former Miss India
-
‘ఒంటికి యోగా మంచిదేగా’ మాజీ మిస్ ఇండియా ఆసనాలు (ఫొటోలు)
-
మిస్ ఇండియా ‘యోగాసన్’
సాక్షి, హైదరాబాద్: మాజీ మిస్ ఇండియా, ప్రముఖ అంతర్జాతీయ యోగా ట్రైనర్ సిమ్రాన్ అహుజా సిటీలో సందడి చేశారు. రానున్న ప్రపంచ యోగా దినోత్సవ నేపథ్యంలో కొన్ని ప్రధాన యోగాసనాలు వేసి ఔత్సాహికులను అలరించారు. నగరంలోని కంట్రీ క్లబ్ వేదికగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను సిమ్రాన్ అహుజా, క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ చైర్మన్ వై.రాజీవ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మంగళవారం నిర్వహించిన ప్రారం¿ోత్సవంలో ‘మహిళా సాధికారత కోసం యోగా’ అనే థీమ్‌తో పాటు కంట్రీ క్లబ్ వీఐపీ ప్లాటినం గ్లోబల్ కార్డ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిమ్రాన్ అహుజా మాట్లాడుతూ.. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో యోగా కీలక పాత్ర పోషించిందని, ఇతర దేశాల వారు సైతం యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం గర్వకారణమని అన్నారు. దేశ ప్రాధాన్యతగా యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంలో ప్రధాని మోదీ కృషి ఎనలేనిదని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ మంచి ఆరోగ్య ఫలితాలను పొందానని వై.రాజీవ్ రెడ్డి తెలిపారు. పటిష్ట ఆరి్థక వ్వవస్థతో పాటు యోగా వంటి విలువైన సాంస్కృతిక వారసత్వ సంపదను కలిగిన అగ్రదేశంగా భారత్ నిలుస్తుందని అన్నారు. కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి వినూత్న ఫిట్నెస్ కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప అనుభూతినిస్తుందన్నారు. -
మాజీ మిస్ ఇండియాపై దాడి : ఎస్పై సస్పెండ్
కోల్‌కతా : మాజీ మిస్ ఇండియా, నటి ఉషోషి సేన్‌గుప్తా కారులో వెళ్తుండగా.. ఆకతాయిలు ఆమె వాహనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఫిర్యాదు చేయడానికి సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు వారు ఘటన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. ఈ విషయాలన్నింటిని ఉషోషి ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. దాంతో పోలీసులు తీరు పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించారు. సదరు చారు మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై పీయూష్ కుమార్ బాల్‌ను సస్పెండ్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాక ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం గురించి కూడా దార్యప్తు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. సహోద్యోగితో కలసి వెళ్తున్న ఉషోషి కారును కొందరు ఆకతాయిలు బైక్‌తో ఢీకొట్టి, కారు డ్రైవర్‌ను బయటకు లాగారు. ఈ గొడవను ఆమె ఫోన్లో రికార్డ్ చేసి కేసు నమోదుచేయాలని దగ్గర్లోని పోలీస్స్టేన్కు వెళ్లారు. ఘటనప్రాంతం తమ పరిధిలోది కాదని చెప్పడంతో ఆమె ఇంటికి తిరుగుపయనమైంది. ఈ సమంలో ఆకతాయిలు మళ్లీ వచ్చి రాళ్లతో దాడి చేశారు. కాగా, ఫేస్బుక్ పోస్టును పరిశీలించిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
మాజీ మిస్ ఇండియాకు వేధింపులు
కోల్‌కతా: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న తనను కొందరు ఆకతాయిలు వేధించారని మాజీ మిస్ ఇండియా, నటి ఉషోషి సేన్‌గుప్తాను తన ఫేస్బుక్ ఖాతాలో తెలిపింది. 2010లో ఆమె మిస్ఇండియాగా గెలిచారు. కాగా, వేధింపుల వీడియోను ఆమె ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. సోమవారం రాత్రి 11:40 గంటలకు కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. ఉషోషి తెలిపిన వివరాల ప్రకారం.. సహోద్యోగితో కలసి వెళ్తున్న ఉషోషి కారును కొందరు ఆకతాయిలు బైక్‌తో ఢీకొట్టి, కారు డ్రైవర్‌ను బయటకు లాగారు. ఈ గొడవను ఆమె ఫోన్లో రికార్డ్ చేసి కేసు నమోదుచేయాలని దగ్గర్లోని పోలీస్స్టేన్కు వెళ్లారు. ఘటనప్రాంతం తమ పరిధిలోది కాదని చెప్పడంతో ఆమె ఇంటికి తిరుగుపయనమైంది. ఈ సమంలో ఆకతాయిలు మళ్లీ వచ్చి రాళ్లతో దాడి చేశారు. కాగా, ఫేస్బుక్ పోస్టును పరిశీలించిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
రెచ్చిపోయిన పోకిరీలు: వీడియో వైరల్
కోల్‌కతా: మాజీ మిస్ ఇండియా ఉషోషి సేన్‌గుప్తా (30)కు కోల్‌కతాలో చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది యువకులు ఆమె ప్రయాణిస్తున్న కారును అడ్డుకొని, దాడికి దిగారు. సోమవారం అర్థరాత్రి పశ్చిమ బెంగాల్ రాజధాని నడిబొడ్డున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనను మొత్తాన్ని వివరిస్తూ ఉషోసి సేన్‌గుప్తా ఫేస్బుక్లో వీడియోతో సహా పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది. ఉషోషి పోస్ట్‌లోని వివరాలు సంక్షిప్తంగా.. ‘పనిముగించుకుని కలిగ్తో కలిసి తిరిగి ఇంటికి వెళుతుండగా కొంతమంది ఆకతాయిలు నేను ప్రయాణిస్తున్న ఉబర్ కారును అడ్డుకున్నారు. డ్రైవరు తారక్‌ను బలవంతంగా బయటికి లాగి, విపరీతంగా కొట్టడం మొదలు పెట్టారు. దీన్ని అడ్డుకున్నాను. నిమిషాల్లో మరో పదిహేనుమంది యువకులు వీరికి తోడయ్యారు. ఈ ఘటనను ఫోన్లో రికార్డు చేస్తూనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను. దగ్గరలో ఉన్న మైదాన్ పోలీస్ స్టేషన్ అధికారిని సాయం చేయమని కోరా. ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ స్పందించేందుకు సదరు పోలీసు ఆధికారి నిరాకరించాడు. అయితే డ్రైవర్‌ను వాళ్లు చంపేస్తారని గట్టిగా అరవడంతో చివరకు వచ్చి వాళ్లను చెదరగొట్టి వెళ్లిపోయాడు. అంతా అయ్యాక అప్పుడు భవానిపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు అధికారులు వచ్చారు. అప్పటికి సమయం రాత్రి 12 గంటలు. ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిందిగా డ్రైవర్‌ను కోరాను. అప్పుడు కూడా ఆ దుండగులు వదలకుండా ఫాలో అయ్యారు. అంతేకాదు మూడు బైకుల మీద వచ్చిన ఆరుగురు మరోసారి కారును అడ్డుకున్నారు. తీసిన వీడియోను డిలీట్ చేయాలంటూ గలాటా చేశారు. కారుపై రాళ్లు విసిరి, కారు ఆపి బ్యాగ్ లాగేశారు. ఫోన్ లాక్కుని దాన్ని పగలగొట్టాలని చూశారు. చివరికి అమ్మానాన్న, సోదరి సహాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఇలాంటి ఘటనలు రేపు మీకు ఎదురు కావచ్చు.. స్పందించి, నిందితులను గుర్తించాలి’ ఈ ఘటన తనను చాలా షాక్‌కు గురిచేసిందని, పోలీసులకు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ఉషోషి ఆరోపించారు. తన ఫిర్యాదు మాత్రమే తీసుకున్న అధికారులు ఉబెర్ డ్రైవర్ ఫిర్యాదును తీసుకోవడానికి అంగీకరించలేదని, అది చట్టానికి విరుద్ధమని, ఒకే కేసులో రెండు ఫిర్యాదులు తీసుకోలేమంటూ మాట్లాడారని ఆమె రాసుకొచ్చారు. హెల్మెట్ లేకుండా పది పదిహేను మంది యువకులు రోడ్లమీద హల్చల్ చేస్తోంటే పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న తనకు జరిగిన అవమానాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. వేధింపులతో జీవించలేని పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతి అమ్మాయికి తన మద్దతు వుంటుందని తెలిపారు. అంతేకాదు ఫిర్యాదు చేసినప్పటికీ వేధిస్తున్న అబ్బాయిలపై చర్యలు తీసుకున్న దాఖలాలను తానెప్పుడూ చూడలేదని విమర్శించారు. మరోవైపు దీనిపై పోలీస్ విభాగం కూడా ట్విటర్లో స్పందించింది. ఈ సంఘటనను చాలా తీవ్రంగా తీసుకున్నామని, కేసు నమోదు చేసి ఏడుగుర్ని అరెస్టు చేశామని కోలకతా పోలీస్ కమిషనర్ తెలిపారు. సీనియర్ స్థాయి ఉద్యోగులతో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. అరెస్టయిన యువకుల్లో రోహిత్, ఫర్దిన్ ఖాన్, సబీర్ అలీ, గని, ఇమ్రాన్ అలీ, వసీం, అతిఫ్ ఖాన్‌లుగా గుర్తించారు. కాగా లాస్‌వెగాస్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2010లో సేన్‌గుప్తా ‘ఐ యామ్ షీ - మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నారు. Seven people were arrested, yesterday, by Kolkata police on harassment and assault charges. The complaint was filed by model and actor Ushoshi Sengupta, the driver of her cab had also been assaulted by the accused. Further probe underway. #WestBengal pic.twitter.com/iMx9jl8Wq8 — ANI (@ANI) June 19, 2019 -
దక్షిణాదిలో ఇషా అరంగేట్రం
మిస్ ఇండియాగా కిరీటం గెలుచుకున్న మిస్ తదుపరి దృష్టి పడేది సినిమా పైనే. వారికి పేరు, డబ్బు లభించేది ఇక్కడే. ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, లారాదత్తా, ప్రియాంక చోప్రా లాంటి వారందరూ ఆ కిరీటాన్ని మోసిన తరువాత ఎంచుకున్న రంగం సినిమానే. వారందరూ తమిళ సినిమాల్లో నటించిన వాల్లే. తాజాగా ఈ పట్టికలో మీరు మాజీ మిస్ ఇండియా చేరారు. 2007లో మిస్ఇండియా కిరీటాన్ని సాధించిన బాలీవుడ్ బ్యూటీ ఇషాగుప్తా ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఈ ఉత్తరాది భామ దక్షిణాది క్రేజీ హీరోయిన్ అనుష్కతో పోటీకి సిద్ధం అయ్యారు. అర్థం కాలేదా? ఆర్య, అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం ఇంజి ఇడుప్పళగు ఈ చిత్రంలో అనుష్క రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారు. ఇది బాహ్య అందం, ఆత్మ సౌందర్యం అంశాలు ప్రధానాంశంగా తెరకెక్కిస్తున్న చిత్రం పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు కొడుకు కె.ప్రకాష్‌రావు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో నాజూకు అందాలతో కూడిన మరో నాయకి అవసరం అవడంతో మాజీ మిస్ ఇండియా ఇషాగుప్తా కరెక్ట్‌గా నప్పుతుందని భావించిన దర్శక, నిర్మాతలు ఆమెను ఎంపిక చేశారని సమాచారం. ఈ సుందరి ఇప్పటికే బాలీవుడ్లో నటించి ప్రముఖ హీరోయిన్గా వెలుగుతున్నారు. ఇప్పుడు ఇంజి ఇడుప్పళగు చిత్రంలో దక్షిణాదిన కాలుమోపుతు న్నారన్నమాట. -
ఉందిలే మంచి కాలం
‘ఉందిలే మంచికాలం ముందు ముందునా... నాకు మంచి రోజులొస్తాయి నంద నందనా..!’ అంటూ ఆశల పల్లకిలో పాటలు పాడుకుంటోంది నటి పార్వతి ఓమన కుట్టాన్. ఈ మాజీ మిస్ ఇండియాకు మోడలింగ్ రంగంలో కలిసొచ్చినట్లు ఇంకా సినిమా రంగం అచ్చి రాలేదు. తమిళంలో అజిత్ సరసన భిల్లా -2తో రంగప్రవేశం చేసింది. ఆ తరువాత చిత్రం నంబియార్ కూడా ఈ సుందరికి హిట్ నివ్వలేదు. ఇక్కడ కాకపోయినా బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని పిజ్జా - 3డి చిత్రంలో ఒక రాయి వేసింది. అది గురి తప్పింది. దీంతో నిరుత్సాహపడినా ఇంకా బింకపు మాటలు పలుకుతోంది. ఈ మాజీ సుందరి మాట్లాడుతూ తనకు మంచి రోజులొస్తాయంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నటిగా తన కింతవరకు విజయవంతమైన చిత్రాలు అమరలేదంది. ఇటీవల హిందీలో నటించిన పిజ్జా -3డి చిత్రానికి మిశ్రమ విమర్శలు వచ్చాయని చెప్పింది. తాను చాలా ఎత్తుపల్లాలు చూశానని తప్పుడు విమర్శలతో వేదనకు గురయ్యానని చెప్పింది. అయినా తనను ప్రత్యక్షంగా కలిసినవాళ్లు తన నటన గురించి మంచిగానే చెబుతున్నారని అంది. ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. తానీ స్థాయికి ఎదగడానికి కారణమైన మోడలింగ్ రంగాన్ని వదులుకునే సమస్యే లేదని చెప్పింది. మోడలింగ్‌లో తాను చాలా ప్రదేశాలు చుట్టొచ్చానని తెలిపింది. అదే విధంగా నటనా వృత్తిపైనా తనకు చాలా నమ్మకం ఉందనే అభిప్రాయపడింది. ఈ రంగంలో రాణించడానికి ఇంకొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుందని అంది. ఖచ్చితంగా తనకంటూ ఒక టైమ్ వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. తన ప్రతిభకు సవాలుగా నిలిచే పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పార్వతి ఓమన కుట్టాన్ తెలిపింది.