
ప్రతీకాత్మక చిత్రం
రెబ్బెన(ఆసిఫాబాద్) : వివాహేతర సంబంధా నికి అడ్డుగా ఉన్నాడని ఏడడుగులు నడిచిన భార్యే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం నర్సయ్య(36) సోమవారం రాత్రి భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురయ్యాడు. నర్సయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. 15 ఏళ్ల క్రితం నర్సయ్యకు జ్యోతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు.
కాపురం సజావుగా సాగుతుండగా ఆర్నెళ్ల క్రితం జ్యోతి గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇటీవలే నర్సయ్యకు తెలిసింది. అప్పటి నుంచి భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి సైతం గొడవ జరిగింది. రాత్రి భోజనం అనంతరం నర్సయ్య ఇంటి ఎదుట నిద్రపోయాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని జ్యోతి నర్సయ్య హతమార్చేందుకు ఇదే అదునుగా భావించింది.
ప్రియుడు శ్రీనివాస్‌ను పిలిపించుకుంది. ఇద్దరు కలిసి నర్సయ్య గొంతు నులుమి హత్య చేశారు. అనంతరం ఇంట్లో చీరతో ఊరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మతదేహాన్ని పరిశీలించారు. మతుడి గొంతుపై గాయాలను గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు. జ్యోతి విచారించగా అసలు విషయం బయటపడింది. మతుడి తమ్ముడు సంతోశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్సై శివకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment