harrassments
-
ఒక మహిళను ఉగ్రవాదుల్లా హింసించారు: అంబటి రాంబాబు
గుంటూరు, సాక్షి: చిలకలూరిపేటకు చెందిన సుధారాణి దంపతులను వేధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని పలు చోట్ల కేసులు పెట్టారని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘సుధారాణి దంపతులతోపాటు పిల్లలను కూడా తీసుకెళ్లారు. ఈ నెల 4న తీసుకెళ్లి నిన్న జడ్జిముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ముందు సుధారాణి జరిగిందంతా చెప్పారు.పోలీసులు కొట్టిన గాయాలను న్యాయమూర్తికి చూపించారు సుధారాణి. ఒక మహిళను ఉగ్రవాదిని హింసించినట్టు హింసించారు. మహిళను ఐదు రోజులు చిత్ర హింసలు పెట్టారు. సుధారాణి దంపతులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తాం. పోలీసు యంత్రాంగం చంద్రబాబు, లోకేష్ గుప్పిట్లోకి వెళ్లింది. పోలీస్ అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. పోలీసు యంత్రాంగం మానవహక్కులు హరిస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలపై ఐఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుంది’’ అని అన్నారు. -
పెళ్లి చేసుకోమంటూ యువతి పోరు.. అయిదు పేజీల లేఖ రాసి..
సాక్షి, బెంగళూరు: నిన్నే పెళ్లిచేసుకుంటా, నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని రావాలని యువతి వేధిస్తుండడంతో తట్టుకోలేక యువకుడు ఇల్లు వదిలి పరారయ్యాడు. ఈ విచిత్ర ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కలబురిగి జిల్లా హరవాళ గ్రామానికి చెందిన మారప్ప అనే యువకుడు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నాడు. గతంలో బీదర్ జిల్లాలో పెళ్లి చూపుల్లో ఓ యువతిని చూశాడు. అయితే ఆమె తిరస్కరించడంతో తిరిగి వచ్చేశాడు. తరువాత కొంతకాలానికి మరో యువతితో అతనికి పెల్లి సంబంధం కుదిరింది. ఈ క్రమంలో గతంలో చూసిన అమ్మాయి మారప్పకు క నబడటంతో ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకుని కాల్స్, మెసేజ్‌లు చేసుకునేవారు. కొన్నిరోజుల తరువాత మారప్పకు నిశ్చితార్థమైన విషయం తెలుసుకున్న యువతి అతనికి రోజూ ఫోన్ చేసి నీవంటే ఇష్టమని చెప్పడం మొదలు పెట్టింది. జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని, తననే పెళ్లి చేసుకోవాలంటూ పోరుపెట్టేది. దీంతో యువతి వేధింపులు తాళలేక యువకుడు ఇల్లు వదిలిపెట్టి ఉడాయించాడు. ఐదు పేజీల లేఖ రాసి, మొబైల్‌ను కూడా ఇంట్లో వదిలేశాడు. అతని తల్లిదండ్రులు కుమారుని కోసం కన్నీరుపెడుతున్నారు. దీనిపై నెలగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంసెట్ స్టేట్ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు
సాక్షి, కరీంనగర్: లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డులేకపోతుంది. రోజురోజుకీ వీటి ఆకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత జీవితం లోన్ యాప్స్ మోసాలకు అర్దాంతరంగా ముగిసిపోతోంది. తాజాగా లోన్ యాప్ వేధింపులు మరో యువకుడి ప్రాణం తీశాయి. కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందిన శ్రీధర్-పధ్మ దంపతుల కుమారుడు మని సాయి. ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాలలో 2వేల ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్‌లోని స్నేహితుడి రూమ్‌కు వచ్చి కౌన్సిలింగ్‌కు సిద్ధమవుతున్నాడు. అంతకుముందే డబ్బులు అవసరం ఉండి లోన్ యాప్‌లో రూ. 6 వేలు అప్పుగా తీసుకున్నాడు. గత ఆరు నెలలుగా రూ. 45 వేలు కట్టినా.. నిర్వహాకుల వేధింపులు మాత్రం ఆగడం లేదు. దీంతో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఈనెల 20న శంషాబాద్‌లోని తన రూమ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గమనించిన స్నేహితులు ఆసుపత్రికి తరలించడగా.. చికిత్స పొందుతూ మణి సాయి శుక్రవారం మృతి చెందాడు. మునిసాయి వైద్యం కోసం తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణం దక్కలేదు. ఎంసెట్‌లో స్టేట్ ర్యాంక్ సాధించిన మనిసాయి వెబ్ కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్‌ల వలలో చిక్కి ప్రాణాలు కోల్పోవడంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: డ్రైవర్‌ను చితక్కొట్టిన కానిస్టేబుల్.. కొట్టింది నిజమేనన్న ఇన్స్పెక్టర్ -
ఫేక్ లోన్‌యాప్‌లపై నిఘా
సాక్షి, అమరావతి: లోన్‌యాప్‌ల వేధింపులు, మోసాలను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉమ్మడి కార్యాచరణకు ఉపక్రమించాయి. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న లోన్‌యాప్‌లపై నిఘా పెట్టాయి. ప్రధానంగా చైనాలోని లోన్‌యాప్ కంపెనీలు మన దేశంలో అనధికారికంగా ఏజెంట్లను పెట్టుకుని సాగిస్తున్న దందాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగాయి. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఈడీ) దేశంలోని వివిధ ప్రాంతాల్లో లోన్‌యాప్ కంపెనీల కార్యాలయాలపై విస్తృతంగా దాడులు నిర్వహించింది. యూపీఐ ఖాతాల ద్వారా చైనాకు భారీగా నిధులు తరలిస్తున్న వివిధ కంపెనీలను గుర్తించింది. ఆ కంపెనీల కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పరిశీలించగా లోన్‌యాప్ దందా మొత్తం బట్టబయలైంది. దీంతో ఆ ఫేక్ లోన్‌యాప్ కంపెనీల జాబితాలను అన్ని జిల్లాలకు పంపించి వాటి కార్యకలాపాలు అడ్డుకునేందుకు పోలీసుశాఖ ఉద్యుక్తమైంది. ఆకర్షణీయమైన పేర్లతో బురిడీ చైనాకు చెందిన లోన్‌యాప్ కంపెనీలు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, లక్నో తదితర నగరాల్లో అనధికారికంగా బీపీవో కేంద్రాలను ఏర్పాటుచేసి ఈ దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నైల్లోని కేంద్రాల నుంచే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ కంపెనీలు వ్యవహారం నడుపుతున్నట్లు గుర్తించారు. ఇవి ఆకర్షణీయమైన ఇంగ్లిష్ పేర్లతో ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. వాటిలో చాలా కంపెనీలు వివిధ అనుబంధ లోన్‌యాప్ కంపెనీలుగా ఒకే అడ్రస్‌తో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లో కొద్దిపాటి మార్పులతో ఒకేలా అనిపించే వివిధ పేర్లతో ఈ కంపెనీలు బురిడీ కొట్టిస్తున్నాయి. దేశంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 271 ఫేక్ లోన్‌యాప్ కంపెనీలను ఆర్బీఐ గుర్తించింది. వాటి కార్యకలాపాలు నిషేధించింది. వాటిపై పర్యవేక్షణను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు సమాచారమిచ్చింది. ఆ కంపెనీలు ఇవే.. క్యాష్ అడ్వాన్స్ అటాచ్, ధన్ పల్, క్యాష్ హోస్ట్, రుపీక్, క్యాష్ మేనేజర్, ఫ్రీ లోన్, క్యాష్ అడ్వాన్స్ టీ1, క్యాష్కామ్, వాలెట్ ప్రో, వెల్ క్రెడిట్ గోల్డ్, హనీ లోన్, యూలవ్ట్ యాప్, హనీ లోన్‌యాప్, హ్యాండీ లోన్, క్యాష్ అడ్వాన్స్, లక్కీ లోన్‌యాప్, ర్యాపిడ్ పైసా, మనీ వ్యూ యాప్, డోవా క్యాష్ లోన్‌యాప్, కాయిన్ ట్రాక్, అవైల్ ఫైనాన్స్, హెల్ప్ మనీ అప్లికేషన్, క్రెడిట్బాక్స్ ఆల్ఫా లోన్ యాప్, ఫ్యూచర్ వాలెట్, హర్మనీ లోన్, నీడీ లోన్, సుగర్ మనీ, క్రెడిట్ కాయిన్ యాప్, అరేకో, క్రెడిట్ పెర్ల్, మే లోన్, ఫోర్ర్టెస్ లోన్‌యాప్, క్యాష్ క్రెడిట్, అరియకో లోన్, వాలెట్ ప్రో, కర్టెల్ లోన్, లక్కీ క్యాష్ లోన్, ఓకే రుపీ లోన్ అప్లికేషన్, హై క్రెడిట్ యాప్, సపోర్ట్ లోన్, క్విక్ మనీ యాప్, టాప్ క్యాష్ లోన్, ఈజీ బారో లోన్ యాప్, కార్ప్ వాలెట్, రూపీ బాక్స్, క్రెడిట్ మార్వెలెక్స్, రుపీరెడీ లోన్ యాప్, మెనీ లోన్, రుపీ పాకెట్, పే రుపీక్, క్రెడిట్ మార్వెల్, వాల్కనో లోన్, మోర్ లోన్, మేజిక్ లోన్, ఇన్స్టంట్ లోన్, ఎస్ క్యాష్, మేజిక్ మనీ, రుపీ పాపా, క్యాష్ ఎక్స్పీ, రుపీ ఓకే 1, క్యాష్ ఓకే, సన్‌షైన్ లోన్, క్రెడిట్ ఇట్ యాప్, పామ్రుపీ, ఈజీ ఆర్పీ, మనీ ల్యాడర్, ఎలిఫెంట్ క్యాష్, మ్యాజిక్ లోన్, క్యాష్ లోన్, పిళ్లై లోన్, క్రెడిట్ లోన్, రుపీ హాల్, ఇన్‌కం లోన్ యాప్, టాప్ క్యాష్, ఫ్లాష్ రుపీ, క్యాష్ స్టేషన్, రుపీ స్టార్, లింక్ మనీ, లోన్ హోమ్, రుఫిలో, మనీ స్టాండ్ క్రెడిట్ లోన్, బెలోన్ లోన్ యాప్, క్రెడిట్ మాంగో యాప్, పాపా మనీ లోన్‌యాప్, యోజన లోన్‌యాప్, లోన్ బ్రో లోన్‌యాప్, రుపీ హోమ్, క్రెజిబెన్, ఆ క్యాష్, క్రిస్టల్ లోన్, గోల్డ్ సీ, మనీ ట్యాంక్, యస్ రుపీస్, ఫ్లాష్ లోన్ యాప్, నీడ్ రుపీ, మామా లోన్‌యాప్, ధనీ, రెయిన్బో లోన్, క్విక్ క్యాష్, మనీ స్టాండ్, మనీ హౌస్, స్టే రుపీ, క్రెడిట్ రుపీ, క్యాష్ సమోసా, ఇన్ఫినిటీ క్యాష్, మే క్రెడిట్, లక్కీ లోన్, కిష్హ్ట్, రుఫిలో, మే లోన్‌యాప్, ఫ్లెక్స్లీ లోన్, మార్వెల్ లోన్, బాబా నాయక్ లోన్ ఫైనాన్స్, మినిట్స్ ఇన్ క్యాష్, బ్రో క్యాష్, గెట్ క్యాష్, డిస్కవర్ లోన్‌యాప్, క్యాష్ కౌ, ఈ–పైసా, షటిల్ లోన్, ఈఎస్ లోన్, ఆల్ఫా లోన్, హనీ లోనిన్, క్యాష్ లైట్, టాప్ క్యాష్, మాన్తా క్యాష్, ఓ క్యాష్, హలో బాక్స్, వల్లబై యాప్, జాస్మిన్ లోన్‌యాప్, అరాక్ లోన్, ఫాస్ట్ క్యాష్, ఓన్లీ లోన్, రుపియా బస్, లింక్ మనీ, లెండ్మాల్, క్రెడిట్ కింగ్, హై క్యాష్, యూపీఏ లోన్, గోల్డ్ మ్యాన్ పేబ్యాక్, హ్యాండీ లోన్, రుపీ కింగ్, మీ రుపీ, వన్ లోన్, క్యాష్ ఎనీ టైమ్, ఎక్స్‌ప్రెస్ లోన్, లోన్ డ్రీమ్, రుపీ లోన్, ఫ్లాష్ లోన్ మొబైల్, రుపీ స్టార్, వావ్ రుపీ, క్యాష్ పార్క్ లోన్, హూ క్యాష్, ఫస్ట్ క్యాష్, క్లియర్ లోన్, రుపీ బాక్స్, స్మాల్ లోన్, రిచ్, లోన్ గో, ఆసాన్ లోన్, లైవ్ క్యాష్, ఫాస్ట్ రుపీ, లోన్ ఫార్యూ్చన్, క్యాష్ పాకెట్, ఇన్‌స్టా లోన్, అప్పా పైసా, కోయిన్ రుపీ, క్యాష్ పాపా, లోన్ క్లబ్, హ్యాండ్ క్యాష్, లోన్ హోమ్ స్మాల్, ఐ క్రెడిట్, వెన్ క్రెడిట్, సమయ్ రుపీ, లెండ్ మాల్, సిల్వర్ పాకెట్, భారత్క్యాష్, మనీ మాస్టర్, ఈజీ లోన్, వార్న్ రుపీ, స్మార్ట్ కాయిన్, లక్కీ వాలెట్, యూపీవో లోన్.కామ్, బడ్డీ లోన్, క్యాష్ మైనే, టైటో క్యాష్, మై క్యాష్ లోన్, సింపుల్ లోన్, క్యాష్ మెషిన్ లోన్, ఫర్ పే, మినిట్ క్యాష్, ఫాస్ట్ పైసా, మోర్ క్యాష్, క్యాష్ బుక్, హ్యాండ్ క్యాష్ ఫ్రెండ్లీలోన్, రిలయబుల్ రుపీ క్యాష్, ఎర్లీ క్రెడిట్ యాప్, ఈగల్ క్యాష్‌లోన్ యాప్, క్యాష్ క్యారీ యాప్, క్యాష్ పార్క్, రిచ్ క్యాష్, ఫ్రెష్ లోన్, బెట్విన్నర్ బెట్టింగ్, రుపీ మాల్, సన్ క్యాష్, మినిట్ క్యాష్, బస్ రుపీ, ఓబ్ క్యాష్ లోన్, ఆన్ స్ట్రీమ్, క్యాష్‌లోన్, స్మాల్ లోన్, రుపయ బస్, ఇన్‌స్టా మనీ, స్లైస్ పే, లోన్ క్యూబ్, ఇకర్జా, మనీ స్టాండ్ ప్రో, పోక్ మనీ, క్వాలిటీ క్యాష్, లోన్ లోజీ, ఫర్‌పే యాప్, రుపీ ప్లస్, డ్రీమ్ లోన్, క్యాష్ స్టార్ మినిసో రుపీ, క్యాష్‌పాల్, ఫార్యూ్చన్ నౌ, క్రెడిట్ వాలెట్, పాకెట్ బ్యాంక్, లోన్‌జోన్, ఫాస్ట్ కాయిన్, స్టార్ లోన్, ఈజీ క్రెడిట్, ఏటీడీ లోన్, ట్రీ లోన్, బ్యాలన్స్ లోన్, క్యాష్ బౌల్, క్యాష్ కర్రీ, క్యాష్ మెషిన్, క్యాష్ పాకెట్ లైవ్ క్యాష్, క్యాష్ కోలా, 66 క్యాష్, కోకో లోన్, క్యాష్ హోల్, ఈజీ బారో క్యాష్ లోన్, ఐఎన్డీ క్యాష్ లోన్, వాలెట్ పేయి, క్యాష్ గురూ యాప్, గోల్డ్ క్యాష్, ఆరెంజ్ లోన్, ఏంజిల్ లోన్, లోన్ శాంతి, షార్ప్ లోన్, డెయిలీ లోన్, స్కై లోన్, మో క్యాష్, జో క్యాష్, బెస్ట్ పైసా, హెలో రూపీ, హాలిడే మొబైల్ లోన్, ఫోన్ పే లోన్, ప్లంప్ వాలెట్, క్యాష్ క్యారీ లోన్‌యాప్, క్రేజీ క్యాష్, క్విక్ లోన్‌యాప్, రాకెట్ లోన్, రుపీ మ్యాజిక్, రుష్ లోన్, బెలోనో లోన్‌యాప్, ఏజిల్ లోన్‌యాప్, క్యాష్ అడ్వాన్స్ 1, ఇన్కమ్ ఓకే. -
లోన్ యాప్ ఘటనలో ఏడుగురి అరెస్ట్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లోన్ యాప్ వేధింపులకు బలైన దంపతుల సంఘటనలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో రుణ యాప్ బాధితులు పెరుగుతుండటంతో సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. లోన్ యాప్‌లతో వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి, వారంలోనే నిందితుల్ని పట్టుకున్నారు. స్థానిక దిశా పోలీస్ స్టేషన్లో సోమవారం మీడియాకు జిల్లా ఇన్చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి వివరాలు తెలిపారు. భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైన హాండీ లోన్, స్పీడ్ లోన్ యాప్‌లపై పోలీసులు ఆరా తీశారు. దీనికి సంబంధించి మూడు పోలీసు బృందాలు పనిచేశాయి. యాప్‌లకు, లోన్ తీసుకునే వారికి మధ్యవర్తులుగా పని చేస్తున్న వారిని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం గండిపేట మండలం మానికొండకు చెందిన లంబాడీ నరేష్, మియాపూర్‌కు చెందిన కొల్లూరు శ్రీనివాస్‌యాదవ్, కాకినాడ జిల్లా తిమ్మాపురానికి చెందిన మేడిశెట్టి పృథ్వీరాజ్, ఏలేశ్వరానికి చెందిన నక్కా సుమంత్, అన్నవరానికి చెందిన మండా వీరవెంకటహరిబాబు, విశాఖ జిల్లా కేకే అగ్రహారానికి చెందిన కోరుపోలుత రామకృష్ణ, అనకాపల్లి సమీపంలోని సిరసపల్లికి చెందిన దానబోయిన భాస్కర్లు నిందితులని పోలీసులు గుర్తించారు. వీరి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా నెలలోనే రూ.కోటి లావాదేవీలు చేసినట్టు గుర్తించారు. బ్యాంకు అధికారులకు అనుమానం రాకుండా ప్రతి నెలా వేర్వేరు ఖాతాలను వీరు నిర్వహిస్తున్నారు. పోలీసులకు ఇతర రాష్ట్రాల్లోని యాప్ నిర్వాహకుల సమాచారం కూడా లభిం చడంతో ఆ దిశగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. త్వర లోనే వీరిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
తాట తీస్తున్నారు! 10 వారాల్లో 106 మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్: మహిళలను వేధించే పోకిరీలకు రాచకొండ పోలీసులు చెక్ పెడుతున్నారు. వారిని పట్టుకోవడం..శిక్షించడంలో ఏమాత్రం ఉపేక్షించడం లేదు. తీవ్రతను బట్టి అప్పటికప్పుడే వారిపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నారు. గత పది వారాలలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 82 కేసులు నమోదు కాగా.. ఇందులో 29 ఎఫ్ఐఆర్లు, 36 పెట్టీ కేసులు, 17 కౌన్సిలింగ్ కేసులున్నాయి. ఆయా కేసులలో 106 మంది ఈవ్ టీజర్లను అరెస్టు చేశారు. వీరిలో 65 మంది మేజర్లు, 41 మంది మైనర్లున్నారు. ఆయా పోకిరీలకు శనివారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ ఆఫీసులో రాచకొండ షీ టీమ్స్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంయుక్తంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. అనధికారిక అనాథాశ్రమాలు.. ముస్కాన్–8 లో భాగంగా రాచకొండ షీ టీమ్స్.. అనధికారిక అనాథ పిల్లల గృహాలను గుర్తించారు. మేడిపల్లి శాంతినగర్‌లోని ఆశ కుటీర్ బాయ్స్ హోమ్, కాకతీయనగర్‌లోని వివేకానంద అనాథాశ్రమం, కాచవానిసింగారంలోని బాలవికాస్ చిల్డ్రన్స్ హోమ్స్, జవహర్‌నగర్ క్రాస్ రోడ్‌లోని విజన్ఇండ్ ఫౌండేషన్లను గుర్తించి మూసేశారు. అందులోని 50కి పైగా అనాథలను ప్రభుత్వ హోమ్స్‌కు తరలించారు. అలాగే మెట్రో రైళ్లలో షీ టీమ్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మహిళల బోగిలో చొరబడిన 8 మంది పోకిరీలను పట్టుకున్నారు. ఆయా మెట్రో స్టేషన్ మాస్టర్‌కు జరిమానా విధించారు. గత 10 వారాలలో రాచకొండ షీ టీమ్స్ 4 బాల్య వివాహాలను అడ్డుకుంది. కాగా ఈవ్‌టీజింగ్, మహిళలపై వేధింపులను ఉపేక్షించకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని రాచకొండ షీ టీమ్స్ డీసీపీ ఎస్కే సలీమా విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థలు, షాపింగ్ మాళ్లు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు ఎక్కడైనా సరే మహిళలను వేధిస్తే వెంటనే 94906 17111 నంబరులో లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. (చదవండి: నీ పిల్లలు ఏమైపోవాలె బిడ్డా..!) -
నన్ను కలిస్తేనే సర్టిఫికెట్.. మహిళకు వైద్యుడి వేధింపులు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పెద్దాస్పత్రి వైద్యులపై ఇంతకాలం విధులకు ఆలస్యంగా వస్తున్నారని, సమయానికి వచ్చినా కొద్దిసేపు ఉండి వెళ్లి పోతున్నారనే ఆరోపణలు ఉండేవి. కానీ ఇప్పుడు సర్టిఫికెట్ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళపై కన్నేసిన ఒక వైద్యుడు ఆమెను వేధించినట్లు వెలుగుచూడడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన తన తండ్రికి సదరమ్ సర్టిఫికెట్ ఇప్పించేందుకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహిళ గత నెలలో తన తండ్రితో పాటు పెద్దాస్పత్రికి వచ్చింది. ఓపీ చీటీ రాయించుకుని ఓ వైద్యుడి వద్దకు వెళ్లగా ఆయన మహిళపై కన్నేశాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచుగా ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. ఈ తతంగం గత నెల 17నుండి జరుగుతోంది. సదరం సర్టిఫికెట్ కావాలంటే తనతో శారీరకంగా కలవాలని వేధిస్తున్న ఆయన, గత వారం ఒంటరిగా రావాలని సూచించాడు. దీంతో విసిగిపోయిన మహిళ ఈనెల 4వ తేదీన పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసింది. చదవండి: అన్నా.. మనల్ని పిలుస్తారే!.. బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు, మాజీలు అలాగే, రెండు రోజుల క్రితం ఖమ్మంలో పోలీసులకు సైతం ఫిర్యాదు ఇచ్చింది. తండ్రి సర్టిఫికెట్ కోసం వెళ్తే తనను మానసికంగా వేధించిన వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణ చేపట్టారు. ఈమేరకు విచారణకు హాజరుకావాలని వైద్యుడికి సూపరింటెండెంట్ సూచించిన నాటి నుంచి విధులకు గైర్హాజరవుతున్నాడు. ఈ విషయ మై సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని విచారణకు రావాలని సమాచారం ఇవ్వగా విధులకే కావడం లేదని తెలిపారు. త్వరలోనే విచారణ చేపట్టి వైద్యుడిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని, ఆతర్వాత విషయం పోలీసులు చూసుకుంటారని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. -
కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..
Comedian Bill Cosby Found Guilty Sexually Assaulting In 1975: ఎంతటి ప్రముఖులైన చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదని మరో సంఘటన నిరూపించింది. ఓ ప్రముఖ కమెడియన్ 1975లో చేసిన నేరం సుమారు 50 ఏళ్ల తర్వాత రుజువైంది. 5 దశాబ్దాల క్రితం అమెరికన్ కమెడియన్ బిల్ కాస్బీ ప్లేబాయ్ మాన్షన్‌లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఆమె బిల్‌పై కేసు పెట్టింది. తర్వాత విచారించిన కాలిఫోర్నియాలోని జ్యూరీ తాజాగా మంగళవారం (జూన్ 21, 2022) తీర్పునిచ్చింది. హాస్య నటుడు బిల్ కాస్బీ నేరం చేసినట్లు నిర్ధారించింది. అంతేకాకుండా బాధితురాలు జూడీ హుత్కు 5 లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. 1975లో 36 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీ 16 సంవత్సరాల జూడీ హుత్ను లైంగికంగా వేధించాడు. ఓ సినిమా సెట్లో జరిగిన ఈ ఘటనలో జూడీతోపాటు ఆమె స్నేహితురాలు డొన్నా శామ్యూల్ సన్ (17) కూడా బాధితురాలైంది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ ప్రస్తుతం 84 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలతో కేసులు వేశారు. ఈ క్రమంలోనే బిల్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కాగా 'అమెరికాస్ డాడ్'గా పిలవబడే బిల్ కాస్బీ 2018లో కూడా ఒక క్రిమినల్ కేసులో జైలుపాలయ్యాడు. తర్వాత పలు కారణాల వల్ల నేరం రద్దు కావడంతో గతేడాది విడుదల అయ్యాడు. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
మైనర్ బాలికపై వేధింపులు.. తండ్రి మందలించడంతో..
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శేరిలింగంపల్లి పరిధిలోని పాపిరెడ్డి కాలనీలోని ఓ మైనర్ బాలిక(16)ను స్థానికంగా ఉండే నాగేశ్వర్రావు కుమారుడు అరవింద్ (21) ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో బాలిక తండ్రి అరవింద్‌ను మందలించారు. ఇదిలా ఉండగా ఈ నెల 2న బాలిక తండ్రి ద్విచక్ర వాహననంతోపాటు మరో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఓ ఇంటికి అమర్చిన ఏసీ ఔట్ డోర్ కంప్రెషర్ కూడా కాలిపోయింది. దీనికి కారణం అరవిందేనని స్థానికులు చితకబాదారు. ఈనెల 9న బాలికను అరవింద్ వే«ధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు 14న అరవింద్‌ను విచారణ కోసం పిలిచారు. తనపై వారు దాడిచేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో బుధవారం చందానగర్ పోలీస్ స్టేషన్ ముందు బాలిక కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.చివరకు చందానగర్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ క్యాస్ట్రో తెలిపారు. చదవండి: 'నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా' -
13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి
Pandya Store Actress Simran Budharup Gets Rape Threats Because Of Role: ఇటీవల అత్యధిక పాపులారిటీ సంపాందించుకున్న షోలలో 'పాండ్యా స్టోర్' ఒకటి. ఇందులో రిషితా ద్వివేది పాండ్యా పాత్రను నటి సిమ్రాన్ బుధారుప్ పోషించింది. అయితే ఈ పాత్ర కారణంగా నిజ జీవితంలో తనకు ఎదురైన బెదిరింపు సంఘటనలను తాజాగా తెలిపింది సిమ్రాన్. సోషల్ మీడియా వేదికగా తనకు అత్యచారం, చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఆ బెదిరింపులు తట్టుకోలేక చివరికీ వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న బెదిరింపుల గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది సిమ్రాన్ బుధారుప్. 'పాండ్యా సోర్ట్ షోలో లీడ్ రోల్స్ అయిన రవి, దేవ్ మధ్య సంబంధాన్ని విడగొట్టే పాత్ర నాది. ఇది చూసిన ప్రేక్షకులు నన్ను దుర్బాషలాడడం మొదలు పెట్టారు. యువకులు, బాలికల సమూహం సోషల్ మీడియాలో అత్యచారం, చావు బెదిరింపులతో వేధించింది. వారు సుమారు 13-14 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలే. చదువు కోసమని వారి తల్లిదండ్రులు ఫోన్ల్ ఇచ్చారు. కానీ ఆ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల నమ్మకాన్ని దుర్వినియోగం చేశారు. వారికి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. అందుకే వారు ఇలా చేశారు. పరిస్థితులు దిగజారడంతో తప్పలేక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాను. పిల్లలు మంచి, చెడుల మధ్య తేడాను అర్థం చేసుకోలేరు. కాబట్టి వారిని ఎప్పుడూ తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.' అని సిమ్రాన్ తెలిపింది. చదవండి: ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్ -
బట్టతల ఉన్నవారికి ఊరటనిచ్చే వార్త.. ఇక ఎగతాళి చేశారో అంతే!
లండన్: పనిచేసే చోట ఎవరినైనా బట్టతల ఉన్నవారిని వెక్కిరిస్తే లైంగిక వేధింపు కిందకే వస్తుందని ఇంగ్లండ్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది! టోనీ అనే వ్యక్తి కంపెనీలో సూపర్వైజర్తో వాదనకు దిగాడు. టోనీ బట్టతలను సూపర్వైజర్ ఎగతాళి చేశాడు. ఈ కేసులో భాగంగా, జుట్టు లేకపోవడంపై కామెంట్లు అవమానించడం కిందకు వస్తాయా, వేధింపుల కిందకా అనే అంశంపై ట్రిబ్యునల్ విచారణ జరిపింది. కేవలం బట్టతల ఉందన్న కారణంతో అవమానిస్తే లైంగిక వేధింపేనని తేల్చింది. చదవండి: జేబులో ఐమాక్స్.. యూట్యూబ్, సినిమాలు, వీడియోలు అన్నీ చూడొచ్చు -
తీవ్రంగా కొట్టి చచ్చిపో అంటున్నాడని.. ఇప్పుడే పెళ్లి వద్దని..
సాక్షి, ఉప్పల్: భర్త, అత్త వేధింపులకు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్, గాంధీనగర్ జనప్రియ అపార్టుమెంట్లో నివసించే పసుమర్తి రాఘవేంద్రరావు, భార్య మణిదీపిక (32), వీరికి సాయి విజ్ఞేష్ (15) ఆశ్రిత (12) సంతానం. గత నాలుగేళ్లుగా రాఘవేంద్రరావు మద్యానికి బానిసై నిత్యం భార్యను కొడుతుండేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినా ఫలితం లేకపోయింది. గురువారం తండ్రి పంగలూరి లక్ష్మీనారాయణ దాస్‌కు ఫోన్ చేసి తన భర్త 20వ తేదీన తీవ్రంగా కొట్టి చచ్చిపో అంటున్నాడని తెలిపింది. 21వ తేదీన మణిదీపిక అత్త సుగుణమ్మ లక్ష్మీనారాయణ దాస్‌కు ఫోన్ చేసి మీ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణ దాస్ అత్త, భర్తల పోరు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఉప్పల్: బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేçసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్ భరత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ కుమార్తె దర్శ అలేఖ్య (20), బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఇటీవల పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి ఇప్పుడే వద్దని చదువుకుంటాననడంతో తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మైనర్‌తో ప్రేమ, పెళ్లి.. నెల నుంచే బాలికను వేధిస్తూ
సాక్షి, అమీర్‌పేట: ప్రేమ పేరిట బాలిక వెంటపడి, పెళ్లి చేసుకుని వేధిస్తున్న యువకుడిపై ఎస్ఆర్నగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లో నివాసముంటున్న 16 ఏళ్ల మైనర్ బాలిక 2017లో వేసవి సెలవుల్లో ఎల్లారెడ్డిగూడలో తాత, అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు స్థానికంగా ఉండే ఎరోళ్ల వివేక్ అనే యువకుడు పరిచయమయ్యాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే అనుమానంతో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికను గతేడాది నవంబర్ 8న వెంట తీసుకుని వెళ్లి 12న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు. తిరిగి వచ్చి ఎల్లారెడ్డిగూడలో కాపురం పెట్టాడు. 5 నెలల నుంచి బాలికను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో బుధవారం ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు పాల్పడిన వివేక్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
యువకుడి కీచకపర్వం.. ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు.. హద్దుమీరడంతో
సాక్షి, గుంటూరు: : లైంగిక వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శావల్యాపురం మండలం శానంపూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ లేళ్ల లోకేశ్వరరావు మంగళవారం వివరాలు వెల్లడించారు. శానంపూడి గ్రామానికి చెందిన పులుకూరి శ్రావణి (19) ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసి ఇంటిలో తన తల్లికి సహాయంగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన చెన్నంశెట్టి నాగేంద్రబాబు తరచూ ప్రేమ పేరుతో శ్రావణిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి వెంకటాచారి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం యంపరాల గ్రామంలోని తన బావమరిది ఇంటికి ఆమెను పంపించాడు. అయినప్పటికీ నాగేంద్రబాబు తన స్నేహితులతో కలిసి ఈ నెల 2వ తేదీన యంపరాల గ్రామం వెళ్లి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. శ్రావణి అత్తయ్య విషయాన్ని వెంకటాచారికి చెప్పడంతో.. యువతిని స్వగ్రామం తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో వెంకటాచారిపై నాగేంద్రబాబు దాడి చేయడమే కాక.. హద్దుమీరి కుటుంబం మొత్తాన్ని హతమారుస్తానని హెచ్చరించాడు. మనస్తాపానికి గురైన యువతి.. మరుసటి రోజు ఉదయం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.కుటుంబ సభ్యులు వినుకొండ పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ నాలుగురోజుల చికిత్స అనంతరం సోమవారం రాత్రి అత్యవసరంగా నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నాగేద్రబాబు, పత్తి శ్రీనివాసరావు, అనిల్‌పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిందితులను చట్టపరంగా శిక్షించాలని సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రాము కోరారు. -
భర్త వేధింపులు.. స్కిన్ ఎలర్జీ తగ్గిస్తానని స్టెరాయిడ్స్ ఇచ్చి
సాక్షి, నిజామాబాద్: స్టెరాయిడ్స్ ఇచ్చి చంపే ప్రయత్నం చేసిన తన భర్త గంగాసాగర్‌ను శిక్షించి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆర్మూర్‌కు చెందిన బాధితురాలు స్రవంతి కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. 2018లో ఆర్మూర్‌కు చెందిన గంగాసాగర్‌తో వివాహాం జరిగిందని, మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. అత్త, మామలు అదనపు కట్నం కోసం ఇబ్బందులు పెట్టారని తెలిపింది. భర్త బాసరలో ఆర్ఎంపీగా పని చేస్తున్నాడని, అయితే ఇటీవల తనకు స్కిన్ ఎలర్జీ రావడంతో తగ్గిస్తానని చెప్పి ఇంజక్షన్లు ఇచ్చాడని తెలిపింది. అయితే శరీరంలో మార్పులు రావడంతో వేరే ఆస్పత్రికి వెళ్లగా, అవి స్టెరాయిడ్స్ అని డాక్టర్లు చెప్పారని, తనను చంపే ప్రయత్నం చేశాడని వాపో యింది. భర్తను నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, కొడుకును కూడా చంపేస్తానని ఇంటికి కత్తితో వచ్చాడని తెలిపింది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని వాపోయింది. బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్ సఖి కేంద్రం అధికారులను ఆదేశించారు. చదవండి: మంచిజీతం ఉంటుందని ఆశపడితే.. అమ్మేశారు! -
మహిళా ప్రొఫెసర్‌కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు..
న్యూఢిల్లీ: మహిళా ప్రొఫెసర్‌ను లైంగిక వేధింపులకు గురిచేస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుడిని ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన ధరంపాల్ రాయ్‌గా (36) గుర్తించారు. వివరాలు..36 ఏళ్ల ధరంపాల్ జోధ్‌పూర్‌లోని ఆర్ఓ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. అయితే రాయ్ గత కొద్దిరోజులుగా ఢిల్లీ వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్‌కు అశ్లీల వీడీయోలు, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్నాడు. వాట్సాప్‌లో అభ్యంతరకర వీడియోలు పంపిస్తూ ఇబ్బంది పెట్టేవాడు. చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందని.. దీంతో గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్‌లో అశ్లీల వీడియోలు పంపి వేధిస్తున్నాడని మహిళా ప్రొఫెసర్ జనవరి 29న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక సహకారంతో ఢిల్లీ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్‌కు వీడియో కాల్స్ చేస్తూ వేధిస్తున్నాడు. ఫేస్బుక్ సెర్చ్‌లో ఫ్రొఫెసర్ కాంటాక్ట్ నంబర్ దొరికిందని, అప్పటి నుంచి ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించానని నిందితుడు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు. ఇతర మహిళలనూ ఇదే తరహాలో నిందితుడు గతంలో వేధించాడనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి: కొడుకు ప్రేమ పెళ్లి.. మానసికంగా కుంగిపోయిన తల్లి.. చివరికి -
బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరం: ఎమ్మెల్యే ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మహిళలను వేధిస్తూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ ఇతరులపై నెట్టేందుకు యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఓ తండ్రిలా చూసుకోవాల్సిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బాలికను ఎంతలా వేధించాడో ఆమె పుస్తకంలో రాసుకున్న విషయాలను బట్టి చూస్తే అర్థం అవుతుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక సూసైడ్ నోట్లో రాసిందని ఎమ్మెల్యే రోజా చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుంది విజయవాడ భవానీపురంలో బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. టీడీపీ నేత వేధింపులే కారణమని బాలిక సూసైడ్ నోట్ రాసిందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. చదవండి: బాలిక ఆత్మహత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ -
అశ్లీల వీడియోల పేరుతో బ్లాక్మెయిల్ కేసు: వెలుగులోకి కొత్తపేరు
సాక్షి, బనశంకరి (కర్ణాటక): మంత్రి సోమశేఖర్ కుమారుడు నిశాంత్‌ని అశ్లీల వీడియోల పేరుతో బ్లాక్మెయిల్ చేసిన కేసులో రాహుల్భట్తో పాటు సోమవారం మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సూత్రధారి ఎవరు అనేదానిపై సీసీబీ పోలీసులు విచారణ చేప ట్టారు. ఇండి ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్ కుమార్తె పేరుతో ఉన్న సిమ్‌కార్డు నుంచి నిశాంత్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయని తేలింది. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ కుమార్తె ఉన్నత విద్య కోసం గత 10 నెలలుగా విదేశాల్లో ఉందని, ఆమె సిమ్‌కార్డును రాకేశ్ అణ్ణప్ప అనే స్నేహితునికి ఇచ్చిందని, అతడు దానిని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. -
నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు!
సాక్షి, బనశంకరి(కర్ణాటక): నీ అశ్లీల వీడియో నా వద్ద ఉంది, డబ్బులు ఇవ్వకపోతే లీక్ చేస్తానని మంత్రి కుమారున్ని బెదిరించాడన్న కేసులో ప్రముఖ జ్యోతిష్యుని కొడుకుని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి ఎస్టీ సోమశేఖర్ కుమారుడు నిశాంత్‌ను ఆర్టీ నగరలో ఉండే రాహుల్‌భట్ బెదిరించాడని, ఆదివారం అతన్ని అరెస్ట్ చేశామని జాయింట్ పోలీస్ కమిషనర్ రమణ్‌గుప్తా తెలిపారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అశ్లీల వీడియోను సృష్టించి మంత్రి పీఏలు శ్రీనివాసగౌడ, బానుప్రకాష్ల మొబైళ్లకు పంపి డబ్బుకు డిమాండ్ పెట్టారు. లేదంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బ్లాక్‌బెయిల్ చేశారని నిశాంత్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాహుల్‌భట్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఐఏసీ విక్రాంత్ మూడోదఫా జలపరీక్షలు ఆరంభం -
విషాదం: అత్తింటి వేధింపులతో పురుగుల మందు తాగిన మహిళ
సాక్షి, నేరేడుచర్ల(నల్లగొండ): కుటుంబ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఓ మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నేరేడుచర్ల ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన పగిడిమర్రి అనూష(21)ను పెద్దమ్మ, పేదనాన్నలు అయిన పగిడిమర్రి సమాదానం, పగిడిమర్రి నగేష్ సాదుకున్నారు. అనూషను వారు వారి కుమారుడు పగిడిమర్రి అంజయ్య, బాబాయి పగిడిమర్రి విజయ్ కుటుంబ సభ్యులందరూ అనూషను పనిమనిషిగా చూడటంతో పాటు వ్యవసాయం, ఇంటి పనులకు పరిమితం చేసి తరుచూకొట్టడం, తిట్టడం, చిత్రహింసలకు గురి చేయడంతో వేధింపులను తట్టుకోలేక ఈనెల 14న పురుగుల మందు తాగింది. దీంతో పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్ ఐ తెలిపారు. తండ్రి సైదులు ఇచ్చిన ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు: డీజీపీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, చెన్నై: వారంతా పోలీస్‌శాఖలో ఉన్నతాధికారులు. అయితేనేం సాధారణ వ్యక్తుల వలె వ్యవహరించారు. డీజీపీ స్థాయి అధికారి మహిళా ఐపీఎస్‌ను లైంగిక వేధింపులకు గురిచేయగా, మరో ముగ్గురు ఐపీఎస్‌లు నిందితుడికి అండగా నిలిచారు. వీరందరిపై శాఖాపరమైన చర్యల కోసం రంగం సిద్ధం అవుతోంది. సీబీసీఐడీ అధికారుల సమాచారం ఇలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా ఎస్పీ (ఐపీఎస్ అధికారి)ని స్పెషల్ డీజీపీ తన చాంబర్‌కు పిలిపించుకున్నారు. సీఎం భద్రాతా చర్యల గురించి చర్చించాలని నమ్మబలికి తన కారులో ఎక్కించుకుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. స్పెషల్ డీజీపీపై తమిళనాడు హోంశాఖ కార్యదర్శికి, డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు సదరు మహిళా ఎస్పీ సేలం నుంచి చెన్నైకి బయలుదేరింది. అయితే స్పెషల్ డీజీపీ తన పలుకుబడిని ఉపయోగించి ఆమెను వెళ్లకుండా ఉండేందుకు అడ్డుకునేయత్నం చేశారు. మధ్య మండల ఐజీ, మహిళా డీఐజీ, చెంగల్పట్టు ఎస్పీ సహా 50 మందికి పైగా పోలీసులు చెంగల్పట్టు చెక్‌పోస్టు వద్ద దారికాచి, కారును అడ్డగించి రాజీ చర్చలు జరిపారు. అయితే ఇందుకు ఒప్పుకోని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చే తీరుతానని బయలుదేరడంతో ఆమె కారు తాళాలు లాక్కుని ఘర్షణ పడ్డారు. ఎంతో ప్రయాసపడి అనుకున్న ప్రకారం అత్యున్నతాధికారులకు ఫిర్యాదు చేయగలిగారు. ప్రిన్సిపల్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పడి విచారణ చేపట్టగా స్పెషల్ డీజీపీ చేసిన నేరం నిర్ధారణైంది. చెంగల్పట్టు చెక్‌పోస్ట్ వద్దనున్న సీసీ కెమెరాల పుటేజ్‌ను పరిశీలించగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కలిసి అక్కడ నడిపిన రాజీ బాగోతం బయటపడింది. దీంతో స్పెషల్ డీజీపీతోపాటు మిగిలిన ముగ్గురు పోలీస్ అధికారులపైనే కేసు నమోదైంది. స్పెషల్ డీజీపీపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులపై శాఖాపరమైన విచారణ జరగకపోగా యథావిధిగా వారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ముగ్గురిపై చార్జిషీటు దాఖలుకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సీబీసీఐడీ లేఖ రాసింది. ఈ లేఖ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సిఫార్సు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
‘నాతో రాకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా’
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమికుడి లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్‌లో ఉండే ఇంటర్ విద్యారి్థని(16)కి నెల రోజుల క్రితం మెహిదీపట్నానికి చెందిన విద్యార్థి సమద్(22)తో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, కొన్ని రోజులుగా సమద్ ప్రేమ ముసుగులో బాలికను లైంగికంగా లోబర్చుకొనేందుకు యత్నిస్తుండగా నిరాకరిస్తూ వచ్చింది. తనతో రాకపోతే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతడి వేధింపులతో శుక్రవారం తెల్ల వారుజామున బాలిక తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమద్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా బాలిక సూసైడ్ నోట్ రాసింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండఙ: భర్త, అత్తమామల వేధింపుల: ఎందుకిలా చేశావు తల్లీ..! -
మరదలిని ఆరేళ్లుగా వేధిస్తున్న బావ.. దీంతో..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని పదిర, రాచర్ల, గొల్లపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వివాహిత మహిళలను మానసికంగా వేధిస్తున్న ముగ్గురిపై ఆదివారం రాత్రి వేర్వేరుగా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తన సొంత అక్క భర్త వేధిస్తున్నాడని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వివాహిత ఫిర్యాదు మేరకు కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చీకటి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే చనిపోతానంటూ ఆరేళ్లుగా వేధిస్తున్నాడని, పుట్టింట్లో ఉండగా చేయి పట్టుకున్నట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే గొల్లపల్లి గ్రామానికి చెందిన ముద్రకోళ్ల వంశీ అనే వ్యక్తి సహాయంతో కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన పూసల శేఖర్ మూడేళ్లుగా ఫోన్ చేస్తూ వేధిస్తున్నట్లు ఒక వివాహిత ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ప్రేయసిపై కన్నేసిన కంప్యూటర్ సెంటర్ యజమాని, దాంతో
సాక్షి, కేజీఎఫ్(కర్ణాటక): కంప్యూటర్ సెంటర్ యజమాని హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నగరానికి చెందిన రాజేంద్ర ప్రసాద్, మేల్విన్‌లు నిందితులు. కంప్యూటర్ సెంటర్ యజమాని ముకుందన్ వద్ద రాజేంద్రప్రసాద్ ప్రియురాలు పనిచేసేది. ఆమెపై కన్నేసి పెళ్లి చేసుకోవాలని ముకుందన్ వేధించసాగాడు. దీంతో ఆమె పని వదిలేసినప్పటికీ అతడు ఫోన్లు చేస్తూ ఒత్తిడి చేశాడు. దీంతో ప్రేయసి సలహాతో మేల్విన్‌తో కలిసి రాజేంద్ర ప్రసాద్ ముకుందన్‌ను ఏప్రిల్ 28న హత్య చేశాడు. అండర్సన్పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. యువతి పరారీలో ఉంది. చదవండి: ఫేస్బుక్ పరిచయం.. నగ్నంగా వీడియో కాల్.. కట్ చేస్తే.. -
ఏదైనా నిగ్గదీసి అడిగే చైతన్యం ఆమె సొంతం
ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్ కోసం వాళ్ళు చెప్పినట్టు ఆడరు. ఆమె స్టార్లకు గొంతు అరువిస్తారు... కానీ రాజీ పడి గొంతు విప్పద్దంటే ఊరుకోరు. ఆమె జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అయినా సరే తారాలోకంలోని తప్పులుచూసి తల వంచుకు వెళ్ళిపోరు! ఆమె గళంలో ఆవేశం ఉంది. ఆమె అక్షరంలో ఆవేదన ఉంది. ఆమెకంటూ భిన్నమైన ఆలోచనా ఉంది. ఆధునిక స్త్రీ చైతన్యానికి ఓ ప్రతీక – సినీ గాయని చిన్మయి శ్రీపాద. ఏదైనా నిగ్గదీసి అడిగే ఆమె చైతన్యం... ఇవాళ సమాజంలో... ముఖ్యంగా సినీ రంగంలో... ప్రతిధ్వనిస్తున్న చిన్మయ నాదం! చిన్మయ వాదం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా – సాక్షి టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో చిన్మయి శ్రీపాద పంచుకున్న మనోభావాలు... ► మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాదీ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇలాంటి ఓ రోజు ఉంది అంటే... ఇందు కోసం చాలామంది మహిళలు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. దాడులకు లింగభేదం లేదు. అమ్మాయిలపైనే కాదు, అబ్బాయిలపైనా జరుగుతున్నాయి. ► మహిళా దినోత్సవం అని ఏడాదికోసారి మనం జరుపుకొంటున్నాం. ఆ తర్వాత మనం మహిళల గురించి మర్చిపోతున్నాం. ‘కట్నం ఇవ్వకూడదు... అడగకూడదు’ అని మన దేశంలో చట్టం ఉంది. కానీ అమ్మాయికిచ్చే కట్నం మీదే ఆమె లైఫ్ అంతా తిరుగుతోంది. ఇటీవల రష్మీ అనే అమ్మాయి 7 కోట్ల కట్నం ఇచ్చింది. కానీ వేధింపుల వల్ల చనిపోయింది. సో... ఒక అమ్మాయి ఎంత బాధ భరించినా ఫర్లేదు. పెళ్లి చేస్తే చాలనుకుంటున్నారు. చట్టాలున్నా భ్రూణహత్యలు చేస్తున్నారు. ► సోషల్ మీడియాలో ‘అమ్మాయి లంటే ఇలానే ఉండాలి’ అని కొన్ని మీమ్స్ ఉంటాయి. ‘మేం మగాళ్లం, ఫెమినిజం గురించి కూడా మేమే చెబుతాం’ అంటారు. ► ఇప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, గృహహింస జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలపై ఇవి నార్మలే... జరుగుతాయి అంటారు. ఎబ్యూజ్ అనేది నార్మల్ అని మన పేరెంట్స్ మనకు చెబుతున్నారు. కానీ ఎబ్యూజ్ అనేది ఎందుకు నార్మల్? ఒక అమ్మాయిగా నేను ఎందుకు ఎబ్యూజ్కు గురి కావాలి? ► దిశ కేసులో కూడా చూడండి. ‘ఆమె దుప్పటా వేసుకుందా? ఆ టైమ్‌లో ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తోంది? అప్పుడు పెద్ద టైమ్ కూడా కాలేదు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు. అర్ధరాత్రి ఓ మహిళ ఒంటరిగా తిరిగినప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితులు లేవు. ► వైరముత్తు గురించి నేను మొదట్లో మాట్లాడకపోవడానికి కారణం మా అమ్మగారు నన్ను మాట్లాడనివ్వకపోవడమే! మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? సొసైటీలో మనకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయపడ్డారు. ► సోషల్ మీడియాలో నాపై రేప్ థ్రెట్ వస్తే కేసు పెట్టాను. 2011 నుంచి ఆ కేస్ నడుస్తూనే ఉంది. ఇండియాలోనే ఫస్ట్ సైబర్ క్రైమ్ కేస్ అది. ► చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుకంటే ఎక్కువగా మగాళ్ళే ఉన్నారు కదా! ఇక, ఒక కంపెనీలో 10మంది ఉద్యోగులుంటే ఐసీసీ అనేది (ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ) ఉండాలి అనేది రూల్. విశాఖ గైడ్లైన్స్కి తగ్గట్లు అన్ని ఆఫీసుల్లో కమిటీలు న్నాయా? ఎన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి. ► ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడటాన్ని సమాజంలో పెద్ద క్రైమ్‌గా చూస్తారు. ఆ అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఒకవేళ వాళ్లు లవ్‌లో ఉంటే వారి తల్లితండ్రులతో మాట్లాడుకుంటారు. అంతేకానీ... అదొక పెద్ద నేరంలా చూడకూడదు. ఒక అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవడమే తప్పు అనే కల్చర్ మారాలి. కల్చర్ అంటే... నిరంతరం మారుతూ ఉండేది. మనం 1852లో ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? టైమ్‌తో పాటు మారాలి. పాతకాలంలోలాగానే ఉండాలనుకుంటే టీవీలు చూడకూడదు. ఇంటర్నెట్ వాడకూడదు. ► ‘నువ్వు..మగాడివికాబట్టి ఏడవకూడదు. బాధపడకూడదు’ అంటారు. అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికి మూడు నాలుగు గంటలు పడుతుంది అని మాట్లాడుతుంటారు. కానీ మేకప్ ఆర్టిస్టు, హెయిర్ డ్రెస్సింగ్ల పని గురించి కూడా ఆలోచించాలి. మేల్ యాక్టర్‌కు ఫిమేల్ హెయిర్ డ్రెస్సరెందుకు ఉండకూడదు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వర్క్ చేసే మహిళ భానుగారు మేకప్ ఉమన్‌గా యూని యన్‌లో గుర్తింపు కోసం కోర్టుకు వెళ్ళాల్సొచ్చింది. ► నేను సింగర్‌గా వచ్చి 19 ఏళ్లు. నాతో మిస్ బిహేవ్ చేసింది వైరముత్తు ఒక్కరే. మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు. ► నేను ఓపెన్‌గా మాట్లాడుతున్నాను అంటే నాకు మా ఆయన (నటుడు రాహుల్ రవీంద్రన్) మంచి సపోర్ట్ ఇచ్చారు. చాలామంది అమ్మాయిలు ఎందుకు బయటకు చెప్పడం లేదంటే వాళ్ల తల్లితండ్రులే ఫ్రీడమ్ ఇవ్వరు. అన్నదమ్ములే తమ సిస్టర్ను తప్పుపడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చైన్ స్నాచింగ్ గురించి, బ్యాగ్ దొంగతనం గురించి చెప్పొచ్చు. కానీ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి బయటకు చెబితే, అందులో అమ్మాయిల తప్పు ఉన్నట్లు మాట్లాడతారు. దొంగతనం కేసుల్లో దోషులను తప్పుపడితే.... హెరాస్మెంట్ కేసుల్లో మహిళలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. ► రేప్ కేసుల్లో కూడా తొందరగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఇప్పుడు రద్దీ బస్సులో ఒక ఆకతాయి గిల్లితే గిల్లాడు లెమ్మని అమ్మాయిలు చెప్పలేరు. దానికి సాక్ష్యం అంటే ఏం చూపిస్తాం? ► 21వ శతాబ్దంలోనూ సినిమాల్లో మహిళలను భోగవస్తువులుగా చూడటం తగ్గడం లేదు. అమ్మాయి ఒక బికినీ కానీ, చిన్న షార్ట్ కానీ వేసుకుంటే... కెమెరా చూపిస్తుంది ఎక్కడ చూడాలనేది! ఇంగ్లీష్ సినిమాల్లో బికినీ హీరోయిన్స్‌ను మామూ లుగానే చూపిస్తారు. కానీ మన సినిమాల్లో కెమెరా జూమ్‌లో చూపిస్తుంటారు. ► సమంత వండర్ వుమన్ . సమంత కూడా లైంగికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని, గెలిచారు. సమంతకూ, నాకు పూర్వజన్మ కనెక్షన్ ఉందనుకుంటా. రాహుల్, సమంత ఓ తమిళ సినిమా ద్వారా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. నా తెలుగు డబ్బింగ్ కెరీర్ సమంత ద్వారానే మొదలైంది. నా కంటే ముందు రాహుల్, సమంత మంచి ఫ్రెండ్స్. ► నా భర్త రాహుల్ నా కన్నా పెద్ద ఫెమినిస్టు. విపరీతంగా చదివే రాహుల్ నన్ను మార్చాడు. క్యాస్టిజమ్, సెక్సిజమ్ గురించి రాహులే నాకు ఎక్కువ చెప్పాడు. మహిళల డ్రెస్‌తో సంబంధం లేకుండా వారి ఫేస్‌లు చూసే మాట్లాడాలన్నది రాహుల్ నుంచే నేను నేర్చుకున్నా. రాహుల్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టే మేము ప్రశాంతంగా ఉన్నాం. మా ఫ్యామిలీ అంతా బాగుంది. ► సినీ గీత రచయిత వైరముత్తు దుష్ప్రవర్తన గురించి ఓపెన్ గా చెప్పా. కానీ, తమిళ డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవి నన్ను బ్యాన్ చేశారు. కోర్టుకు వెళ్లా. ఇప్పటికీ పోరాడుతున్నా. సింగర్‌గా ఛాన్సులు తగ్గిపోయాయి. బాధగానే ఉంది. కానీ మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు కూడా కొన్ని వార్నింగ్‌లు వచ్చాయి. ‘పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడితే ఐటీ రైడ్స్ జరుగుతాయి’ అని చెప్పారు. ► జర్నలిస్టు ఎం.జె. అక్బర్ లైంగిక వేధింపులపై 20 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ప్రియా రమణి వర్సెస్ అక్బర్ కేసులో తాజా తీర్పు రిలీఫ్. కానీ, నువ్వు రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని రీసెంట్గా ఓ జడ్జ్ అడిగారు. చాలా విషయాలు నేను ఓపెన్‌గా మాట్లాడతా. నా గురించి నేను ఆలోచించను. సొసైటీకి మంచి జరిగితే చాలు. -
అనురాగ్ కశ్యప్‌కు సమన్లు
ముంబై: సినీనటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ముంబై పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. విచారణకు హాజరు కావాలని అనురాగ్ కశ్యప్‌కు సమన్లు జారీ చేశారు. గురువారం వెర్సోవా పోలీసు స్టేషన్‌కు రావాలని పేర్కొన్నారు. అనురాగ్‌పై సెప్టెంబర్ 22న పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయన తనపై 2013లో తనను వేధించాడని పాయల్ ఘోష్ ఫిర్యాదు చేశారు. అనురాగ్‌ను కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
ఇక్కడైతే బతికిపోయేవాడు
హాలీవుడ్ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌కి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యారు హార్వీ. పలువురు నటీమణులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. ఆ తర్వాతే ‘మీటూ ఉద్యమం’ ఊపందుకుంది. ఇటీవల జరిగిన కేసు విచారణలో హార్వీకు 23 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. కోర్టు నిర్ణయంపై పలువురు హాలీవుడ్ హీరోయిన్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హార్వీ వయసు 67 ఏళ్లు. ఇదిలా ఉంటే... ఇండియన్ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం బాగా ఊపందుకోవడానికి కారణం బాలీవుడ్లో నటి తనుశ్రీ దత్తా, సౌత్‌లో సింగర్ చిన్మయి. ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేశారు చిన్మయి. ఇప్పుడు హార్వీకి శిక్ష పడిన విషయాన్ని ఉద్దేశించి ‘‘ఇండియాలో పుట్టి ఉండాల్సింది అని హార్వీ అనుకునే వాడేమో. ముఖ్యంగా తమిళ నాడులో. ఇక్కడ ఉండి ఉంటే పార్టీలు చేసుకునేవాడు. తనకి పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేసుండేవి’’ అని ఇక్కడైతే హార్వీ బతికిపోయేవాడనే అర్థం వచ్చేట్లు చిన్మయి ట్వీట్ చేశారు. -
జైలుకి హార్వీ వెయిన్‌స్టీన్
తమపై లెంగిక వేధింపులు జరిపాడు అంటూ హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై ఆరోపణలు చేశారు పలువురు హాలీవుడ్ నటీమణులు. దాంతో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకుంది. తాజాగా హార్వీ వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమే అంటూ జ్యూరీ తేల్చింది. పన్నెండు మంది (ఏడుగురు మగవాళ్లు, ఐదుగురు ఆడవాళ్లు) సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ జ్యూరీ ఐదురోజులపాటు సమీక్షించి వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలోని నిజానిజాలు తేల్చారు. ఈ కేసులో వెయిన్‌స్టీన్‌కి ఐదేళ్ల నుంచి 25 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందట. మార్చి 11న వెయిన్‌స్టీన్ జైల్‌కి వెళ్లనున్నారు. అయితే ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ‘‘వెయిన్‌స్టీన్ గురించి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్లకి, ఇన్ని రోజులు ఆ బాధను అనుభవించిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మీ ధైర్యం ప్రపంచంలో ఎందరో మహిళలకు పబ్లిక్ సర్వీస్లాంటిది. మరోసారి అందరికీ థ్యాంక్స్’’ అన్నారు నటి ఆఫ్లే జూడ్. వెయిన్‌స్టీన్ గురించి తొలిసారి బాహాటంగా ఆరోపణ చేశారామె. ఆ తర్వాత మిగతావాళ్లు బయటికొచ్చారు. -
జిల్లాల్లో 2 పోక్సో కోర్టులు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం కింద 300 పైగా ఎఫ్ఐఆర్లు పెండింగ్‌లో ఉన్న ప్రతీ జిల్లాలో రెండు ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం రాష్ట్రాలను ఆదేశించింది. 100కు పైగా పొక్సొ కేసులు పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక పొక్సొ కోర్టును ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పష్టతనిచ్చింది. ‘పోక్సో కేసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోక్సో కోర్టుల్లోనే విచారించాలి. ఈ కోర్టులు వేరే కేసులను విచారించకూడదు. జిల్లాల్లో పోక్సో పెండింగ్ కేసులు 100కు పైగా ఉంటే ఒక ప్రత్యేక కోర్టు, 300కు పైగా ఉంటే 2 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి’ అని పేర్కొంది. అయితే, జిల్లాలో 100 కన్నా తక్కువ పోక్సో కేసులు పెండింగ్‌లో ఉంటే.. ఇతర అత్యాచార కేసులను ఆ కోర్టులు విచారించవచ్చని వివరించింది. -
అపరకాళిగా మారి హతమార్చింది
సాక్షి ప్రతినిధి, చెన్నై: వరుసకు సోదరుడైన వ్యక్తి లైంగిక వేధింపులకు ఆమె తట్టుకోలేకపోయింది. అపరకాళిగా మారి అంతమొందించింది. తేనీ జిల్లా ఉత్తమపాళయంకు చెందిన అరటి ఆకుల వ్యాపారి మణికంఠన్ (38)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మణికంఠన్ బావమరిది పాండీశ్వరన్ (30) భార్య నిరంజన (25)లకు ఇద్దరు పిల్లలున్నారు. మణికంఠన్, పాండీశ్వరన్ కొన్నేళ్ల క్రితం టీ బంకు నడిపారు. ఈ సమయంలో నిరంజనపై కన్నేసిన మణికంఠన్ తరచూ సెల్ఫోన్లో ఇబ్బందికరమైన సంభాషణ చేసేవాడు. అనేకసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో భర్తకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కారణంగా టీ బంకును ఎత్తివేసి ఇరువురూ వేర్వేరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అయినా బుద్ధి మార్చుకోని మణికంఠన్ నిరంజనకు సెల్‌ఫోన్ ద్వారా అసభ్య సంభాషణలు కొనసాగించాడు. దీంతో విసిగిపోయిన నిరంజన శనివారం ఉదయం భర్తతో కలిసి మణికంఠన్ దుకాణానికి వెళ్లి నిలదీసింది. ఈ సమయంలో ఘర్షణ వాతావారణం చోటుచేసుకోగా నిరంజన తన వెంట తెచ్చుకున్న కొడవలితో మణికంఠన్‌ను హతమార్చింది. రక్తం మడుగులో ఉన్న మణికంఠన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. భార్యాభర్తలిద్దరూ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా వారిని అరెస్ట్ చేశారు. -
స్విమ్మింగ్ కోచ్‌పై ‘రేప్’ ఆరోపణలు!
పనాజీ: గురుపూజోత్సవం రోజున దేశంలోని ప్రముఖ ఆటగాళ్లెందరో తమకు ఓనమాలు నేర్పిన శిక్షకులను స్మరించుకుంటున్న వేళ... ఒక క్రీడా గురువు ఆ బాధ్యతకు మచ్చ తెచ్చే పని చేశాడు. తన వద్ద శిక్షణ పొందుతున్న ఒక 15 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించి ఛీ కొట్టించుకున్నాడు! గోవా రాజధాని పనాజీలో ఈ ఘటన జరిగింది. బెంగాల్‌కు చెందిన సురజిత్ గంగూలీ అనే స్విమ్మింగ్ కోచ్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండున్నరేళ్లుగా అతను పనాజీలో కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. బాధిత అమ్మాయి కూడా బెంగాల్‌కు చెందినదే. ఈ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక వీడియో బయటకు రావడంతో గంగూలీ నిర్వాకం తెలిసింది. సదరు అమ్మాయి ఫిర్యాదుపై కోల్‌కతా పోలీసులు ముందుగా కేసు నమోదు చేసి దానిని గోవా పోలీసులకు బదిలీ చేశారు. సురజిత్‌పై వేర్వేరు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో రేప్ (376) కూడా ఉంది. ప్రస్తుతానికి సురజిత్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లినట్లుగా తెలిసింది. అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
గదిలోకి వెళ్లగానే వెకిలిగా ప్రవర్తించాడు
ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ దాకా ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ పేరిట వేధిస్తున్నారంటూ ఇప్పటికే పలువురు నటీమణులు ఆరోపణలు చేశారు. తాజాగా నటి విద్యాబాలన్ కూడా కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ముఖ్యపాత్రల్లో జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ మంగళ్’. ఈ నెల 15న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ– ‘‘కెరీర్ తొలిరోజుల్లో చెన్నైలోని ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చి స్టోరీ లైన్ చెప్పాడు. ‘పూర్తి కథ చెప్పడానికి కాస్త సమయం పడుతుంది, రూమ్‌లోకి వెళ్దాం’ అన్నాడు. నేను ఏదైనా కాఫీ షాప్‌లో కలుద్దామని చెబితే అతను అంగీకరించలేదు. తీరా హోటల్ రూమ్‌కి వెళ్లగానే ఆ వ్యక్తి రూమ్ తలుపు వేసి నాతో వెకిలిగా ప్రవర్తించాడు. నాకు కోపం రావడంతో తలుపు తీసి బయటకు పొమ్మన్నాను. అతను నన్ను పైకీ, కిందకీ చూస్తూ వెళ్లిపోయాడు’’ అన్నారు. ఈ సందర్భంలో మరో సంఘటనను గుర్తు చేసుకున్నారామె. ‘‘కెరీర్ ఆరంభంలో నా తల్లిదండ్రులతో కలిసి సినిమా అవకాశాల కోసం ఓ నిర్మాతను కలిశాను. నీది హీరోయిన్ ముఖమేనా? అని ఆ నిర్మాత అన్నారు’’ అని విద్యాబాలన్ పేర్కొన్నారు. -
ట్రంప్ అత్యాచారం చేశారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ఉన్న సమయంలో అమ్మాయిలతో వ్యవహారాలు చాలా నడిపాడని, లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఇప్పటికే చాలా ఉన్నాయి. తాజాగా రచయిత్రి ఈ జీన్ కరోల్ కూడా 1995 సమయంలో ట్రంప్ తనపై అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆమె తన జీవితంలోని అనుభవాల్ని న్యూయార్క్ మ్యాగ్జైన్ కవర్ స్టోరీలో రాస్తూ ఈ ఆరోపణలు చేశారు. మన్హట్టన్లో బెర్గ్‌డోర్ఫ్ డిపార్ట్మెంట్ స్టోర్‌లో తనను కలిసిన ట్రంప్ గర్ల్ ఫ్రెండ్‌కి ఒక గౌను కొన్నానని, అది వేసుకొని చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందంటూ కోరారని వెల్లడించారు. అందుకు అంగీకరించి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లగా ట్రంప్ తనపై అత్యాచారం చేశారని పేర్కొన్నారు. కరోల్ తాను రాసిన కొత్త పుస్తకం వాట్ డూ వి నీడ్ మెన్ ఫర్ పుస్తకం నుంచి కొన్ని భాగాలతో ఈ కథనం రాశారు. ఈ పుస్తకం విడుదల కావల్సింది. ఈ కథనంపై ట్రంప్ స్పందించారు. అసలు కరోల్‌ని తన జీవితంలో ఎప్పుడూ కలవలేదని ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. కరోల్ తన పుస్తకం అమ్మకాలు పెంచుకోవడానికే ఈ కట్టు కథ అల్లి వదిలిందన్నారు. ఆధారాలు లేకుండా న్యూయార్క్ మ్యాగజైన్ ఇలాంటి కథనాన్ని ఎలా ప్రచురిస్తుందని నిలదీశారు. అంత పెద్ద స్టోర్‌లో కెమెరాలు ఉండవా? సేల్స్ అటెండర్స్ ఉంటారు కదా? డ్రెస్సింగ్ రూమ్‌లో అత్యాచారం ఎలా సాధ్యం ? బెర్గ్దోర్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్ వాళ్లు ఎలాంటి వీడియోలు లేవని ధ్రువీకరించారు. ఎందుకు లేవంటే అలాంటి ఘటనే జరగలేదని ఆ ప్రకటనలో వెల్లడించారు. ట్రంప్ అధికారం పీఠం ఎక్కిన దగ్గర్నుంచి కనీసం 20 మంది మహిళలు ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. -
మాజీ మిస్ ఇండియాకు వేధింపులు
కోల్‌కతా: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న తనను కొందరు ఆకతాయిలు వేధించారని మాజీ మిస్ ఇండియా, నటి ఉషోషి సేన్‌గుప్తాను తన ఫేస్బుక్ ఖాతాలో తెలిపింది. 2010లో ఆమె మిస్ఇండియాగా గెలిచారు. కాగా, వేధింపుల వీడియోను ఆమె ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. సోమవారం రాత్రి 11:40 గంటలకు కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. ఉషోషి తెలిపిన వివరాల ప్రకారం.. సహోద్యోగితో కలసి వెళ్తున్న ఉషోషి కారును కొందరు ఆకతాయిలు బైక్‌తో ఢీకొట్టి, కారు డ్రైవర్‌ను బయటకు లాగారు. ఈ గొడవను ఆమె ఫోన్లో రికార్డ్ చేసి కేసు నమోదుచేయాలని దగ్గర్లోని పోలీస్స్టేన్కు వెళ్లారు. ఘటనప్రాంతం తమ పరిధిలోది కాదని చెప్పడంతో ఆమె ఇంటికి తిరుగుపయనమైంది. ఈ సమంలో ఆకతాయిలు మళ్లీ వచ్చి రాళ్లతో దాడి చేశారు. కాగా, ఫేస్బుక్ పోస్టును పరిశీలించిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
నారావారి రాజ్యం.. మహిళకు మరణ శాసనం
‘‘నిర్భయ చట్టాన్ని, గృహహింస చట్టాన్ని, ఇతర మహిళా రక్షణ చట్టాలను కఠినంగా అమలుచేసి విద్యార్థినులపై, మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్టవేస్తాం. జీపీఎస్ టెక్నాలజీ ద్వారాప్రమాదంలో ఉన్న మహిళలకు 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థను తెస్తాం.మహిళల రక్షణకు ప్రత్యేక పోలీస్ విభాగాన్ని (ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్) ఏర్పాటుచేస్తాం’’ – 2014 ఎన్నిలప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ. అక్కడితో ఆగలేదు.. చంద్రబాబు ఉన్నప్పుడు అసలు భయమనేదే లేదు. ఆయన వస్తేనే బాగుంటుందండి. అవునుఆయనొస్తున్నాడు’’– అంటూ 2014 ఎన్నికల సమయంలో టీవీ యాడ్లతో ఊదరగొట్టారు.‘‘మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటాం. బాలికపై చేయి వేయాలంటే భయపడేపరిస్థితిని తీసుకొస్తాం. చట్టాలు కఠినంగా అమలుచేస్తాం’’ అంటూ చంద్రబాబు హడావుడి చేశారు. సీన్ కట్ చేస్తే... 2018 చంద్రబాబు పాలనలో.. గతేడాది జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ)విడుదల చేసిన నివేదిక ప్రకారం – మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 8వ స్థానంలో ఉంది.దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో సగటున 55 మందిపై నేరాలు జరుగుతుండగా..ఏపీలో మాత్రం ప్రతిలక్ష మంది మహిళల్లో 65 మందిపై అఘాయిత్యాలు, అరాచకాలుచోటుచేసుకుంటున్నాయని.. నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. బీహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై నేరాలుఅధికమనే చేదు నిజం గతేడాది రాష్ట్ర ప్రభుత్వాలతో ‘నీతి ఆయోగ్’నిర్వహించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సమీక్షలో వెల్లడైంది! సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని మహిళలందరి భద్రతకు నాది భరోసా.. అంటూ నమ్మబలికి 2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు అధికారం చేపట్టారు. ఆ తర్వాత కూడా మహిళలు, బాలికల భద్రతపై అనేక వేదికలపై, సభల్లో చంద్రబాబు ఉపన్యాసాలు దంచేశారు. మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత తనదేనన్నారు. మరి ఈ రోజు రాష్ట్రంలోని మహిళలకు రక్షణ ఉందా? కనీసం పట్టపగలైనా ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వచ్చే పరిస్థితి ఉందా?! అంటే.. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందనేది వార్షిక క్రైమ్ నివేదికలే బట్టబయలు చేస్తున్నాయి. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇందులో చాలావరకు స్వయంగా చంద్రబాబు పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులే దారుణాలకు పాల్పడుతుండటం తెలిసిందే. ఓవైపు మహిళకు రక్షణగా నిలవాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అబలలపై దాడులు, వేధింపులు, దౌర్జన్యాలకు దిగుతుంటే... నేరాలకు పాల్పడుతున్న తమ నాయకులను కాపాడేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుండటం నిర్ఘాంత పరుస్తోంది. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు సర్కారు.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతీయేటా మహిళలపై నేరాలు పెరుగుతూనే వచ్చాయి. చంద్రబాబు పాలనలో మంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. సర్పంచ్ నుంచి జన్మభూమి గ్రామ కమిటీ సభ్యుడి దాకా.. సాగిస్తున్న దౌర్జన్యకాండకు అడ్డూ అదుపులేకుండా పోయింది. టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెట్రేగిపోయిన ఘటనల్లో ప్రభుత్వ అధికారులు సైతం బాధితులుగానే మిగిలారు. గత ఐదేళ్లలో మన కళ్లముందే.. మహిళలపై ఎన్నో నేరాలు జరిగాయి.. ♦ ముఖ్యంగా ర్యాగింగ్ భూతం, లైగింక వేధింపులకు బలైన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి.. ♦ ప్రొఫెసర్ల వేధింపులతో వైద్య విద్యార్థిని సంధ్యారాణి బలవన్మరణం.. ♦ లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న జూనియర్ డాక్టర్ శిల్ప.. ♦ టీడీపీ నేతల దన్నుతో అమాయక మహిళలను వ్యభిచారంలోకి నెట్టిన కాల్‌మనీ సెక్స్ రాకెట్.. ♦ ఇసుక మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని దాడి.. ♦ ఇలా చెప్పుకుంటూపోతే.. గత ఐదేళ్ల నారా వారి పాలనలో.. ఎక్కడ చూసినా అబలలపై అకృత్యాలే.. మహిళలపై నేరాల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టాప్– నిగ్గు తేల్చిన ఏడీఆర్ నివేదిక ఏపీలో ఆడబిడ్డలపై పెచ్చుమీరిన ‘పచ్చ’ నేతల కీచక పర్వాన్ని జాతీయ స్థాయి సంస్థలు నిగ్గుతేల్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సాగించిన కీచకపర్వాలను స్వచ్చంద సంస్థలు బట్టబయలు చేశాయి. మహిళలపై దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన వారి గురించి ప్రపంచానికి చాటాయి. ‘మహిళలపై నేరాల కేసుల్లో చట్టసభ్యులు’ అనే అంశంపై అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), జాతీయ ఎన్నికల పరిశీలన స్వచ్ఛంద సంస్థలు అధ్యయనం చేసిన నివేదికను గతేడాది వెల్లడించాయి. రాష్ట్రానికి చెందిన ఐదుగురు టీడీపీ ప్రజాప్రతినిధులు మహిళలపై పాల్పడ్డ నేరాలకుగానూ నమోదైన కేసులను నివేదికలో స్పష్టం చేసాయి. ఇక మహిళలపై దాడులకు పాల్పడిన కేసుల్లో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. మహిళలను అగౌరవ పర్చడంలో రాష్ట్రం ఫస్ట్ గతేడాది జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం– తొలి పది స్థానాల్లో ఏపీ ఉండటం గమనార్హం. అందులోను మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 8వ స్థానంలో ఉంది. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అనే నినాదం బస్సుల్లోను, గోడలపైన రాతలకే పరిమితం అవుతోంది. మహిళలను అగౌరవపర్చడంలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని ఇటీవల జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) రిపోర్టు తేటతెల్లం చేసింది. మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు, బహుభార్యత్వం, మహిళల కిడ్నాప్‌లు, గృహహింస.. ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో మహిళలు పడుతున్న వేదన వర్ణనాతీతం. గడిచిన ఐదేళ్లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 82,502 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యాచారాలు, వేధింపులు, దాడులు, అవమానాలే 44,780 కేసులు ఉన్నాయి. 2014 నుంచి 2018 వరకు మహిళలపై నేరాలను గమనిస్తే ప్రతి యేటా పెరుగుతూనే ఉన్నాయి. మరెవరికీ ఇలాంటి కడుపు కోత వద్దు మా కుమార్తె రిషితేశ్వరి 2015 జూలై 14వ తేదీన ఏఎన్‌యూలో హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావుతో పాటు, కొందరు సీనియర్ విద్యార్థుల వేధింపుల వల్లే మా పాప ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె డైరీలో పది పేజీలకు పైగా సూసైడ్ నోట్ రాసింది. అప్పట్లో న్యాయం కోసం కొన్ని నెలలు పోరాటం చేసిన తర్వాత ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన విచారించి నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరాం. అయితే ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం మేము కాకినాడలో ఉంటున్నాం. నాలుగేళ్లుగా గుంటూరు కోర్టుకు న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నాం. కేసును త్వరితగతిన విచారించి మా కుమార్తె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. మరే తల్లిదండ్రులకు ఇలాంటి కడుపు కోత రాకుండా చర్యలు తీసుకోవాలి. – రిషితేశ్వరి తల్లిదండ్రులు వేధింపులకు బలైన రిషితేశ్వరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం, లైగింక వేధింపులతో తీవ్ర అవమానభారంతో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి 2015 జూలైలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చంద్రబాబు ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనం. రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ సైతం ర్యాగింగ్, లైంగిక వేధింపుల కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని ప్రభుత్వానికి అప్పట్లో నివేదిక సమర్పించింది. రిషితేశ్వరి ఆత్మహత్యకు ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు కారణమని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. బాబూరావు అండదండలతో వర్సిటీలో అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు నివేదికలో పేర్కొంది. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విచారణ కమిటీ సిఫార్సు చేసింది. ర్యాగింగ్‌పై నిర్భయ చట్టం కన్నా గట్టి చట్టం తీసుకురావాలని నివేదికలో సూచించింది. రిషితేశ్వరి ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో చంద్రబాబు అప్పుడు హడావుడి చేసి.. ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం.. దోషులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలతో ప్రజల నుంచి విమర్శలను మూటగట్టుకుంది. సిట్‌తో శిల్ప కేసు దారి మళ్లింపు.. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జూనియర్ డాక్టర్ శిల్ప 2015–16లో తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో పీజీలో చేరింది. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ 2017 ఏప్రిల్‌లో శిల్ప ఈ–మెయిల్లో గవర్నర్ నరసింహన్, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఈ విషయంపై విచారించాలంటూ విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వీసీని గవర్నర్ ఆదేశించారు. దీనిపై తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన కమిటీ విచారణలో శిల్ప ఆరోపణల్లో నిజంలేదని నివేదిక ఇచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్లు పనిచేసే మెడికల్ కాలేజీ నుంచే కమిటీ వేస్తే.. నిజాలు వెలుగులోకి రావనే లాజిక్‌ను ప్రభుత్వం విస్మరించింది. వేధింపులు ఆగకపోవడంతో జూనియర్ డాక్టర్ శిల్ప డిపార్టుమెంట్‌కు సంబంధంలేని వారితో విచారణ చేయించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తిరుపతి సబ్‌కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ వేసిన కమిటీ నాలుగు నెలలైనా వాస్తవాలు వెల్లడించలేదు.ఈలోపే వచ్చిన పీజీ ఫలితాల్లో థియరీలో ఉత్తీర్ణత సాధించిన ఆమె.. ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ అయ్యింది. తమపై ఫిర్యాదు చేసిందనే కక్షతోనే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేయడంతో తీవ్ర ఆవేదనకు గురైన శిల్ప 2018,ఆగస్టు7న పీలేరులో ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప మరణానికి ప్రభుత్వమే కారణమంటూ అప్పట్లో విద్యార్థిలోకం, మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ఆ తర్వాత శిల్ప కేసును సిట్ పేరుతో దారి మళ్లించారు. లైంగిక వేధింపులపై ఆమె ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం స్పందించి ఉంటే శిల్ప ప్రాణం దక్కేదని ఆమె బంధువులు, తోటి జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంధ్యారాణి ప్రాణం తీసిన ప్రొఫెసర్ల వేధింపులు గుంటూరులో ప్రొఫెసర్ల వేధింపులు మెడికో సంధ్యారాణి ప్రాణం తీశాయి. 2016లో వైద్య విద్యార్థిని సంధ్యారాణి బలవన్మరణానికి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్త విజయసారథిని కాపాడేందుకు టీడీపీ కీలక నేతలే ప్రయత్నాలు చేయడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. సంధ్యారాణి ఆత్మహత్య అనంతరం ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్త విజయసారథి తప్పించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు 23 ప్రాంతాలకు వెళ్లినట్టు పోలీసులు అప్పట్లో నిర్ధారించారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం తాత్కాలికంగా హడావుడి చేసిందే తప్ప కఠిన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌కు టీడీపీ నేతల దన్ను అధికార తెలుగుదేశం పార్టీ నేతల దన్నుతో రాజధాని ప్రాంతమైన విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. 2015 డిసెంబర్లో వెలుగుచూసిన ఈ వ్యవహారంలో.. కీలక సూత్రధారులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉండటంతో పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోలేదు. చివరకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో దోషులను అరెస్టు చేయక తప్పలేదు. అప్పులు ఇచ్చి మహిళలను బలవంతంగా లొంగదీసుకోవడంతోపాటు, వారిని వ్యభిచార కూపంలోకి దించుతున్నకాల్మనీ(అధిక వడ్డీలకు అప్పులిచ్చే) ముఠాకు ఆర్థిక వనరులుసమకూర్చుతున్నది అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులేననితేలడంతో కొందరిని అరెస్టు చేసి.. కేసును మూసేయడం గమనార్హం. మహిళా తహసీల్దార్పైచింతమనేని దౌర్జన్యం తమ్మిలేరులో అక్రమంగా ఇసుక తవ్వి తరలించుకుపోతున్న మాఫియాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై.. టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్ 2015 దాడి ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ఆగడాలు మితిమీరాయి. కాగా, సచివాలయం సాక్షిగా ఒక మహిళా అధికారిని లైంగికంగా వేధించిన మరో మంత్రిపైన, రాష్ట్రంలో మహిళపై దాడులు, వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతలపైన.. చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలా చంద్రబాబు సర్కారు ఉదాసీన వైఖరి కారణంగా రాష్ట్రంలో మహిళలపై నేరాలు,ఘోరాలు పెరగడానికి ఊతమిచ్చినట్టు అయ్యిందని ప్రజానీకం అంటోంది. రాష్ట్రంలో చింతమనేని టాప్ ⇔ అత్యంత వివాదాస్పదుడిగా పేరొందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఏకంగా 23 కేసులు నమోదైనట్టు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. వాటిలో తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు ఉన్నవి 13 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో మొత్తం 75 సెక్షన్ల కింద అభియోగాలున్నాయి. ⇔ రాష్ట్ర మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుపై 13 కేసులు నమోదు కాగా, అందులో ఒకటి తీవ్రమైన కేసు. మొత్తం 42 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. ⇔ మరో మంత్రి అచ్చెన్నాయుడుపై 3 అభియోగాల కింద ఒక కేసు నమోదైంది. ⇔ విశాఖపట్నం పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై నాలుగు కేసులున్నాయి. వీటిల్లో ఐపీసీకి సంబంధించి మొత్తం 21 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ⇔ అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యానారయణ (వరదాపురం సూరి)పై మొత్తం 10 కేసులుండగా.. 8 తీవ్రమైన కేసులు. దేశవ్యాప్తంగా రేప్ సంబంధిత కేసులు ఎదుర్కొంటున్న వారు ముగ్గురు సభ్యులు ఉండగా.. అందులో ధర్మవరం ఎమ్మెల్యే ఒకరు. వీరిపై మహిళా వేధింపుల కేసులే కాకుండా.. మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. మచ్చుకుమరికొన్నినేరాలు,ఘోరాలు ⇔ తమ్మిలేరులో ఇసుక మాఫియాను నిజాయితీగా విధులు నిర్వర్తించి 2015 జూలై 8న అడ్డుకున్న మహిళా తహసిల్దార్ వనజాక్షిపై టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడిచేసి ఏళ్లు గడిచినా.. కనీస చర్యలు తీసుకోని చంద్రబాబు సర్కారు ఆమెకు న్యాయం చేయడంలో ఘోరంగా విఫలమైంది. ⇔ చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు తహసిల్దార్ నారాయణమ్మపై 2015 జూలైలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ రమణారెడ్డి, తన అనునయులతో కలిసి దాడి చేసి దుర్బాషలాడినా చంద్రబాబు సర్కారు కనీసం స్పందించలేదు. ⇔ అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత పర్యటనలో నిరసన తెలిపిన మహిళలపై మంత్రి సోదరుడు మురళీ తన ప్రతాపం చూపించడంతో మహిళలకు తీవ్ర గాయాలుకావడం బాధాకరం. ⇔ అనంతపురం రూరల్ పూలకుంట గ్రామంలో రెచ్చిపోయిన అధికారపార్టీ నాయకులు ఒంటరిగా నివసిస్తున్న మహిళ కవితపై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంరేపింది. బాధితురాలు ఇటుకలపల్లి పోలీసులనుఆశ్రయించి మొరపెట్టుకుని లిఖితపూర్వక ఫిర్యాదు చేసినా నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ⇔ పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు.. జనచైతన్య యాత్ర సమయంలో నిరసన తెలిపిన మహిళలపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టడం సంచలనం రేపింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఐదేళ్లుగా కొనసాగిన అనేక టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలకు అంతేలేదు. ⇔ తన ఇంటి వద్ద తొట్టె కడుతున్నందుకు ప్రశ్నించిందన్న అక్కసుతో అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లిలో సుధమ్మ అనే మహిళపై సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ నాయకుడు చంద్ర కలిసి ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చి ఈడ్చి కొట్టి దారుణంగా దుర్బాషలాడుతూ దుశ్శాశన పర్వాన్ని తలపించారు. కంటి చూపు కూడా సరిగా లేని ఒంటరి మహిళ సుధమ్మను నడిరోడ్డుపై చెప్పుకాళ్లతో ఎగిరెగిరి తంతుంటే నిస్సహాయతతో విలవిల్లాడిపోయింది. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అనుచరుడైన నాగరాజు చేసిన ఈ అకృత్యం దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వీడియోగా హల్ చల్ చేసినా కనీస చర్యలు లేవు. ఇంత జరిగితే.. ’అయ్యా..న్యాయం చేయండ’ని బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే నిందితులను పిలిపించి బెయిల్ ఇచ్చి పంపించేశారు. కిడ్నాప్‌లు.. రేప్లుభయపెడుతున్నాయి రాజధానిలోని గుంటూరు జిల్లాతోపాటు నెల్లూరు జిల్లాలోనుకిడ్నాప్లు, రేప్‌లు ఆందోళనకలిగిస్తున్నాయి. ఇక అత్యాచార కేసుల్లో పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లోనిలిచాయి. గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చిన్నారులపై దాడులు, లైంగిక దాడులు పోలీసులకు సవాలుగా మారాయి. నీతి ఆయోగ్ నివేదికలోను నివ్వెరపరిచే నిజాలు..: ఏపీలో మహిళలపై నేరాల సంఖ్యకు అడ్డుకట్ట పడడం లేదని, దేశ సగటును మించి రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరుగుతున్నాయంటూ.. నీతి ఆయోగ్ నివ్వెరపరిచే నిజాలు వెల్లడించింది. దేశంలో ప్రతీ లక్ష మంది మహిళల్లో సగటున 55 మందిపై నేరాలు జరుగుతుండగా, ఏపీలో మాత్రం ప్రతి లక్ష మంది మహిళల్లో 65 మందిపై అఘాయిత్యాలు, అరాచకాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మహిళలపై ప్రధానంగా అత్యాచారాలు, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బీహార్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల కంటే ఏపీలోనే మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి -
నాని అనుచరుడిని ఎవడ్రా నాపై చేయి వేసేది..
పులివర్తి నాని.. రెండేళ్ల క్రితం వరకు ఈ పేరంటే జిల్లాలో ఎవరికీ తెలియదు. చినబాబు పుణ్యామా అంటూ పదవి అలా చేతికి వచ్చిందో లేదో జిల్లాలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. వీధి ఏదైనా, వాడ ఏదైనా తన దౌర్జన్యానికి దాసోహం అనాల్సిందేనంటున్నారు. ఇక ఆయన అనుచరగణం మామూలుగా ఉంటుందా? అదే స్థాయిలో రెచ్చిపోతోంది. సాక్షి, తిరుపతి : నాని పేరు చెప్పి చిత్తూరు నుంచి చంద్రగిరి దాకా దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. పిస్తోలుతో బెదిరింపులకు దిగినా, దళితులపై దౌర్జన్యాలు చేయించినా ఆయన హవా నడుస్తూనే ఉంది. ప్రశ్నించే పోలీసు లేడు...ఇదేంటని అడిగే అధికారీ లేడు. ‘నేను నాని అనుచరుడిని ఎవడ్రా నాపై చేయి వేసేది’ అంటూ నడిరోడ్డుపై సినీ ఫక్కీలో పట్టాకత్తితో హల్చల్ చేసినా పోలీసులకు అటువైపు చూసే ధైర్యం కూడా లేదు. ఇంతకీ ఇంత ధైర్యం, దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? అంతా ‘చినబాబు(లోకేష్)కు నేను ఎంత చెప్పితే అంతే’ అని మభ్యపెడుతూ, కలరింగ్ ఇస్తూ అధికారులను హుకుం జారీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కేవలం కోడిని దొంగతనం చేశాడని వడ్డెర కులానికి చెందిన వ్యక్తిని మూడు గంటపాటు నిర్బంధించి చేయి విరిచి, చిత్రహింసలకు గురి చేసి చంపేస్తామని బెదిరించిన ఘటన వెలుగు చూసింది. ఇందులో నాని ప్రధాన అనుచరుడు చిట్టిబాబు నాయుడు నిందితుడు. అయినా సరే ఇతడ్ని అరెస్టు చేయలేదు. పోలీసులు బెయిలబుల్ సెక్షన్ కింద కేసు పెట్టి చేతులుదులుపుకున్నారు. అతనిపై ఈగ కూడా వాలనివ్వకుండా నాని అనే పేరు కాపాడుతోంది. దాష్టీకాలకు సాక్ష్యాలు.. ♦ చంద్రగిరి మండలం మొరవపల్లి దళితవాడకు చెందిన పుత్తా రవి అనే దళితుడిని నాని అనుచరులు గతేడాది నవంబర్ 13న హత్య చేయడానికి ప్రయత్నించారు. పండుగ సందర్భంగా తనకు ఇష్టమైన నాయకుడి ఫొటోతో ఫ్లెక్సీలను వేయటమే ఆ దళితుడు చేసిన పాపం. అతన్ని వెంటాడి కారుతో గుద్దించి, కర్రలు, రాడ్లతో చంపేందుకు నాని అనుచరులు ప్రయత్నించా రు. రోడ్డుపై వెళ్లే వాహనాల్లోని ప్రయాణికులు గుర్తించి అడ్డుకోకుంటే అతన్ని అక్కడే చంపేసేవాళ్లు. హత్యాయత్నం వల్ల అతను వినికిడి శక్తిని కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితులను మాత్రం అరెస్ట్ చేయలేదు. ♦ గత నెల 18న తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో దళితుడైన శ్రీరాములను అంతు చూస్తామంటూ నాని రెచ్చిపోయాడు. సాక్ష్యత్తు నానినే దౌర్జన్యాలకు, బెదిరింపులకు దిగటంతో అదే సమయంలో అతని అనుచరులు సైతం రెచ్చిపోయారు. ♦ గత నెల 21న తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడులో ఫ్లెక్సీల రగడతో నాని అనుచరులు రెచ్చిపోయి నిఖిల్ అనే వ్యక్తిపై హత్యాయత్నంకు ప్రయత్నించారు. కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసినా చర్యలు మాత్రం అంతంతమాత్రమే. ♦ ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలోని ముంగిలిపట్టులో దామోదర్నాయుడుపై చిత్తూరు నుంచి వచ్చిన నాని అనుచరులు దాడి చేశారు. తమకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను పెట్టారని జాతీయ రహదారిపైనే తరిమి తరిమి కొట్టారు. ప్రాణాలను కాపాడాలని ఆ వృద్ధుడు చేసిన ఆర్తనాదాలను రోడ్డు వెంట వెళ్లే ప్రయాణికులు విని, అతన్ని కాపాడారు. ♦ 2017లో చిత్తూరు చర్చి వీధిలో పూలమార్కెట్ తొలగింపునకు సంబంధించి వివాదం నెలకొంది. ఈ ఘటనలో స్థానిక మాజీ ఎమ్మెల్యే, నానికి మధ్య వాగ్వాదం జరిగింది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతో సహా పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో తన వద్ద ఉన్న తుపాకీ తీసుకున్న నాని కాల్పులు జరపబోయాడు. పక్కనే ఉన్న వ్యక్తి తుపాకీ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. దీనిపై ఎక్కడా ఎలాంటి కేసూ నమోదు కాలేదు. ♦ గతేడాది చిత్తూరు బజారు వీధిలో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తుండగా శరవణ అనే వ్యక్తి పట్టాకత్తితో హల్చల్ చేశాడు. ‘‘నేను నాని అనుచరుడిని ఎవర్రా నాపై చేయి వేసేది? తలలు తీసుకెళుతా..’’ అంటూ నడిరోడ్డుపై కత్తిను గీటుతూ మోహన్ అనే వ్యక్తిని నరికాడు. ఈ వీడియో చక్కర్లు కొట్టగా తప్పనిసరి పరిస్థితుల్లో శరవణపై పోలీసులు కేసు పెట్టారు. ఇదే సమయంలో నాని మాటకాదలేక శరవణ నుంచి ఓ ఫిర్యాదు తీసుకుని మోహన్‌పై కూడా కేసు పెట్టి అరెస్టు చేశారు. ♦ ఇప్పుడు పెనుమూరుకు చెందిన వేణుగోపాల్ అనే వడ్డెర కులస్తుడిపై నాని అనుచరుడు చిట్టిబాబు నాయుడు దాడి చేసి, చంపుతామంటూ బెదిరించిన వీడియో బయటకొచ్చింది. మనిషి మానవత్వం మరచి ఎలా ప్రవర్తిస్తాడనే దానికి ఈ వీడియోనే నిదర్శనం. ఇదే చిట్టిబాబునాయుడు చిత్తూరు టూటౌన్ కానిస్టేబుల్‌తో గొడవపడ్డాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. నాని ప్రోద్బలంతో చిట్టిబాబునాయుడుపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. పోలీసులు అష్రాఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వేణుగోపాల్‌కు చేయి విరిగినా, తీవ్ర రక్తగాయాలైనా, చంపేస్తామని బెదిరించినా నాన్‌బెయిలబుల్ సెక్షన్ ఎక్కడా నమోదు కాకపోవడం కొసమెరుపు. -
ఆమె.. బీటెక్... అతడు ఇంటర్మీడియట్
చౌటుప్పల్ (మునుగోడు) : భార్యపై అనుమానంతో కూతురుని కడతేర్చిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల ను బుధవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ బాపురెడ్డి వెల్లడిం చారు. మండలంలోని దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన సిలివేరు శివకుమార్‌కు హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు చెందిన అక్షర అలియాస్ స్వప్నతో గత ఏడాది ఆగస్టు 16న వివాహం జరి గింది. శివకుమార్ కుటుంబం జీవనోపాధి నిమి త్తం సమీపంలోని ఎల్లగిరి గ్రామం వద్ద కిరాణం షాపు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి సంసారం రానురాను గొడవలకు దారితీసింది. శివకుమార్ తరుచూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో అక్షర గర్భం దాల్చింది. మొదటి కాన్పుకావడంతో ప్రసవం కోసం తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అక్కడే ఈ ఏడాది ఆగస్టు 1న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు బారసాల చేసి నిహారిక అనే పేరు పెట్టారు. మూడు నెలల అనంతరం దీపావళి పండుగకు అక్షర చంటిబిడ్డతో కలిసి అత్తగారి ఇంటికి వచ్చింది. నిత్యం భార్యపై అనుమానమే.. శివకుమార్ ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాడు. తన భార్య అక్షర బీటెక్ పూర్తి చేసింది. తనకంటే ఎక్కువగా చదువుకుందని భార్యను అనుమానించేవాడు. ఇంటి వద్ద ఖాళీ సమయంలో అక్ష ర ఫోన్ మాట్లాడేది. తనను కాకుండా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో దంపతుల నడుమ నిత్యం గొడవలు జరిగేవి. బిడ్డ తనకు పుట్టలేదని.. ఇప్పటికే భార్యతో నిత్యం గొడవ పడుతున్న శివకుమార్ బిడ్డ జన్మించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైన కూతురిని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సరైన సమయం కోసం వేచివున్నాడు. ఈ క్రమంలోనే శివకుమార్ తల్లిదండ్రులు ఈనెల 11న దీపావళి నోముల కోసం తమ సొంత గ్రామమైన నాగారం వెళ్లారు. ఆరోజు తమ తల్లిదండ్రులు కొయ్యలగూడెం రారని గ్రహించిన శివకుమార్ ఇదే అదునుగా భావించాడు. ఎలాగైన బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో భార్యతో గొడవపడ్డాడు. కొంత సేపటికి భార్య బయట ఉన్న బాత్రూంకు వెళ్లింది. వెంటనే మంచంపై నిద్రిస్తున్న బిడ్డను గొంతు నులిమి తలను మంచానికి కొట్టాడు. ఈ శబ్దానికి బయట ఉన్న అక్షర పరుగున లోనికి వెళ్లింది. అప్పటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి అక్షర ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. అందులో భాగంగా మంగళవారం అరెస్టు చేశామన్నారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై చిల్లా సాయిలు ఉన్నారు. -
ప్రశ్నించడం మానండి
‘మీటూ’ అంటూ ఇండస్ట్రీలో హీరోయిన్లు తాము ఎదుర్కొన్న వేధింపులను బయటకు చెబుతున్నారు. చాలా మంది నటీమణులు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి, ‘అన్నమయ్య’ ఫేమ్ కస్తూరి కూడా ‘మీటూ’ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. ఈ విషయం గురించి కస్తూరి మాట్లాడుతూ– ‘‘పబ్లిసిటీ కోసమే హీరోయిన్లు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాటిని వ్యతిరేకిస్తున్నాను. ఎవరైనా ఒక స్త్రీ వచ్చి తనకు ఇలా జరిగిందని చెప్పగానే మనం చేసే మొదటి పని తనని జడ్జ్ చేయడం. ఇలా ఆరోపించడం వల్ల తనకు లాభం ఏంటి? అని ఆలోచిస్తున్నారు కూడా. అలాంటి సంఘటనలు బయటకు చెప్పడానికే ఎంతో ధైర్యం కావాలి. ఇలా చెప్పడం వల్ల తను ఏదో సాధిస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. తప్పుడు ఆరోపణలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాలని, పాపులర్ అవ్వాలని ఏ స్త్రీ కోరుకోదు. మనం అనవసరంగా ప్రశ్నిస్తే ఇంకెప్పుడూ ఎవరూ ముందుకు వచ్చి తమ వేదనను పంచుకోరు. ‘ఈ విషయం జరిగినప్పుడే ఎందుకు బయటకు చెప్పలేదు?’ అని చాలామంది అంటుంటే విన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవ్వరైనా వాటి నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తుంటారు తప్పితే కంప్లయింట్ ఇవ్వాలనుకోరు. నేనిచ్చే సలహా ఏంటంటే స్త్రీలను ప్రశ్నించడం మానేసి, అలాంటి ఇబ్బందులు పెట్టిన వారి నుంచి సమాధానాలు రాబట్టడం మంచిదనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
గూగుల్‌కు ఉద్యోగుల షాక్
సింగపూర్/న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో పనిచేసే ఉద్యోగులు గురువారం ఆ సంస్థకు షాక్ ఇచ్చారు. మహిళా ఉద్యోగులపై లైంగికవేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల విషయంలో సంస్థ పక్షపాతంతో వ్యవహరించడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులు వాకౌట్ నిర్వహించారు. తొలుత జపాన్ రాజధాని టోక్యోలో ఉదయం 11.10 గంటలకు గూగుల ఉద్యోగులు అందరూ కంపెనీ నుంచి బయటకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం అమెరికా, భారత్, స్విట్జర్లాండ్, సింగపూర్, బ్రిటన్ సహా పలుదేశాల్లోని వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఉదయం 11.10కు(స్థానిక కాలమానం ప్రకారం) కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు. ఆండ్రాయిడ్ ఓఎస్ సృష్టికర్త ఆండీ రూబిన్, డైరెక్టర్ రిచర్డ్ డీవౌల్ సహా కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై గూగుల్ దశాబ్దకాలం పాటు మౌనం పాటించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల సంచలన కథనాన్ని ప్రచురించింది. కాగా, వేధింపులపై కోర్టును ఆశ్రయించేలా నిబంధనల్లో సవరణ, స్త్రీ–పురుషులకు సమాన వేతనం, కంపెనీ బోర్డులో తగిన ప్రాధాన్యం కల్పించడం వంటి సంస్కరణలు చేపట్టాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. -
నిజానిదే గెలుపు
‘‘చదువుకునే రోజుల్లో ఇంట్లో తినడానికి తిండి లేకపోతే మా నాన్నగారు తోటల్లో రెండు టమాటా పండ్లు కోసుకుని తిని, పరీక్షలకు వెళ్లిన రోజులు ఎవరికీ తెలియవు. కాలేజీ ఫీజు 150 రూపాయలు కట్టడానికి అప్పు కోసం ఎన్ని ఊళ్లు తిరిగి, ఎన్ని అవమానాలు భరించారో ఎవరికీ తెలియదు. హైస్కూల్‌కి వెళ్లేవరకూ కాళ్లకు చెప్పులు లేకుండా రాళ్లు, ముళ్లు గుచ్చుకున్నా లెక్కచేయక వెళ్లి చదువుకున్న రోజులు తెలియవు. అమ్మా, నాన్నలది ప్రేమ వివాహం. ఒక్క ఫ్యాన్ వసతి కూడా లేని ఇంట్లో ఒకరు తమిళ టీచర్‌గా, ఒకరు కవిగా ఇద్దరు కన్నబిడ్డల ఆలనా పాలనా చూసుకోవడానికి పడిన తిప్పలు తెలియవు. ఒక మారుమూల గ్రామం నుంచి నగరానికి వచ్చి, దేశంలో ఉన్న ప్రముఖుల్లో ఓ ప్రమఖుడిగా ఎదిగిన మా నాన్న గురించి ఈ ‘టెక్నాలజీ యువత’కు ఏం తెలుసు? ఎంతో ఎత్తుకి ఎదిగిన నాన్నగారి జీవితం యువతకు ఎంతో ఆదర్శప్రాయం. ఆయన అందుకోని అవార్డులు లేవు. ప్రశంసలు లేవు. అలాంటి ఆయన కీర్తి ప్రతిష్టలకు మకిలి పట్టించడానికి ప్రయత్నిస్తున్నవారిని చూస్తే జాలిగా ఉంది’’ అని ‘నిజానిదే గెలుపు’ అంటూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు తనయుడు, రచయిత కబిలన్ ట్వీటర్లో ఓ సుదీర్ఘ లేఖను పొందుపరిచారు. వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చి దాదాపు 15 రోజులు పైనే అయింది. ‘‘ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు స్పందించడానికి కారణం ఇంత సుదీర్ఘంగా రాసే మానసిక స్థితి లేకపోవడమే’’ అన్నారు కబిలన్. ‘‘ఆధారాలు లేకుండా పురుషులను స్త్రీలు, స్త్రీలను పురుషులు నిందించడం అనే ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరమైనది. మన దేశం ప్రధాన బలం మన కట్టుబాట్లు. అవి ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కొంతవరకూ మనల్ని కాపాడటానికి కారణమయ్యాయి. పాశ్చాత్య ప్రభావం మెల్లిగా మన కుటుంబ కట్టుబాట్ల నాశనానికి కారణమవుతోంది. మా నాన్నగారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం వెనక పొలిటికల్ ఎజెండా ఉందని కొందరు, అలాంటిదేమీ లేదని మరికొందరు అంటున్నారు. ఎవరు ఏమన్నా చట్టపరమైన చర్యల ద్వారా న్యాయం జరుగుతుందన్నది నా అభిప్రాయం. ఈ మొత్తం సమస్య (ఆరోపణలు) ఓ మెగా ఈవెంట్‌లా అయిపోయింది. అది మనల్ని దేశంలో ఎన్నో ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తోంది. ‘మీటూ’ అంటూ ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమం ఏ దిశలో వెళుతోందో చెప్పేంత పరిపక్వత నాకు లేదు’’ అంటూ పలు విషయాలు పంచుకున్నారు. ఈ ట్వీట్‌ని వైరముత్తు మరో కుమారుడు, కబిలన్ సోదరుడు మదన్ కార్కీ రీ–ట్వీట్ చేశారు. అయితే కబిలన్ ట్వీట్‌కి పలు విమర్శలు వచ్చాయి. ‘‘మా నాన్నగారు అన్ని కష్టాలు పడ్డారు.. ఇన్ని కష్టాలు పడ్డారు అని చెప్పావు కానీ, మా నాన్న నిజాయితీపరుడు, మా అమ్మకు ద్రోహం చేయలేదు. ఏ అమ్మాయి దగ్గరా తప్పుగా ప్రవర్తించలేదని బలంగా చెబుతున్నాను అని మీరు చెప్పకపోవడానికి కారణం మీ మనసాక్షి ఒప్పుకోకపోవడమే’’ అని కొందరు విమర్శించారు. -
హీరో అర్జున్‌పై నటి శ్రుతి ఫిర్యాదు
బెంగళూరు: బహుబాషా నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ లైంగికంగా వేధిస్తూ తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించాడని బెంగళూరు లోని పోలీస్‌స్టేషన్‌లో హీరోయిన్ శ్రుతి హరిహరణ్ ఫిర్యాదు చేశారు. 2016లో విడుదలైన ద్విభాషా చిత్రం ‘విస్మయ’ చిత్రీకరణ సందర్భంగా అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీ 354, 354ఏ(మహిళల గౌరవాన్ని భంగపర్చడం), 506(బెదిరింపులకు పాల్పడటం), 509(మాటలు చేష్టల ద్వారా గౌరవానికి భంగం కలిగించడం) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ అర్జున్ ఆమెపై రూ.5 కోట్ల పరువునష్టం దావా వేశారు. -
వేధింపులపై గూగుల్ ఉక్కుపాదం
న్యూయార్క్: సహోద్యోగులపై లైంగిక వేధింపులు, లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తెలిపింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 2016 నుంచి ఇప్పటివరకూ 48 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఉపాధ్యక్షురాలు(ప్రజా వ్యవహారాలు) ఐలీన్ నాటన్ వెల్లడించారు. వీరిలో 13 మంది సీనియర్ మేనేజర్, అంతకంటే ఉన్నతస్థాయి వ్యక్తులు ఉన్నారు. సాగనంపినవారిలో ఎవ్వరికీ ఎగ్జిట్ ప్యాకేజీ ఇవ్వలేదు. లైంగికవేధింపుల కారణంగా గూగుల్ నుంచి వైదొలిగిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్త ఆండీ రూబీన్కు రూ.659.38 కోట్లు(90 మిలియన్ డాలర్లు) ఎగ్జిట్ ప్యాకేజీ ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో పిచాయ్, ఐలీన్ కంపెనీ ఉద్యోగులకు సంయుక్తంగా లేఖ రాశారు. ఉద్యోగులకు సురక్షితమైన పని ప్రదేశాన్ని కల్పించేందుకు గూగుల్ కట్టుబడి ఉందని లేఖలో పిచాయ్ పేర్కొన్నారు. బాధితుల గోప్యతను పరిరక్షించేందుకు వీలుగా వ్యక్తిగత వివరాలు చెప్పకుండానే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఓ మహిళా ఉద్యోగిపై 2013లో హోటల్లో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆండీ రూబీన్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో మరుసటి ఏడాది కంపెనీ నుంచి తప్పుకున్న ఆయనకు గూగుల్ వీడ్కోలు పలికిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. తన ఇష్టప్రకారమే గూగుల్‌ను వీడినట్లు రూబీన్ వివరణ ఇచ్చారు. -
లైంగిక వేధింపులపై జీవోఎం
న్యూఢిల్లీ: పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. ఇందులో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉంటారు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను ఈ బృందం సమీక్షిస్తుందని హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అన్నివర్గాలను సంప్రదించి లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లోగా జీవోఎం కేంద్రానికి నివేదికను సమర్పిస్తుందని వెల్లడించింది. పని ప్రదేశంలో మహిళల గౌరవాన్ని కాపాడటానికి, భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. మరోవైపు మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ‘షీ–బాక్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. ఏ స్థాయి ఉద్యోగిని అయినా ఇందులో ఫిర్యాదు చేస్తే, కంపెనీలోని సంబంధిత పరిష్కార విభాగానికి దీన్ని బదిలీ చేస్తామని వెల్లడించింది. బాధితుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
చిన్నారులూ క్షమించండి: ఆస్ట్రేలియా ప్రధాని
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని విద్యాసంస్థలు, మతపరమైన విద్యాసంస్థల్లో దశాబ్దాలపాటు లైంగిక వేధింపులకు గురైన వేలాది మంది బాలబాలికలకు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ క్షమాపణలు చెప్పారు. వీరిని రక్షించడంలో తాము వైఫల్యం చెందామని అంగీకరించారు. నమ్మకం, మతవిశ్వాసాల మాటున ఈ తప్పులను దాచుకోవడానికి ప్రయత్నించిన వారిపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చర్చ్‌లు, అనాథాశ్రమాలు వంటి విద్యాసంస్థల్లో బాలబాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఐదేళ్లపాటు కొనసాగిన విచారణ నివేదిక సమర్పించింది. అనంతరం దీనిపై ప్రధాని మాట్లాడుతూ..‘మిమ్మల్ని(చిన్నారులు) కాపాడటంలో మేం విఫలమయ్యాం.. క్షమించండి. మీ(తల్లిదండ్రుల) నమ్మకాన్ని ఒమ్ము చేశాం. ఈ లైంగిక వేధింపుల పరిణామాలను ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిని క్షమాపణలు కోరుతున్నా’ అంటూ ప్రధాని కన్నీరు పెట్టుకున్నారు. -
వైరముత్తు అలాంటివాడే!
కొన్ని రోజులుగా వైరముత్తు తనతో పని చేసేవారి మీద లైంగిక వేధింపులు జరిపాడు అంటూ గాయని చిన్మయి పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆరోపణలకు మద్దతు పలికారు సంగీత దర్శకుడు రెహమాన్ సోదరి, సంగీత దర్శకురాలు, నిర్మాత రైహానా. ‘‘వైరముత్తు అలాంటివాడే అన్న విషయం ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్. వైరముత్తు ఇలాంటి వాడు అన్న సంగతి రెహమాన్‌కి తెలియదు. ‘నిజమా? ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి?’ అని రెహమాన్ నన్ను అడిగాడు. రెహమాన్ పుకార్లను పట్టించుకోడు. తన పనేంటో తను చేసుకుంటూ వెళ్తాడు. అలాగే కాంట్రవర్శీలు ఉన్నవాళ్లతో తను పనిచేయడు. మరి రెహమాన్ వీళ్లతో కలసి పనిచేయడా? అంటే.. అది తన ఇష్టం’’ అని పేర్కొన్నారు. చెడ్డవాడు హీరోయిన్ లేఖా వాషింగ్టన్ కూడా ‘మీటూ’ అంటూ పేరు చెప్పకుండా ఓ వ్యక్తిని ఆరోపించారు. శింబుతో కలసి లేఖ ‘కెట్టవన్’ అనే సినిమాలో యాక్ట్ చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ట్వీటర్లో ‘ఒకే ఒక్క పదం.. కెట్టవన్.. మీటూ’ అని ట్వీట్ చేశారు. అంటే.. ఆమె ఎవర్ని అన్నారో ఊహించడం ఈజీ. అన్నట్లు ‘కెట్టవన్’ అంటే చెడ్డవాడు అని అర్థం. -
సంజయ్‌కు ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్
సాక్షి, నిజామాబాద్ : నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో నిజామాబాద్ మాజీ మేయర్ డి సంజయ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. నర్సింగ్ కాలేజీ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్‌ను ఈ నెల 12న అరెస్టు చేసి, జిల్లా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు కృపాకర్‌రెడ్డి, ఆకుల రమేశ్.. ఈ నెల 14న ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్.. సంజయ్ విచారణ ఇంకా పూర్తి కాలేదని కోర్టుకు తెలిపారు. అతని విచారణకు మరింత సమయం పడుతుందన్నారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సంజయ్‌కు 13 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. -
బెయిల్ ఇవ్వండి..
నిజామాబాద్ లీగల్(నిజామాబాద్ అర్బన్) : లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన మాజీ మేయర్ డి.సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జిల్లా జైలులో ఉన్న సంజయ్.. బెయిల్ ఇవ్వాలని కోరుతూ సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి.. ఇరు పక్షాల వాదనలు వినేందుకు వీలుగా విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సింగ్ కాలేజీ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, జిల్లా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు కృపాకర్‌రెడ్డి, ఆకుల రమేశ్.. సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిరాధారమైన ఆరోపణలతో సంజయ్‌ను కేసులో ఇరికించారని, లైంగిక వేధింపులకు సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనాలు వినేందుకు వీలుగా విచారణను వాయిదా వేస్తూ ఎస్పీ, ఎస్టీ కోర్టు స్పెషల్ జడ్జీ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. కస్టడీకి కోరనున్న పోలీసులు? జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న సంజయ్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. సంజయ్ ను పూర్తిగా విచారించేందుకు తమకు తగిన సమయం లేకుండా పోయిందని, రిమాండ్ లో ఉన్న అతడిని కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంగళవారం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖాలు చేయనున్నట్లు సమాచారం. పోలీసులు వేసే కస్టడీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ, బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు తెలిపారు. మరోవైపు, కేసు డైరీకి సంబంధించిన వివరాలను పోలీసు లు సకాలంలో పీపీకి అందించక పోతే, బెయిల్ పిటిషన్‌పై పీపీ కోర్టును తగినంత సమయం అడిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌పై గురువారం వరకు వాదనలు జరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే, బుధవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోర్టుకు సెలవు ఉంటుంది. దీంతో బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సంజయ్ జిల్లా జైలులోనే ఉండాల్సి ఉంటుంది. -
లైంగిక వేధింపులు: ఎట్టకేలకు విచారణకు సంజయ్!
సాక్షి, నిజామాబాద్: నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ ఆదివారం విచారణకు హాజరయ్యారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసులో 41- సీఆర్పీసీ ప్రకారం పోలీసులు సంజయ్‌కు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్ ఎట్టకేలకు ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్‌పై నిర్భయ యాక్ట్ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్‌ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్ ఆ ఆరోపణలను ఖండించారు. విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా. -
స్త్రీలోక సంచారం
తెలంగాణలోని సిద్దిపేటలో ‘మదర్ అండ్ చైల్డ్ కేర్’ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు అరుణా నాయుడు, తన జూనియర్ డాక్టర్ సెలవులో ఉండటంతో తనొక్కరే ముగ్గురు నర్సుల సహాయం తీసుకుని 24 గంటల వ్యవధిలో 33 మందికి సురక్షితంగా కాన్పులు జరిపి 17 మంది ఆడ శిశువులను, 16 మంది మగ శిశువులను తల్లుల ఒడికి చేర్చి వైద్యవృత్తికి వన్నె తెచ్చారు. జూలై 9 అర్ధరాత్రి మొదలై జూలై 10 అర్ధరాత్రి వరకు ఏకబిగిన సాగిన కాన్పులలో మొత్తం 66 మందీ (తల్లీబిడ్డలు కలిపి) ఆరోగ్యంగా ఉండటంతో ప్రసూతి విభాగం కళకళలాడింది వెయిట్ లాస్ సర్జరీ చేయించుకుంటే తేలిగ్గా నడిచేందుకు వీలవుతుందనీ, థైరాయిడ్ వంటి సమస్యలను నివారించవచ్చునని సూచించినప్పటికీ.. డైటింగ్ ద్వారా మాత్రమే బరువు తగ్గడానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత మొగ్గుచూపారని.. జయ మృతికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిటీ ఎదుట ప్రముఖ డయాబెటాలజిస్ట్ జయశ్రీ గోపాల్ సాక్ష్యం ఇచ్చారు. 2016 సెప్టెంబర్ 22న జయలలిత ఆసుపత్రిలో అడ్మిట్ కావడానికి దారితీసిన పరిస్థితులపైన, డిసెంబర్ 5న ఆమె మరణించినట్లుగా ప్రకటన వెలువడే వరకు ఆసుపత్రిలో ఆమెకు అందిన వైద్య చికిత్సలపైన ఈ ఏకసభ్య కమిటీ విచారణ జరుపుతోంది ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’లో గత ఏడాది జూన్ 4న జరిగిన మైనర్ బాలిక రేప్ కేసులో మూడు నెలల విచారణ అనంతరం బి.జె.పి. బంగార్మావ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్ మీద, అతడికి సహకరించిన శశీ సింగ్ అనే మహిళ మీద ‘పోక్సో’ చట్టం కింద సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. పని ఇప్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే ఇంటి లోపలికి ఆ బాలికను పంపించి, తను బయట వేచి ఉండటం ద్వారా అత్యాచారానికి సహకరించినందుకు శశిపైన, అత్యాచారానికి పాల్పడినందుకు ఎమ్మెల్యే పైన పోక్సో (ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్’) చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. హిందువుల ఇంట్లో పెరిగిన షబ్నమ్ షేక్ అనే 20 ఏళ్ల యువతి తన వివాహ వేడుకను గణేశ్ పూజతో ప్రారంభించి, ముస్లిం సంప్రదాయంలో నిఖా జరిపించుకుని, తనను పెంచిన తండ్రితో కన్యాదానం ఇప్పించుకోవడం మత సామరస్యానికి చక్కటి ఉదాహరణగా నిలిచింది. గుజరాత్‌లోని వెరవెల్ ప్రాంతంలో ఉంటున్న షబ్నమ్‌కు ఐదేళ్ల వయసులో తల్లి చనిపోగా, ట్రక్కు డ్రైవర్ అయిన ఆమె తండ్రి ఆమెను తన హైందవ స్నేహితుడి ఇంట్లో వదిలి వెళ్లిపోయిన అనంతరం పదిహేనేళ్ల తర్వాత ఆ స్నేహితుడే ముస్లిం పెద్దల సహకారంతో షబ్నమ్‌కు అబ్బాస్ అనే వరుడిని వెదికి తెచ్చి, ఆమె ఇష్ట ప్రకారం రెండు వివాహ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిపించాడు. రాజస్తాన్‌లోని బుండీ జిల్లా, హరిపురా గ్రామంలో ఒకటో తరగతి చదువుతున్న ఐదేళ్ల బాలిక తన పాఠశాల ప్రాంగణంలో వరుణపక్షి (రెడ్ వాటిల్డ్ లాప్వింగ్) పెట్టిన గుడ్లను.. చూసుకోకుండా కాలితో తొక్కినందుకు పరిహారంగా గ్రామ పెద్దలు ఆ బాలిక 11 రోజుల పాటు ఇంటిలోపలికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు! వాన రాకడ సందేశాన్ని తెచ్చే వరుణపక్షి గుడ్లను చిదిమేసినందుకు పాప పరిహారంగా, ప్రాయశ్చిత్తంగా వారు ఈ శిక్ష విధించడంతో ఆ బాలిక ఈ నెల 3 వ తేదీ నుంచి స్కూలుకు వెళ్లి వస్తున్నప్పటికీ, ఇంటి బయటే ఒక నులక మంచంపై ఉంటోంది ::: రష్యాలో ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు మొదలయ్యాక ఇప్పటి వరకు 300 వరకు మహిళల్ని వేధించిన కేసులు నమోదు అయ్యాయని ‘ఫుట్‌బాల్ అగైనెస్ట్ రేసిజం ఇన్ యూరప్’ (ఫేర్) హెడ్డు పియారా పోవార్ వెల్లడించారు. ఇవన్నీ కూడా లైంగిక వివక్షతో ఫుట్‌బాల్ అభిమానులు వీధులలో చెలరేగి పాల్పడినవేనని చెబుతూ, స్థానిక రష్యన్ మహిళలు కూడా విదేశీ పురుషుల లైంగిక వేధింపులకు గురైన ఘటనలూ చోటు చేసుకున్నాయని పోవార్ తెలిపారు. వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకూడదన్న బ్రిటిష్ రాజప్రాసాద సంప్రదాయాలకు భిన్నంగా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఐర్లండ్‌లోని ప్రముఖులతో అనేక విషయాలను చర్చించడం, ఆ వివరాలను ఆ ప్రముఖులు ట్విట్టర్లో పెట్టడం.. బ్రిటన్‌లో రాజకీయ కల్లోలానికి కారణం అయ్యాయి. పెళ్లయ్యాక తొలి విదేశీ పర్యటనగా ఈ భార్యాభర్తలు ఐర్లండ్ వెళ్లినప్పుడు వీరికి సాదర ఆహ్వానం లభించడంతో పాటు, కొన్ని రాజకీయ అంశాలపైన తప్పనిసరిగా మాట్లాడవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి ‘మీటూ’ స్ఫూర్తితో కేరళలో మలయాళీ మహిళా నటులు లింగ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సహ నటిని కిడ్నాప్ చేయించి, ఆమెపై అత్యాచారం చేయబోయాడన్న ఆరోపణలపై జైలు శిక్షను అనుభవించి ప్రస్తుతం బెయిల్ మీద తిరుగుతున్న దిలీప్ అనే నటుడుని తిరిగి నటీ నటుల సంస్థ ‘అమ్మ’లో చేర్చుకోవడంతో మొదట వ్యతిరేకించిన రీమా, పార్వతి, శ్రీలేఖ, సజిత్లతో మొదలైన ఈ ఉద్యమం క్రమక్రమంగా తీవ్రమై, దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలకూ వ్యాపించి ఒక స్ఫూర్తి పోరాటంగా రూపు దాల్చే అవకాశం ఉంది. -
కన్న కుమార్తెను మంటల్లో తోసేసిన తల్లి
భువనేశ్వర్ : మాతృత్వం మంటకలిసింది. పొత్తిళ్లలో బిడ్డని సంరక్షించాల్సిన కన్న తల్లి మంటల్లోకి వేసేసింది. కొండ కోనలు వంటి మారుమూల ప్రాంతాల్లో పౌర జీవన విధానాల్లో అవగాహన లోపంతో పసి బిడ్డలకు వాతలు పెడుతున్న దురాచారం కంటే హీనంగా ఈ సంఘటన ఉంది. కుటుంబ కలహాలతో వేసారిన వివాహిత కన్న బిడ్డపై తన వేధింపుల్ని ప్రయోగించి సజీవ దహనానికి విఫలయత్నం చేసింది. లాలించాల్సిన చేతులతో పసి బిడ్డను మంటల్లోకి తోసేయడంతో కొన ఊపిరితో ఆ బిడ్డ కొట్టుమిట్టాడుతోంది. 7 నెలల బాలిక మంటల్లో కాలిపోయింది. సింహ భాగం శరీరం కాలడంతో ఈ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఊగిసలాడుతోంది. స్థానిక సాలియా సాహి ప్రాంతంలో గురువారం ఉదయం ఈ విషాద సంఘటన జరిగింది. నయాపల్లి ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం... గుడ్డను కిరోసిన్‌లో ముంచి నిప్పు పెట్టింది. ఆ మంటల్లో 7 నెలల చిన్నారి కన్న బిడ్డని తల్లి చేతులారా తోసేసింది. మంటల్లో కాలిపోతున్న పసి బిడ్డ చావు కేకల్ని ఆలకించిన ఇరుగు పొరుగు పరుగులు తీశారు. పరిస్థితిపట్ల అవాక్కు అయ్యారు. స్థానికులు కల్పించుకుని మంటల్లో కాలిపోతున్న బాలికను అక్కున చేర్చుకుని హుటాహుటీన స్థానిక క్యాపిటలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు పసి కందు పరిస్థితి క్షణ క్షణం క్షీణించే ప్రమాదాన్ని గుర్తించారు. తక్షణమే ఉన్నత చికిత్స కోసం కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. బిడ్డ చికిత్స ఇక్కడ కొనసాగుతుంది. మతి స్థిమితం లేదా ... కన్న బిడ్డను చేతులారా నిప్పుల్లో పడేయడంపై హృదయాల్ని కలచి వేసింది. సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. తల్లి చేష్టలపై ఇరుగు పొరుగు వర్గాలు ఆమెకి మతి స్థిమితం అదుపు తప్పినట్టు తెలిపారు. రెండో వివాహం కావడంతో తరచూ భార్యాభర్తలు కలహాలతో ఎడ పెడ ముఖాలుగా కాపురం చేయడం అలవాటుగా మారింది. ఇప్పుడు ఏమైందో ఏమో కాని ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్థానికులు వాపోయారు. ప్రస్తుతం మంటల్లోకి బిడ్డని తోచేయడంతో ఆ తల్లి మనస్సు స్థిమితంగా లేనట్టు కనిపిస్తుంది. అదుపులోకి తీసుకుని విచారణ వంటి కార్యాచరణ ప్రారంభించనున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. -
బామ్మర్దులను కత్తితో పొడిచిన బావ
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చిన భా ర్యను తనతో రమ్మని గొడవపడ్డాడు. బావను సముదాయించేందుకు ప్రయత్నించిన బామ్మర్దులను కత్తి తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో బామ్మర్దులు వేర్వేరు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి శనివారం 5వ టౌన్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగారం ప్రాంతానికి చెందిన మహేష్ శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య భాగ్యలక్ష్మి తో గొడవపడ్డాడు. ఇలా తరుచుగా గొడవ చేస్తుండ టంతో భార్య భరించలేక అదే కాలనీలో నివాసం ఉండే తన తల్లి గంగామణి ఇంటికి వచ్చింది. అనం తరం మహేష్ అక్కడకు వచ్చి తనతో ఇంటికి రావాలని భార్యతో అక్కడ ఘర్షణకు దిగాడు. అక్కడే ఉన్న బామ్మర్దులు చంద్రబాబు, గంగాబాబుతో బావ మహేష్ గొడవకు దిగి కత్తితో బామ్మర్దుల కడుపులో పొడిచాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అ య్యాయి. శనివారం ఉదయం ఎస్ఐ శ్రీహరి ఘటన స్థలాన్ని సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. భాగ్యలక్ష్మి తల్లి గంగామణి అల్లుడు మహేష్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శనివారం ఉదయం పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమించాలని విద్యార్థినికి బెదిరింపులు
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): ప్రేమించాలని వేధింపులకు గురి చేయడమే కాకుండా ప్రేమించకుంటే చంపుతానని చాకుతో కళాశాల వద్దకు వచ్చిన యువకుడిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురానికి చెందిన యువతి వన్‌టౌన్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో ఎంబీఏ చదువుతంది. ఆ యువతి గతంలో మహాత్మాగాంధీ రోడ్డులోని కాలేజీలో చదివే రోజులలో సీనియర్ అయిన చక్రవరం మహేష్ ప్రేమించాలని వెంట పడేవాడు. తనకు అలాంటివి ఇష్టం లేదని చెప్పడంతో కొంత కాలం కనిపించకుండా పోయాడు. ఇటీవల ఆ యువతికి ఫోన్ చేసిన మహేష్ తనను ప్రేమించాలని వేధించసాగాడు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కళాశాల వద్ద ఉండగా మహేష్ అక్కడకు వచ్చి తనను ప్రేమించాలని వేధించసాగాడు. అంతేకాకుండా మహేష్ చేతిలోని ఫోన్ కింద చాకు ఉండటంతో ఆ యువతి వెంటనే తన తండ్రికి సమాచారం ఇచ్చింది. తండ్రి వచ్చిన తర్వాత ఆ యువతి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నన్నే ప్రేమించాలి.. నన్నే పెళ్లి చేసుకోవాలి
బంజారాహిల్స్: ‘నన్నే ప్రేమించాలి... పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి.. ఇంకెవరితోనైనా మాట్లాడావో ఖబడ్దార్..! ఎవరితో మాట్లాడాలన్నా నా అనుమతి తీసుకోవాలి.. నా మాట వినకపోయావో.. నీ క్యారెక్టర్ మంచిది కాదని చిత్రపరిశ్రమతో పాటు నీ కుటుంబ సభ్యుల్లో కూడా బదనాం చేస్తా అంటూ ఓ యువకుడు తనను మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ సినీనటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకృష్ణానగర్, పిల్లర్ నంబర్ 3 వద్ద నివసించే వర్ధమాన నటికి (23)ని రెండు నెలలుగా జూనియర్ ఆర్టిస్ట్‌లను సరఫరా చేసే కో–ఆర్డినేటర్ రాజు వేధింపులకు గురి చేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడమేగాక ప్రతి రోజూ ఆమె గది వద్దకు వెళ్లి న్యూసెన్స్ చేస్తున్నాడు. ఎవరితోనైనానా మాట్లాడాలంటే తన అనుమతి తీసుకోవాలని లేకపోతే మీ తల్లిదండ్రులకు చెడుగా చెబుతానని బెదిరిస్తున్నాడు. ఈ నెల 17న ఆమె తాను నటిస్తున్న సినిమా దర్శకుడితో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చి అతడితో నీకు సంబంధం ఏంటంటూ ప్రశ్నించాడు. తనతో పాటు బైక్ ఎక్కకపోతే దుష్ప్రచారం చేస్తానని హెచ్చరించడంతో రాజుపై చర్యలు తీసుకోవాలని తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జేబులో యాసిడ్ సీసా పెట్టుకొని తనను బెదిరిస్తున్నాడని ఆరోపించింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మస్కట్‌లో చిత్రహింసలు..
పెద్దాపురం: పొట్టకూటి కోసం స్వగ్రామాన్ని, అయిన వారిని వదులుకుని గల్ఫ్ దేశానికి వలస వెళ్లి అక్కడ ఏజంట్ చేతిలో చిత్రహింసలకు గురై నరకయాతన అనుభవిస్తున్న మహిళ మానవ హక్కుల సంఘం చొరవతో జిల్లాకు చేరింది. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన గోలి కుమారి ఆరు నెలల క్రితం కుటుంబ పోషణ కోసం భర్త, ఇరువురు కుమార్తెలను వదిలి మస్కట్ వెళ్లింది. పని కుదర్చుకున్న ఇంటి వద్ద అనారోగ్యంతో ఉండడంతో ఎవరైతే తీసుకువెళ్లారో ఆ కంపెనీకి కుమారిని పంపించేశారు. దీంతో ఒప్పందం ప్రకారం మస్కట్‌కు చెందిన వీసా కంపెనీ వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి కంపెనీ ఏజెంట్ నక్కా సీతా ఆమెను చిత్ర హింసలకు గురి చేస్తోంది. విషయాన్ని తన భర్త రత్నరాజుకు చెప్పడంతో ఆయన తన భార్యను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండను ఆశ్రయించారు. ఆయన ఇండియన్ ఎంబసీ అధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అక్కడి అధికారులు కుమారిని స్వగ్రామం పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయడంతో బుధవారం కుమారి స్వగ్రామం కట్టమూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా తను స్వగ్రామానికి రావడానికి కృషి చేసిన నూతలపాటి అప్పలకొండతో కలసి విలేకర్ల సమావేశంలో తన కష్టాలను వివరించి కన్నీటి పర్యంతమైంది. సుమారు 15 మంది మహిళలు అక్కడ సీత అనే మహిళ వేధింపులకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి తనలా ఇబ్బందులకు గురవుతున్న వారిని స్వగ్రామానికి తీసుకురావాలని ఆమె కోరింది. అప్పలకొండ మాట్లాడుతూ గల్ఫ్ వంటి దేశాల్లో వేధింపులకు గురవుతున్న పలువురు మహిళలను తమ సంఘం తరఫున నుంచి స్వగ్రామాలకు తీసుకువస్తున్నామన్నారు. దీనికి సహకరించిన జిల్లా యంత్రాంగానికి, ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జుత్తుక అప్పారావు., కుంచే నానీబాబు, వల్లీభాషాతో కుమారి కుటుంబ సభ్యులు ఉన్నారు. -
కన్న తండ్రి కర్కశత్వం
జవహార్‌నగర్: కన్న తండ్రే కుమారుని కర్కశంగా చితకబాదుతుండగా, అందుకు అతడి తల్లి కూడా సహకరించిన సంఘటన జవహర్‌నగర్ పరిధిలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని చూసిన స్థానికులు బుధవారం జవహార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్ కాలనీకి చెందిన ప్రహ్లాద్ దంపతుల కుమారుడు శివమణి(14) కౌకూర్‌లోని పాఠశాలలో చదువుకుంటున్నాడు. ప్రహ్లాద్ తన కుమారుడు శివమణి(14)ని నిత్యం అకారణంగా చితకబాదేవాడు. బుధవారం ఉదయం 6గంటల సమయంలో బాలుడిని చితకబాదడంతో అతడి ఒళ్లంతా కమిలిపోయింది. దెబ్బలను తాళలేక ఏడ్చుకుంటూ బయటికి పరిగెత్తడంతో గమనించిన స్థానికులు బాలుడిని ఎందుకు కొడుతున్నావని ప్రహ్లాద్‌ను నిలదీయగా పాఠశాలకు వెళ్లడం లేదంటూ సమాధానం ఇస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఏడుస్తూ అక్కడే ఉన్న శివమణిని అతని తల్లి ఉతికిన బట్టలు ఆరబెట్టాలని ఆదేశించడంతో అతను ఏడుస్తూనే ఆ పని పూర్తి చేశాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లమని స్థానికులు సూచించినా పట్టించుకోకుండా అతడిని ఇంట్లోకి తీసుకెళ్లింది. దీంతో స్థానికులు జవహార్‌నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ సైదులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడు, అతని తల్లిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డుగా ఉన్నాడని..
సనత్‌నగర్: భర్తను కోల్పోయిన మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి తమకు అడ్డుగా ఉన్నాడని ఆమె కుమారుడిని చిత్రహింసలకు గురిచేస్తుండటంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జయమ్మ భర్త చనిపోవడంతో మోతీనగర్ బబ్బుగూడలో ఉంటున్న పెద్దిరాజుతో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కుమారుడు పవన్‌ను వదిలించుకోవాలని పెద్దిరాజు జయమ్మపై ఒత్తిడి చేయడమేగాక తరచూ అతడిని కొట్టేవాడు. మంగళవారం అల్లరి చేస్తున్నాడంటూ పవన్‌ను ప్లాస్టిక్ వైర్‌తో బాదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు పెద్దిరాజుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బస్తీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దిరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
మాయని మచ్చ!
ఊరంతా మహిళా దినోత్సవం జరుపుకుంటుంటే.. ఓ వివాహిత మాత్రం అర్ధంతరంగా తనువు చాలించింది. మహిళల భద్రత, గృహ హింస, చట్టాలు అంటూ వేదికలెక్కి గొప్పగా చెబుతున్నా.. మరోవైపు వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళలు సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. కేవలం అదనపు కట్నం కోసం అత్తింటి వారు తరచూ భౌతిక దాడులు, మానసిక వేధింపులు చేస్తుండడంతో భరించలేని గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మకూరు: అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే అది హత్య అని పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన నరసింహులు ఇద్దరు సంతానం. తన కుమార్తె నాగేంద్రమ్మ(22)ను తొమ్మిది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన శివకు ఇచ్చి వివాహం జరిపించారు. ఐదు నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వేధిస్తున్నారు.. నాన్న ఈ నేపథ్యంలోనే నాగేంద్రమ్మ గర్భం దాల్చింది. మూడు నెలలుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త శివతో పాటు అతని అన్న పోతులయ్య, తల్లి (నాగేంద్రమ్మ అత్త) లింగమ్మ వేధింపులు మొదలు పెట్టారు. ఇదే విషయమై పలుమార్లు తండ్రి వద్ద నాగేంద్రమ్మ వాపోయింది. ‘నాన్న.. డబ్బు కావాలంటూ మా ఆయనతో పాటు అత్త, బావ రోజు నన్ను మాటలతో కాల్చుకు తింటున్నారు’ అంటూ కన్న తండ్రి ఎదుట ఆమె బోరుమంది. గర్భణి అని కూడా చూడకుండా భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారంటూ కన్నీటి పర్యంతమైంది. ఉరి వేసుకుని.. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో నాగేంద్రమ్మ తాళలేకపోయింది. చివరకు ఆత్మహత్య ఒక్కటే మార్గంగా ఆమె భావించింది. ఈ నెల 6న కూడేరులోని ఆస్పత్రిలో వైద్య చికిత్సల కోసం నాగేంద్రమ్మను పిలుచుకెళ్లారు. గురువారం ఉదయం ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ చేయడంతో నరసింహులు అక్కడకు చేరుకుని పరిశీలించాడు. హతమార్చారు.. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదంటూ ఈ సందర్భంగా నరసింహులు కన్నీటి పర్యంతమయ్యాడు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ తరచూ తన వద్ద బాధపడుతుండేదని తెలిపారు. పరిస్థితి అనుకూలంగా లేదని కొంత కాలం ఆగితే కొద్దోగొప్పో డబ్బు సర్దుతానంటూ చెప్పుకొచ్చినట్లు వివరించారు. ఇంతలో అత్తింటి వారు ఇంతటి దురాగతానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భర్తను కడతేర్చిన భార్య
చిత్తూరు, పలమనేరు:వేధింపులు తాళలేక భార్య భర్తను హతమార్చింది. ఆపై శవాన్ని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఓ రక్తపు చుక్క నిందితురాలిని పట్టించింది. సంచలం సృష్టించిన ఈ సంఘటన పలమనేరు మండలం పెంగరగుంట సమీపంలోని చిన్నకుంటలో శుక్రవారం జరిగింది. పలమనేరు సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. పెంగరగుంట గ్రామానికి చెందిన క్రిష్ణప్ప(55) తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య శాంతమ్మ, కుమారుడు అనీల్‌కుమార్ ఉన్నారు. వీరు గ్రామ సమీపంలోని పొలం వద్ద నివాసం ఉంటున్నారు. క్రిష్ణప్ప మద్యానికి బానిసయ్యాడు. అతన్ని మార్చేందుకు భార్య, కుమారుడు ఎంతో ప్రయత్నించారు. ప్రయోజనం లేకపోవడంతో క్రిష్ణప్పను ఇంటికి రావద్దని చెప్పారు. అతను బయట ఉంటూ అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అతను పొలం సమీపంలోని మామిడితోపు వద్ద మద్యం సేవించాడు. ఆపై మనువరాలికి చెప్పి భార్యను రమ్మన్నాడు. ఆమె అక్కడికి వచ్చి మళ్లీ తాగొచ్చావా అంటూ వాగ్వాదానికి దిగింది. ఎంతచెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించింది. మత్తులో పడి ఉన్న అతనిపై బండరాయి వేసి హత మార్చింది. తర్వాత మృతదేహాన్ని సంచిలో మూటకట్టి గుడియాత్తం రోడ్డు వద్దకు ఈడ్చుకెళ్లింది. అక్కడ పడేసి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం ఆ దారిలో వెళ్లేవారు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని చూసి గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెంది ఉంటాడని భావించారు. ఓ రక్తపు చుక్కతో శవానికి కాస్త దూరంలో పోలీసులకు ఓ రక్తపు చుక్క కనిపించింది. దాని ఆధారంగా కొంత దూరం పరిశీలించగా మట్టిలో రక్తపు చుక్కలు కనిపించాయి. ఎవరో హత్యచేసి లాక్కొచ్చి రోడ్డులో పడేశారని గుర్తించారు. మృతుని భార్యపై అనుమానంతో విచారించగా తానే హత్య చేసినట్టు అంగీకరించింది. పోలీసులు ఆమెను అదపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన బండరాయి, శవాన్ని లాక్కెళ్లిన తాడును స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో ఉంది. -
ప్రేమ వేధింపులు..వ్యక్తికి జైలు శిక్ష
మునిపల్లి(అందోల్): ప్రేమించమని వెంటపడిన వ్యక్తికి మేజిస్ట్రేట్ మహేష్‌నాథ్ ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ. 12 వేల జరిమానా విధించినట్లు బుదేరా ఎస్ఐ కోటేశ్వర్రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన యువతిని మేళసంగ్యం గ్రామానికి చెందిన ఎల్లయ్య ప్రేమించమని, పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. విసుగు చెందిన యువతి 2016 సెప్టెంబర్‌లో బుదేరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఎల్లయ్యపై ఎస్ఐ కోటేశ్వర్రావు కేసు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధాకర్ వాదనలు విన్న మేజిస్ట్రేట్ మహేశ్‌నాథ్ బుధవారం ఎల్లయ్యకు ఆరు నెలల జైలుతోపాటు రూ. 12 వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆస్తి కోసం కుమార్తె, అల్లుడి దాష్టీకం
మండ్య: ఆస్తి కోసం ఆ కుమార్తె అమానుషంగా వ్యవహరించింది. కని పెంచి పోషించి ఓఇంటిదానిని చేసినా కనికరం చూపలేదు. భర్తతో కలిసి తల్లిని, మతిస్థిమితం లేని చెల్లెలను గదిలో బంధించింది. ఈ ఉదంతం మండ్య నగరంలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనిలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు..ఇక్కడి లేఔట్లో సునందమ్మ భర్త విధానసౌధలో పనిచేస్తూ ఒక ప్రమాదంలో మృతి చెందాడు. సునందమ్మకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె గీతను తాలుకాలోని ముద్దేగౌడనదొడ్డి గ్రామానికి చెందిన నాగరాజుకు ఇచ్చి వివాహం చేసింది. వివాహ సమయంలో ద్విచక్ర వాహనంతో పాటు 200 గ్రాముల బంగారం, రెండు సైట్లు కట్నంగా సమర్పించింది. సునందమ్మ చిన్న కుమార్తె రమ్యకు మతిస్థిమితం సరిగా లేదు. ఆమెను ఆటో డ్రైవర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. కొన్ని రోజుల తర్వాత అతను రమ్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో రమ్యను సునందమ్మే పోషిస్తోంది. అయితే సునందమ్మ నివాసం ఉంటున్న డూప్లెక్స్ హౌస్‌పై పెద్ద కుమార్తె, అల్లుడు కన్నువేశారు. ఇల్లు విక్రయించాలని పట్టుబట్టారు. దానికి సునందమ్మ అంగీకరించలేదు. దీంతో గీత, ఆమె భర్త నాగరాజులు సునందమ్మ, రమ్యను గదిలో బంధించి వేధింపులకు పాల్పడ్డారు. రెండు రోజులుగా గదిలో బంధీగా ఉన్న సునందమ్మ ఆదివారం ఉదయం కిటికీ తెరిసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు తీసి బాధితులకు విముక్తి కల్పించారు. గీత, నాగరాజుపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో కీచకుడు
మెహిదీపట్నం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా రోగులు, వారికి సహాయకులకు కనీస రక్షణ లేకుండా పోయింది. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాల్సిన సిబ్బంది వారిపాలిట కీచకుల్లా మారుతున్నారు. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో డ్రైవర్‌గా పని చేస్తున్న శివ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తప్పతాగి ఓ రోగిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి బంధువులు హుమాయిన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం కంటి పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరిన రోగి పట్ల అతను శనివారం రాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. తాను చెప్పినట్లు వింటే అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు, త్వరగా సర్జరీ కూడా చేయిస్తానని చెప్పాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో డ్రైవర్ శివపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం రోగుల, సహాయకులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో హుమాయూన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు. -
వేధింపులు ఇక ఆపండి
గుంటూరు వెస్ట్: ఎంత పనిచేసినా తమను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఏపీ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.డి.ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి దాదాపు 300 మంది పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లు గంటల్లోనూ, రోజుల్లోనూ వసూలు చేయాలని లేకపోతే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. హక్కులు మాత్రం అధికారులకు, బాధ్యతలు మాత్రం తమకు అనే పద్ధతిలో వ్యవస్థ నడుస్తుందని వాపోయారు. 6 నుంచి 18 ఏళ్లకు చెందిన ఇంక్రిమెంట్ల ఫైళ్లు అధికారులు తొక్కి పెడుతున్నారన్నారు. మెడికల్ బిల్స్ పెండింగ్‌ను క్లియర్ చేయడంలేదన్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శిని రెండు మూడు గ్రామాలకు ఇంచార్జ్‌లుగా నియమించడంవల్ల పనిభారం అధికమైపోతుందన్నారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అ రుణతో సమస్యలపై చర్చించారు. ఆమె స్పందిస్తూ వీలైనంత వరకు మార్చి 15 నాటికి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏపీ పంచాయతీ కార్యదర్శులు సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జాన్‌పీరా, ప్రధాన కార్యదర్శి జి.ఎస్.సి.బోస్, కోశాధికారి కె.సాంబ శివరావు ఎ.పి.గ్రామ పంచాయితీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మందపాటి వెంకటరెడ్డి, ప్రధాన కార్యద ర్శి పి.నాగరా జు, కోశాధికారి వెంకటాద్రి పాల్గొన్నారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్యాయత్నం
కావలిరూరల్: కావలిలోని వీఎస్‌యూ పీజీ సెంటర్లో డిపార్ట్మెంట్ ఓఎస్డీ వేధింపులు తట్టుకోలేక మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఈఘటన సోమవారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా కడప పట్టణానికి చెందిన మీసాల సుశీల 2013 నుంచి కావలిలోని విక్రమ సింహపురి పీజీ సెంటర్లో జువాలజీ విభాగంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తోంది. రెండున్నరేళ్ల క్రితం జువాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వి.శైలజను జువాలజీ హెచ్ఓడీగా నియమించారు. ఆమెకు రెండేళ్ల పాటు బాధ్యతలు అప్పగించగా కాలపరిమితి పూర్తయి 6 నెలలు గడిచింది. శైలజ తర్వాత హెచ్ఓడీగా నియమితులయ్యేందుకు సుశీలకు అన్ని అర్హతలు ఉండటంతో ఆమెను హెచ్ఓడీ కాకుండా ఉద్దేశ పూర్వకంగా అడ్డుకుంటుందని ఆరోపించారు. దీంతో పాటు తనకు డిపార్ట్మెంట్ పరంగా రావాల్సిన సౌకర్యాలను సైతం రాకుండా అడ్డుకుందని, శైలజ భర్త సుబ్రహ్మణ్యంనాయుడు యూనివర్సిటీ ఈసీ మెంబర్ కావడంతో పైఅధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. హెచ్ఓడీకి మద్దతుగా వీసీ వీరయ్య, మాజీ రిజిష్ట్రార్ శివశంకర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పరిస్థితులతో విసిగిపోయిన సుశీల సోమవారం సూసైడ్ నోట్‌గా రాసి సహధ్యాపకుడికి పంపించింది. అనంతరం డిపార్ట్మెంట్ ఆఫీస్ రూంలో విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో సహోద్యోగులు ఆమెను 108 వాహనంలో ప్రభుత్వ ఏరి యా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్సై ఎస్.వెంకటేశ్వరరాజు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు
గుంటూరు: ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పుకునేందుకు కూడా మొదట్లో భయపడ్డాను. అతని ఆగడాలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు చెప్పాను. ఈవిషయం తెలిసి పెళ్లికి అంగీకరించకపోతే నన్ను హతమారుస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాను. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఓ విద్యార్థిని రూరల్ అదనపు ఎస్పీ వరదరాజు వద్ద సోమవారం కన్నీటి పర్యంతమైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన చదలవాడ శ్రీకాంత్ గుంటూరు రూరల్ మండలం గ్రామంలోని ఓప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో బీఫార్మాసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ గతేడాది సెప్టెంబరు నుంచి వెంటపడుతున్నాడు. ఫోన్ తీసుకొచ్చి ఆమెకు బలవంతంగా ఇచ్చి ఫోన్ నీ దగ్గర లేకుంటే అంతు చూస్తానని బెదిరించడంతో గత్యంతరం లేని స్థితిలో ఆమె ఫోన్ ఇంటికి తీసుకువెళ్లింది. తల్లిదండ్రులకు విషయం చెబితే చులకనగా చూడడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలుపగా, శ్రీకాంత్ తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. అయినా శ్రీకాంత్ వేధింపులు ఆపలేదు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో గతనెల 10న తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో భయంగా కళాశాలకు వెళ్లాల్సి వస్తుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. -
భర్తను హత్య చేసిన భార్య
ఆదిలాబాద్, జైపూర్(చెన్నూర్): కట్టుకున్న వాడినే కడతేర్చింది ఆ ఇల్లాలు. వేధింపులు తాళలేక రోకలిదుడ్డుతో తలపై బాది హత్యచేసింది. నిత్యం తాగుతూ భార్యను చిత్రహింసలకుక గురిచేసే భర్తను కానరాని లోకాలకు పంపేసింది. మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకోకపోగా డబ్బుల కోసం తరచూ గొడవకు దిగే భర్తపై దాడి చేసి చంపేసింది. ఏడడుగులతో కలకాలం తో డుంటానని చేసిన బాసలు మరిచి పతిని పరలోకానికి పంపింది. జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మోర్ల శ్రీనివాస్(38)ని తన భార్య మోర్ల రాజేశ్వరి సోమవారం ఉదయం రోకలిదుడ్డుతో కొట్టి హత్యచేసింది. సంఘటన వివరాల్లోకి వెళ్తే మోర్ల రాజేశ్వరి–శ్రీనివాస్‌లకు 2005లో వివాహం జరిగింది. శ్రీనివా స్ అత్తగారి ఇంటికి ఇల్లరికంగా వచ్చారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి కుమార్తెలు భూమిక(11), శ్రావణి(8), కుమారుడు శివకుమార్(6) ఉన్నా రు. సొంతంగా ఆటో నడుపుతూ శ్రీనివాస్ మద్యానికి బానిస అయ్యాడు. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులతో మద్యం సేవించి భార్య రాజేశ్వరిని తరుచూ వే ధింపులకు గురిచేసేవాడు. రాజేశ్వరి తండ్రి కొట్రంగి లస్మయ్య సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కాగా ఇటీవల రూ.2లక్షలు సహార డబ్బులు రాగా బ్యాంకులో వేశా రు. అందులో నుంచి రూ.40 వేలు అప్పు తీర్చారు. బ్యాంకులో ఉన్న డబ్బులు తనకు ఇవ్వాలని కోరడంతో భార్యభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు ఆటోలు అమ్మిన శ్రీనివాస్ మళ్లీ కొత్త ఆటో కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వాలని మద్యం సేవించి భార్య రాజేశ్వరిని వేధించాడని ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా అతిగా మద్యం సేవించి భార్య రాజేశ్వరితో గొడవ పెట్టుకుంటున్నాడు. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం తాగి వచ్చిన శ్రీనివాస్ రాజేశ్వరితో గొడవకు దిగాడు. ఇద్దరూ తోసుకోగా విరక్తి చెందిన రాజేశ్వరి పక్కన ఉన్న రోకలిదుడ్డుతో శ్రీనివాస్ తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త వేధింపులు తాళలేక హత్య చేసినట్లు రాజేశ్వరి అంగీకరించింది. సంఘటన స్థలాన్ని ఏసీపీ సీతారాములు, శ్రీరాంపూర్ సీఐ నారాయణ నాయక్ పరిశీలించారు. నేరాన్ని అంగీకరించి రాజేశ్వరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించన్నుట్లు స్థానిక ఎస్సై ఆంజనేయలు తెలిపారు. -
ఎమ్మెల్యే వేధిస్తుండు సారూ!
నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి వేధిస్తున్నారని దామరగిద్ద మండలం బాపన్‌పల్లి సర్పంచ్ జి.శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మెయిల్, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేఖను పంపినట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన శివకుమార్‌రెడ్డి పక్షన తాను నిలబటం తప్పా అని ప్రశ్నించారు. తనపై అక్రమకేసులు బనాయింపచేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులను ప్రారంభించాలని కోరి నా శివకుమార్‌రెడ్డి అనుచరుడిగా ముద్ర వేస్తూ పట్టించుకోవడం లేదన్నారు. -
భర్త చేతిలో రోజూ చావలేక..
రోజూ భర్త చేతిలో హింస పడే కంటే చావుతో అన్ని సమస్యలను మరిచిపోవచ్చని భావించింది ఆ మహిళ. అనుకున్నదే తడవుగా తన నాలుగేళ్ల కుమారుడుని తీసుకుని గండిపేట చెరువు వద్దకు వచ్చింది. సందర్శకుల మాదిరిగానే అటూ ఇటూ తిరిగి చివరికి ఆత్మహత్యాయత్నం చేసింది. నిత్యం భర్త శారీరకంగా పెట్టే వేధింపులు భరించడం కంటే చావే శరణ్యమని భావించింది. తాను మరణిస్తే కొడుకు అనాథ అవుతాడనే భయంతో కొడుకుతో సహా చెరువులో దూకబోయింది. రంగారెడ్డి , మణికొండ: భర్త తనను తరచూ కొడుతున్నాడనే కారణంతో ఓ మహిళ తన నాలుగేళ్ల కుమారుడితో పాటు గండిపేట(ఉస్మాన్‌సాగర్) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు రాగా జలమండలి సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. నార్సింగి పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల బిక్షపతికి అదే మండలం అజీజ్‌నగర్ గ్రామానికి చెందిన అనూష(24)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటికే బిక్షపతికి ఓ మహిళతో వివాహం జరగగా ఆమె అతని బాధలు భరించలేక మరొకరితో వెళ్లిపోయింది. దీంతో ఏడేళ్ల క్రితం అనూషను రెండో వివాహం చేసుకున్నాడు. వివాహమైన ఏడాది నుంచే ఆమెను వేధించడం ప్రారంభించాడు. దాంతో ఆమె అప్పట్లో మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండు వైపుల పెద్ద వారు నచ్చచెప్పి కాపురం చేయించారు. వారికి ఓ కుమారుడు పుట్టడంతో సమస్యలు సద్దుమణిగి నాలుగేళ్లుగా బుద్దిగానే ఉన్నాడు. గత కొంతకాలంగా బిక్షపతి ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య అనూషతోపాటు నాలుగేళ్ల కొడుకు వినయ్‌ను రోజూ చితకబాదుతున్నాడు. ప్రస్తుతం అనూష మూడు నెలల గర్భవతి. ఇదే క్రమంలో మంగళవారం కూడా ఇద్దర్నీ తీవ్రంగా కొట్టడంతో ఈ బాధల నుంచి తప్పించుకోవాలంటే చావే శరణ్యమని భావించి బుధవారం ఉదయం 11గంటల సమయంలో గండిపేట చెరువు కట్టపైకి కుమారుడితో సహా వచ్చింది. అందరి మాదిరిగానే చెరువును చూసేందుకే వచ్చి ఉంటుందని అక్కడి సిబ్బంది భావించారు. అంతలోనే ఆమె కుమారుడితో పాటు చెరువుకట్టపై వేసిన ఫెన్సింగ్ ఎక్కి చెరువులోకి దూకే ప్రయత్నం చేస్తుండటాన్ని అక్కడ పనిచేస్తున్న జలమండలి సిబ్బంది గమనించారు. సాయిబాబ, మునీర్లు హుటాహుటిన వెళ్లి ఆమెను కాపాడి లేక్ పోలీసులకు అప్పగించారు. దాంతో వారు నార్సింగి పోలీస్‌స్టేసషన్‌కు తరలించి కేసు నమోదు చేసి వారి ఆత్మహత్యాయత్నానికి కారణమైన బిక్షపతిని రిమాండ్‌కు తరలించారు. మహిళల ఆగ్రహం.. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్న స్థానికంగా జలమండలిలో పనిచేస్తున్న మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీపుపై వాతలు తేలేలా కొట్టడాన్ని చూసి బిక్షపతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను, కుమారుడిని పోషించాల్సింది పోయి భార్యనే డబ్బులు తెచ్చివ్వాలని ఎలా అడుగుతావంటూæ బిక్షపతిని నిలదీశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వారు లేక్ పోలీస్‌స్టేషన్ ఎస్సై నాగేశ్వర్రావును కోరారు. -
పాక్ మీడియా వేధింపులు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ వెళ్లినప్పుడు పాక్ పాల్పడిన దురాగతాలు ఒక్కోటీ వెలుగుచూస్తున్నాయి. అవంతి, చేతాంకుల్ వద్దకు పాక్ ప్రభుత్వమే విలేకరుల పేరుతో కొందరిని పంపించి విపరీతమైన ప్రశ్నలు అడిగించి వారిని వేధించిన విషయం వెల్లడైంది. విదేశాంగ శాఖ కార్యాలయంలో జాధవ్‌ను కలిశాక తిరిగి వెళ్లేముందు వారి వద్దకు కొందరు జర్నలిస్టులు వచ్చారు. ‘అమాయకపు పాకిస్తానీల రక్తంతో మీ భర్త హోళీ ఆడుకున్నారు. దీనికి మీరేమంటారు? హంతకుడైన మీ కొడుకును కలిశాక మీకేమనిపిస్తోంది?’ తదితర ప్రశ్నలతో జాధవ్ భార్య, తల్లికి వేదన కలిగించారు. సంబంధిత వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ప్రశ్నలు అడిగిన విలేకరులకు ఆ తర్వాత పాక్ విదేశాంగ శాఖ నుంచి ‘బాగా పనిచేశారు’ అంటూ సంక్షిప్త సందేశాలు వచ్చాయని డాన్ పత్రికలో పనిచేసే ఓ సీనియర్ కరస్పాండెంట్ ట్వీటర్లో చెప్పారు. ‘దేశభక్తిని నిరూపించుకునేందుకు ఉత్తమ మార్గం 70 ఏళ్ల మహిళను వేధించడమే అనుకునే పాక్ జర్నలిస్టుల గురించి చెప్పేందుకు పదాలు రావడం లేదు’ అని మరో ప్రముఖ పాత్రికేయురాలు బేనజీర్ షా అన్నారు. అసలు అక్కడున్న వాళ్లంతా జర్నలిస్టులేనా లేక ఐఎస్ఐ మనుషులు ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జాధవ్‌ను ఆయన తల్లి, భార్య నేరుగా కలవకుండా గాజుతెర అడ్డుగా పెట్టడం, ఇంటర్‌కామ్ (ఫోన్)లో మాత్రమే మాట్లాడేందుకు అనుమతివ్వడం, మంగళసూత్రం, బొట్టు తీయించి, దుస్తులు మార్పించి లోపలకు పంపించడం తదితర పాక్ దుశ్చర్యలు ఇప్పటికే వెలుగుచూడటం తెలిసిందే. ‘ఫోరెన్సిక్’కు చేతాంకుల్ పాదరక్షలు చేతాంకుల్ పాదరక్షలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షకు పంపినట్లు పాక్ మీడియా తెలిపింది. షూలో కెమెరా, రికార్డింగ్ చిప్ లాంటి వస్తువేదైనా ఉందేమో తెలుసుకోడానికి ల్యాబ్‌కు పంపినట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఫైజల్ చెప్పారంది. జాధవ్ కుటుంబ సభ్యులను వేధించామన్న భారత ఆరోపణలను నిరాధారమైనవిగా పాక్ కొట్టిపారేసింది. జాధవ్ భార్య, తల్లితో పాకిస్తాన్ అధికారులు ప్రవర్తించిన తీరు అమానవీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మొత్తం భారతీయులకు అవమానం: కాంగ్రెస్ అవంతి, చేతాంకుల్‌ను పాకిస్తానీ విలేకరులు వేధించడం మొత్తం 130 కోట్ల మంది భారతీయులకు జరిగిన అవమానమని కాంగ్రెస్ పేర్కొంది. భారతీయులుగా మనం ఈ చర్యను ఏ మాత్రం సహించకూడదని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. -
ఆకతాయిని చెప్పు తెగేలా కొట్టి ఈడ్చి తన్నింది
సాక్షి, యానాం : యువతులు ఇప్పుడు ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అల్లరిచిల్లర పనులు చేయాలనుకుంటున్నవారి దుమ్ముదులుపుతున్నారు. మాటలతో బెదిరించడం మాత్రమే కాదు చేయి కూడా చేసుకుంటూ మరోసారి అల్లరి చేయాలనే ఆలోచన అంటేనే భయపడేలా చేస్తున్నారు. యానాంలో అల్లరికి పాల్పడిన ఓ ఆకతాయికి ఓ యువతి చుక్కలు చూపించింది. ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువతులు కలిసి యానాంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఓ పనిమీద వచ్చారు. అదే సమయంలో అక్కడే మద్యం మత్తులో ఉన్న ఓ ఆకతాయి యువకుడు వారిపై చేయి వేసే ప్రయత్నం చేశాడు. అసభ్యంగా తాకబోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువతి అతడి దుమ్ముదులిపింది. కిందపడేసి ఈడ్చి తన్నింది. గల్లాపట్టి లాక్కెళ్లింది. చెప్పుతీసుకొని వీపు పగులగొట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి స్కూటిపై వెళ్లిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. -
ఆకతాయికి చుక్కలు చూపించిన యువతి
-
నవ వధువు బలవన్మరణం
ఎన్నో ఆశలతో మెట్టినింటిలో అడుగుపెట్టింది.. నాటి నుంచి అదనపుకట్నం అత్త మామలు వేధించసాగారు. జీవితాంతం బాసటగా నిలుస్తానన్న భర్త కూడా తల్లిదండ్రులకు వంతపాడాడు. వారి వేధింపులు తాళలేక ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన నగరంలోని జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు(క్రైమ్): నగరంలో జాకీర్‌హుస్సేన్ నగర్‌లోని వాటర్‌ట్యాంక్ సమీపంలో నివశిస్తున్న షేక్ సాబ్జాన్, మస్తాన్‌బీ దంపతుల కుమార్తె సిరాజున్నీసా(25). బీటెక్ పూర్తిచేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఆమెకు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మండలం అశోక్‌నగర్‌కు చెందిన ఇస్మాయిల్, హసీనా దంపతుల కుమారుడు నవాజ్ అలీతో వివాహమైంది. వివాహ సమయంలో సిరాజున్నీసా కుటుంబసభ్యులు కట్నం కింద రూ.6లక్షల నగదు, 40సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. మెట్టినింటిలో సిరాజున్నీసా సంతోషం ఎంతో కాలం నిలువలేదు. అత్త, మామలు అదనపు కట్నం కోసం ఆమెను వేధించడం ప్రారంభించారు. రూ.10లక్షలు ఇస్తే కాపురం చేయమని లేదంటే మరొకరికి ఇచ్చి కుమారుడికి వివాహం చేస్తామని ఆమెను బెదిరించడం ప్రారంభించారు. భర్త కూడా తన తల్లిదండ్రులకు ఒత్తాసు పలికాడు. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. వారు సర్దుకుపోమని చెప్పారు. దీంతో ఆమె ఎప్పటికైనా అత్తింటివారు మారకపోతారా అని వారి వేధింపులను భరిస్తూ వచ్చింది. అయినా వారి ప్రవర్తనలో మార్పురాలేదు. అత్తమామలు, భర్త ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఈ నేపథ్యంలో 15రోజుల కిందట సిరాజున్నీసా పిన్ని బద్వేలుకు వెళ్లి ఆమెను తన వెంట నెల్లూరుకు తీసుకొచ్చింది. అప్పటి నుంచి బాధితురాలు తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. శనివారం నవాజ్‌అలీ వారికి ఫోన్ చేశాడు. తాము అడిగినంత తీసుకొని కాపురానికి రావాలనీ లేదంటే నీ వస్తువులు తీసుకొని వెళ్లిపోవాలని చెప్పాడు. దీంతో బాధితురాలు తన తండ్రికి విషయాన్ని చెప్పింది. ఆయన సోమవారం తానే స్వయంగా వచ్చి మాట్లాడుతానని నవాజ్ అలీ కుటుంబభ్యులకు చెప్పాడు. శనివారం రాత్రి మళ్లీ సిరాజున్నీసాకు ఫోన్‌చేసి రూ.20వేలు కావాలని నవాజ్ అలీ అడిగాడు. కొద్దిసేపు ఆమెతో మాట్లాడాడు. అనంతరం ఏం జరిగిందో తెలియదు కాని ఆదివారం తెల్లవారుజామున ఆమె తన ఇంట్లోని దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం ఆమె కుటుంబసభ్యులు పడకగదిలోకి వెళ్లిచూడగా సిరాజున్నీసా వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకుదించారు. అప్పటికే మృతిచెంది ఉండటంతో బోరున విలపించారు. సిరాజున్నీసా మృతి విషయాన్ని అత్తింటివారికి తెలియజేశారు. సాయంత్రం రెండోనగర పోలీసులకు సమాచారం అందడంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, రెండోనగర ఇన్స్పెక్టర్ వెంకటరావు, ఎస్ఐ వి.శ్రీహరిబాబులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఆత్మహత్యకు గల కారణాలను బాధిత కుటంబసభ్యులను అడిగి తెలుసుకొన్నారు. రెవెన్యూ అధికారుల శవ పంచనామా నిర్వహించారు. ఈ క్రమంలో మృతురాలి భర్త అక్కడికి రావడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని స్టేసన్‌కు తరలించారు. డీఎస్పీ కేసు విచారిస్తున్నారు. వేధింపులతోనే ఆత్మహత్య అత్తింటి వేధింపులతోనే సిరాజున్నీసా బలవన్మరణానికి పాల్పడిందని బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహ సమయంలో నవాజ్‌అలీ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్పారనీ, పెళ్లికార్డులు తయారుచేయించే సమయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాదన్న విషయం తమకు తెలిసిందన్నారు. ఈ విషయం వారిని ప్రశ్నించగా ఆ కంపెనీలో చేయడం ఇష్టంలేక ఇంటికి వచ్చి ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడి చేస్తున్నట్లు చెప్పారని తెలిపారు. అయినప్పటికి కుమార్తె బాగుంటుందని వివాహం చేశామని, నాటినుంచే అదనపుకట్నం కోసం వేధించి బలితీసుకొన్నారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
లెక్చరర్ వేధింపులు- విద్యార్థి ఆత్మహత్య
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని చాపా కృష్ణ ప్రియాంక(19) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె భద్రాచలంలో చదువుకుంటున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా రు. లింగాలపల్లికి చెందిన చాపా సుబ్బారావు, అరుణల పెద్ద కుమార్తె కృష్ణ ప్రియాంక భద్రాచలంలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లి అనారోగ్యంగా ఉండటం తో శనివారం ఇంటికి వచ్చి.. ముభావంగా గడిపింది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. తల్లిదండ్రులు సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సోమ వారం తెల్లవారుజామున మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జలకం ప్రవీణ్ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం మధిర: యూనిట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతోందని ఉపాధ్యాయురాలు మందలించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం జరిగింది. ఆత్కూరుకు చెందిన బొడ్డు దివ్య తన అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ మధిరలోని టీవీఎం పాఠశాలలో టెన్త్ చదువుతోంది. సోమవారం దివ్య యూనిట్ పరీక్ష రాస్తుండగా.. ఆమె కూర్చున్న చోట స్లిప్ ఉండటాన్ని టీచర్ గుర్తించారు. స్లిప్‌ను, దివ్య సమాధాన పత్రాన్ని పరిశీలించగా.. చేతిరాత పోలి ఉండటంతో టీచర్ మందలించారు. మనస్తాపానికి గురైన దివ్య మధ్యాహ్నం గ్రామానికి వెళ్లి ఖాళీ పురుగు మందు డబ్బాలో నీళ్లు పోసు కుని తాగింది. టీచర్ జరిగిన çఘటనను హెచ్ఎం నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. దివ్య తాతయ్య ఫ్రాన్సిస్‌కు హెచ్ఎం ఫోన్ చేసి.. సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దివ్య మధిర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
భర్త ఇంటి ముందు నవ వధువు ఆందోళన
సాక్షి, తాడ్వాయి: ప్రేమించి.. పెద్దలను ఎదిరించి కూలాంతర వివాహం చేసుకొని ఇప్పుడు తనను కాదంటున్నాడంటూ.. ఓ నవ వధువు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలంలోని బీరెల్లి గ్రామానికి చెందిన మంగ రజిత(22)ను ఇదే పంచాయతి పరిధిలోని కామారం గూడానికి చెందిన బిక్షపతి(25) ప్రేమించుకున్నారు. బిక్షపతి యాదవ కులానికి చెందిన వాడు కాగా.. రజిత దళిత యువతి. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. అయినా పెద్దలను ఎదిరించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా.. రెండు నెలలు కాపురం చేసిన అనంతరం నువ్వు తక్కువ కులం దానివి.. నాకు నీ అవసరం లేదంటూ బిక్షపతి.. భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఎటు పోవాలో దిక్కుతోచక స్థితిలో రజిత భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఆమెకు స్థానిక మహిళా సంఘం సభ్యులు సంఘీభావం తెలిపారు. -
బీ అలర్ట్ ఫ్లీజ్
సాక్షి, సిటీబ్యూరో: రోజు రోజుకూ బాలలపై ఇంటా బయటా లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ అఘాయిత్యాలపై చిన్నారులు, తల్లిదండ్రులు పెదవి విప్పితే రేపటికి ముందడుగు వేయొచ్చని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర పోలీస్ శాఖ చేయని విధంగా ‘స్టాప్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’ (లైంగిక వేధింపుల నియంత్రణ) కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిందని హోంమంత్రి స్పష్టం చేశారు. ఏడాదిపాటు జరిగే ఈ క్యాంపెయిన్‌లో లైంగిక వేధింపులపై అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కలిసి పనిచేసేందుకు ముందుకువచ్చిన పోలీస్ శాఖకు అందరూ సహకరించాలని ఆయన సూచించారు. శుక్రవారం నెక్లెస్ రోడ్డులో బ్లూక్రాస్ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని, హీరోయిన్ రాశిఖన్నా, గాయని సునీత, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నిర్మాత దగ్గుపాటి సురేష్‌బాబు, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య, ఐజీలు సౌమ్యామిశ్రా, చారు సిన్హా తదితరులు క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 800 పోలీస్స్టేషన్లలో ‘చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’పై ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో అవగాహన కల్పించనున్నామన్నారు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. ‘జాగో బద్లో, బోలో’ అనే నినాదంతో ముందుకెళ్లండని పిలుపునిచ్చారు. విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య మాట్లాడుతూ.. మా అందరి ఉద్దేశం మీరంతా బాగుండాలనేదేనన్నారు. అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘సెంటర్ ఫర్ ఆర్ట్స్ మీడియా అండ్ సోషల్ వెల్ఫేర్’ ఆర్గనైజేషన్ సభ్యుల ప్రదర్శన అలరించింది. సమావేశం అనంతరం వేలాదిమంది విద్యార్థులు, ప్రముఖులు ర్యాలీగా కొవ్వొత్తుల ప్రదర్శనతో ‘స్టాప్ చైల్డ్ అబ్యూజ్’ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. మాట్లాడటానికి భయపడొద్దు చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై మాట్లాడేందుకు భయపడొద్దు. పిల్లల్ని రక్షించేందుకు, సమాజాన్ని మెరుగుపరిచేందుకు, లైంగిక దాడులను అరికట్టేందుకు మన పోలీసులు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. - అమల అక్కినేని, బ్లూక్రాస్ వ్యవస్థాపకారులు ఏ ధైర్యంతో చేస్తున్నారు..? ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతలో చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఏ ధైర్యంతో వారు చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. మొదట ఇంటి నుంచే ఆ ప్రశ్నల వర్షం కురవాలి. – దగ్గుబాటి సురేష్, ప్రొడ్యూసర్ మౌనం.. ప్రమాదకరం.. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను ఎదుర్కొనేందుకు తల్లిదండ్రులకు, చిన్నారులకు ధైర్యం కావాలి. ఏ విధమైన దాడులు జరిగినా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పాలి. మౌనంగా ఉంటే పెను ప్రమాదం అవుతుంది. – రాశిఖన్నా, సినీనటి న్యాయం చేసేవారు పోలీసులే సాయం ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ న్యాయం చేసేది మాత్రం పోలీసులే. అటువంటి న్యాయం కోసం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన పోలీసుల్ని ప్రత్యేకంగా అభినందించాలి. –బోయపాటి శ్రీను, సినీదర్శకుడు అరమరికలు, సమస్యలు లేకుండా.. మన చుట్టూ ఉన్న చిన్నారులకు అరమరికలు, సమస్యలు లేని బాల్యాన్ని ఇద్దాం. దీంతో బాల్యం నుంచే చిన్నారులు అవగాహన కలిగి ఉంటారు. ‘చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’పై అవగాహన ఏడాదిపాటు చేసేందుకు డీజీపీ కృతనిశ్చయంతో ఉన్నారు. – మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ పిల్లలకు సంతోషాన్ని పంచుదాం సమస్యలు చాలా మందికి ఉంటాయి. బయటకు చెప్పేందుకు వెనకాడతాం. కానీ ఇప్పటి నుంచి సమస్యలను చెప్పేందుకు భయపడొద్దు. తల్లిందడ్రులు పిల్లలకు సంతోషాన్ని పంచాలి. చిన్నారుల సమస్యలపై ప్రశ్నించి వారికి ఆనందాన్ని ఇవ్వాలి. – సునీత, గాయని బీ అలర్ట్ ఫ్లీజ్ పిల్లలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా శుక్రవారం రాత్రి నెక్లెస్‌రోడ్డులో స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. హోంమంత్రి నాయిని, డీజీపీ అనురాగ్ శర్మతోపాటు హీరోయిన్ రాశిఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
కంతు ప్రకంపన
కంతు వడ్డీ వేధింపుల ఆత్మాహుతి ఘటన రాష్ట్రంలో ప్రకంపనలకు దారితీసింది. తమకంటే, తమకు వేధింపులు పెరిగాయంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇక, ఇంటెలిజెన్స్ విచారణలో గతంలో స్టేషన్లలో వెయ్యికి పైగా కంతు వడ్డీ ఫిర్యాదులు వచ్చినా కనీసం వాటి మీద ఆయా స్టేషన్ల అధికారులు దృష్టి పెట్టలేదని తేలింది. దీంతో స్టేషన్లలోని అధికారుల భరతం పట్టాల్సిందేనన్న నినాదం తెరమీదకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో అయితే, రాష్ట్ర పోలీసుల తీరుపై విమర్శల జోరు పెరిగింది. అలాగే, తిరునల్వేలి ఎస్పీ, కలెక్టర్లపై చర్యకు డిమాండ్ చేస్తూ మంగళవారం ఆందోళనలు హోరెత్తాయి. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో చిరు వ్యాపారులు, రోడ్డు పక్కన వ్యాపారులే కాదు, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వాళ్లు అత్యధికంగా కంతు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించక తప్పడం లేదు. అధిక వడ్డీకి అప్పులు చేసి మరీ జీవనం సాగించాల్సిన పరిస్థితులు అనేకచోట్ల ఉన్నాయని చెప్పవచ్చు. వారం, పది రోజులు, నెల గడవుతో, కంతుల వారీగా చెల్లింపులు సాగే విధంగా కంతు వడ్డీ జోరుగా సాగుతోంది. ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని విరుదునగర్, తిరునల్వేలి, రామనాథపురం, తేని, మదురై వంటి జిల్లాల్లో కంతు వడ్డీ అనేది ఓ వ్యాపారంగా మారింది. తిరునల్వేలిలో అయితే, మరీ ఎక్కువే. వందకు పది, పదిహేను రూపాయలు చొప్పున వడ్డీలకు అప్పులు తీసుకునే వాళ్లూ ఉన్నారు. నిర్ణీత గడువులో ఆ మొత్తాన్ని చెల్లించకుంటే, వడ్డీ రెట్టింపు అవుతూ, అస్సలు కన్నా, వడ్డీ ఎక్కువగా చెల్లించే పరిస్థితులు తప్పదు. పోలీసులు, రాజకీయనేతల మద్దతు కంతు వడ్డీ వ్యాపారులకు పోలీసులు, స్థానికంగా రాజకీయ వర్గాల మద్దతు ఎక్కువే. అందుకే పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడమే కాదు, తీసుకున్న వారికి బెదిరింపులు, వేధింపులు ఇవ్వడం పరిపాటే. వేధింపులు తాళ లేక బలవన్మరణాలకు పాల్పడే కుటుంబాలు ఎన్నో. అయితే, చర్యలు శూన్యం. ఈ కంతు వడ్డీని అడ్డుకునే విధంగా 2003లోని అమ్మ జయలలిత ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆమేరకు కంతు వడ్డీ బాధితుల్ని ఆదుకోవడంతో పాటు, వేధించే వారికి మూడేళ్లు జైలు శిక్ష పడే రీతిలో చర్యలు తీసుకున్నా, అది అమలుచేసిన వాళ్లే లేరు. తాజాగా అదే కంతు వడ్డీ వేధింపులకు తిరునల్వేలి కలెక్టరేట్లో కుటుంబం ఆత్మాహుతి యత్నం చేసి ప్రకంపనను సృష్టించింది. దీంతో కంతు వేధింపులు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. చర్యలకు పట్టు ఆ కుటుంబం పలు మార్లు విన్నవించుకున్నా, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వర్గాలు స్పందించని దృష్ట్యా, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టే వాళ్లు పెరిగారు. ఇదే నినాదంతో తిరునల్వేలి కలెక్టరేట్ మంగళవారం దద్దరిల్లింది. ఇక, రాజకీయ పక్షాలు ప్రభుత్వ, పోలీసుల తీరుపై విమర్శల జోరును పెంచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల పనితీరుపై దుమ్మెత్తిపోశారు. కంతు వడ్డీ బాధితుల్ని ఇకనైనా ఆదుకునేలా చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ తదితరులు ఇకనైనా మేల్కొనాలని, ఆ మరణాలకు న్యాయం చేకూరే విధంగా కంతు వడ్డీ భరతం పట్టే విధంగా ముందుకు సాగాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. మదురై ధర్మాసనంలో ఓ పిటిషన్ సైతం దాఖలు అయింది. గాంధీ అనే న్యాయవాది కంతు వడ్డీ వేధింపులు, చట్టం గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఇదే సమయం అని, కంతు వడ్డీని అడ్డుకునే విధంగా చర్యలు వేగవంతం చేయాలని, ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకంపనలు ఆత్మాహుతి యత్నం చేసిన నలుగురిలో ఇసక్కి ముత్తు మినహా భార్య, పిల్లలు మరణించారు. వారి మృత దేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు మంగళవారం అప్పగించారు. ఆ మృతదేహాలకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈకేసులో ఇద్దర్ని అరెస్టుచేసి ప్రత్యేక సెక్షన్లను నమోదు చేశారు. అయితే, వారి మరణం రాష్ట్రంలో ఓ ప్రకంపనకు దారితీసింది. పాలకులు, పోలీసుల్ని తట్టి లేపే రీతిలో బలిదానం ఓవైపు సాగితే, మరోవైపు తమకంటే తమకు వేధింపులు పెరిగాయని, ఆదుకోవాలంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయించే పనిలో పడ్డారు. మంగళవారం వందకు పైగా ఫిర్యాదుల రావడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు కంతు వడ్డీ వ్యవహారం మీద దృష్టి పెట్టడం గమనార్హం. గతంలో వెయ్యి వరకు ఫిర్యాదులు ఆయా స్టేషన్లకు వచ్చినా పట్టించుకున్న పోలీసు లేదని విచారణలో వెలుగు చూసి ఉన్నది. ఈ సమాచారంతోనైనా డీజీపీ కార్యాలయం స్పందిస్తుందని భావిస్తే, అక్కడ నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో విమర్శలు జోరందుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పోలీసులపై దుమ్మెత్తి పోసే వాళ్లు పెరిగారు. ఇక, సీఎం, సీఎస్, హోం కార్యదర్శులు స్పందించాలని డిమాండ్ చేసే వాళ్లు మరీ ఎక్కువే. కోర్టు జోక్యం చేసుకోవాలని, చట్టం కఠినంగా అమలుచేయాలని విన్నవించే వాళ్లూ పెరిగారు. -
విడాకులు ఇచ్చేయ్.. ఇంకో పెళ్లి చేసుకుంటా!
విశాఖపట్నం: అదనపు కట్నంగా రూ.5 లక్షలు తీసుకురా.. లేదా రెండో పెళ్లి చేసుకుంటా.. విడాకులు ఇచ్చేయ్.. అంటూ భర్తతో పాటు అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి ఆదివారం మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ద్వారా మనసు మార్చుకున్నట్టు నటించిన భర్త మళ్లీ తన వక్రబుద్ధి చూపడంతో బాధితురాలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని చినవాల్తేరు సమీప విద్యానగర్‌కు చెందిన రీసు నాగేశ్వరరావు, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ప్రవీణను రాజమండ్రి సమీప కడియం ప్రాంతానికి చెందిన ఓదూరి సుమన్ కల్యాణ్‌తో 2014 ఆగస్టు 15న వివాహం చేశారు. కట్నం, సారె, ఆడపడుచు లాంఛనాలు, వరుడికి బంగారంతో కలిపి సుమారు రూ.11 లక్షల వరకు చెల్లించారు. సుమన్ సౌత్‌సెంట్రల్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల పాటు కడియంలో వీరి కాపురం సజావుగానే సాగింది. సుమన్ సోదరుడు దినేష్, సోదరి అలేఖ్యలు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ప్రవీణ గర్భిణిగా ఉన్న సమయంలో ఆడపడుచు అలేఖ్య, ఆమె భర్త పార్థసారథి కలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి రూ.10 లక్షల కట్నం చాలా తక్కువ అని కట్టుకథలు అల్లడంతో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమెను రూ.5లక్షల అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించడం ప్రారంభించారు. లేని పక్షంలో విడాకులు ఇచ్చేస్తే మేనత్త కుమార్తెతో వివాహం చేస్తామని బెదిరించేవారు. విషయాన్ని ప్రవీణ తమ తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పగా వారు నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రవీణను భర్త, ఆడపడుచు శారీరకంగా హింసించడంతో గర్భం పోయింది. అప్పట్లో ప్రవీణ తల్లిదండ్రులు ఈ విషయంపై అత్తింటి వారిని ప్రశ్నించగా.. సర్దిచెప్పి పంపించేశారు. సుమన్ విధుల పేరుతో పదిరోజుల పాటు ఇంటికి దూరంగా ఉండేవారు. ఈ క్రమంలో సుమన్ తనకు విశాఖకు బదిలీ అయిపోతుందని మాయమాటలు చెప్పి ప్రవీణను ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించేశాడు. అప్పటి నుంచి సుమన్ వారం, పది రోజులకోసారి విశాఖలోని అత్త వారింటికి వచ్చి వెళుతుండేవాడు. మూడు నెలలుగా ఆయన రావడం లేదు. దీనిపై తల్లిదండ్రులతో కలిసి ప్రవీణ కడియంలోని అత్తింటికి వెళ్లి ప్రశ్నించగా.. వారు దౌర్జన్యం చేశారు. వివాహం సమయంలో గౌడ సామాజిక వర్గం అన్ని చెప్పిన సుమన్‌కల్యాణ్ వాస్తవానికి ఎస్సీ(మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వారని వివాహం తరువాత తెలిసిందని, కాని, తనకు కులాల పట్టింపు లేదని ప్రవీణ పోలీసులకు వివరించింది. అయితే కులం పేరుతో దూషించారంటూ తనపై తప్పుడు కేసులు పెడతామని అత్తింటి వారు బెదిరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేసును మూడో పట్టణ సీఐ బి.వెంకటరావు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వెంకటరావుకి ఫిర్యాదు చేస్తున్న ప్రవీణ, తల్లిదండ్రులు -
స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు
ధర్మవరం: ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న ఓ యువకుడికి బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంజయ్‌నగర్‌కు చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. పట్టణంలోనే ఓ కళాశాలలో ఇంటర్ చదివే రాజేష్ ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సదరు బాలిక పరీక్ష కోసం ఇంటి నుంచి బయటకు రాగా.. అక్కడే ఉన్న రాజేష్‌ను చూసి భయంతో కుటంబ సభ్యులకు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో వారు రాజేష్‌ను పట్టుకుని ఓ స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. అనంతరం పట్టణ పోలీసులకు అప్పగించారు. -
ప్రేమించటం లేదని ఇంటికి నిప్పు
హైదరాబాద్: ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని వేధిస్తూ మాట వినటం లేదనే అక్కసుతో చంపేందుకు యత్నించారు ఓ యువకుడు, అతని కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించి వివరాలివీ... ఫిల్మ్ నగర్‌కు చెందిన శివ అనే యువకుడు స్థానికంగా ఉండే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిర్భయ కేసు పెట్టి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన ఆ యువకుడు బాధితురాలిని మళ్లీ వేధించటం మొదలుపెట్టాడు. కేసు వెనక్కి తీసుకోవాలని, శివను పెళ్లి చేసుకోవాలంటూ అతడి బంధువులు కూడా బెదిరిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ రాత్రి యువతి, ఆమె కుటుంబసభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటికి నిప్పుపెట్టి సజీవ దహనం చేసేందుకు యత్నించారు. అయితే ఇంటి నుంచి బయటపడిన బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు పద్మ, మురళి, ఆటోరెడ్డి తదితరులు బాధ్యులంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
'నటిని ఎంత రేటుకొస్తావని అడిగారు'
ముంబై: సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఓ వర్ధమాన నటికి సినిమా నాటకీయతను మించిన నిజజీవిత డ్రామా ఎదురైంది. ఇద్దరు వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించారు. ఎంత రేటుకు వస్తావంటూ బేరమాడారు. దీంతో ఆమె కేకలు వేయడంతో బెదిరిన దుండగులు పారిపోయే యత్నం చేశారు. వారిని ఆటోలో వెంటాడి మరీ పోలీసులకు పట్టించింది ఆ ధీరవనిత. ఈమేరకు ముంబైలో వర్ధమాన నటి పూర్ణిమా బేల్ (26)ను వేధించిన హర్యానాకు చెందిన ఇద్దరు బాక్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత గురువారం రాత్రి బాంద్రా బాండ్స్టాండ్కు జాగింగ్ కోసం పూర్ణిమా బేల్ వెళ్లింది. 10.30 గంటల సమయంలో జాగింగ్ అనంతరం ఓ బెంచ్ మీద ఆమె విశ్రాంతి తీసుకుంటూ ఫోన్లో తన కుటుంబసభ్యులతో మాట్లాడింది. ఈ సమయంలో ఇద్దరు బాక్సర్లు అక్కడికి వచ్చారు. వారిలో ఒకడు 'నీకేమైనా సాయం కావాలా? నీ పేరు ఏమిటి?' అంటూ ఆరాతీయడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్లో మాట్లాడుతుండగా ఆమె దగ్గరగా జరిగి పక్కన కూర్చున్నాడు. దీంతో ఆమె భయాందోళనకు గురైంది. 'అతను నన్నేచూస్తూ.. నాతో మాట్లాడాలని ప్రయత్నించాడు. ఈ రాత్రికి మాతో వచ్చేందుకు ఎంత తీసుకుంటావు అని అతను అడిగాడు. దీంతో నేను వెంటనే లేచి కేకలు వేశాను' అని పూర్ణిమా బేల్ వివరించారు. 'దాదాపు పది నిమిషాలపాటు నేను గట్టిగా అరిచాను. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాను. అయినా వారేం భయపడలేదు. అక్కడ జాగింగ్‌కు వచ్చిన చాలామంది కూడా ఉన్నారు. కానీ ఎవరూ నాకు సాయం చేయడానికి సాహసించలేదు. వారి మనస్తత్వం నన్ను బాధించింది. ఈ క్రమంలోనే వారు అక్కడి నుంచి ఆటోలో మెల్లగా పలాయనం చేశారు. అయినా వారిని విడిచిపెట్టవద్దని భావించి.. మరో ఆటోలో వారిని వెంబడించాను. హిల్ రోడ్డులోని సెయింట్ ఆండ్య్రూ చర్చ్ వద్ద ఉన్న పోలీసు నాకాబందీ వద్ద వారిని పోలీసులకు పట్టించాను' అని పూర్ణిమా బేల్ తెలిపారు. ముంబై పోలీసులు ఈ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులు హర్యానాకు చెందిన బాక్సర్లు దినేశ్ యాదవ్, అమిత్ కుమార్ లుగా గుర్తించారు. వీరిలో దినేశ్ యాదవ్ అరెస్టవ్వగా.. అమిత్ కుమార్ పోలీసు స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. -
వేధింపుల కేసులో ఐదుగురికి మూడేళ్ల జైలు
పగిడాల(కర్నూలు): యువతితో అసభ్యంగా మాట్లాడటంతో పాటు.. మానసికంగా వేధించిన కేసులో ఐదుగురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ.. నందికోట్కూరు జేఎస్ఎమ్ మెజిస్ట్రేట్ తీర్పు నిచ్చారు. వివరాలు.. వెస్ట్ ప్రాతకోటకు చెందిన యువతి(22)ని అదే ప్రాంతానికి చెందిన 5గురు యువకులు వేధింపులకు గురిచేసేవారు. తరచు వెంట పడుతూ.. తమ కోరిక తీర్చాలని ఇబ్బంది పెట్టేవారు. ఈ వేధింపులతో విసిగిపోయిన యువతి.. 2013లో ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు అనంతరం ఈ రోజు న్యాయమూర్తి ఐదుగురు నిందితులకు మూడేళ్ల జైలు, రూ. 4 వేల జరిమన విధిస్తూ.. తీర్పునిచ్చారు.