ఫ్లాప్‌ల కోసం 15 నిమిషాలు | 15 minutes for flap | Sakshi
Sakshi News home page

ఫ్లాప్‌ల కోసం 15 నిమిషాలు

Published Tue, Feb 21 2017 2:47 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఫ్లాప్‌ల కోసం 15 నిమిషాలు - Sakshi

ఫ్లాప్‌ల కోసం 15 నిమిషాలు

నటి పూజాహెగ్డే గుర్తుందా? ముఖముడి చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్‌ బ్యూటీ ఈ అమ్మడు. ఇక్కడ ఆ ఒక్క చిత్రంతోనే సరిపెట్టుకున్న పూజా టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసింది. అయితే అక్కడ కూడా పెద్దగా విజయాలు వరించలేదు. దీంతో రాశిలేని నటి అనే ముద్ర వేశారట. అందుకే అపజయాల కోసం రోజూ 15 నిమిషాలు కేటాయించి ఆ సమయంలో చింతిస్తుందట. వింతగా ఉంది కదూ. ఇంకా ఈ ముద్దుగుమ్మ ఏమి చెబుతుందో చూద్దాం.

‘భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రేపేమి జరుగుతుందో కూడా చెప్పలేం. అదే విధంగా చిత్ర విజయం ఒక్కరి వల్ల సాధ్యం కాదు. చేసే పనికి సంపూర్ణంగా న్యాయం చేయడమే మన కర్తవ్యం. విజయం అనేది చూసే ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అందువల్ల నేను అపజయాలకు భయపడను. అయితే వాటి గురించి చింతించడానికి రోజు 15 నిమిషాలు కేటాయిస్తున్నాను. ఇతర సమయాన్ని  వృత్తిపై పెడుతున్నాను. ఇది నాకు నేనుగా విధించుకున్న విధి విధానం. నా కఠిన శ్రమకు ఎప్పటికైనా విజయం వెతుక్కుంటూ వస్తుందనే నమ్మకం ఉంది’ అని అంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement