దక్షిణాదిలో ఇషా అరంగేట్రం | sha gupta acting in kollywood movies | Sakshi
Sakshi News home page

దక్షిణాదిలో ఇషా అరంగేట్రం

Published Sun, Apr 5 2015 2:23 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దక్షిణాదిలో ఇషా అరంగేట్రం - Sakshi

దక్షిణాదిలో ఇషా అరంగేట్రం

మిస్ ఇండియాగా కిరీటం గెలుచుకున్న మిస్‌ తదుపరి దృష్టి పడేది సినిమా పైనే. వారికి పేరు, డబ్బు లభించేది ఇక్కడే. ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, లారాదత్తా, ప్రియాంక చోప్రా లాంటి వారందరూ ఆ కిరీటాన్ని మోసిన తరువాత ఎంచుకున్న రంగం సినిమానే. వారందరూ తమిళ సినిమాల్లో నటించిన వాల్లే. తాజాగా ఈ పట్టికలో మీరు మాజీ మిస్ ఇండియా చేరారు.
 
 2007లో మిస్‌ఇండియా కిరీటాన్ని సాధించిన బాలీవుడ్ బ్యూటీ ఇషాగుప్తా ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఈ ఉత్తరాది భామ దక్షిణాది క్రేజీ హీరోయిన్ అనుష్కతో పోటీకి సిద్ధం అయ్యారు. అర్థం కాలేదా? ఆర్య, అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం ఇంజి ఇడుప్పళగు ఈ చిత్రంలో అనుష్క రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారు. ఇది బాహ్య అందం, ఆత్మ సౌందర్యం అంశాలు ప్రధానాంశంగా తెరకెక్కిస్తున్న చిత్రం పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు కొడుకు కె.ప్రకాష్‌రావు దర్శకత్వం వహిస్తున్నారు.
 
  తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో నాజూకు అందాలతో కూడిన మరో నాయకి అవసరం అవడంతో మాజీ మిస్ ఇండియా ఇషాగుప్తా కరెక్ట్‌గా నప్పుతుందని భావించిన దర్శక, నిర్మాతలు ఆమెను ఎంపిక చేశారని సమాచారం. ఈ సుందరి ఇప్పటికే బాలీవుడ్‌లో నటించి ప్రముఖ హీరోయిన్‌గా వెలుగుతున్నారు. ఇప్పుడు ఇంజి ఇడుప్పళగు చిత్రంలో దక్షిణాదిన కాలుమోపుతు న్నారన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement