
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఎస్సై సతీష్‌బాబు
భీమారం వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌతమ్‌నగర్‌లో వారంరోజుల క్రితం జరిగిన ఓ యువకుడి హత్య కేసులో పోలీసులు ఇద్దరి అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్సై సతీష్‌బాబు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతోనే హత్య చేసినట్లు చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నరసింహులపేట మండలం లాల్‌తండాకు చెందిన భూక్యా రవి(35) నగరంలో కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. పదేళ్ల క్రితం అతడికి గార్లబయ్యారం ఉప్పలప్పుడు గొళ్లగూడానికి చెందిన భూక్యా లక్ష్మి(36)తో పరిచయం ఏర్పడింది. ఈపరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశారు. ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో నాలుగేళ్ల క్రితం విడిపోయారు.పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి రవికి రూ.50వేలు జరిమానా విధించారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. లక్ష్మి ఎక్కడ ఉన్న అడ్రస్ కనుక్కొని వేధించేవాడు.
లక్ష్మికి మరో వ్యక్తితో సంబంధం..
లక్ష్మి రవి నుంచి విడిపోయాక హన్మకొండకు చెందిన టైల్స్ మేస్త్రీ రఘుపతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారం రోజల క్రితం రవి గౌతమ్‌నగర్‌కు వచ్చి లక్ష్మిని వేధిస్తున్న విషయం తెలుసుకున్న రఘుపతి అక్కడికి చేరుకున్నాడు. తమ వివాహేతర సంబంధానికి రవి అడ్డువస్తున్నాడని భావించాడు. ప్లాన్ ప్రకారం హత్య చేయాలనుకున్నాడు. దీంతో రవిని రఘుపతి తన వాహనంపై జూలైవాడకు తీసుకెళ్లి చితకబాదాడు. కోన ఊపిరితో ఉన్న రవిని అక్కడి నుంచి గౌతమ్‌నగర్‌కు తీసుకొచ్చి వదిలిపెట్టారు. రఘుపతి కొట్టిన దెబ్బలకు రవి మృతి చెందినట్లు ఎస్సై సతీష్‌బాబు వివరించారు. ఈ హత్యకు లక్ష్మి సహకరించినట్లు తెలిపారు.
పోలీసులకు సమాచారం..
రవి చనిపోయిన సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లక్ష్మిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి లక్ష్మి రఘుపతి పరారీలో ఉన్నారు. కాగా జూలైవాడలోని ఓ ఇంట్లో పనిచేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి వారిద్దని అరెస్ట్ చేశారు సమావేశంలో ఎస్సైలు భీమేష్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment