వడోదర: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భర్తను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిందో భార్య. నాలుగు రోజుల క్రితం గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని కెవాడియా పట్టణంలో జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ ముఖేశ్ ఎస్ బారియా, సంగీత భార్యా భర్తలు. వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ముఖేశ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య సంగీత ఎప్పుడూ అతనితో ఘర్షణ పడుతూ ఉండేది.
ఈ క్రమంలోనే బుధవారం కూడా భర్తతో గొడవపడ్డ సంగీత క్రికెట్ బ్యాట్‌తో ముఖేశ్‌ను పలుమార్లు కొట్టింది. అయితే తన భర్త ఇంటి దగ్గర అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని తానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ముఖేశ్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. పోస్ట్‌మార్టం రిపోర్టులో హత్య అని తేలడంతో పోలీసులు సంగీతను అరెస్టు చేశారు.