౌష్టంవం కలిగిన మల్లాచారిని అంతమొందించడం స్రవంతి వల్ల కాదని, ఈ హత్యోదంతంలో మరో ఇద్దరు పాత్ర ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత్రధారుల పాత్ర నిగ్గుతేల్చేందుకు ఈ కేసును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నుంచి తప్పించుకునేందుకేనా ? కొడుకు మల్లాచారి మృతిపై కోడలుపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 19న స్రవంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన స్రవంతి అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీస్‌స్టేషన్‌ని బాత్రూంలో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను నల్లగొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం బుధవారం తిరిగి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..?
నర్సీపట్నం: వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి ఓ మహిళ హత్య చేయించింది. గతేడాది ఆగస్టు 7న ఈ ఘటన జరిగింది. తొమ్మిది నెలల తరువాత గొలుగొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన రుత్తల సత్తిబాబు భార్య రామలక్ష్మికి అదే గ్రామానికి చెందిన సబ్బవరపు ఎర్రినాయుడుకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం సత్తిబాబుకు తెలియడంతో తరచూ తాగి వచ్చి భార్య రామలక్ష్మితో గొడవ పడేవాడు. దీంతో సత్తిబాబును హతమార్చాలని రామలక్ష్మి, ఆమె మేనత్త సన్యాసమ్మ, రామలక్ష్మి ప్రియుడు ఎర్రినాయుడు కలిసి కుట్రపన్నారు. సత్తిబాబును హత్య చేస్తే రూ.50 వేలు ఇచ్చేందుకు అదే గ్రామానికి చెందిన కర్రి కృష్ణతో ఎర్రినాయుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సత్తిబాబుకు మద్యపానం, పేకాట అలవాటు ఉంది. గత ఏడాది ఆగస్టు 7న సత్తిబాబుకు ఫోన్ చేసి మాకవరపాలెం సమీపంలో పేకాట ఆడుతున్నారని ఎర్రినాయుడు,కృష్ణ నమ్మబలికారు. ఎర్రినాయుడు, కృష్ణ ఒక బైక్‌పై, సత్తిబాబు తన మోపెడ్‌పై బయలుదేరారు. మార్గం మధ్యంలో ఏటిగైరంపేట, పెద»ొడ్డేపల్లిల్లో సత్తిబాబుతో ఫుల్‌గా మద్యం తాగించారు. మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం దగ్గరలో ఏలేరు కాలువ పక్కన తోటలోకి తీసుకు వెళ్లారు. సత్తిబాబును ఎర్రినాయుడు కిందపడేశాడు. కృష్ణ గట్టిగా పట్టుకోగా ఎర్రినాయుడు అతని గొంతునొక్కి చంపేసి పక్కనే ఉన్న ఏలేరు కాలువలో పడేశారు. మోపెడ్‌ను కూడా కాలువలో పడేశారు. సత్తిబాబు కనిపించకపోవడంతో అతని తండ్రి దేముడు, అక్క పైడితల్లి, ఆమె భర్త రమణమూర్తి గత ఏడాది ఆగస్టు 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయలేదు. రామలక్ష్మి, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న ఎర్రినాయుడు కలిసి సత్తిబాబును చంపేసి ఉంటారని గత నెల 19న హతడు తండ్రి దేముడు, కుటుంబ సభ్యులు గొలుగొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముందు పరారీ.. తరువాత లొంగుబాటు గొలుగొండ ఎస్ఐ ధనుంజనాయుడు, సిబ్బందితో కలిసి విచారణ చేస్తుండగా ఎర్రినాయుడు కనిపించకుండా పోయాడు. తరువాత ఈ నెల 27న గ్రామ వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మను విచారించగా తామే హత్య చేశామని అంగీకరించారు. హత్య జరిగిన ప్రాంతంలో కాలువలో గాలించగా మోపెడ్ లభ్యమైంది. సంఘటన జరిగి తొమ్మిది నెలలు కావడంతో సత్తిబాబు మృతదేహం లభ్యం కాలేదు. హత్య కేసులో మరో నిందితుడు కృష్ణ ఇటీవల గంజాయి కేసులో పట్టుబడి జైలులో ఉన్నాడు. ఎర్రినాయుడు, రామలక్ష్మి, సన్యాసమ్మలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. కృష్ణను కూడా అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. -
శ్వేత బాడీపై గాయాలు.. భర్తే కీలక సూత్రధారి
దొడ్డబళ్లాపురం: భార్యను హత్య చేసిన భర్త ఆమె అనారోగ్యంతో మృతి చెందిందని నాటకమాడిన ఉదంతం నెలమంగల తాలూకా తోణచినకొప్పె గ్రామంలో వెలుగుచూసింది. చౌడేశ్ (35), తన భార్య శ్వేత (30)ను హత్య చేశాడు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన శ్వేతను తొమ్మిదేళ్ల క్రితం హిరియూరు తాలూకా కురుబరహళ్లికి చెందిన చౌడేశ్‌కిచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. హఠాత్తుగా బుధవారం రాత్రి శ్వేతకు అనారోగ్యంగా ఉందని నెలమంగల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు చౌడేశ్. అయితే అప్పటికే ఆమె చనిపోయి ఉందని వైద్యులు తెలిపారు. శ్వేత అనారోగ్యంతో మృతి చెందిందని చౌడేశ్ నమ్మించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసికెళ్లగా ఆమె దేహంపై గాయాల గుర్తులు కనబడ్డాయి. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చౌడేశ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..?
సాక్షి, మేళ్లచెరువు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ దారుణానికి తెగబడింది. మద్యం సేవించి నిద్రమత్తులో ఉన్న భర్త తలను గోడకు బలంగా మోది కడతేర్చింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలోని కప్పలకుంట తండాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సీఐ శివరాంరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కప్పలకుంటతండాకు చెందిన భూక్యా బాలాజీ (40)కి కోదాడ మండలం బాలజీనగర్ తండాకు చెందిన బుజ్జీతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. బాలాజీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భర్త దుబాయ్ బాట.. భార్య అడ్డదారి బాలాజీకి స్థానికంగా కూలి పనులు దొరక్కపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో తెలిసిన వారి సహకారంతో నాలుగేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడినుంచి ప్రతి నెలా డబ్బులు పంపిస్తుండడంతో బుజ్జి పిల్లలను పోషించుకుంటోంది. అయితే ఇదే సమయంలో బుజ్జి గ్రామానికి చెందిన రాముడుతో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డదారులు తొక్కింది. బాలాజీ అక్కడి నుంచి బాగా డబ్బులు సంపాందించి రెండేళ్ల క్రితం తన ఇద్దరు కూతుళ్ల వివాహాలు జరిపించాడు. కుమారుడు ప్రస్తుతం స్థానిక ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదవండి: (తల్లితో సహజీవనం.. కుమార్తెపై ఘాతుకం) నాలుగు నెలల క్రితం తిరిగి రాగా.. బాలాజీ నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతడికి భార్య ప్రవర్తనపై అనుమానం కలిగింది. పలుమార్లు ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయినా బుజ్జి తగ్గకుండా ప్రతిసారి ఇబ్బందులకు గురిచేయడంతో పాటు చిత్రహింసలు పెట్టింది. భార్య ప్రవర్తనకు విసిగి వేసారిన బాలాజీ తాగుడుకు బానిసగా మారాడు. ఒక్కతే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..? ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా బాలాజీ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రోజూ మాదిరిగానే దంపతులు గొడవపడుతుండగా కుమారుడు పక్క గదిలో నిద్రపోయాడు. తెల్లారేసరికి బాలాజీ విగత జీవిగా మారడంతో ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ శివరాంరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే బుజ్జి మాత్రం తానే భర్త తలను గోడకు బలంగా మోది హత్య చేశానని తెలిపిందని సీఐ తెలిపారు. కాగా, బుజ్జి ఒక్కతే ఘాతుకానికి తెగబడిందా లేక ఇందులో ప్రియుడి హస్తం కూడా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీఐ ధ్రువీకరించలేదు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాలాజీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నెహ్రూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: (సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే గర్భిణి ఆత్మహత్య) -
భర్త అడ్డు తొలగించుకోవాలని.. ప్రియుడుకి రూ.15 లక్షల సుపారి
సాక్షి, యశవంతపుర: భర్తను హత్య చేయడానికి పథకం వేసిన భార్య రూపతో పాటు మరో ఇద్దరిని మాదనాయకనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రూప, గిరీశ్‌లకు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. ఇటీవల రూప ఒక ఫ్యాక్టరీలో పనికి చేరింది. అక్కడ కుమార్ జైన్ అనే వ్యక్తితో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. రూప సంగతి తెలిసిన భర్త పనికి వెళ్లవద్దంటూ కట్టడి చేశాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని రూప, ప్రియుడు రూ.15 లక్షలకు సుపారి ఇచ్చారు. నలుగురు దుండగులు మాదనాయకనహళ్లిలో మంకీ క్యాప్ ధరించి తిరుగుతుండగా పోలీసులు అనుమానం వచ్చి ప్రశ్నించగా సుపారి విషయం బయటపడింది. రూప, కుమార్‌జైన్ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని..
సాక్షి, పటాన్చెరు టౌన్ : వివాహేతర సంబంధంతో వరసకు బావతో కలసి భర్తను భార్య హత్య చేయించిన ఘటన మంగళవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. చత్తీస్ఘడ్ రాష్ట్రం... దురుగు జిల్లా..మరోదా గ్రామానికి చెందిన అనిల్ కుమార్ దారు (35) బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం స్నేహితుడు హరినారాయణ (అలియాస్) సంజీవుతో కలసి అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు వచ్చాడు. సమీపంలోని మెడికల్ డివైజ్ పార్క్ సమీపంలో సెంటరింగ్ పని చేసుకుంటూ, అక్కడే నివాసం ఉంటున్నాడు. పది రోజుల క్రితం వరసకు సడ్డకుడు నర్వోత్తంతో కలిసి మృతుడి భార్య భువనేశ్వరి అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ వచ్చింది. భువనేశ్వరి, నర్వోత్తంల మధ్య వివాహేతర సంబంధం ఉంది. భర్త అనిల్ కుమార్‌ను హతమారిస్తే ఇద్దరం సంతోషంగా ఉండవచ్చని మృతుడి భార్య బావ నర్వోత్తంతో చెప్పింది. దీంతో అతను అనిల్ కుమార్‌ను ఆదివారం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సమీపంలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి రాయితో తలపై బాది హత్య చేశాడు. ఒక్కసారిగా అనిల్‌కుమార్ కనిపించకుండా పోవడంతో తోటి కార్మికులు, స్నేహితుడు సంజీవు .. నర్వోత్తంని అడిగారు. ఎవరో వచ్చి బైక్‌పై తీసుకెళ్లారని అబద్ధం చెప్పాడు. అనంతరం కాసేపు వెతికినా అనిల్‌కుమార్ దొరక్కపోవడంతో మరోసారి నర్వోత్తంను గట్టిగా నిలదీశారు. అనిల్‌కుమార్ భార్యకు తనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె చెబితేనే హత్య చేశానని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ భీంరెడ్డి, పటాన్చెరు క్రైం సీఐ శ్రీనివాసులు, అమీన్పూర్ ఎస్ఐలు మురళి, కిష్టారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతుడి భార్య భువనేశ్వరిని, నర్వోత్తంను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్నేహితుడు సంజీవు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? -
డబ్బు వివాదం: కుటుంబంతో కలిసి భర్త హత్య
సాక్షి, జిన్నారం(పటాన్చెరు): డబ్బుల విషయంలో వివాదంతో అయినవారే అంతమొందించిన సంఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ముళ్లపొదల్లో పడేసి కాల్చేసిన కేసును పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించడం విశేషం. వివరాలను డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న విజయ్‌సింగ్ (42), మల్లీశ్వరి దంపతులు. 16 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి 14ఏళ్ల కుమార్తె ఉంది. విజయ్‌సింగ్ తన కుమార్తె పేరుపై రూ.లక్షను బ్యాంక్‌లో ఫిక్స్డ్ చేశాడు. నామినీగా మల్లీశ్వరిని ఉంచాడు. నెల రోజుల క్రితం భర్తకు తెలియకుండా మల్లీశ్వరి బ్యాంక్‌లో ఉన్న రూ.లక్షను తెచ్చి తన తమ్ముడైన మంద కృష్ణకు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల తర్వాత విషయం విజయ్‌సింగ్‌కు తెలిసింది. తనకు తెలియకుండా డబ్బులు ఎందుకు ఇచ్చావని నిలదీయడంతో భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. అప్పుగా తీసుకున్న డబ్బును త్వరగా తిరిగిచ్చేయాలని మంద కృష్ణపై విజయ్‌సింగ్ ఒత్తిడి పెంచాడు. డబ్బు తిరిగిచ్చే పరిస్థితి లేకపోవటంతో మందకృష్ణ అక్క మల్లీశ్వరితో కలిసి విజయ్‌సింగ్‌ను హత్య చేయాలని పన్నాగం పన్నాడు. తనను కూడా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నాడని మల్లీశ్వరి, చెల్లెలు తలారి పద్మ, తల్లి మంద లక్ష్మితో కలిసి పథకం వేశారు. ఆదివారం రాత్రి విజయ్‌సింగ్‌కు ఎక్కువగా మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లిన తర్వాత నలుగురూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. రాత్రి 12 గంటల తర్వాత హృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్డు సమీపంలోని ఓ ముళ్ల పొదలో పడేసి తగులబెట్టారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి విచారణ సాగించగా వారు నేరం అంగీకరించారు. ఈ మేరకు నలుగురినీ రిమాండ్‌కు తరలించారు. హత్య ఉదంతం వెలుగు చేసిన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. విలేరుల సమావేశంలో సీఐ ప్రశాంత్, ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసింది. భార్య ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఈ ఘటన తేని జిల్లా దేవనాంపట్టిలో చోటుచేసుకుంది. కొంగువార్ పట్టికి చెందిన శివకుమార్ (43) రైతు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పాపాత్తికి ముగ్గురు కుమార్తెలు. 24వ తేదీ కల్లుపెట్టి, కామక్కాపట్టిలోని మైదాన ప్రాంతంలో శివకుమార్ తీవ్రగాయాలతో మృతి చెంది పడివున్నాడు. ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అతని మృతిపై అనుమానం ఉందని బంధువులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాపాత్తిని అనుమానించిన పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల వద్ద పాపాత్తి ఇచ్చిన వాంగ్మూలంలో తనకు, తన భర్త శివకుమార్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న సెల్వరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఈ విషయం శివకుమార్‌కు తెలియడంతో అతను తనను మందలించినట్టు తెలిపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని శివకుమార్‌ను సెల్వరాజుతో కలిసి హత్య చేసేందుకు మరో ట్రాక్టర్ డ్రైవర్ అయ్యనార్ వద్ద సాయం కోరినట్టు పేర్కొంది. శివకుమార్‌కు మద్యం తాగించిన అయ్యనార్ అతన్ని బైకులో ఎక్కించుకుని వెళ్లి మైలేజీ రాయికి ఢీకొట్టించి తరువాత శివకుమార్ గొంతు కోసి హత్య చేశాడని పాపాత్తి పోలీసులకు విచారణలో తెలిపింది. -
వివాహేతర సంబంధం: భర్త దారుణ హత్య
సాక్షి, పంజగుట్ట: ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది. సోమవారం పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బిహార్‌కు చెందిన లక్ష్మణ్ ఝా, ఖుష్బూ దంపతులు మక్తా, రాజ్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాత్రి వేళ సెక్యూరిటీ గార్డుగా, పగలు జ్యూస్‌షాపు నడుపుతూ లక్ష్మణ్ జీవనం సాగిస్తున్నాడు. దీంతో న్యూరాలజీ సమస్య వచ్చింది. ఇతని జ్యూస్ సెంటర్ వద్ద లక్ష్మణ్ దూరపు బంధువు లాల్‌బాబు పనిచేస్తుంటాడు. లక్ష్మణ్‌కు మధ్యాహ్నం టిఫిన్ ఇచ్చేందుకు ఖుష్బుదేవి వస్తుండేది. ఈ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. లాక్డౌన్ అనంతరం లాల్‌బాబు మరోచోట పనిచేయడం ప్రారంభించాడు. అయినా వీరి మధ్య బంధం కొనసాగింది. దీంతో లక్ష్మణ్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్ పడుకున్నాక లాల్‌బాబు ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి లక్ష్మణ్ చేతులు కట్టేశారు. ఖుష్బుదేవి లక్ష్మణ్ ఛాతీపై కూర్చుని చున్నీ మెడకు బిగించి ఇద్దరూ కలిసి గట్టిగా నొక్కి చంపేశారు. ఉదయం లక్ష్మణ్ సోదరుడికి ఖుష్చుదేవి ఫోన్ చేసి నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. మెడపై గాట్లు చూసి అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
సాక్షి, హుబ్లీ: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడితో హతుడి భార్య వివాహేతర సంబంధం గుట్టు ఈ హత్యతో బట్టబయలైంది. ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా అంచటగేరి నివాసి అక్షతకు హావేరి జిల్లా హానగల్ నివాసి జగదీష్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితం అక్షతకు ఓ మగబిడ్డ జన్మించింది. ఈక్రమంలో భార్య, బిడ్డలను చూడటానికి వచ్చిన భర్త దారుణ హత్యకు గురయ్యాడు. (మంజీరలో ఏఓ గల్లంతు?) ఈ కేసు కూపీ లాగిన సీఐ రమేష్ గోకాక్ అక్షత కాల్ డేటాను తెలుసుకొని ఆమె ప్రియుడు కాశప్పను అదుపులోకి తీసుకుని పోలీసు పద్ధతిలో విచారించగా అసలు విషయం నిగ్గు తేలింది. అక్షత ప్రియుడు కాశప్ప స్వగ్రామం బాదామి తాలూకా బండకేరి. ఇతడు గత ఐదేళ్ల నుంచి కేఈబీ లైన్మెన్గా ఉంటూ అంచటగేరిలో అక్షత ఇంటి ఎదుట ఇల్లు తీసుకొని ఉండేవాడు. వీరి మధ్య గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నెలకొంది. అంతేగాక నాలుగు నెలల క్రితం కాశప్పకు మరో యువతితో వివాహమైంది. (పదేళ్ల బాలికపై పూజారి అఘాయిత్యం) తమ వివాహేతర సంబంధం కొనసాగాలంటే అడ్డుగా ఉన్న భర్త జగదీష్‌ను చంపేయాలని ఇద్దరూ పథకం వేశారు. ఆ క్రమంలోనే భార్య, బిడ్డను చూసేందుకు వచ్చిన జగదీష్‌కు మంగళవారం కాశప్ప మందుపార్టీ ఇచ్చి ఊరు చివరలోని చెన్నాపుర క్రాస్ వద్ద తలపై బండరాయిని ఎత్తి వేసి హత్య చేసి పరారయ్యాడు. కొన్ని గంటల్లోనే కేసు మిస్టరీని చేధించిన పోలీసులు గురువారం నిందితులను జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. -
దారుణం: భర్తపై భార్య విషప్రయోగం
సాక్షి, కాటారం(జయశంకర్ భూపాలపల్లి): మూడుమూళ్లు, ఏడు అడుగుల బంధానికి కళంకాన్ని తెచ్చింది ఓ మహిళ. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రేగులగూడెంలో చోటు చేసుకుంది. ఆగస్టు 19న ఈ ఘటన చోటుచేసుకోగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు. కాటారం సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.హతీరాం కేసు వివరాలను వెల్లడించారు. రేగులగూడెం గ్రామానికి చెందిన మారుపాక దేవేందర్(40), మారుపాక స్వప్నకు 12 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇదే క్రమంలో 2017లో మహాముత్తారం గ్రామానికి చెందిన లింగమళ్ల కళ్యాణ్‌తో స్వప్నకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం దేవేందర్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆయనను అడ్డు తొలగించాలని స్వప్న, ఆమె ప్రియుడు కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం కళ్యాణ్ పురుగుమందు విషపు గుళికలు స్వప్నకు అందించగా, ఆమె మద్యంలో కలిపి దేవేందర్‌కు ఆగస్టు 19న తాగించింది. మరుసటి రోజు ఉదయం దేవేందర్ వాంతులు, విరోచనాలు చేసుకొని మృతి చెందాడు. అయితే, తన కొడుకు మృతిపై అనుమానం ఉందని దేవేందర్ తండ్రి నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాటారం సీఐ హతీరాం నేతృత్వంలో దర్యాప్తు చేపట్టగా, రసాయనిక పరీక్షల ఆధారంగా మృతుడిపై విషప్రయోగం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు స్పప్నపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. దీంతో బుధవారం స్వప్న, కల్యాణ్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
ప్రియుడి మోజులో భర్త హత్య
సాక్షి, నెక్కొండ: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిందో మహిళ. శవాన్ని కాల్చి.. బూడిదను చెరువు లో కలిపి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండలో జరిగింది. సీఐ తిరుమల్ కథనం ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి శివారు గేటుపల్లికి చెందిన బాదావత్ ధర్యావత్ సింగ్ (42), జ్యోతి దంప తులకు ఇద్దరు సంతానం. సింగ్ హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తుండగా.. జ్యోతి స్థానికంగా టైలరింగ్ శిక్షణ ఇస్తోంది. ఈ క్రమంలో మండలంలోని అప్పల్‌రావుపేటకు చెందిన సాంబరాజుతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు ఈ విషయం భర్త సింగ్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి ధర్యావత్ సింగ్ ఇంట్లోనే ఉంటుండటంతో జ్యోతికి సాంబరాజును కలవడం సాధ్యం కావడం లేదు. ఎప్పటికైనా ఈ సమస్య ఎదురవుతుందని భావించిన ఆమె.. భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ప్రియుడితో కలసి పథకం పన్నింది. హత్య, ఆపై దహనం ఈనెల 14న రాత్రి మద్యం మత్తులో ఉన్న భర్తను హతమార్చేం దుకు ఇదే సరైన సమయమని భావించిన జ్యోతి.. సాంబరాజుకు సమాచారం ఇచ్చింది. దీంతో అతను ట్రాలీ ఆటోలో నెక్కొండకు వచ్చాడు. తాడును సింగ్ మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం తన పత్తి చేను వద్దకు మృతదేహాన్ని తరలించాడు. అప్పటికే అక్కడ ఉన్న సాంబరాజు తండ్రి యాకయ్య, సోదరుడు సురేశ్ సాయంతో శవాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా శవం సగమే కాలింది. దీంతో మళ్లీ దహనం చేశారు. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు 16న బూడిద, అస్థికలను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం దర్గా చెరువులో కలిపారు. గుట్టురట్టు చేసిన కాల్‌డేటా.. మృతుడి సోదరుడు వీరన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జ్యోతి కదలికలపై నిఘా పెట్టి.. ఆమె సెల్‌ఫోన్ కాల్‌డేటా ను సేకరించారు. సాంబరాజుతో మాట్లాడిన సంభాషణల ఆధారంగా జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సాంబరాజు, జ్యోతిని అరెస్టు చేశారు. సాంబరాజు తండ్రి యాకయ్య, సోదరుడు సురేశ్ పరారీలో ఉన్నారు. -
ప్రియుడిపై మోజుతో.. విషం కలిపి
అన్నానగర్: భర్త గొంతు నులిమి హత్య చేసిన భార్య, ఆమె వివాహేతర ప్రియుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. పూందమల్లి సమీపంలోని కాట్టుపాక్కం ఓం శక్తి నగర్ కు చెందిన ధరణీ ధరణ్ (39), కారు డ్రైవర్. ఇతని భార్య భవాని (31). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 22వ తేదీ అప్పుల బాధతో భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు భవాని పూంద మమల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ప్రకారం పూందమల్లి పోలీసులు ధరణీధరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో ధరణీ ధరణ్ గొంతు నులిమి హత్య చేయబడినట్లు తేలడంతో భవానిని పోలీసులు విచారణ చేశారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమె సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆమె తరచూ ఫోన్లో మాట్లాడుతున్న ఓ వ్యక్తి మృతుడి ఇంటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు భవానిని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమెను, పుందమల్లికి చెందిన దినేష్ (31) ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పథకం బెడిసికొట్టడంతో.. పోలీసుల విచారణలో ధరణీ ధరణ్, దినేష్ స్నేహితులు. ఇద్దరు కలిసి మద్యం తాగేవారు. తరచూ ధరణీ ధరణ్ ఇంటికి దినేష్ వచ్చేవాడు. ఈ క్రమంలో భవానితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. దినేష్‌కు ఇది వరకే వివాహమై భార్యను విడిచిపెట్టి ఉంటున్నాడు. భవానితో వివాహేతర సంబంధానికి ధరణీ ధరణ్ అడ్డుగా ఉండటం అతన్ని హత్య చేసేందుకు పథకం వేసినట్లు తెలిసింది. గత 21వ తేదీ పురుగుల మందు తీసుకువచ్చిన దినేష్ దానిని భవాని ఇంటికి వెళ్లి ఇచ్చాడు. ఆహారంలో కలిపి ఇవ్వమని భవానికి చెప్పాడు. పథకం ప్రకారం ఆ రోజు రాత్రి మత్తులో ఇంటికి వచ్చిన అతనికి భవాని ఆహారంలో పురుగుల మందు కలిపి ఇచ్చింది. దాన్ని తిని నిద్రపోయిన ధరణీధరన్ మరుసటి రోజు ఉదయం లేచి వాంతులు చేసుకున్నాడు. తర్వాత కాఫీ తాగి మళ్లీ నిద్రించాడు. ఆహారంలో విషం కలిపి ఇచ్చినా భర్త చావక పోవటంతో భవాని దినేష్‌కి సమాచారం ఇచ్చింది. ఇద్దరు పిల్లలను తాతయ్య ఇంటికి పంపించింది. దినేష్ ఇంటికి రాగానే నిద్రపోతున్న ధరణీ ధరణ్ దుప్పటితో గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత ధరణి ధరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా దుప్పటిని రెండు చేతులతో చుట్టి దినేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా భవాని నాటకం ఆడింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.