ఉషోషి సేన్‌గుప్తా
కోల్‌కతా: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న తనను కొందరు ఆకతాయిలు వేధించారని మాజీ మిస్ ఇండియా, నటి ఉషోషి సేన్‌గుప్తాను తన ఫేస్‌బుక్ ఖాతాలో తెలిపింది. 2010లో ఆమె మిస్‌ఇండియాగా గెలిచారు. కాగా, వేధింపుల వీడియోను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. సోమవారం రాత్రి 11:40 గంటలకు కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. ఉషోషి తెలిపిన వివరాల ప్రకారం.. సహోద్యోగితో కలసి వెళ్తున్న ఉషోషి కారును కొందరు ఆకతాయిలు బైక్‌తో ఢీకొట్టి, కారు డ్రైవర్‌ను బయటకు లాగారు. ఈ గొడవను ఆమె ఫోన్‌లో రికార్డ్ చేసి కేసు నమోదుచేయాలని దగ్గర్లోని పోలీస్‌స్టేన్‌కు వెళ్లారు. ఘటనప్రాంతం తమ పరిధిలోది కాదని చెప్పడంతో ఆమె ఇంటికి తిరుగుపయనమైంది. ఈ సమంలో ఆకతాయిలు మళ్లీ వచ్చి రాళ్లతో దాడి చేశారు. కాగా, ఫేస్‌బుక్ పోస్టును పరిశీలించిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment