మరిదితో వివాహేతర సంబంధం.. భర్త హత్య | Wife Killed Husband in Hyderabad | Sakshi
Sakshi News home page

అడ్డుగా ఉన్నాడని..

Published Thu, May 2 2019 7:01 AM | Last Updated on Thu, May 2 2019 7:01 AM

Wife Killed Husband in Hyderabad - Sakshi

మరిది వరసయ్యే సపావత్‌ కిషన్‌తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

చైతన్యపురి: వివాహేత సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  బుధవారం ఎల్‌బీనగర్‌  ఏసీసీ పృథ్వీదర్‌రావు, సీఐ సుదర్శన్‌  వివరాలు వెల్లడించారు. డిండి మండలం, దేవత్‌పల్లి తండాకు చెందిన బానోవత్‌ దులియా అలియాస్‌ శంకర్‌ (33) భార్య విజయ, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చి చైతన్యపురి యదవనగర్‌లో ఉంటూ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే విజయ మరిది వరసయ్యే సపావత్‌ కిషన్‌తో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిని గుర్తించిన శంకర్‌ ఆమెను మందలించడంతో అతడి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పథకం పన్నింది. ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి మద్యం తాగిన శంకర్‌ నిద్రలో ఉండగా విజయ, కిషన్‌ అతని ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. అనంతరం కరెంట్‌ షాక్‌తో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. శంకర్‌ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులను బుధవారం అరెస్ట్‌ చేశారు. తామె హత్య చేసినట్లు అంగీకరించడంతోవారిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement