IMDb Top 10 Most Popular Indian Stars Of The Year 2022, Details Inside - Sakshi
Sakshi News home page

IMDb Popular Indian Stars: ఈ ఏడాది టాప్‌ 10 నటులు వీళ్లే.. టాలీవుడ్‌లో ఎవరెవరంటే?

Published Wed, Dec 7 2022 3:01 PM | Last Updated on Wed, Dec 7 2022 5:18 PM

 IMDB Top 10 Most Popular Indian Stars of the year 2022 - Sakshi

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ఈ ఏడాదిలో మోస్ట్ పాపులర్ నటుల జాబితాను విడుదల చేసింది. దేశంలో టాప్‌ టెన్ నటుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో తమిళ నటుడు ధనుష్ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో నటీనటుల పేర్లను ఐఎండీబీ పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐఎండీబీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. 

రెండోస్థానంలో బాలీవుడ్ నటి అలియా భట్, మూడోస్థానంలో ఐశ్వర్యరాయ్, నాలుగోస్థానంలో మెగా హీరో రామ్ చరణ్ నిలవగా.. సమంత ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా హృతిక్ రోషన్, కియారా అద్వానీ, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కేజీఎఫ్ హీరో యశ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement