మృతి చెందిన శ్రీనివాస్,దిక్కుతోచని స్థితిలో పిల్లలు.. శ్రీనివాస్(ఫైల్)
ఆదిలాబాద్, జైపూర్(చెన్నూర్): కట్టుకున్న వాడినే కడతేర్చింది ఆ ఇల్లాలు. వేధింపులు తాళలేక రోకలిదుడ్డుతో తలపై బాది హత్యచేసింది. నిత్యం తాగుతూ భార్యను చిత్రహింసలకుక గురిచేసే భర్తను కానరాని లోకాలకు పంపేసింది. మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకోకపోగా డబ్బుల కోసం తరచూ గొడవకు దిగే భర్తపై దాడి చేసి చంపేసింది. ఏడడుగులతో కలకాలం తో డుంటానని చేసిన బాసలు మరిచి పతిని పరలోకానికి పంపింది.
జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మోర్ల శ్రీనివాస్(38)ని తన భార్య మోర్ల రాజేశ్వరి సోమవారం ఉదయం రోకలిదుడ్డుతో కొట్టి హత్యచేసింది. సంఘటన వివరాల్లోకి వెళ్తే మోర్ల రాజేశ్వరి–శ్రీనివాస్‌లకు 2005లో వివాహం జరిగింది. శ్రీనివా స్ అత్తగారి ఇంటికి ఇల్లరికంగా వచ్చారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి కుమార్తెలు భూమిక(11), శ్రావణి(8), కుమారుడు శివకుమార్(6) ఉన్నా రు. సొంతంగా ఆటో నడుపుతూ శ్రీనివాస్ మద్యానికి బానిస అయ్యాడు. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులతో మద్యం సేవించి భార్య రాజేశ్వరిని తరుచూ వే ధింపులకు గురిచేసేవాడు. రాజేశ్వరి తండ్రి కొట్రంగి లస్మయ్య సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కాగా ఇటీవల రూ.2లక్షలు సహార డబ్బులు రాగా బ్యాంకులో వేశా రు.
అందులో నుంచి రూ.40 వేలు అప్పు తీర్చారు. బ్యాంకులో ఉన్న డబ్బులు తనకు ఇవ్వాలని కోరడంతో భార్యభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు ఆటోలు అమ్మిన శ్రీనివాస్ మళ్లీ కొత్త ఆటో కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వాలని మద్యం సేవించి భార్య రాజేశ్వరిని వేధించాడని ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా అతిగా మద్యం సేవించి భార్య రాజేశ్వరితో గొడవ పెట్టుకుంటున్నాడు. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం తాగి వచ్చిన శ్రీనివాస్ రాజేశ్వరితో గొడవకు దిగాడు. ఇద్దరూ తోసుకోగా విరక్తి చెందిన రాజేశ్వరి పక్కన ఉన్న రోకలిదుడ్డుతో శ్రీనివాస్ తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త వేధింపులు తాళలేక హత్య చేసినట్లు రాజేశ్వరి అంగీకరించింది. సంఘటన స్థలాన్ని ఏసీపీ సీతారాములు, శ్రీరాంపూర్ సీఐ నారాయణ నాయక్ పరిశీలించారు. నేరాన్ని అంగీకరించి రాజేశ్వరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించన్నుట్లు స్థానిక ఎస్సై ఆంజనేయలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment