
బరిపద సదర్ స్టేషన్ (ఇన్‌సెట్‌లో) నిందితురాలు
భువనేశ్వర్: దాంపత్య జీవనానికి సముచిత గుర్తింపు ఇవ్వకుండా నిత్యం వేధింపులకు గురి చేసిన భర్తను ఓ భార్య హతమార్చి పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయింది. తన జీవితాన్ని విచ్ఛిన్నం చేసిన భర్త ఉన్నా, పోయినా ఒకటేనన్న మనోవేదనతో ఈ అమానుష చర్యకు ఆమె పాల్పడింది. బాలాసోర్ జిల్లాలోని సహదేవ్ ఖుంటొ పోలీస్ స్టేషన్ పరిధి గుడొపొదొ గ్రామంలో ఈ సంఘటన బుధవారం జరిగింది. కత్తితో నరికి భర్తను హతమార్చిన భార్య బరిపద సదర్‌స్టేషన్‌లో లొంగిపోయింది.
నిందితురాలు బరిపద సదర్ స్టేషన్ పరిధిలోని సిరిసొబొణి గ్రామస్తురాలు సీతా హేంబ్రమ్. ఆమెకు బొఢొ మరాండితో చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక మగబిడ్డ సంతానం. భర్త తనను నిరాకరించి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, బిడ్డను అంగీకరించకుండా వేధించడంతో భరించలేక మనోవేదనకు గురై భర్తను హత్య చేసినట్లు ఆమె పోలీసుల ఎదుట పేర్కొంది. భర్తను కత్తితో నరికి చంపేసి బాలాసోర్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో బయల్దేరి రుప్సా వరకు ప్రయాణించింది. అక్కడి నుంచి మరో రైలులో బరిపద రైల్వేస్టేషన్‌కు చేరి నడుచుకుంటూ బరిపద సదర్ స్టేషన్‌కు చేరుకుని తాను భర్తను హత్య చేశానని లొంగిపోతున్నానని పోలీసులకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment